ప్రధాన వార్తలు

వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని గురువారం కలిశారు. కూటమి ప్రభుత్వ కక్షరాజకీయాలకుగానూ వంశీ సుమారు నాలుగున్నర నెలలపాటు విజయవాడ జైల్లో గడిపిన సంగతి తెలిసిందే. న్యాయస్థానాల్లో ఊరట లభించడంతో బుధవారమే ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సాక్షి, గుంటూరు: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ గురువారం వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన వంశీ.. కష్టకాలంలో తనకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో వంశీ ఆరోగ్య స్థితి గురించి జగన్ ఆరా తీశారు. వంశీ వెంట ఆయన సతీమణి పంకజశ్రీ కూడా ఉన్నారు. వల్లభనేని వంశీపై మొత్తం 11 కేసులు పెట్టి వేధింపులకు దిగింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో ఆయన 140 రోజులపాటు జైల్లో గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్యం బారిన పడ్డారు కూడా. చివరకు వంశీకి బెయిల్ వచ్చినా తర్వాత కూడా విడుదలను అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేశారు. అందులో భాగంగానే సుప్రీం కోర్టులో బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ కూడా వేశారు. అయితే సుప్రీం కోర్టు వంశీకి ఊరట ఇవ్వడంతో.. బుధవారం ఉదయం విజయవాడ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు.

ఏంటీ కిరికిరి?..అమెరికా-పాక్‌ల మధ్య అసలేం జరుగుతోంది?
అమెరికా పర్యటనకు ఇటీవలే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వెళ్లి వచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో డిన్నర్ పార్టీలో సుదీర్ఘంగా మాట్లాడారు. మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అమెరికా పర్యటనలో ఉన్నారు. పాక్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమెరికాకు వెళ్లడం దశాబ్దం తర్వాత ఇదే తొలిసారి. ఇక్కడ పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ మాత్రం గుమ్మనంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ వ్యూహాత్మకమ చర్యా లేక ప్రధానిని పక్కన పెట్టేశారా? అనేది ప్రస్తుతానికి ప్రశ్నగానే ఉంది. భారత్ చేపట్టిన ఆపరేషన్సింధూర్ తర్వాత పాక్ ప్రధాని మనకు సోయలో కూడా కనిపించడం లేదు. పాక్‌లో ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనంతరం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట ఎక్కడా వినిపించకపోవడం ఒకటైతే, పాక్‌కు చెందిన రక్షణ వ్యవస్థలోని కీలక అధికారులు వాషింగ్టన్లో దర్శనమిస్తూనే ఉన్నారు. భారత్ కొట్టిన దెబ్బతో పాక్ ఆర్మీ ఎంత పేలవంగా ఉందో తేలిపోవడంతో ఇప్పుడు దానిపై వారు దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అమెరికా-పాకిస్తాన్ల మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం మాత్రం ప్రతీ ఒక్కరికీ ఏదో మూలన తొలుస్తూనే ఉంది. భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే చర్యలకు అమెరికాతో కలిసి కుట్రలు చేస్తుందా అనేది మరొక కోణంలో చూడాల్సి వస్తుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్(ఫైల్‌ఫోటో)చైనాను దెబ్బతీయాలన్నేదే లక్ష్యమా?పాక్‌కు భారత్ శత్రువు అయితే, అమెరికాకు చైనా శత్రువు అనేది కాదనలేని సత్యం. మరి భారత్, చైనాల సరిహద్దుల్లో ఉన్న దేశం పాకిస్తాన్. మరి చైనాను దెబ్బతీయాలన్నా కూడా అమెరికాకు పాక్ సాయం అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ ఆర్మీనే పదే పదే యూఎస్‌కు ట్రంప్ పిలుపించుకుంటున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఆ క్రమంలోనే పాకిస్తాన్‌ను కాకాపట్టి.. చైనా దెబ్బకొట్టాలనే ఉద్దేశంలో ట్రంప్ ఉన్నారా? అనేది ప్రధానంగా అనుమానించాల్సి వస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రధానికి ఉండే విలువ ఏమిటో అందరికీ తెలిసిందే. మరి అటువంటింది పాక్ ప్రధానిని పక్కన పెట్టి మరీ రక్షణ రంగంలోని కీలక అధికారులతో అమెరికా సమావేశాలేంటో ఎవరికీ అర్థం కావడం లేదు.పునః నిర్మాణంలో ఉగ్రస్థావరాలుఇటీవల సమకూరిన నిధులతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను, ఆర్మీ క్యాంపులను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డ పాక్.. ఇప్పడు అమెరికా యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి సిద్ధమైందనేది ప్రముఖంగా వినిపిస్తోంది. అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలకు పాకిస్తాన్ కొనుగోలుకు ఇప్పటికే పాక్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక్కడ పాక్‌కు అమెరికా ఎంత సపోర్ట్‌గా ఉందనేది తేటతెల్లమవుతుండగా, భారత్‌తో మాత్రం అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది అగ్రరాజ్యం. కొన్ని రోజుల క్రితం కెనడా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్ ఆహ్వానించినా, అందుకు మోదీ వెళ్లలేదు. ఇది స్వయంగా మోదీ చెప్పినమాట. అమెరికా కుతంత్రాలు ఇప్పటికే ప్రధాని మోదీకి అర్ధం కావడంతోనే ట్రంప్ డిన్నర్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. ఇరుదేశాల మధ్య ఏదో కిరికిరి..?ఇక చైనా కూడా పాక్‌కు అండగానే ఉంటుంది. ఇటీవల భారత్‌తో జరిగిన యుద్ధంలో కూడా పాక్‌కే సపోర్ట్ చేసింది చైనా. అదే సమయంలో ‘చైనా యుద్ధ సామాగ్రినే’ పాక్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా వైపు చూస్తోంది. అంటే ఏదో కిరికిరి ఉందనేది కామన్ మ్యాన్‌కు అర్థం అవుతున్న విషయం. విలువకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పాకిస్తాన్.. చైనాను పక్కన పెట్టడం కూడా పెద్ద పనేం కాదు. పెద్దన్నగా చెప్పుకునే అమెరికా అండదండలు పాకిస్తాన్‌కు ఉండటంతో తన పాత మిత్రుడు చైనాను దూరం చేసుకోవడానికి కూడా వెనుకాడని దేశం అది. అసలు అమెరికా వ్యూహం ఏమిటి?, పదే పదే వాషింగ్టన్లో పాక్ ఆర్మీ అధికారుల దర్శనం ఏమిటి?, అమెరికా-పాక్‌ల మధ్య ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చర్చకు దారి తీసింది.

ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. రెండో రోజు టీ విరామం తర్వాత భారత తొలి ఇన్నింగ్స్ 587 పరుగుల వద్ద ముగిసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ (387 బంతుల్లో 269; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి భారత్‌కు ఈ స్థాయి స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన భారత్.. ఇవాళ (రెండో రోజు) మరో 264 పరుగులు జోడించి మిగతా 5 వికెట్లు కోల్పోయింది. తొలి రోజే సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఇవాళ డబుల్ సెంచరీ సాధించాడు.భారత ఇన్నింగ్స్‌లో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) రాణించారు. గిల్.. జడేజాతో ఆరో వికెట్‌కు 203 పరుగులు , వాషింగ్టన్ సుందర్‌తో (42) ఏడో వికెట్‌కు 144 పరుగులు జోడించాడు.మిగతా భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 2, కరుణ్ నాయర్ 31, రిషబ్ పంత్ 25, నితీశ్ కుమార్ రెడ్డి 1, ఆకాశ్‌దీప్ 6, సిరాజ్ 8, ప్రసిద్ద్ కృష్ణ 5 (నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ తలో 2, బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్ చెరో వికెట్ పడగొట్టారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. ఆ మ్యాచ్‌లో భారత తరఫున ఐదు శతకాలు నమోదైనా ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134).. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు.

57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
ముంబై: చదువు ప్రముఖ నటి కుమారుడి ప్రాణం తీసినట్లు తెలుస్తోంది. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో తల్లితో వాగ్వాదం జరిగింది. అనంతరం ఆమె కుమారుడు 57వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల సమాచారం మేరకు .. ముంబైలో జరిగిన ఈ విషాదకర ఘటన బుధవారం ముంబైలోని కాందివలి వెస్ట్ ప్రాంతంలోని సీ బ్రూక్ అనే హైరైజ్ అపార్ట్మెంట్లో జరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో నటి కుమారుడు 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ట్యూషన్‌కు వెళ్లే విషయంలో నటితో ఆమె కుమారుడు గొడవ పడ్డాడు. వాగ్వాదం జరిగిన తర్వాత బాలుడు 57వ అంతస్తు నుంచి దూకినట్టు అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనను పోలీసులు ప్రాథమికంగా బాలుడిది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఎటువంటి అనుమానాస్పద అంశాలు లేవని తెలిపారు. ప్రముఖ నటి ఎవరు అనేది పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే, ఆ నటి భర్తతో విడాకులు తీసుకుందని, కుమారుడితో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మానసిక స్థితి, పాఠశాల వాతావరణం, కుటుంబ పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. ట్యూషన్ క్లాస్‌పై ఒత్తిడి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా,సదరు నటి పలు హిందీ, గుజరాతీ సీరియళ్లలో నటించిన ఆమె పాపులర్ అయ్యారు.

Siddaramaiah: ‘సీఎం సిద్ధరామయ్య నా మీదే చెయ్యెత్తుతారా?’
బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ దుమారం రేపిన ధార్వాడ జిల్లా ఏఎస్పీ నారాయణ భరమణి (ASP Narayan Venkappa Baramani) ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిండు బహిరంగ సభలో సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య (cm siddaramaiah).. తనని కొడుతానంటూ చెయ్యెత్తడం తనని మానసికంగా కలచివేసిందంటూ ఏఎస్పీ నారాయణ భరమణిని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా పోలీస్ శాఖలో పనిచేసిన తనకు జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానంటూ వాలంటరీ రిటైర్మెంట్ (VRS) ప్రకటించారు.ఈ మేరకు కర్ణాటక పోలీస్ శాఖకు ఏఎస్పీ నారాయణ భరమణి లేఖ రాశారు. వీఆర్ఎస్ లేఖలో..‘ అందరూ చూస్తుండగానే నిండు బహిరంగం సభలో సీఎం సిద్ధరామయ్య చేతిలో నాకు అవమానం జరిగింది. ఆ సంఘటన నన్ను మానసికంగా దెబ్బతీసింది. నా కుటుంబం బాధపడింది. నా భార్య, పిల్లలు కన్నీళ్లతో నిశ్శబ్దంగా గడిపారు. ఘటనకు సంబంధించిన వీడియోలో వైరల్ అయ్యాయి. పలువురు నన్ను అవమానిస్తూ కామెంట్లు పెట్టారు. 31 ఏళ్లుగా పోలీస్ శాఖలో అంకిత భావంతో పనిచేసిన నాకు ఇలాంటి అవమానం జరగడాన్ని తట్టుకోలేకపోయాను’ అని పేర్కొన్నారు. ఏఎస్పీ నారాయణ భరమణి వీఆర్ఎస్ ప్రకటించడంపై కర్ణాటక సిద్ధరామయ్య ప్రభుత్వం స్పందించింది. కర్ణాటక (Karnataka) హోంమంత్రి జి పరమేశ్వర .. ఏఎస్పీ నారాయణ భరమణిని సంప్రదించి బెళగావి డీసీపీ (Belagavi)గా కొత్త పోస్టింగ్ ఆఫర్ చేసినట్టు సమాచారం. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్‌ను భరమణి సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. The Police, who was insulted on stage by Congress leader & CM Siddaramaiah has resigned.The cop served for 31 years, joined force as his dream wish, worked hard.In his resignation, ASP Narayan Baramani has said he felt humiliated & traumatizedpic.twitter.com/ZxBCvSSF9h— Karthik Reddy (@bykarthikreddy) July 3, 2025పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో (2025 Pahalgam attack) ‘పాకిస్తాన్‌తో యుద్ధం తప్పనిసరి కాదు’అంటూ సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై వివాదం నెలకొంది. పలువురు సిద్ధరామయ్య పాకిస్తాన్ వెళ్లిపో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కామెంట్స్ తర్వాత ఏప్రిల్ 28న బెలగావిలో కాంగ్రెస్ సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది.సహనం కోల్పోయిన సిద్ధరామయ్యఅయితే, ఆసభలో సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతుండగా.. పలువురు ఆయన ప్రసంగానికి మాటిమాటికి అడ్డుతగిలారు. గో టూ పాకిస్తాన్ అంటూ నినదించారు. దీంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఆగ్రహంతో ఊగిపోతూ వేదిక ముందున్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని స్టేజీపైకి పిలిచారు. వాళ్లను ఎందుకు కంట్రోల్ చేయడంలేదని ప్రశ్నించారు. ఏఎస్పీ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా కొడుతానంటూ చెయ్యెత్తారు. ఆ తర్వాత తమాయించుకుని చెయ్యి దించారు.ఆ ఘటనపై రాజకీయ వివాదం జరిగింది. ప్రతిపక్షాలు ఆయన తీరును తప్పుబట్టాయి. కర్ణాటక కాంగ్రెస్ పాలనను హిట్లర్ పరిపాలనతో పోల్చాయి. ఆ ఘటనపై ఏఎస్పీ నారాయణ్ భరమణి కీలక నిర్ణయం తీసుకున్నాయి. వీఆర్ఎస్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి లేఖ రాయడం చర్చాంశనీయంగా మారింది.

రాయచోటిలో ఉగ్రమూలాల కలకలం.. ఇళ్లలో దొరికిన బాంబుల నిర్వీర్యం
సాక్షి, అన్నమయ్య జిల్లా: రాయచోటిలో ఉగ్ర మూలాలు బయటపడ్డాయి. ఉగ్ర వాదుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ సమక్షంలో సూట్‌కేసు బాంబులను ఆక్టోపస్ పోలీసులు నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్‌గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం.ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది.పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్‌బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్‌అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు.వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్‌లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్‌కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించారు.

చంద్రబాబుకు ఊహించని షాకిచ్చిన అమరావతి రైతులు
సాక్షి,గుంటూరు: అమరావతి విస్తరణ కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతులు షాకిచ్చారు. రాజధాని విస్తరణకు తమ భూముల్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.అమరావతి రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం మరో భారీ కుట్రకు తెరతీసింది. రాజధానికి సమీపంలోని 11 గ్రామాల్లో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది. ఇందుకోసం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం బేజాత్ పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుంచి భూముల్ని సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత చంద్రబాబులో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావొద్దని హెచ్చరించారు.అయితే, అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెప్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదానికి దారి తీసింది.ల్యాండ్ పూలింగ్కురాజధాని అమరావతిలో మరోసారి భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్)కు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 విధి విధానాలను జారీ చేస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్ స్కీం 2025 కింద రాజధానికి సమీపంలో ఉన్న 11 గ్రామాల్లో సుమారు 44,676.64 ఎకరాలను సమీకరిస్తుంది. ఇప్పటికే రాజధాని కోసం 2015లో తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరించిన విషయం తెలిసిందే.రాజధాని భూముల్ని అమ్మేందుకు కుట్రమరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217చదరపు కిలోమీటర్లు) రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు గతంలో పేర్కొంది. మౌలిక సదుపాయాల కల్పన, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాల భూమి మిగులుందని.. దాన్ని విక్రయించగా వచ్చే ఆదాయంతోనే రాజధానిని నిర్మించుకోవచ్చని.. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి అంటూ సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ 2015 నుంచి పదే పదే చెబుతూ వచ్చారు.మండిపడుతున్న అమరావతి రైతులుఇప్పుడు స్మార్ట్ ఇండస్ట్రీస్ వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని.. కానీ ఆ ప్రాజెక్టులు రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని వారు చెబుతున్నారు. వాటి కోసం పది వేల ఎకరాలు అవసరమని, అంత భూమి ప్రభుత్వానికి అందుబాటులోకి రావాలంటే 44,676.64 ఎకరాలు సమీకరించాలని అంటున్నారు. 2015లో భూములిచ్చిన తమకే ఇంతవరకూ అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వకుండా మళ్లీ భూ సమీకరణకు ప్రభుత్వం సిద్ధం కావడంపై రైతులు మండిపడుతున్నారు.

ఒకే ఒక పెద్ద సినిమా.. టాలీవుడ్‌కి ఏమైంది?
టాలీవుడ్లో మొన్నటి వరకు పోటీ లేకుండా సినిమా రిలీజ్ అయ్యేది కాదు. ఒకేవారం పెద్ద సినిమాతో పాటు మూడు, నాలుగు చిన్న చిత్రాలు కూడా రీలీజ్ అయ్యేవి. కానీ సమ్మర్ నుంచి టాలీవుడ్లో పెద్దగా పోటీ లేకుండా సినిమాలు వస్తున్నాయి. ఇక గత నెలలో థగ్‌లైఫ్, కుబేర, కన్నప్ప లాంటి పెద్ద సినిమాలు వచ్చినా.. వాటి మధ్యలో కూడా వారం, వారం గ్యాప్ ఉంది. వీటితో పాటు రెండు, మూడు చిన్న సినిమాలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా పోటీ ఇవ్వలేకపోయాయి. ఇక జులైలో టాలీవుడ్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెల మొత్తంలో ఒకే ఒక పెద్ద సినిమా రిలీజ్ కానుంది. మిగిలిన సినిమాలన్ని పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగబోతున్నాయి.జులై మొదటి వారంలో తమ్ముడు చిత్రంలో నితిన్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ హీరోయిన్లుగా నటించగా, లయ కీలక పాత్ర పోషించింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంపై మోస్తరు అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాల మేరకు అయినా సినిమా ఆడుతుందో లేదో జులై 4న తెలుస్తుంది. ఇక అదే రోజు సిద్ధార్థ్ నటించిన 3 బి.హెచ్.కె కూడా విడుదల కానుంది. తమ్ముడుతో పోలిస్తే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. హిట్ టాక్ వస్తే తప్ప థియేటర్‌కి వెళ్లి చూసే పరిస్థితి అయితే ఈ సినిమాకు లేదు.ఇక రెండో వారంలో అనుష్క షూటీ రిలీజ్ కావాల్సింది. కానీ అది వాయిదా పడింది. దీంతో ఈ వారంలో ఎలాంటి పోటీ లేకుండా సింగిల్‌గా బరిలోకి దిగుతున్నాడు సుహాస్. ఆయన హీరోగా నటించిన ఓ భామ అయ్యో రామ జులై 11న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి సింగిల్‌గా వస్తున్న సుహాస్.. సూపర్ హిట్ కొడతాడో లేదో చూడాలి.ఇక మూడో వారంలో మేఘాలు చెప్పిన ప్రేమ కథ(జులై 17) అనే చిన్న సినిమాతో పాటు జూనియర్(జులై 18 అనే కన్నడ-తెలుగు సినిమా కూడా ఇక్కడ విడుదల కాబోతుంది. గాలి జనార్థన్‌రెడ్డి కొడుకు కిరీటీ హీరోగా నటిస్తున్న జూనియర్‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం, హీరోయిన్గా శ్రీలీల నటించడం, మరో కీలక పాత్రలో జెనీలియా కనిపించడంతో జూనియర్‌పై టాలీవుడ్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక చివరి వారంలో (జూలై 24) హరిహరి వీరమల్లు రాబోతుంది. ఈ నెలలో వస్తున్న ఏకైక పెద్ద సినిమా ఇదే. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఎంఎం రత్నం భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పీరియాడికల్ డ్రామాలో నిధి అగర్వాల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసిది.

F-35 Row: రిపేర్ కుదరదు, ఇక మిగిలింది ఒక్కటే ఆప్షన్!
అత్యవసర పరిస్థితులతో కేరళలో దిగిన యూకే యుద్ధ విమానం ఎఫ్ 35(F-35 fighter) ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. 20 రోజుల తర్వాత మరమ్మత్తుల విషయంలో యూకే నిపుణులు చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన ఒకే ఒక్క ఆప్షన్నే పరిశీలిస్తున్నట్లు సమాచారం.బ్రిటన్‌కు చెందిన HMS Queen Elizabeth నౌకాదళ విమాన వాహక నౌక ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మిషన్‌లో పాల్గొంది. జూన్ 14వ తేదీన ఈ నౌక నుంచి ఎగిరిన ఎఫ్ 35 ఫైటర్ జెట్ మిలిటరీ కార్గో ఎయిర్‌క్రాఫ్ట్.. తిరువంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. తొలుత సాంకేతిక సమస్యగా భావించిన నిపుణులు.. త్వరగతినే ఇది రిపేర్ అవుతుందని భావించారు. అయితే.. ఇంధనం తక్కువగా ఉండడం, ప్రతికూల వాతావరణం కారణంగానే ఇది ల్యాండ్ అయ్యిందని తర్వాతే తేలింది. ఈలోపు.. ల్యాండింగ్ అనంతరం హైడ్రాలిక్ స్నాగ్ అనే లోపం తలెత్తడంతో అది గాల్లోకి లేవలేదు. అప్పటి నుంచి CISF సిబ్బంది విమానానికి నిరంతర భద్రత కల్పించారు. అలాగే భారత వైమానిక దళం (IAF) లాజిస్టికల్ సహాయం అందిస్తూ వచ్చింది. ఈలోపు.. సుమారు 40 మంది బ్రిటిష్ ఇంజనీర్లు మరమ్మతుల కోసం కేరళకు వచ్చారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో విమానాన్ని విడదీసి ఆ భాగాల్ని తరలించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్నిరోజులకుగానూ.. విమానం పార్కింగ్, హ్యాంగర్ ఛార్జీలను చెల్లించాలని UK ప్రభుత్వం నిర్ణయించింది. భారత వైమానిక దళం, నౌకాదళం, తిరువనంతపురం విమానాశ్రయ అధికారుల సహకారానికి UK హై కమిషన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.మీమ్స్ వైరల్తిరువనంతపురంలో నిలిచిపోయిన బ్రిటన్ ఎఫ్-35బీ యుద్ధ విమానం గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అయ్యాయి. OLXలో 4 కోట్లకే అమ్మకానికి! అని ఓ యూజర్ చమత్కరించారు. ఇది స్టెల్త్ కాదు... స్టక్! అంటూ మరో వ్యక్తి పోస్ట్ చేశారు. బ్రిటన్ టెక్నాలజీ.. చివరకు భారతీయ భూభాగంలో ఓడింది అంటూ ఓ మీమ్ దేశభక్తి టచ్‌తో వైరల్ అయ్యింది. ఇది ఫైటర్ జెట్ కాదు... పార్కింగ్ జెట్ అంటూ మరో యూజర్ ఎద్దేవా చేశారు. ఇది టూమచ్ గురూ.. F-35B స్టెల్త్ యుద్ధ విమానం.. ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఇది షార్ట్ టేకాఫ్ & వర్టికల్ ల్యాండింగ్ సామర్థ్యం కలిగి ఉంది. ఇలాంటి అత్యాధునికమైన విమానాలను ఇప్పటిదాకా అమెరికా, UK, ఇజ్రాయెల్ వంటి దేశాలే వినియోగిస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ Lockheed Martin Corporation F-35B స్టెల్త్ యుద్ధ విమానాలను తయారు చేస్తోంది. F-35B (Short Takeoff and Vertical Landing version) ధర సుమారుగా $135.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు ₹1,170 కోట్ల రూపాయలు ఉంటుంది. ఈ విమానంలో ఇంజిన్, ఆయుధ వ్యవస్థలు, స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన సెన్సార్లు కూడా ఉంటాయి. ఇంజిన్ ఖర్చు మాత్రమే సుమారుగా $19.7 మిలియన్ (₹169 కోట్లు) వరకు ఉంటుంది. ఒక్క గంట ఎగరడానికి సుమారుగా $38,000 (₹32.88 లక్షలు) ఖర్చవుతుంది. F-35B యొక్క వార్షిక నిర్వహణ ఖర్చు సుమారుగా $6.8 మిలియన్ (₹58.8 కోట్లు) ఉంటుంది. అంతెందుకు.. ఈ జెట్‌లో వాడే హెల్మెట్ ధర $400,000 (₹3.4 కోట్లు). అంటే ఒక్క హెల్మెట్ ఒక లగ్జరీ కారు ధరతో సమానమన్నమాట. అంతేకాదు.. విమానాన్ని నడిపేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ఇది కూడా ఖరీదైనదే.పార్కింగ్ ఫీజు ఎంత చెల్లిస్తారంటే.. తిరువనంతపురం ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకు అధికారికంగా యూకే ప్రభుత్వం ఎంత పార్కింగ్ ఛార్జీలు చెల్లింస్తుంది అనే వివరాలు బయటకు రాలేదు. అయితే అది లక్షల్లోనే ఉండే అవకాశం ఉంది. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్, భద్రత, హ్యాంగర్ ఛార్జీలు కలిపి రోజుకు ₹2–3 లక్షలు వరకు ఉండొచ్చని విమానాశ్రయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 20 రోజుల పాటు విమానం అక్కడే నిలిచిన నేపథ్యంలో, మొత్తం ఖర్చు ₹40–60 లక్షలు, అంతకంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం రేపాయి. బుధవారం (జూలై 2) రాత్రి చికాగోలో డ్రైవ్ బై కాల్పులు జరిగాయి. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. చికాగో స్థానిక పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చికాగో నగరంలోని రివర్ నార్త్ (River North) ప్రాంతం ఆర్టిస్ లాంజ్ (Artis Lounge) అనే నైట్‌క్లబ్‌లో రాపర్ మెలో బక్స్ (Mello Buckzz) ఆల్బమ్ రిలీజ్ పార్టీ జరుగుతోంది.ఆ సమయంలో ఓ వాహనం లోపల ఉన్న అగంతకులు నైట్‌క్లబ్ వెలుపల గుమికూడిన జనంపై కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దుర్ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదు.అగంతకులు జరిపిన కాల్పుల్లో 13 మంది మహిళలు, 5 మంది పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ట్రోజర్ హాస్పిటల్, నార్త్‌వెస్టర్న్ మెమోరియల్ హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇదే ప్రదేశంలో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.Yet another mass shooting in Chicago media won't tell you about.Initial reports of 3 dead, 20+ injured following gunfire after a record release party.But it's only Black people with illegal handguns again so, HO, HUM, doesn't fit the narrative. pic.twitter.com/DNm5sXLd1i— BarleyPop (@MikePilbean) July 3, 2025
‘దెబ్బలతో నడవలేని స్థితిలో మహిళా విద్యార్ధినులు ఉన్నారు’
కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్‌లో బిగ్‌బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్
ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై దాడి
Pakistan: ‘ఆ 30-45 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు’
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
భారీ డబుల్ సెంచరీ.. కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్‌బై..!
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గేమ్ ఛేంజర్‌తో భారీ నష్టాలు.. 'చరణ్' కనీసం ఫోన్ కూడా చేయలేదు: నిర్మాత
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
గుడ్‌న్యూస్! బయటి రాష్ట్రాల్లో మన ప్రత్యర్థులు కూడా బాగానే ఉన్నార్సార్!
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పలుకుబడి పెరుగుతుంది
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్‌లో టీమిండియా యువ సంచలనం ఆల్‌రౌండ్ షో
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
చైనా అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్?
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
ఎల్లుండే మెగా సునామీ?
రూ.లక్షల్లో క్రెడిట్‌కార్డు బాకీ ఇలా తీరిపోయింది..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
‘దెబ్బలతో నడవలేని స్థితిలో మహిళా విద్యార్ధినులు ఉన్నారు’
కలర్ ఫుల్ శారీలో అనసూయ.. బ్లాక్ డ్రెస్‌లో బిగ్‌బాస్ విష్ణుప్రియ గ్లామరస్ లుక్స్!
57వ అంతస్తు నుంచి దూకి ప్రముఖ నటి కుమారుడు ఆత్మహత్య
లోన్ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఆర్బీఐ కొత్త రూల్
ENG VS IND 2nd Test: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. టీమిండియా భారీ స్కోర్
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ సర్పంచ్‌పై దాడి
Pakistan: ‘ఆ 30-45 సెకన్లు ఏం జరిగిందో అర్థం కాలేదు’
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
భారీ డబుల్ సెంచరీ.. కోహ్లి ఆల్ టైమ్ రికార్డు బద్దలు కొట్టిన గిల్
ముందు లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.450 కోట్లతో ప్రచారం
ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ్ కౌశల్ గుడ్‌బై..!
వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. ఈసారి ఊచకోత
‘ప్రభుత్వ నియమాలకు దండం.. కారు చౌకగా అమ్ముతున్నా!’
వైఎస్ జగన్‌కు వల్లభనేని వంశీ కృతజ్ఞతలు
గేమ్ ఛేంజర్‌తో భారీ నష్టాలు.. 'చరణ్' కనీసం ఫోన్ కూడా చేయలేదు: నిర్మాత
‘నా వద్దకు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా’
గుడ్‌న్యూస్! బయటి రాష్ట్రాల్లో మన ప్రత్యర్థులు కూడా బాగానే ఉన్నార్సార్!
రైల్వే ఎస్సై భార్య బలవన్మరణం
ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం.. పలుకుబడి పెరుగుతుంది
వాళ్లు ‘జగనన్న గోరుముద్ద’ పెట్టారు.. మనం ‘బాబు బొద్దింక భోజనం’ అని పెట్టేద్దాం మేడమ్!!
సెంచరీ, 6 వికెట్ల ప్రదర్శన.. ఇంగ్లండ్‌లో టీమిండియా యువ సంచలనం ఆల్‌రౌండ్ షో
ఈ మధ్య అలానే కూర్చుంటున్నారు!
చైనా అధ్యక్షుడిగా వాంగ్ యాంగ్?
ఒక్కసారిగా షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఏకంగా..
ఆ విషయంలో మంచు విష్ణుని ఫాలో అవుతాం : దిల్ రాజు
ఎల్లుండే మెగా సునామీ?
రూ.లక్షల్లో క్రెడిట్‌కార్డు బాకీ ఇలా తీరిపోయింది..
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
ఈ రాశి వారికి కార్యజయం.. ఆస్తిలాభం
హోం మంత్రి అనితకు చేదు అనుభవం
సినిమా

'కుబేర' నుంచి తొలగించిన వీడియో సాంగ్ వచ్చేసింది
ధనుష్, నాగార్జున కాంబినేషన్లో దర్శకుడు శేఖర్ కమ్ముల(Sekhar kammula) తెరకెక్కించిన చిత్రం 'కుబేర'.. ఇందులో రష్మిక మందన్న కీలకపాత్రలో నటించారు. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఈ మూవీ రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. తాజాగా ఈ మూవీ నుంచి 'పీ పీ డుమ్ డుమ్' అంటూ సాగే వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఇందులో రష్మిక వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా కావాల్సిందే. అయితే, ఈ పాట సినిమాలో లేదు. రన్‌టైమ్ ఎక్కువగా ఉండటంతో దీనిని తొలగించారు. ఓటీటీ విడుదల సమయంలో మళ్లీ యాడ్ చేసే ఛాన్స్ ఉంది. చైతన్య రాసిన ఇంగ్లిష్ లిరిక్స్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సాంగ్ మొత్తం ఇంగ్లిష్ పదాలతోనే ఉండడం విశేషం. మంగ్లీ సోదరి ఇంద్రావతి ఈ పాటను ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించారు.

అనుమానాస్పద స్థితిలో నటి మృతి.. అతిగా డ్రగ్స్ తీసుకుందా?
ప్రముఖ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కైలీ పేజీ(28) అనుమానాస్పదంగా మృతి చెందారు. జూన్ 25న ఆమె లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో మరణించినట్లు లాస్ ఏంజిల్స్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నిర్ధారించారు. ఆమె మరణానికి గల కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదు. కానీ మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవలడం వల్లే ఆమె చనిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్ సంబంధిత వస్తువులు ఆమె ఇంటిలో కనిపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అంతేకాదు ఆమె గదిలో ఇతరులు సన్నిహితంగా ఉన్న గ్రాఫిక్ ఫోటోలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అతిగా తీసుకోవడం వల్ల చనిపోయిందా లేదా ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.కైలీ పేజీ అసలు పేరు కైలీ పైలెంట్. 2016లో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి దాదాపు 200పైగా సినిమాల్లో నటించింది. 2017లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిరీస్ "హాట్ గర్ల్స్ వాంటెడ్: టర్న్డ్ ఆన్"లో కూడా కనిపించారు, ఇందులో ఆమె అడల్ట్ ఇండస్ట్రీలోని తన అనుభవాలు, అక్కడ ఎదురయ్యే సవాళ్ల, సమస్యలను గురించి ఓపెన్‌గా మాట్లాడింది. కైలీ మరణ వార్త తెలియగానే ఆమె స్నేహితులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

హీరో చెంప చెళ్లుమనిపించింది.. ఆ దెబ్బతో ఇమేజ్ డ్యామేజ్!
ఆవేశం అనర్థదాయకం అని ఈ హీరోయిన్ విషయంలో రుజువైంది. ఆవేశంతో చేసిన ఓ పని వల్ల తన కెరీర్ తలకిందులైంది. టాప్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఆమె చివరకు వెండితెరపై అవకాశాల్లేక బుల్లితెరకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఆమె సోదరి మాత్రం ఇప్పటికీ సినిమాల్లో రాణిస్తోంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఫరా నాజ్. ఆమె సోదరి టబు.చిన్న వయసులోనే..హైదరాబాద్‌లో పుట్టిన ఫరా నాజ్ (Farah Naaz Hashmi) తర్వాత ముంబైకి షిఫ్ట్ అయింది. యష్ చోప్రా 'ఫాల్సే' మూవీతో 1985లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. అప్పుడామె వయసు 17 ఏళ్లు మాత్రమే! ఈ సినిమా డిజాస్టర్ అయినా తన అందానికి, టాలెంట్‌కు ముగ్ధులైన దర్శకనిర్మాతలు ఆమెకు మరిన్ని ఛాన్సులిచ్చారు. మార్తే డం టక్, నసీబ్ అప్నా అప్నా, లవ్ 86, ఇమాందార్, వీరు దాదా, దిల్జలా, బాప్ నంబ్రీ బేటా దస్ నంబ్రీ.. ఇలా ఎన్నో హిట్ చిత్రాలు చేసింది. రాజేశ్ ఖన్నా, ధర్మేంద్ర, సంజయ్ దత్, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి యాక్ట్ చేసింది.ఆవేశంస్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన ఫరా నాజ్‌కు ఆవేశం ఎక్కువ. ఓసారి ఇంట్లో గొడవపడ్డప్పుడు ఆవేశంతో చేయి కోసుకుంది. అలా అని చనిపోవాలని ప్రయత్నించలేదు, కాకపోతే తన కోపాన్ని, బాధను అలా బయటపెట్టిందట! తన బాధ ఇంట్లోవాళ్లకు అర్థమవ్వాలనే అలాంటి పని చేసినట్లు తను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ ఆవేశం తర్వాత కూడా అలాగే కంటిన్యూ అయింది.చెంప చెళ్లుమనిపించిందికసం వర్దీకీ సినిమాలో చుంకీ పాండేతో కలిసి నటించింది ఫరా. ఆ మూవీ షూటింగ్లో చుంకీ పాండే ఏదో జోక్ వేస్తే హీరోయిన్‌కు ఒళ్లంతా మండిపోయింది. ఆవేశం పట్టలేక అతడి చెంప చెళ్లుమనిపించినట్లు అప్పట్లో బోలెడు వార్తలు వచ్చాయి. అదే ఏడాది ఆమె నటించిన రఖ్వాలా సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. ఫరాకు బదులు మాధురీ దీక్షిత్‌ను హీరోయిన్గా తీసుకుని ఉండుంటే సినిమా హిట్టయ్యేదని అనిల్ కపూర్ ఫీలయ్యాడట! ఈ విషయం తెలిసిన ఫరా.. అనిల్‌ను బెదిరించినట్లు భోగట్టా! ఇలా వరుస వివాదాలతో ఫరాపై నెగెటివిటీ పెరిగింది. అది నెమ్మదిగా తన ఇమేజ్ను దెబ్బ తీసింది.చెల్లితో అసభ్యంగా..జాకీ ష్రాఫ్‌తో కలిసి దిల్జలా మూవీ చేసింది ఫరా. ఈ సినిమా అయిపోయాక నటుడు డానీ డెంజోంగ్ప ఓ పార్టీ ఇచ్చాడు. దానికి ఫరా.. టబును తీసుకుని వెళ్లింది. తను తాగి పడిపోయింది. అప్పుడు పూటుగా తాగిన జాకీ ష్రాఫ్.. టబును ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అది చూసిన డానీ వెంటనే జాకీ ష్రాఫ్‌ను బయటకు తీసుకెళ్లిపోయాడు. ఈ వ్యవహారంపై మండిపడ్డ ఫరా.. మీడియా ముందే నటుడిని ఎండగట్టింది. అనంతరకాలంలో మాత్రం అపార్థం చేసుకున్నానని యూటర్న్ తీసుకుంది.రెండు పెళ్లిళ్లుఫరా.. రెజ్లింగ్ లెజెండ్ దారా సింగ్ కుమారుడు విందు దారా సింగ్‌ను పెళ్లాడింది. 1986లో వీరి వివాహం జరగ్గా 1997లో కుమారుడు జన్మించాడు. కానీ ఆ తర్వాత దంపతుల మధ్య విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన ఆరేళ్లకే విడిపోయారు. విడాకులు తీసుకున్న ఏడాదే నటుడు సుమీత్ సైగల్‌ను రెండో పెళ్లి చేసుకుంది. ఆయనక్కూడా ఇది రెండో పెళ్లే! అయితే పిల్లలు వద్దనుకుని ఓ నిర్ణయానికి వచ్చాకే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. ఫరా.. తెలుగులో ఒంటరి పోరాటం, విజేత విక్రమ్ సినిమాలు చేసింది. 20 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మధ్యలో బుల్లితెరపై సీరియల్స్ చేసింది.చదవండి: ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు.. అందుకే అంత ద్వేషం: స్మృతి ఇరానీ

జానీ మాస్టర్ ఎఫెక్ట్.. 'నయనతార' దంపతులపై తీవ్ర విమర్శలు
మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన కొంతకాలం జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. నయనతార, విఘ్నేష్ శివన్‌లు తమ సినిమా కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను తీసుకున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రకటించారు. దీంతో ఈ దంపతులపై కోలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈమేరకు బాలీవుడ్ మీడియా కూడా పలు కథనాలు ప్రచురించింది.నయనతార, విఘ్నేష్ శివన్‌లు నిర్మిస్తున్న కొత్త సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కోసం కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ పనిచేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని చెబుతూ కొన్ని ఫోటోలను కూడా జానీ షేర్ చేశాడు. అయితే, ఈ ప్రకటన వెలువడిన తర్వాత నయనతార దంపతులను కోలీవుడ్ మీడియా తప్పుబడుతుంది. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేసిన బాలికపైనే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని కొరియోగ్రాఫర్‌గా ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పనిపించలేదా..? కోలీవుడ్‌లో మీకు ఎవరూ కొరియోగ్రాఫర్ దొరకలేదా..? అంటూ విమర్శించారు.నేరస్థులకే ఛాన్సులు: చిన్మయికోలీవుడ్ టాప్ సింగర్ చిన్మయి శ్రీపాద ఈ అంశంపై రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్, విఘ్నేష్ ఫోటోలను షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చారు. 'జానీ, ఒక మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చాడు. మనం 'ప్రతిభావంతులైన' నేరస్థులను ప్రేమిస్తున్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారిని ప్రోత్సహిస్తూనే ఉంటాము. వారినే అధికార స్థానాల్లో ఉంచుతాము. మహిళలను ఎక్కువగా వేధించేది నేరస్థులే అని గుర్తుపెట్టుకోవాలి. 'నాకు ఏమీ జరగకుండా చూడండి' మనం ఏం చేస్తున్నామో ఆలోచించండి స్వీట్' అంటూ ఆమె తెలిపారు.చిన్మయి చేసిన ఈ పోస్ట్ వైరల్ అయింది. ఆన్లైన్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. తీవ్రమైన నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తితో కలిసి పనిచేయాలనే ఈ జంట నిర్ణయాన్ని చాలా మంది నెటిజన్లు ప్రశ్నించారు. మరికొందరు వారు "లైంగిక వేటగాడిని వేదికగా చేసుకున్నారని" ఆరోపించారు. నయన్ తనను తాను స్వయంకృషి కలిగిన మహిళగా చెప్పుకుంది. మహిళా నటుల కష్టాలను ఆమె తెరపైకి తీసుకొచ్చింది. వేదికలపై తారలు మాట్లాడాలని కోరింది. కష్ట సమయంలో తనకు మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపింది. అయినప్పటికీ, పోక్సో కింద నిందితుడైన వ్యక్తికి తన భర్త మద్దతు ఇవ్వడం ఆమెకు బాగానే ఉంది అంటూ కొందరు విమర్శించారు. ఏదేమైన నయనతార దంపతులు తీసుకున్న నిర్ణయం పట్ల కోలీవుడ్ నుంచి తీవ్రంగా వ్యతిరేఖత వస్తుంది.Jani is out on conditional bail involving a minor’s sexual assault.We as a people seem to love ‘talented’ offenders and will keep promoting them and keeping them in positions of power which the offenders use to harangue the women more - “See nothing will happen to me.” It is… pic.twitter.com/irXOqZp824— Chinmayi Sripaada (@Chinmayi) July 2, 2025Nayan called herself a self-made woman who knows the struggles of female actors, urged stars to speak out, and thanked those who supported her. Yet she's fine with her husband backing a man accused under POCSO. Why the double standards? #Jani #VigneshShivan pic.twitter.com/Bz1sXpumvq— Films Spicy (@Films_Spicy) July 2, 2025don't know when wikki is gonna understand he's not a single person anymore.Whatever he does/speaks directly attached to #Nayanthara.She is a self made woman who stood up for herself and women in cinema in the past.A happy post with a pedophile dance master is seriously a big mess pic.twitter.com/SaG9sT2kQD— common_man (@IronladyNa5366) July 2, 2025It's not news that Vignesh Shivan and Nayan support predators. Why are y'all surprised? pic.twitter.com/f9u97SB2Ko— ஜமுனா (@velu_jamunah) July 2, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్

ఘటన జరిగిన రెండేళ్లకు కేసు నమోదు చేయడం ఏమిటి?... వల్లభనేని వంశీపై కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య... బెయిల్ రద్దు పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం

ప్రజలకు అండగా నిలబడాలి, నిత్యం వారికి అందుబాటులో ఉండాలి... వైఎస్సార్సీపీ యువజన విభాగం ప్రతినిధులకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం

ఏపీలో ధాన్యం బకాయిలు వేయి కోట్లు. రెండు నెలలు దాటినా రైతులకు చెల్లింపు లేదు. పట్టించుకోని కూటమి ప్రభుత్వం

ఏపీలో ఈసెట్ కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఫలితాలొచ్చి 45 రోజులైనా ప్రారంభించకపోవడం ఏమిటి?... కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌లో బాలికల విద్యను భ్రష్టు పట్టిస్తున్న కూటమి ప్రభుత్వం.. ‘హైస్కూల్ ప్లస్’లు వ్యూహాత్మకంగా నిర్వీర్యం

ప్రమాదానికి ప్రయాణికులు బాధ్యులవుతారా? సింగయ్య మృతి ఘటనలో మాజీ సీఎం వైఎస్ జగన్ తదితరులపై ఎలాంటి కఠిన చర్యలొద్దు... నల్లపాడు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం

హైకోర్టులో విచారణ జరుగుతున్నా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి అప్పులా?... టీడీపీ కూటమి సర్కారుపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం

ఇంటింటికీ వంచన. ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై గ్రామగ్రామాన.. ఇంటింటా ప్రచారం. పార్టీ శ్రేణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు

ఆగిన దాడులు!. యుద్ధం ముగిసిందంటూ తొలుత ట్రంప్ ప్రకటన. అయినా కొనసాగిన దాడులు, విమర్శలు. ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్

అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలు.. ఖతార్‌లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు... కువైట్, ఇరాక్, బహ్రెయిన్‌లోని యూఎస్ ఎయిర్ బేస్‌లపైనా దాడి జరిపినట్లు వార్తలు
క్రీడలు

భారత్‌కు రానున్న పాకిస్తాన్ జట్టు..!
ఇటీవల జరిగిన తీవ్ర పరిణామాల (పహల్గాం ఉగ్రదాడి, బదులుగా భారత్ ఆపరేషన్ సిందూర్) తర్వాత భారత్, పాక్‌ల మధ్య అన్ని విషయాల్లో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. క్రీడలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి. పాక్‌తో ఏ క్రీడలో అయినా తలపడేందుకు భారత్ నిరాసక్తత వ్యక్తం చేస్తుంది.అయితే తాజాగా జరుగుతున్న ఓ ప్రచారం భారత క్రీడాభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆసియా కప్, జూనియర్ వరల్డ్‌కప్ టోర్నీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ హాకీ జట్లు భారత్‌కు రానున్నాయట. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాక్ హాకీ జట్లకు అనుమతి కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది.వచ్చే నెల (అగస్ట్) 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆసియా కప్ జరుగనుంది. ఈ టోర్నీ కోసం 31 మంది సభ్యుల పాకిస్తాన్ జట్టుకు భారత్‌కు రానున్నట్లు సమాచారం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఓ కీలక అధికారి ప్రముఖ క్రీడా వెబ్సైట్ స్పోర్ట్స్‌స్టార్‌కు చెప్పాడు. జూనియర్ హాకీ వరల్డ్‌కప్ నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు చెన్నై, మధురై నగరాల్లో జరుగనుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు కూడా పాకిస్తాన్‌కు అనుమతి లభించినట్లు తెలుస్తుంది.ఇదిలా ఉంటే, భారత్, పాకిస్తాన్ త్వరలో క్రికెట్ ఆసియా కప్‌లో కూడా తలపడాల్సి ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించలేదు. ఈ టోర్నీపై ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది క్రికెట్ ఆసియా కప్ సెప్టెంబర్ 5 నుంచి 21వ తేదీ వరకు యూఏఈలో జరగాల్సి ఉంది. ఈ టోర్నీ టీ20 ఫార్మాట్లో జరుగనుంది. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి.

డబుల్ సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్
ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్న ఈ నాలుగో నంబర్ బ్యాటర్.. 311 బంతుల్లో 200 పరుగుల మార్కును అందుకున్నాడు. తద్వారా తన టెస్టు కెరీర్లో తొలి ద్విశతకం (Maiden Test Double Century)నమోదు చేయడంతో పాటు.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. కాగా గిల్ ఇన్నింగ్స్‌లో ప్రస్తుతానికి 21 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు.. ఎన్నో అరుదైన రికార్డులను కూడా గిల్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ హోదాలో టెస్టుల్లో ద్విశతకం బాదిన దిగ్గజాల సరసన గిల్ చేరాడు. గిల్ కంటే ముందు.. విరాట్ కోహ్లి ఏడుసార్లు ఈ ఫీట్ నమోదు చేయగా.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోని ఒక్కో డబుల్ సెంచరీ బాదారు.విదేశీ గడ్డ మీద కోహ్లి తర్వాత..అదే విధంగా.. విదేశీ గడ్డ మీద విరాట్ కోహ్లి (Virat Kohli) తర్వాత టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గానూ గిల్ చరిత్రకెక్కాడు. కోహ్లి 2016లో నార్త్ సౌండ్‌లో 200 పరుగులు సాధించాడు.👉అత్యంత పిన్న వయసులో టెస్టు డబుల్ సెంచరీ చేసిన భారత రెండో కెప్టెన్‌గానూ ఘనత.. ఈ జాబితాలో గిల్ కంటే ముందు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఉన్నాడు.🏏మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ- 1964లో ఢిల్లీ వేదికగా 23 ఏళ్ల 39 రోజుల వయసులో..🏏శుబ్‌మన్ గిల్- 2025లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా 25 ఏళ్ల 298 రోజుల వయసులో..🏏సచిన్ టెండుల్కర్- 1999లో అహ్మదాబాద్ వేదికగా 26 ఏళ్ల 189 రోజుల వయసులో..🏏విరాట్ కోహ్లి- 2016లో నార్త్ సౌండ్ వేదికగా 27 ఏళ్ల 260 రోజుల వయసులో...500 పరుగుల మార్కు దాటిన టీమిండియాఎడ్జ్బాస్టన్ వేదికగా ఓవైపు శుబ్‌మన్ గిల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. మరో ఎండ్ నుంచి వాషింగ్టన్ సుందర్ అతడికి సహకారం అందిస్తున్నాడు. 129 ఓవర్ల ఆట ముగిసేసరికి సుందర్ 24, గిల్ 231 పరుగులతో ఉండగా.. టీమిండియా స్కోరు: 510/6. అంతకు ముందు రవీంద్ర జడేజా అర్ధ శతకం (89) బాది అవుట్ కాగా.. తొలిరోజు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (87) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.చదవండి: Ind vs Eng: ఇదేం తీరు?.. గిల్‌పై మండిపడ్డ గావస్కర్!.. గంగూలీ విమర్శలు

భావోద్వేగంతో వీడ్కోలు పలికిన రొనాల్డో.. పోస్ట్ వైరల్
లివర్‌పూల్ ఫుట్‌బాల్ స్టార్ డియోగో జోటా (Diogo Jota) జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. 28 ఏళ్లకే ఈ పోర్చుగల్ ఫుట్‌బాలర్‌కు నూరేళ్లూ నిండాయి. స్పెయిన్‌లో జరిగిన ఘోర ర కారు ప్రమాదం అతడిని బలిగొంది. ఈ దుర్ఘటనలో జోటాతో పాటు అతడి తమ్ముడు ఆండ్రీ సిల్వా (25) కూడా మృత్యువాత పడ్డాడు.కాగా ఆండ్రీ కూడా అన్న మాదిరే ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్. వీరిద్దరి దుర్మరణంతో ఫుట్‌బాల్ ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ముఖ్యంగా పెళ్లైన పదిరోజులకే జోటా ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోవడం.. అతడి భార్య రూటే కార్డొసోకు తీరని శోకాన్ని మిగిల్చింది. మర్చిపోలేని రోజుఇక చనిపోవడానికి కొన్ని గంటల ముందే జోటా.. తమ పెళ్లి వీడియోను షేర్ చేశాడు. ‘ఇది జీవితంలో మర్చిపోలేని రోజు’ అంటూ తన లవ్ లైఫ్‌లోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నాడు. వధూవరులుగా మారిన చిరకాల స్నేహితులు అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో ఉంగరాలు మార్చుకుని వివాహ బంధంతో ఒక్కటైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ వీడియోను చూసిన జోటా అభిమానులు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘‘మీ ప్రేమను చూసి చూసి విధికి కన్నుకుట్టింది. వి మిస్ యూ’’ అంటూ జోటాకు సంతాపం తెలుపుతున్నారు. కాగా పది రోజుల క్రితమే.. తన చిన్ననాటి స్నేహితురాలు రూటేను జోటా పెళ్లి చేసుకున్నాడు. జోటాకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు సంతానం. View this post on Instagram A post shared by Diogo Jota (@diogoj_18) రొనాల్డో భావోద్వేగంపోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) సహచర ఆటగాడు జోటా దుర్మరణం పట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశాడు. ‘‘అసలు ఇది నిజమేనా?!.. ఇలాంటిది ఒకటి జరిగిందా?.. మనం ఇప్పుడే కదా జాతీయ జట్టులో కలిసి ఆడటం మొదలుపెట్టాము.మొన్ననే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు. నీ భార్య, పిల్లలు, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నువ్వు ఎల్లప్పుడూ వాళ్లతోనే ఉంటావని నాకు తెలుసు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. డియోగో, ఆండ్రీ.. మీ ఇద్దరిని మేము చాలా మిస్సవుతాము’’ అంటూ రొనాల్డో భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. డియోగో జోటా ఫొటో షేర్ చేస్తూ రొనాల్డో పెట్టిన ఈ పోస్టు కూడా పదికి పైగా మిలియన్ల వ్యూస్‌తో వైరల్‌గా మారింది.లివర్‌పూల్ తరఫున ఐదు టైటిళ్లులివర్పూల్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున డియోగో జోటా ప్రీమియర్ లీగ్‌తో పాటు రెండు నేషన్స్ లీగ్ టైటిళ్లు.. అదే విధంగా.. రెండు ఈఎఫ్ఎల్ టైటిళ్లూ గెలిచాడు. కాగా తమ స్టార్ ప్లేయర్ మృతి పట్ల లివర్‌పూల్ ఎఫ్‌సీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. డియోగో, ఆండ్రీ మరణం తమను తీవ్రంగా కలచివేసిందని.. ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కుటుంబం ధైర్యంగా ఉండాలంటూ సంతాపం ప్రకటించింది. వారికి తాము ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపింది. View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano)

ENG VS IND 2nd Test: పాపం జడేజా.. తృటిలో సెంచరీ మిస్..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 310/5 స్కోర్ వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ లంచ్ విరామం సమయానికి 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 114 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ 150 పరుగులు పూర్తి చేసుకొని ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 41 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన రవీంద్ర జడేజా 89 పరుగుల స్కోర్ (137 బంతుల్లో 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో) వద్ద ఔటయ్యాడు.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా గిల్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చాడు. గిల్-జడేజా ఆరో వికెట్‌కు 203 పరుగులు జోడించారు. గిల్‌తో పాటు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన జడేజా సెంచరీ మిస్ చేసుకోవడంతో టీమిండియా అభిమానులు పాపం అంటున్నారు. తొలి టెస్ట్‌లో సామర్థ్యం మేరకు రాణించలేక (11, 25 నాటౌట్) విమర్శలు ఎదుర్కొన్న జడేజా ఈ మ్యాచ్‌లో తానేంటో నిరూపించుకున్నాడు. జోష్ టంగ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జేమీ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి జడేజా ఔటయ్యాడు. లంచ్ విరామం సమయానికి గిల్ 168, వాషింగ్టన్ సుందర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్‌తో గిల్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టాడు. ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు (168) సాధించిన భారత క్రికెటర్‌గా అవతరించాడు. గతంలో ఈ రికార్డు విరాట్ కోహ్లి (149) పేరిట ఉండేది. టెస్టుల్లో గిల్ 150 పరుగుల మార్కుకు చేరుకోవడం కూడా ఇదే తొలిసారి. ఇంగ్లండ్ గడ్డ మీద ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో నూట యాభైకి పైగా వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా రెండో కెప్టెన్‌గానూ గిల్ నిలిచాడు. 1990లో ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్ హోదాలో 179 పరుగులు సాధించాడు.
బిజినెస్

రూ.84 లక్షల బెంజ్ కారు.. రూ.2.5 లక్షలకే..
ఢిల్లీలో కొత్తగా అమల్లోకి వచ్చిన కఠినమైన ఇంధన నిషేధం ఖరీదైన కార్ల యజమానులకు శాపంగా మారింది. చాలా మంది తమ ఖరీదైన పాత ప్రీమియం కార్లను కారు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన ప్రకారం 10 ఏళ్లు పైబడిన డీజిల్ వాహనాలకు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలకు ఇంధనం పోయకూడదు. రాజధానిలో నెలకొన్న తీవ్రమైన వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ (సీఏక్యూఎం) ఆదేశాల మేరకు నిషేధాన్ని అమలు చేస్తున్నారు.మనీ కంట్రోల్ కథనం ప్రకారం.. వరుణ్ విజ్ అనే వ్యక్తి తన లగ్జరీ ఎస్యూవీ 2015 మెర్సిడెస్ బెంజ్ ఎంఎల్ 350ని తప్పని పరిస్థతిలో చాలా చౌకగా అమ్ముకోవాల్సి వచ్చింది. పదేళ్ల కిందట ఈ వాహనాన్ని ఆయన రూ.84 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పాత వాహనాలకు ఇంధన నిషేధం కారణంగా కేవలం రూ.2.5 లక్షలకే అమ్ముడుపోయింది.దశాబ్ద కాలంగా తమ కుటుంబ జీవితంలో అంతర్భాగంగా ఉన్న కారును ఇప్పుడు వదిలించుకోవాల్సి రావడం వల్ల కలిగే భావోద్వేగాన్ని విజ్ వివరించారు. తన కుమారుడిని హాస్టల్ నుండి తీసుకురావడానికి వారానికి కేవలం 7-8 గంటల ప్రయాణానికి మాత్రమే ఈ కారును వినియోగించానని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తంగా 1.35 లక్షల కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించిన ఈ కారుకు రొటీన్ సర్వీసింగ్, టైర్ రీప్లేస్మెంట్లకు మించి మరే ఖర్చులు చేయాల్సిన అవసరం లేదని, కానీ ఇంత చౌకగా అమ్ముడుపోయిందని విజ్ ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రూ.62 లక్షలతో ఎలక్ట్రిక్ వాహనం కొన్నట్లు విజ్ తెలిపారు. ప్రభుత్వం ఇలా మరోసారి విధానం మార్చుకోకపోతే 20 ఏళ్ల పాటు దీన్ని వాడుకోవాలని అనుకుంటున్నానని ఆయన చెప్పారు.రితేష్ గండోత్రా అనే వ్యక్తి కూడా తాను రూ.లక్షలు పోసి కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారును చౌకగా అమ్మాల్సి వస్తోందని ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేసి ఎనిమిదేళ్లు అవుతుంది. ఇది డీజిల్ వేరియంట్. చాలా జాగ్రత్తగా ఉపయోగించాను. ఇప్పటివరకు కారులో కేవలం 74,000 కిలోమీటర్లే తిరిగాను. కొవిడ్ సమయంలో లాక్డౌన్ కారణంగా రెండేళ్ల పాటు ఏమీ వాడలేదు. ఇంట్లో పార్క్ చేసే ఉంచాను. ఇంకా రెండు లక్షల కిలోమీటర్లకు పైగా కారుకు లైఫ్ ఉంది. ఎన్సీఆర్లో 10 సంవత్సరాల డీజిల్ వాహనాల నిషేధ నియమాల కారణంగా నా కారును విక్రయించవలసి వస్తోంది. అది కూడా ఎన్సీఆర్ వెలుపల కొనుగోలుదారులకు తక్కువ రేటుకే. మళ్లీ కొత్త వాహనం కొనుగోలు చేస్తే 45 శాతం జీఎస్టీ+ సెస్ విధిస్తారు. ఇది మంచి విధానం కాదు. బాధ్యతాయుతమైన యాజమాన్యానికి విధించే శిక్ష’ అని రాసుకొచ్చారు.

బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి కాదు
బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఆధార్ తప్పనిసరి అనేలా బ్యాంకులు పట్టుబట్టకూడదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. ఆధార్ వాడకం ప్రజల స్వచ్ఛంద నిర్ణయంగా ఉండాలని తెలిపింది. బ్యాంకింగ్ వంటి సేవలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2018) కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ఉటంకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఆధార్ వివరాలు లేవనే కారణంతో ఖాతా తెరవడంలో జాప్యం చేసిన బ్యాంకుకు, ఓ కంపెనీకి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఈ తీర్పు వెలువడింది. కంపెనీ ప్రత్యామ్నాయంగా నో యువర్ కస్టమర్(కేవైసీ) పత్రాలను అందించినప్పటికీ బ్యాంకు ఆధార్ కోసం పట్టుబట్టింది. ఫలితంగా కొంతకాలం బ్యాంకు ఖాతా తెరవడం ఆలస్యం అయింది. ఇది కంపెనీ నిర్వహణ అంతరాయాలకు, ఆర్థిక నష్టానికి దారితీసిందని సంస్థ పేర్కొంది.బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధం..బ్యాంకు చర్యలు చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. కేవైసీ ధ్రువీకరణ కోసం ఆధార్‌ను స్వచ్ఛందంగా ఇవ్వగలిగినప్పటికీ, దాన్ని తప్పనిసరి చేయకూడదని నొక్కి చెప్పింది. పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఆధార్ వినియోగం నిర్దిష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలకే పరిమితమని మరోసారి స్పష్టం చేసింది. చట్టసభల మద్దతు లేకుండా ప్రైవేటు సేవలకు దీన్ని తప్పనిసరి చేయకూడదని పేర్కొంది.The Bombay High Court has held that a bank could not have insisted on Aadhaar as a mandatory requirement for opening a bank account after the Supreme Court's verdict in Justice K.S. Puttaswamy v. Union of India (2018), and awarded ₹50,000 in compensation to a company whose… pic.twitter.com/aHDMMKuat3— Live Law (@LiveLawIndia) July 2, 2025ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలునష్టపరిహారం చెల్లింపుఖాతా తెరిచేందుకు జాప్యం జరిగిన కారణంగా కంపెనీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడినట్లు సంస్థ తరఫు న్యాయవాది వాదించారు. దీన్ని గుర్తించిన బాంబే హైకోర్టు రూ.50,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. కేవైసీ నిబంధనలు చట్టానికి, రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలని ఈ తీర్పు ఆర్థిక సంస్థలకు గుర్తు చేస్తోంది. ప్రత్యేకించి ప్రత్యామ్నాయ, చట్టబద్ధంగా ఆమోదయోగ్యమైన డాక్యుమెంటేషన్ అందించినప్పుడు కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించకూడదని తెలుపుతుంది.

భారత్‌లో ‘యాపిల్’కు చెక్ పెట్టేలా చైనా కుతంత్రాలు
భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్ గ్లోబల్ హబ్‌గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.గత రెండు నెలల్లో భారత్‌లో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్ ఎగుమతులకు చెక్ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.అసలేం జరిగిందంటే..యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్‌కాన్ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్ ఐఫోన్ 17ను లాంచ్ చేయనుంది. ఈమేరకు భారత్‌లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్‌కాన్‌పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్ సైట్‌ల్లో ఉంచుతుంది.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది.

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓపై క్రిమినల్ కేసు
ముంబయిలోని లీలావతి ఆసుపత్రి ట్రస్టీలు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రిమినల్ కేసులో బలమైన ఆధారాలేవీ లేవని, పెండింగ్ చెల్లింపులపై ఒత్తిడి తప్పా మరేమీ కాదని జగదీషన్ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు.జగదీషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీం కోర్టులో వాదనలు వినిపిస్తూ ఆసుపత్రి ట్రస్టీలు నమోదు చేయించిన ఎఫ్ఐఆర్కు బలమైన ఆధారాలు లేవని, ఆసుపత్రి నుంచి డబ్బు రికవరీ చేయడానికి బ్యాంకు ప్రయత్నిస్తున్నందునే ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని వాదించారు. ఈ కేసును బాంబే హైకోర్టులోని మూడు వేర్వేరు బెంచ్‌లు పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ విచారించలేకపోయాయని ఆయన అన్నారు.కొద్దిసేపు వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ కేసును శుక్రవారంకు వాయిదా వేశారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ చీఫ్‌పై ఇలా ఎఫ్ఐఆర్ నమోదు కావడానికిగల కచ్చితమైన కారణాలను ఇరువర్గాలు పంచుకోలేదు. అయితే కొన్ని సంస్థలు తెలిపిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’ట్రస్ట్ ఆరోపణలు..ట్రస్ట్ పాలనపై అనవసర నియంత్రణ కోసం జగదీషన్ మాజీ ట్రస్టీ చేతన్ మెహతా నుంచి అనధికారికంగా రూ.2.05 కోట్లు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఈఓగా ఆయన స్వచ్ఛంద సంస్థ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని ట్రస్ట్ పేర్కొంది. లీలావతి ఆస్పత్రిలో జగదీషన్, తన కుటుంబ సభ్యులకు ఉచిత వైద్యం అందించారని తెలిపింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ట్రస్ట్ డిపాజిట్ల కింద రూ.48 కోట్లు ఉన్నాయని చెప్పింది.
ఫ్యామిలీ

కాపురానికి కమ్యూనికేషన్ : గ్యాప్ పెరిగిపోతోంది
రిలేషన్షిప్ ఎన్ని కొత్తపోకడలు పోయినా పెళ్లితోనే ఆ బంధానికి భద్రత అనుకునేవాళ్లే ఎక్కువ!అందుకే పెళ్లికి జాతకాలు,శాలరీ ప్యాకేజ్‌లు, ఆస్తులు, అంతస్తులు చూసుకున్నా...హక్కులు–బాధ్యతలు, ప్రణాళికలు, శక్తిసామర్థ్యాలు, పరస్పర గౌరవం, నమ్మకాలు, అండర్స్టాండింగ్, కంపాటబులిటీలకూ ప్రాధాన్యం ఇవ్వాలి! కాపురానికి కమ్యూనికేషన్ అత్యంత అవసరమని గ్రహించాలి అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్స్, మానసిక, న్యాయ నిపుణులు.. ఈ తరం కూడా! ఆ అభిప్రాయాలతోనే ఈ క్యాంపెయిన్‌ను నేటితో ముగిస్తున్నాం! ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరుపెళ్లికి సంబంధించి మన దగ్గర రెండు విధానాలున్నాయి. ఒకటి రాజ్యాంగపరంగా జీవించడం, రెండు.. ఆచార వ్యవహారాలకనుగుణంగా ఉండటం. ఈ రెండోరకంలో పెద్దల నిర్ణయాలు, సమాజ కట్టుబాట్లను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిరకంలో రాజ్యాంగం వ్యక్తులకు ఏ హక్కులనైతే ఇచ్చిందో అవన్నీ కూడా జీవితభాగస్వాములకు అమలవుతాయి. రాజ్యాంగ పరంగా భార్యభర్తలు ఇద్దరూ సమానమే! కానీ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక విలువల పరంగా ఆలుమగలిద్దరూ సమానం కాదు. అయినా అమ్మాయి చదుకోవాలి, ఉద్యోగం ఉండాలి, కట్నకానుకలు ఇవ్వాలి అనే అంచనాలూ ఉంటాయి. కానీ అమ్మాయి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని మాత్రం ఒప్పుకోరు. రాజ్యాంగబద్ధమైన వాటిల్లో కూడా భర్త సం΄ాదన మీద హక్కు కోరుకుంటున్న భార్య .. ఆయన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతల విషయంలో మాత్రం మిన్నకుంటోంది. ఇక్కడే కాన్ఫ్లిక్ట్ మొదలవుతోంది ఏ పెళ్లిలో అయినా! అందుకే ఏ విధానంలోనైనా జీవితభాగస్వాములిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. హక్కుల విషయంలో పరస్పర గౌరవంతో ఉండాలి. ఏరకమైన బాధ్యతలనైనా సమానంగా పంచుకోవాలి.– బీఎన్ నాగరత్న, ప్రెసిడెంట్ దలీప్ ఇదీ చదవండి: తొలి ఏకాదశికి ఆ పేరెందుకు వచ్చింది?గ్యాప్ పెరిగిపోతోంది పెళ్లికి కమ్యూనికేషన్ అండ్ టైమ్ చాలా ముఖ్యం. భార్య, భర్త ఇద్దరూ ఉద్యోగాలు చేయడం తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ఈతరం కాపురాల్లో అవి రెండూ మిస్ అవుతున్నాయి. పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి మా దగ్గరకు వచ్చే జంటల్లో మేము నోటీస్ చేస్తున్న ప్రధాన సమస్య అదే. భార్య, భర్తలిద్దరిలో ఒకరికి డే షిఫ్ట్ ఉంటే, ఇంకొకరికి నైట్ షిఫ్ట్ ఉంటోంది. వీకెండ్లో మాత్రమే ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అదీ ఎవరి ఫోన్లలో వాళ్లు! దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగి΄ోతోంది. అండర్స్టాండింగ్ కొరవడుతోంది. మనం అనే భావన లేకుండా నాది అనే ఈగోనే వాళ్ల మ్యారిటల్ లైఫ్‌ని డామినేట్ చేస్తోంది. దీనివల్ల పిల్లల సంగతి అటుంచి వాళ్లు కలిసి కాపురం చేసే పరిస్థితే కనబడట్లేదు. అందుకే పెళ్లిని నిలుపుకోవాలంటే ఈకాలం జంటలకు కావాల్సింది కమ్యూనికేషన్ అండ్ ఇద్దరూ కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైమ్. దీని కోసం ఇద్దరూ కొన్ని సర్దుబాట్లు చేసుకోవాలి. – డాక్టర్ ప్రశాంతి ఉప్పునూతలపేరెంట్స్కూ కౌన్సెలింగ్ అవసరంపెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. ఇరు కుటుంబాల మధ్య స్నేహం, బంధం, సాన్నిహిత్యం వంటివి పెళ్లి చేసుకునే ఇద్దరు వ్యక్తుల అంగీకారంపై ఆధారపడి ఉండలే తప్ప కుటుంబాల కలయిక కోసం పెళ్లిళ్లు జరగకూడదు. పెళ్లివ్యవస్థపై పూర్తి అవగాహన కల్పించడంలో మనం విఫలమయ్యామని చెప్పుకోవాలి. పెళ్లి బంధంలో ఉండాల్సిన పరస్పర గౌరవం లాంటి ఎన్నో విషయాలు చాలామందికి అర్థం కావడం లేదు. దాంతో పెళ్లి తర్వాత గృహహింస లాంటి ఎన్నో నేరాలకు పాల్పడుతున్నారు. విడాకుల వరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవలసిన పరిస్థితులను తరచుగా చూస్తున్నాం. పెళ్లికి ముందే అందరికీ సరైన రీతిలో లీగల్ – సైకలాజికల్ అవగాహన కల్పించినట్లయితే వివాహ వ్యవస్థ నిలబడడానికి కొంతవరకు హెల్ప్ అవుతుంది. మన దగ్గర సెక్స్ ఎడ్యుకేషన్ కూడా సరిగా లేదు. అందులో భాగంగా ‘అంగీకారం’ అంటే ఛిౌnట్ఛn్ట – వ్యక్తిగత స్వేచ్ఛ, సేఫ్టీ వంటి అంశాలను బోధించాలి. లేకపోతే వైవాహిక జీవితమంతా వైధింపుల మయమవుతుంది. పెళ్లి చేసుకునే వారికే కాదు, వారి తల్లిదండ్రులకూ పెళ్లికి ముందు కౌన్సెలింగ్ అవసరం. చాలామటుకు పెళ్లిళ్లలో తల్లిదండ్రుల జోక్యం వల్ల సులభంగా పరిష్కారమయ్యే సమస్యలు కూడా తెగేదాకా వెళ్తున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది ఈ ఎడ్యుకేషన్ తప్పనిసరి అమ్మాయిలు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నా.. డొమెస్టిక్ వ్యవహారంలో మాత్రం జెండర్ రోల్స్‌లో పెద్దగా మార్పు లేదు. ఇంటి పనులు, పేరెంటింగ్‌లో అబ్బాయిలకు భాగస్వామ్యం ఇవ్వట్లేదు. భర్తతో సమానంగా సం΄ాదిస్తున్నా ఇల్లు, పిల్లల బాధ్యత ఆమెదే అన్న సంప్రదాయ భావనలోనే ఉన్నాం ఇంకా. దీనివల్ల ఆడపిల్లల మీద అదనపు భారం పడుతోంది. అందుకే చాలామంది అమ్మాయిలు పెళ్లి పట్ల విముఖత చూపిస్తున్నారు. అసలు మనదగ్గర వైవాహిక జీవితానికి సంబంధించి ఎడ్యుకేషనే లేదు. పెళ్లికి కులగోత్రాలు, జీతం, ఆస్తి, అంతస్తే ముఖ్యం అనుకుంటారు. ఇంటి బాధ్యత దగ్గర్నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా అమ్మాయి, అబ్బాయి అంచనాలు, ప్రణాళికలు, పరస్పర గౌరవ నమ్మకాలు, ఎమోషనల్, ఫిజికల్ కంపాటబులిటీ లాంటివాటి మీద చర్చే ఉండదు. అసలు అలాంటి వాతావరణం తల్లిదండ్రుల మధ్యే కనబడదు కాబట్టి ఆ సంభాషణలు ఇంట్లో వినపడవు. కానీ ఈ తరం అమ్మాయి, అబ్బాయిలూ మాత్రం ఆ దిశగా ఆలోచించాలి. పెళ్లికి ముందు పెళ్లి తంతు, హనీమూన్‌కి ప్లాన్ చేసుకోవడం కన్నా పెళ్లి తర్వాత గడపబోయే సహజీవనం మీద శ్రద్ధ పెట్టాలి. జీతం, ఆస్తిపాస్తుల గురించి పెద్దలు ఎలాగూ చూస్తారు కాబట్టి.. పెళ్లి మీద ఇద్దరి అవగాహన, ఇంటి పనుల నుంచి ఆర్థిక వ్యవహారాల దాకా ఇద్దరి ప్లాన్స్, సామర్థ్యాలు, కంపాటబులిటీల గురించి ఇద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అవసరమైతే ఫ్యామిలీ కౌన్సెలర్స్ సాయం తీసుకోవాలి. పెళ్లికి ముందే అన్నీ తెలుసుకునే వీలు లేక΄ోతే ముఖ్యమైన వాటి గురించైన ప్రాథమిక సమాచారం తీసుకుని పెళ్లి తర్వాత హనీమూన్ కన్నా ముందు కౌన్సెలింగ్‌కు ప్లాన్ చేసుకోవాలి. కాపురం సజావుగా సాగేందుకు ఇద్దరికీ అనుకూలమైన ఓ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. – వర్ష వేముల, సైకోథెరపిస్ట్ పైపై బంధంగానే ఉంటుంది పెళ్లికి కేవలం జాతకాలు, శాలరీలతోనే చూస్తున్నవాళ్లు వాళ్ల ప్రధాన క్రైటీరియా అయిన కం΄ాటబులిటీని మాత్రం మ్యాచ్ చేయట్లేదు. కంఫర్టబుల్ లైఫ్ అండ్ డీసెంట్ లైఫ్ ఉండాలి.. కాదనట్లేదు. కానీ వైవాహిక జీవితానికి కావల్సిన చిన్న చిన్న విషయాలను కూడా మాట్లాడుకోవట్లేదు. ప్రేమ గురించిన వెంపర్లాట కనపడుతోంది తప్ప గౌరవం గురించి కాదు. రెస్పెక్ట్ ఉంటేనే కదా ప్రేమ ఉండేది! ఇలాంటివి అంటే మ్యాచ్ కాక΄ోతే, పరస్పర గౌరవం, కం΄ాటబులిటీ లేక΄ోతే పెళ్లి సఫకేటింగ్ చాంబర్‌లా మారుతుంది.. ముఖ్యంగా మహిళలకు. ఒక్కమాటలో చె΄్పాలంటే పెళ్లి అనేది రెండు కుటుంబా ప్రాపర్టీని రెట్టింపు చేసేదిగా, కుల అహంకారాన్ని ప్రిజర్వ్ చేసేదిగా, క్లాస్‌ని మెయింటేన్ చేసేదిగానే ఉంది. ఒక ప్రిస్టేజ్ సింబల్. ΄ాతికేళ్లు వచ్చాయా పెళ్లి చేసుకున్నామా .. ముప్పై ఏళ్లొచ్చాయా పిల్లల్ని కన్నామా.. సెటిల్ అయ్యామా అనే చూస్తున్నారు కానీ సంతోషంగా ఉన్నామా అని చూడట్లేదు. హారోస్కోప్ లో పద్దెనిమిదో ముప్పై ఆరో గుణాలు (ఛత్తీస్గుణ్) కలుస్తున్నాయా అని చూస్తున్నారు తప్ప పెళ్లిచేసుకోయే జంట కాబోయే తల్లిదండ్రులు కూడా కదా! వాళ్లు పిల్లల్ని కనాలనుకుంటున్నారా లేదా.. పేరెంటింగ్ బాధ్యతలను ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు లాంటి ముఖ్యమైన విషయాల గురించి చర్చించట్లేదు. ఇవేవీ లేని పెళ్లి పైపై బంధంగానే ఉంటుంది. దానికన్నా అన్మ్యారీడ్గా ఉండటమే బెటర్. – హిమబిందు, సోషల్ యాక్టివిస్ట్పరిణతే ప్రామాణికం పెళ్లిని సమాజమెప్పుడూ వయసుకి సంబంధించిన అంశంగా చూస్తోంది. త్వరగా పెళ్లి చేసుకుని త్వరగా పిల్లలు పుడితే వృద్ధ్యాపంలో తోడుగా ఉంటారనే ఆధారపడే మనస్తత్వం అందులో కనిపిస్తుంది. అంతేకానీ పరిణతి, ΄ోషించే శక్తిసామర్థ్యాలను ్ర΄ామాణికంగా చూడట్లేదు. మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మన అభి రుచులూ వేగంగా మారుతున్నాయి. భాగస్వామి వాటన్నిటినీ తీర్చలేక΄ోయినా కనీసం అర్థం చేసుకొని, గౌరవించే స్థాయిలో అయినా ఉండాలి. ఇటీవల జరిగిన అస్సాం, గద్వాల్ సంఘటనలను బూచిగా చూపించి పెళ్లికి ఆడవారి మనస్తత్వమే అడ్డు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. కానీ ఆ నేరాల్లో నిందితులకు సహకరించింది మగవారే అన్న విషయాన్ని విస్మరిస్తున్నాం. పెళ్లి బంధంలోకి అడుగు పెట్టే ముందు మన మీద మనకు సంపూర్ణ అవగాహన ఉండాలి. ఎదుటివారినీ అర్థం చేసుకునే ఓర్పు కావాలి. – కెన్సారో వీవా, ఆంట్రప్రెన్యూర్

జంతు ప్రేమికులూ.. జర జాగ్రత్త..!
వర్షాలు ముసురుకుంటున్న సమయంలో కుక్కలకు ర్యాబిస్ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా కుక్కలతో పాటు మనుషులకూ ఈ వ్యాధి వ్యాప్తిచెందొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో పేద, మధ్యతరగతి, ఉన్నత శ్రేణి అనే తేడా లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వివిధ జాతుల కుక్కలను, ఇతర జంతువులను పెంచుకుంటున్నారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆ పెట్స్ కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా కలిసిపోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మూగజీవాలకు కొంత సమయం కేటాయిస్తూ వాటి ఆలనా పాలనా చూసుకుంటున్నారు. ఒత్తిడిని జయించడానికి కొంత సమయం వాటితో ఆడుకోవడం అలవాటుగా మారుతోంది. ఈ సమయంలో ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకితే పెట్స్‌తో సహా మనుషులకూ ముప్పు పొంచి ఉంది. వీధి కుక్కలతో జర జాగ్రత్త.. వీధి కుక్కలు చిన్ననాటి నుంచి పుట్టి పెరిగిన, సంచరించే ప్రాంతానికి సరిహద్దులు (టెరిటరీ) నిర్ణయించుకుంటాయి. వాటి పరిధిలోకి వేరే కుక్కలను రానీయవు. ఇవి వాటి పరిధి దాటి వెళితే ఆందోళనకు గురవుతాయి. దీంతో కొత్త వ్యక్తులను చూసినప్పుడు భయంతో దాడి చేయడానికి ప్రయతి్నస్తాయి. అటువంటి వాటని ఐ కాంటాక్ట్ (కళ్లలోకి కళ్లుపెట్టి చూడటం) చేయకపోవడం మంచిదని సూచిస్తున్నారు. పిల్లలు సహజంగానే కుక్కలు కనిపించినపుడు వాటి తోక, చెవులు పట్టుకుని లాగుతుంటారు. ఒక రకమైన ఇరిటేషన్లో ఉన్న కుక్కలను ఇలా చేస్తే అవి వెంటనే కరిచే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల నియంత్రణ వీధుల్లో వాటిని పట్టుకుని చికిత్సలు చేస్తున్నారు. అనంతరం ఎక్కడ నుంచి తెచ్చినవి అక్కడ విడిచిపెట్టకుండా ఏదో ఒక చోటు వదిలేస్తున్నారు. ఇది కూడా కుక్క కాట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తోంది. మెదడును ప్రభావితం చేస్తుంది.. పెట్స్‌కు ర్యాబిస్ సోకినప్పుడు వైరస్ అనేది మెదడుపై ప్రభావం చూపిస్తుంది. ఆ సమయంలో కుక్క ఏం చేస్తుందనేది దానికి తెలియకుండానే నియంత్రణ కోల్పోతుంది. కోపం, దూకుడుగా, పచ్చిపిచ్చిగా వ్యవహరిస్తుంది. మనుషులకు వచ్చినట్లే కుక్కలకు సైతం విషజ్వరాలు వస్తాయి. లక్షణాలు గుర్తించినపుడు వైద్యులను సంప్రదించడం మేలు. రేబిస్ వ్యాధి అనేది కుక్కల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉంది. అందుకు ముందుగానే జాగ్రత్త పడాలి. సొంగ కార్చే సమయంలో దాన్ని మనం చేతితో ముట్టుకోకుండా జాగ్రత్తపడాలి. కుక్క పిల్లలు ఆరు వారాల నుంచి 8 వారాల వయసులో పారో వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అన్నిటికీ ముందస్తుగా టీకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రివెంటివ్ వ్యాక్సిన్ తీసుకోవడం మేలు. – డా.డీ.అశోక్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్, వెటర్నరీ యూనివర్సిటీ, రాజేంద్రనగర్.ఈ సీజన్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. వైరస్ వ్యాప్తికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఇంటో పెంచుకునే పెట్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. కళ్లు ఎర్రబడటం, జ్వరం రావడం, గొంతు కండరాలు బిగుసుకుపోయి నీళ్లు తాగడానికి ఇబ్బంది పడటం, నాలుగైదు రోజుల పాటు సొంగ కార్చడం, నురగలు కక్కడం వంటి లక్షణాలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇవన్నీ ర్యాబిస్ వైరస్‌కు సంబంధించిన లక్షణాలుగా పరిగణించాలి. ప్రాథమికంగా గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించినట్లైతే పెట్స్‌ను రక్షించుకోవచ్చు.నివారణ చర్యలు.. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. తద్వారా ర్యాబిస్ వ్యాప్తిని అరికట్టవచ్చు..దీంతో పాటు పెంపుడు జంతువులను నియంత్రణలో ఉంచాలి. ముఖ్యంగా కుక్కలు, పిల్లులు, కుందేళ్లు వంటి ఇళ్లలో పెంచుకునే వాటికి టీకాలు వేయించాలి. ఏదైనా జబ్బు లక్షణాలు కనిపిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలి. పెంపుడు జంతువులు లేదా బయటి జంతువుల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించినా.. అవి కాటు వేసినా.. గాయాన్ని సబ్బు నీటితో కనీసం 15 నిమిషాల పాటు శుభ్రం చేయాలి. ర్యాబిస్ సోకిన జంతువు నుంచి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వైద్యుని సలహా మేరకు తగిన చికిత్స తీసుకోవాలి. ర్యాబిస్ వైరస్ సోకే ప్రమాదం ఉన్న వ్యక్తులు, లేదా తరచూ జంతువులతో నివాసం ఉండాల్సిన పరిస్థితులు ఉన్న వ్యక్తులు ముందస్తుగా ర్యాబిస్ టీకా తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాల్లో గబ్బిలాల నివాసం లేకుండా చూసుకోవాలి. ర్యాబిస్ సోకిన తర్వాత, లక్షణాలు కనిపించిన తర్వాత చికిత్స తీసుకోవడం చాలా కష్టం.. కాబట్టి నివారణా చర్యలు పాటించడం ఉత్తమం.. ఆరోగ్యకరం. (చదవండి: కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ చికిత్సల ఖరీదు ఎంతంటే..!)

ఇక్కడ త్రిమూర్తులకూ ఆలయాలు, ఎక్కడో తెలుసా?
కాకతీయ కాలం నాటి ఆధ్యాత్మిక శోభకు, శిల్పకళా వైభవానికి తార్కాణం 800 ఏళ్లనాటి ‘పిల్లల మర్రి’ (Pillalamarri )దేవాలయాలు. తెలుగు వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చి సువిశాల కాకతీయ సామ్రాజ్యాన్ని నిర్మించిన కాకతీయ రాజుల ఏలుబడిలో ఒక ఆధ్యాత్మిక, కళాక్షేత్రంగా వెలసిన కమనీయ సీమ సూర్యాపేట దగ్గర గల పిల్లలమర్రి.ముక్కంటికి మూడు ఆలయాలు..పిల్లలమర్రిలో మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాలున్నాయి. 13వ శతాబ్దంలో వీటిని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దం ఆరంభంలో కట్టిన గుడులు దాదాపు 150 సంవత్సరాలు వైభవోపేతంగా వెలిగాయి. ఆ తర్వాత పరదేశీ పాలనలో దోపిడీలకు గుర యినా, మధ్య మధ్య పునః ప్రతిష్టలు పొందాయి. బేతిరెడ్డి భార్య ఎరుకసానమ్మ క్రీ.శ. 1208లో ఎరుకేశ్వర ఆలయాన్ని కట్టించారు. కాకతీయ శిల్పకళావైభవాన్ని చాటిచెప్పేలా చాలా ఎత్తుగా ఆలయం నిర్మించారు. దీని ముఖమండప స్తంభాలు నల్లరాయితో చెక్కారు. స్తంభాలు చాలా నునుపుగా అద్దం మాదిరిగా కనిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలను తాకితే సప్తస్వరాలు వినపడతాయి. ఆలయంలో కొలువైన స్వామివారిని కొలిస్తే కోరిన కోర్కెలు తీరుస్తారని ప్రతీతి. బేతిరెడ్డి సోదరుడైన నామిరెడ్డి పిల్లలమర్రిలో రెండు శివాలయాలు కట్టించారు. తన పేరిట నామేశ్వర ఆలయం నిర్మించగా తన తల్లిదండ్రుల పేరిట త్రికూటాలయం నిర్మించారు నామేశ్వరాలయంలో నల్లరాతిపై చెక్కబడిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి. ద్వారాలు, ముఖమండపాలపై లతలు, పుష్పాలు, వివిధ భంగిమలలో నృత్యాలు కళాకారులు, గాయకులు, వాద్యకారులు, దేవతావిగ్రహాలు తదితర శిల్పాలు చూపరులను కళ్లు తిప్పుకోనివ్వవు. కొన్నిచోట్ల స్తంభాలపై సూక్ష్మాతిసూక్ష్మంగా అందమైన నగిషీలతో శిల్పాలను మలిచారు. కఠినమైన నల్లరాయి శిల్పుల చేతిలో మైనం లాæకరిగి΄ోయిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. నామేశ్వరాలయంలో రాతితో స్తంభాలపై కొట్టినప్పుడు సప్తస్వరాలు వినిపించడం ప్రత్యేకత. కాకతీయులకు రాజముద్రికైన ఏనుగు బొమ్మలు ఆలయాలపై దర్శనమిస్తాయి. ఇటుకలతో నిర్మించిన ఆలయంలో రాతిదూలాలపై భారత రామాయణ గా«థలు, సముద్ర మథనం వర్ణచిత్రాలు చెక్కబడ్డాయి. నామేశ్వర ఆలయం పక్కనే త్రికూటేశ్వర ఆలయం ఉంది. ఒకేమండపంలో శివునికి మూడు వేర్వేరు ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మూడు ఆలయాలకు కలిపి ఒకే నంది ఉండటం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి సేవలో వీరంగాలు వేయటం, అగ్నిగుండాలు కాల్చటం మొదలైన వేడుకలు నిర్వహిస్తున్నారు. చెన్నకేశ్వర... బ్రహ్మదేవాలయాలు... పిల్లలమర్రి శైవం, వైష్ణవం కలిసి పుణ్యక్షేత్రంగా చెప్పవచ్చు. శివకేశవులకు భేదాలు లేవని చాటిచెప్పేలా మూడు ప్రసిద్ధ శివాలయాలు ఉన్న పిల్లలమర్రి గ్రామంలోనే ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయం ఉంది. 13వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మించినట్లు చెబుతారు. గర్భాలయంలో మకర తోరణం లో చెన్నకేశవస్వామివారి రూపలావణ్యం నయన మనోహరం. గర్భాలయం వెలుపల పన్నిద్దరు ఆళ్వారులు కొలువై ఉన్నారు. క్రీ.శ.1260లో చెన్నకేశ్వర ఆలయం ధ్వంసం అయ్యింది. 1899 ప్రాంతంలో గ్రామానికి చెందిన వుమ్మెత్తల చక్రయ్య గ్రామస్తుల సహకారంతో ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చెబుతారు. చెన్నకేశ్వర ఆలయంతో΄ాటు నామేశ్వర ఆలయం ఎడమవైపు బ్రహ్మదేవుని ఆలయం ఉంది. బ్రహ్మ హంసవాహనారూఢుడై సరస్వతీమాతతో కలిసి దర్శనమిస్తారు. మహాదేవుని సేవ కోసం బ్రహ్మాసరస్వతులు హంసవాహనంపై ఇక్కడికి వస్తుంటారని స్థలపురాణం చెబుతోంది.ఎలా చేరుకోవాలంటే?ప్రసిద్ధ పురాతన ఆలయాలకు నెలవైన పిల్లల మర్రికి చేరుకోవడం చాలా సులువు. సూర్యాపేట జిల్లాలోని పిల్లల మర్రి గ్రామం హైదరాబాద్ నుంచి 134 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ నుంచి విరివిగా సూర్యాపేటకు బస్సులు ఉంటాయి. సూర్యాపేటలో దిగితే ఆక్కడినుంచి వాహనాల్లో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లలమర్రి గ్రామానికి చేరుకోవచ్చు.ఆ గ్రామం మూడు సుప్రసిద్ధ శైవ ఆలయాలకు నెలవు... ఒక్క ముక్కంటికే కాదు బ్రహ్మ, విష్ణువులకు సైతం ఆలయాలు ఉండటం మరో ప్రత్యేకత. త్రిమూర్తులలోని లయకారకుడైన శివుడు ఎరుకేశ్వరుడు, నామేశ్వరునిగా అవతరించగా స్థితికారకుడైన విష్ణువు చెన్నకేశ్వరునిగా వెలిశారు. ధరిత్రిపై పూజలు ఉండని శాపగ్రస్తుడైన బ్రహ్మదేవుడికి సైతం ఇక్కడ ఆలయం ఉండటం విశేషం. సృష్టికారకుడైన బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలిసి హంస వాహనారూఢుడై దర్శనమిస్తాడిక్కడ.

ఉమెన్ 'ఇన్నోవేటర్స్'..! ఆవిష్కర్తల కోసం..
పరిశ్రమలు, పారిశ్రామిక రంగంలో మహిళకు వ్యవస్థాపకులుగా, ఆవిష్కర్తలుగా సాధికారత కల్పిస్తూ వారందరినీ అనుసంధానం చేసే వినూత్న వేదికగా డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ (డీఇడబ్ల్యూఐ) ప్రారంభమైంది. అంకుర సంస్థల ఔత్సాహిక మహిళల సమిష్టి ఉన్నతికి సహకారం, ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా నగరంలో డీఇడబ్ల్యూఐ ఆవిష్కృతమైంది. నగరంలోని హైటెక్స్ నోవోటెల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ డాక్టర్ నీలిమా వేములతో పాటు చైర్పర్సన్ డాక్టర్ కళ్యాణి గుడుగుంట్ల, వైస్ చైర్పర్సన్ – సహ వ్యవస్థాపకురాలు సత్యవతి ప్రసన్న మడిపడిగే, సహ వ్యవస్థాపకురాలు – బ్రాండ్ కస్టోడియన్ పల్లవి నాగళ్లతో పాటు ముఖ్య సలహాదారు రాజు మడిపడిగే డీఇడబ్ల్యూఐను ఆవిష్కరించారు. ఇందులో భాగంగా మహిళా దార్శనికులు, స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహిళా ఆవిష్కర్తలను ఒక చోటికి చేర్చారు. మహిళా శక్తికి లాంచ్‌ప్యాడ్.. ఈ సందర్భంగా డైనమిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఉమెన్ ఇన్నోవేటర్స్ వ్యవస్థాపకురాలు డా.నీలిమా వేముల మాట్లాడుతూ.. డీఇడబ్ల్యూఐ కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, ఇదొక ఒక ఉద్యమం. ప్రధానంగా ఇండస్ట్రీ, ఇన్నోవేషన్‌లో బాధ్యతను కోరుకునే, ఒకరికొకరు ప్రోత్సాహం అందించుకునే ఔత్సాహిక మహిళలను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటు మహిళా శక్తిని, విజయాన్ని పునర్ నిర్వచించడానికి సిద్ధంగా ఉన్న మహిళలను అనుసంధానం చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. డీఇడబ్ల్యూఐ అనేది మహిళల వ్యవస్థాపకతను పెంపొందించేందుకు కమ్యూనిటీ సహకారంతో పాటు మూలధనంపై దృష్టి సారించి, ఆశావహులైన–స్థిరపడిన మహిళా వ్యవస్థాపకులకు ఒక లాంచ్‌ప్యాడ్‌గా సేవలందించనుందని, ఇలాంటి వారి అభివృద్ధికి అవకాశాలు కల్పించే సమాంతర వ్యవస్థగా రూపొందించనున్నామని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో మహిళా నేతృత్వంలోని వెంచర్లను స్కేలింగ్ చేయాలనే సంస్థ లక్ష్యానికి భవిష్యత్తు పెట్టుబడిదారులు, నిధుల సేకరణదారులుగా విశిష్ట జ్యువెలరీ డైరెక్టర్ సింధుజా పలబట్ల, సురక్ష ఫార్మా డైరెక్టర్ పద్మజా మానేపల్లిని డీఇడబ్ల్యూఐ కుబేరులుగా ఎంపిక చేశారు. ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి అలేఖ్య పుంజాల, ప్రముఖ ఫిట్నెస్ నిపుణురాలు దినాజ్ వెర్వత్వాలా, సినీ నటుడు అలీ జీవిత భాగస్వామి జుబేదా అలీ, వైద్య నిపుణురాలు, మహిళా ఆరోగ్య న్యాయవాది డాక్టర్ సునీత రెడ్డి (వైఎస్), వకుళ సిల్స్ వ్యవస్థాపకురాలు మాధురి దువ్వాడ, టీజీ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. (చదవండి: దటీజ్ షెకావత్..! వృద్ధురాలైన తల్లితో కలిసి స్కైడైవింగ్‌కి సై)
ఫొటోలు


చినుకుల్లో డార్జిలింగ్ అందాలు.. రా రమ్మని ఆహ్వానించే పచ్చటి కొండ కోనలు!


వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ (ఫొటోలు)


'హరి హర వీరమల్లు' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)


నేచురల్ బ్యూటీ 'వర్ష బొల్లమ్మ' స్పెషల్ ఫోటోలు చూశారా..? (ఫొటోలు)


మంచు కొండల్లో ‘శివయ్యా..’ అమర్నాథ్ యాత్ర షురూ (చిత్రాలు)


నిహారిక కొణిదెల కొత్త సినిమా..సంగీత్ శోభన్, నయన్ సారిక జంట కొత్త చిత్రం (ఫొటోలు)


కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం (ఫొటోలు)


చిరు జల్లుల్లో చూడాల్సిన బ్యూటిఫుల్ బీచ్‌లు ఇవే...


తెలంగాణ : నీటి గుహలోని అత్యంత అద్భుతమైన ఈ శివుడ్నిఎప్పుడైనా దర్శించుకున్నారా? (ఫొటోలు)


తమ్ముడుతో టాలీవుడ్లో ఎంట్రీ.. అప్పుడే లైన్లో పెట్టేసిందిగా! (ఫోటోలు)
అంతర్జాతీయం

ఘనాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం
ఆక్రా: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనాకు చేరుకున్నారు. ఘనా అధ్యక్షుడు జాన్ ద్రామానీ మహామా ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడ పర్యటిస్తున్నారు. కొటోకా ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టులో మోదీకి ఘన స్వాగతం లభించింది. సైనికులు ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఘనా ప్రభుత్వాధి నేతలతో మోదీ సమావేశ మవుతారు. భారత్–ఘనా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చిస్తారు. ప్రధాని మోదీ ఘనాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. అలాగే గత మూడు దశాబ్దాల్లో భారత ప్రధాని ఘనాలో అడుగుపెట్టడం కూడా ఇదే తొలిసారి. ఇండియా నుంచి బయలుదేరే ముందు మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. గ్లోబల్ సౌత్‌లో భారత్‌కు ఘనా అత్యంత విలువైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఘనా పర్యటన అనంతరం ఆయన ఈ నెల 3, 4వ తేదీల్లో ట్రినిడాడ్ అండ్ టోబాగోలో, 4, 5వ తేదీల్లో అర్జెంటీనాలో పర్యటిస్తారు. తర్వాత బ్రెజిల్లో 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు. చివరగా నమీబియాలో పర్యటించి, స్వదేశానికి చేరుకుంటారు.

మనోళ్ల అక్రమ వలసలు తగ్గాయి
వాషింగ్టన్: ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో 10,300 మందికి పైగా భారతీయులు అక్రమంగా అమెరికా లోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు. వైట్‌హౌస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. అయితే 2024తో పోలిస్తే భారతీయుల అక్రమ వలసలు 70 శాతం తగ్గినట్టు వెల్లడించింది. గతేడాది జనవరి– మే మధ్య 34,535 మంది భారతీ యులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డారు. అంటే సగటున రోజుకు 230 మంది! 2025లో ఇది రోజుకు 69కి తగ్గింది. ట్రంప్ రెండోసారి గద్దెనెక్కాక ఇమిగ్రేషన్ నిబంధనల అమలును కఠినతరం చేయడమే ఇందుకు కారణమని ప్రభుత్వం తెలిపింది. అమెరికా లోకి ప్రవేశించడానికి ప్రయత్నించి పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో గుజరాత్‌కు చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ట్రంప్ తిరిగి అధికారంలోకి వస్తారని ఊహించే స్మగ్లింగ్ సిండికేట్ 2024 చివరి నుంచి తమ కార్యకలాపాలను తగ్గించిందని నివేదిక పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఏకంగా 6 లక్షలకు పైగా అక్రమ వలసదారులను అమెరికా సరిహద్దుల వద్ద అరెస్టు చేసింది. 2024లో ఇదే కాలంలో 12,33,959 మంది పట్టుబడ్డారు. పట్టుబడ్డ 10,382 మంది భారతీయుల్లో 30 మంది ఒంటరి మైనర్లున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 500 మందికి పైగా భారతీయ మైనర్లను అమెరికా అరెస్టు చేసింది. అనేక దేశాల నుంచి ఏటా వేలాది మంది తమ పిల్లలను అమెరికా–మెక్సికో, అమెరికా–కెనడా సరిహద్దులో వదిలి వెళ్తారు. వారికి అమెరికన్ పౌరసత్వం లభిస్తుందనే ఆశతో ఇలా చేస్తుంటారు. ఈ పిల్లలంతా 12–17 ఏళ్లు, అంతకంటే చిన్న వయసు వారని నివేదికలు చెబుతున్నాయి.పత్రాల్లేని వారు 2.2 లక్షలుడిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) 2024 ఏప్రిల్ నివేదిక ప్రకారం అమెరికాలో 2.2 లక్షల మంది భారతీయులు ఎలాంటి అనుమతి పత్రాలూ లేకుండా అనధికారికంగా నివసిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివకరూ 332 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. అయినా ప్రమాదకరమైన డంకీ మార్గాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించడానికి భారతీయులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు ప్రమాదకరమైన సముద్ర మార్గాల్లోనూ వెళ్తున్నారు. గత మే 9న కాలిఫోర్నియా తీరంలోని డెల్మార్ సమీపంలో జరిగిన పడవ ప్రమాదంలో 14 ఏళ్ల భారతీయ బాలుడు, అతని 10 ఏళ్ల అతని సోదరి మరణించారు.– సాక్షి, నేషనల్ డెస్క్

జిన్‌పింగ్ శకానికి తెర?
చైనాలో షీ జిన్‌పింగ్ శకం ముగిసిందా? పలువురు అధ్యక్షులకు పట్టిన గతే ఆయనకు కూడా పట్టనుందా? నెల రోజులుగా డ్రాగన్ దేశంలో జరుగుతూ వస్తున్న పలు అనూహ్య పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మే 21 నుంచి జూన్ 5 దాకా జిన్‌పింగ్ రెండు వారాల పాటు ఆచూకీ లేకుండాపోయారు. అధికారిక కార్యక్రమాలు వేటిలోనూ పాల్గొనలేదు. కనీసం బహిరంగ వేదికలపై కూడా కన్పించలేదు. ఆయన చైనా పగ్గాలు చేపట్టిన గత 12 ఏళ్లలో ఇలా జరగడం ఇదే తొలిసారి. దానికి తోడు అధ్యక్షుని గురించిన వార్తలను ప్రతి రోజూ ఫ్రంట్ పేజీల్లో విధిగా ప్రముఖంగా ప్రచురించే చైనా అధికార మీడియాలోఆ రెండు వారాల పాటు ఎక్కడా కనీసం ఆయన ప్రస్తావన కూడా రాలేదు! అధ్యక్షుని గైర్హాజరీపై ప్రపంచమంతా జోరుగా చర్చ జరిగినా చైనా ప్రభుత్వం మాత్రం స్పందించలేదు. అధికారిక మీడియాలోనూ ఖండన వంటివి రాలేదు. చివరికి జూన్ 5 తర్వాత జిన్‌పింగ్ తిరిగి దర్శనమిచ్చినా ఆయనలో ముందున్న కళాకాంతులేవీ కన్పించలేదు. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకòÙంకోతో జరిగిన భేటీలో బాగా అనాసక్తంగా దర్శనమిచ్చారు. ‘‘జిన్‌పింగ్ బాగా నీరసించి, ఆరోగ్యంగా కన్పించారు’’ అని భేటీ తర్వాత బెలారస్ అధ్యక్షుని తరఫున వెలువడ్డ అధికారిక మీడియా ప్రకటన పేర్కొంది. దీనికి తోడు జిన్‌పింగ్‌కు భారీ స్థాయిలో ఉండే వ్యక్తిగత భద్రత కూడా కొద్దిరోజులుగా బాగా తగ్గిపోయింది. ఆయన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన మ్యూజియానికి అధికారిక హోదాను తొలగించారు. అంతేకాదు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జిన్‌పింగ్ ఫోన్లో సంభాషించారు. దాన్ని గురించిన చైనా అధికార టీవీ సంస్థ ప్రసారం చేసిన వార్తా కథనంలో జిన్‌పింగ్‌ను ఎలాంటి హోదా లేకుండా సంబోధించడం విశేషం! అతి శక్తిమంతమైన డ్రాగన్ దేశాన్ని ఇనుప పిడికిలితో శాసిస్తూ వస్తున్న జిన్‌పింగ్‌కు పాలనకు నూకలు చెల్లాయనేందుకు ఇవన్నీ స్పష్టమైన సంకేతాలేనంటూ జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పాలక కమ్యూనిస్టు పారీ్టలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాలు అంతిమంగా జిన్‌పింగ్‌ను తప్పించే దిశగా సాగుతున్నాయంటూ ప్రవాస చైనా మేధావులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జిన్‌పింగ్‌కు ముందున్న అధ్యక్షుడు హూ జింటావో కూడా అధికారాంతానికి ముందు అచ్చం ఇలాగే కొతంకాలం పాటు అనూహ్యంగా కనబడకుండా పోవడం విశేషం. ఆ తర్వాత జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టారు. అనతికాలంలోనే పార్టీలోని తన విరోధులు, వ్యతిరేకుల ఆట కట్టించి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఇప్పుడు జిన్‌పింగ్‌కు కూడా అదే గతే పడుతోందంటూ ఆయన వ్యతిరేకులు సంబరపడిపోతున్నారు. నిజానికి జిన్‌పింగ్‌పై తిరుగుబాటుకు పథక రచన చేసింది, నిశ్శబ్దంగా తెర వెనక పావులు కదిపింది 82 ఏళ్ల జింటావోనే అని కూడా చెబుతున్నారు. ఇవేమీ నిజం కాదని, అధ్యక్షుడు తీవ్ర అనారోగ్యం పాలై చికిత్స పొందుతున్నారని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఉదంతం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను కలకలం రేపుతోంది. బ్రెజిల్‌లోని రియో డిజనిరోలో శనివారం నుంచి జరగనున్న 17వ బ్రిక్స్ సదస్సుకు కూడా జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. దీన్ని చైనా అధికారికంగా ధ్రువీకరించింది. మూడు రోజుల సదస్సుకు ఆయన బదులుగా ప్రధాని లీ కియాంగ్ భేటీలో పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ బుధవారం మీడియాకు వెల్లడించారు. దీనికి కారణం ఏమిటన్న ప్రశ్నలకు ఆమె సమాధానం దాటవేశారు. బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ డుమ్మా కొడుతుండటం గత 12 ఏళ్లలో ఇదే తొలిసారి! ఈ పరిణామం ఆయన భవితవ్యంపై అనుమానాలను మరింతగా పెంచుతోంది. జాంగ్ హవా! అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికార కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శి మాత్రమే గాక సర్వశక్తిమంతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్ (సీఎంసీ)కి చైర్మన్ కూడా. అయితే ప్రస్తుతం చైనాలో అధికార వ్యవహారాలన్నీ సీఎంసీ వైస్ చైర్మన్ జనరల్ జాంగ్ యూక్సియా కనుసన్నల్లో నడుస్తున్నాయని చెబుతున్నారు. జిన్‌పింగ్ చైనా చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి అధ్యక్ష పదవి దక్కించుకునేందుకు సహకరించిన వారిలో జాంగ్ ముఖ్యుడు కావడం విశేషం! శక్తిమంతమైన 24 మందితో కూడిన కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరోలో ఆయన సభ్యుడు. అంతేగాక పారీ్టలోని సీనియర్ సభ్యుల్లో అత్యధికులు ప్రస్తుతం జాంగ్‌కు దన్నుగా నిలిచినట్టు వార్తలొస్తున్నాయి. మాజీ అధ్యక్షుడు జింటావో అనుయాయులైన వారంతా జిన్‌పింగ్‌ను తొలినుంచీ లోలోపల వ్యతిరేకిస్తూ వస్తున్న వారేనని సమాచారం. నిజానికి సైనిక, ఆర్థిక తదితర కీలక వ్యవహారాల్లో కొన్నాళ్లుగా జిన్‌పింగ్ మాట సాగడం లేదని చెబుతున్నారు. అంతేగాక ఆయన అనుయాయులైన డజన్ల కొద్దీ సైనిక జనరళ్లు కొద్ది రోజులుగా అనూహ్యంగా మాయమవుతున్నారు. మరికొందరికి ఉన్నట్టుండి ఉద్వాసన పలికారు.వారసుడు వాంగ్! చైనా చైనా కమ్యూనిస్టు పార్టీ సారథిగా ఇటీవలే నియమితుడైన వాంగ్‌యాంగ్ త్వరలో జిన్‌పింగ్ స్థానంలో అధ్యక్షునిగా పగ్గాలు చేపడతారని వార్తలొస్తున్నాయి. టెక్నోక్రాట్ అయిన వాంగ్‌కు మృదు స్వభావిగా, మార్కెట్ శక్తుల అనుకూలునిగా పేరుంది. అందుకే సంస్కరణవాది అయిన నాయకునిగా కమ్యూనిస్టు పార్టీ ఆయనను దేశ నాయకత్వ బాధ్యతలకు సిద్ధం చేస్తోందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్

విద్యార్థి వీసాలపై ‘కాల పరిమితి’ కత్తి!
వాషింగ్టన్: విదేశీ వలసదారులపై బహిష్కరణ వేటు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా విదేశీ విద్యార్థులపై ‘కాల పరిమితి’ కత్తి దూసేందుకు సాహసించారు. విదేశీ విద్యార్థులకు కాలపరిమితితో సంబంధం లేకుండా ఇన్నాళ్లూ ఎఫ్–1 స్టూడెంట్ వీసాలు జారీచేస్తుండగా ఇకపై స్పష్టమైన తుదిగడువుతో విద్యార్థి వీసాలు జారీచేయాలని అమెరికా ప్రభుత్వం యోచిస్తోంది. గడువు దాటాక అమెరికా గడ్డపై ఉంటే మళ్లీ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత ప్రతిపాదనలో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్(ఓఎంబీ) వద్ద పరిశీలనలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడితే ఇకపై విద్యార్థి అమెరికాలో చేయబోయే కోర్సు పూర్తయినా, పూర్తికాకపోయినా వీసాపై ముద్రించిన గడువుతేదీలోపు అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఇన్నాళ్లూ ఇలాంటి గడువు అనేదే లేదు. అమెరికాలోకి అడుగుపెట్టినప్పుడు ఎంచుకున్న విద్యా కోర్సు సంపూర్ణంగా పూర్తయ్యేదాకా ఆ స్టూడెంట్ వీసా చెల్లుబాటులోనే ఉండేది. దీనినే ‘ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’గా పిలుస్తారు. ఈ స్టేటస్‌లో ఇకపై గడువు తేదీని ముద్రించాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. గతంలో కోర్సు ఆలస్యమైతే వీసా గడువు పొడిగింపు వంటి వెసులుబాట్లు ఉండేవి. ఇకపై అలాంటివి ఒప్పుకోబోమని ట్రంప్ సర్కార్ కరాఖండీగా చెబుతోంది. దీంతో ఎఫ్–1 వీసాలతో అమెరికా విద్యాభ్యాసం కోసం వచ్చే భారతీయ విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది. అనివార్య కారణాలతో కోర్సు ఆలస్యమైనాసరే వీసా గడువు మాత్రం పాత తేదీకే పూర్తవుతుంది. అలాంటి సందర్భాల్లో కోర్సు పూర్తికాకముందే అమెరికాను వీడాల్సి ఉంటుంది. ఈ గండం నుంచి గట్టెక్కేందుకే మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆ దరఖాస్తు ఆమోదం కోసం వేచి ఉండటం, దరఖాస్తు, తదితరాల ఖర్చులు తడిసిమోపెడై విద్యార్థులకు ఖర్చు మరింత పెరగనుంది. ఎక్స్చేంజ్ విజిటర్లకూ కష్టాలే జే–1 వీసా సాధించి ఎక్స్చేంజ్ విజిటర్లుగా వచ్చే వాళ్లకూ ఇదే నిబంధనను వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చిన్నారులకు ఇంట్లో సేవచేయడం అందుకు ప్రతిఫలంగా భోజన, వసతి, స్వల్ప భత్యం వంటి సదుపాయాలు పొందే ‘ఆపెయిర్’ యువతకు ఇదే గడువు విధించాలని చూస్తున్నారు. కొత్త ప్రతిపాదలు అమల్లోకి వస్తే విదేశీ విద్యార్థులతోపాటు ఎక్స్చేంజ్ విజిటర్ల విభాగంలోకి వచ్చే అధ్యాపకులు, విదేశీ మీడియా ప్రతినిధులు, విద్యావేత్తలు, కళాకారులు, ఉపాధ్యాయులు, ట్రైనీలు, ఇంటర్న్లు, వైద్యులు సైతం వీసా కాలపరిమితి కష్టాలను ఎదుర్కోనున్నారు. అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదనలు ప్రస్తుతం ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ విభాగం పరిశీలిస్తోంది. వీటిని ఫెడరల్ రిజిస్ట్రీలో ప్రచురించాక 30 లేదా 60 రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. అత్యవసరమైతే దొడ్డిదారిన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి కూడా ట్రంప్ ప్రభుత్వం ఈ నిబంధనను అమల్లోకి తెచ్చే ప్రమాదముందని తెలుస్తోంది. పలు వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరాలు ఇప్పటికే వీసా దరఖాస్తుదారుల ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్టా గ్రామ్, లింక్డి్డన్ వంటి సామాజిక మాధ్యమ ఖాతాలను అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు జల్లెడ పడుతున్నారు. అమెరికా వ్యతిరేక, హమాస్ అనుకూల పోస్ట్‌లు, ట్వీట్లు, వీడియోలు ఉన్నాయో లేదోనని పరిశీలించి ఆ మేరకు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇన్ని అడ్డంకులను దాటుకుని సంపాదించిన వీసాను కేవలం గడువు ప్రాతిపదికన మంజూరుచేయడం తగదని పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడువు విధింపు కారణంగా లక్షలాది మంది విద్యార్థులపై అదనపు ఒత్తిడి, ఆర్థికభారం తప్పదని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అకడమిక్ కోర్సుల విధానం అస్తవ్యస్తమవుతుందని పలువురు పేర్కొన్నారు. గడువుదాటి అమెరికాలో ఉంటే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ మే 14వ తేదీన హెచ్చరించడం తెల్సిందే.
జాతీయం

పాకిస్తాన్ సెలబ్రిటీలకు బిగ్ షాకిచ్చిన భారత్
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌కు చెందిన సెలబ్రిటీలకు భారత ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పాక్ సెలబ్రిటీలు, క్రికెటర్లు సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం మళ్లీ నిషేధం విధించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన పలు ఛానళ్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే, బుధవారం వారి అకౌంట్లు ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో, అప్రమత్తమైన కేంద్రం.. వారి ఖాతాలపై మళ్లీ నిషేధం విధించినట్లు సమాచారం.ఇక, పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు, పాకిస్తానీ క్రికెటర్ల ట్విట్టర్ అకౌంట్స్ అన్నింటినీ భారత్‌లో బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్‌కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్‌ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్‌లో ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి.An Indian soldier takes a bullet on the border.A Pakistani influencer takes creator payouts from Indian views.The government banned their content… then quietly unbanned it.This isn't soft diplomacy.This is soft headed.#BanPakContent pic.twitter.com/HlOZNvE2AX— SambhavāmiYugeYuge (Ministry of Aesthetics) (@Windsofchange72) July 2, 2025హనియా అమీర్, మహీరా ఖాన్, క్రికెటర్ షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, ఫవాద్ ఖాన్, సాబా కమర్, అహద్ రజా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఖాతాలు భారత్‌లో అన్‌బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్‌లో దర్శనం ఇచ్చాయి. ఇవన్నీ చూసిన భారత నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. భారత్‌లో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై బ్యాన్ తొలగించారా? అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల విమర్శల నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి నిషేధం విధించినట్టు తెలుస్తోంది.

ముద్దులొలికే ఈ చిన్నారి ఫొటో వెనుక.. అంతులేని విషాదం
బార్మర్: ఇద్దరు పిల్లలతో నిండుగా కళకళలాడుతున్న ఆ పచ్చని సంసారాన్ని కుటుంబ కలహాలు చిదిమేశాయి. క్షణికావేశంలో కుటుంబ పెద్ద తీసుకున్న నిర్ణయం స్థానికులకు తీరని ఆవేదనను మిగిల్చింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.బార్మర్‌కు చెందిన కవిత కవిత తన చిన్న కుమారుడు రామ్‌దేవ్‌కు బాలికల దుస్తులు ధరించి, కళ్లకు కాజల్ పెట్టి, బంగారు ఆభరణాలు వేసి, చూడముచ్చటగా తయారుచేసింది. ఆ తరువాత వారి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. ఆ ఇంటిలోని భర్త, భార్య ఇద్దరు కుమారులు ఇంటికి సమీపంలో ఉన్న నీటి ట్యాంక్‌లోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను శివలాల్ మేఘ్వాల్ (35), అతని భార్య కవిత (32), కుమారులు బజరంగ్ (9) రామ్‌దేవ్ (8)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. శివలాల్ మేఘ్వాల్ కుటుంబం సామూహిక ఆత్మహత్య వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. శివలాల్ మేఘ్వాల్ కుటుంబ సభ్యుల మృతదేహాలను వారి బంధువుల సమక్షంలో వాటర్ ట్యాంక్ నుండి వెలికితీశారు.శివలాల్ మేఘ్వాల్కు అతని సోదరుడు ఫోన్ చేసినప్పుడు ఎటువంటి సమాధానం రాకపోవడంతో, అతను పొరుగింటివారిని శివలాల్ మేఘ్వాల్ ఇంటికి వెళ్లి చూసిరమ్మనడంతో ఈ ఘటన వెలుగు చూసిందని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)మనారామ్ గార్గ్ మీడియాకు తెలిపారు. శివలాల్ మేఘ్వాల్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్లో తమ నిర్ణయానికి ముగ్గురు వ్యక్తులు కారకులని, వారిలో తన సోదరుడు ఒకరని రాసివుంది. కుటుంబ సభ్యుల మధ్య భూ వివాదం సంవత్సరాల తరబడి నడుస్తున్నదని లేఖలో వెల్లడయ్యింది. తమ నలుగురి అంత్యక్రియలు తమ ఇంటి ముందు నిర్వహించాలని ఆ లేఖలో శివలాల్ మేఘ్వాల్ అభ్యర్థించారు.మృతురాలు కవిత మామ తెలిపిన వివరాల ప్రకారం, శివలాల్ మేఘ్వాల్.. కేంద్ర ప్రభుత్వం అందించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద మంజూరు చేసిన నిధులను ఉపయోగించి ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు. అయితే అందుకు అతని తల్లి, సోదరుని నుంచి వ్యతిరేకత ఎదురయ్యింది. ఈ నేపధ్యంలోనే శివలాల్ మేఘ్వాల్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నదని కవిత మామ ఆరోపించారు. ఘటన జరిగిన రోజున ఇతర కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేదని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mali: ‘అల్ ఖైదా’ మరో ఘాతుకం.. ముగ్గురు భారతీయుల అపహరణ

గదిలో బంధించాడు వివస్త్రను చేశాడు!
కోల్‌కతా: లా కాలేజీ గ్యాంగ్‌రేప్ కేసులో ప్రధాన నిందితుడు, తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నాయకుడు మోనోజిత్ మిశ్రాపై మరిన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అతను తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరో విద్యార్థిని వెల్లడించింది. ఓ వేడుక సందర్భంగా గదిలో బంధించి, వివస్త్రను చేసి లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ‘‘2023 అక్టోబర్‌లో కాలేజీ వేడుకలో ఓ పక్క విద్యార్థులు డ్యాన్స్ చేస్తుండగా మా నాన్న ఫోన్ చేశారు. గోలగోలగా ఉండటంతో మాట్లాడటానికి పక్కనున్న ఖాళీ గదిలోకి వెళ్లాను. మాట్లాడి బయటికి రాబోతుండగా మోనోజిత్ లోపలికొచ్చి తలుపు లాక్ చేశాడు. మద్యం, గంజాయి తాగి ఉన్నాడు. నా మీదికొస్తుంటే నెట్టేశా. దాంతో తన జేబులోని రిమోట్‌తో వేదిక వద్ద మ్యూజిక్ సౌండు పెంచాడు. తర్వాత నా జుట్టు పట్టుకుని గదిలోని బాల్కనీలోకి ఈడ్చుకెళ్లాడు. నా బట్టలు విప్పడం ప్రారంభించాడు. వదిలెయ్యమని వేడుకున్నా. బిగ్గరగా అరిచా. అదృష్టవశాత్తూ ఒక సీనియర్ విద్యార్థి తలుపు తట్టడంతో మోనోజిత్ పారిపోయాడు’’ అని వెల్లడించింది. ఇష్టపూర్వక లైంగిక కలయికే: లాయర్ గ్యాంగ్ రేప్ కేసులో మోనోజిత్‌తో పాటు జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ కస్టడీని కోర్టు మరో ఎనిమిది రోజులు పొడిగించింది. వారి తర్వాత అరెస్టయిన నాలుగో నిందితుడు, కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీ కస్టడీనీ జూలై 4 వరకు పొడిగించారు. మోనోజిత్ ఆరోగ్య పరీక్షల సమయంలో సమయంలో అతని శరీరంపై రక్కిన గీతలను పోలీసులు గుర్తించారు. లైంగిక దాడిని బాధితురాలు ప్రతిఘటించిందనేందుకు అవి నిదర్శమని పోలీసు వర్గాలు తెలిపాయి. మోనోజిత్ కాల్ రికార్డులను సిట్ బృందం పరిశీలించింది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నయనా చటర్జీతో అతనికి జరిగిన ఫోన్ సంభాషణల ఆధారాలను గుర్తించింది. కానీ మోనోజిత్ తరఫు లాయర్ రాజూ గంగూలీ మాత్రం బాధితురాలి ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని ఆరోపించారు. ‘‘ఆమె ఇష్టపూర్వకంగానే అతనితో లైంగికంగా కలిసింది. మోనోజిత్ మెడపై ఆమె గోటి గుర్తులే దానికి నిదర్శనం. ఈ విషయాన్ని ప్రాసిక్యూషన్ కావాలనే దాస్తోంది’’ అని ఆక్షేపించారు.

SpiceJet: గాల్లో ఉండగా ఊడిన కిటికీ ఫ్రేమ్
ముంబై: గోవా నుంచి పుణెకు ప్రయాణిస్తున్న స్పైస్‌జెట్ క్యూ400 విమానం కిటికీ ఫ్రేమ్ హఠాత్తుగా ఊడిపోయింది. అయితే ప్రయాణికుల భద్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని తెలుస్తోంది. పుణెలో విమానం ల్యాండవగానే ఊడిన కాస్మెటిక్ ఇంటీరియర్ కిటికీ ఫ్రేమ్‌ను బిగించామని స్పైస్‌జెట్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ఘటనను ఆ విమాన ప్రయాణికులు తీవ్రంగా తప్పుబట్టారు. సరైన ముందుస్తు తనిఖీలు చేయకుండా విమానాలను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ కిటికీ అసెంబ్లీ యూనిట్ మొత్తం ఊడిపోయింది. అయినాసరే విమానాన్ని అలాగే పోనిచ్చారు. అసలీ విమానాన్ని ఎగిరే అర్హత ఉందా?’’ అంటూ ఒక ప్రయాణికుడు సంబంధిత కిటికీ ఫొటోను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు ట్యాగ్చేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. #SpiceJet from Goa to Pune today. The whole interior window assembly just fell off mid flight. And this flight is now supposed to take off and head to Jaipur. Wonder if it’s air worthy @ShivAroor @VishnuNDTV @DGCAIndia pic.twitter.com/x5YV3Qj2vu— Aatish Mishra (@whatesh) July 1, 2025
ఎన్ఆర్ఐ

NRI డాలస్‌లో యోగాడే సెలబ్రేషన్స్
డాలస్, టెక్సాస్: అమెరికాలో ఇర్వింగ్ (డాలస్) నగరంలోని మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద జూన్ 21 న మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వందలాదిమంది ప్రవాస భారతీయులు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. గంటన్నరకు పైగా సాగిన యోగా, ధ్యాన కార్యక్రమానికి ‘హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ సారధ్యం వహించింది. ఈ కార్యక్రమంలో ఇషా ఫౌండషన్, ది ఐ వై ఇసి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్, వన్ ఎర్త్ వన్ చాన్స్ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్, డి ఎఫ్ డబ్లు హిందూ టెంపుల్ మొదలైన సంస్థలనుండి వందలాదిమంది పాల్గొన్నారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల అతిథులందరికీ స్వాగతం పలికి, యోగా చెయ్యడం కోసం సుప్రభాత సమయంలో తరలివచ్చిన వారందరికీ ధన్యవాదములు అని సభను ప్రారంభించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో ఛైర్మన్ రాజీవ్ కామత్ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “యోగా, ధ్యానం కేవలం జూన్ 21 న మాత్రమేగాక మన దైనందిన జీవితంలో దినచర్యలో ఒక భాగంగా చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందన్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు జూన్ 21న యోగా దినోత్సవం జరుపుకోవడం ఆనందదాయకం అన్నారు.” మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండిముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాపర్ మహాత్మాగాంధీ మెమోరియల్ దశమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించి, అన్ని వయస్సులవారు వందలాదిమంది ఈ రోజు యోగాలో పాల్గొనడం సంతోషం అని, ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిభావంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యవర్గ సభ్యులకు అభినందనలు అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మరియు కార్యవర్గసభ్యుల విజ్ఞప్తి ననుసరించి, అతిత్వరలో 5 మిలియన్ డాలర్లకు పైగా ధనాన్నివెచ్చించి ఈ 18 ఎకరాల సుందరమైన పార్క్ లో వాకింగ్ ట్రాక్స్, ఎల్ యి డి విద్యుత్ దీపాలను మెరుగుపరుస్తామని ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు.ప్రత్యేకఅతిథులుగా హాజరైన కాపెల్ నగర కౌన్సిల్ సభ్యులు బిజు మాథ్యూ, రమేష్ ప్రేమ్ కుమార్, ఫ్రిస్కో ఇండిపెండెంట్ స్కూల్ ట్రస్టీ బోర్డ్ సభ్యుడు సురేష్ మండువ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని కల్గించింది అంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర సహచర కార్యవర్గ సభ్యులు రాజీవ్ కామత్, రావు కల్వాల, బి.ఎన్ రావు, తయాబ్కుండావాల, రాజేంద్ర వంకావాల, రాంకీ చేబ్రోలు, మహేంద్ర రావు, జె పి పాండ్య, రన్నా జానీ, అనంత్ మల్లవరపులతో కలసి అతిథులందర్నీ సత్కరించారు.యోగా అనంతరం నిర్వాహాకులు చక్కటి ఉపాహారాన్ని ఏర్పాటు చేశారు. గాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యుడు బి.ఎన్ రావు తన ముగింపు సందేశంలో యోగా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, అతిథులకు, వివిధ ప్రసార మాధ్యమాలకు, హార్ట్ ఫుల్నెస్’ యోగా సంస్థ నిర్వాహాకులు సురేఖా కోయ, ఉర్మిల్ షా మరియు వారి బృంద సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ స్మారక సిరికోన నవలారచన పోటీ తుది ఫలితాలు
తెలుగులో గుణాత్మకమైన నవలారచనలను ప్రో త్సహించడానికి సిరికోన సాహితీ అకాడెమీ ( వాట్సప్) తరపున, స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు - సరోజమ్మ నవలా రచన పోటీ 2024కు సంబంధించిన తుది ఫలితాలను సంస్థ ప్రకటించింది. గత నాలుగు సంవత్సరాల నుంచి, ప్రతి ఏడాదీ ఉత్తమ నవలారచన పోటీల్లో భాగంగా ఉత్తమ రచనకు ముప్ఫై వేల నగదు బహుమతితో కూడిన పురస్కారాన్ని అందిస్తుంది., ఇతర రచయితలకు ప్రోత్సాహకంగా ఒకటి రెండు ప్రత్యేక బహుమతులను కూడా ప్రకటిస్తుంది. 2024 వ సంవత్సరానికి అనూహ్యమైన స్పందన లభించింది.. ఎక్కువమంది ప్రేమను కేంద్రవస్తువుగా తీసుకుని రాసినా, గణనీయ సంఖ్యలో ఆధునిక జీవన వైవిధ్యాన్ని చిత్రించే నవలలు రచించి పోటీకి సమర్పించారు.. ప్రాథమిక వడబోత పిమ్మట 26 నవలలు పోటీకి నిలిచాయి. తర్వాత వాటిని మరొక నిర్ణేత పరిశీలించి ఎంపిక చేసిన 7 నవలలను ముగ్గురు న్యాయనిర్ణేతలకు పంపడం జరిగింది. a. కథావవస్తువు, b. ఇతివృత్త నిర్మాణం- వాస్తవికత/ తార్కికతలు, c. శైలి- శిల్పం, d. సామాజిక ప్రయోజనం అంశాల ఆధారంగా గుణ పరిశీలన జరిగిందని సంస్థ ప్రతినిధి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఉత్తమ నవల: 'కిలారి': డా.బి.నాగశేషుప్రత్యేక బహుమతులు: 1. “కావేరికి అటూ ఇటూ”: రెంటాల కల్పన 2. “ లింగాల కంఠంలో” : రంజిత్ గన్నోజుఅసాధారణ నిర్మాణచాతురితో, అద్భుత మాండలిక భాషా కథనంతో, సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తున్న నవల 'కిలారి, మూడుతరాల నారీచేతనకు అద్దం పడుతున్న రచన 'కావేరికి అటూ ఇటూ..', నల్లమల అడవుల్లోని చెంచుల జీవితాన్ని అత్యంత సన్నిహితంగా పరిచయం చేస్తున్న రచన 'లింగాలకంఠంలో నవలలు నిస్సందేహంగా సిరికోనకు గర్వకారణంగా నిలిచే రచనలని పేర్కొంది. విజేతలకు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం అభినందనలు తెలిపారు.మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు
తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తాజాగా విశాఖలో దివ్యాంగుల కోసం నాట్స్ ఉచిత బస్సును ఏర్పాటు చేసింది. నాట్స్ స్థానిక స్వచ్చంద సంస్థ గ్లోతో కలిసి విశాఖలోని దివ్యాంగుల పాఠశాల సన్ ప్లవర్ స్కూల్ కోసం ఈ బస్సు కోనుగోలుకు కావాల్సిన ఆర్ధిక సహాకారాన్ని అందించింది. విశాఖ ఎంపీ భరత్ ఈ బస్సును లాంఛనంగా ప్రారంభించారు. నాట్స్ తెలుగు వారి కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలను ఈ సందర్భంగా ఎంపీ ప్రశంసించారు. నాట్స్ సంబరాల్లో భాగంగా సంబరంలో సేవ.. సంబరంతో సేవ అనే కార్యక్రమం కింద సంబరాల్లో వచ్చిన మొత్తంలో 10శాతం ఇలా సేవ కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. దానిలో భాగంగానే న్యూజెర్సీలో జరిగిన సంబరాల్లో ఇచ్చిన మాట ప్రకారం విశాఖలో దివ్యాంగుల పాఠశాల సన్ ప్లవర్ స్కూల్‌కి తన చేయూత అందిస్తోంది. నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్, ఎవల్యూజ్ సంస్థ అధినేత శ్రీనివాస్ అరసాడ కూడా ఈ దివ్యాంగ పాఠశాలకు కావాల్సిన ఆర్థిక చేయూత అందించారు.

షాకిచ్చిన ట్రంప్.. సోషల్ మీడియా వివరాలు ఇవ్వకపోతే వీసా రద్దు!
వాషింగ్టన్: వీసా అభ్యర్థులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ షాకిచ్చారు. వీసా అప్లయి దారులు వారి సోషల్ మీడియా అకౌంట్ల వివరాల్ని బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. లేదంటే సదరు అభ్యర్థుల వీసా క్యాన్సిల్ చేసే దిశగా చర్యలకు ఉపక్రమించారు. తద్వారా సోషల్ మీడియా అకౌంట్లలో వీసా అప్లయి దారులు ఏ మాత్రం నెగిటీవ్ అనిపించినా అలాంటి వారు అమెరికాలోకి అడుగు పెటట్టడం అసాధ్యం అవుతుంది.ఉదాహారణకు నార్వేకు చెందిన 21ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ అమెరికాలో పర్యాటించాలని అనుకున్నాడు. కానీ మాడ్స్ ఫోన్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బట్టతలతో ఉన్న మీమ్ ఫొటో ఉంది. అంతే ఆ ఫొటొ దెబ్బకు అమెరికాలో పర్యటించే అవకాశాన్ని కోల్పోయాడు. మాడ్స్ తరహాలో భారతీయులు సైతం అమెరికాలో అడుగుపెట్టేందుకు రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కోనున్నారు. అందుకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం తీసుకున్న నిర్ణయమే కారణం. ఇంతకి ఆ నిర్ణయం ఏంటని అనుకుంటున్నారా?.అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వీసాల మంజూరుపై ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. వీసాల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ వీసా అభ్యర్థుల గుణగణాల్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా అమెరికా కొత్త వీసా నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది.Visa applicants are required to list all social media usernames or handles of every platform they have used from the last 5 years on the DS-160 visa application form. Applicants certify that the information in their visa application is true and correct before they sign and… pic.twitter.com/ZiSewKYNbt— U.S. Embassy India (@USAndIndia) June 26, 2025 సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త.. లేదంటే నో వీసాఅమెరికా వెళ్లేందుకు వీసా అప్లయి చేసుకునే అభ్యర్థులు వారి ఐదేళ్లకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్ల (సోషల్ మీడియా వెట్టింగ్) వివరాల్ని డీఎస్-160ఫారమ్‌లో బహిర్ఘతం చేయాల్సి ఉంటుంది. ఆ ఫారమ్‌లో వీసా కోసం ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్ వివరాల్ని ఎవరైతే మీరు పొందే కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని వీసా ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే ఫారమ్‌లో అభ్యర్థులు వారి సోషల్ మీడియా వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. ఇమ్మిగ్రేషన్ అధికారులు మీ సోషల్ మీడియా అకౌంట్స్‌ను చెక్ చేస్తారు. అందులో ఏ మాత్రం తేడా అనిపించినా వీసా ఇవ్వరు.అంతర్జాతీయ విద్యార్థులపై ఆంక్షలు విధించేలాఇక తాజా చర్య ట్రంప్ అంతర్జాతీయ విద్యార్థుల్ని నియంత్రించే ప్రయత్నాల్లో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతేడాది అమెరికాలోని పలు కాలేజీ క్యాంపస్‌లలో పాలస్తీనాకు అనుకూలంగా పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నాటి నుంచి అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం కఠిన ఆంక్షలకు దిగింది. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం వీసా ప్రక్రియ సమయంలో సోషల్ మీడియా సమాచారాన్ని విశ్లేషించడం జాతీయ భద్రతా చర్యలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతోంది.భారత్‌లో అమెరికా రాయబార కార్యాలయం ప్రకటన అందుకు అనుగుణంగా గత సోమవారం భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ కీలక ప్రకటన చేసింది. అందులో 2019 నుండి, యునైటెడ్ స్టేట్స్ వీసా దరఖాస్తుదారులు వలసదారుల, వలసేతర వీసా దరఖాస్తు ఫారమ్‌లపై సోషల్ మీడియా ఐడెంటిఫైయర్లను అందించాలని కోరింది. అమెరికా జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారితో సహా, యునైటెడ్ స్టేట్స్కు అనుమతించబడని వీసా దరఖాస్తుదారులను గుర్తించడానికి మేము మా వీసా స్క్రీనింగ్, వెట్టింగ్‌లో అందుబాటులో సమాచారాన్ని ఉపయోగిస్తాము’ అని రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
క్రైమ్

మళ్లీ వస్తా.. యువతిపై డెలివరీ బాయ్ ఘాతుకం.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ దిగి..
పూణే: మహారాష్ట్రలోని పూణేలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటికి పార్సిల్ డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు నిందితుడు అంతటితో ఆగకుండా ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ రాసిపెట్టేసి వెళ్లిపోయాడు. దీంతో, ఈ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది.వివరాల ప్రకారం.. పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి బాధితురాలు(22) నివాసం ఉంటోంది. అయితే, ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడు. ఇంతలో బాధితురాలికి పార్సిల్ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడు. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లింది. ఆమె లోపలికి వెళ్లగానే డెలివరీ బాయ్ డోర్ క్లోజ్ చేసి.. ఆమెపై పెప్పర్ స్ప్రే చల్లాడు. వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి.. ఆమె ఫోన్లోనే సెల్ఫీ తీసుకుని తిరిగి వస్తానంటూ ఓ పేపర్‌పై రాసిపెట్టే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని హెచ్చరించి పరారయ్యాడు. ఓ గంట తర్వాత బాధితురాలు స్పృహలోకి కన్నీరు పెట్టుకుంది. వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో, పోలీసులు.. ఆమె ఇంటికి చేరుకుని వివరాలను సేకరించారు. బాధితురాలి స్టేట్మెంట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజ్ కుమార్ షిండే మాట్లాడుతూ.. ఇంట్లో బాధితురాలి సోదరుడు లేని సమయంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడి కోసం గాలిస్తున్నాం. సీసీ కెమెరాల ఆధారం అతడి గురంచి అన్వేషిస్తున్నాం. లైంగిక దాడి, మహిళపై దాడి, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాధితురాలి మొబైల్ సెల్ఫీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. నిందితుడు ఆమెను స్పృహ కోల్పోయేలా చేయడానికి ఏదో పదార్థాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఏదైనా స్ప్రే ఉపయోగించారా? అని వివరాలు సేకరిస్తున్నాం అని తెలిపారు. VIDEO | Here's what Pune Deputy Commissioner of Police (Zone 5) Rajkumar Shinde said on the alleged rape of a 22-year-old woman in her apartment by a courier delivery executive:"A case has been registered under Bharatiya Nyaya Sanhita sections 64 (punishment for rape), 77… pic.twitter.com/rbxvN86an9— Press Trust of India (@PTI_News) July 3, 2025

భర్త వద్దు.. మామే కావాలి.. పెళ్లైన 45 రోజులకే..
పాట్నా: దేశవ్యాప్తంగా ఇటీవలి కాలంలో భర్తలను అత్యంత దారుణంగా చంపేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో భర్త.. పెళ్లి అయిన 45 రోజులకు హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే, తన మామతో జీవించేందుకే.. అడ్డుగా ఉన్న భర్తను భార్యే హత్య చేయించింది. ఈ విషాదకర ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. దీంతో, పెళ్లి అంటేనే పురుషులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన ప్రియాంశు (25), గుంజాదేవి (20)లకు రెండు కుటుంబాల పెద్దలు వివాహం జరిపించారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య 45 రోజుల క్రితమే వీరిద్దరికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అయితే, గుంజాదేవికి తన మామ అంటే(భర్త తండ్రి కాదు) ఎంతో ఇష్టం. పెళ్లికి ముందు నుంచే గుంజాదేవీ, ఆమె మామ జీవన్‌సింగ్ (55)లు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. శారీరకంగా కూడా కలిసినట్టు తెలిసింది. ఈ క్రమంలో తన మామనే పెళ్లిచేసుకుంటానని.. గుంజాదేవీ తన పేరెంట్స్‌కు చెప్పింది. ఇందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు.అనంతరం, ప్రియాంశుతో దేవీకి బలవంతంగా వివాహం చేశారు. తర్వాత.. తన మామను మరిచిపోలేక గుంజాదేవీ.. భర్తను దూరం పెడుతూ వస్తోంది. ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకుని తన మామను పెళ్లి చేసుకోవాలని ఆమె భావించింది. దీంతో, తన భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. ఇందుకు సుపారీ గ్యాంగ్‌తో డీల్ కుదుర్చుకుంది. గత నెల 25న ప్రియాంశు తన సోదరిని కలిసేందుకు వెళ్లి రైలులో తిరిగి పయనమయ్యాడు. ఈ క్రమంలో నవీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్తుండగా.. ఇద్దరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సమయంలో గుంజాదేవీ గ్రామం నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన ప్రియాంశు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె కాల్ రికార్డులను పరిశీలించగా.. జీవన్‌సింగ్‌తో తరచూ టచ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. అతడి కాల్ డేటా కూడా పరిశీలిస్తే సుపారీ గ్యాంగ్‌తో సంప్రదింపులు జరిపినట్లు తేలింది. ఇక, ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు సుపారీ గ్యాంగ్ సభ్యులతో పాటు నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జీవన్‌సింగ్ పరారీలో ఉండగా అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెళ్లి అయిన నెలన్నరకే తమ కొడుకు ఇలా చనిపోయవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

సర్ప్రైజ్ చేస్తానంటూ.. చంపేశాడు
హైదరాబాద్: తండ్రిని సర్ప్రైజ్ చేస్తానని చెప్పిన ఓ కుమారుడు.. కళ్లకు గంతలు కట్టి.. ఆపై కత్తితో పొడిచి హతమార్చిన వైనం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆన్లైన్ బెట్టింగ్‌లో పోగొట్టిన డబ్బుల గురించి తండ్రి అడగడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ హృదయ విదారక ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంటకు చెందిన కెతావత్ హన్మంత్ (37) బతుకుదెరువు కోసం గోపన్‌పల్లి ఎన్టీఆర్ నగర్‌కు వలస వచ్చి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య జములమ్మ, కొడుకులు రవీందర్ (19), సంతోషిలు ఉన్నారు. హన్మంత్ ఇటీవల తన భూమిని కుదువబెట్టి రూ.6 లక్షల అప్పు తీసుకొని ఇంట్లో పెట్టాడు. ఇంటర్ పూర్తి చేసిన పెద్ద కొడుకు కెతావత్ రవీందర్ యాప్‌లో ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్‌లో పోగొట్టాడు. తండ్రి పదేపదే డబ్బుల గురించి అడగగా.. అవసరానికి స్నేహితునికి ఇచ్చానని త్వరలోనే తిరిగిస్తాడని నమ్మబలికాడు. దీంతో రోజూ ఇంట్లో డబ్బు గురించి గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో రవీందర్ తన స్నేహితుడు డబ్బులు ఇచ్చేందుకు వస్తున్నాడని మంగళవారం తండ్రిని ఎన్టీఆర్ నగర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తానని నమ్మించి తండ్రి కళ్లకు గంతలు కట్టాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన కత్తితో గొంతులో బలంగా పొడిచాడు. దాదాపు 100 మీటర్ల వరకు పరిగెత్తి కింద పడిపోయి హన్మంత్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. అనంతరం రవీందర్ బాబాయ్ రమేశ్‌కు ఫోన్ చేసి నాన్న కత్తితో పొడుచుకొని చనిపోయాడని చెప్పాడు. ఆత్మహత్యగా కుటుంబ సభ్యులను, బంధువులను నమ్మించి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కోతులకుంటకు తరలించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘనపూర్ పీఎస్‌కు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలు నిర్వహిస్తే అందరిపై కేసు నమోదవుతుందని హెచ్చరించి, మంగళవారం రాత్రి హన్మంత్ మృతదేహాన్ని తిరిగి గచ్చిబౌలి పీఎస్‌కు తీసుకొచ్చారు. మృతదేహంతో పాటు వచ్చిన రవీందర్‌ను విచారించగా తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్‌కుమార్‌తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్‌కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్‌కుమార్ హుటాహుటిన మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్‌పాషా తెలిపారు.
వీడియోలు


హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టు


చంద్రబాబుకు బనకచర్ల పూర్తిచేసే ఉద్దేశం లేదు: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి


శ్రీవాణి టికెట్ల కేంద్రం దగ్గర కనీసం మంచినీళ్ల సౌకర్యం కూడా లేదని ఫైర్


ఏపీ రాజధాని కోసం మరో 45 వేల ఎకరాల భూ సమీకరణకు యత్నం


అనకాపల్లి జిల్లా పూడిమడకలో విషాదం


Medical Graduates: ఇంత చదవడవం కంటే అడుక్కోవడం బెటర్


తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 17న రైల్ రోకో నిర్వహిస్తున్నాం: కవిత


Sailajanath: లోకేష్... దమ్ముంటే సింగయ్య భార్య ప్రశ్నలకు సమాధానం చెప్పు


తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్‌కు చేదు అనుభవం


Palakollu roads: అంతన్నారు.. ఇంతన్నారు చివరికి గోతులు పడితే మాత్రం!?