Ashes: ఎట్టకేలకు...
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ తాజా ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో స్టోక్స్ బృందం విజయం సాధించింది. ఆతిథ్య జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి.. సిరీస్‌లో కంగారూల సిరీస్ ఆధిక్యాన్ని తగ్గించింది.యాషెస్ సిరీస్ (Ashes)లో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ ఆస్ట్రేలియా (Aus vs Eng) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్, బ్రిస్బేన్, అడిలైడ్ టెస్టుల్లో ఆసీస్ చేతిలో ఇంగ్లిష్ జట్టు చిత్తుగా ఓడింది. దీంతో 3-0తో కంగారూలు సిరీస్ మరోసారి కైవసం చేసుకోగా.. ఇంగ్లండ్ జట్టు తీవ్ర విమర్శలు మూటగట్టుకుంది.రెండు రోజుల్లోనే..ఇలాంటి తరుణంలో ప్రధాన పేసర్ జోఫ్రా ఆర్చర్ (Jofra Archer) గాయపడటంతో మరో ఎదురుదెబ్బ తగిలింది. అతడు లేకుండానే బాక్సింగ్ డే టెస్టు బరిలో దిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా శుక్రవారం మొదలైన ఈ నాలుగో టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ చేసింది. యువ పేసర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, ఆ సంతోషం ఇంగ్లండ్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజే తమ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్టోక్స్ బృందం.. 110 పరుగులకే కుప్పకూలింది.నిప్పులు చెరిగిన ఆసీస్ పేసర్లుహ్యారీ బ్రూక్ 41 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ఆసీస్ పేసర్లు నాసర్ 4, బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీసి ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఈ క్రమంలో తొలిరోజు ఆట ముగిసే సరికి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్.. వికెట్ నష్టపోకుండా నాలుగు పరుగులు చేసింది. ఇక 4/0 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఆసీస్.. మరో 128 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (46), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (24 నాటౌట్) మాత్రమే మెరుగ్గా రాణించగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు.విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్లుఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. కెప్టెన్ స్టోక్స్ మూడు, జోష్ టంగ్ రెండు, గస్ అట్కిన్సన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆది నుంచే నిప్పులు చెరుగుతూ 34.3 ఓవర్లలో ఆసీస్‌ను 132 పరుగులకు ఆలౌట్ చేశారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 42 పరుగులు కలుపుకొని ఆసీస్.. ఇంగ్లండ్‌కు 175 (42+132) పరుగుల లక్ష్యాన్ని విధించింది.ఎట్టకేలకు తొలి విజయంపేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ మేరకు ‘భారీ’ స్కోరును ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ సఫలమైంది. టాపార్డర్‌లో ఓపెనర్లు జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) రాణించగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ‘పేసర్’ బ్రైడన్ కార్స్ (6) విఫలమయ్యాడు.ఈ క్రమంలో జేకబ్ బెతెల్ (40) బాధ్యతాయుతంగా ఆడగా.. జో రూట్ 15 పరుగులు చేయగలిగాడు. ఇక కెప్టెన్ స్టోక్స్ (2) నిరాశపరచగా.. జేమీ స్మిత్ (3)తో కలిసి అజేయంగా నిలిచిన హ్యారీ బ్రూక్ (18) ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, జే రిచర్డ్సన్, స్కాట్ బోలాండ్ తలా రెండు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 32.2 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి గెలుపు అందుకుంది.బాక్సింగ్ డే టెస్టు సంక్షిప్త స్కోర్లుఆస్ట్రేలియా: 152 &132ఇంగ్లండ్: 110 &178/6.చదవండి: నవతరం క్రికెట్లో.. మూడు ఫార్మాట్లు ఆడగల టాప్-5 ప్లేయర్లు వీరే!
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
బలుపు మాటలకు భారత్ రియాక్షన్
భారత్ దృష్టిలో తాము పరారీలో ఉన్న కీలకమైన వ్యక్తులమంటూ.. లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అలాంటి వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.లలిత్ మోదీ, విజయ్ మాల్యా లండన్‌లో పార్టీలు చేసుకుంటూ.. భారత దర్యాప్తు సంస్థలను(Enforcement Agencies) ఎగతాళి చేస్తూ వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రంధీర్ జైస్వాల్ శుక్రవారం జరిగిన ప్రెస్మీట్లో స్పందించారు. “అలాంటి పరారీలను తిరిగి తీసుకురావడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ ప్రక్రియలో అనేక ప్రభుత్వాలతో చర్చలు జరుగుతున్నాయి. అయితే.. చట్టపరమైన అనేక దశల కారణంగా ఆలస్యం జరుగుతోంది.అంతేతప్ప మరొక ఉద్దేశం లేదు. అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు’’ అని స్పష్టం చేశారాయన.VIDEO | Delhi: “The Government of India is committed to bringing back all fugitives who have fled the country and evaded the law. Discussions are ongoing with several countries in this regard, and I want to assure you that we are firm and fully committed to ensuring their… pic.twitter.com/f7wcs5kwrR— Press Trust of India (@PTI_News) December 26, 2025బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం నుంచి పరారై లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యా ఇటీవల(డిసెంబర్ 16న) 70వ పుట్టినరోజు చేసుకున్నారు. దీనికి భారత బిలియనీర్ కిరణ్ మజుందార్ షా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ లలిత్ మోదీ, విజయ్ మాల్యా తాము అతి పెద్ద పరారీలో ఉన్న వ్యక్తులుగా నిలిచామని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ‘లెట్స్ బ్రేక్ ద ఇంటర్నెట్ డౌన్ ఇన్ ఇండియా ఎగెయిన్ (మళ్లీ భారత్‌లో ఇంటర్నెట్ను బద్దలు కొడదాం)’ అని క్యాప్షన్ పెట్టారు. అయితే ఫ్రాడ్, మనీలాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ విదేశాలకు పారిపోయిన వీళ్లు ఇలా వెటకారంగా స్పందించడం ఇదే తొలిసారి కాదు. ఐపీఎల్ వ్యవస్థాపకుడైన లలిత్ మోదీ.. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో దేశం విడిచి పారిపోయి లండన్‌లో తలదాచుకున్నాడు. అయితే.. న్యాయపరమైన చిక్కుల వల్ల తాను దేశం వీడలేదని, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి బెదిరింపులు రావడం వల్లే దేశాన్ని వీడాల్సి వచ్చిందని ఆ మధ్య ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన వెల్లడించాడు. కానీ, భారత ప్రభుత్వం ఆయనపై బిడ్ రిగ్గింగ్, మనీలాండరింగ్, విదేశీ మారక చట్ట ఉల్లంఘనల అబియోగాలు నమోదు చేసింది. ఇక మరో బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యా రూ.9,000 కోట్ల రుణ డిఫాల్ట్ కేసులో భారత్‌కు కావలసిన నిందితుడు. 2017లో లండన్‌లో అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. ఈడీ ఇప్పటికే మాల్యా ఆస్తుల విక్రయం ద్వారా వచ్చిన నిధులను ఉద్యోగులకు, బ్యాంకులకు తిరిగి ఇచ్చింది. అలాగే.. ఆయన్ని భారత్‌కు రప్పించే ప్రయత్నాల్లో కూడా పురోగతి కనిపిస్తోంది. అయితే.. భారత బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థులపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కిందటి ఏడాది పార్లమెంట్ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా.. విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులను జప్తు చేసి బ్యాంకుల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. అయితే ఆర్థిక మంత్రి ప్రకటన సమయంలో.. విజయ్ మాల్యా తీవ్రంగా స్పందించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బాకీలు రూ.6,203 కోట్లు, వడ్డీ.. రూ. 1,200 కోట్ల వడ్డీ. కానీ, ఈడీ సాయంతో బ్యాంకులు 14,131 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అంటే అప్పు కంటే రెట్టింపు వసూలు చేశారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగానే చూస్తున్నారు. నన్ను యధేచ్ఛగా విమర్శిస్తున్నవాళ్లు.. నాకు జరిగిన ఈ అన్యాయం మీద మాట్లాడగలరా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారాయన. ఈ జప్తు చర్యను ఈడీ, బ్యాంకులు చట్టబద్ధంగా సమర్థించుకోవాలి. లేకుంటే.. ఉపశమనం కోసం పోరాడే అర్హత నాకు ఉన్నట్లే! అని ట్వీట్ చేశారాయన. అయితే దానికి లలిత్ మోదీ స్పందిస్తూ.. ‘‘నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు.. బర్త్‌డే శుభాకాంక్షలు’’ అంటూ ఓ పోస్ట్ చేశాడు.
నా కంటే వీధికుక్కలే ఎక్కువంట!.. ఓ భర్త ఆవేదన వైరల్
‘ఒకప్పుడు దంపతులు కలిసి ఉండటానికి రాజీ కుదర్చాల్సిన పరిస్థితులు కనిపించేవి. ఇప్పుడు జంటలు విడిపోవడానికి అధిక శాతం రాజీ పడుతున్నారు’ అంటున్నారు న్యాయ నిపుణులు. అంతేకాదు, చిన్న చిన్న విషయాలు భూతద్దంలో చూసి,విడాకులకువచ్చేవారి సంఖ్య పెరుగుతోంది అంటున్నారు. భార్య కుక్కలు పెంచుతోందని భర్త విడాకులకు వెళ్లడం, బ్యూటీ పార్లర్ ఖర్చు కోసం భరణం ఎక్కువ ఇవ్వాలని భార్య తిరిగి కోర్టును ఆశ్రయించడం, ఇవన్నీ ఇప్పుడు పెద్ద సమస్యలే అయ్యాయని అంటున్నారు. వైవాహిక బంధంలో వస్తున్న ఈ పెనుమార్పులు రాబోయే కాలానికి ఈ యేడాది చెబుతున్న కొత్త భాష్యం.. ‘‘ఈ యేడాది న్యాయపరంగా చూస్తే విడాకుల సంఖ్య బాగా పెరిగింది. సెక్షన్ 490ఎ కింద వరకట్న కేసులు కోర్టులలో చాలా సులువుగా వీగిపోతున్నాయి. ఇప్పుడు జాతీయ లోక్ అదాలత్‌లో చాలావరకు ఈ కేసులను నిర్వహిస్తున్నారు. ఇరువైపుల వాళ్లు ఈ విషయంలో రాజీ కుదుర్చుకొని, డబ్బు విషయాలలో ఒక ఒప్పందానికి వచ్చి, త్వరగా విడాకులు తీసుకుంటున్నారు. దీని వల్ల కోర్టులకు పనిభారం కూడా తగ్గింది’’ అంటున్నారు న్యాయనిపుణులు ఈమని పార్వతి.సమయానికే ప్రాధాన్యతచిన్న వయసు జంటలు విడాకులకు లాయర్లను సంప్రదించే వారి శాతం బాగా పెరిగింది. దంపతులలో మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరిలోనూ ఒక ఖాళీ ఏర్పడుతుంది. ఆ గ్యాప్‌ని పూరించడానికి చాలా సమయం పట్టవచ్చు. సమయం వృథా అయ్యేలా కోర్టుల చుట్టూ తిరగడం వల్ల మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారు. డబ్బు, సమయం, పనులు మానేసి కోర్టుల చుట్టూ తిరగడం.. నవతరానికి నచ్చడం లేదు. అందుకే విడాకులు తీసుకునే సందర్భంలో డబ్బు పంపకాలలో ఒక కచ్చితమైన ధోరణి ఉండేది. ఉదాహరణకు... ఒక విడాకుల కేసులో అమ్మాయి తనకు పది లక్షలు ఇవ్వాలని ముందు పంతం పట్టినా రెండు మూడు సిట్టింగ్‌లలో 5–6 లక్షలకు రాజీకి వచ్చేస్తుంది.విడాకులకు ఏదైనా కారణమే...!ఇంత చిన్న విషయానికే బంధాన్ని విడగొట్టుకుంటారా అనిపించే హాస్యాస్పదమైన కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయి. ఉదాహరణకి.. ‘ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య వీధి కుక్కలను ఇంట్లోకి తీసుకొచ్చి, వాటికి ఆహారం పెడుతూ, వాటితో ఆడుతూ–పాడుతూ ఆనందంగా ఉంటోంది. దీంతో ఖర్చు ఎక్కువైపోయింది, ఆ వాసన భరించలేకపోతున్నాను అని ఆ భర్త ‘నా భార్య నన్ను మానసికంగా టార్చర్ చేస్తుంది, విడాకులు కావాలని’ కోర్టును ఆశ్రయించాడు. అది సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అతని ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతోందని ఆమెను హెచ్చరించిన కోర్టు విడాకులు మంజూరు చేయడానికి ఇంకాస్త టైమ్ ఇచ్చింది. ఒక కేసులో జంటలో ఒకరు మాంసాహారులు, మరొకరు శాకాహారులు. తమ భాగస్వామి నుంచి వచ్చే ఉల్లి, వెల్లుల్లి వాసన నచ్చడం లేదు. ఈ కారణంగా విడాకులకు అప్లై చేశారు. అస్తమానం ల్యాప్‌ట్యాప్ ముందు కూర్చొని తనను పట్టించుకోవడం లేదని మరొక కేసు ఫైల్ అయ్యింది. ఇలాంటివన్నీ క్రూయల్టీ కింద అంటే మానసిక వేదనకు కారణం అవుతుందనే విషయంగా ఆలోచిస్తున్నారు. ఒక ఎన్ఆర్ఐ కేసు విషయంలో... భర్త అమెరికాలో ఉన్నాడు, భార్య ఇండియాకు వచ్చింది. ఆమె తిరిగి వెళ్లడం లేదు. ఆ భర్త అమెరికా నుంచి కేసు ఫైల్ చేశాడు భార్య తిరిగి రావాలని. ఆమెకు ఇష్టం లేక ‘క్రూయల్టీ అమౌంట్’ అనే విషయం మీద కేసు వేసింది. అదేమింటంటే, భర్త తాను పంపే డబ్బుకు ప్రతీ పైసాకు లెక్క అడుగుతున్నాడనేది ఆమె అభియోగం. అతనిపైన క్రిమినల్ కేసు నమోదయ్యింది. హైకోర్టులో కూడా అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో అతను సుప్రీంకోర్టు దాకా వెళ్లాడు. సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. విడాకులు తీసుకున్న ఒకామె భరణం పెంచాలని కోర్టును ఆశ్రయించింది. ఆమె చెప్పిన విషయాలు.. బ్యూటీ΄ార్లర్కు వెళ్లడానికి, షాపింగ్ చేయడానికి డబ్బులు సరిపోవడం లేదని కేసు ఫైల్ చేసింది.సర్దుబాటు «ధోరణి దంపతుల్లో లోపించడం, డబ్బులు, ఇతరుల పట్ల ఆకర్షణ, అవసరాలు పెరగడంతో బంధాలు చాలా సులువుగా విచ్ఛిన్నమవుతున్నాయి. బంధాలు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తేనే అవి మనుగడ సాధిస్తాయి. విడిపోవడానికి రాజీ చేసుకునేవాళ్లు, కలిసుండే విషయంలో ప్రయత్నిస్తే దాంపత్య జీవనం సామాజికంగానూ పటిష్టంగా ఉంటుంది. పిల్లలు ఉన్నా.. ఒత్తిడి లేదు..విడాకులు తీసుకోవాలనుకున్న జంటలకు పిల్లలు ఉంటే, వారిపై తమ ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనే ఒత్తిడి ఈ రోజుల్లో లేదు. ఇరువైపుల ఇద్దరికీ తల్లిదండ్రులు ఉంటున్నారు. వారు కూడా సంతానం నిర్ణయాన్నే ఆమోదిస్తున్నారు. విడాకులు తీసుకున్న జంటలకు పిల్లల కస్టడీ గురించి పెద్ద సమస్యలు లేవు. విజిటింగ్ రైట్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. ఎవరికి వారు తమ వ్యక్తిగత జీవితం చూసుకుంటూ, తమ పిల్లల విషయంలో సమాన బాధ్యతలు నిర్వర్తించేందుకు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన సహజీవనాలు2022లో దీపక్ శర్మ కేసులో వచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వివాహేతర సంబంధాలలో సమాజం ప్రకారం అనైతికం కానీ, చట్టరీత్యా శిక్ష పడేటటువంటి నేరం కాదు అనేది వచ్చింది. అయితే, అందరి విషయాల్లో కాదు, కొన్ని సందర్భాలలో మాత్రమే అని కూడా చె΄్పారు. కానీ, చట్టాన్ని ఒక సాకుగా చూపుతున్నారు. లివింగ్ రిలేషన్ కూడా పెరిగింది. సమస్య వచ్చినప్పుడు కోర్టును ఆశ్రయిస్తున్నారు. దూరం అయినప్పుడు లైంగిక హింస, రేప్ వంటి కేసులు వస్తున్నాయి. ఇద్దరు ఒక ఇష్టప్రకారం ఉండి, ఎవరో ఒకరికి నష్టం జరిగినప్పుడు తట్టుకోలేక కేసులు ఫైల్ అవుతున్నాయి. అయితే, ఈ కేసులు అంతగా నిలబడటం లేదు.
దేవుడా.. నా తోడును తీసుకెళ్లిపోయావా...
పవన్.. అప్పుడు ఊగిపోయావు.. ఇప్పుడేమైంది?: జగ్గారెడ్డి
'కూలీ'పై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: లోకేశ్
‘ఛాంపియన్’ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్
పని చెప్పలేదని యజమానిపై కోర్టుకు..
రియల్ ఎస్టేట్.. ఫుల్ జోష్!
Ashes: ఎట్టకేలకు...
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
నా కంటే వీధికుక్కలే ఎక్కువంట!.. ఓ భర్త ఆవేదన వైరల్
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
మీకు ఎన్ని డాలర్లు ఇస్తే దిగిపోతారో కనుక్కోమంటున్నార్సార్!
దేవుడా.. నా తోడును తీసుకెళ్లిపోయావా...
పవన్.. అప్పుడు ఊగిపోయావు.. ఇప్పుడేమైంది?: జగ్గారెడ్డి
'కూలీ'పై విమర్శలు.. మళ్లీ అలా జరగనివ్వను: లోకేశ్
‘ఛాంపియన్’ మూవీ కలెక్షన్స్.. రెండో రోజు ఎంతంటే?
ఢిల్లీలో హై అలర్ట్.. 285 మంది అరెస్ట్
పని చెప్పలేదని యజమానిపై కోర్టుకు..
రియల్ ఎస్టేట్.. ఫుల్ జోష్!
Ashes: ఎట్టకేలకు...
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
నా కంటే వీధికుక్కలే ఎక్కువంట!.. ఓ భర్త ఆవేదన వైరల్
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
'అందరికీ ఇదే నా విజ్ఞప్తి'.. అనసూయ ఆసక్తికర ట్వీట్
స్విమ్ సూట్లో అనసూయ వీడియో.. శివాజీపై కోపమా?
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం
ఈ రాశి వారికి యత్నకార్యసిద్ధి.. స్థిరాస్తి వృద్ధి
వేళాకోళంగా ఉందా? వీళ్ల పేర్లు ‘రెడ్‌బుక్’లో రాయండి!!
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియా కెప్టెన్ ఎవరంటే?
డబ్బు సంపాదన ధ్యేయంగా.. రోజుకు 14 గంటలు పని!
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసిన 'బిగ్‌బాస్' ఇమ్మాన్యుయేల్
‘సీఎం కుర్చీ’లో కూడా ఈ విధానం ఉంటే చెప్పండని ప్రైవేటు భాగస్వామ్యం వాళ్లు అడుగుతున్నార్సార్!
నాకేమో రాజకీయ కాలుష్యంతో అలర్జీ సార్!
బంగారమా.. ఈరోజైనా కొనగలమా?
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
మీకు ఎన్ని డాలర్లు ఇస్తే దిగిపోతారో కనుక్కోమంటున్నార్సార్!
ఫొటోలు
తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)
తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)
హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)
విశాఖపట్నం : గంగమ్మా..మమ్మేలు మాయమ్మా! (ఫొటోలు)
'ఛాంపియన్' మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
కాజల్ అగర్వాల్ డిసెంబరు జ్ఞాపకాలు (ఫొటోలు)
TTD: అదే నిర్లక్ష్యం.. భక్తుల భద్రత గాలికి.. (ఫొటోలు)
ఈవినింగ్ చిల్ అయిపోతున్న సుప్రీత (ఫొటోలు)
బిగ్‌బాస్ శివజ్యోతి మరోసారి బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
సినిమా
విడాకుల రూమర్స్.. సతీమణితో వేదికపై రానున్న విజయ్!
నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్. నటి పూజా హెగ్డే నాయకిగా నటించిన ఇందులో మమితా బైజు ముఖ్యభూమికలు పోషించారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ భారీ బడ్జెట్లో నిర్మించింది. హెచ్.వినోద్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2026 జనవరి 9వ తేదీన తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ప్రస్తుతం ఆయన తమిళగ వెట్రికళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. దీంతో జననాయకన్ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి తోడ్పడేలా రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. దీంతో జననాయకన్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలోని మూడు పాటలు ఇప్పటికే విడుదలై విజయ్ అభిమానుల్లో జోష్‌ను నింపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 27న చెన్నైలో కాకుండా మలేషియాలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. విజయ్ సతీమణి పాల్గొంటారా? జననాయకన్ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి చెన్నై నుంచి పలువురు సినీ ప్రముఖులు మలేషియాకు వరుస కట్టారు. ముఖ్యంగా దర్శకుడు అట్లి, నెల్సన్ తదితరులు మలేషియాకు మలేషియాకు వెళ్లారు. నటుడు విజయ్ కూడా తన తల్లి శోభ చంద్రశేఖర్, బంధువు, గాయని పల్లవి వినోద్ తదితరులు ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి మలేషియాకు చేరుకున్నారు. అదేవిధంగా విజయ్ భార్య సంగీత, కొడుకు జెసన్ సంజయ్ కూడా మలేషియాకు వెళ్లారు. అయితే వీరు జననాయకన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే నటుడు విజయ్ ఆయన భార్య సంగీత మధ్య సఖ్యత లేదంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అలాంటిది సంగీత ఆమె కొడుకు, కూతురు దివ్య సాషా జననాయక్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటే ఇప్పటివరకు జరిగిన ప్రచారానికి తెరదించినట్లు అవుతుంది.
పరారీలో 'రకుల్ ప్రీత్ సింగ్' సోదరుడు
హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరంలో రోజు రోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో డ్రగ్స్ సబ్-పేడ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు మరోసారి తెలంగాణ ‘ఈగల్ టీం’తో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్‌తో పాటు ప్రమాదకరమైన 43గ్రాముల ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ పేడ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్ట్‌లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలింది. వీరి నుంచి అతను రెగ్యులరర్గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విషయం తెలుసుకున్న అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతను సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది.
మొన్న ఆమిర్... ఇప్పుడు షారూఖ్!
రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలకు ఇతర ప్రముఖ నటుల సపోర్టింగ్ తప్పనిసరిగా మారిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈయన ఇంతకు ముందు నటించిన జైలర్, వేట్టయయాన్, కూలీ చిత్రాల్లో ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు ముఖ్య భూమిక పోషించిన విషయం తెలిసిందే! వీటిలో జైలర్ చిత్రం మినహా ఇతర చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాయి. రజనీకాంత్ సినిమాలో గెస్టులుజైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్, మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలు పోషించారు. అదేవిధంగా హీరోయిన్ తమన్నా ప్రత్యేక పాట సినిమాకు మరింత బలంగా మారింది. ఇక వేట్టయాన్ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషించారు. అయినప్పటికీ ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. మిక్స్డ్ టాక్అదేవిధంగా రజనీకాంత్ ఇటీవల నటించిన కూలీ చిత్రంలోనూ బాలీవుడ్ స్టార్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటించారు. టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్‌వుడ్ స్టార్ ఉపేంద్ర ముఖ్యపాత్రలను పోషించారు. ఈ సినిమా రూ.500 కోట్లు రాబట్టినప్పటికీ మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న చిత్రం జైలర్–2. ఇది జైలర్ చిత్రానికి సీక్వెల్. జైలర్ 2లో సూపర్ స్టార్ఇందులోనూ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, బాలీవుడ్ భామ విద్యాబాలన్‌తోపాటు నటి రమ్యకష్ణ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఇందులో అతిథి పాత్రలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ నటిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి.. జైలర్ 2లో షారూఖ్ ఉన్నట్లు పేర్కొన్నాడు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
'దండోరా'కు నష్టం.. వేడుకున్న శివాజీ
నటుడు శివాజీ, నవదీప్, రవికృష్ణ, బిందు మాధవి తదితరులు నటించిన దండోరా సినిమా బాగుందని చాలామంది అంటున్నారు. కులవివక్ష గురించి దర్శకుడు మురళీకాంత్ చక్కగా చూపారని రివ్యూవర్లు కూడా చెబుతున్నారు. కానీ, థియేటర్లో మాత్రం పెద్దగా ప్రేక్షకులు కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం హీరోయిన్ల దుస్తుల గురించి ఆయన చేసిన డర్టీ కామెంట్సే.. సోషల్‌మీడియాలో ఆయన్ను సమర్థించిన వారందరూ వెళ్లి సినిమా చూసినా భారీ కలెక్షన్స్ వచ్చేవని కొందరు సెటైర్స్ కూడా వేస్తున్నారు. అయితే, తాజాగా దండోరా సినిమా చూడాలని ప్రేక్షకులను శివాజీ వేడుకున్నాడు.దండోరా సినిమా కోసం ప్రతి ఆర్టిస్టు ప్రాణం పెట్టి చేశారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే, తన వ్యక్తిగత విషయాల వైపు వెళ్లకుండా ఈ చిత్రాన్ని అందరూ ప్రమోట్ చేయాలని కోరాడు. ప్రతి ఒక్కరూ చూడండి. లేదంటే ఆ నింద తాను మోయాల్సి వస్తుందని తెలిపాడు. తనతో ఏదైన సమస్య ఉంటే మిగిలిన విషయాల గురించి మరోచోట మాట్లుడుకుందామని చెప్పాడు. కావాలంటే తాను కూడా థియేటర్‌కు వస్తానన్నాడు. ఏం మాట్లాడాలన్నా అందరం థియేటర్లోనే మాట్లాడుకుందామన్నాడు.అయితే, దండోరా చిత్ర దర్శకుడు మురళీకాంత్ ఇలా అన్నాడు. 'కొద్దిరోజుల క్రితం జరిగిన వేడుకలో దొర్లిన రెండు మూడు మాటల ఆధారంగా ఈ చిత్రాన్ని ఎవరూ జడ్జ్ చేయకండి. ఈ సినిమా కోసం నేను సుమారు మూడేళ్లు పైగానే కష్టపడ్డాను. నటీనటులు కూడా చాలా కష్టపడ్డారు. మా అందరి శ్రమకు ఫలితం తెరపై కనిపించింది. ఇప్పుడు చాలా సినిమాలు పోటీలో ఉన్నా సరే మా కథపై నమ్మకంతోనే భయపడకుండా సినిమా విడుదల చేశాం' అని దర్శకుడు అన్నారు.Worst fellow still living in 16th century, who thinks Women are subservient to Men I never saw any women advising how Men should dress publicly, why the fuck he can advise If he says similar thing is US, he would be thrown out of movies & public lifepic.twitter.com/cSIhwmo7vt— Ravi @ Prabhas Army (@RaviPrabhas333) December 26, 2025
క్రీడలు
కోహ్లి 77 రోహిత్ 0
బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (61 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) దేశవాళీల్లో కూడా అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఆంధ్ర జట్టుపై శతకంతో కదంతొక్కిన కోహ్లి... గుజరాత్‌తో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ పోరులో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. మొదట ఢిల్లీ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి చక్కటి షాట్లతో అర్ధశతకంతో ఆకట్టుకోగా... రిషభ్ పంత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ ‘డకౌట్’ జైపూర్: సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ సెంచరీతో చెలరేగిన ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ (0) ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో ‘గోల్డెన్ డకౌట్’ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి నిరాశ పరిచాడు. అయినా శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ముంబై జట్టు 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై గెలిచింది. మొదట ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ తమోర్ (93 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సర్ఫరాజ్ ఖాన్ (55; 5 ఫోర్లు, 1 సిక్స్), ముషీర్ ఖాన్ (55; 7 ఫోర్లు), షమ్స్ ములానీ (48; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకు పరిమితమైంది.
మీ వెంటే మేము...
మెల్బోర్న్: ఆ్రస్టేలియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ‘యాషెస్’ సిరీస్ నాలుగో టెస్టులో బౌలర్ల జోరు కొనసాగుతోంది. పచ్చికతో కూడిన పిచ్‌పై ఆట తొలి రోజే 20 వికెట్లు నేలకూలి రెండు జట్ల తొలి ఇన్నింగ్స్‌లు ముగిశాయి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ దాదాపు లక్ష మంది అభిమానుల సమక్షంలో జరిగిన పోరులో... ఇరు జట్ల బౌలర్లు బంతితో నిప్పులు చెరిగారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే ఆడిన తొలి మూడు టెస్టుల్లో నెగ్గిన ఆ్రస్టేలియా సిరీస్‌ను 3–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం ప్రారంభమైన ‘బాక్సింగ్ డే’ టెస్టులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45.2 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. నెసెర్ (49 బంతుల్లో 35; 7 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... ఉస్మాన్ ఖ్వాజా (29), అలెక్స్ కేరీ (20) తలా కొన్ని పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు పడగొట్టగా... అట్కిన్సన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కూడా ప్రత్యర్థి పేస్‌కు దాసోహమైంది. 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు ఆలౌటైంది. హ్యారీ బ్రూక్ (34 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే కాస్త పోరాడగా... అట్కిన్సన్ (28), కెపె్టన్ బెన్ స్టోక్స్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఆసీస్ బౌలర్లలో నెసెర్ 4 వికెట్లు పడగొట్టగా... బోలాండ్ 3, స్టార్క్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది. స్కాట్ బోలాండ్ (4 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా... ఓవరాల్‌గా 46 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకరి వెంట ఒకరు... గత మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న ఆ్రస్టేలియాకు... ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ట్రావిస్ హెడ్ (12), జేక్ వెదరాల్డ్ (10) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. లబుషేన్ (6) విఫలం కాగా... కెపె్టన్ స్టీవ్ స్మిత్ (31 బంతుల్లో 9) క్రీజులో నిలిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఆసీస్ 51 పరుగులకే 4 ప్రధాన వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఖ్వాజా, కేరీ కాస్త ప్రతిఘటన కనబర్చారు. క్రీజులో పాతుకుపోయి పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయితే పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని వినియోగించుకున్న ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ... కంగారూలపై ఒత్తిడి పెంచారు. ఇటీవల ఐపీఎల్ వేలంలో రికార్డు ధర దక్కించుకున్న కామెరాన్ గ్రీన్ (17) కూడా ప్రభావం చూపలేకపోగా... ఆఖర్లో నెసెర్ ధాటిగా ఆడాడు. గ్రీన్, నేసెర్ ఏడో వికెట్‌కు 52 పరుగులు జోడించడంతో ఆసీస్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఈ క్రమంలో ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్ కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/45) నమోదు చేసుకున్నాడు. తీరు మారని ఇంగ్లండ్... చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసి సిరీస్‌లో తొలిసారి ఆధిపత్యం కనబర్చే అవకాశాన్ని ఇంగ్లండ్ వినియోగించుకోలేకపోయింది. జాక్ క్రాలీ (5), బెన్ డకెట్ (2), జాకబ్ బెథెల్ (1), జో రూట్ (0) ఇలా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లండ్ జట్టు 16 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో డకెట్‌ను అవుట్ చేసిన స్టార్క్... తన తదుపరి ఓవర్లో క్రాలీని బుట్టులో వేసుకున్నాడు. ఈ మధ్య డకెట్‌ను నెసెర్ అవుట్ చేయగా... 15 బంతులాడి ఖాతా తెరవలేకపోయిన రూట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్రూక్ కౌంటర్ ఎటాక్‌కు ప్రయత్నించి కొంత ఫలితం సాధించాడు. కెపె్టన్ స్టోక్స్‌తో కలిసి చక్కటి షాట్లతో ఐదో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. బోలాండ్ బౌలింగ్‌లో బ్రూక్ వికెట్ల ముందు దొరికిపోగా... తక్కినవాళ్లు అతడిని అనుసరించారు. ఆఖర్లో అట్కిన్సన్ కొన్ని షాట్స్ ఆడి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. దీంతో ఆసీస్‌కు 42 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. 94,199 ఈ మ్యాచ్‌కు తొలి రోజు ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానుల సంఖ్య. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇదే అత్యధికం. ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ మధ్య 2015 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు 93,013 మంది హాజరయ్యారు. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 3468 టెస్టు క్రికెట్లో 3000 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు హ్యారీ బ్రూక్‌కు అవసరమైన బంతులు. ఆ్రస్టేలియా మాజీ ప్లేయర్ గిల్‌క్రిస్ట్ 3610 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. 4 మెల్బోర్న్ మైదానంలో ఇప్పటి వరకు జరిగిన టెస్టుల్లో తొలి రోజే 20 అంతకంటే ఎక్కువ వికెట్లు నేలకూలడం ఇది నాలుగోసారి. 1894లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 20 వికెట్లు... 1902లో ఆ్రస్టేలియా–ఇంగ్లండ్ టెస్టు తొలి రోజు 25 వికెట్లు...1932లో ఆస్ట్రేలియా–దక్షిణాఫ్రికా టెస్టు తొలి రోజు 20 వికెట్లు పడ్డాయి.
ఆంధ్ర గెలుపు బోణీ
బెంగళూరు: విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో ఓడిన ఆంధ్ర జట్టు... రెండో పోరులో గెలుపుబాట పట్టింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో రైల్వేస్‌ను ఓడించింది. మొదట రైల్వేస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 266 పరుగులు చేసింది. రవి సింగ్ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్ష్ యాదవ్ (59; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలు సాధించారు. ఆంధ్ర బౌలర్లలో సత్యనారాయణ రాజు, కలిదిండి రాజు చెరో 3 వికెట్లు పడగొట్టగా... హేమంత్ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆంధ్ర జట్టు 44.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి గెలిచింది. రికీ భుయ్ (74 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి (41 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. మారంరెడ్డి హేమంత్ రెడ్డి (35 బంతుల్లో 41 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షేక్ రషీద్ (53 బంతుల్లో 40; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), అశ్విన్ హెబ్బర్ (42 బంతుల్లో 30; 3 ఫోర్లు), శ్రీకర్ భరత్ (23 బంతుల్లో 25; 5 ఫోర్లు) కూడా తలా కొన్ని పరుగులు చేశారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన హేమంత్ రెడ్డికి ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సోమవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్‌లో ఒడిశా జట్టుతో ఆంధ్ర తలపడుతుంది. మళ్లీ ఓడిన హైదరాబాద్రాజ్కోట్: విజయ్ హజారే ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. విదర్భ జట్టుతో శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 5 వికెట్లకు 365 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ధ్రువ్ షొరే (77 బంతుల్లో 109 నాటౌట్; 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ధ్రువ్‌కిది వరుసగా ఐదో సెంచరీ. నారాయణ్ జగదీశన్ పేరిట ఉన్న రికార్డును ధ్రువ్ సమం చేశాడు. అమన్ మోఖడె (82; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశ్ రాథోడ్ (68; 6 ఫోర్లు), సమర్థ్ (63; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో కార్తికేయ 3 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 49.2 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ గౌడ్ (68 బంతుల్లో 85; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... అభిరథ్ రెడ్డి (43; 8 ఫోర్లు), కెపె్టన్ రాహుల్ సింగ్ (37; 4 ఫోర్లు) తలాకొన్ని పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.
రఫ్ఫాడించిన రింకూ సింగ్
రాజ్‌కోట్: భారత ఆటగాడు రింకూ సింగ్ (60 బంతుల్లో 106 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కించుకున్న రింకూ సింగ్... మిడిలార్డర్లో మెరుపులు మెరిపించాడు. ఫలితంగా ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా జరిగిన పోరులో ఉత్తర ప్రదేశ్ జట్టు 227 పరుగుల భారీ తేడాతో చండీగఢ్‌ను చిత్తు చేసింది. మొదట ఉత్తర ప్రదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 367 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఆర్యన్ జుయల్ (118 బంతుల్లో 134; 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) సెంచరీతో జట్టుకు గట్టి పునాది వేయగా... దానిపై రింకూ సింగ్ భారీ స్కోరు నిలబెట్టాడు. ధ్రువ్ జురేల్ (57 బంతుల్లో 67; 11 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో చండీగఢ్ 29.3 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (32; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... మిగిలిన వాళ్లంతా విఫలమయ్యారు. ఉత్తరప్రదేశ్ బౌలర్లలో జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూ కశీ్మర్ 142 పరుగుల తేడాతో అస్సాంపై... బరోడా 4 వికెట్ల తేడాతో బెంగాల్‌పై విజయాలు సాధించాయి. కరుణ్ నాయర్, పడిక్కల్ సెంచరీలు భారత ఆటగాళ్లు కరుణ్ నాయర్ (130 బంతుల్లో 130 నాటౌట్; 14 ఫోర్లు), దేవదత్ పడిక్కల్ (137 బంతుల్లో 124; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీలతో కదంతొక్కడంతో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నమెంట్లో కర్ణాటక జట్టు వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక 8 వికెట్ల తేడాతో కేరళపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కేరళ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొహమ్మద్ అజహారుద్దీన్ (58 బంతుల్లో 84; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), బాబా అపరాజిత్ (62 బంతుల్లో 71; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం లక్ష్యఛేదనలో కర్ణాటక జట్టు 48.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్ ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో తమిళనాడుపై, జార్ఖండ్ 73 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై... త్రిపుర 7 వికెట్ల తేడాతో పుదుచ్చేరిపై గెలుపొందాయి. అన్మోల్, హర్నూర్ శతకాలు ఎలైట్ గ్రూప్ ‘సి’లో పంజాబ్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో పంజాబ్ 9 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై నెగ్గింది. మొదట ఛత్తీస్‌గఢ్ 48.4 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అమన్‌దీప్ ఖరే (76; 4 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ వర్మ (64; 8 ఫోర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం పంజాబ్ 42.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 254 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆప్ ద మ్యాచ్’ హర్నూర్ సింగ్ (114 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), అన్మోల్ప్రీత్ సింగ్ (96 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకాలతో జట్టును గెలిపించారు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో మహారాష్ట్ర 8 వికెట్ల తేడాతో సిక్కింపై... గోవా 8 పరుగుల తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై విజయాలు సాధించాయి. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన మ్యాచ్‌ల్లో హరియాణా 6 వికెట్ల తేడాతో సౌరాష్ట్ర పై... ఒడిశా 4 వికెట్ల తేడాతో సర్వీసెస్‌పై గెలుపొందాయి. ప్లేట్ గ్రూప్‌లో బిహార్ జట్టు 15 పరుగుల తేడాతో మణిపూర్‌పై నెగ్గింది. బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’ అందుకోవడానికి ఢిల్లీ వెళ్లడంతో ఈ మ్యాచ్‌లో ఆడలేదు.
న్యూస్ పాడ్‌కాస్ట్
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
బిజినెస్
ప్రాంతీయ భాషలే ప్లస్
రోజువారీ ఉద్యోగ విధుల్లో భాగంగా కస్టమర్లతో మాట్లాడాల్సిన ఫ్రంట్‌లైన్ ఉద్యోగులను తీసుకునేందుకు అంకుర సంస్థలు కొత్త పంథాను ఎంచుకుంటున్నాయి. ప్రాథమికంగా దరఖాస్తులను మదింపు చేయడంలాంటి పనుల కోసం ప్రాంతీయ భాషల్లోని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ టూల్స్ వినియోగంతో నియామకాలకు పట్టే సమయం దాదాపు 40% వరకు ఆదా అవుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. షెఫ్‌లు, స్టోర్ ఆపరేటర్లలాంటి ఉద్యోగాలకు చాలా మంది దరఖాస్తుదారులు, ఇంగ్లిష్ కన్నా, ప్రాంతీయ భాషల్లోనే మాట్లాడటమే సౌకర్యవంతంగా భావిస్తున్నారనే విషయం గ్రహించిన క్లౌడ్ కిచెన్ ఆపరేటరు క్యూర్‌ఫుడ్స్ ఈ ఏడాది నుంచి నియామకాల ప్రక్రియ కోసం నేటివ్ ల్యాంగ్వేజ్ ఏఐ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించింది. ప్రస్తుతం తొలి దశ స్క్రీనింగ్‌ను ఆటోమేటెడ్ వాయిస్బాట్స్తో నిర్వహిస్తోంది. దీని వల్ల రిక్రూట్మెంట్ విభాగం సిబ్బందిపై ఒత్తిడి, అలాగే నియామకాలకు పట్టే సమయం తగ్గుతోందని కంపెనీ పేర్కొంది. తెలుగు, తమిళం, హిందీ తదితర ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యమిచ్చే, ద్వితీయ..తృతీయ శ్రేణి పట్టణాల్లో నివసించే ప్రతిభావంతులైన దరఖాస్తుదార్లనూ పరిగణనలోకి తీసుకునేందుకు వీలవుతోందని తెలిపింది. వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు తోడ్పడుతోందని పేర్కొంది. వాహన్ ఏఐ తదితర థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంలు కొన్ని ఈ–కామర్స్, టెక్ స్టార్టప్‌లలో సిబ్బంది సంఖ్య 70 శాతం పైగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. చాలా అంకుర సంస్థలు తమ మానవ వనరుల విభాగంలో సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం లేకుండా, ప్రాంతీయ భాషల్లో హైరింగ్ సొల్యూషన్స్ అందించే థర్డ్ పార్టీ ప్లాట్‌ఫాంల సర్వీసులను వినియోగించుకుంటున్నాయి. దీంతో వాహన్ ఏఐ, బోల్నా ఏఐ, సంవాదిని లాంటి కంపెనీల సేవలకు డిమాండ్ పెరుగుతోంది.స్టార్టప్‌లు చిన్న పట్టణాల్లోని ప్రతిభావంతులను కూడా తీసుకునేందుకు ఈ తరహా హైరింగ్ విధానం ఉపయోగపడుతోందని ఇన్‌స్టాహైర్ వర్గాలు వివరించాయి. దేశీయంగా ఏఐ ప్రొఫెషనల్స్ 23.5 లక్షల మంది పైగా ఉన్నప్పటికీ వివిధ కార్యకలాపాల నిర్వహణకు తగినంత మంది దొరకడం లేదు. డిమాండ్, సరఫరాకి మధ్య 51% పైగా వ్యత్యాసం ఉంటోంది. దీనితో ఎక్కువగా సంక్లిష్టత ఉండని, పెద్ద స్థాయిలో నిర్వహించాల్సిన ప్రాథమిక స్క్రీనింగ్, రొటీన్‌గా వచ్చే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంటర్వ్యూలను ఫిక్స్ చేయడంలాంటి పనుల కోసం అంకురాలు ఏఐ టూల్స్‌ని ఎంచుకుంటున్నాయి. ప్రాంతీయ భాషల్లోని వాయిస్ బాట్స్ ఏకకాలంలో పెద్ద సంఖ్యలో కాల్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్నాలాంటి జాబ్స్ మార్కెట్‌ప్లేస్ అంకుర సంస్థ అంతర్గతంగా రూపొందించిన ఏఐ కాలింగ్ ఏజెంటును వినియోగిస్తోంది. తొలి దశ స్క్రీనింగ్‌కి దీన్ని ఉపయోగిస్తోంది. రిక్రూటర్లు నిర్దిష్టంగా ప్రశ్నలను తయారు చేసి సిస్టమ్‌లో ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత సదరు సిస్టమే, దరఖాస్తుదార్లకు కాల్ చేసి, వారి సమాధానాలను విశ్లేíÙంచుకుని, షార్ట్‌లిస్ట్ చేస్తుంది. దీని వల్ల మాన్యువల్‌గా స్క్రీనింగ్‌కి పట్టే సమయం సగానికి పైగా తగ్గింది. ఈ టూల్‌ని అప్నా తమ క్లయింట్ కంపెనీలకూ ఆఫర్ చేస్తోంది. మెరుగ్గా అంచనా వేసేందుకు వీలు .. అలాగే దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) రుణ సేవలందించే ఫ్లెక్సిలోన్స్ కూడా ఇదే తరహాలో నియామకాలకు ఏఐ టూల్స్‌ని ఉపయోగిస్తోంది. దీనితో ఫ్రంట్‌లైన్ సిబ్బంది నియామకాల ప్రక్రియకు పట్టే సమయం 30–40 శాతం మేర తగ్గిందని కంపెనీ వివరించింది. అభ్యర్ధులు తమకు సౌకర్యవంతంగా ఉండే భాషలో మాట్లాడటం వల్ల వారి సామర్థ్యాలను మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు వీలవుతోందని తెలిపింది. ఇలాంటి సిస్టమ్స్ ఇచ్చే విశ్లేషణల వల్ల పక్షపాత ధోరణి తగ్గి, అభ్యర్ధుల షార్ట్‌లిస్టింగ్ ప్రక్రియ వేగవంతమవుతుందని ఫ్లెక్సిలోన్స్ వివరించింది. ముఖ్యంగా రాతపరమైన ఇంగ్లిష్ నైపుణ్యాల కన్నా స్థానిక భాషల్లో మాట్లాడే నైపుణ్యాలు ఎక్కువగా అవసరమయ్యే సేల్స్, కలెక్షన్ మొదలైన ఉద్యోగాలకు ఇది ఎంతో ఉపయోగకరమని పేర్కొంది. సాక్షి, బిజినెస్‌డెస్క్
అగర్‌బత్తులకూ బీఐఎస్ ప్రమాణాలు!
వినియోగదారుల భద్రతను.. ఇండోర్ గాలి నాణ్యతను దృష్టిలో ఉంచుకుని అగర్బత్తులకు బీఐఎస్ ప్రమాణాలు ఉండాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రి 'ప్రహ్లాద్ జోషి' కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగానే ''ఐఎస్ 19412:2025 – అగరుబత్తి - స్పెసిఫికేషన్''ను విడుదల చేశారు.కొత్త నిబంధనల ప్రకారం.. అగర్‌బత్తులలో వినియోగదారుల ఆరోగ్యం, ఇండోర్ గాలి నాణ్యతకు, పర్యావరణానికి హాని కలిగించే కొన్ని క్రిమిసంహారక రసాయనాలు & సింథటిక్ సువాసన పదార్థాల వాడకం పూర్తిగా నిషేధం. జాబితాలో అలెత్రిన్, పెర్మెత్రిన్, సైపర్మెత్రిన్, డెల్టామెత్రిన్ & ఫిప్రోనిల్ వంటి కొన్ని క్రిమిసంహారక రసాయనాలు.. అలాగే బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ & డైఫెనిలమైన్ వంటి సింథటిక్ సువాసన పదార్థాలు ఉన్నాయి.కొత్త ప్రమాణాలు.. అగర్బత్తులను యంత్రాలతో తయారు చేసినవి, చేతితో తయారు చేసినవి మరియు సాంప్రదాయ మసాలా వర్గాలుగా వర్గీకరిస్తుంది. అంతే కాకుండా.. ముడి పదార్థాలు, బర్నింగ్ నాణ్యత, సువాసన పనితీరు & రసాయన పారామితుల కోసం స్పెసిఫికేషన్లను నిర్దేశిస్తుంది. దీంతో అగర్బత్తులు బీఐఎస్ ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. ఇవి మానవ, పర్యావరణ హితంగా ఉంటాయి. దీనివల్ల ఉత్పత్తులపై ప్రజలకు నమ్మకం పెరగడం మాత్రమే కాకుండా.. మన దేశ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది.అగర్బత్తుల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్..ప్రపంచంలో అగర్బత్తుల ఉత్పత్తి & ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. కర్ణాటకలోని మైసూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు అగరుబత్తీ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఈ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధిని కల్పిస్తోంది. మన దేశం సుమారు 150 దేశాలకు అగర్బత్తులను ఎగుమతి చేస్తున్నట్లు కొన్ని గణాంకాలు చెబుతున్నాయి.
2025లో లాంచ్ అయిన టాప్ 5 బైక్స్: వివరాలు
2025లో హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా, కేటీఎమ్, టీవీఎస్, రాయల్ ఎన్ఫీల్డ్, ఏప్రిలియా మొదలైన కంపెనీలు తమ ఉత్పతులను భారతదేశంలో లాంచ్ చేశాయి. అయితే ఈ ఏడాది ఎక్కువమంది ఆకట్టుకున్న టాప్ 5 మోటార్‌సైకిళ్ల గురించి తెలుసుకుందాం.హోండా సీబీ125 హార్నెట్: హోండా CB125 హార్నెట్ బైక్ 123.94 సీసీ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో.. 7500 rpm వద్ద 11 hp & 6000 rpm వద్ద 11.2 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.4 సెకన్లలో 0 నుంచి 60 km/h వరకు దూసుకుపోతుంది. CB125 హార్నెట్ ప్రారంభ ధర రూ. 1.12 లక్షలు (ఎక్స్-షోరూమ్).కేటీఎమ్ 390 అడ్వెంచర్: కేటీఎమ్ 390 అడ్వెంచర్ ఫిబ్రవరి 2025లో లాంచ్ అయింది. ఇది 399 cc సింగిల్ సిలిండర్ LC4c ఇంజిన్ ద్వారా 45.2 hp శక్తిని & 39 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ & స్లిప్పర్ క్లచ్‌తో పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 3.49 లక్షలు (ఎక్స్-షోరూమ్).టీవీఎస్ అపాచీ ఆర్టిఎక్స్ 300: టీవీఎస్ అక్టోబర్‌లో అపాచీ ఆర్టిఎక్స్ 300ను విడుదల చేయడం ద్వారా అడ్వెంచర్ టూరర్ విభాగంలోకి ప్రవేశించింది. దీని ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ మోటార్‌సైకిల్, కేటీఎమ్ 250 అడ్వెంచర్, యెజ్డి అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ స్క్రామ్ 440 వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతోంది.రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650: రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 ట్విన్ బైకును కంపెనీ 2025 మార్చిలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 3.61 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 647 సిసి ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజిన్.. 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 46.4 హెచ్‌పి & 5,650 ఆర్‌పిఎమ్ వద్ద 52.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్‌ను కలిగి ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి అందిస్తుంది. ఈ మోటార్‌సైకిల్ భారతీయ మార్కెట్లో బిఎస్ఎ గోల్డ్‌స్టార్ 650కు ప్రత్యర్థిగా ఉంటుంది.ఇదీ చదవండి: 2026 కవాసకి వెర్సిస్ 650 లాంచ్: ధర ఎంతంటే?ఏప్రిలియా టుయోనో 457: ఏప్రిలియా టువోనో 457 రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ అందిస్తుంది. ఇది ప్రీలోడ్-అడ్జస్టబుల్ USD ఫ్రంట్ ఫోర్కులు, రియర్ మోనో షాక్‌తో కూడా ఇందులో ఉంటుంది. రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. ఇది 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులోని 457 సీసీ లిక్విడ్-కూల్డ్ ప్యారలల్-ట్విన్ ఇంజన్.. 46.6 బిహెచ్పి & 43.5 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
ఉద్యోగం మానేసినా.. పీఎఫ్ డబ్బుకు వడ్డీ వస్తుందా?
ఉద్యోగం చేసే దాదాపు అందరికీ పీఎఫ్ వస్తుంది. జాబ్ మానేసిన తరువాత ఆగిపోతుంది. అయితే ఉద్యోగం మానేశాక కూడా వడ్డీ వస్తుందా?, వస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుందో.. బహుశా చాలామందికి తెలుసుకుండకపోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు చూసేద్దాం.ఒక ఉద్యోగి తాను చేస్తున్న ఉద్యోగం ఆపేశాక కూడా పీఎఫ్ బ్యాలెన్స్‌కు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (UAN)కు లింక్ చేసిన తరువాత, మీరు ఉద్యోగం మారినా.. మానేసినా వడ్డీ ఆగిపోదు. సుమారు 58 ఏళ్లు వచ్చే వరకు లేదా మీకై మీరు విత్‌డ్రా చేసుకునే వరకు వడ్డీ జమ అవుతూనే ఉంటుంది.ఉద్యోగం మానేసిన రెండు నెలలు పూర్తయ్యాక, పీఎఫ్ మొత్తాన్ని తీసుకునే అర్హత పొందుతారు. కేవైసీ (ఆధార్, పాన్, బ్యాంక్) వివరాలు లింక్ అయి ఉంటే.. వడ్డీ క్రెడిట్ / విత్‌డ్రా సులభంగా జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి.. ప్రభుత్వం EPF వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ధారించింది.
ఫ్యామిలీ
సెలవులు పెట్టి.. చెక్కేస్తున్నారు!
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్ నెల అంటే హైదరాబాద్ నగర వాసులకు ప్రత్యేకమైన క్రేజ్.. ఏడాది చివరి నెలగా మాత్రమే కాకుండా లాంగ్ లీవ్స్ ఫెస్టివల్‌గా మారింది. ఏడాదిగా దాచుకున్న లీవ్స్‌ను ఐటీ ఉద్యోగులు ఈ ఒక్క నెలలోనే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అక్కడక్కడా కొన్ని ప్రైవేటు కంపెనీల ఉద్యోగులతో పాటు ఐటీ సంస్థల్లో ఈ కల్చర్ స్పష్టంగా కనిపిస్తోంది.హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్వంటి ప్రాంతాల్లోని ఐటీ ఆఫీసుల్లో డిసెంబర్ మొదలవుతూనే లీవ్ అప్లికేషన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. చాలా కంపెనీల్లో ఈ సమయంలో లీవ్స్‌కు పెద్దగా అభ్యంతరాలు ఉండవు. దీనికి ప్రధాన కారణం.. క్రిస్మస్ పండుగ. నగరంలో పనిచేస్తున్న అనేక విదేశీ ఎమ్ఎన్సీ కంపెనీలు క్రిస్మస్ను (Christmas) ప్రధాన పండుగగా భావిస్తాయి. అందువల్ల ఈనెల చివరి రెండు వారాలు ఆఫీసుల్లో పని ఒత్తిడి తక్కువగా ఉంటుంది.ట్రావెల్ ట్రిప్స్.. డేట్స్ ఫిక్స్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఐటీ ఉద్యోగులు లాంగ్ లీవ్స్ (Long Leaves) ప్లానింగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కొందరు వారం నుంచి పది రోజులు లీవ్స్ కలిసొచ్చేలా ముందుగానే ప్లాన్ చేసుకుని, దేశవ్యాప్తంగా ట్రావెల్ ట్రిప్స్‌కు బయలుదేరుతున్నారు. గోవా, కేరళ, కర్ణాటక, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వంటి టూరిస్ట్ డెస్టినేషన్స్‌కు నగరం నుంచి భారీగా బుకింగ్స్ పెరిగాయి. ఫ్లైట్స్, ట్రైన్స్, హోటల్స్ ఫుల్ అవుతున్నాయి.ఇంకొందరు ఉద్యోగులు తమ కుటుంబంతో కలిసి స్వగ్రామాలకు వెళ్లి పండుగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఏడాదంతా నగర జీవనశైలిలో బిజీగా ఉండే వారికి, ఈ లాంగ్ లీవ్స్ కుటుంబంతో గడిపే అమూల్యమైన సమయంగా మారుతోంది. మరోవైపు యువత మాత్రం ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్స్, బీచ్ పార్టీలు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు (New Year Celebrations) ప్రాధాన్యత ఇస్తున్నారు.సిటీ లైఫ్ ఆస్వాదించొచ్చు.. లాంగ్ లీవ్ కల్చర్‌లో (Long Leave Culture) అందరూ నగరం విడిచి వెళ్లిపోతున్నారు అనుకోవడం కూడా తప్పే. భాగ్యనగరంలోనే ఉండి సెలబ్రేషన్స్ చేసుకునే బ్యాచ్ కూడా ఉంది. ఈనెలలో నగరమంతా ఈవెంట్స్‌తో కళకళలాడుతుంది. మాల్స్, పబ్బులు, క్యాఫేలు, క్లబ్బులు ప్రత్యేక క్రిస్మస్, న్యూ ఇయర్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నాయి. లైవ్ మ్యూజిక్, డీజే నైట్స్, ఫుడ్ ఫెస్టివల్స్ నగర యువతను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ వల్ల నగర లైఫ్ స్టైల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ట్రాఫిక్ కొంతమేర తగ్గడం, ఐటీ ఏరియాల్లో ఆఫీసుల హడావుడి తగ్గిపోవడం సాధారణంగా మారింది. చాలా మంది ఉద్యోగులు ఈ నెలను వర్క్ ఫ్రీ మంత్‌గా అభివర్ణిస్తున్నారు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు డిసెంబర్ ఒక బ్రేక్‌లా ఉపయోగపడుతోందని ఉద్యోగులు భావిస్తున్నారు.నగర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం.. డిసెంబర్ నెల (December Month) ఇప్పుడు కేవలం క్యాలెండర్ చివరి నెల మాత్రమే కాదు. ఐటీ ఉద్యోగుల జీవితాల్లో ఇది రిలాక్సేషన్, ట్రావెల్, సెలబ్రేషన్స్‌కు సంకేతంగా మారింది. కొత్త ఉత్సాహంతో న్యూ ఇయర్‌కు స్వాగతం పలికేందుకు టెకీలు సిద్ధమవుతున్నారు. లాంగ్ లీవ్స్ ట్రెండ్ సిటీ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతోంది. ట్రావెల్ ఏజెన్సీలు, టూర్ ఆపరేటర్లు, హోటల్ బుకింగ్ ప్లాట్‌ఫాంలకు ఈ నెల పీక్ సీజన్‌గా మారింది.చదవండి: ఆహా అనిపించే సినిమా లొకేషన్లుఅలాగే నగరంలోని కెఫేలు, పబ్బులు, ఎంటర్టైన్మెంట్ జోన్లలో ఫుట్‌ఫాల్ గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు కంపెనీలు కూడా టీమ్ అవుటింగ్స్, ఇయర్ ఎండ్ పార్టీలు నిర్వహిస్తూ ఉద్యోగుల్లో మోరల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తానికి డిసెంబర్ నెల సిటీలో కేవలం సెలవుల సీజన్ మాత్రమే కాదు, వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు ప్రతీకగా మారుతోంది.
'భారత్ చాలా నేర్పించింది'..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్
చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్‌లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం చెప్పుకొచ్చిందంటే..బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్‌లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్ నేచర్ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్‌భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్ చేయడం ఓ థ్రిల్, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్‌ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్‌కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Lifestyle (@yana.in.india) (చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్)
సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం ! వైరల్‌గా ఎన్ఆర్ఐ పోస్ట్
సంపాదన కంటే ప్రశాంతమైన జీవితం మంచిది అనే సూక్తులు వినడానికే బాగుంటాయి. నిజజీవితంలో కాస్త కష్టమే అంత ఈజీ కూడా కాదు. పోనీ అలాంటి సాహసం చేస్తే..సమాజంలో, బంధువుల్లో మన స్థాయి తక్కువుగా ఉంటే మనం తట్టుకున్నా.. మన కుటుంబసభ్యలు అందుకు సిద్ధంగా ఉంటారా అంటే సమాధానం దొరకడం చాలా కష్టం. కానీ నార్వేలో నివశిస్తున్న భారత యువకుడు అదే మంచిదంటూ తాను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా అంటూ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అవ్వడమే కాదు..అందర్నీ విపరీతంగా ఆకర్షించింది.అందులోనూ ఈ ఉరుకుల, పరుగుల జీవితంతో విసిగివేశారిన వారికి ఈ పోస్ట్ ఓ మంచి ఎనర్జిటిక్‌గా కనిపించింది. పైగా ఆయన ఏం చెబుతున్నాడో అంటూ ఆ వీడియోని అంతా ఆస్తక్తిగా చూసేశారు కూడా. ఇంతకీ ఈ నార్వే యుకుడు ఆ ఇన్స్టాగ్రామ్ వీడియో పోస్ట్‌లో ఏం చెప్పాడంటే..తన పేరు సచిన్ అని తాను నార్వేలో నివశిస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను దాదాపు 35 దేశాలకు పైగా పర్యటించాక ఓ విషయాన్ని గ్రహించానానని అంటూ చెప్పుకుంటూ రావడం వీడియోలో చూడొచ్చు. జీవితానికి ఎల్లప్పుడూ డబ్బు అవసరం లేదని, జీవించడానికి కేవలం సమయమే కావలని అన్నాడు. ఇక్కడ నార్వేలో ఉద్యోగం మనిషి విలువను ప్రతిబింబించదని, కేవలం వాళ్లు మనుషులుగా చూడటం అత్యంత ప్రశంసించదగ్గ విషయమని అన్నాడు. అక్కడ జీతం, హోదా, జెండర్, ఎక్కడ నుంచి వచ్చారు వంటి వాటికి పెద్దగా విలువ ఇవ్వరని అన్నాడు. అక్కడ కుటుంబం, ఆరోగ్యం, అభిరుచులు, పర్యటనలు, మానసిక ప్రశాంతత తదితరాలే ముఖ్యమనే విషయం ఇక్కడకు వచ్చాక తప్పక గుర్తిస్తారని అన్నాడు. కేవలం జీవన నాణ్యత, భద్రత, శాంతి అనేవి ఎంత ముఖ్యమో కచ్చితంగా తెలుస్తుందంటున్నాడు. అలాగని నార్వే ఏదో గొప్పదని చెప్పుకురావడం తన ఉద్దేశ్యం మాత్రం కాదని, కేవలం నిజంగా మనం కోసం మనం జీవించే జీవితాన్ని ఎంచుకోవడానికి మించిన ప్రశాంతత మరొకటి ఉండదని తెలియజేసేందకేనని పోస్ట్‌లో పేర్కొన్నాడు. అంతేగాదు నార్వేలో పని అనేది జీవితంలో ఒక భాగమేనని, అక్కడ ప్రజలు కుటుంబం, పర్యటనలు, అభిరుచులపై పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పాడు. అంతేగాదు ఇక్కడ ప్రజలు మనుగడ కోసం జీవించరని, పూర్తి స్థాయిలో జీవితాన్ని ఆస్వాదిస్తారని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు సచిన్. అయితే నెటిజన్లు ఈ పోస్ట్‌ని చూసి బ్రదర్ మీరు చాలా అదృష్టవంతులు అని కొందరు, అలాంటి మంచి భారతీయ కమ్యూనిటీ ఉంటే కచ్చితంగా మేము అక్కడకి వచ్చేస్తాం అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Sachin | Life in Norway 🇳🇴 | Ship to Shore 🚢 (@sachinoffshore) (చదవండి: IAS Officer Anu Garg: ఎవరీ అను గర్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..)
ఎవరీ అను గార్గ్..? అత్యున్నత పదవిని చేపట్టిన తొలి మహిళగా..
ఇప్పటివరకు పరిపాలనా విభాగానికి సంబంధించిన అత్యతున్నత బ్యూరోక్రాటిక్ పదవులను పురుషులు మాత్రమే చేపట్టారు. అలాంటి పదవులు మహిళల వరకు చేరువ్వడం లేదా ఆ స్థాయికి చేరుకునేలా ప్రతిభా చాటిన మహిళలు చాలా అరుదు. అలాంటి మూసధోరణిని బద్దలు కొట్టి సరికొత్త ప్రభంజనం సృష్టించారు ఐఏఎస్ అధికారిణి అనుగార్గ్. ఎవరీమె? ఈ అరుదైన ఘనతను ఎలా సాధించారామె..?56 ఏళ్ల అనుగార్గ్ ఒడిశాలో అదనపు ప్రధాన కార్యదర్శి హోదాతో అభివృద్ధి కమిషనర్‌గా పనిచేస్తూ.. జల వనరుల విభాగం కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1991 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణి అయిన అనుగార్గ్ బుధవారమే ఒడిశా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇలా రాష్ట్రంలో అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఘనత సృష్టించారు. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ప్రధాన కార్యదర్శి మనోజ్ అహుజా డిసెంబర్ 31 పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో ఒడిశా సాధారణ పరిపాలన, ప్రజా ఫిర్యాదుల విభాగం అను గర్గ్‌కి నియామక ఉత్తర్వులను జారీ చేయడం విశేషం. ఇన్నాళ్లు అనుగర్గ్ డెవలప్మెంట్ కమ్ అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్లానింగ్ అండ్ కన్వర్జెన్సీ విభాగంలో పనిచేస్తూ..జనవనరుల విభాగానికి అదనపు భాధ్యతలను కూడా నిర్వహించారామె. ఇప్పటి వరకు పురుషులకే పరిమితమైన అత్యున్నత బ్యూరోక్రాటిక్ పదవిని అనుగర్గ్ చేపట్టి ఒడిశా పరిపాలన చరిత్రలో ఒక సరొకొత్త మైలు రాయిని సృష్టించారు. అయితే ఒడిశాలో గతంలో ఇలాంటి అత్యుతన్న పరిపాలనాధికారంలో 1972లో నందిని సత్పతి మహిళా సీఎంగా ఉన్నారన్నది గమనార్హం.మరో విశేషం ఏంటంటే అనుగార్గ్ ఒడిశా రాష్ట్రంలో డెవలప్మెంట్ కమిషనర్‌గా నియమితులైన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి కూడా ఆమెనే. దీన్ని అను ప్రస్తుతం చేపట్టనున్న అత్యున్న పదవి తర్వాత రెండో అత్యున్నతి పదవిగా పేర్కొనవచ్చు. ఇక ఈ అత్యున్న బ్యూరోక్రాటిక్ పదవిని అలంకరించనున్న అనుగర్గ్ మార్చ్2029లో పదవీవిరమణ చేయనున్నారు. నిజానికి కొత్తేడాది నేపథ్యంలో కీలక అభివృద్ధి కార్యక్రమాలు, బడ్జెట్ ప్రతిపాదనలు అమలకు సిద్ధమవుతన్న తరుణంలో అనుగార్గ్ ఈ ఉన్నతి పదవిని చేపట్టడం హర్షించదగ్గ విషయం. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన అనుగార్గ్ సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అలాగే మూడు దశాబ్దాలకు పైగా సివిల్ సర్వీస్‌లో పనిచేసి మహిళా అధికారిణి కూడా.(చదవండి: ప్రపంచం మొత్తం 6జీ అంటుంటే..అక్కడ మాత్రం కీప్యాడ్ ఫోనులే! ఎందుకో తెలుసా?)
అంతర్జాతీయం
ఆదివారం ట్రంప్‌తో భేటీ: జెలెన్స్కీ
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆదివారం ఫ్లోరిడాలో సమావేశమయ్యే అవకాశముందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శుక్రవారం తెలిపారు. ‘మేం ఒక్క రోజు కూడా వృథాగా పోనివ్వడం లేదు. అధ్యక్షుడు ట్రంప్‌తో అతి త్వరలోనే ఉన్నత స్థాయి సమావేశం జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. నూతన సంవత్సరం ప్రవేశించే లోగానే కీలక పరిణామాలు సంభవించొచ్చు’అని ఆయన మీడియాకు తెలిపారు. ట్రంప్ ప్రతిపాదిత 20–సూత్రాల ప్రణాళికలో 90 శాతం మేర ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ఆదివారం జరిగే సమావేశం సందర్భంగా ఉక్రెయిన్‌కు అమెరికా ఇచ్చే భద్రతా హామీలపై చర్చించనున్నామన్నారు. జెలెన్స్కీ వ్యాఖ్యలతో చర్చలు పురోగతిలో ఉన్నట్లు భావించవచ్చని పరిశీలకులు అంటున్నారు. అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జేర్డ్ కుషె్నర్తో ఫలవంతమైన చర్చలు జరిగినట్లు జెలెన్స్కీ అంతకుముందు గురువారం ప్రకటించారు. పారిశ్రామికంగా కీలకమైన తూ ర్పు ప్రాంతం తమ బలగాలను ఉపసంహరించుకునేందుకు సిద్ధమని జెలెన్స్కీ తెలిపారు. అయితే, రష్యా కూడా ఆ ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరించుకుని, నిస్సైనిక ప్రాంతంగా ప్రకటించేందుకు సిద్ధం కావాలన్నారు.
ఐఎస్ స్థావరాలపై దాడులు
వెస్ట్ పామ్ బీచ్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) లక్ష్యంగా అమెరికా వాయవ్య నైజీరియాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది. నైగర్–నైజీరియా సరిహద్దుల్లో ఉన్న సొకొటొ రాష్ట్రంలో ఐఎస్ నడుపుతున్న క్యాంపులపై ఈ దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ప్రాబల్యం కోసం ఐఎస్ తీవ్రంగా ప్రయతి్నస్తోంది. నైజీరియా యంత్రాంగం వినతి మేరకు గురువారం తమ దాడుల్లో పలువురు మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారముందని అమెరికా మిలటరీ ప్రకటించింది. అమాయక క్రైస్తవులను అమానుషంగా చంపుతున్నందుకే ఐఎస్ శిబిరాలపై భీకర, శక్తివంతమైన దాడులు చేపట్టామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇది అమెరికా బలగాలతో కలిసి చేపట్టిన ఉమ్మడి ఆపరేషన్ అని, నైజీరియా ప్రజలను చంపుతున్న ఉగ్రవాదులే తమ లక్ష్యమని నైజీరియా విదేశాంగ మంత్రి యూసుఫ్ మైతామాని అన్నారు. అదేవిధంగా, దాడులకు మతం ప్రాతిపదిక కాదని, క్రిస్మస్తో సంబంధం లేదని యూసుఫ్ స్పష్టం చేశారు. నైజీరియా నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు ముందస్తు పథకం ప్రకారమే ఈ దాడులు జరిగాయన్నారు. మరిన్ని దాడులకు అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. అయితే, జిహాదీ గ్రూపుల దాడుల నుంచి క్రైస్తవులను కాపాడటంలో నైజీరియా ప్రభుత్వం విఫలమైందంటూ కొంతకాలంగా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు చేస్తున్నారు. ‘ప్రత్యేకంగా ఆందోళనకరంగా మారిన దేశం’గా నైజీరియాపై అమెరికా ప్రభుత్వం ముద్ర వేసింది. దీని ప్రకారం.. మత స్వేచ్ఛ ఉల్లంఘనలు చోటుచేసుకున్న ఇలాంటి దేశాలపై ఆంక్షలు విధించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే అమెరికా మిలటరీ నవంబర్ నుంచే నైజీరియాలోని ఐఎస్ గ్రూపు స్థావరాలపై దాడులకు పథకం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఐఎస్ అనుబంధ గ్రూపుల హింస నైజీరియాలోని వాయవ్య ప్రాంతంలోని రెండు రాష్ట్రాల్లో ఐఎస్ అనుబంధ గ్రూపులు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఐఎస్‌కు సంబంధించిన ఓ గ్రూపు ఇప్పటికే బోర్నో రాష్ట్రంలో గట్టి పట్టు సాధించింది. ఈశాన్య నైజీరియాలో బోకోహరామ్, ఐఎస్ అనుబంధ గ్రూపులు గత పదేళ్లుగా వేలాది మందిని పొట్టనబెట్టుకున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది ముస్లింలేనని ఆక్లెడ్ అనే మానవ హక్కుల విభాగం తెలిపింది. ఈ గ్రూపు ప్రపంచవ్యాప్తంగా జరిగే రాజకీయ పరమైన హింసను విశ్లేíÙస్తుంది. ఐఎస్ అనుబంధ ‘నైజీరియా–ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్’ఈశాన్య ప్రాంతంలో నడుస్తున్న అతిపెద్ద గ్రూపని విశ్లేషకుడు బులామా బుకాటి చెప్పారు. అదే వాయవ్య సొకొటొ, కెబ్బి రాష్ట్రాల్లో ప్రాబల్యం కోసం స్థానికంగా లకురమా అని పిలిచే గ్రూపు ప్రయతి్నస్తోందన్నారు. ఈ గ్రూపునే తాజాగా అమెరికా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఈ గ్రూపు సొకొటొలోని ప్రజలపై సామాజిక ఆంక్షలను అమలు చేస్తోందని చెప్పారు. అదే సమయంలో, సెంట్రల్ నైజీరియా ప్రాంతంలో క్రైస్తవులైన రైతులు, ముస్లింలైన పశువుల కాపరుల మధ్య నీళ్లు, పచి్చక బయళ్ల విషయమై తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని బుకాటి వివరించారు.ట్రంప్ ఆరోపణల్లో నిజముందా?నైజీరియాలోని వివిధ జిహాదీ గ్రూపులు జరుపుతున్న దాడుల్లో ముస్లింల కంటే క్రైస్తవులే ఎక్కువ మంది చనిపోయారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని మానవ హక్కుల సంస్థలంటున్నాయి. బాధితుల్లో రెండు మతాల వారూ దాదాపు సమానంగానే ఉంటున్నారన్నాయి. క్రిస్మస్ రోజు రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్స్ వేదికగా..‘నైజీరియాలో రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదం పెచ్చుమీరడాన్ని మేం జరగనీయం. హ్యాపీ క్రిస్మస్’అంటూ వ్యాఖ్యానించారు. దాడులకు మద్దతు, సహకారం అందించిన నైజీరియా ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ పేర్కొన్నారు. ఓ యుద్ధ నౌక నుంచి క్షిపణిని ప్రయోగిస్తున్న ఫొటోను రక్షణ శాఖ విడుదల చేసింది. నైజీరియా జనాభా 22 కోట్లు కాగా, వీరిలో క్రైస్తవులు, ముస్లింలు సమాన సంఖ్యలో ఉన్నారు.
మన బ్రాండ్.. స్విచ్ ఆఫ్!
సాక్షి, స్పెషల్ డెస్క్ : మొబైల్ ఫోన్ల తయారీలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే. యూఎస్, యూఏఈ, నెదర్లాండ్స్, యూకే, ఆ్రస్టియా, ఇటలీ వంటి దేశాలకు మేడ్ ఇన్ ఇండియా ట్యాగ్‌తో ఐఫోన్లూ ఎగుమతి అవుతున్నాయి. స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. ఏటా 15 కోట్లకుపైగా స్మార్ట్ఫోన్లు వినియోగదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. ఈ స్థాయిలో అమ్మకాలు జరుగుతున్నా ఇండియన్ బ్రాండ్స్ కనిపించకపోవడం గమనార్హం. మైక్రోమ్యాక్స్ వంటి దేశీ బ్రాండ్స్ వచ్చినా.. భారత మొబైల్ ఫోన్ల విపణిలో 2010కి ముందు వరకు నోకియా (ఫిన్లాండ్), మోటరోలా (యూఎస్), ఎరిక్సన్ (స్వీడన్), సీమెన్స్ (జర్మనీ), సామ్సంగ్ (దక్షిణ కొరియా), సోనీ ఎరిక్సన్ (జపాన్/స్వీడన్), బ్లాక్‌బెర్రీ (కెనడా), ఎల్జీ (దక్షిణ కొరియా) కంపెనీలు రాజ్యమేలాయి. 2003లో చెన్నైకి చెందిన వీకే మునోత్తోపాటు పలు కంపెనీలు ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా రాణించలేదు. కానీ 2008లో మైక్రోమ్యాక్స్ రాకతో భారతీయ చవక హ్యాండ్సెట్స్ యుద్ధం మొదలైంది. క్రమంగా కార్బన్, లావా, సెల్కాన్, ఇంటెక్స్ వంటి దేశీ బ్రాండ్ల రాకతో 2010–12 మధ్య మొబైల్ ఫోన్ల కంపెనీల మధ్య పోటీ తారస్థాయికి చేరింది. దేశీయ మొబైల్ కంపెనీల దెబ్బకు ఒక దశలో నోకియా, సామ్సంగ్ మార్కెట్ వాటా తగ్గింది. ఏకంగా 230 బ్రాండ్స్.. భారత మొబైల్స్ రంగంలో ఒకానొక దశలో 50%పైగా వాటాను దేశీయ కంపెనీలు చేజిక్కించుకున్నాయంటే అతిశయోక్తి కాదు. 230 దాకా భారతీయ బ్రాండ్స్ అమ్మకాలు సాగించాయి. ఫీచర్ ఫోన్లతోపాటు స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్ పీసీలు, టీవీల తయారీలోకి సైతం ప్రవేశించాయి. 2010లో చైనా కంపెనీ హువావే భారత్‌లో అడుగుపెట్టగా షావొమీ, వివో, ఒప్పో ప్రవేశంతో 2014 నుంచి అసలైన యుద్ధం మొదలైంది. చైనా బ్రాండ్ల ముందు మన కంపెనీలు నిలవలేకపోయాయి. కొన్ని భారతీయ కంపెనీలు ఇప్పుడు ఫీచర్ ఫోన్లతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నా స్మార్ట్ఫోన్ల విభాగం పోటీలో మాత్రం విదేశీ కంపెనీల దరిదాపుల్లో కూడా లేవు. ఎలా సాధ్యమైందంటే..చవక ధరలో విక్రయించాలన్న లక్ష్యంతో ప్రవేశించిన దేశీయ బ్రాండ్స్ రిటైలర్ల మార్జిన్లపై దృష్టిపెట్టలేదనేది మార్కెట్ వర్గాల మాట. పైగా రూ. 10 వేలలోపు ధరల విభాగంలోనే ఇవి ప్రధానంగా దృష్టిపెట్టాయి. ఇక్కడే చైనా కంపెనీలు చక్రం తిప్పాయి. అధిక ఫీచర్లు, నాణ్యతకుతోడు రిటైలర్లకు అధిక లాభాలను అందించాయి. పైగా సొంత పరిశోధన, అభివృద్ధి విభాగాలతోపాటు స్మార్ట్ఫోన్ల తయారీ సైతం వాటి చేతుల్లోనే ఉండటంతో ధరలను శాసించాయి. విక్రయానంతర సేవలను చిన్న పట్టణాలకూ విస్తరించాయి. క్రమంగా చైనా బ్రాండ్లు భారతీయ మార్కెట్‌ను కైవసం చేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్ పరిమాణం పరంగా దాదాపు 70% వాటా చైనా కంపెనీలదే. ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశీయ బ్రాండ్లకు అవకాశమే లేదన్నది నిపుణుల మాట.ఇదీ భారత మార్కెట్..» 2025 జూలై–సెప్టెంబర్ మధ్య 4.8 కోట్లస్మార్ట్ఫోన్లుఅమ్ముడయ్యాయి. » టాప్–10లోని సామ్సంగ్, యాపిల్, మోటరోలా మినహా మిగిలినవన్నీ చైనావే. » మన దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ఫోన్సగటు ధర రూ. 26,400పైమాటే. » రూ.72 వేలు, ఆపై ఖరీదు చేసేమోడళ్ల అమ్మకాలు ఏడాదిలో53 శాతం పెరిగాయి. » విక్రయాల్లో ఆఫ్‌లైన్ వాటా48.3 నుంచి 56.4 శాతానికిదూసుకెళ్లగా ఆన్లైన్ విభాగం 51.7నుంచి 43.6 శాతానికి తగ్గింది.» ఈ ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ రూ. 4.34 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతంస్మార్ట్ఫోన్లనువినియోగిస్తున్నవారి సంఖ్య70కోట్లు
పర్వత ప్రాంతం.. ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం
బీజింగ్: చైనా మరోసారి ప్రపంచ ఇంజనీరింగ్ రంగాన్ని ఆశ్చర్యపరిచే ప్రాజెక్టును పూర్తి చేసింది. షింజియాంగ్ ప్రావిన్స్‌లోని తియాన్షాన్ పర్వతాల ప్రాంతంలో నిర్మించిన 22.13 కిలోమీటర్ల పొడవైన ‘తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్’ను అధికారికంగా ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌గా గుర్తింపు పొందింది.ఈ టన్నెల్ ద్వారా గతంలో పర్వత మార్గం గుండా ప్రయాణించడానికి గంటల తరబడి పట్టిన ప్రయాణం ఇప్పుడు కేవలం 20 నిమిషాల్లో పూర్తవుతోంది. షింజియాంగ్ ఉత్తర భాగంలోని ఉరుమ్చీ నగరాన్ని, దక్షిణ భాగంలోని యులీ ప్రాంతాన్ని కలుపుతూ నిర్మించిన G0711 ఉరుమ్చీ–యులీ ఎక్స్‌ప్రెస్‌వేలో ఇది కీలక భాగంగా నిలిచింది.తీవ్ర చలిలో, మైనస్ 43 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు పడిపోయే ఉష్ణోగ్రతల్లో, 9,842 అడుగుల ఎత్తులో ఈ టన్నెల్‌ను నిర్మించడం ఒక ఇంజనీరింగ్ సవాలుగా నిలిచింది. కేవలం ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా చైనా మరోసారి తన నిర్మాణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించింది.తియాన్షాన్ పర్వతాలు షింజియాంగ్‌ను ఉత్తర–దక్షిణ భాగాలుగా విభజిస్తాయి. ఈ టన్నెల్ ప్రారంభం వల్ల రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగవుతుంది. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక పరంగా కొత్త అవకాశాలను ఆహ్వానించినట్లు అవుతుంది.
జాతీయం
ఏఐ పొట్ట కొట్టింది.. డిజైనర్ దారి తప్పాడు
ఒకవైపు ఆధునిక ప్రపంచం ’ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’ విజయాలను వేడుక చేసుకుంటుంటే.. అదే టెక్నాలజీ ఒక 18 ఏళ్ల కుర్రాడి పొట్ట కొట్టింది. చేతిలోని పనిని ఏఐ లాగేసుకోవడంతో, ఆకలి తట్టుకోలేక ఆ యువకుడు తన స్నేహితురాలితో కలిసి చోరీ చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఏం జరిగిందంటే? ఇండోర్‌లోని రావు పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 22వ తేదీ రాత్రి ఒక నగల దుకాణంలో సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు చోరీ అయ్యాయి. ఈ కేసును ఛేదించిన పోలీసులు, భోపాల్‌లో తలదాచుకున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు 18 ఏళ్ల గ్రాఫిక్ డిజైనర్ కాగా, మరొకరు డాక్టర్ కావాలని కలలు కంటూ ’నీట్’ పరీక్షకు సిద్ధమవుతున్న యువతి. ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా స్ఫూర్తితో.. డీసీపీ శ్రీకృష్ణ లాల్చందాని తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారు. 2005లో వచి్చన ‘బంటీ ఔర్ బబ్లీ’ సినిమా చూసి స్ఫూర్తి పొందారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళిక వేసుకుని ఈ చోరీకి పాల్పడ్డారు. బతకడం కష్టమై తప్పు చేశా.. పోలీసుల విచారణలో.. ‘నేను ఒక ఐటీ కంపెనీలో పార్ట్ టైమ్ గ్రాఫిక్ డిజైనర్‌గా పని చేసేవాడిని. కానీ కంపెనీ వాళ్లు ఏఐ టెక్నాలజీని వాడటం మొదలుపెట్టి, నా ఉద్యోగం తీసేశారు. చేతిలో పైసా లేక, బతకడం కష్టమై ఈ దారి ఎంచుకున్నాను’.. అని ఆ యువకుడు కన్నీళ్లు పెట్టుకోవడం కలచివేసింది. దొంగతనం చేసిన నగలను అమ్మడానికి వారు ప్రయతి్నంచారు కానీ, చూడ్డానికి చిన్నపిల్లల్లా ఉండటంతో ఎవరూ వాటిని కొనడానికి ముందుకు రాలేదు. తక్కువ ధర కోట్ చేయడంతో, క్రిస్మస్ సెలవుల తర్వాత నిదానంగా అమ్ముదామని వేచి చూస్తుండగా పోలీసులకు చిక్కారు. ప్రస్తుతం పోలీసులు వారి దగ్గర నుండి నగలను స్వా«దీనం చేసుకున్నారు. సాంకేతికత తెచి్చన మార్పు ఒక యువకుడిని నేరస్తుడిగా మార్చడం.. నేటి సామాజిక సంక్షోభానికి అద్దం పడుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
నేడు సీడబ్ల్యూసీ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణయాత్మక విభాగం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) శనివారం భేటీ కానుంది. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీ జీ రామ్ జీ) పేరుతో తెచి్చన కొత్త చట్టంతో పాటు దేశ రాజకీయ పరిస్థితులపై చర్చించనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీకి అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాం«దీలతో పాటు అన్ని రాష్ట్రాల పీసీసీల అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో అక్కడి వైఫల్యాలపైనా చర్చించే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న పశి్చమబెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ వ్యూహాన్ని సమావేశంలో ఖరారు చేసే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక పారీ్టలతో పొత్తుల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాలు ఇటీవల వెల్లడైన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను భేటీలో విశ్లేíÙంచనున్నారు. దీంతో పాటే యూపీఏ ప్రభుత్వం తీసుకువచి్చన నరేగా పథాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కొత్తగా తెచ్చి జీ రామ్ జీ చట్టాన్ని అమల్లోకి తెచి్చన నేపథ్యంలో, దీనిపై. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై భేటీలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిరసనలపై రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి సభ్యుల నుంచి ప్రతిపాదనలు కోరనున్నట్లు తెలిసింది. కొత్త చట్టంపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ తీసుకునే కార్యాచరణ కీలకం కానుంది. ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు దామోదర రాజనర్సింహా ఢిల్లీకి చేరుకున్నారు.
అది ‘పండోర బాక్స్’ తెరిచినట్టే!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫయర్లపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) తగ్గించాలన్న డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో కీలక వ్యాఖ్యలు చేసింది. నిబంధనలను పక్కనపెట్టి, కోర్టు ఆదేశాల మేరకు జీఎస్టీని తగ్గిస్తే అది ‘పండోర బాక్స్’తెరిచినట్లవుతుందని, దీనివల్ల భవిష్యత్తులో అనేక క్లిష్ట సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఎయిర్ ప్యూరిఫయర్లను ‘వైద్య పరికరాల’జాబితాలో చేర్చాలని, ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. సమాఖ్య వ్యవస్థకు ముప్పు: కేంద్రం కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకటరామన్ వాదనలు వినిపించారు. జీఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగ బద్ధమైన సంస్థ అని గుర్తు చేశారు. పన్ను రేట్ల తగ్గింపు అనేది కేంద్రం, రాష్ట్రాల చర్చల ద్వారా, ఓటింగ్ ద్వారా నిర్ణయించాల్సిన అంశమని స్పష్టం చేశారు. ’ఇప్పుడు కోర్టు ఆదేశాలతో పన్నులు తగ్గిస్తే.. రేపు ప్రతి ఒక్కరూ పిటిషన్లు వేసి పన్నులు తగ్గించమని అడుగుతారు. ఇది ఒక పండోర బాక్స్ తెరిచినట్లవుతుంది. పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు ఉన్నాయి, వాటిని పరిశీలిస్తున్నాం. కానీ పద్ధతి ప్రకారం వెళ్లాలి’అని కోర్టుకు నివేదించారు. అసలు ఈ పిటిషన్ వెనుక ఎవరున్నారో ఆరా తీయాల్సి ఉందని, ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాకపోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సామాన్యుడు ఎలా కొంటాడు?: హైకోర్టు ఆగ్రహం జస్టిస్ వికాస్ మహాజన్, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించింది. ’ఒక ఎయిర్ ప్యూరిఫయర్ ధర రూ.10 వేల నుంచి రూ.15 వేలు వరకు ఉంది. సామాన్యుడు దీన్ని ఎలా కొనగలడు? జీఎస్టీని తగ్గించి సామాన్యుడికి అందుబాటులోకి తేవచ్చు కదా?’ అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని అత్యవసరంగా జీఎస్టీ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లాలని గతంలోనే చెప్పామని గుర్తు చేసింది. దీనిపై సమగ్ర సమాధానం ఇచ్చేందుకు (కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు) కేంద్రం గడువు కోరడంతో, కోర్టు 10 రోజుల సమయం ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 9, 2026కి వాయిదా వేసింది. సెలవుల తర్వాత వెంటనే ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఎప్పుడు చర్చించగలదో తెలపాలని ఆదేశించింది. విలాసం కాదు.. అవసరం: పిటిషనర్ పిటిషనర్ కపిల్ మదన్ వాదిస్తూ.. ఢిల్లీలో కాలుష్యం ఎమర్జెన్సీ స్థాయికి చేరిందన్నారు. ఎయిర్ ప్యూరిఫయర్ ఇప్పుడు లగ్జరీ కాదని, ప్రాణాలను కాపాడే వైద్య పరికరమని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తోందని, దీనివల్ల నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్యూరిఫయర్లను తప్పుడు కేటగిరీలో ఉంచి పన్ను వసూలు చేస్తున్నారని వాదించారు.
ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు ఏటీఎస్.. యాంటీ టెర్రర్ గ్రిడ్
న్యూఢిల్లీ: దేశంలోని పోలీసు వ్యవస్థ కోసం ఏటీఎస్(అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. అదేవిధంగా, యాంటీ టెర్రర్ గ్రిడ్‌ను కూడా అందుబాటులోకి తేవడం ద్వారా ఉగ్రదాడులను ప్రతి స్థాయిలోనూ ఉమ్మడిగా వేగంగా, సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని చెప్పారు. ‘వ్యవస్థీకృత నేరాలపై 360– డిగ్రీల దాడి’అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. జీరో టెర్రర్ పాలసీకి ఇది అత్యంత కీలకంగ మారనుందని ఆయన వివరించారు. దేశ రాజధానిలో శుక్రవారం మొదలైన రెండు రోజుల యాంటీ టెర్రరిజమ్ కాన్ఫరెన్స్–2025లో మంత్రి అమిత్ షా ప్రసంగించారు. ‘బలవంతంగా డబ్బు వసూలు చేయడమనే ఏకైక లక్ష్యంతో వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు ఏర్పడుతాయి. వాటి నేతలు విదేశాలకు పారిపోయి, అక్కడే స్థిరపడిపోయాక.. ఇక్కడుండే నెట్వర్క్ ఉగ్ర గ్రూపుల ఆ«దీనంలోకి వెళ్లిపోతున్నాయి. అటు తర్వాత, ఆ నెట్వర్క్ ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు దోహదపడుతోంది’అని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఆర్గనైజ్డ్ క్రైం నెట్వర్క్ డేటాబేస్, వెపన్స్ డేటా బేస్ ఫర్ లాస్ట్, లూటెడ్ అండ్ రికవరీ ఆరŠమ్స్‌కు సంబంధించిన రెండు డేటాబేస్లను ఆయన ప్రారంభించారు. జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) రూపొందించిన ఈ డేటాబేస్లను దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా విభాగాలు ఉపయోగించుకునేందుకు వీలుందన్నారు. వీటితోపాటు ఉగ్రవాదులు, నేరగాళ్లకు సంబంధించిన డేటాబేస్లను కూడా రూపొందించాలని సూచించారు.
ఎన్ఆర్ఐ
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి.
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్
గేదెల దాముకు సేవారత్న అవార్డు
అమెరికాలో నివసిస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రవాసాంధ్ర వాసి, మన అమెరికా తెలుగు అసోసియేషన్- మాట కో కన్వీనర్ దాము గేదెలను సేవారత్న అవార్డుతో సత్కరించారు. విజయనగరం జిల్లాలోని రాజాంకు చెందిన పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు పద్మశ్రీ యడ్ల గోపాలరావు... శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన ఎన్నారై, సామాజిక సేవా కార్యకర్త గేదెల దాము దంపతులను సేవారత్న అవార్డుతో సత్కరించారు.అవార్డు అందుకున్న దాము మాట్లాడుతూ… తనకు చిన్నప్పటి నుంచి సేవా కార్యక్రమాలు అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. కుటుంబీకులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఉత్సాహం రెట్టింపు అయ్యిందని, సేవా కార్యక్రమాలు బాధ్యతను, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెట్టాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దామును పలువురు కళాకారులు సత్కరించారు.అంతకు ముందు జగన్మోహిని పద్య నాటక ప్రదర్శన, కేవీ పద్మావతి శిష్య బృందంతో భరత నాట్య నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక జీఎంఆర్ వరలక్ష్మీ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలిపల్లి పైడితల్లి కళాకారుల సంక్షేమ సేవా సంఘం కమిటీ సభ్యులు, రాజాంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి)
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.
క్రైమ్
ఆపరేషన్ థియేటర్లో కామోన్మాది
యశవంతపుర: ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో మహిళలు బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలను మొబైల్‌ఫోన్ రికార్డ్ చేయడానికి యత్నించాడో జూనియర్ టెక్నీషియన్. నాగరబావి సెకండ్ స్టేజ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సువెందు మెహతా (23) అనే కామోన్మాదిని అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన నిందితుడు ఏడాదిగా ఈ ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పని చేస్తూ పీజీ హాస్టల్లో ఉండేవాడు. 20న ఉదయం 8:30 గంటలకు శస్త్రచికిత్స విభాగం గదిలో మహిళా సిబ్బంది బట్టలు మార్చుకొనే దృశ్యాలను రికార్డ్ చేయడానికి రహస్యంగా మొబైల్ఫోన్ని పెట్టాడు. ఫోన్ చూసిన నర్సులు కేకలు వేశారు.
డబ్బులు పంపుతావా.. జైలుకు వెళ్తావా
వికారాబాద్ జిల్లా: ‘డబ్బులు పంపు. లేదంటే జైలుకు పంపిస్తాను. చంపేస్తా’ అని గుర్తు తెలియని వ్యక్తి బెధిరింపు ఫోన్‌కాల్స్‌తో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన చన్గోముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి రాకంచర్ల గ్రామానికి చెందిన వడ్త్యా రాఘవన్ అలియాస్ పవన్(26) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజులుగా రెండు సెల్‌ఫోన్ నంబర్లతో.. ఓ వ్యక్తి క్రైమ్ కానిస్టేబుల్ అని, కంట్రోల్ రూం నుంచి మాట్లాడుతున్నానని వివిధ రకాలుగా బెధిరించి డబ్బులు వేయమని వేధించసాగాడు. డబ్బులు పంపకుంటే జైలుకు పంపిస్తానని, చంపేస్తానని బెధిరించాడు. దీంతో మనస్తాపంచెందిన పవన్.. ఈ నెల 23న రాకంచర్ల ఇండస్ట్రీయల్ పార్కు ప్రాంతంలో పురుగు మందు తాగి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. వికారాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కాల్‌డేటా ఆధారంగా హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిపై అనుమానం ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడిని డబ్బుల కోసం ఫోన్లో వేధించినట్లు గుర్తించారు. మృతుడి అన్న విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళా కమిషన్‌లో నటుడు శివాజీ విచారణ కొనసాగుతోంది. దండోరా సినిమా ప్రమోషన్లో భాగంగా వేదికపై శివాజీ అనుచిత వాఖ్యలు(misogynistic remark) చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. మహిళల వస్త్రధారణపై ఆయన అలా ఎందుకు మాట్లాడారో కమిషన్ ఛైర్ పర్సన్ నేరెళ్ళ శారద విచారణ జరుపుతున్నారు.సినిమా ఈవెంట్లో శివాజీ చేసిన ఆ అసంబద్ధ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. చిన్మయి, అనసూయ, నిధి అగర్వాల్, పాయల్ రాజ్‌పుత్ లాంటి సెలబ్రిటీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరోవైపు.. ఆ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా స్వీకరించి.. ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ శివాజీకి నోటీసులు జారీ చేసింది. దీంతో మహిళా కమిషన్ విచారణలో ఆయన ఎలాంటి వివరణ ఇస్తున్నారనే ఉత్కంఠ నెలకొంది.తన కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదన్న ఈ సీనియర్ నటుడు.. తన వ్యాఖ్యలను గానూ మహిళా లోకానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేశారు. అయితే తన వ్యాఖ్యల్లో దొర్లిన రెండు అసభ్య పదాలకు మాత్రమే సారీ చెబుతూనే.. తన స్టేట్మెంట్కు మాత్రం కట్టుబడి ఉన్నానంటూ చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఈ ఘటనలో శివాజీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఫిర్యాదులు, కేసులు నమోదు కాకపోవడం మరో కొసమెరుపు.
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ఆఫీస్ అయ్యాక మెట్రో రైలులో ఆ యువతి తాను ఉంటున్న ప్లేస్‌కు బయల్దేరింది. రద్దీలో ఎలాగోలా సీటు సంపాదించుకుని ఇద్దరు మగాళ్ల మధ్య కూర్చోగలిగింది. ఈలోపు.. తన పక్కన కూర్చన్న వ్యక్తి దిగిపోయి.. మరొకతను ఎక్కాడు. నెమ్మదిగా అతనిలోని కామోన్మాది బయటపడ్డాడు. ఒక్క నిమిషం ఆమెకు గుండె ఆగినంత పనైంది. అయితే ఆ వెంటనే ధైర్యం తెచ్చుకున్న యువతి ఆ మృగాడి చెంపలు చెడామడా వాయించింది.డిసెంబర్ 23 సాయంత్రం నమ్మా మెట్రో(బెంగళూరు) ప్రయాణిస్తున్న ఒక యువతి, తనకు ఎదురైన లైంగిక వేధింపుల ఘటనను సోషల్ మీడియాలో పంచుకుంది. ‘‘నా ప్రయాణం అప్పటిదాకా సాఫీగా సాగింది. మధ్యలో పక్కన కూర్చున్న ప్రయాణికుడు దిగిపోవడంతో, మరో వ్యక్తి వచ్చి పక్కన కూర్చున్నాడు. నా మీద పడడం, శరీర భాగాలకు తాకడంతో ఇబ్బంది పడ్డా. అయితే రద్దీ కాబట్టి యాదృచ్ఛికమని భావించా. ఈలోపు.. అతని తీరు మారింది. కావాలనే చేస్తున్నాడని అర్థమైంది. ఇదేమిటన్నట్లు చూస్తే వెకిలినవ్వులు నవ్వాడు. ఇంతలో.. నేను దిగాల్సిన స్టేజ్ వచ్చింది. అతను మరికొందరిని కూడా ఇలాగే వేధించే అవకాశం ఉందని భావించా. అతని చెంప పగలకొట్టి లేవమన్నా. స్టేషన్ బయటకు వచ్చాక మరోసారి చెంప పగలకొట్టా. కెంపగౌడ మెట్రో స్టేషన్ సెక్యూరిటీ సిబ్బంది అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు సర్దుకుపోవాల్సిన అవసరం ఏ అమ్మాయికీ లేదు’’ అంటూ ఆమె వీడియో ఉంచింది. ఈ ఘటనపై ఆ యువతి ఉప్పారపేట పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. అతని పేరు ముత్తప్ప (48) అని తెలిసింది. తర్వాత తప్పయిపోయిందంటూ అతడు యువతి పాదాలపై పడి క్షమాపణలు చెప్పాడు. యువతి అంగీకరించడంతో అతనిని మందలించి పంపించివేశారు. లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్న యువతిపై ప్రశంసలు కురుస్తున్నాయి. Namma Metro Harassment Case | ನಮ್ಮ ಮೆಟ್ರೋದಲ್ಲಿ ಕಾಮುಕ ಅಂಕಲ್ ಕಾಟ | Bengaluru....#NammaMetro #MetroHarassment #BengaluruNews #WomenSafety #MajesticMetro #PublicSafety #HarassmentCase #bengaluru pic.twitter.com/YaNsNgACW4— Sanjevani News (@sanjevaniNews) December 26, 2025
వీడియోలు
ఇకనైనా నల్ల అద్దాలు తీసి.. వంగవీటి రాధకు పోతిన మహేష్ కౌంటర్
అన్యాయం తట్టుకోలేక ఆగిన రైతు గుండె
పోటాపోటీగా.. వెండి, బంగారం ధరలు
తెలంగాణ మహిళా కమిషన్ ముందుకు శివాజీ
ధురంధర్ కలెక్షన్ల విధ్వంసం
నారాయణ స్కూల్ లో వేధింపులు.. వార్డెన్, ఏవోని చితకబాదిన పేరెంట్స్
రెండు నెలలు చాలు.. జగన్ వచ్చాక మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు
తప్పిన పెను ప్రమాదం.. పెట్రోల్ బంకులో మంటలు
డ్రగ్స్ కేసు.. రకుల్ సోదరుడు పరార్!
ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు దగ్ధం

