Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Vallabhaneni Vamsi Mohan Met YS Jagan Convey Thanks1
వైఎస్‌ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ గురువారం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్‌ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్‌ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్‌ రద్దు కోరుతూ పిటిషన్‌ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

Pak air chief in US after Chinese equipment2
ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్‌ల మధ్య అసలేం జరుగుతోంది?

అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో డిన్నర్‌ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ జహీర్‌ అహ్మద్‌ బాబర్‌ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చీఫ్‌ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్‌ ప్రధాని షెహబాబ్‌ షరీఫ్‌ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్‌ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌సింధూర్‌ తర్వాత పాక్‌ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్‌లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్‌కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్‌లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్‌ కొట్టిన దెబ్బతో పాక్‌ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్‌ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌(ఫైల్‌ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్‌కు భారత్‌ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్‌, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్‌. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్‌ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్‌ ఆర్మీనే పదే పదే యూఎస్‌కు ట్రంప్‌ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్‌ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్‌ ప్రధానిని పక‍్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్‌.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్‌ కొనుగోలుకు ఇప్పటికే పాక్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్‌కు అమెరికా ఎంత సపోర్ట్‌గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్‌తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్‌ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్‌ డిన్నర్‌ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్‌కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాక్‌కే సపోర్ట్‌ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్‌ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్‌ మ్యాన్‌కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్‌.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్‌కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్‌లో పాక్‌ ఆర్మీ అధికారుల దర్శనం​ ఏమిటి?, అమెరికా-పాక్‌ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది.

ENG VS IND 2nd Test Day 2: Gill Becomes First Asian Captain To Score A Double Hundred In SENA Countries3
ENG VS IND 2nd Test: భారీ డబుల్‌ సెంచరీ.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్‌ గిల్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ భారీ డబుల్‌ సెంచరీతో (266) చెలరేగి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. రెండో రోజు లంచ్‌ తర్వాత గిల్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. గిల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి డబుల్‌ సెంచరీ. ఈ మైలురాయిని గిల్‌ 311 బంతుల్లో చేరుకున్నాడు. ఈ డబుల్‌తో గిల్‌ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) డబుల్‌ సెంచరీ సాధించిన తొలి ఆసియా కెప్టెన్‌గా..ఇంగ్లండ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన మూడో భారత ఆటగాడిగా.. ఇంగ్లండ్‌ గడ్డపై అత్యధిక స్కోర్‌ చేసిన భారత ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఆరో భారత కెప్టెన్‌గా.. విదేశాల్లో డబుల్‌ సెంచరీ సాధించిన రెండో భారత కెప్టెన్‌గా.. సేనా దేశాల్లో 250 పరుగుల మార్కు తాకిన తొలి భారత ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్‌ చేసిన భారత కెప్టెన్‌గా పలు రికార్డులు సాధించాడు.మ్యాచ్‌ విషయానికొస్తే.. గిల్‌ రికార్డు డబుల్‌ సెంచరీతో చెలరేగడంతో భారత్‌ ఇప్పటికే భారీ స్కోర్‌ చేసేసింది. డబుల్‌ సెంచరీ తర్వాత కూడా గిల్‌ జోరు కొనసాగుతుంది. 266 పరుగుల వద్ద గిల్‌ బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా ఆకాశ్‌దీప్‌ (0) క్రీజ్‌లో ఉన్నాడు. టీ విరామం సమయానికి​ భారత్‌ స్కోర్‌ 565/7గా ఉంది.310/5 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్..‌ లంచ్‌ విరామానికి ముందు రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89; 10 ఫోర్లు, సిక్సర్) వికెట్‌ కోల్పోయింది. 41 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జడేజా గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్‌-జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. అనంతరం గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌తో (42) కలిసి ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి రోజు ఆటలో యశస్వి జైస్వాల్‌ (87), కేఎల్‌ రాహుల్‌ (2), కరుణ్‌ నాయర్‌ (31), రిషబ్‌ పంత్‌ (25), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (1) వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ 2 వికెట్లు తీయగా.. బ్రైడన్‌ కార్స్‌, బెన్‌ స్టోక్స్‌, షోయబ్‌ బషీర్‌, జోష్‌ టంగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

ASP Narayan Barmani sought voluntary retirement after public humiliation by CM Siddaramaiah4
Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’

బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్‌ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్‌ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్‌ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్‌ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్‌ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్‌ఎస్‌ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్‌ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్‌ తర్వాత ఏప్రిల్‌ 28న బెలగావిలో కాంగ్రెస్‌ సంవిధాన్‌ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్‌ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్‌ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్‌ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్‌ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ‌ఏఎస్పీ నారాయణ్‌ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్‌ఎస్‌ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది.

Police Defuse Bombs Seized From Terrorists In Rayachoti5
రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం

సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్‌కేసు బాంబులను ఆక్టోపస్‌ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్‌ జోన్‌గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్‌ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్‌ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్‌లో పాక్‌ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్‌ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్‌ అమానుల్లా(55) అలియాస్‌ అబూబకర్‌ సిద్దిక్‌, మహబూబ్‌బాషావీధిలో నివాసం ఉన్న షేక్‌ మన్సూర్‌ (47) అలియాస్‌ మహమ్మద్‌అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్‌ పరికరాలు, కేబుల్స్‌, నెట్‌వర్క్‌ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు.

List Of Tollywood Movies Released In July Month6
ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్‌కి ఏమైంది?

టాలీవుడ్‌లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్‌ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్‌ అయ్యేవి. కానీ సమ్మర్‌ నుంచి టాలీవుడ్‌లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్‌లైఫ్‌, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్‌ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్‌ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్‌ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్‌ నటించిన 3 బి.హెచ్‌.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్‌ టాక్‌ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్‌ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్‌గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్‌. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్‌ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సినిమాపై బజ్‌ క్రియేట్‌ చేసింది. మరి సింగిల్‌గా వస్తున్న సుహాస్‌.. సూపర్‌ హిట్‌ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్‌(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించడం, హీరోయిన్‌గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్‌పై టాలీవుడ్‌లో మంచి హైప్‌ క్రియేట్‌ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడికల్‌ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది.

Kerala F-35 Row: No Repair Possible UK Looks At This Final Option7
F-35 Row: రిపేర్‌ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్‌!

అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్‌ 35(F-35 fighter) ఎపిసోడ్‌ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్‌నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్‌ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్‌ 35 ఫైటర్‌ జెట్‌ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌.. ‍ తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్‌ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్‌ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్‌ వైరల్‌తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్‌ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్‌ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్‌ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్‌ చేశారు. బ్రిటన్‌ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్‌ దేశభక్తి టచ్‌తో వైరల్‌ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్‌ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్‌ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్‌ జనరేషన్‌ స్టెల్త్‌ ఫైటర్‌ జెట్‌. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్‌లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్‌ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్‌ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

Three dead, 16 wounded in Chicago nightclub8
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

వాషింగ్టన్‌: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్‌క్లబ్‌లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్‌క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్‌వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025

Rich Dad Poor Dad Robert Kiyosaki warns of BIGGEST CHANGE Youth Finance9
రాబోతోంది పెను మార్పు.. రాబర్ట్‌ కియోసాకి వార్నింగ్‌

ఆధునిక చరిత్రలోనే అతిపెద్ద మార్పు రాబోతోందని ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ పుస్తక రచియిత రాబర్ట్‌ కియోసాకి హెచ్చరించారు. "కృత్రిమ మేధ (AI ) చాలా మంది 'స్మార్ట్ విద్యార్థులు' తమ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తుంది.. భారీ నిరుద్యోగం కలిగిస్తుంది.. విద్యా రుణాలు పెరగిపోతాయి.." అని అప్రమత్తం చేస్తూ తాజాగా ఆయన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’(ట్విటర్)లో ఓ పోస్ట్‌ పెట్టారు.ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కలగనున్న పరిణామాలపై కియోసాకి విద్యార్థులను అప్రమత్తం చేశారు. చాలా మంది తెలివైన విద్యార్థులు కూడా ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. ఒకప్పుడు డోకా లేదనుకున్న ఉద్యోగాలను కూడా ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని ఆయన అంచనా వేస్తున్నారు. రుణ సాయంతో విద్యను పూర్తి చేసి ఉద్యోగాల కోసం వస్తున్న గ్రాడ్యుయేట్లకు ఉద్యోగావకాశాలు లేక రుణ భారం తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. "నాకు ఉద్యోగం లేదు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నన్ను తొలగించలేదు" అంటూ ఉద్యోగం కంటే వ్యాపారం, ఇన్వెస్ట్‌మెంట్‌లే నయమని చెప్పే ప్రయత్నం చేశారు.సాంప్రదాయిక విద్య, ఉద్యోగ మార్గాన్ని కియోసాకి ఇప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బడికి వెళ్లడం, మంచి గ్రేడ్లు సాధించడం, ఉద్యోగం సంపాదించడం, డబ్బు ఆదా చేయడం వంటి విధానాలు ఇకపై ఆర్థిక భద్రతకు హామీ ఇవ్వవని ఆయన వాదిస్తున్నారు. శరవేగంగా మారుతున్న నేటి ప్రపంచంలో, ఆయన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. తన "రిచ్‌ డాడ్‌" మనస్తత్వానికి అనుకూలంగా తన "పూర్‌ డాడ్‌" సలహాను ఎలా విస్మరించిందీ వివరించారు. సంప్రదాయ మార్గానికి విరుద్ధంగా ఎంట్రెప్రెన్యూర్‌ అయ్యానని, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టానని, బంగారం, వెండి, ప్రస్తుతం బిట్కాయిన్‌లలో పొదుపు చేస్తున్నానని పేర్కొన్నారు.ఈ ఆర్థిక పరివర్తన కాలంలో నిష్క్రియాత్మక పరిశీలనకు గురికావద్దని కియోసాకి తన ఫాలోవర్లకు సూచించారు. "దయచేసి చరిత్రలో ఈ కాలానికి బలైపోవద్దు" అని హెచ్చరించారు. స్వతంత్రంగా ఆలోచించాలని, వ్యక్తిగత ఎదుగుదలకు పెట్టుబడులు, సాంప్రదాయ వ్యవస్థలకు వెలుపల ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యూహాలను అన్వేషించాలని హితవు పలికారు. BIGGEST CHANGE in MODERN HISTORYAI will cause many “smart students” to lose their jobs.AI will cause massive unemployment.Many still have student loan debt.AI cannot fire me because I do not have a job.If you are in this category please take proactive action. Please do…— Robert Kiyosaki (@theRealKiyosaki) July 1, 2025

Amaravati Farmers Big Shock to Chandrababu10
చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు

సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్‌ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్‌ పూలింగ్‌కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్‌ పూలింగ్‌(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎయిపోర్టు, స్పోర్ట్స్‌ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement