
సాక్షి, విజయవాడ: టీటీడీ నెయ్యి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులు క్రితం సింగయ్య కేసులో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ను అనుమతించిన వ్యవహారంపై సోషల్ మీడియాలో న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ‘‘నన్ను గత రెండు రోజులు నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్’’ అంటూ న్యాయమూర్తి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు
ఇప్పుడు నెయ్యి కేసులో నిందితులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్‌కు బాగా పనికొస్తాయంటూ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్థన్‌రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెయిల్ కేసులు వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన న్యాయమూర్తి.. తన ముందున్న బెయిల్ పిటిషన్లను వచ్చే వారం వేరే బెంచ్ ముందు ఉండేలా చూసుకోవాలన్నారు.