ఎయిర్‌ ఇండియా భారీ తప్పిదం | Air India Flight To Nowhere: Wrong Plane, 8 Hours In Air, And A U-Turn | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ ఇండియా భారీ తప్పిదం

Mar 21 2026 1:51 AM | Updated on Mar 21 2026 1:51 AM

Air India Flight To Nowhere: Wrong Plane, 8 Hours In Air, And A U-Turn

భారతీయ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ఓ భారీ తప్పిదం చేసింది. ఓ ఫ్లైట్‌కు బదులు మరో ఫ్లైట్‌ను వినియోగించి ప్రయాణికులకు విస్మయకర అనుభవాన్ని మిగిల్చింది. సొంతంగానూ భారీ ఆర్దిక నష్టాన్ని మూటగట్టుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఉదయం 11:34 గంటలకు ఢిల్లీ నుంచి AI185 సర్వీస్‌ నంబర్‌తో బోయింగ్‌ 777-200LR విమానం ప్యాసింజర్లతో కలిసి వాంకోవర్‌కు (కెనడా) బయల్దేరింది. అయితే నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తప్పుడు విమానం అని అధికారులు గుర్తించారు.

వాస్తవానికి ఈ సర్వీస్‌లో బోయింగ్‌ 777-300ER మోడల్‌ విమానం వాంకోవకర్‌కు వెళ్లాలి. అయితే ఆపరేషనల్‌ తప్పిదం కారణంగా 777-300ER మోడల్‌కు బదులు 777-200LR విమానం వాంకోవర్‌కు టేకాఫ్‌ అయ్యింది.

చైనా గగనతలంలోకి ప్రవేశించాక అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. కెనడాకు వెళ్లేందుకు 777-300ER మోడల్‌కు మాత్రమే అనుమతి ఉందని, తాము ప్రయాణిస్తున్నది 777-200LR మోడల్‌ అని నాలుక కరుచుకున్నారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు.  

మొత్తం 7 గంటలు 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎయిర్‌ ఇండియాపై అసంతృప్తిని వెల్లగక్కారు. 

ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. మరుసటి రోజు సరైన విమానం ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించింది. అప్పటివరకు ప్రయాణికులకు ఉచిత హోటల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పించింది.

ఈ ఘటన ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బోయింగ్‌ విమానానికి ఒక్క గంటలో 8–9 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం వల్ల వందల టన్నుల ఇంధనం వృథా అయ్యింది. దీని వల్ల భారీ ఆర్దిక నష్టం చవిచూడటంతో పాటు సంస్థ ప్రతిష్టను దిగజార్చుకుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement