
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమాజీగూడ యశోదా ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ ఉన్నారు. మూడు రోజుల పాటు నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నారు.
సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్.. ఫాంహౌస్ నుంచి నందినగర్ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో నందినగర్ నివాసంలో కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం డాక్టర్ల సలహా మేరకు యశోదా ఆస్పత్రికి వెళ్లారు కేసీఆర్. సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా కేసీఆర్‌కు మెడికల్ టెస్టులు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీస్తున్నారు.