
హోం మంత్రి వంగలపూడి అనితకు చేదు అనుభవం ఎదురైంది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ 'సందర్శనకు వెళ్లిన ఆమెను సమస్యలు పలకరించాయి. హాస్టల్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ పలువురు బాలికలు ఆమెకు ఫిర్యాదు చేశారు. దీంతో.. ఆమె చేసేది లేక అధికారులపై చిందులు తొక్కారు.
హోం మంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. అయితే ఆమె అక్కడి బాలికల గురుకుల హాస్టల్‌ను సందర్శించారు. ఆ టైంలో గురుకుల హాస్టల్స్ దుస్థితి వెలుగులోకి వచ్చింది. భోజనంతో పాటు మెయింటెనెన్స్ కూడా బాగా లేదంటూ విద్యార్థినిలు హోం మంత్రికి చెప్పారు. దీంతో ఆమె కాస్త అసహనానికి గురయ్యారు.
‘‘43 మంది ఆడ పిల్లలు చదువుతున్న హాస్టల్ వద్ద కనీసం సీసీ కెమెరాలు లేవు. వార్డెన్ పిల్లల్ని వదిలేసి 5 గంటలకే వెళ్ళిపోయింది. సన్న బియ్యం ఇవ్వాలని చెప్పినా అమలు కావడం లేదు. నాణ్యమైన భోజనం అందడం లేదు. ఇద్దరు అధికారులను ఎత్తేస్తే అందరికీ బుద్ధి వస్తుంది అంటూ ఆమె అధికారులపై మండిపడ్డారు.
