
విజయవాడ: పర్మినెంట్ రిజస్ట్రేషన్ల కోసం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వద్ద ఆందోళనకు దిగిన వైద్య విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వైద్య విద్యార్థుల పట్ల పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారు. అయితే గాయాల పాలైన వైద్య విద్యార్థులను పరామర్శించేందుకు అక్కడకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
విద్యార్థులను కలవడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. అతికష్టం మీద ఇద్దరు విద్యార్థులతో మాత్రమే మాట్లాడేందుకు దేవినేని అవినాష్‌కు అనుమతి ఇచ్చారు.
అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. ‘ ఈ ప్రభుత్వ వైఖరితో 1500 మంది విద్యార్ధుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. శాంతియుతంగా నిరసన చేస్తున్న విదేశీ విద్యార్థులను అరెస్ట్ చేయడం దుర్మార్గం. పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణం. మహిళా విద్యార్థులని చూడకుండా పోలీసులు లాగి పడేశారు. దెబ్బలతో నడవలేని స్థితిలో మహిళా విద్యార్థినులు ఉన్నారు. వైద్య విద్యార్థుల మీద కూడా చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే విదేశీ వైద్య విద్యార్ధులు చేసిన పాపం. విదేశీ వైద్య విద్యార్ధులకు అండగా ఉంటాం. వారి డిమాండ్లు నెరవేరే వరకూ పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: