SpiceJet: గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్‌ | Window Pane Of Goa-pune Spicejet Flight Comes Off Midair, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

SpiceJet: గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్‌

Jul 3 2025 7:47 AM | Updated on Jul 3 2025 9:19 AM

Window pane of Goa-Pune SpiceJet flight comes off midair

ముంబై: గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్‌ క్యూ400 విమానం కిటికీ ఫ్రేమ్‌ హఠాత్తుగా ఊడిపోయింది. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలుస్తోంది. పుణెలో విమానం ల్యాండవగానే ఊడిన కాస్మెటిక్‌ ఇంటీరియర్‌ కిటికీ ఫ్రేమ్‌ను బిగించామని స్పైస్‌జెట్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. 

అయితే ఈ ఘటనను ఆ విమాన ప్రయాణికులు తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ముందుస్తు తనిఖీలు చేయకుండా విమానాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ కిటికీ అసెంబ్లీ యూనిట్‌ మొత్తం ఊడిపోయింది. అయినాసరే విమానాన్ని అలాగే పోనిచ్చారు. అసలీ విమానాన్ని ఎగిరే అర్హత ఉందా?’’ అంటూ ఒక ప్రయాణికుడు సంబంధిత కిటికీ ఫొటోను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ)కు ట్యాగ్‌చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement