ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా.. | Enterprise AI Shifts Focus From Model Power to Operational Control | Sakshi
Sakshi News home page

ప్రయోగాల నుంచి ప్రయోజనాల దిశగా..

Apr 1 2026 1:40 PM | Updated on Apr 1 2026 2:21 PM

Enterprise AI Shifts Focus From Model Power to Operational Control

ఎంటర్‌ప్రైజ్ ఏఐ ముందున్న సవాళ్లు!

కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పుడు కేవలం ప్రయోగశాలలకో, మొబైల్ యాప్‌లకో పరిమితమైన సాంకేతికత కాదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ రోజువారీ కార్యకలాపాల్లో ఏఐని అంతర్భాగం చేసుకుంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ‘మోడల్ సామర్థ్యం’ కంటే ఇప్పుడు దాని ‘నిర్వహణా సామర్థ్యం’ పైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎంటర్‌ప్రైజ్ ఏఐ మనుగడకు నియంత్రణ, సమన్వయం కీలకంగా మారుతున్నాయిని ప్రముఖ సంస్థ గార్ట్‌నర్‌ అంచనా వేసింది.

2027 నాటికి 40 శాతం ప్రాజెక్టులు రద్దు?

గార్ట్‌నర్‌ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి సుమారు 40 శాతం ఏజెంటిక్ ఏఐ ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇందుకు కారణం.. అంచనాలకు మించి నిర్వహణ ఖర్చులు పెరగడం, వ్యాపార పరంగా స్పష్టమైన విలువ జోడింపు కనిపించకపోవడం వంటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలాఉండగా, కేవలం ఏఐ మోడల్స్‌ను కొనుగోలు చేయడం వల్ల లాభం లేదని, పని విధానాన్ని పునర్నిర్మించడం, పటిష్టమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారానే ఫలితాలు వస్తాయని మెకిన్సే పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

అడ్డంకిగా అవాస్తవ సమాచారం

ఏఐ వ్యవస్థలు ఇచ్చే సమాచారం ఎంతవరకు నమ్మదగినది? అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద కంపెనీలను వేధిస్తోంది. కేపీఎంజీ 2025 నివేదిక ప్రకారం.. 54 శాతం మంది ప్రతినిధులు డేటాలో ఉన్న అశాస్త్రీయతను ప్రధాన రిస్క్‌గా భావిస్తున్నారు. 45 శాతం మంది ఏఐ సృష్టించే తప్పుడు సమాచారం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యల వల్ల పైలట్ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలోకి రావడానికి జాప్యం జరుగుతోంది. ఇక్కడే గవర్నెన్స్(నియంత్రణ) ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. ఏఐ తీసుకునే నిర్ణయాలకు ఎవరు బాధ్యత వహించాలి? ఆ నిర్ణయం వెనుక ఉన్న లాజిక్ ఏమిటి? అనే అంశాలపై స్పష్టత లేకపోతే సంస్థలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది.

సమీకృత పరిష్కారం

ప్రముఖ టెక్ నిపుణుడు, ఎవాల్యుయేట్‌ఐక్యూ సహ వ్యవస్థాపకుడు సంజయ్ కొప్పికర్ అభిప్రాయం ప్రకారం.. ఎంటర్‌ప్రైజ్ ఏఐలో గవర్నెన్స్, సమన్వయం అనేవి విడివిడి అంశాలు కావు. ఇవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాలు. ‘ఏఐని కేవలం అమలు చేయడం ముఖ్యం కాదు, దానిని నియంత్రించగలగడం, వివరించగలగడం, నమ్మదగినదిగా మార్చడం తక్షణ అవసరం’ అని చెప్పారు.

భారీ పెట్టుబడులు - రాబడిపై ఆందోళనలు

టెక్ దిగ్గజాలు జనరేటివ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ల డాలర్లు కుమ్మరిస్తున్నాయి. నిత్యం కొత్త వెర్షన్లు, కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తుండటంతో పాత టెక్నాలజీ త్వరగా కాలం చెల్లిపోతోంది. దీంతో పెట్టుబడిని ఎలా వెనక్కి తీసుకోవాలనే దానిపై కంపెనీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి.

దాంతో కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ ఖర్చులను తగ్గించుకోవడానికి చిన్న, ప్రత్యేకమైన మోడల్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఏఐ ఇచ్చే అవుట్‌పుట్ నమ్మదగ్గదిగా ఉంటేనే క్లయింట్లు డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ట్రస్ట్‌ను ఒక ఫీచర్‌గా కంపెనీలు అమ్ముతున్నాయి. పూర్తిగా ఏఐపై ఆధారపడకుండా మానవ పర్యవేక్షణ ఉండేలా హైబ్రిడ్‌ వర్క్ ఫ్లోలను డిజైన్ చేస్తున్నాయి.

ఇదీ చదవండి: దక్షిణాదిలో ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement