వెడ్డింగ్ షూట్‌ కోసం.. నీటిలో తేలియాడుతూ..! | pre wedding shoot video shows couple floating | Sakshi
Sakshi News home page

వెడ్డింగ్ షూట్‌ కోసం.. నీటిలో తేలియాడుతూ..!

Mar 20 2026 4:52 PM | Updated on Mar 20 2026 6:09 PM

 pre wedding shoot video shows couple floating

ట్రెండింగ్‌లో ఉండాలనే పిచ్చి ప్రజలను ఏ పనికైనా ఉసిగొలుపుతుంది. కొందరేమే సెన్షేషన్ పేరుతో రీల్స్‌ చేసి ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరేమే కొత్తదనం కోరుకుంటూ నిండు నూరేళ్లు గడపాల్సిన జీవితాన్ని ముగించినట్లు ఫోటోషూట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి చేసుకొని నూతన జీవితం ప్రారంభించాల్సిన జంట నీటిలో పడి తేలియాడతూ వీడియో తీశారు. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు.

ప్రస్తుతం కాలంలో సంప్రదాయాలు ఏ విధంగా మారుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఆధునికత పేరుతో తమకు నచ్చిన ట్రెండ్‌ను యువత ఫాలో అవుతున్నారు. సాధారణంగా ఈ రోజుల్లో ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా ఫేమస్‌ అయ్యాయి. రకారకాల లోకెషన్లలో ఫోటోలు దిగుతూ సాంగ్స్ షూట్ చేస్తూ మ్యారేజ్‌ని సెలబ్రేట్‌ మోడ్‌లోకి తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక జంట తమ వెడ్డింగ్ షూట్‌ని వెరైటీగా ప్లాన్ చేసింది.

తెల్లబట్టలు ధరించిన యువతీ యువకులు బురద గుంటలో నీటిలో తేలియాడుతూ నటించారు. దీనిని ఆ ఫోటో గ్రాపర్‌ సినిమాటిక్ రేంజ్‌లో షూట్ చేస్తున్నట్లు హంగామా చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు."వన్యప్రాణి ఫోటో గ్రాఫర్‌ను కాస్త పెళ్లళ్ల ఫోటో గ్రాఫర్ చేశారు" అని ఒకరు కామెంట్ చేస్తున్నారు. మరోకరు టైటానిక్ మరియు గంగమ్ స్టైల్‌ కలయిక అని కామెంట్ పెట్టారు.  మరోకరు ఇది పెళ్లికి ముందు ఫోటో షూటా లేక పెళ్లి తర్వాతదా అని సరదాగా ప్రశ్నించారు.

అయితే ఇటీవల కాలంలో ప్రజలు సెన్షెషన్‌ల కోసం తెగబడిపోయి ఇష్ఠారీతిన వ్యవహరిస్తున్నారు. కొందరేమే రీల్స్ మోజులో పడి ప్రాణాల పైకి తెచ్చుకుంటే మరి కొందరేమో ఇలా శుభకార్యం జరిగే ముందు సెన్షేషన్ కోసం ఇలా ఇబ్బందికర షూట్‌లు చేస్తున్నారు. దీంతో ఇప్పటి కల్చర్ అసలు ఎటు వైపు వెళుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement