
హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నిఅంశాలపై చర్చ జరుపుతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కేసీఆర్, మేము ఉద్యమంలో పని చేశామని, తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి అన్నారు. తమకు హరీష్ రావు, కేటీఆర్‌లతో సంబంధం లేదని, వారు తమ లెక్కల్లోకి రారని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.
‘ హరీష్‌రావు ఉత్తి ఎమ్మెల్యే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కాదు. అసెంబ్లీకి ప్రతిపక్ష నేత వచ్చి మా తప్పు ఒప్పులను చెప్పాలి. కేసీఆర్ సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. తప్పులను చూపిస్తే సరిదిద్దుకుంటాం. కేసీఆర్‌తోనే లెక్క.. హరీష్‌రావు ఎవరో నాకు తెలీదు. ఫోన్ ట్యాపింగ్ చేసింది హరీష్‌రావు, కేటీఆర్‌లు,. కేసీఆర్ చుట్టూ ఉంటూ కేసీఆర్‌కు చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావు, కేటీఆర్‌లు కీలకం’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.