మహిళల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తప్పని ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పేర్కొన్నారు. ఈ అంశంలో శివాజీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన నటి అనసూయ, సింగర్ చన్మయిలను నెట్టంట ట్రోలింగ్‌కు దిగారు. దీంతో వారు కూడా గట్టిగానే తిరిగి కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. అయితే, తాజాగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అనసూయకు మద్ధతుగా తన ఎక్స్ పేజీలో ఒక ట్వీట్ చేశారు.
శివాజీ, అనసూయల మధ్య మొదలైన వివాదం నెట్టింట వైరల్ అవుతుంది. ఈ సందర్భంలో ప్రకాష్ రాజ్ ఇలా అన్నారు. సంస్కారి అని పిలవబడే వారిని మొరుగుతూనే ఉండనివ్వండి అంటూ అనసూయకు మద్ధతుగా పోస్ట్ చేశారు. అలాంటి వ్యాఖ్యలు చేస్తున్న వారి నీచమైన మనస్తత్వం ఇలా బయటపడుతుంది. ఇలాంటి అంశంలో ఇంకా బలంగా నిలబడాలని, అందుకోసం ఎప్పుడూ కూడా అండగా ఉంటామని అనసూయను ట్యాగ్ చేస్తూ పేర్కొన్నారు.
శివాజీని రేపిస్ట్‌తో పోల్చిన ఆర్జీవీ
నటుడు శివాజీ వ్యాఖ్యలపై మరోసారి దర్శకుడు ఆర్జీవీ భగ్గుమన్నారు. ఏకంగా నిర్భయ కేసు రేపిస్టుతో శివాజీని పోల్చడమే కాకుండా మహిళలపై అతను చేసిన వ్యాఖ్యలను వర్మ షేర్ చేశారు. మహిళలపై నిర్భయ రేపిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఇలా ఉన్నాయి. ' రాత్రి 9గంటల తర్వాత పద్ధతిగల అమ్మాయి రోడ్ల మీద తిరగదు. అత్యాచారా కేసుల్లో ఆడవాళ్లదే ఎక్కువ తప్పుంది. ఇందులో మగవారి తప్పు ఎక్కడుంది..?' అని నిర్భయ రేపిస్ట్ పేర్కొన్నాడు.
PR Sir ❤️💪🏻🙏🏻 https://t.co/2J11PKzqI5
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 27, 2025
This says it all 👍💪 https://t.co/NK7i8ipiHb
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2025


