breaking news
Rashmika Mandanna
-
వైల్డ్ లుక్‌లో రష్మిక.. రోమాలు నిక్కబొడుచుకునేలా ‘ ఓ మైసా’ సాంగ్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’. ఇందులో ఆమె పవర్ ఫుల్ అవాతర్ లో కనిపించనున్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, పోస్టర్లకు అద్భుతమైన స్పందన లభించింది. ఈ అంచనాలను మరింత పెంచుతూ మేకర్స్ ఈ రోజు సినిమా నుంచి తొలి పాట ‘ఓ మైసా రే’ ను విడుదల చేశారు.(చదవండి: జాగ్రత్తా.. నాకు 5 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు : అమితాబ్ వార్నింగ్)జేక్స్ బిజోయ్ అందించిన ఇంటెన్స్, పవర్ఫుల్ మ్యూజిక్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. ఉరుముల్లాంటి బీట్స్‌తో సాగే ఈ పాట ఆద్యంతం అదే టెంపో, ఎనర్జీని కొనసాగిస్తూ ఎలక్ట్రిఫైయింగ్ మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తోంది. సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం మైసాను ఈషి, ఐషి రూపాల్లో ఆవిష్కరిస్తూ దైవిక స్త్రీ శక్తిని, అర్ధనారీశ్వర స్వరూపాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళల శక్తి సామర్థ్యాలను కీర్తిస్తూ, ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధం కావాలనే స్ఫూర్తిని ఈ పాటలోని పదాలు బలంగా చాటుతున్నాయి. ఈ సినిమాలో.. రష్మిక శక్తిమంతమైన గిరిజన గోండు మహిళ పాత్రలో అలరించనున్నారు. నవంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో విడుదల కానుంది. -
అలా చేస్తే తప్పేంటి? ట్రోల్స్ పై రష్మిక ఫైర్..!
-
విజయ్ అంటే పిచ్చి ప్రేమ కోపంతో ఊగిపోయిన రష్మిక
-
విరోష్ జంటపై ట్రోల్స్.. సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఫిర్యాదు
ప్రస్తుతం విజయ్-రష్మిక జంటపై వస్తోన్న ట్రోల్స్ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. కాఫీ విత్ కరణ్ షో తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. దీంతో ఈ వివాదంపై రష్మిక, విజయ్ కూడా స్పందించారు. తన వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు విరోష్ జంట. తాజాగా తమపై ట్రోల్స్ చేసినవారిపై ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో తప్పుదోవ పట్టించే కంటెంట్ ప్రచారం జరుగుతోందని విరోష్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరపాలని కోరుతూ విజయ్ తరఫున మేనేజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. వీరికి సంబంధించిన కల్పిత కంటెంట్, మార్ఫింగ్ చేసిన స్క్రీన్షాట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ట్రోల్స్‌కు సంబంధించిన లింక్స్, సాక్ష్యాలను సైబర్ క్రైమ్ పోలీసులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. -
నా పీరియడ్స్ టైమ్.. విజయ్ చేసే పని అదే: రష్మిక
టాలీవుడ్లో ఇప్పుడంతా విరోష్ జంట పేరు హాట్‌టాపిక్‌గా మారింది. రణబాలి రిలీజ్ తర్వాత వీరిద్దరి పేర్లు మార్మోగిపోతున్నాయి. ఇటీవల ఈ జంట కాఫీ విత్ కరణ్ షోకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత తమ రిలేషన్, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రష్మిక తనను దాదాపు వందసార్లు పెళ్లి చేసుకోమని అడిగిందని విజయ్ సరదాగా చెప్పుకొచ్చారు.అంతలోనే ఈ జంటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వీరిద్దరు విడిపోతున్నారంటూ కొందరు రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. కొందరు కావాలనే ఈ జంటపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక, విజయ్ సైతం ట్రోల్స్‌పై స్పందించారు. తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని.. అవసరంగా మా వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని కాస్తా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.ఇదంతా పక్కనపెడితే ఇటీవల ఇంటర్వ్యూలో రష్మిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే విజయ్ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని రష్మిక వెల్లడించారు. ఆ సమయంలో విజయ్ నా చేతులు, కాళ్లను ఒత్తుతూ తనను ప్రేమగా చూసుకుంటాడని పేర్కొన్నారు. తాను అలా పక్కన ఉండటం ఎంతో ఓదార్పునిస్తుందని రష్మిక వివరించారు.అయితే పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందే విజయ్‌కు ముందుగానే సమాచారం ఇస్తానని రష్మిక చెప్పారు. పురుషులకు ఈ విషయాలపై పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ.. విజయ్ తనను అర్థం చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా తనకు మొదటిసారి రుతుస్రావం అయినప్పటి అనుభవాన్ని కూడా రష్మిక గుర్తు చేసుకున్నారు. అప్పుడు నాకు చాలా భయమేసిందని తెలిపింది. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ అనేవి ఉంటాయని కూడా నాకు తెలియదని పేర్కొంది. టవల్స్నే మడతపెట్టి వాడానని.. ఇది కేవలం ఒక్కసారే వస్తుందేమో అనుకున్నానని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలసరి సెలవుల ప్రస్తావన ఇంకా రాలేదని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ.. నెలసరి సెలవులు లేకుండా పనిచేయడమే వారికి సాధారణమైపోయిందన్నారు. ఇది చాలా విచారకరం అన్నారు. తాను నెలసరి నొప్పిని తట్టుకోవడానికి హాట్ ప్యాడ్స్ వాడతానని, జీలకర్ర నీళ్లు తాగుతానని కూడా రష్మిక వెల్లడించారు. -
విడాకుల రూమర్స్.. విరోష్ జంటకు అండగా ఫ్యాన్స్..
టాలీవుడ్లో ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు సంబంధించిన వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ జంటపై సోషల్ మీడియాలో విడాకుల రూమర్స్ చక్కర్లు కొట్టడంతో తాజాగా వీరిద్దరూ స్పందించారు. తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దంటూ రష్మిక సుదీర్ఘ పోస్ట్ పెట్టగా.. విజయ్ సైతం తన ప్రేమను చాటుకుంటూ భావోద్వేగపూరిత సందేశాన్ని పంచుకున్నారు. దీంతో ఈ జంట అభిమానులు మరోసారి వారికి మద్దతుగా నిలుస్తున్నారు.నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదురష్మిక తన పోస్ట్‌లో తమ ప్రేమను ఇతరుల అభిప్రాయాలతోనో, ప్రపోజల్స్తోనో కొలవలేరనే విషయాన్ని స్పష్టం చేసింది. మరోవైపు విజయ్ కూడా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ.. ఆమె తనకు భార్య మాత్రమే కాదని, బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఉమెన్ అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి పోస్టులు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో విరోష్ అభిమానులు తమ అభిమాన జంటకు మద్దతుగా నిలుస్తున్నారు. విజయ్, రష్మిక కలిసి ఉన్న పాత వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. ‘నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.(ఇదీ చదవండి: విజయ్ను మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకుంటా.. తప్పేంటి? : రష్మిక మందన్న) #VijayDeverakonda and #RashmikaMandanna reacted to the trolls against them after the recent KWK episode https://t.co/ux3qTTcDJS https://t.co/84DmaHxzkh— The Climax India (@TheClimaxIndia) October 26, 2026 -
తప్పేముంది.. అవసరమైతే విజయ్ ని మళ్లీ పెళ్లి చేసుకుంటా..
-
'ప్రపంచమంతా వ్యతిరేకమైనా కలిసే ఉంటాం': విజయ్ దేవరకొండ
ప్రస్తుతం టాలీవుడ్లో విరోష్ జంట పేరు మార్మోగిపోతోంది. వీరిద్దరిపై సోషల్ మీడియాలో విడాకుల రూమర్స్ రావడంతో ఈ జంట స్పందించారు. ఇప్పటికే రష్మిక తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని సుదీర్ఘ పోస్ట్ చేసింది. తమ ప్రేమను ఎవరు కూడా ప్రపోజల్స్‌తో కొలవలేరని స్పష్టం చేసింది.విజయ్ సైతం తన భార్యపై ప్రేమను చాటుకున్నారు. తను నా భార్య మాత్రమే కాదు.. నా బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ మహిళ అంటూ పోస్ట్ చేశారు. ఆమె నా జీవితంలో అత్యంత అందమైన అధ్యామని.. తన విషయంలో నేను సరైన నిర్ణయం తీసుకున్నానని రాసుకొచ్చారు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని తెలిపారు. ప్రపంచమంతా మాకు వ్యతిరేకమైనా.. నేను, ఆమె ఎప్పటికీ కలిసే ఉంటామన్నారు. మా ప్రేమను గౌరవించేవారికి ప్రేమతో ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. దీంతో వీరిద్దరిపై వస్తున్న ట్రోల్స్‌కు విరోష్ జంట తమదైన స్టైల్లో గట్టిగానే కౌంటరిచ్చారు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) -
ఏందయ్యా సామీ.. ఫుల్ వీడియో సాంగ్ చూశారా?
పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజై ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తున్న సినిమా 'రణబాలి'. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన మూవీ ఇది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రంలో కథ పరంగా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నప్పటికీ రష్మిక-విజయ్ కెమిస్ట్రీ మాత్రం ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. చివరి నిమిషంలోనూ రొమాన్స్)మరీ ముఖ్యంగా వీళ్లిద్దరి మీద తీసిన 'ఏందయ్యా సామీ' అనే పాట అందరికీ తెగ నచ్చేసింది. ఇప్పుడు దీని ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎక్స్టెండెడ్ వెర్షన్‌ని వదిలారు. ఇకపోతే ఈ మూవీ వచ్చే నెల రెండోవారంలో నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: రోహిత్‌తో నువ్వు కూడా అదే ఉద్దేశంతో ఉన్నావా?.. వెక్కి వెెక్కి ఏడ్చిన షాలిని) -
పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే ఇలా తయారయ్యారేంట్రా?
టాలీవుడ్లో మోస్ట్ క్రష్ ఉన్న జంటల్లో విజయ్-రష్మిక ముందుటారు. వీరిద్దరు ఈ ఏడాదిలోనే పెళ్లిపీటలెక్కారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబాల సభ్యలు సందడి చేశారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేక రిసెప్షన్ వేడుక ఏర్పాటు చేశారు విరోష్ జంట. వీరిద్దరు పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి చిత్రం రణబాలి. ఈ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది.ఈ సంగతి పక్కనపెడితే సెలబ్రిటీలపై తరచుగా గాసిప్స్, రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వారి వ్యక్తిగత జీవితాలపై ప్రతి ఒక్కరిలో ఆసక్తి ఉంటుంది. పెళ్లి నుంచి విడాకుల వరకు సెలబ్రిటీలపై ఏదో ఒక సందర్భంలో వార్తలు వస్తుంటాయి. అలా విజయ్- రష్మిక విషయంలోనూ అదే జరుగుతోంది. విరోష్ జంట పెళ్లై ఏడాది కూడా కాలేదు.. అప్పుడే రూమర్స్ మొదలయ్యాయి. పెళ్లై కొన్ని నెలలు కూడా గడవకముందే ఈ జంట విడిపోతోందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మొదలైంది.విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో రష్మికను అన్ ఫాలో చేశాడని కొందరు పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. అసలు విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో అవ్వడం లేదు. కానీ.. రష్మికను మాత్రమే ఫాలో అవ్వడంలేదని.. ఆమెను కొత్తగా అన్ ఫాలో చేసినట్లుగా ఫేక్ ప్రచారం మొదలెట్టారు. దీంతో అసలు మన సమాజం ఎటు పోతోందన్న చర్చ మొదలైంది.ఈ ఫేక్ ప్రచారంపై విజయ్, రష్మిక అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. వీరిద్దరు తమ జీవితాన్ని తమ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తుంటే ఇలాంటి ప్రచారం చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ వివాదంగా మార్చడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. కేవలం సోషల్ మీడియా ఆధారంగా బంధాలను జడ్జ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని సోషల్ మీడియా వేదికగా గడ్డి పెడుతున్నారు.కాగా.. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పెళ్లి ప్రపోజల్ గురించి చర్చ వచ్చినప్పుడు.. రష్మిక తనను పెళ్లి చేసుకోమని వందసార్లు అడిగిందని విజయ్ చెప్పారు. ఆ తర్వాతే పెళ్లికి ఓకే చెప్పానని విజయ్ వెల్లడించారు. దాదాపు ఏడాది పాటు పెళ్లి గురించి ప్రస్తావించిందని విజయ్ తెలిపారు. దీంతో కొందరు విజయ్ను ‘రెడ్ ఫ్లాగ్’ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారనే విషయాన్ని కూడా హాట్ టాపిక్‌గా మార్చేశారు. -
30 రోజుల్లో 20 సినిమాలు.. విజేతలెవరో!
మరో వారంలో అక్టోబరు నెల పూర్తవుతోంది. నవంబరు నెల ఆరంభం కానుంది. ఈ నెలలో దాదాపు 20 సినిమాలకు పైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అంటే... ‘సినిమా మేళా’ అన్నమాట. ప్రత్యేకించి నవంబరు 6న దీపావళి పండగ సందర్భంగా ఒకే రోజు నాలుగు సినిమాలు విడుదలవుతుండటం విశేషం. నవంబరులో రిలీజ్ అవుతున్న సినిమాల్లో పలు తెలుగు స్ట్రయిట్ మూవీస్ ఉండగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ నెలలో రానున్న చిత్రాల్లో రణ్‌బీర్ కపూర్ నటించిన బాలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ ‘రామాయణ పార్ట్ 1’ ఉంది. అలాగే సూర్య, శర్వానంద్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్, ధనుష్, నయనతార, కీర్తీ సురేష్, రష్మిక మందన్నా వంటి స్టార్ హీరో, హీరోయిన్ల చిత్రాలతో పాటు పలువురు యువ హీరోల సినిమాలు కూడా విడుదలకు క్యూ కడుతున్నాయి. తమ క్రేజీ ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమవుతున్న ఆ హీరోలు, హీరోయిన్లు ఎవరు? ఆయా సినిమాలు ఏంటి? వంటి విశేషాలు చూద్దాం... రామాయణం... శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించిన పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ (తెలుగులో ‘రామాయణం’). నితీష్ తివారీ దర్శకత్వంలో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మించారు. ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటించారు. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘రామాయణ పార్ట్ 1’ నవంబరు 5న విడుదలవుతోంది. ఈ మూవీని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన హిందీ చిత్రం ఇది. పౌరాణికం నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో, స్టార్ నటీనటులతో రూపొందిన ఈ మూవీ తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ద్వితీయ భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. సీన్... ‘రామాయణం’ వంటి ప్రతిష్ఠాత్మక సినిమా విడుదలైన మరుసటి రోజు 6న దీపావళి కానుకగా ‘సీన్, మహాశక్తి, సమ్మర్ హాలిడేస్, హతః’ వంటి చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. పై సినిమాల్లో ముందుగా చర్చించుకోవాల్సిన చిత్రం ‘సీన్’. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రాన్ని మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆవేశం’ ఫేమ్ డైరెక్టర్ జిత్తు మాధవన్ తెరకెక్కించారు. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించారు. జ్యోతిక, సూర్య కలిసి అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మించిన ఈ తమిళ చిత్రానికి జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. యాక్షన్–కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం 6న విడుదల కానుంది. ఈ మూవీని ఆంధ్రప్రదేశ్– తెలంగాణలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎన్వీఆర్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తోంది. ఈ నగరానికి ఏమైంది రిపీట్... విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’. ప్రియదర్శిని రామ్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఇతర పాత్రల్లో నటించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా నవంబరు 13న రిలీజ్ అవుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ 2018లో విడుదలై, కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన మూవీ ‘ఈఎన్ఈ రిపీట్’. తొలి భాగంలో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి... గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.మహాశక్తి... దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్‌గా దూసుకెళుతున్న నయనతార ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. సుందర్ .సి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రెజీనా, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్లో ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ చిత్రం ‘మహాశక్తి’ పేరుతో 6న తెలుగులో విడుదల కానుంది. భక్తి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీలో నయనతార అమ్మవారిగా కనిపించనున్నారు. ఆమె నటించిన ‘మూకుత్తి అమ్మన్’ 2020 నవంబరు 14న విడుదలై, హిట్‌గా నిలిచంది. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిన ‘మహాశక్తి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సమ్మర్ హాలిడేస్... మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో, వాసుకి, రాజీవ్ కనకాల, హర్షిణి ముఖ్య పాత్రలు పోషించిన చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. శ్రీకర్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్పై ధీరజ్ మొగిలినేని నిర్మించారు. బాలల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని తొలుత అక్టోబరు 2, ఆ తర్వాత అక్టోబరు 30న విడుదల చేయాల్సి ఉండగా చివరకు నవంబరు 6న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. పేరుకి ఇది చిన్న పిల్లల సినిమా అయినప్పటికీ పెద్దలు కూడా చూసేలా ఉంటుందని, వారికి తమ బాల్యం గుర్తొస్తుందని నిర్మాత ధీరజ్ మొగిలినేని తెలిపారు. హతః కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘హతః’. అనుష్ గోరక్ దర్శకత్వంలో కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై కిరణ్ అబ్బవరం, శివశంకర నాయుడు. వై నిర్మించారు. ఈ సినిమా కూడా 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గోట్... సుడిగాలి సుధీర్ హీరోగా, దివ్యభారతి హీరోయిన్గా నటించిన చిత్రం ‘జీ.ఓ.ఏ.టీ’(గోట్). (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) అనేది ఉపశీర్షిక. వేదవ్యాస్ దర్శకత్వంలో మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణవ్ ప్రొడక్షన్స్‌పై మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. బ్రహ్మాజీ, నితిన్ ప్రసన్న ఇతర పాత్రలు పోషించారు. వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రం పలుమార్లు రిలీజ్ వాయిదా పడి. ఫైనల్‌గా నవంబరు 12న విడుదలకానుంది.దొంగ నా కొడుకు... ‘లిటిల్ హార్ట్స్’ మూవీ ఫేమ్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దొంగ నా కొడుకు’. ఈ సినిమాతో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ నిర్మించారు. కడుపుబ్బా నవ్వించే క్రైౖమ్ కామెడీగా రూపొందిన ఈ సినిమా నవంబరు 13న విడుదలవుతోంది. ‘లిటిల్ హార్ట్స్’ వంటి హిట్ మూవీ తర్వాత మౌళి తనూజ్ ప్రశాంత్ నటించిన ‘దొంగ నా కొడుకు’పై యువతలో క్రేజ్ నెలకొంది.టాల్కమ్ పౌడర్... ‘పెళ్ళిచూపులు’, ‘మెంటల్ మదిలో’, ‘చూసీ చూడంగానే’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి నిర్మించిన తాజా చిత్రం ‘టాల్కమ్ పౌడర్’. శివ కందుకూరి హీరోగా, ద్రిషికా చందర్ కథానాయికగా నటించారు. సాయినాథ్ మున్నా రచన, దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందింది. ఈ సినిమాలో వెంకటేష్ మహా, జీవన్ కుమార్, కృష్ణ కమల్, రూ΄ా లక్ష్మి, సంజయ్ స్వరూప్, యోగి ఖత్రి, నాగమహేష్, శివాని మహి కీలక పాత్రలు పోషించారు. న్యూ ఏజ్ క్రైౖమ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 13న విడుదల కానుంది.∙ఆకాశంలో ఒకతార... దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. అలాగే హీరోయిన్ శ్రుతీహాసన్ ప్రధాన పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా బ్యానర్‌పై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ మూవీ నవంబరు 20న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. ‘‘వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో బహు భాషా నటుడిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు దుల్కర్ సల్మాన్. ఆయన నటించిన మరో డిఫరెంట్ మూవీ ‘ఆకాశంలో ఒక తార’. చక్కని కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు పవన్ సాధినేని. ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ఈ సినిమా ప్రత్యేకమైన, గుర్తుండిపోయే ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.సత్యవాన్ సావిత్రి... హీరోయిన్ కీర్తీ సురేశ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ‘రౌడీ జనార్ధన’, ‘జనవరి 12 విడుదల’ వంటి పలు సినిమాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’. ఈ చిత్రం ద్వారా ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నటుడు, దర్శకుడు మిస్కిన్, చారుకేష్, బాల శరవణన్, శిల్పా మంజునాథ్, మధుసూదనన్, ఆర్. సుందరరాజన్, బ్రిగిడా, మాలా ΄ార్వతి, ఎ. వెంకటేష్ తదితరులు ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వేదికకారన్‌పట్టి ఎస్. శక్తివేల్ నిర్మించారు. జీ స్టూడియోస్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ పలుమార్లు రిలీజ్ వాయిదా పడి, ఫైనల్‌గా నవంబరు 20న తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది. కోర్ట్‌రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో లాయర్ పాత్ర పోషించారు కీర్తీ సురేశ్. ఓమ్...ధనుష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఓం చాప్టర్ 1– ఉదిరమ్: ది బ్లడ్ ఉడ్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి, శ్రీలీల హీరోయిన్లుగా నటించగా, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా కీలక పాత్రలు పోషించారు. వండర్‌బార్ ఫిల్మ్స్‌పై ధనుష్ స్వయంగా నిర్మించిన ఈ సినిమా తొలుత అక్టోబరు 16న రిలీజ్ కావాల్సి ఉండగా రజనీకాంత్‌గారి ‘జైలర్–2’ సినిమా అక్టోబరు 15న విడుదల కానుండటంతో వాయిదా వేశారు ధనుష్. భారీ బడ్జెట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం నవంబరు 20న ప్రేక్షకులముందుకు వస్తోంది. ధనుష్–మమ్ముట్టి– నసీరుద్దీన్ షా, సాయిపల్లవి, శ్రీలీల వంటి యాక్టర్స్ నటించిన ఈ సినిమాపై దక్షిణాదిలో క్రేజ్ నెలకొంది.మైసా... ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్స్‌తో దూసుకెళుతున్నారు హీరోయిన్ రష్మికా మందన్న. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్ ఇతర పాత్రలు పోషించారు. అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీ నవంబరు 27న రిలీజ్ అవుతోంది. ‘‘రష్మిక నటించిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’. ఈ చిత్రంలో రష్మిక గోండ్ గిరిజన యువతి పాత్రలో నటించారు. ఈ చిత్రం కోసం రెండు రోజుల పాటు దాదాపు 20 గంటల పాటు నీటిలో ఉండి అత్యంత క్లిష్టమైన అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్‌ను పూర్తి చేశారు. భారతీయ సినీ చరిత్రలో ఓ కథానాయిక స్వయంగా చేసిన మొట్టమొదటి అండర్‌వాటర్ ఫైట్ సీక్వెన్స్ ఇదే. ఈ సన్నివేశం సినిమాలోనే అత్యంత హైలైట్‌గా నిలవనుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.హైందవ... బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, సంయుక్త హీరోయిన్గా నటించిన చిత్రం ‘హైందవ’. మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను ఇతర పాత్రలు పోషించారు. లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో శివెన్ రామకృష్ణ సమర్పణలో మూవీ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేశ్ చందు నిర్మించారు. ఈ సినిమా నవంబరు 27న రిలీజ్ కానుంది. ‘‘దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ ‘హైందవ’. విగ్రహాలకు, ఒక ΄ోలీస్ ఆఫీసర్‌కు మధ్య ఎలాంటి కథ జరుగుతుందనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ కోసం నటీనటులు బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టారు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక అద్భుతమైన, గొప్ప అనుభూతినిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. పైన పేర్కొన్న సినిమాలే కాదు.. మరికొన్ని సినిమాలు కూడా నవంబరు నెలలోనే ప్రేక్షకులముందుకు వచ్చేందుకు వరుసలో ఉన్నాయి. -
'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)
-
అర్ధరాత్రి బన్నీకి ఫోన్.. లేచే ఉన్నావా అన్నా..: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ స్టార్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బయటపడింది. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఆసక్తికరమైన ఫోన్ కాల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ షోలో భాగంగా నిర్వహించిన గేమింగ్ రౌండ్లో సెలబ్రిటీ స్నేహితుడికి ఫోన్ చేయాలని విజయ్ దేవరకొండకు టాస్క్ ఇచ్చారు. దీంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా అల్లు అర్జున్‌కు కాల్ చేశారు. అప్పుడు సమయం రాత్రి 11.40 గంటలు. అయినప్పటికీ బన్నీ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి విజయ్‌తో మాట్లాడారు.బన్నీ అన్నా.. నిద్ర లేచే ఉన్నారా?ఈ క్రమంలో ‘బన్నీ అన్న.. నిద్ర లేచే ఉన్నారా?’ అని విజయ్ అడగ్గా.. ‘లేచే ఉన్నాను’ అని అల్లు అర్జున్ సమాధానమిచ్చారు. ఇంత రాత్రి సమయంలో ఫోన్ చేయడానికి గల కారణాన్ని విజయ్ సరదాగా వివరించారు.‘నేను కాఫీ విత్ కరణ్ షోలో ఉన్నాను. వీళ్లకు టైమ్ సెన్స్, సందర్భం అసలేమీ లేదు. రాత్రి 11.40 గంటలకు ఎవరికైనా ఫోన్ చేయమన్నారు. నన్ను ఇష్టపడే వారిలో ఈ సమయంలో ఫోన్ చేస్తే తిట్టకుండా ఎవరు లిఫ్ట్ చేస్తారా అని ఆలోచించాను. ఇండస్ట్రీలో మనల్ని ప్రేమించేవాళ్లు ఎవరు ఉన్నారు? ఎవరితో అంత చనువు ఉంది? అని అనుకుని మొదట మీకే కాల్ చేశాను’ అని విజయ్ తెలిపారు.అల్లు అర్జున్ నవ్వుతూదీనికి అల్లు అర్జున్ నవ్వుతూ స్పందించారు. ‘ఇట్స్ ఓకే.. పర్వాలేదు. నువ్వు కాల్ చేయడం చాలా స్వీట్’ అంటూ విజయ్‌తో అన్నారు. ఆ తర్వాత కరణ్ జోహార్, రష్మిక మందన్నతోనూ బన్నీ మాట్లాడారు. ఈ సంభాషణతో షోలో సందడి నెలకొంది.కాగా హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా కానుకగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విడుదల రోజున మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి వసూళ్లను రాబడుతోంది.(ఇదీ చదవండి: ఈ ట్విస్ట్ మెసేజ్ చేస్తే రూ.కోటి ఇస్తా..: స్టార్ డైరెక్టర్)Calling him Bunny Anna on #KoffeeWithKaran shows that brotherly bond ❤️🔥 #AlluArjun Anna, we know you’re busy with your shoot, but when you get a moment, please watch #Ranabaali. Your favourite @TheDeverakonda has poured his heart, soul & immense hard work into this film. ❤️🔥 It would means the Lots Of World to us 🫂❤️ #VijayDeverakonda https://t.co/SvFSz8RbJM— Vijay Deverakonda Fans Club (@VJDeverakondaFC) October 21, 2026 -
మిక్స్డ్ టాక్‌తోనూ ‘రణబాలి’కి భారీ వసూళ్లు!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దసరా కానుకగా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు విడుదల రోజున మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, వసూళ్లపై మాత్రం పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. టాక్‌తో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న స్టార్ పవర్‌కు ప్రేక్షకుల ఆదరణ తోడవడంతో ‘రణబాలి’ బాక్సాఫీస్ వద్ద తన జోరు కొనసాగిస్తోంది.మిశ్రమ టాక్ ఉన్నప్పటికీ ‘రణబాలి’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. అయితే ఈ వసూళ్లకు సంబంధించిన అధికారిక లెక్కలు వెలువడాల్సి ఉంది. మొత్తానికి, విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న జంటకు ఉన్న క్రేజ్, దసరా సెలవులు ‘రణబాలి’కి బాక్సాఫీస్ వద్ద కలిసొస్తున్నాయి. రానున్న రోజుల్లో సినిమా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ఈవెన్ సాధించి లాభాల బాట పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
అవును..నా యాస ఇలానే ఉంటుంది : ట్రోలింగ్‌పై రష్మిక స్ట్రాంగ్ కౌంటర్
పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. అలాగే సినీ తారల్లో తప్పులే వెతికేవారికి వాళ్లు చేసే ప్రతి పనిలోనూ నెగెటివిటీనే కనిపిస్తుంది. చిన్న విషయాన్ని సైతం పెద్దది చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతుంటారు. అలా రష్మిక విషయంలోనూ జరుగుతోంది. ఆమె యాసను హేళన చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతుందని హేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై రష్మిక స్పందించింది. తను దక్షిణాది నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి..సహజంగానే తనలో ఆ యాస ఉంటుందని చెప్పింది. తాజాగా భర్త విజయ్ దేవరకొండతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో పాల్గొన్న ఆమె.. తన యాసపై వచ్చిన ట్రోల్ గురించి మాట్లాడుతూ.. ‘ఇలాంటి విమర్శలను తాను ఎన్నో చూశానని.. వాటి కారణంగా తనను తాను ఎప్పుడూ హద్దులు విధించుకోవాలని ఆలోచించలేదని చెప్పింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగితే.. అప్పుడు ఓకే చేశా: విజయ్ దేవరకొండ)‘నేను సౌత్ యాసలో మాట్లాడుతున్నానని ట్రోల్ చేస్తున్నారు. అది నిజమే.. నేను దక్షిణాది నుంచి వచ్చాను. అందుకే నాలో ఆ యాస సహజంగానే ఉంటుంది. అలా కాకుండా మరోలా మాట్లాడాలనుకోవడం సమంజసం కాదు. ఇలాంటి ట్రోల్ నాకు కొత్తేమి కాదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నా మాట, నటన, యాస..ఇలా దేనిని వదలడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. వారి కోసం నాకొచ్చిన అవకాశాలను మిస్ చేసుకోవాలనుకోలేదు’ అని రష్మిక అన్నారు. -
పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగితే.. అప్పుడు ఓకే చేశా: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్లో విజయ్ దేవరకొండ-రష్మిక జంట ఒకటి. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ స్టార్ జంట.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కలిసి నటించిన తొలి సినిమా ‘రణబాలి’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్, రష్మిక ఇద్దరు.. వేరు వేరుగా పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.అయితే పెళ్లి తర్వాత జంటగా కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా తమ లవ్‌స్టోరీ,పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. పెళ్లికి ముందు రష్మికకు ప్రత్యేకంగా ప్రపోజ్ చేయలేకపోయానని విజయ్ చెప్పారు. అంతేకాదు పెళ్లి ప్రపోజల్ కూడా తొలుత రష్మికనే చేసిందట. ‘రొమాంటిక్ విషయాలు ప్లాన్ చేయడంలో నేను వీక్. కానీ నా వల్ల రష్మిక ఓ అందమైన మూమెంట్ మిస్ కాకూడదని ప్రత్యేకంగా ప్రపోజ్ చేద్దామనుకున్నా. ఇద్దరం కలిసి ఇటలీ వెళ్లినప్పుడు ఆమెకు సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశా. అయితే సరైన ఉంగరం దొరకలేదు. దీంతో అక్కడ ప్రపోజ్ చేయలేకపోయా. కానీ పెళ్లికి ముందు నిర్వహించిన సంగీత్‌లో మాత్రం రష్మికకు నేనే ప్రపోజ్ చేశా. స్నేహితులందరి సమక్షంలో మోకాళ్లపై నిలబడి పెళ్లి చేసుకోవాలని కోరాను. ఆ క్షణాలు ఆమె జీవితంలో ఎప్పటికీ గుర్తిండిపోతాయి’ అని విజయ్ అన్నారు. ఇక ఇద్దరిలో పెళ్లి ప్రపోజ్ ముందుగా చేసిందెవరని హోస్ట్ అడగ్గా.. రష్మికనే అని విజయ్ బదులిచ్చాడు. ‘నేను ఒకే చేసేలోపే వందసార్లు అడిగేసింది’అని విజయ్ చెప్పడంతో పక్కనే ఉన్న రష్మిక నవ్వుతూ.. ‘అవును, నేను నిజంగానే పెళ్లి కోసం ఆయన్ని ఒప్పించడానికి ఏడాది పాటు అడుగుతూనే ఉన్నాను’ అని అనడంతో. ‘చూశారా.. తనే నన్ను వందసార్లు అడిగింది. అందుకే నేను ఓకే చెప్పాను. నేనేం అంత బ్యాడ్ పర్సన్‌ని కాదు’ అంటూ విజయ్ నవ్వులు పూయించారు.(ఇదీ చదవండి: రెగ్యులర్ ముఖాలంటూ పక్కన పెడుతున్నారు: రజిత) -
విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)
-
దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)
-
Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు
-
విజయ్-రష్మిక కెరీర్లో మైల్స్టోన్ మూవీగా ‘రణబాలి’
టాలీవుడ్లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటించిన మూవీ ‘రణబాలి’. వీరిద్దరి కలయికలో రూపొందిన మూడో చిత్రమిది. ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి షోకు సినిమాకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ‘రణబాలి’లో కనిపించడం ప్రధాన ఆకర్షణ. కథానాయకుడిగా తన ఇమేజ్‌కు పరిమితం కాకుండా, నటుడిగా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని రణబాలి చిత్రం మరోసారి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా పాత్ర కోసం ఆయన చూపించిన డెడికేషన్, తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం సినిమాకు ప్రత్యేకతని తీసుకొచ్చాయి.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)‘రణబాలి’ విజయ్‌లోని నటుడిని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలుస్తోంది. మరోవైపు రష్మికతో విజయ్ దేవరకొండ జోడీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలయికకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సినిమా చుట్టూ కొనసాగుతున్న చర్చలు ‘రణబాలి’కి అదనపు ఆకర్షణగా మారింది.మొత్తంగా చూస్తే ‘రణబాలి’ విజయ్ దేవరకొండ కెరీర్లో మరో భిన్నమైన ప్రయత్నం. మూస పాత్రలకు దూరంగా వెళ్లి కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే ఆయన ప్రయత్నం మరోసారి సక్సెస్ అయ్యింది. నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండ, రష్మికలకు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిందనటంలో సందేహం లేదు.ఇకపోతే హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. స్టార్ జంట వేడుకల్లో పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ.. వివాహానంతరం తనకు ఇదే తొలి బతుకమ్మ పండుగ అని రష్మిక మందన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో విరోష్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ) -
హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)
-
ఆ ప్రశాంతతని మాటల్లో వివరించలేను.. రష్మిక ఎమోషనల్ పోస్ట్
విజయ్ దేవరకొండ-రష్మిక దంపతులు రెండు మూడు రోజుల క్రితం పుట్టపర్తి వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ ప్రదేశానికి వెళ్లొచ్చిన తర్వాత తాను పొందిన అనుభూతిని రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంది. పోస్ట్ పెట్టి భావోద్వేగానికి గురైంది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)'ఇన్నేళ్లుగా విజయ్(విజయ్ దేవరకొండ) ఎక్కడ పెరిగారు? ఎక్కడ చదువుకున్నారు? ఆయన పాఠశాల రోజులు ఎలా ఉండేవి? అనే విషయాలని ఎన్నో కథల రూపంలో విన్నాను. విజయ్ స్నేహితులందరూ పుట్టపర్తిలో చదువుకున్నారు. అందుకే వాళ్లని ఎప్పుడూ ‘పర్తి బాయ్స్’, ‘పర్తి గర్ల్స్’ అని పిలిచేదాన్ని. వాళ్లంతా నాకూ స్నేహితులు అయిపోయారు. ఇన్నాళ్లు పుట్టపర్తి గురించి ఎన్నో విషయాలు విన్నప్పటికీ, అక్కడికి వెళ్లలేకపోయానని అనిపించేది''చివరకు పుట్టపర్తిని సందర్శించే అందమైన అవకాశం లభించింది. విజయ్‌తో పాటు ఆయన స్నేహితులు చదువుకున్న పాఠశాలని, తరగతి గదులని, వసతి గృహాలని చూసే అవకాశం కలిగింది. అక్కడ ఎంతోమంది మంచి వ్యక్తులను కలవడంతో పాటు, హెచ్ఎం ఆంటీని కూడా కలిశాను. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు నాకు కలిగిన ప్రశాంతత మాటల్లో వివరించలేను. అక్కడి వాతావరణం నా మనసుకు ఎంతో ప్రశాంతత ఇచ్చింది'(ఇదీ చదవండి: కావ్య మారన్‌తో అనిరుధ్ పెళ్లి.. పదేళ్ల క్రితమే 'ఆమె' చెప్పింది)'విజయ్, ఆనంద్‌తో పాటు పుట్టపర్తి విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల్లో ప్రేమ, దయ, మానవత్వం వంటి విలువలు ఇంత బలంగా ఉండటానికి కారణమేంటని నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని. వారు చదువుకున్న పాఠశాలకు వెళ్లిన తర్వాత ఆ విలువలు ఎక్కడి నుంచి వచ్చాయో కొంతవరకు అర్థమైంది. చిన్నతనంలో మనం పెరిగే వాతావరణం, మనతో కలిసి సమయం గడిపే వ్యక్తులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నేర్పించే పాఠాలు మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చిన్నారులు ఎంతో భక్తిశ్రద్ధలతో వేదాలు, భజనలు పాడటం, శ్లోకాలను నేర్చుకుని మనస్ఫూర్తిగా పఠించడం నన్ను ఎంతగానో కదిలించింది''నా జీవితంలోని ఈ సమయంలోనే పుట్టపర్తిని సందర్శించాలని స్వామి కోరుకున్నారేమో. అందుకే ఈ ప్రయాణానికి ఇదే సరైన సమయం. కొన్ని ప్రదేశాలు మనకు తెలియకుండానే ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. మనకు ఇష్టమైన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారో, వారు పెరిగిన వాతావరణం ఏమిటో తెలుసుకున్నప్పుడు వారిని మరింత లోతుగా అర్థం చేసుకోగలుగుతాం' అని రష్మిక తన అనుభూతిని పంచుకుంది. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి.. ఏడాది తిప్పించుకున్న విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
రష్మికతో పెళ్లి.. ఏడాది తిప్పించుకున్న విజయ్ దేవరకొండ
టాలీవుడ్ ప్రేమజంట రష్మిక-విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. భార్యభర్తలుగా కలిసి సినిమా కూడా చేశారు. అదే 'రణబాలి'. ఈ వీకెండ్ థియేటర్లలోకి వచ్చింది. మూవీ ప్రమోషన్లలో భాగంగా తెగ తిరిగేస్తున్న ఈ జంట.. తన పెళ్లి ప్రపోజల్ స్టోరీ ఏంటనేది బయటపెట్టింది. స్వయంగా రష్మిక జరిగిందంతా చెప్పింది.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)'రణబాలి' ప్రమోషన్లలో భాగంగా 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో విజయ్-రష్మిక పాల్గొన్నారు. ప్రపోజల్ ఏమైనా చేసుకున్నారా? అని హోస్ట్ కరణ్ జోహర్ అడగడంతో.. విజయ్ జరిగింది చెప్పాడు. రష్మిక వచ్చి పెళ్లి చేసుకుందాం అని అడిగిందని.. కానీ నేనే 100 సార్లు అడగమని చెప్పినట్లు పేర్కొన్నాడు. పక్కనే ఉన్న రష్మిక దీని గురించి మాట్లాడుతూ.. పెళ్లి కోసం విజయ్ ఏకంగా ఏడాదిపాటు తనని తిప్పించుకున్నాడని చెప్పుకొచ్చింది.ఇక రష్మిక కాకుండా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయిన మరో హీరోయిన్ ఎవరు? అని విజయ్‌ని కరణ్ అడగ్గానే.. 'ఎవరూ కాదు' అని పక్కనే ఉన్న రష్మిక చెప్పింది. దీంతో స్పందించిన విజయ్.. భార్య ఏం చెబితే అదే ఫైనల్ అని రష్మికని ఫాలో అయిపోయాడు. ఇలా ప్రోమో సరదాగా సాగిపోయింది. ఇక ఈ షో ఫుల్ ఎపిసోడ్.. వచ్చే బుధవారం అంటే అక్టోబర్ 21న హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.(ఇదీ చదవండి: అందంగా ఉన్నా గానీ భయపడ్డా: హీరోయిన్ నివేదా థామస్) -
‘రణబాలి’పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ
ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని దర్శక–నిర్మాత సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మకా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘రణబాలి’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలైంది. ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వీక్షించి, తన స్పందనను ‘ఎక్స్’ వేదికగా ఆయన తెలిపారు.(చదవండి: రణబాలి మూవీ రివ్యూ)‘‘విజయ్... నీ యాక్షన్, ఫెరోషియస్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉన్నాయి. సిల్వర్ స్క్రీన్‌పై నీ ఫైట్స్ చూస్తుంటే ఆ ఇంటెన్సిటీ ఫీల్ అయ్యాం. ఇకపై ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే నీ గురించే చెప్పుకుంటారు. కంగ్రాట్స్ విజయ్... ప్రేక్షకులు ‘రణబాలి’ చిత్రాన్ని విజయ్ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ కోసం చూడాలి. జయమ్మ పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. ఆమె పాత్ర ఎంతో రియలిస్టిక్ ఫీల్‌ను కలిగించింది. అజయ్ – అతుల్ మ్యూజిక్ మరో హైలైట్ గా నిలిచింది. చరిత్ర నుంచి ఇలాంటి ఒక నేపథ్యాన్ని ఎంచుకుని సినిమాగా రూపొందించిన డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. పాఠ్యపుస్తకాల్లో చెప్పని చారిత్రక అధ్యాయాన్ని ‘రణబాలి’ చూపించింది’’ అని సందీప్‌రెడ్డి వంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. (చదవండి: 'రణబాలి' జంట దుర్గమ్మ దర్శనం)అలాగే సందీప్ రెడ్డి వంగాకు విజయ్ దేవరకొండ ‘ఎక్స్’ వేదికగానే బదులు ఇచ్చారు. ‘‘వంగా... నువ్వు సినిమా చూశావు... నీ రివ్యూను చెప్పావు. మన కాంబినేషన్లో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రీమియర్స్ తర్వాత మన హగ్, నీ వాయిస్ నాకు ఇంకా గుర్తుంది. పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే ఫీలింగ్ కలిగింది. ‘రణబాలి’ సినిమా నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఈ సినిమాపై నువ్వు ఇలా స్పందించడం నాకు చాలా కిక్ ఇచ్చింది’’ అని విజయ్ దేవరకొండ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ఆనందం ఉప్పొంగుతోంది: రష్మికా మందన్నా ఈ సంగతి ఇలా ఉంచితే...రణబాలి సినిమాలో జయమ్మ పాత్రను పోషించడం పట్ల రష్మిక మందన్నా ఓ సుధీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా షేర్ చేశారు. ‘‘జయమ్మ..ఆమె ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఓ మహిళగా ఉండటమంటే ఏంటో ఆమె నాకు నేర్పింది. తన ప్రజల కోసం నిలవడం, తన వారిని కాపాడుకోవడం, ప్రేమను పంచడం..ఇదే నిజమైన స్త్రీతత్వానికి అర్థమని తెలిపింది. మన సామాజిక శక్తిని, దేవుడిపై విశ్వాసాన్ని, సమష్టిగా పోరాడే స్ఫూర్తిని ‘రణబాలి’ సినిమా చాటిచెబుతోంది. ఇక దర్శకుడు రాహుల్ కృషికి ప్రశంసలు వస్తుంటే చాలా ఆనందంగా ఉంది. విజయ్...నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను. ఇప్పుడూ చెబుతున్నాను. నువ్వు కష్టపడే గుణానికి నేను నీకు అభిమానిని. ఇప్పుడు నీ కష్టాన్ని అందరు మెచ్చుకుంటుంటే నాలో ఆనందం ఉప్పొంగుతోంది. ఇప్పటికే ‘రణబాలి’ సినిమా చూసిన వారికి నా ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రేమ తో..మీ జయమ్మ..’ అంటూ రష్మిక మందన్నా స్పందించారు. -
అందంగా సారా అర్జున్.. పద్ధతిగా 'రణబాలి' జయమ్మ
అందంగా 'ధురంధర్' సారా అర్జున్'రణబాలి' జయమ్మ జ్ఞాపకాలతో రష్మికగ్లామర్ చూపించేస్తున్న 'జైలర్ 2' నటి ఆపేక్షకాలిఫోర్నియా ట్రిప్ వేసిన తృప్తి దిమ్రిజైలర్ షూటింగ్ జ్ఞాపకాలతో నోరా ఫతేహిమాల్దీవుల్లో బికినీతో బ్యూటీ ఖుషీ కపూర్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Apeksha Porwal (@apeksha_porwal) View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Sara Arjun (@saraarjunn) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Saniya (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సేవలో విజయ్-రష్మిక
'రణబాలి' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన విజయ్ దేవరకొండ-రష్మిక అలరిస్తున్నారు. ఇక రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో చెప్పినట్లే ప్రేక్షకుల్ని కలిసేందుకు వస్తామని విజయ్ అన్నాడు. ఇప్పుడు తొలుత విజయవాడ వచ్చాడు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మని భార్య రష్మికతో కలిసి దర్శించుకున్నాడు.(ఇదీ చదవండి: 'జైలర్ 2' సినిమాలో షో స్టీలర్.. ఎవరీ మూర్తి?)దర్శనానంతరం మాట్లాడుతూ.. 'అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మా సినిమా 'రణబాలి'ని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇక్కడికి వచ్చాం. అందరికీ దసరా శుభాకాంక్షలు' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహించిన 'రణబాలి' సినిమాలో బ్రిటీషర్లని ఎదురించిన రాయలసీమ వీరుడు సింగనమల రణబాలి జీవితాన్ని చూపించారు.(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)(ఇదీ చదవండి: ‘రణబాలి’ తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?)The #Ranabaali pair at the Kanaka Durga Temple in Vijayawada ✨ Book your tickets now! 🎟️ https://t.co/ux77cy5vha #Ranabaali #ConqueringCinemas https://t.co/PrQwc17OmM— RANABAALI (@RanabaaliFilm) October 17, 2026 -
'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)
-
‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రణబాలి.. ఈరోజు అదే నిజమైంది: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'రణబాలి' థియేటర్లలోకి వచ్చేసింది. పీరియాడికల్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. అయితే ఈ మూవీకి మిశ్రమ స్పందన ఓవైపు వినిపిస్తుండగా మరోవైపు టీస్, ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో మాట్లాడిన తాను చెప్పిందే ఇప్పుడు చిత్ర ఫలితం విషయంలో జరిగిందని పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)'తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుందని ముందే చెప్పాను. ఈరోజు 'రణబాలి'తో అదే నిజమైంది. మేం ఈ మూవీని మొదలుపెట్టినప్పుడు హిట్ కొట్టాలనో, పెద్ద నంబర్స్ చేయాలనో చేసినదైతే కాదు. ఇదొక చాలా ఇంపార్టెంట్ సినిమా. రేపొద్దున నేను 25-30 సినిమాలు చేసిన తర్వాత ఇది నాకు గుర్తుండిపోతుంది' అని విజయ్ దేవరకొండ అన్నాడు.ఇందులో విజయ్ దేవరకొండ.. బ్రిటీషర్లపై తిరగబడ్డ సింగనమాల రణబాలి అనే వీరుడి పాత్రలో కనిపించాడు. ఇతడి భార్య జయమ్మగా రష్మిక చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన తొలి చిత్రం కావడంతో అభిమానులు తెగ ఎదురుచూశారు. ఈ జంటని తెరపై చూసి మురిసిపోతున్నారు.(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ) -
'రణబాలి' సినిమా.. థియేటర్లకు టీమ్ రిక్వెస్ట్
పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా 'రణబాలి'. తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్.. థియేటర్ల యజమానులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)ప్రస్తుతం సినిమాలని 5.6 లెవల్లో ఆడియో(సౌండ్) ప్లే చేస్తున్నారు. అయితే 'రణబాలి' కోసం 6 లేదా 6.6 లెవల్‌కి పెంచితే మంచి థియేట్రికల్ అనుభూతి కలుగుతుందని టీమ్ పోస్ట్ పెట్టింది.ఇకపోతే స్వాతంత్ర్యం రాకముందు రాయలసీమలో బ్రిటీషర్లు సాగించిన అరాచకాల బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తీశారు. ఇందులో ప్రజల కోసం పోరాడే వీరుడు రణబాలిగా విజయ్ దేవరకొండ కనిపించగా, ఇతడి భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించింది. వీళ్లిద్దరూ జంట బాగుందనే ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ఈ మూవీ అసలు రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by RANABAALI FILM (@ranabaalifilm) -
రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!
-
‘రణబాలి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: రణబాలి నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా, ఆర్నాల్డ్ వోస్లూ, ఈశ్వరీరావు తదితరులునిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్దర్శకుడు: రాహుల్ సంకృత్యాన్సంగీతం: అజయ్–అతుల్ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: అక్టోబర్ 16, 2026కథేంటంటే.. 1876–78 మధ్యకాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో వచ్చిన భయంకరమైన కరువు నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మద్రాసుకు కొత్తగా వచ్చిన కమిషనర్(ఆర్నాల్డ్ వోస్లూ)..అధికారులకు కొత్త కండీషన్ పెడతారు. ఇక్కడ పండించిన ప్రతి గింజా బ్రిటన్‌కు వెళ్లాల్సిందేనని ఆదేశిస్తాడు. ఎదురు తిరిగిన వాళ్లను దారుణంగా చంపేస్తాడు. ధాన్యాన్ని దేశం దాటించడానికి రైల్వే పనులు ప్రారంభిస్తాడు. కరువు సృష్టించి.. అక్కడ ప్రజలను పనికి వచ్చేలా చేస్తాడు. ఈ విషయం రాయలసీమ ప్రాంతానికి చెందిన పాలెగాడు సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) దృష్టికి వెళ్తుంది. భద్రమల్లన్న స్వామి ఆయుష్షుతో పెరిగిన రణబాలి.. బ్రిటీష్ పాలకులకు ఎలా ఎదురుదిరిగాడు? తినడానికి తిండిలేక అతి భయంకరమైన కరువుతో బాధపడుతున్న ప్రజలకు ఎలా అండగా నిలిచాడు? కరువుకు కారణమైన మద్రాసు కమిషనర్ని ఎలా అంతం చేశాడు? ఈ కథలో జయమ్మ(రష్మిక) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. బ్రిటిష్ పాలనలో దేశ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు.వాళ్లు చేసిన అరచకాలు అంతా ఇంత కాదు. అందులో కొన్ని మాత్రమే బయటి ప్రపంచానికి తెలిశాయి. చాలా వరకు చరిత్రలో లేకుండా చేశారు. అలా చరిత్రలో లేకుండా చేసిన కొన్ని సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ఈ రణబాలి. 1876–78 మధ్యకాలంలో మద్రాసు ప్రాంతంలో అతిపెద్ద కరువు వచ్చిందన్న విషయం మాత్రమే చరిత్రలో ఉంది. అయితే ఆ కరువుకు గల కారణం.. చావుల సంఖ్య విషయంలో సృష్టత లేదు. ఈ సినిమాలో ఆ కరువు కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూనే దానికి గల కారణాన్ని వివరించారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన పోరాటాల నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి. అయితే వాటిల్లో ఎక్కువగా హీరో వీరత్వాన్ని మాత్రమే చూపించారు. కానీ రణబాలిలో మాత్రం ప్రజలు ఎందుకు తిరగబడాల్సి వచ్చింది? వాళ్లకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చూపించారు. అయితే నేరేషన్ అనేది పూర్తిగా ఇబ్బంది పెట్టింది. ప్రతీ విషయాన్నీ డీటైల్డ్ గా చెప్పాలన్న ఉద్దేశంతో నిడివి పెంచుకొంటూ పోయాడు.దర్శకుడు ఎంచుకున్న కథలో విషయం ఉంది. బాగానే రిసెర్చ్ చేసి స్టోరీ రాసుకున్నాడు. డాక్యూమెంటరీ అనే ఫీలింగ్ రాకుండా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని సన్నివేశాలను పేర్చాడు. ఈ విషయంలో ఆయనను అభినందించొచ్చు. అయితే కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. టీజర్, ట్రైలర్ చూస్తే.. సినిమా ఎలా సాగుతుందో అర్థమైపోతుంది. దాదాపు సినిమా మొత్తం ఊహకందేలా సాగుతుంది. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. కొన్నీ సీన్లు చూస్తే.. బ్రిటీష్ పాలకులు ఇంతదారణంగా వ్యవహరించారా? అని తిట్టుకుంటాం. మరికొన్ని చోట్ల బాధపడతాం. అయితే స్లో నెరేషన్‌తో పాటు నిడివి ఎక్కువగా ఉండడంతో కొంత సాగదీతగా అనిపిస్తుంది. బుర్రకథ రూపంలో రణబాలి నేపథ్యాన్ని వివరిస్తూ చాలా ఎమోషనల్‌గా సినిమా ప్రారంభం అవుతుంది. ఈశ్వరీరావు పురిటి నొప్పులతో బిడ్డకు జన్మనివ్వడం.. ఆ చిన్నారికి భద్రమల్లన్న తాత నామకరణం పెట్టి.. ఓ షాకింగ్ విషయాన్ని చెప్పడం.. ఇలా మొదటి పావుగంట స్లోగా సాగుతుంది. రణబాలిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్, యాక్షన్ సన్నివేశం కథలో వేగం పుంజుకుంటుంది. ఆ తర్వాత కరువు రాక్షసుడు అంటూ ఆర్నాల్డ్ వోస్లూ పాత్రను పరిచయం చేసి.. అసలు కథను ప్రారంభించాడు. ఒకవైపు బ్రిటీష్ అరచకాలను చూపిస్తూనే మరోవైపు జయమ్మ పాత్రని పరిచయం చేసి.. కొంత ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించాడు. మొదటి రాత్రి రోజు రణబాలి చేసే పనులు.. జయమ్మ రియాక్షన్ నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. విరామం తర్వాత 20 నిమిషాల వరకు కథనం వేగంగా సాగుతుంది. కానీ ఆ తర్వాత కథనం నెమ్మదిస్తుంది. కరువు కష్టాలను పదే పదే చూపించడంతో చూసిన సీన్లను మళ్లీ చూసినట్లుగా అనిపిస్తుంది. గుహలో వచ్చే యాక్షన్ సీన్ మాత్రం అదిరిపోతుంది. ఇలా కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లు ఉన్నాయి కానీ.. కథనం నెమ్మదిగా సాగడంతో అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేవు. ఇక క్లైమాక్స్‌లో భద్రమల్లన్న చుట్టూ సాగే సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి..నిడివి తగ్గిస్తే ఫలితం ఇంకాస్త మెరుగ్గా ఉండేది. ఎవరెలా చేశారంటే..రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ పరకాయ ప్రవేశం చేశాడు. తన ఇమేజ్‌కి దూరంగా ఉన్న పాత్ర ఇది. ఆ పాత్ర కోసం ఆయన పడిన కష్టమంతా తెరపై కనిపించింది. యాక్షన్ సీన్లు మాత్రమే కాదు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. నటుడిగా ఈ సినిమాతో విజయ్ ఓ మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. ఇక జయమ్మ పాత్రకు రష్మిక పూర్తి న్యాయం చేసింది. నిడివి తక్కువగా ఉన్నప్పటికీ.. ఒకటి రెండు బలమైన సీన్లు పడ్డాయి. విజయ్‌తో ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. మద్రాసు కమిషనర్‌గా ఆర్నాల్డ్ విలనిజం బాగానే పండించాడు. ఈశ్వరీరావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. జిష్ను భట్టాచార్జీ, నీరవ్ షా సినిమాటోగ్రఫి ఈ సినిమాకు మరో ప్రధాన బలం. అప్పటి పరిస్థితులను తెరపై చాలా సహజంగా కనిపించేలా చిత్రీకరించారు. అజయ్–అతుల్ నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సరైన బీజీఎం లేకపోవడం వల్లే కొన్ని సీన్లు ఎలివేట్ కాలేకపోయాయి. పాటలు బాగున్నాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్ పనితీరు బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను కట్ చేసి నిడివి తగ్గిస్తే బాగుండేదేమో. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)
-
చీరకట్టులో నేషనల్ క్రష్ రష్మిక (ఫొటోలు)
-
పుట్టపర్తిలో విరోష్ జంట ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్
రణబాలి జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పుట్టపర్తిని సందర్శించారు. అక్కడి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవలే తిరుమల వెళ్లిన వీరిద్దరు.. ఇవాళ పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఈ జంట పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీరిద్దరు పెళ్లి తర్వాత జంటగా కలిసి నటించిన పీరియాడికల్ మూవీ రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రాయలసీమలో దారుణ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీశ్ పాలనలో తలెత్తిన తీవ్ర కరువుతో దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ చీకటి చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు డైరెక్టర్ రాహుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. #VijayDeverakonda and #Rashmika from Puttaparthi. #Ranabaali https://t.co/TPgVVSrlQI— Anonymous (@__GirDhar) October 15, 2026 -
విరోష్ జంట గొప్ప నిర్ణయం.. ఏకంగా 400 కుటుంబాలకు..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. రాయలసీమలో బ్రిటీశ్ కాలంలో జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని.. ఆనాటి దారుణ పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సంగతి పక్కనపెడితే తాజాగా రష్మిక, విజయ్ దంపతులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట తమ గొప్ప మనసును చాటుకున్నారు. ఏకంగా 400 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కుటుంబాలకు మూడు నెలల పాటు సాయం చేస్తామని ప్రకటించారు. అన్నపూర్ణ పేరుతో 400 ఫ్యామిలీస్‌కు పౌష్టికహారం అందజేయనున్నట్లు రష్మిక వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..'మీరు పోషించే పాత్రలలో మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు కొన్ని ఉంటాయి.. మీలో చాలా మంది 'జయమ్మకి, నాకు మధ్య ఏమైనా పోలికలు ఉన్నాయా?' అని అడుగుతూ ఉంటారు. దానికి నా సమాధానం ఉంది. ఇది ఎల్లప్పుడూ నేనే, ఇది ఆమె కూడా.. మీరు నాపై చూపిస్తున్న ప్రేమకు ప్రతిఫలంగా నేను ఎప్పుడూ ఇలాంటివి చేస్తూనే ఉంటా.. కానీ ఎప్పుడూ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాను. ఎందుకంటే, నాకు, నా బృందానికి, మాలో కొందరికి తెలిస్తే చాలు అనుకున్నా. కానీ ఇప్పుడు నేను దీని గురించి బయటపెడుతున్నా.. ఎందుకంటే ఇది మిమ్మల్ని, నా ప్రియమైన వారిని, ఇలాంటిది ఏదైనా చేయడానికి ప్రభావితం చేయగలిగితే.. నేను చాలా సంతోషిస్తాను. నేను ఈ రోజు 400 కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఒక్కో కుటుంబానికి 3 నెలల పాటు సహాయం చేయాలనుకుంటున్నా. రాబోయే ఒక సంవత్సరం పాటు దీనిని కొనసాగిస్తా. వారు ఆ డబ్బును నిత్యావసరాల కోసం ఆదా చేసి, దానిని తమ భవిష్యత్తును మెరుగ్గా ప్రణాళిక చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా' అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విజయ్ ని ఇమిటేట్ చేసిన రష్మిక
-
అమ్మాయి పుడితే.. రష్మిక వ్యాఖ్యలు వైరల్
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు రష్మిక చెప్పిన సరదా సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి: ' ఆ సినిమా డిజాస్టర్.. అందుకే నా ఈగో హార్ట్ అయింది')‘రణబాలి’ చిత్రంలో జయమ్మ పాత్రను రష్మిక పోషించిన సంగతి తెలిసిందే. రియల్ లైఫ్‌లో భర్త అయిన విజయ్‌కి.. ఈ చిత్రంలోనూ భార్యగా నటిస్తోంది. అయితే జయమ్మకు ఇన్స్టాగ్రామ్ ఉంటే ఎలాంటి రీల్స్ చేసేదని యాంకర్ సుమ అడగ్గా.. ‘ఫుడ్ రీల్స్ చేసేది’అని రష్మిక సమాధానం చెప్పింది. ఇక ‘జయమ్మగా ఈ ప్రపంచంలోని ఆడవాళ్లకు ఏదైనా చెప్పాలంటే..ఏం చెబుతారు? అంటే.. ‘అమ్మాయి పుడితే ఏం తక్కువ కాదు. అదే ఒక పవర్ అని చెబుతా’ అని రష్మిక అనడంతో అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు. ఇక ఇలాంటి ప్రశ్నలనే విజయ్‌ని అడిగారు. ‘రణబాలి’ ఎలాంటి వ్యక్తులను క్షమించడు అని అడగ్గా.. ‘రణబాలి నా కంటే పది రెట్లు మంచి మనిషి. రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తులను అస్సలు క్షమించడు. ప్రజల కోసం ప్రాణం అయినా ఇస్తాడు’ అని చెప్పాడు. -
జయమ్మ పాత్రకు నువ్వే కావాలి.. రష్మికకు విజయ్ థ్యాంక్స్
‘‘దసరా పండగ మొదలైపోయింది. తిరుపతిలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, విజయవాడలో దుర్గమ్మ ఉత్సవాలు మొదలయ్యాయి. పిల్లలకు సెలవులు కూడా మొదలయ్యాయి. మరో మూడు రోజుల్లో మీరందరూ, తెలుగు సినిమా గర్వపడేలా ‘రణబాలి’ సినిమా వస్తోంది’’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్’ సినిమాల తర్వాత ‘రణబాలి’ లాంటి పెద్ద సినిమా చేయాలన్నది డైరెక్టర్ రాహుల్ కల. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌ని అందమైన విధానంలో చెప్పాలని ‘రణబాలి’ క్రియేట్ అయింది. ఈ నెల 16న తన విజన్‌ని అందరూ తెరపై చూస్తారు. 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ చేసిన పని వల్ల వచ్చిన ఆకలి కరువు కొన్ని లక్షల మంది చావుకు కారణం అయింది. ప్రస్తుతం ఎలినో నడస్తోంది. నీళ్లు, విద్యుత్, తిండి... ఏదైనా వృథా చేయకుండా జాగ్రత్తగా వాడాలి. ‘టాక్సీవాలా’ సినిమాకి ముందు నా ‘నోటా’ సినిమా విడుదలవడం, అది సరిగ్గా ఆడకపోవడం.. అందరూ నన్ను అదోలా మాట్లాడటం జరిగాయి. నేను బ్యాక్ అవుతానని ఆ రోజు ఓ లేఖ రాశాను. ‘టాక్సీవాలా’తో కమ్‌బ్యాక్ ఇచ్చాను. ఈసారి నేను, రాహుల్ అనుకున్నది జరిగిందంటే అనంతపురంలో మీ అందరి ముందు మళ్లీ గుర్తు చేస్తా. మన మీద మనకుండే నమ్మకం, మనం చేసే పనిలో పూర్తిగా ప్రాణం పెట్టి చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. రవి, నవీన్‌గార్లకు కథ నచ్చితే వారు ఎలాగైనా బిగ్ స్కేల్లో ప్రజల వద్దకు తీసుకెళతారు. నేను–రష్మిక కలిసి చేసిన మూడో సినిమా ‘రణబాలి’. కెరీర్లో రష్మిక ఎదుగుదల చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. జయమ్మ పాత్రకు నువ్వు అవసరం. ఈ సినిమా ఒప్పుకున్నందుకు తనకు థ్యాంక్స్’’ అని తెలిపారు. రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ–‘‘మైత్రి మూవీ మేకర్స్ అన్నది మహాసముద్రం. ఎంతోమంది దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు, ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. మీ బ్యానర్‌కి ‘రణబాలి’ మంచి పేరు తీసుకొస్తుందని గర్వంగా చెబుతున్నాను. మైత్రి సంస్థ సహకారం లేక΄ోతే ఆర్నాల్డ్లాంటి హాలీవుడ్ నటుణ్ణి తీసుకురాలేం. ఈ సినిమాలో జయమ్మ–రణబాలి ΄ాత్రల్లో భార్యాభర్తలుగా అద్భుతంగా చేశారు రష్మిక–విజయ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు’’ అని పేర్కొన్నారు. రష్మిక మందన్నా మాట్లాడుతూ– ‘‘రణబాలిగా విజయ్ నటన చూస్తుంటే భయం వేసేది. ఎంతో ప్యాషన్‌తో, ప్రేమతో కష్టపడ్డాడు. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాలు అద్భుతమైన లవ్‌స్టోరీస్. కానీ, ‘రణబాలి’ లవ్‌స్టోరీ కాక΄ోయినప్పటికీ లవ్‌ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా మాకు (విజయ్–రష్మిక) మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘రణబాలి’లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. ఈ సినిమా మాకు బాగా సంతృప్తినిచ్చింది. ఇందుకు కారణం డైరెక్టర్ రాహుల్. విజయ్, రష్మికగార్ల పెళ్లి తర్వాత వారిద్దరితో సినిమా చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఆ చాన్స్ మాకు ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘రణబాలి’ మన సినిమా, మన మట్టి కథ, మన సంస్కృతితో రాహుల్ ఎంతో బాగా తీశాడు. ఈ సినిమాలో విజయ్–రష్మిక నటన, డ్రామా సన్నివేశాలు అత్యద్భుతం. ‘ఇరుముడి’ సినిమాలోలా ‘రణబాలి’లోనూ భక్తి నేపథ్యం కూడా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్.. విరోష్ జంట క్యూట్ మూమెంట్స్ (ఫోటోలు)
-
రణబాలిలో నా రోల్.. ఆమె పేరుతోనే: రష్మిక
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. రాయలసీమలో బ్రిటీశ్ కాలంలో జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని.. ఆనాటి దారుణ పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హీరోయిన్ రష్మిక మందన్నా హాజరయ్యారు. ఈ సందర్భంగా రణబాలిలో తన రోల్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాను ఇంకా సినిమా చూడలేదని.. మీతో కలిసి థియేటర్లో చూస్తానని అన్నారు. తాను మూవీ సెట్స్‌లో వెళ్తుంటే భయం భయంగా వెళ్తానని రష్మిక తెలిపింది. అందరూ సీరియస్‌గా వర్క్ చేస్తుంటే..తాను మాత్రం భయపడతాననని వెల్లడించింది. ఈ మూవీలో నా క్యారెక్టర్ పేరు జయమ్మ అని.. అది మా డైరెక్టర్ రాహుల్ మదర్ గారి పేరు అని రష్మిక రివీల్ చేశారు. అందుకే అక్కడే నేను కనెక్ట్ అయిపోయానని రష్మిక ఆనందం వ్యక్తం చేశారు. -
తన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. ఎక్కడికైనా వస్తా: రాహుల్ రవీంద్రన్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటించిన మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహిస్తున్న మేకర్స్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ గురించి మాట్లాడారు. నాకు రాహుల్ ఓ కథ చెప్పారు.. అది చాలా బాగా నచ్చిందని అన్నారు. ఆ తర్వాత 2015లో ఓ కొత్త బ్యానర్ తెలుగు సినిమాలో అడుగుపెట్టారని తెలిపారు. తొలిసారే వీళ్లు పెద్ద ప్రాజెక్ట్ చేయడం చూసి షాకయ్యానని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన మొదటి మూవీ సూపర్‌హిట్‌గా నిలిచిందన్నారు.విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయారని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆ తర్వాత రాహుల్, విజయ్ ఇద్దరు టాక్సీవాలాతో సూపర్ హిట్ కొట్టారని తెలిపారు. ఇప్పుడు వీళ్లంతా రణబాలితో మనముందుకొస్తున్నారని కొనియాడారు. ఇక్కడ నాకు అందరికంటే ఎక్కువ కావాల్సిన అమ్మాయి రష్మిక అన్నారు. తన కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చానని.. ఎక్కడికైనా వస్తా రాహుల్ రవీంద్రన్ తెలిపారు. నువ్వు నాకు ఫ్యామిలీతో సమానమని అన్నారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదీ చదవండి: రష్మికకు విజయ్ థ్యాంక్స్ -
విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'రణబాలి' సెన్సార్ రివ్యూ.. రన్ టైమ్ ఎంతంటే?
ఈ మధ్య చిన్న నుంచి పెద్ద సినిమాల వరకు సెన్సార్ అనేది చాలాపెద్ద సమస్యగా మారిపోయింది. టైటిల్ దగ్గర నుంచి మూవీలోని సన్నివేశాల వరకు సెన్సార్ ఇబ్బందులతో చాలానే సతమతమయ్యాయి. అయితే ఈ గండం నుంచి విజయ్ దేవరకొండ 'రణబాలి' దాటేసింది. ఇంతకీ సెన్సార్ టాక్ ఏంటి? చిత్ర రన్ టైమ్ ఎంత?(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)విజయ్ దేవరకొండ, రష్మిక.. తమ పెళ్లి తర్వాత చేసిన తొలి సినిమా 'రణబాలి'. స్వాతంత్ర్యం రాకముందు రాయలసీమ ప్రాంతంలో జరిగిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. అయితే ట్రైలర్లో హింస, రక్తం కనిపించే సీన్స్ ఉండేసరికి దీనికి కూడా సెన్సార్ ఇబ్బందులు తప్పవేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని సెన్సార్ టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకున్న దర్శకుడు.. హింస మోతాదు తగ్గించి భావోద్వేగ సన్నివేశాలకు ఎక్కువగా చోటిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సినిమాకు అన్ని కలిసొస్తున్నాయి. ఇక కంటెంట్‌తో హిట్ కొట్టడమే మిగిలుంది. విజయ్-రష్మిక ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: సాయిపల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య) -
Live: విజయ్ దేవరకొండ-రష్మిక ‘రణబాలి’ ప్రీరిలీజ్ ఈవెంట్
విజయ్ దేవరకొండ, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.ఇందులో విజయ్ ఓ శక్తిమంతమైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ దసరా కానుకగా అక్టోబరు 16న ప్రేక్షకుల రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నేడు(అక్టోబర్ 13) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి. -
తిరుమల శ్రీవారి సేవలో విజయ్ దేవరకొండ-రష్మిక (ఫోటోలు)
-
శ్రీవారి సన్నిధిలో రణబాలి జంట
-
సీఎం విజయ్ను కలిసిన విరోష్ జంట.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ ఫోటోలు!
-
తిరుమల శ్రీవారి సేవలో విరోష్ జంట.. సుప్రభాత సేవలో పూజలు
టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయాన్నే సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరోష్ జంటకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా నటించిన రణబాలి రిలీజ్‌కు రెడీ అయింది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం.. అక్టోబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని బ్రిటీశ్ కాలంలో రాయలసీమలో జరిగిన దారుణాల నేపథ్యంలో తెరకెక్కించారు. కరువుతో దాదాపు కోటి మంది ఆకలి చావులతో అల్లాడిపోయారని డైరెక్టర్ రాహుల్ తెలిపారు. అందుకే ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న #Virosh #RanaBaali Back 2 Back ప్రమోషన్స్ లో బిజీ బిజీగా #RashmikaMandanna & #VijayDeverakonda... https://t.co/Lvn1jGNijl— Taraq(Tarak Ram) (@tarakviews) October 13, 2026 -
ముంబై : 'స్వదేశ్ ఎట్ ఈరోస్' మొదటి వార్షికోత్సవం...బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను, కారణం ఇదే : విజయ్ దేవరకొండ
‘‘మన చరిత్రలో ప్రజల కోసం నిలబడిన గొప్ప వీరులు ఉన్నారు. ఆ వీరుల్లో చాలామంది మూడు పదుల వయసులోనే చనిపోయారు. అలాంటివారే మా ‘రణబాలి’ సినిమాకు స్ఫూర్తి. ఆ వీరుల గొప్పదనం, మన పూర్వీకులు ఎదుర్కొన్న దారుణాలు, బ్రిటిషర్స్ ఈ విశాల దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారు? వీటన్నింటినీ మేం ‘రణబాలి’ సినిమా ద్వారా బిగ్ స్క్రీన్ పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చూపించబోతున్నాం’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన సంగతులు... → మన చరిత్ర గురించి మనం తెలుసుకోవాలనే ఆలోచనతో ‘రణబాలి’ సినిమా తీశాం. అనంతపురంలో జరిగే ఓ జాతరలో కొంతమంది వీరుల గురించి విన్న బుర్రకథల ఆధారంగా దర్శకుడు రాహుల్ ఈ కథను రెడీ చేశారు. ‘రణబాలి’ ఓ బుర్రకథతోనే ప్రారంభం అవుతుంది. మన దేశ భవిష్యత్ గురించి మనం ఆలోచించాలంటే చరిత్ర తెలియడం ముఖ్యం. మన చరిత్రలో మనకు తెలియకుండా రహస్యంగా మిగిలి΄ోయిన అధ్యాయాలను సినిమా మాధ్యమం ద్వారా వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. లేదంటే ఇంకెవరూ ఇలాంటి కథల్ని ముట్టుకోరు.→ ఈ సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు బ్రిటిషర్లు చేసిన దారుణాల కంటే మా సినిమాలో చూపించనవి తక్కువే. ఇది సాఫ్ట్‌గా చెప్పే కథ కాదు, సాఫ్ట్‌గా చూపించే ప్రపంచం కాదు. ఈ సినిమా కోసం యాస, గుర్రపు స్వారీ నేర్చుకోవడం చాలెంజింగ్‌గా అనిపించింది. నేను పుట్టపర్తిలో చదువుకున్నాను కాబట్టి రాయలసీమ యాస కొంత పరిచయమే. అయితే ఈ సినిమా కోసం పర్ఫెక్ట్గా ఉండేలా నేర్చుకున్నాను. → నేను హీరోగా చేసే సినిమాల్లో హీరోయిన్గా రష్మిక పేరును దర్శకులు సూచిస్తుంటారు. అయితే నాకు ‘రణబాలి’లోని జయమ్మ పాత్రకు రష్మిక అయితే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో రణబాలి, జయమ్మ (రష్మిక పాత్ర పేరు) పాత్రల మధ్య మంచి ఎమోషనల్ డ్రామా ఉంది. మేమిద్దరం చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ వచ్చింది. ఆ పాత్రలపై మా రియల్ లైఫ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఇదే ఫీల్ అవుతారు. → సినిమా టికెట్ ధరల పెంపు నాకు ఎప్పట్నుంచో ఇష్టం లేదు. కానీ ఇది నిర్మాతలకు సంబంధించిన విషయం. అయితే ప్రొడ్యూసర్‌కు కంట్రోల్ ఉన్నంతవరకు నేను హీరోగా చేసే ఏ సినిమాకు టికెట్ రేట్స్ హైక్ వద్దనే చెబుతాను. ‘బిజి నెస్ పరంగా మనం వర్కౌట్ చేసుకుందాం. నేను తక్కువ చేయడం (పారితోషికం ఉద్దేశించి కావొచ్చు), లాభాల్లో వాటా గురించి మాట్లాడుకోవడం వంటివి మనం చూసుకుందాం’ అని నిర్మాతలతో అంటుంటాను. విజయ్ దేవరకొండ సినిమాకు టికెట్ రేట్స్ హైక్ అనేది ఉండదు. ఒకవేళ నేను రాజమౌళిగారితో సినిమా చేస్తే అప్పుడు తెలియదు. ఇది ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే ‘రణబాలి’ సినిమా అప్పుడు విజయ్ అలా చెప్పాడు. మళ్లీ ఇప్పుడు ఇలా ఏంటి? అనే చర్చ జరగకూడదు. ఇక ‘రణబాలి’ సినిమాకు రావాల్సిన డబ్బులు వస్తాయి. అయితే ఆ డబ్బులు ఎక్కువగా ఈ సినిమాను థియేటర్స్‌లో చూసి, ప్రేక్షకుల నుంచి వస్తే మంచిదని భావిస్తున్నాను. ఎందుకంటే ‘రణబాలి’ సినిమా ఉద్దేశం అందరికీ తెలియాలి. → తెలంగాణను ఎక్కువగా విలన్ క్యారెక్టర్స్‌కు చూపించారు. ఒక స్లాంగ్‌ను ఎక్కువగా కామెడీగా చూపించారు. రాయలసీమ స్లాంగ్‌ను విలన్, ఫ్యాక్షన్‌కు చూపించారు. రాహుల్ ‘రణబాలి’ చేశాడు. దర్శకుడు రవికిరణ్ నాతో గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో ‘రౌడీ జనార్ధన’ సినిమా చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఆ ప్రాంతాల యాసల్లోని హీరోయిజం కనిపించేలా సినిమా చేస్తామని చెప్పారు. ఈ రెండు సినిమాలూ అలానే ఉంటాయి.→ బయోపిక్ చేయాలనే ఆకాంక్ష ఉంది. అయితే సత్య సాయిబాబా బయోపిక్కు న్యాయం చేయలేను. అందుకు కారణం ఆయనలో ఉన్న స్వచ్ఛత, సున్నితత్వం నాలో లేవన్నది నా ఫీలింగ్. నేను చేయగలిగే బయోపిక్‌లు వస్తే తప్పక చేస్తాను. -
మాకు పిల్లలు పుట్టేలోపు.. గుర్రాలను పెంచుకుంటా: విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాన్ని రాయలసీమలో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 16న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. దీనిలో భాగంగా ఈ రోజు(శనివారం) మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం. ఇందులో పాల్గొన్న విజయ్ తనదైన శైలిలో నవ్వూతూ పుట్టబోయే పిల్లలపై కామెంట్స్ చేశారు.మాకు పిల్లలు పుట్టేలోపు..‘రణబాలి ఎంతో కష్టపడి చేసిన సినిమా. దీని కోసం హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను. చాలా సార్లు కింద పడ్డాను. కానీ గుర్రంతో మంచి బాండిగ్ ఏర్పడింది. అప్పుడే అనుకున్నా నేనూ ఒక గుర్రాన్ని పెంచుకోవాలని. అయితే ఒక్క గుర్రాన్ని పెంచితే మళ్లీ అది డిప్రెషన్లోకి వెళ్తుంది. దానికి తోడుగా ఇంకోటికూడా ఉండాలి. మాకు పిల్లలు పుట్టేలోపు గుర్రాలను తెచ్చుకొని పెంచుకుంటాను’ అని సరదాగా అంటూ నవ్వులు పూయించారు.రణబాలి విషయానికొస్తే.. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. (ఇదీ చదవండి: ‘ఆ డైరెక్టర్లు క్రిమినల్స్‌తో సమానం.. వారిని బ్యాన్ చేయాలి’) -
రష్మిక పేరు నేను చెప్పలేదు : విజయ్ దేవరకొండ
‘టాక్సీవాలా’ తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘రణబాలి’. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంది. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘రణబాలి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ పాత్రకే కాదు రష్మిక పోషించిన జయమ్మ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పాత్రకు రష్మికను తీసుకోవాలని విజయ్ చెప్పలేదట. దర్శకుడు రాహుల్ పట్టుపట్టి రష్మికను హీరోయిన్గా ఒప్పించారట. (ఇదీ చదవండి: రాజమౌళితో సినిమా చేస్తే తప్ప.. టికెట్ల రేట్లు పెంచను: విజయ్ దేవరకొండ)ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండనే చెప్పాడు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రష్మిక పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘జయమ్మగా రష్మిక పేరును డైరెక్టర్ రాహుల్ సూచించాడు. నాకు కూడా ఆమె అయితేనే బాగుంటుంది అనిపించింది. గతంలోనూ నా సినిమాల్లో హీరోయిన్ గా రష్మిక ప్రస్తావన వచ్చినా ఆ సినిమాలకు తను కరెక్ట్ కాదు అనిపించింది. మేము కలిసి చేసే సినిమా స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. రణబాలి సినిమాలో మా ఇద్దరి మధ్య అలాంటి మంచి డ్రామా ఎమోషన్ ఉంది. మేము కలిసి చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ వచ్చింది. ఎందుకంటే ఆ పాత్రలపై మా రియల్ లైఫ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు’ అని విజయ్ అన్నారు. -
రణబాలి బడ్జెట్ 120 కోట్లు.. విజయ్, రష్మికల రెమ్యునరేషన్ ఎంతంటే?
పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన చిత్రం ‘రణబాలి’. గతంలో విజయ్‌తో ‘టాక్సీవాలా’ తెరకెక్కించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక ప్రాంతంలో జరిగిన అమానవీయ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. రణబాలి పాత్ర డిమాండ్ అనుగుణంగా వయొలెన్స్ కూడా అవసరమైన మోతాదు కంటే ఎక్కువే పెట్టినట్టు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కాబట్టి.. ఖర్చు కూడా భారీగానే పెట్టారట. మొదట ఈ చిత్రాన్ని రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే షూటింగ్ తర్వాత ఖర్చులు పెరిగి.. ఆ బడ్జెట్ కాస్త రూ. 120 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మికల పారితోషికాలే దాదాపు రూ. 30 కోట్ల వరకు ఉంటుందట. (ఇదీ చదవండి: త్రివిక్రమ్.. నా కుటుంబ బలహీనతని వాడుకున్నారు)అయితే షూటింగ్ ప్రారంభం అయినప్పుడే ఓటీటీ బిజినెస్ కావడంతో నిర్మాతలకు ఊపిరి పీల్చుకున్నారు. నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఓటీటీ రైట్స్ దక్కించుకుంది. శాటిలైట్, ఆడియో రైట్స్‌తో కలిపి మొత్తంగా నాన్ థ్రియేట్రికల్ రూపంలో రూ. 60 కోట్ల వరకు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 60 కోట్లను రిలీజ్ తర్వాత రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై బజ్ భారీగానే ఉంది. రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే.. రూ. 60 కోట్ల కలెక్షన్స్ ఈజీగానే వచ్చేస్తుంది. విజయ్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. మరి ఈ చిత్రంలో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా? చూడాలి. -
విజయ్ దేవరకొండ ‘రణబాలి’ సినిమా HD స్టిల్స్
-
రణబాలి మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో స్పెషల్ మూమెంట్స్.. (ఫోటోలు)
-
రష్మిక తరపున క్షమాపణలు చెబుతున్నా : విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(అక్టోబర్ 8) ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కి విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్, నిర్మాతలు నవీన్, రవి హాజరయ్యారు. వేరే సినిమా షూటింగ్లో బిజీగా ఉండడంతో రష్మిక ఈ ఈవెంట్‌కి రాలేకపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రష్మిక తరపున అభిమానులకు క్షమాపణలు చెప్పారు విజయ్. (ఇదీ చదవండి: ట్రైలర్ రాకముందే నెగెటివ్ ప్రచారం.. మైత్రి రవి కామెంట్స్)ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. ‘రష్మిక కూడా ఈ ఈవెంట్‌కు రావాల్సింది. కానీ షూటింగ్లో బిజీగా ఉండడంతో రాలేకపోయింది. ఆమె తరపున అందరికి నేను క్షమాపణలు చెబుతున్నా’అని అన్నారు. రష్మిక ఎలాగో రాలేదు కాబట్టి..ఫోన్లో అయినా ఆమెతో మాట్లాడిస్తే బాగుంటుందని యాంకర్ చెప్పడంతో.. విజయ్ వెంటనే రష్మికకు ఫోన్ చేశాడు.అయితే ఆమె మాత్రం లిఫ్ట్ చేయలేదు. షూట్లో బిజీగా ఉండడం వల్లే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్లీ చేసినప్పుడు చూద్దాంలే’ అని విజయ్ ఫోన్ కట్ చేశాడు. -
‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ లైవ్
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రష్మిక హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమా ట్రైలర్‌ని రిలీజ్చేశారు. -
విరోష్ జంట రణబాలి.. యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాన్ని రాయలసీమలో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్లలో భాగంగా రణబాలి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే రాయలసీమలో బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల పాటు కరువు రావడంతో దాదాపు కోటిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజుల్లో బ్రిటీశ్ పాలకులు చేసిన దురాగతాలకు వ్యతిరేకంగా రణబాలి చేసే పోరాటం ట్రైలర్లో కనిపిస్తోంది. బ్రిటీశ్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన వీరుడి కథే రణబాలి అని అర్థమవుతోంది. ఈ ఫుల్ యాక్షన్ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.ఇక ‘రణబాలి’ సినిమా విషయానికొస్తే.. సినిమా నేపథ్యం, కథ ఎలా ఉండబోతుందనే విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్రబృందం ఇప్పటికే నాలుగు భాగాలుగా డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసింది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించారు. -
నీలి రంగు చీరలో చందమామలా నేషనల్ క్రష్..!
ప్రముఖ కర్ణాటక గాయని ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభోత్సవంలో టాలీవుడ్ నటి రష్మిక మందన్న అద్భుతమైన నీలిరంగు కంజీవరం పట్టుచీరలో తళుక్కుమన్నారు. ఈ కార్యక్రమంలోని రెడ్‌కార్పెట్‌పై సంప్రదాయ లుక్‌తో మెరిసింది నేషనల్ క్రష్. అచ్చం సుబ్బలక్ష్మీ వారసత్వాన్ని అందుకున్నట్లుగా ఆమె ఆహార్యం ఉంది. అంతేగాదు ఆమె ధరించిన చీరను కూడా శాస్త్రీయ సంగీతం ఆధారంగానే రూపొందించడం విశేషం. మరి ఆ చీరలో ఏఏ విశేషాలు దాగున్నాయో చూద్దామా..!. ముద్దుగుమ్మ రష్మిక ఐక్యత వారి సుస్వర రాగ ఎడిషన్ నుంచి శంకరాభరణ కంజీవరం పట్టు చీరను ఎంచుకున్నారట. చేతితో నేసిన ఈ పట్టుచీర ముదురు నీలిరంగుతో ప్రారంభమై క్రమంగా రాజసం ఉట్టిపడే ఊదారంగులోకి మారుతుంది. సన్నని బంగారు జరీ, దేవాలయ స్ఫూర్తితో కూడిన నమునాల అంచు, పల్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు ఈ ఆరుగజాల నీలిరంగు చీరను మరింత అందంగా కనిపించేలా చేశాయి. అలాగే శంకరాభరణంతో ఉన్న సంబంధాన్ని కూడా హైలెట్ చేసింది. శాస్త్రీయ రాగాల రంగు ఆకృతి నుమునాలను కూడా ఈ చీరలో పొందుపర్చడం విశేషం. అదీగాక ఎంఎస్సీ సుబ్బలక్ష్మీ ప్రదర్శనలన్నీ కంజీవరం పట్టు చీర, సాంప్రదాయ బంగారు ఆభరణాలతో ముడిపడి ఉన్నందున.. ఆ పాత్రలో నటిస్తున్న రష్మిక కూడా ఆ కార్యక్రమానికి అనుగణంగా ఈ శారీని ఎంచుకుంది. తన పాత్రకు అనుగుణంగానే బంగారు ఝమ్కాలు, సాంప్రదాయ గాజులు, సరిపోయే నాథ్ అనే జుట్టు ఆభరణం, మలెపూల గజ్రాతో అచ్చం సుబ్బలక్ష్మీ అనిపించేలా అద్భుతంగా కనిపించింది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఇదీ చదవండి: 90 గంటల పాటు ఏమి తినకుండా..సీఈవో మైండ్‌బ్లాక్ సవాల్! -
‘ఎవరికోసమో నేను మారలేను’.. రష్మిక స్ట్రాంగ్ రిప్లై
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ క్రమంలో తనపై సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌పై రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.తాను అందరితో సరదాగా, స్నేహపూర్వకంగా ఉండటాన్ని కొందరు మరోలా అర్థం చేసుకుంటున్నారని రష్మిక తెలిపారు. అందరితో మంచిగా ఉండటం తన బలహీనత కాదని స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ సానుకూల వాతావరణం ఉండాలని కోరుకుంటానని చెప్పారు.ఉన్న చోట పాజిటివిటీ ఉండాలని..‘అందరితో మంచిగా ఉండటం నా బలహీనత కాదు. నేను ఉన్న చోట పాజిటివిటీ ఉండాలని, సరదాగా ఉండాలని అనుకుంటాను. దీనికి ఎవరు ఏ పేరు పెట్టినా నాకు పెద్దగా పట్టింపు లేదు. అందరికీ నేను నచ్చాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం నేను మారలేను. సరదాగా ఉండటం వల్ల నా కుటుంబం, స్నేహితులు సంతోషంగా ఉంటారు’ అని రష్మిక తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.రణబాలి విషయానికొస్తే..ఇక ‘రణబాలి’ విషయానికొస్తే.. సినిమా నేపథ్యం, కథ ఎలా ఉండబోతుందనే విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్రబృందం ఇప్పటికే నాలుగు భాగాలుగా డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసింది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.(ఇదీ చదవండి: ‘40 సినిమాలకు డైలాగ్స్ రాశా.. 500 చిత్రాల్లో నటించా.. కానీ..’) -
ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ (ఫొటోలు)
-
రష్మిక రణబాలి లుక్.. అదిరిపోయిన స్టిల్స్(ఫోటోలు)
-
విజయ్ను రష్మిక.. ఇంట్లో ఏమని పిలుస్తుందో తెలుసా?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రమోషన్లు సరవేగంగా చేస్తోంది చిత్రబృందం. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ జంట యాంకర్ సుమతో ప్రత్యేకంగా చిటిచాట్ చేసింది. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకోవడంతో పాటు పలు వ్యక్తిగత విషయాలు వెల్లడించారు. ఇలా విజయ్‌పై రష్మిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.ఇంట్లో విజయ్ ఎలా ఉంటాడు?‘ఇంట్లో విజయ్ ఎలా ఉంటాడు?’ అని సుమ రష్మికను అడిగారు. దీంతో రష్మిక అతడి స్టైల్‌ను తనదైన శైలిలో ఇమిటేట్ చేసి చూపించింది. విజయ్ కింద హాల్లోకి వచ్చి ఫుడ్ ఏంటి అని అడుగుతాడని చెప్పింది. అంతేకాదు.. తాను ‘బేబీ.. బేబీ’ అని పిలిచినా విజయ్ వెంటనే స్పందించడని, కానీ ‘ఒరేయ్’ అని పిలిస్తే మాత్రం వెంటనే పలుకుతాడని సరదాగా చెప్పుకొచ్చింది. దీనిపై విజయ్ ఫ్యాన్స్ కూడా సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. వదినమ్మా ఏంటి మా అన్నయ్యని పట్టుకుని ఒరేయ్ అంటున్నావా అంటూ సరదా కామెంట్స్ చేస్తున్నారు. Vijay Deverakonda at Home. #Rashmika imitates #VijayDeverakonda https://t.co/V61TzWxGIY— cinee worldd (@Cinee_Worldd) October 4, 2026 -
బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామనుకున్నా కానీ
విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాడు. ఎన్నాళ్ల నుంచి ప్రేమించిన హీరోయిన్ రష్మికతో కొత్త జీవితం మొదలుపెట్టాడు. అయితే ఈ వివాహ వేడుకలో విజయ్.. మెడలో బంగారు నగలు వేసుకుని రావడం చిత్రంగా అనిపించింది. అయితే ఇదంతా తన ప్లాన్‌లో లేదని బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెళ్లి చేసుకుందామని అనుకున్నట్లు ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. మరీ ఇలానా?)గతంలో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో విజయ్-రష్మిక జంటగా నటించారు. కానీ పెళ్లి తర్వాత 'రణబాలి' కోసం స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వచ్చే శుక్రవారం(అక్టోబర్ 16) థియేటర్లలో రిలీజ్ కానుంది. దీని ప్రమోషన్లలో భాగంగా సుమతో చేసిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తాను ఎలా పెళ్లి చేసుకోవాలనుకున్నాను? ఎలా జరిగింది? అనే విషయాల గురించి చెప్పాడు.'నేను సింపుల్‌గా బీచ్‌లో షార్ట్స్ వేసుకుని పెద్దగా హడావుడి లాంటివి చేయకుండా పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ ఇది తెలిసి మా అమ్మ నన్ను రెండు కొట్టింది. పదిరోజుల పాటు ఇంట్లో ఏడ్చింది. పెద్ద కొడుకువి ఇలా చేస్తే ఎలా అని రచ్చ రచ్చ చేసింది. దీంతో ఇలా కాదు కింగ్‌లా దిగాలని ఒంటిపై బంగారం వేసుకుని పెళ్లి చేసుకున్నాను' అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.రాజస్థాన్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక.. హైదరాబాద్‌లో సెలబ్రిటీల కోసం రిసెప్షన్ పెట్టారు. అలానే విజయ్ దేవరకొండ తన సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేశాడు.(ఇదీ చదవండి: ముంబైని వదిలేస్తున్న 'ధురంధర్' దర్శకుడు!) -
విజయ్ను ఇమిటేట్ చేసిన రష్మిక.. ఈ క్యూట్ వీడియో చూశారా..?
విజయ్ దేవరకొండ రష్మిక జంటగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. అక్టోబరు 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ మేకింగ్ వెనుక విశేషాలను చిత్ర బృందం పంచుకుంటోంది. ఈ సందర్భంగా సినిమాలో విజయ్ చెప్పిన ‘సింగనమల బొబ్బిలి రణబాలి’ డైలాగ్‌ను రష్మిక రీ-క్రియేట్ చేసిన వీడియో విడుదల చేసింది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.కాగా సినిమా ఎలా ఉండబోతుందనేది ఇప్పటికే డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు.అజయ్, అతుల్ సంగీతం అందించారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఇదీ చదవండి: రష్మిక వంట చేస్తే.. ఓ యుద్ధం చేసినట్లే: విజయ్ దేవరకొండBest Couple 💕👌🏻#VijayDeverakonda #Rashmika pic.twitter.com/Qphqm0JnqQ— Anonymous (@__GirDhar) October 3, 2026 -
విజయ్-రష్మిక లగ్జరీ విల్లా.. విడిపోయేందుకే కొంటున్నారా?
టాలీవుడ్లో మోస్ట్ ఫేమస్ జంటల్లో విజయ్ దేవరకొండ- రష్మిక ముందు వరుసలో ఉంటారు. ఆన్ స్క్రీన్‌పై మెరిసిన వీరిద్దరు రియల్ లైఫ్‌లోనూ ఒక్కటయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ జంటను విరోష్ అంటూ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్నారు. ప్రస్తుతం పెళ్లి తర్వాత కలిసి జంటగా నటించిన రణబాలి రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సంగతి పక్కనపెడితే విజయ్- రష్మిక జంటకు సంబంధించి ఓ వార్త తెగ వైరలవుతోంది. పెళ్లి తర్వాత వీరిద్దరు వేరు కాపురం పెట్టనున్నారా? అనే చర్చ మొదలైంది. అందుకే హైదరాబాద్‌లో ఓ లగ్జరీ విల్లా కొనుగోలు చేస్తున్నారనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. విజయ్ తన తల్లిదండ్రులకు దూరంగా ఉంటారా? అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విషయంపై విజయ్, రష్మిక నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.(ఇది చదవండి: డైరెక్టర్ తాగొచ్చి నన్ను కౌగిలించుకుంటావా? అని అడిగాడు: స్వర భాస్కర్)విల్లా కేవలం భవిష్యత్ ప్లాన్‌లో భాగంగానే కొంటున్నారని తెలుస్తోంది. విల్లా కొనుగోలు అంటే వెంటనే అక్కడే కాపురం పెట్టాలని కాదు.. ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ కోసమేనని అర్థమవుతోంది. కాగా.. గతంలో తాము జాయింట్ ఫ్యామిలీగా ఉండటాన్ని ఇష్టపడతామని విరోష్ జంట చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదంతా కేవలం రూమర్స్ మాత్రమేనని అర్థమవుతోంది. -
బ్రిటీషర్లు రైల్వే ఎందుకు నిర్మించారంటే?..రణబాలి మరో డాక్యుమెంటరీ
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాని బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.ఈ నేపథ్యంలోనే డాక్యుమెంటరీ రూపంలో ఈ మూవీ విశేషాలను ఆడియన్స్‌తో పంచుకుంటున్నారు. ఇప్పటికే ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్ అనే పార్ట్ రిలీజ్ చేశారు. తాజాగా ట్రూత్ 2: ది హిస్టరీ వుయ్ ఫర్గాట్ విడుదల చేశారు. ఇందులో బ్రిటీష్ పాలనలో ఇండియన్ రైల్వేల గురించి వివరించారు. బ్రిటిషర్లు భారత్‌లో రైల్వే వ్యవస్థను నిర్మించడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని ఇందులో చూపించారు. ఈ డాక్యుమెంటరీని పూర్తిగా రాయలసీమ ప్రాంతంలోనే చిత్రీకరించారు. ఈ సినిమా కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లోనే తెరకెక్కించారు. -
ప్యారడైజ్ ఎఫెక్ట్.. రణబాలి టీమ్ కీలక నిర్ణయం
-
‘రణబాలి’ డాక్యుమెంటరీ ఫస్ట్ పార్ట్ వచ్చేసింది..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ఏందయ్యా సామీ ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితేషూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్రం బృందం తాజాగా ఏందయ్య సామీ సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.ఇప్పుడు మరో అప్డేట్ను పంచుకుంది. మొదటి భాగం ‘ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్’ డాక్యుమెంటరీని విడుదల చేశారు. బ్రిటిష్ పాలన సమయంలో వచ్చిన తీవ్ర కరవు పరిస్థితులు, ఆ సమయంలో బ్రిటిష్ వారి దాష్టీకాల గురించి చిత్రబృందం ఇందులో వివరించింది.సినిమా ఎలా ఉండబోతుందని..కాగా సినిమా ఎలా ఉండబోతుందనేది డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. వచ్చే నెల 16న మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే డాక్యుమెంటరీలోని తొలి మూడు ఎపిసోడ్స్ వరసగా సోమవారం (సెప్టెంబరు 28), బుధవారం(సెప్టెంబరు 30), శుక్రవారం(అక్టోబరు 02) యూట్యూబ్‌లో వదలబోతున్నామంటూ చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.ఇదీ చదవండి: ఆ ఒక్క మాట నన్ను కట్టిపడేసింది.. కన్నీరుపెట్టుకున్నా: రాజమౌళి -
ది ట్రూత్ సిరీస్
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న జంటగా నటించిన తాజా సినిమా ‘రణబాలి’. టీ సిరీస్ సమర్పణలో రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం విజయ దశమి సందర్భంగా అక్టోబరు 16న విడుదల కానుంది. ఈ మూవీలో రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ, జయమ్మ పాత్రలో రష్మికా మందన్నా, సర్ థియోడర్ హెక్టర్‌గా ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. 19వ శతాబ్దం నేపథ్యంలో 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ తెరకెక్కింది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ‘నెవర్ ఫర్గాట్: ది ట్రూత్ సిరీస్’ అనే డాక్యుమెంటరీని నాలుగు విభాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. యూట్యూబ్ వేదికగా ఈ నాలుగు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కానున్నాయి. తొలి ఎపిసోడ్ ‘ది ఫెమైన్ వుయ్ ఫర్గాట్’ నేడు (సెప్టెంబరు 28) స్ట్రీమింగ్ కానుంది. రెండో ఎపిసోడ్ ‘ది హిస్టరీ ఉయ్ ఫర్గాట్’ ఈ నెల 30న, మూడో ఎపిసోడ్ ‘ది మెన్ వుయ్ ఫర్గాట్’ అక్టోబరు 2న స్ట్రీమింగ్ కానున్నాయి. నాలుగో ఎపిసోడ్ ‘ది లాస్ట్ లోడ్’ స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ పేర్కొన్నారు ‘‘రణబాలి’ ప్రపంచం నుంచి బిహైండ్ ది సీన్స్ కంటెంట్‌తో ఈ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది. చరిత్రకు రెండు పార్శా్వలు ఉన్నాయి. ఒకటి మనకు చెప్పింది, మరొకటి ఎవరికీ తెలియకుండా సమాధి చేయబడింది. మనకు తెలియకుండా చరిత్రలో కనుమరుగు చేసిన ఆ నిజాలను చెప్పబోతోంది ఈ ట్రూత్ సిరీస్’’ అని యూనిట్ పేర్కొంది. -
'రణబాలి' టీమ్ కీలక నిర్ణయం.. 'ప్యారడైజ్' ఎఫెక్టా?
నాని 'ప్యారడైజ్' సినిమాకు రిలీజ్ రోజు దారుణమైన నెగిటివ్ టాక్ వచ్చింది. తర్వాత నుంచి మెల్లగా కుదురుకుంటోంది. చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వస్తున్నాయి. అయితే తొలిరోజు ఇలాంటి టాక్ రావడానికి ఓ కారణముంది. మరి ఈ చిత్రం ఎఫెక్టో ఏమో గానీ విజయ్ దేవరకొండ 'రణబాలి' టీమ్ కీలక నిర్ణయం తీసుకుంది.(ఇదీ చదవండి: తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో భారీ రెమ్యునరేషన్! రోజుకు రూ.7.5 లక్షలు)'ప్యారడైజ్' సినిమా నుంచి పాటలు మాత్రమే రిలీజ్ చేశారు. కనీసం ట్రైలర్ కూడా చూపించలేదు. దీంతో అసలు మూవీ ఎలా ఉండబోతుందనేది కూడా ఎవరికీ తెలియలేదు. తీరా థియేటర్లలోకి వెళ్లాక కొందరికి నచ్చింది కొందరికి అస్సలు నచ్చలేదు. మూవీ థీమ్ ఏంటనేది ప్రేక్షకులకు తెలియకపోవడమే దీనికి కారణం.ఇప్పుడు 'రణబాలి' టీమ్ మాత్రం ఆ తప్పు చేయట్లేదు. సినిమా ఎలా ఉండబోతుందనేది చూచాయిగా చెప్పే డాక్యుమెంటరీ సిరీస్‌ని నాలుగు భాగాలుగా రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన చేసింది. వచ్చే నెల 16న మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగానే డాక్యుమెంటరీలోని తొలి మూడు ఎపిసోడ్స్ వరసగా సోమవారం (సెప్టెంబరు 28), బుధవారం(సెప్టెంబరు 30), శుక్రవారం(అక్టోబరు 02) యూట్యూబ్‌లో వదలబోతున్నారు.అయితే 'రణబాలి' టీమ్ ఇలా చేయడం ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా వచ్చేలోపు కంటెంట్ ఎలా ఉండబోతుందనేది వీటిని చూసే ప్రేక్షకులకు ఓ అంచనా ఏర్పడుతుంది. తద్వారా మూవీకి ప్లస్ అయ్యే అవకాశముంది. ఈ డాక్యుమెంటరీలో విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్ చిత్ర సంగతుల్ని పంచుకోబోతున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన) View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
యాక్షన్‌కు రెడీ!
‘రాకా’ సినిమా చిత్రీకరణలో రష్మికా మందన్నా పాల్గొనే సమయం ఆసన్నమైందని తెలిసింది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘రాకా’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో రష్మికా మందన్నా, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా మేజర్ షూటింగ్ ముంబైలోని ఓ ప్రముఖ స్టూడియోలో ఏర్పాటు చేసిన సెట్స్‌లో జరుగుతోంది. కాగా, ‘రాకా’ చిత్రానికి సంబంధించిన ఓ కీలక యాక్షన్ షెడ్యూల్ చిత్రీకరణలో పాల్గొనడానికి ఈ నెల చివర్లో ముంబైకి వెళ్తున్నారట రష్మికా మందన్నా. నిజానికి ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఈపాటికే చిత్రీకరించాల్సింది. కానీ ‘మైసా’ చిత్రీకరణ సమయంలో రష్మిక గాయపడ్డారు. దీంతో ఈ చిత్రీకరణ వాయిదా పడింది. అలాగే ‘రాకా’ చిత్రంలో రష్మిక పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని తెలిసింది.సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ వచ్చే ఏడాది చివర్లో విడుదల కానుందట. ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న మిలన్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేస్తున్నారు రష్మిక. ఆమె భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ‘రాకా’ చిత్రీకరణలో పాల్గొంటారని ఊహించవచ్చు. ఇక విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నటించిన ‘రణబాలి’ సినిమా అక్టోబరు 16న, రష్మిక టైటిల్ రోల్ చేసిన ‘మైసా’ మూవీ నవంబరు 27న రిలీజ్ కానున్నాయి. -
పెళ్లైనా .. ఆయనపై క్రష్ తగ్గట్లేదు: రష్మిక
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు చిత్ర బృందం ప్రకటించింది.మరోవైపు ఇటీవల ‘ఏందయ్య సామీ’ ఫుల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలోని ఓ క్లిప్‌ను రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విజయ్‌పై తన ప్రేమను మరోసారి చాటుకుంది. ‘అతను నాకు పూర్తిగా సొంతమైనా.. తనపై క్రష్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇదేంటో మరి’ అంటూ రష్మిక చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. జీవితాంతం నా దగ్గరే ఉంటావుదీనికి విజయ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘నేను ఎంతో అదృష్టవంతుడిని. జయమ్మను మిస్ అయినా.. నువ్వు మాత్రం జీవితాంతం నా దగ్గరే ఉంటావు’ అంటూ రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి సోషల్ మీడియా సంభాషణ చూసిన అభిమానులు సంబరపడుతున్నారు. సినిమా ప్రమోషన్స్‌లోనూ విజయ్-రష్మిక జోడీపై ఆసక్తి పెరుగుతోంది.ఇక ‘రణబాలి’ కథ 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు చిత్ర బృందం తెలిపింది. ఇందులో విజయ్ దేవరకొండ ఓ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్-రష్మిక పెళ్లి తర్వాత కలిసి వస్తున్న తొలి చిత్రం కావడంతో ‘రణబాలి’పై మరింత ఆసక్తి నెలకొంది. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.ఇదీ చదవండి: ‘ఎందుకింత దురద..? ఏం చూసుకొని సినిమాల్లోకి వచ్చావ్..?’ -
అక్కినేని కోడలు శోభిత స్టన్నింగ్ లుక్స్.. గ్రీన్ శారీలో సాక్షి బ్యూటీ...!
బ్లాక్ డ్రెస్‌లో రష్మిక పోజులు...రెడ్ శారీలో శ్రియా శరణ్ అందాలు..ఆరెంజ్ కలర్లో మెరిసిపోతున్న నమ్రతా..హీరోయిన్ దుషారా విజయన్ గ్లామరస్ పిక్స్..ఈవెంట్లో మెరిసిన అక్కినేని కోడలు శోభిత..గ్రీన్ శారీలో మెరిసిన సాక్షి అగర్వాల్.. View this post on Instagram A post shared by Suta | Sarees & Blouses (@suta_bombay) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Khushi Kapoor (@khushikapoor) View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు
-
మైసా తో బ్లాక్ బస్టర్ కొట్టేస్తా...
-
‘ఎనిమిది గంటలు నీటిలో ఉండడానికి.. నేను చేపనా..’
రష్మిక మందన్న నటిస్తున్న ఆసక్తికరమైన చిత్రాల్లో 'మైసా' ఒకటి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2026 నవంబర్ 27న విడుదల కానుంది. ఇందులో ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి, కార్తిక్ రంజిని, తారక్ పొన్నప్ప, నిధి సింగ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మరో రెండు వారాల షూటింగ్ ఉంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.సుమారు 8గంటలు కిందే ఉండమన్నారు..‘మైసా’ కోసం నా లైఫ్‌నే ఇచ్చేశాను. కథ అద్భుతంగా అనిపించింది. డైరెక్టర్ నాతో చాలా రిస్కీ స్టంట్స్ చేయించారు. అండర్ వాటర్‌లో ఫైట్ ఉంది అని డైరెక్టర్ చెప్పారు. నాకు ఈత వచ్చుకదా అని సరే చెప్పా. తీరా చూస్తే.. సుమారు 8గంటలు కిందే ఉండమన్నారు. అదేలా నేను ఏమైనా చేపనా అలా ఉండడానికి అనిపించింది. కథకు తగ్గట్లుగా నిజంగా చేయాలంటే ఎంత కష్టమో అప్పుడే తెలిసింది’ అని చెప్పారు. ఇదే క్రమంలో ఓ అభిమాని మీకు తెలంగాణ భాష వచ్చేసింది అక్కా అని చెప్పగా.. ‘నేను ఏ రకంగా మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు. పోనిలే మాట్లాడింది మీకు అర్థం అవుతుంది కదా’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.రణబాలి విషయానికి వస్తే.. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఇటీవలే ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదీ చదవండి: కదిలిస్తే.. కన్నీరే.. ఇదే హీరోయిన్ కయాదు జర్నీ #GirlFriend Movie కోసం నా ఎమోషన్ మొత్తం ఇచ్చేశా..#Mysaa Movie కోసం నా లైఫ్‌నే ఇచ్చేశా.:- Actress #RashmikaMandanna pic.twitter.com/DSOXzS9pWC— Milagro Movies (@MilagroMovies) September 20, 2026 -
క్యూట్ లుక్స్‌తో రష్మిక.. మైసా ఈవెంట్లో అలా.. (ఫొటోలు)
-
రష్మిక మందన్నా ‘మైసా’ మూవీ టీజర్ రిలీజ్ (ఫొటోలు)
-
రష్మిక యాక్షన్ మూవీ.. టీజర్ వచ్చేసింది
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా లీడ్ రోల్లో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌లో రష్మిక లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. 'అలసిపోయాను.. ఆగిపోయాను.. ఓడిపోయాను' అనే రష్మిక డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఈ టీజర్ చూస్తుంటే తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే మహిళ పాత్రలో రష్మిక కనిపించనున్నట్లు తెలుస్తోంది. 'యుద్ధానికి ఆయుధమంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు' అనే డైలాగ్ మైసాపై మరింత ఆసక్తి పెంచుతోంది. రష్మిక ఫైట్ సీన్స్ చూస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీని నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బేజోయ్ సంగీతమందిస్తున్నారు. No fear to hold.No truth to hide.Just ONE promise to keep.#Mysaa – A DAUGHTER’S PROMISE.#MysaaTeaser out now ❤️🔥-- https://t.co/kUg5j4XxA0IN CINEMAS WORLDWIDE ON 27.11.26. 💥@iamRashmika @RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/AJCj8izHPY— UnFormula Films (@unformulafilms) September 20, 2026 -
రష్మికతో విజయ్ ‘ఎందయ్యా సామి’ సాంగ్ వచ్చేస్తోంది..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘రణబాలి’ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది. అజయ్-అతుల్ సంగీతం అందించిన ‘ఎందయ్యా సామి’ పాటను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ పాట అందుబాటులోకి రానుంది.రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ రణబాలిగా, రష్మిక మందన్న జయమ్మగా కనిపించనున్నారు. 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల నేపథ్యంలో కథ సాగనుంది. 130 రోజుల పాటు షూటింగ్ జరిపిన ఈ మూవీ అక్టోబర్ 16, 2026న దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. -
నటనకు ప్రాణం పెట్టిన తారలు.. కోట్లలో కలెక్షన్లు
బయోపిక్ అంటేనే ఓ సవాల్. నిజజీవితంలో తెలిసిన వ్యక్తులను తెరపై వారి పాత్రలో నటించి మెప్పించడం అంత ఈజీ మాట కాదు. వారి హావాభావాలు, నడక, మాట తీరు, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే ప్రముఖల బయోపిక్‌లో నటించడం నటీనటులకు సవాల్‌తో కూడుకున్న పని. కొంచం అటు ఇటు అయితే అటు డైరెక్టర్లకి, ఇటు యాక్టర్లకీ ట్రోలింగ్ తప్పదు. అయితే ఇంతటి కఠిన పరీక్షలోనూ కొంతమంది తారలు అలాంటి పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన వారు కూడా ఉన్నారు. బయోపిక్ కథాంశంతో వచ్చి బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమాలూ ఉన్నాయి. ఇలా తెలుగు విడుదలైన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని మనం చూద్దాం.మహానటిగా కీర్తి సురేశ్తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటి సావిత్రి. ఈమె కోసం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి నటి జీవితాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించారు. తెరపై సావిత్రిగా కనిపించేందుకు ఆమె చేసిన ప్రయత్నం ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. సినిమా కూడా మంచి ఆదరణ పొందడంతో కీర్తి సురేశ్‌కు ఏకంగా ఉత్తమ నటి జాతీయ అవార్డు అందుకుంది. ఈ సినిమా 2018లో విడుదలై సుమారు 90కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తలైవిగా కంగనా రనౌత్..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. ఇందులో కంగనా రనౌత్.. జయలలిత పాత్రలో కనిపించారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా విడుదల సమయంలో కంగనా లుక్, నటనపై చర్చ జరిగింది. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. 2021లో విడుదలైన ఈ చిత్రం సుమారు 50 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది.గుంగూబాయిగా అలియా భట్ముంబైలోని కామాఠిపుర ప్రాంతంలో ప్రముఖరాలిగా ఎదిగిన గంగూబాయి జీవితంలోని కొన్ని ఘటనల ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన చిత్రం ‘గంగూబాయి కాఠియావాడి’. సాధారణ యువతిగా మొదలై కామాఠిపురంలో ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగిన గంగూబాయి పాత్రలో అలియా భట్ విభిన్నమైన నటనను ప్రదర్శించారు. ఈ చిత్రానికి అలియాకు మంచి ప్రశంసలు అందాయి. 2022లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా 126 కోట్లకు పైగా వసూళ్లను రాబెట్టింది.గంజన్ సక్సేనాగా జాన్వీ కపూర్జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కార్గిల్ ముద్ధంలో సేవలందించిన భారత వైమానిక దళ అధికారిణి గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కోవిడ్ కారణంగా థియేటర్లలో విడుదలకానప్పటికీ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగా రష్మిక..ఇప్పుడు ప్రముఖ కర్ణాటక సంగీత విధ్వాంసురాలు ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కిస్తున్నారు. గౌతమ్ తిన్నునూరి దర్శకత్వంలో రష్మిక ఎం.ఎస్ సుబ్బులక్ష్మిగా నటించనున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నరు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. -
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక మందన్న (ఫొటోలు)
-
వెనక్కితగ్గని ‘రణబాలి’.. షూటింగ్ పూర్తి..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమి చిత్రీకరణ పూర్తిచేసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ప్రత్యే పోస్టర్‌ను పంచుకుంది.కాగా ఈ చిత్రం1854 నుంచి 1878 మధ్యకాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కింది. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. విజయ్, రష్మిక పెళ్లి తరువాత వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. -
సుబ్బులక్ష్మి అమ్మ సంగీతమే మనకు సందేశం
‘‘సుబ్బులక్ష్మి అమ్మ సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ... ఇలా ఏ భాషలో పాడినా ఆ భాషకే అందం తెచ్చేలా ఆ పాట ఉండేది. తన సంగీతంతో భారతదేశాన్ని, ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసిన సంగీత సామ్రాజ్ఞి. ఆమె సంగీతమే మనకు సందేశం’’ అని కమల్‌హాసన్ తెలిపారు. సంగీత సామ్రాజ్ఞి, గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర ‘భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మి’ పేరుతో వెండితెరపైకి రానుంది. రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. బుధవారం ఎంఎస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను కమల్‌హాసన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో ర ష్మికా మందన్నపై చిత్రీకరించిన సన్నివేశానికి కమల్‌హాసన్ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా గౌతమ్ తిన్ననూరి మాట్లాడుతూ– ‘‘మన దేశపు గొప్ప సంగీత సామ్రాజ్ఞి గురించి సినిమా చేస్తున్నాం’’ అన్నారు. ‘‘సుబ్బులక్ష్మి అమ్మ జీవితంలోని ఘటనల గురించి తెలిశాక ఈ బయోపిక్ తీయాలని మరింతగా స్ఫూర్తి పొందాం. నాలుగు దక్షిణ భారత భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నాం’’ అని చెప్పారు అల్లు అరవింద్. ‘‘ఈ సినిమా నిర్మించడం నాకు దక్కిన గౌరవం’’ అన్నారు బన్నీ వాస్. ‘‘ఈ సినిమా వెనక ఏడెనిమిదేళ్ల ప్రయత్నం ఉంది’’ అన్నారు రాక్‌లైన్ వెంకటేశ్. ‘‘నటిగా గొప్ప చాన్స్ దక్కినందుకు కృతజ్ఞతతో మనసు నిండిపో తోంది. అమ్మ జీవిత ప్రయాణంలో చిన్న భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు రష్మిక. ఈ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు ఎంఎస్ సుబ్బులక్ష్మి మనవడు చంద్రశేఖర్, ఆయన భార్య మణిమాల పాల్గొన్నారు. -
MS సుబ్బలక్ష్మి బయోపిక్ లో అడుగు పెట్టిన రష్మిక
-
ఎమ్మెస్ సుబ్బలక్ష్మిగా రష్మిక.. అధికారిక ప్రకటన
తెలుగింటి కోడలైన రష్మికని మరో అద్భుతమైన అవకాశం వరించింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, భారతరత్న అవార్డ్ గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక నటించబోతుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఇప్పుడు ప్రకటించారు. దీంతో గత కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌కి చెక్ పడింది.(ఇదీ చదవండి: రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో)ఎమ్మెస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రస్తావన గత కొన్ని నెలల నుంచి వస్తూనే ఉంది. సాయిపల్లవి, రుక్మిణి వసంత్ తదితరుల పేర్లు వినిపించాయి. కానీ చివరకు రష్మిక ఈ సదావకాశం దక్కించుకుంది. సుబ్బులక్ష్మి జయంతి సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో ఈ మూవీ గ్రాండ్ లాంచ్ జరగనుంది. కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.'MS – A Legacy on Screen' (ఎమ్ఎస్: ఏ లెగసీ ఆన్ స్క్రీన్) పేరుతో ఈ బయోపిక్ రానుంది. చెన్నైలో జరిగే లాంచ్ ఈవెంట్లో ఇండియన్ చోరల్ ఎన్సెంబుల్ ప్రత్యేకంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆలపించిన కొన్ని ప్రముఖ గీతాలను ప్రదర్శించి ఆమెకు నివాళులు అర్పించనున్నారు. ఇకపోతే అల్లు అరవింద్, బన్నీవాసు, రాక్ లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జెర్సీ, మళ్లీరావా, కింగ్డమ్ చిత్రాలు తీసిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. అనిరుధ్ సంగీతమందించబోతున్నాడు.ఇప్పటివరకు కమర్షియల్, యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న రోల్స్ చేస్తున్న రష్మిక.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా ఎలా కనిపించనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా అనిపిస్తోంది. భారతీయ సంగీత ప్రపంచంలో చెరగని ముద్రవేసిన ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.. సంగీత రంగానికే పరిమితం కాలేదు. సేవాసదనం, శకుంతలై, సావిత్రి, మీరా లాంటి సినిమాల్లోనూ కనిపించారు.రష్మిక విషయానికొస్తే చాన్నాళ్లుగా తెలుగులో నటిస్తున్న ఈమె.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లిచేసుకుంది. వివాహం తర్వాత వీళ్లిద్దరూ కలిసి 'రణబాలి' అనే మూవీ చేశారు. వచ్చే నెల 16న ఇది పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. అలానే రష్మిక చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' నవంబర్ 27న రిలీజ్ కానుంది. (ఇదీ చదవండి: రష్మికతో ఐటెం సాంగ్.. ఆ భయంతో తీసేశారు: తమన్) -
షూటింగ్ పూర్తి.. రష్మికకు విజయ్ స్పెషల్ హగ్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ స్పెషల్ మూమెంట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.‘రణబాలి’లో జయమ్మ పాత్రలో నటిస్తున్న రష్మిక తన షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేశారు. ఇంజ్యూరీ నుంచి కోలుకున్న తర్వాత ఆమె తిరిగి సినిమా సెట్స్‌లో అడుగుపెట్టారు. తాజాగా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేసిన సందర్భంగా చిత్రబృందం ఆమెకు వీడ్కోలు పలికింది. ఈ సమయంలో రష్మికను అభినందించేందుకు విజయ్ దేవరకొండ కూడా సెట్‌కు వచ్చారు. ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ ‘రణబాలి’ టీజర్ చూశారా..షూటింగ్ పూర్తయిన సందర్భంగా..రష్మిక షూటింగ్ పూర్తయిన సందర్భంగా విజయ్ ఆమెను ఆప్యాయంగా హగ్ చేసుకున్నారు. ఈ స్పెషల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమ అభిమాన జంటను ఇలా చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.బ్రిటిష్ పాలన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో విజయ్ దేవరకొండ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇదీ చదవండి: ఇరుముడి చిత్రబృందానికి ’మెగా‘ అభినందనలు It's a wrap for Jayamma ✨We will dearly miss you on sets, @iamRashmika ❤️The much loved #EndhayyaSaami out very soon.#RanabaaliTeaser TRENDING #1 on YouTube 🔥▶️https://t.co/tqKGJM7RdG#Ranabaali GRAND RELEASE WORLDWIDE ON 16.10.26.#NeverForget#RanabaaliOnOct16th pic.twitter.com/qHX008QMkF— Mythri Movie Makers (@MythriOfficial) September 13, 2026 -
ఎకో ఫ్రెండ్లీగాపండగ చేసుకుందాం – దేవరకొండ రష్మిక
‘‘మా ‘అత్తమ్మ’, మా ‘నాన్న’... మా ఇంటికి పిల్లర్స్’’ అంటున్నారు రష్మికా మందన్నా. మామగారిని నాన్న అని పిలుస్తారామె. ‘దేవరకొండ’ ఇంటి కోడలిగా రష్మిక తొలి వినాయక చవితి పండగని జరుపుకోనున్నారు. మరి... పండగ ప్లాన్ ఏంటి? అంటే... ‘‘మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలను కుంటున్నాను’’ అన్నారు రష్మిక. ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన పలు వేడుకల్లో రష్మిక పాల్గొన్నారు. ఇప్పుడు ‘దేవరకొండ రష్మిక’గా పండగ చేసుకోవడం ఓ స్పెషల్ ఫీలింగ్ అన్నారామె. వినాయక చవితి సందర్భంగా ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ‘దేవరకొండ రష్మిక’ చెప్పిన విశేషాలు...→ మీ ఇంట్లో పండగ ప్లాన్‌లో ఎవరి భాగం ఎక్కువ?అంతా మా అత్తమ్మే. ఇంట్లో ప్రతిదీ తనే ప్లాన్ చేస్తారు. నేను ఆమె చేసేవన్నీ జస్ట్ అలా ఎంజాయ్ చేస్తాను. నేననే కాదు... ఇంట్లో మేం అందరం బాధ్యత అంతా పూర్తిగా అత్తమ్మకే వదిలేస్తాం. అయితే డైట్ విషయంలో మేమంతా చాలా జాగ్రత్తగా ఉంటాం. బహుశా పండగ రోజు కూడా డైట్ నియమాలను పాటిస్తామేమో. మేం డైట్ పాటించినా, పాటించకపోయినా, ఇంట్లో ఏం చేసినా చేయకపోయినా... ఇంట్లో ఏమేం చేయాలో అన్నీ మా అత్తమ్మే చూసుకుంటారు. → మీరు, మీ భర్త... మీ ఇద్దరిలో ఎవరికి భక్తి ఎక్కువ? ఇద్దరికీ... నేను ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు వర్క్ మీద వెళ్లేటప్పుడు పూజ చేసుకుని వెళతాను. విజయ్ కూడా చేస్తుంటారు. మేం ఇద్దరం గుడికి కూడా బాగా వెళుతుంటాం. భక్తి తాలూకు ఆ అనుభూతిని ఇద్దరం ఆస్వాదిస్తాం. → పండగకు ఇంటిని అలంకరించే విషయం కూడా మీ అత్తమ్మ చెప్పినట్లేనా? అంతే... ఇంట్లో ఎలాంటి సందడి నెలకొన్నా మా అత్తమ్మకే థ్యాంక్స్ చె΄్పాలి. మా అత్తమ్మ మా ఇంటికి ‘సూర్య రశ్మి’లాంటివారు. ఇంటిని అలంకరించడం, పిండి వంటలు చేయడం నుంచి పూజ చేయడం వరకూ అన్నీ ఆమే చేస్తారు. ఇంతకు ముందు చెప్పినట్లు మేం ఎంజాయ్ చేస్తాం. → మరి... పండగ వేడుకల్లో మీ మామయ్యగారు, మరిది (ఆనంద్ దేవరకొండ) భాగస్వామ్యమో? విజ్జు (విజయ్ దేవరకొండ), నాన్న, నా, ఆనంద్... మా అందరి భాగస్వామ్యం ఈక్వల్‌గా ఉంటుంది.. అయితే ఇంటి సారథి మాత్రం కచ్చితంగా అత్తమ్మే. మేం నలుగురం ఆమె మాట వింటాం... చెప్పినది చెప్పినట్లు నిజాయితీగా చేస్తాం. ఎందుకంటే మేం మా పనుల్లో మునిగిపోతాం... ఎప్పుడూ పరుగులు పెడుతూ ఉంటాం. సో... ఇంట్లో మమ్మల్ని నిలకడగా ఉంచేది మా అత్తమ్మే. అసలు ఆవిడ పనులను ఎంత బాగా చేస్తారంటే... మెచ్చుకోవాలనిపిస్తుంటుంది. అంత బాధ్యతగా ఇంటిని పట్టించుకుంటారు కాబట్టే అత్తమ్మ ఏం చెబితే అది నమ్మి చేసేస్తాం. → ఇప్పుడు దేవరకొండ ఇంటి కోడలిగా పండగలో పాలుపంచుకోబోతున్నారు... ‘మిస్ రష్మిక’గా ఉన్నప్పుడు ఆ ఇంటి పూజల్లో పాల్గొన్నారా? పండగలప్పుడు, పూజలప్పుడు మా అత్తమ్మ దగ్గరవాళ్లందర్నీ పిలుస్తారు. ఈ ఇంటి ఆనవాయితీ అది. అలా నన్ను కూడా పిలిచేవారు. నన్ను సొంత మనిషిలా అనుకునేవారు. సో... ‘రష్మిక’లా ఈ ఇంటి వేడుకల్లో నేను చాలాసార్లు పాల్గొన్నాను. → ‘మిస్ రష్మిక’గా వెళ్లినప్పుడు ఇప్పుడు ‘మిసెస్ విజయ్’గా ఆ ఇంట్లో ఉంటున్న మీకు కనిపించిన తేడా? నిజాయితీగా చె΄్పాలంటే... ఏ తేడా లేదు. అప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఏమీ మారలేదు. ఒప్పుడు ఓ ఫ్రెండ్‌లా నన్ను ఇంటికి పిలిచేవారు. ఇప్పుడు విజ్జు భార్యగా ఆ ఇంట్లో ఉన్నాను. వ్యక్తులుగా మాలో ఏ మార్పూ లేదు. అయితే ఒక్క విషయం ఏంటంటే... ఆ కుటుంబ సభ్యురాలిగా ఉండటం అనే అనుభూతి వేరు. ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడంలో దక్కే ఆనందాన్ని మాటల్లో చెప్పడం కష్టం.→ ఎప్పుడైనా వినాయకుడి బొమ్మను గీశారా?నాకు బొమ్మలు గీయడం అస్సలు రాదు, కానీ రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. వినాయకుడి బొమ్మ గీసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాక్కూడా గీయాలనిపించలేదు. ఎందుకంటే నేను ఆ రూపానికి న్యాయం చేయలేనని నా ఫీలింగ్. అందుకే అసలు ప్రయత్నం కూడా చేయకూడదనుకున్నాను. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎవరో నన్ను మట్టితో వినాయకుణ్ణి తయారు చేయమని అడిగితే కాదన లేక ప్రయత్నం చేశాను. నాకు చేతనైనంతలో బాగానే చేశాను.→ పెళ్లి వేడుకల్లో మీరు కట్టుకున్న చీరలన్నీ బాగున్నాయి... మరి... పండగ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు? కచ్చితంగా చీర కట్టుకుంటాను. ఈ పండగ జరుపుకోవడానికి వర్క్ నుంచి నాకు కొన్ని గంటలైనా బ్రేక్ దొరికితే బాగుండు అను కుంటున్నాను. ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ మెటీరియల్ శారీ కట్టుకోవాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చాలా ఉన్నాయి... అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది కట్టుకుంటాను.→ ఇటీవల విజయ్ ‘సీడ్ గణేశా’కి ప్రాధాన్యం ఇవ్వాలంటూ మట్టి వినాయకుడితో దిగిన ఫొటో బయటకు వచ్చింది... అవును... మా ఇంట్లో మేం పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాం. రాబోయే తరాలకు సుర క్షితమైన పర్యావరణం ఉండాలి కదా. అందుకు మా వంతు కృషి చేస్తాం. అందుకే ‘ఎకో ఫ్రెండ్లీ’ వినాయకుడిని ఇంటికి తీసుకు వస్తున్నాం. మేమే కాదు... అందరం ఎకో ఫ్రెండ్లీగా పండగ చేసుకుందాం.– డి.జి. భవాని -
రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)
-
చరిత్ర సృష్టించిన రష్మిక
-
రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఎపిక్' లాంటి సినిమాలు చేయడం చాలా కష్టం: రష్మిక
‘‘ఎపిక్’ ట్రైలర్ చాలా నచ్చింది. మంచి రొమాంటిక్, కామెడీ వైబ్‌లో ఉంది. ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. ఈ నెల 11న మీతో (ప్రేక్షకులతో), యూనిట్‌తో కలిసి ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ నెల 10న ప్రీమియర్స్ వేస్తున్నారు... చూసి ఎంజాయ్ చేయండి’’ అని రష్మిక మందన్నా పేర్కొన్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్–ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరోయిన్ రష్మిక మందన్నా మాట్లాడుతూ– ‘‘ఎపిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి వస్తారా? అని ఆనంద్ మెసేజ్ చేశాడు. ‘రణబాలి’ షూట్లో హైదరాబాద్‌లో ఉన్నాను. తప్పకుండా వస్తానని, వచ్చేశాను. ఆనంద్ చాలా కష్టపడతాడు. తన సినిమాలు బాగా ఆడాలి, మంచి వసూళ్లు రావాలి. వైష్ణవి కోసం అద్భుతమైన పాత్రలు రాస్తుండటం గొప్ప విషయం. ఆదిత్య హాసన్ ఈ మూవీని అద్భుతంగా తీశారనిపిస్తోంది’’ అని తెలిపారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘వదినమ్మతో (రష్మిక) ఇంట్లో ఎక్కువగా మాట్లాడను. కానీ, ‘ఎపిక్’ ప్రమోషన్స్ గురించి నన్ను అడిగి మరీ తెలుసుకుని సపోర్ట్ చేశారు. విజయ్‌లాంటి అన్నయ్య, రష్మికలాంటి వదినమ్మ ఉన్నందుకు అదృష్టవంతుణ్ణి. ‘ఎపిక్’ భావోద్వేగమైన, అందమైన సినిమా’’ అని చెప్పారు. -
తుంటి గాయం.. పెళ్లి తర్వాత లోటును తీర్చేసింది: రష్మిక
టాలీవుడ్ రష్మిక ప్రస్తుతం మైసాతో పాటు రణబాలి చిత్రంలోనూ నటిస్తున్నారు. పెళ్లి తర్వాత విజయ్, రష్ జంటగా నటిస్తోన్న చిత్రం రణబాలి కావడం విశేషం. అయితే ఇటీవల రష్మికకు తుంటి గాయమైంది. ఆ తర్వాత షూటింగ్‌లకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. అదే సమయంలో తనతో విజయ్ దేవరకొండ ఎక్కువ సమయం ఉన్నారని తెలిపింది. పెళ్లి తర్వాత కంటే గాయం అయ్యాకే మాకు ఎక్కువ సమయం దొరికిందని చెప్పుకొచ్చింది.షూటింగ్స్ బిజీ షెడ్యూల్స్ వల్ల తామిద్దరం ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయలేకపోయామని వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ పెళ్లి తర్వాత మూడు నెలల పాటు ఒకరినొకరం చాలా అరుదుగా కలిసేవాళ్లమని తెలిపింది. మా ఇద్దరి సంభాషణ చాలా వరకు ఫోన్ కాల్స్‌కే పరిమితమైందని రష్మిక వెల్లడించింది. అయితే తనను ఇంట్లోనే ఉండేలా చేసిన గాయం.. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసిందని పేర్కొంది. పెళ్లి తర్వాత మేమిద్దరం కలిసి గడిపిన సుదీర్ఘ సమయం కూడా ఇదేనని రష్మిక తెలిపింది.గాయం కాకుండా ఉంటే.. ఇలాంటి విరామ సమయంలో విజయ్ మరింత సంతోషంగా ఉండేవాడని వెల్లడించింది. ఈ విరామం నిద్రపోవడానికి, చదువుకోవడానికి, పజిల్స్ పరిష్కరించుకోవడానికి.. తన కుటుంబంతో సమయం గడపడానికి కూడా అవకాశం ఇచ్చిందని తెలిపింది. బిజీ షెడ్యూల్లోకి వెళ్లాక.. ఇలాంటి ప్రశాంతమైన క్షణాలను తాను మిస్ అవుతానని చెప్పింది. గాయపడినప్పటికీ, తాను నిస్సహాయంగా భావించలేదని రష్మిక చెప్పింది. ఇతరులపై ఆధారపడటం తనకు ఇష్టం లేదని.. తన పనులు తాను చూసుకోగలగడానికే ప్రాధాన్యత ఇస్తానని వివరించింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, తన కుటుంబంతో కలిసి మధురమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. -
నాకూ బ్రేకప్ అయింది: విజయ్ దేవరకొండ
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామానాయడు స్డూడియోస్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. మద్యం మానేయడం, ప్రేమలో పడటం, బ్రేకప్ ఎదుర్కోవడం, చివరకు పెళ్లి చేసుకోవడం.. ఇలా తన జీవితంలో చోటుచేసుకున్న కీలక మలుపులను గుర్తుచేసుకున్నారు. ‘రొమాంచకం’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ప్రేమ, బ్రేకప్, మద్యం మానేయడం, పెళ్లి వంటి అంశాలపై ఓపెన్‌గా మాట్లాడటంతో అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.బ్రేకప్ అయింది..తన జీవితంలోని జరిగిన కొన్ని అనుభవాలని విజయ్ వివరిస్తూ.. ‘నేను ఆల్కహాలిక్ని. డబ్బులు ఉన్నా లేకపోయినా విస్కీ తాగేవాడిని. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల మద్యం మానేయాలని నిర్ణయించుకున్నా. తర్వాత ప్రేమలో పడ్డా. బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా. ఏదేమైనా.. ఇదంతా థ్రిల్లింగ్ అనుభవమే’ అని విజయ్ తెలిపారు. ఇదీ చదవండి: ‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!ప్రస్తుతం రణబాలితో..ఇదే సందర్భంలో వదినమ్మ ఎలా ఉంది అని అభిమానులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘రష్మిక బాగుంది. ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. పని నుంచి విరామం తీసుకుని రిలాక్స్ అవుతోంది’ అని చెప్పారు. కాగా విజయ్, రష్మిక కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. Question: 2026 లో మీ దృష్టిలో ఒక 'రోమాంచకం' మూమెంట్ అంటే ఏమిటి?#VijayDevarakonda : 89 లో పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతీదీ రోమాంచకమే . జేబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, బ్లెండర్స్ ప్రైడ్ తాగినా గ్లెన్ ఫిడిచ్ తాగినా, మందు వదిలేసినా, ప్రేమలో పడినా, హార్ట్ బ్రేక్ అయినా, పెళ్లి… pic.twitter.com/G1DmPjT064— CHITRAMBHALARE (@chitrambhalareI) August 30, 2026 -
అచ్చొచ్చిన నెలనే మళ్లీ టార్గెట్ చేసిన రష్మిక
హీరోయిన్ రష్మిక కొన్నాళ్ల క్రితం గాయపడింది. ఓ పాట షూటింగ్లో భాగంగా తుంటి భాగానికి గాయమవగా ఇంట్లోనే నెల పాటు విశ్రాంతి తీసుకుంది. ప్రస్తుతం తిరిగి చిత్రీకరణలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే సదరు మూవీ 'మైసా' విడుదల తేదీని ప్రకటించారు. మళ్లీ అచ్చొచ్చిన నవంబరు నెలలోనే రష్మిక.. తన మూవీతో థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: పెళ్లి పేరుతో మోసం.. పరారీలో 'బాసింగ బలాలే' ఈశ్వర్ సాయి)గతేడాది నవంబరులో 'ద గర్ల్ ఫ్రెండ్' సినిమాతో సక్సెస్ అందుకున్న రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భర్తతోనే 'రణబాలి' అనే పీరియాడికల్ మూవీ చేస్తోంది. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబరు 11నే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ వాయిదా పడటంతో అక్టోబరు 16న రావాలనే ఆలోచనలో ఉన్నారు.మరోవైపు రష్మిక చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా'. రవీంద్ర పుల్లెల దర్శకుడు. పూర్తిగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ సినిమా నుంచి రష్మిక పవర్ఫుల్ లుక్ వదిలి నవంబరు 27న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంటే దాదాపు నెల గ్యాప్‌లో రష్మిక తన రెండు మూవీస్‌తో బిగ్ స్క్రీన్స్‌పైకి రాబోతుందనమాట.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి)Resilient by nature.Fearless by choice.Unbreakable by spirit. ❤️🔥Get ready to experience the world of #MYSAA with #RashmikaMandanna like never before.💥IN CINEMAS WORLDWIDE ON 27.11.26🔥@iamRashmika @RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/ZmpAUeYGqU— UnFormula Films (@unformulafilms) September 1, 2026 -
రష్మిక హెల్త్ ఎలా ఉంది? వదిన నన్ను ముద్దుగా ఏమని పిలుస్తాదంటే?
-
స్టార్ హీరోయిన్స్ కొత్త రూట్.. బయోపిక్స్ బాటలో స్టార్ హీరోయిన్స్
-
రష్మిక కు బాగానే ఉంది ఇంట్లో ఎంజాయ్ చేస్తుంది
-
పెళ్లి తర్వాత తొలి చిత్రం.. అప్డేట్ వచ్చేసింది..
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. తొలిత ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ రష్మికకు గాయం కావడంతో విడుదల తేదీని మార్చారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రష్మికకు గాయం..రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక చేస్తున్న యాక్షన్ సినిమా ‘మైసా’. ఇందులో గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక కనిపించనుంది. ఓ పాట షూటింగ్ చేస్తుండగా ఈమెకు బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తు తం కోలుకోవడంతో త్వరలోనే మూవీ షూటింగ్లో పాల్గొనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: సన్నీ లియోన్‌పై కేసు.. కొట్టేసిన కోర్టు -
‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ
చాలాకాలం తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడింది. శివ నిర్వాణ దర్శకత్వం ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు.. రవితేజ, బేబీ నక్షత్రల నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే దర్శకుడు శివ నిర్వాణ తన కథ, కథనంతో అందరినీ ఎమోషనల్ గురి చేశాడని చెబుతున్నారు. సాధారణ ప్రేక్షకులే కాదు సినీ తారలు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ రోజే ఈ చిత్రంపై ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశాడు. ఇక తాజాగా నేషనల్ క్రష్ రష్మిక కూడా ఈ చిత్రంపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానని.. ఇరుముడి తన మనసుని ఎంతగానో హత్తుకుందని ట్వీట్ చేసింది.(చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ అండ్ రేటింగ్)‘నిన్న నాకు ‘ఇరుముడి’ సినిమా చూసే అవకాశం లభించింది. అసలు ఎంత మంచి సినిమానో ఇది. ఊహించని విధంగా నా మనసును ఎంతగానో హత్తుకుంది. సాధారణంగా చిన్నతనంలో మనకేదైనా జరిగినా లేదా ఏదైనా మనల్ని బాధించినా, అమాయకత్వంతో మన మొదటి స్పందన పెద్దవాళ్లకు చెప్పడమే ఉంటుంది.. కానీ ఆ తర్వాతే అసలు నిజం అర్థమవుతుంది.. ఏం జరిగినా సరే నోరు మూసుకుని ఊరుకోవాలని మనకు చెబుతారు... ఈ సినిమా ఒక అద్భుతమైన సర్ప్రైజ్. కచ్చితంగా ప్రస్తావించాల్సిన, మాట్లాడాల్సిన ఒక విషయాన్ని ఈ చిత్రం ఎత్తిచూపింది. (చదవండి: ‘ఇరుముడి’ ఫీవర్.. స్వామి గెటప్‌లో వార్నర్)రవితేజ సర్, మీకు అభినందనలు.. ఈ విజయం సాధించినందుకు మీ తరఫున నేను ఎంతో సంతోషిస్తున్నాను.. నక్షత్రకు నా అభినందనలు.. సినిమాలో నువ్వు సూర్యకాంతిలా మెరిసావు, నీ నవ్వు నా పెదవులపై చిరునవ్వు నింపింది.. శివ నిర్వాణ గారికి శుభాకాంక్షలు.. మీరు ఈ విజయానికి అన్ని విధాలా అర్హులు.. మీ గురించి చాలా చాలా సంతోషంగా ఉంది. చిత్రబృందం మొత్తానికి అభినందనలు. ఇంతటి సుందరమైన చిత్రాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు’ అని రష్మిక ట్వీట్ చేసింది. Yesterday I had the opportunity to watch Irumudi.. ❤️What a beautiful film it is.. ❤️ it hit me in ways I didn’t see coming.. ❤️Generally when we grow up in small towns something happens to us or something bothers us our first response will be to tell our elders what happened… pic.twitter.com/lyntnD3bm3— Rashmika Mandanna (@iamRashmika) August 25, 2026 -
ఇన్నాళ్లకు కనిపించిన రష్మిక..
తుంటి గాయం కారణంగా కొద్ది రోజుల నుంచి ఇంటికే పరిమితమైంది హీరోయిన్ రష్మిక. అయితే ఇప్పుడు తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి హైదరాబాద్‌లోని ఓ వివాహ వేడుకకు హజరై అభిమానులను ఆశ్చర్యపరిచింది. వీరిద్దరు నిర్మాత నిరంజన్ రెడ్డి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రష్మికకు గాయం..రవీంద్ర పుల్లే దర్శకత్వంలో రష్మిక చేస్తున్న యాక్షన్ సినిమా ‘మైసా’. ఇందులో గోండు తెగకు చెందిన మహిళగా రష్మిక కనిపించనుంది. ఓ పాట షూటింగ్ చేస్తుండగా ఈమెకు బలమైన గాయమైంది. దీంతో వైద్యులు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.పెళ్లి తర్వాత తొలి చిత్రం..టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. తొలిత ఈ సినిమా సెప్టెంబర్ 11న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ రష్మికకు గాయం కావడంతో విడుదల తేదీని అక్టోబర్ 30కి మార్చినట్లు సమాచారం. ప్రస్తుతం రష్మిక కోలుకోవడంతో త్వరలోనే షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఇదీ చదవండి: విడుదలకు ముందే ‘టాక్సిక్’ కలెక్షన్ల వర్షం Virosh @TheDeverakonda @iamRashmika snapped Producer #NiranjanReddy son engagement in Hyd.💓💓#VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/l6VF2ANwhd— Pavan Kumar (@pavankumar__123) August 24, 2026 -
బాక్సాఫీస్ బంగారం
కథలో ఆడియన్స్‌కు కనెక్ట్ చేయగల అంశాలు మెండుగా ఉంటే చాలు... ఉమన్ సెంట్రిక్ సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. 2024లో శ్రద్ధాకపూర్ ‘స్త్రీ 2’ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి, రూ. 850 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. తెలుగులో సమంత లీడ్ రోల్ చేసిన ‘మా ఇంటి బంగారం’ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరింది. దీంతో ఈ ఏడాది రాబోయే, ఆల్రెడీ సెట్స్‌పై ఉన్న ఉమన్ సెంట్రిక్ చిత్రాలపై ఇటు ఆడియన్స్‌లో, అటు ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. మరి... రానున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో ఏవి కనక వర్షం కురిపించి, ‘బాక్సాఫీస్ బంగారం’గా నిలుస్తాయో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.మహాదేవి నయనతార, ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మూకుత్తి అమ్మన్’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై, వీక్షకుల మెప్పు పొందింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మూకుత్తి అమ్మన్ 2’ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా తెలుగులో ‘మహాదేవి’గా విడుదల కానుంది. ఈ సినిమాకు సుందర్ .సి దర్శకత్వం వహించారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నుంచి ఆల్రెడీ నయనతార ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మైథాలజీ సినిమాలో భారీ వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉన్నాయట. ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దునియా విజయ్, రెజీనా కసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, ఇనయ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో స్నేహ ఓ కీలక పాత్రలో నటించనున్నారని కోలీవుడ్ సమాచారం.గిరిజన యువతి మైసా రష్మికా మందన్నా నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ది గర్ల్ ఫ్రెండ్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఇదొక రొమాంటిక్ లవ్‌స్టోరీ సినిమా. కాగా రష్మికా మందన్నా ప్రస్తుతం ‘మైసా’ అనే ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో గోండు గిరిజన యువతి పాత్రలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా యాక్షన్ విజువల్స్, యాక్షన్ స్టిల్స్‌గా కనిపిస్తున్నాయి. దీంతో ‘మైసా’ సినిమాలో మేజర్ పార్ట్ యాక్షన్దే అనిపిస్తోంది.ఇటీవల కేరళలో జరిగిన ఈ సినిమా చిత్రీకరణలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్. రెండు రోజుల్లో 20 గంటల పాటు ఓ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌లో కూడా పాల్గొన్నారు రష్మిక. సో... యాక్షన్ పరంగా ‘మైసా’ సినిమా మరో లెవల్లో ఉండబోతోందని స్పష్టం అవుతుంది. ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కోసమే రష్మిక మందన్నా ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. అయితే ఇటీవల ‘మైసా’ చిత్రీకరణలో రష్మికా మందన్నా గాయపడ్డారు. దీంతో ఆమెకు దాదాపు ఆరు వారాల పాటు విశ్రాంతిని సూచించారు వైద్యులు. ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్నారు రష్మిక. పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ‘మైసా’ సినిమా షూటింగ్‌ను మళ్లీ షురూ చేస్తారని ఊహింవచ్చు. ఈ చిత్రాన్ని తొలుత ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ రష్మికా మందన్నా గాయం వల్ల ‘మైసా’ సినిమా చిత్రీకరణ రిలీజ్‌పై ఎఫెక్ట్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నాతో పాటు రాహుల్ రవీంద్రన్, ఈశ్వరీ రావు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. డోరతీ లేడీ ఓరియెంటెడ్ జానర్లో ‘మహానటి’ సినిమాతో ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేశారు కీర్తీ సురేష్. ఆ తర్వాత ఆమె ‘మిస్ ఇండియా, పెంగ్విన్, రివాల్వర్ రీటా’ వంటి మరికొన్ని ఉమన్ సెంట్రిక్ చిత్రాల్లో నటించారు. తాజాగా ఆమె మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్‌లో నటించారు. అదే ‘డోరతీ’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిప ఈ సినిమా సెప్టెంబరు 25న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాలో సనంత్, రిషి కాంత్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నట్లు ఈ చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఇటీవల పేర్కొన్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో..! తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో, నిజ జీవిత ఘటనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘ది బ్లాక్‌గోల్డ్’. హీరోయిన్ సంయుక్త నటించిన తొలి ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇది. దేశాన్ని కుదిపేసిన కోల్ సిండికేట్ల బ్యాక్‌డ్రాప్ కథనంతో సాగే ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు సంయుక్త. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్ నగర్, ఆదిలాబాద్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లలో చిత్రీకరించారు.మొత్తం 60కి పైగా వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తి చేశారు. ఐదు పవర్ఫుల్ షెడ్యూల్స్‌లో, 10కి పైగా భారీ సెట్లలో, రోజుకు 300 మందికి పైగా క్రూ పాల్గొంటూ చిత్రీకరణ జరిగిందిని మేకర్స్ తెలి పారు. అంతేకాదు... ఈ సినిమా కోసం సంయుక్త కొన్ని రిస్కీ యాక్షన్ స్టంట్స్ సీక్వెన్స్ చేశారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా వెండితెరపై సంయుక్త నటన, బొగ్గు గనుల సిండికేట్ వంటి అంశాలను వెండితెరపై చూసేందుకు కాస్త సమయం ఉంది. ఈ ఏడాదే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ‘ది బ్లాక్ గోల్డ్’ సినిమా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ కానుంది. కేఎమ్‌సీ యోగేష్ దర్శకత్వంలో, మాగంటి పిక్చర్స్ సహకారంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా, రాంకి, రవీంద్ర విజయ్, అడు కలం నరేన్, బీవీఎస్ రవి, కృష్ణ చైతన్య, చంద్రిక రవి ఇతర కీలక పాత్రల్లో నటించారు. మైథాలజీ అండ్ సస్పెన్స్ ‘సవ్యసాచి’, ‘ఇస్మార్ట్ శంకర్’, ‘ది రాజా సాబ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు నిధీ అగర్వాల్. కాగా, తొలి సారి ఆమె ఓ ఉమన్ సెంట్రిక్ సినిమా చేయడానికి సిద్ధమైయ్యారు. నిధీ అగర్వాల్ నటించనున్న ఈ మైథాలజీ అండ్ సస్పెన్స్ డ్రామా ఉమెన్ సెంట్రిక్ సినిమాను ‘తంత్ర’ ఫేమ్ శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించనున్నారు. ఆగస్టు 17న నిధీ అగర్వాల్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమాను హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు మేకర్స్. అలాగే ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణను మొదలుపెట్టనున్నారు. వరాహ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సునీత్ పడోల్కర్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి మహాకాళి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఫీమేల్ సూపర్ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా, రోహిత్ సరాఫ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. 125 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మించిన ఈ మైథాలజీ సినిమాకు క్రియేటర్‌గా ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఇక ‘మహాకాళి’ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట ప్రశాంత్ వర్మ. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.విదేశాల్లో హ్యాపీ జర్నీ ఏడుగురు మహిళల జీవితాల నేపథ్యంలో రూపొందిన సినిమా ‘హ్యాపీ జర్నీ’. ఈ చిత్రంలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలి శెట్టి, రూ పా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రల్లో నటించారు. పారిస్, మాంట్ పెలియర్ వంటి అందమైన యూరప్ ప్రాంతాల లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు మేకర్స్. మేజర్ షూటింగ్ యూరప్‌లోనే జరిగింది. వేర్వేరు వయసులకు చెందిన ఏడుగురు మహిళలు ఒక రోడ్ ట్రిప్ (ప్రయాణం) ప్రారంభించి, ఆ ప్రయాణంలో వారి జీవితాలను, బంధాలను, భావోద్వేగాలను ఎలా అన్వేషించుకున్నారనే కోణంలో ‘హ్యాపీ జర్నీ’ సినిమా కథనం సాగుతుందని సమాచారం. ‘‘కథ విదేశీ నేపథ్యంలో సాగినా అందులోని మనుషుల అనుబంధాలు, భావాలు ప్రతి ఒక్కరికీ దగ్గరగా అనిపించేలా ఉంటాయి. నటీనటుల సహజమైన నటన, వారి మధ్య ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకు మరింత బలం చేకూర్చాయి’’ అని యూనిట్ పేర్కొంది. గుత్తా ప్రోడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తరుణ్ రెడ్డి సహ–నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివతేజ ఈ చిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటించారు.హీరోయిన్ సాయి పల్లవి నటించిన పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ సినిమా ‘గార్గి’. ఆ తర్వాత ఈ స్థాయిలో మరో ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ చేయలేదు సాయి పల్లవి. అయితే కొంతకాలంగా రెండు భాగాలుగా విడుదల కానున్న హిందీ ‘రామాయణ’, ఆల్రెడీ రిలీజైన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’తో సాయి పల్లవి బిజీగా ఉన్నారు. కాగా, సాయిపల్లవి ఓ ఉమెన్ సెంట్రిక్ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘నేను.. శైలజ’, ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ వంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు కిషోర్ తిరుమల మైథాలజీ అంశాలతో ఓ ఉమన్ సెంట్రిక్ సినిమా కథను రెడీ చేస్తున్నారట. ఈ చిత్రంలో సాయి పల్లవి మెయిన్ లీడ్ రోల్ చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అలాగే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గాయని, భారతరత్న అవార్డు గ్రహీత ఎమ్.ఎస్ సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా రానుందని, ఈ చిత్రంలో సాయి పల్లవి నటిస్తారనే ప్రచారం సాగుతోంది. బన్నీ వాసు, రాక్‌లైన్ వెంకటేశ్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రోడక్షన్ పనులు మొదలయ్యాయని, త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చనే టాక్ వినిపిస్తోంది.ఉమన్ సెంట్రిక్ సినిమాల ట్రెండ్ బాలీవుడ్‌లోనూ బాగానే కనిపిస్తోంది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కళాకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవితం ఆధారంగా హిందీలో రూపొందుతున్న సినిమా ‘ఈఠా’. మహారాష్ట్ర సంప్రదాయ కళలు ‘లవానీ’, ‘తమాషా’లో అత్యంత ప్రావీణ్యురాలైన విఠాబాయి బయోపిక్కు ‘చావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వెండితెర విఠాబాయిగా శ్రద్ధా కపూర్ నటిస్తున్నారు. మరో లీడ్ రోల్లో రణ్‌దీప్ హుడా నటిస్తున్నారు. దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ నిర్మిస్తున్న ‘ఈఠా’ సినిమా డిసెంబరు 4న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం శ్రద్ధా కపూర్ ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా గురించి శ్రద్ధా కపూర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ–‘‘ఈఠా’ సినిమా కోసం 15 కేజీల బరువు పెరిగాను. విఠాబాయి పాత్రలో ఓ సన్నివేశంలో చీరకట్టుతో పాటు భారీ ఆభరణాలు ధరించి డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. దీంతో కాలి కండరాలు ఒత్తిడికి గురయ్యాయి. వైద్యుల సూచనల మేరకు ఓ వారం రెస్ట్ తీసుకున్నాను’’అని పేర్కొన్నారు. ఇంకా ‘స్త్రీ 2’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత శ్రద్ధా కపూర్ నటిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్లో అంచనాలు ఉన్నాయి. మరో బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సైతం ఓ మహిళ పాత్ర బలంగా ఉన్న కథతో ‘తుంబాడ్ 2’ అనే సినిమా చేస్తున్నారు. సోహమ్ షా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబరు 3న రిలీజ్ కానుంది. ఇంకా ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్’ ఫ్రాంచైజీలోని ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 3’లో తమన్నా టైటిల్ రోల్ చేయనున్నారని, ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మించనున్నారనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇంకా ‘మడాక్ హారర్ కామెడీ యూనివర్స్’ నుంచి ‘శక్తి శాలినీ’ అనే ఉమన్ సెంట్రిక్ సినిమా రానుంది. ఈ చిత్రంలో అనీత్ పద్దా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, విశాల్ జెత్వా కీలక పాత్రలో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆదిత్య సర్పోత్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబరు 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
రష్మిక.. నా గురించి అందుకే అలా మాట్లాడిందేమో
రష్మిక స్వతహాగా కన్నడ అమ్మాయి. 'కిరిక్ పార్టీ' మూవీతో హీరోయిన్ అయింది. తర్వాత మాతృభాషలో కొన్ని మూవీస్ చేసింది. ఇదంతా 9-10 ఏళ్ల కిందటి ముచ్చట. అయితే ఈ టైంలో పలు వివాదాల్లోనూ ఈమె ఇరుక్కుంది. అందులో 'కేజీఎఫ్' హీరో యష్‌పై చేసిన 'షో ఆఫ్' కామెంట్ కూడా ఉంది. దీని కారణంగా యష్ అభిమానులు రష్మికని చాలా ట్రోల్ చేశారు. తొమ్మిదేళ్ల క్రితం నాటి వ్యాఖ్యపై యష్ ఇన్నాళ్లకు స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో సదరు విషయమై క్లారిటీ ఇచ్చాడు.(ఇదీ చదవండి: చిరంజీవితో సినిమా.. నేను ఇంకాస్త ఎదగాలి: డైరెక్టర్ వెంకీ అట్లూరి)'ఆమె ఏ సందర్భంలో ఆ కామెంట్ చేసిందో నాకు తెలీదు. అప్పుడే ఆమె ఇండస్ట్రీలోకి వచ్చింది. కొందరు యాంకర్లు ఇష్టమొచ్చినట్లు ప్రశ్నలు అడుగుతూ, ఆప్షన్లు ఇచ్చి ఏదో చెప్పమంటారు. బహుశా రష్మిక కూడా ఆ ఆప్షన్ నాకు సరిపోతుందని భావించి అలా మాట్లాడిందేమో! రష్మిక వ్యాఖ్యల వల్ల చాలామంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. అయితే తోటి నటీనటులు ఎవరేమనుకున్నా నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అది నా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయదు. ఎవరైనా తమకు నచ్చింది చెప్పొచ్చు. కానీ దాని వల్ల నేనేం మారిపోను' అని యష్ అన్నాడు.ఇక తన అభిమానులని ఉద్దేశిస్తూ ఈ క్రమంలోనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తోటి నటీనటులని గౌరవించలేని వాళ్లు తన అభిమానులే కాదని యష్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ వివాదంపై అప్పట్లోన రష్మిక స్పందించింది. అలా అన్నందుకు క్షమాపణ కూడా చెప్పింది. అయితే ఇన్నేళ్లకు సందర్భం రావడంతో యష్ కూడా స్పందించి ఎట్టకేలకు దీనికి ముగింపు పలికాడు. ఇకపోతే యష్ హీరోగా చేసిన 'టాక్సిక్'.. వచ్చే బుధవారం (ఆగస్టు 26) థియేటర్లలోకి రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: 'ఇరుముడి' నుంచి 'మల్లెపూల పల్లకి సాంగ్' రిలీజ్) -
ఆ రోజులు గుర్తు చేసుకుంటే భయమేస్తుంది
-
పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది
కొన్నిరోజుల క్రితం 'మైసా' షూటింగ్ సందర్భంగా గాయపడిన రష్మిక.. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటోంది. అయితే ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే ఉంటుంది అని చెబుతూ కొన్ని ఫొటోలని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అలానే తన పేరిట అన్నదానం కూడా నిర్వహించారని చెబుతూ ఓ వీడియోని పంచుకుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా)'ఎప్పుడైనా ఎక్కువరోజులు ఇంట్లో ఉంటే ఇలానే గడుస్తుంది. క్షణం తీరిక లేకుండా గడిపేవారికి విశ్రాంతి.. భయంగా అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు బిజీబిజీగా గడిపే పాత రోజుల్ని గుర్తుచేసుకుంటే భయమేస్తుంది. బహుశా జీవితం అంటే ఇదేనేమో?' అని సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ పెట్టింది.గతేడాది నవంబరులో 'గర్ల్ ఫ్రెండ్'తో హిట్ కొట్టిన రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకుంది. రెండు నెలల క్రితం 'కాక్ టెయిల్ 2' అనే హిందీ మూవీతో థియేటర్లలోకి వచ్చింది. భర్తతో కలిసి చేస్తున్న 'రణబాలి' షూటింగ్ జరుగుతుండగా, మరోవైపు లేడీ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' చేస్తోంది. దీని చిత్రీకరణలోనే తుంటి భాగానికి గాయమవగా.. ఆరు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అత్తారింట్లో రెస్ట్ తీసుకుంటోంది. తాజాగా రష్మిక అమ్మ ఈమె దగ్గరకొచ్చి పలకరించింది.(ఇదీ చదవండి: సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విటర్ రివ్యూ) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
ఓటీటీకి రష్మిక మందన్నా లేటేస్ట్ మూవీ.. అఫీషియల్ ప్రకటన
రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించింది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది.అయితే బాక్సాఫీస్ వద్ద అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్‌గా ప్రకటన వచ్చేసింది. ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. గతంలో దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 📢 Official Announcement ▶️#CockTail2 (Hindi) Streaming from August 14 on Netflix 🍿!!#OTT_Trackers pic.twitter.com/jpeSMvWDvR— OTT Trackers (@OTT_Trackers) August 12, 2026 -
పజిల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నా: రష్మిక మందన్నా
ఓ వైపు హీరోయిన్గా, మరోవైపు లీడ్ రోల్స్ చేస్తూ బిజీ బిజీగా ఉండే రష్మిక మందన్నా ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా ఓ డ్యాన్స్ మూమెంట్ చేస్తున్నప్పుడు ఇటీవల రష్మిక గాయపడిన సంగతి తెలిసిందే. 6 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెప్పడంతో ప్రస్తుతం రెస్ట్‌లో ఉన్నారు రష్మిక.ఈ ప్రమాదంపై తొలిసారి ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారామె. ‘‘గాయాలు కావడం నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది. ఈ గాయం గురించి ఎవరికీ తెలియకూడదనుకున్నప్పటికీ తెలిసిపోయింది. నాకు ఇలాంటి గాయం కావడం ఇది మూడవసారి. తుంటికి కాలుని కలిపే టెండన్స్ ఒక్కో వైపు నాలుగు ఉంటాయి. నా కుడి తుంటిలోని ఒక టెండెన్ ఊడిపోయింది. కాలుపైకి ఎత్తాలి అంటే అది మళ్లీ అతుక్కోవాలి. నేను చేస్తున్న సినిమాల్లో ‘మైసా’ అత్యంత కష్టమైన సినిమా.నేను విశ్రాంతి తీసుకోవడానికే దేవుడు ఈ గాయం బారిన పడేలా చేశాడని భావిస్తున్నాను. ఈ టైమ్‌లో మానసికంగా బలంగా ఉండటానికి పజిల్స్ పూర్తి చేస్తూ కాలక్షేపం చేస్తున్నాను. అదేవిధంగా ఫిట్నెస్ దెబ్బతినకుండా, బరువు పెరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నా ఆరోగ్యం గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందవద్దు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తాను’’ అని రష్మిక మందన్నా పేర్కొన్నారు. -
ఓటీటీలోకి రష్మిక కొత్త సినిమా...స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
షాహిద్ కపూర్, రష్మిక, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాక్టెయిల్ 2’.హోమీ అదజానియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లో విడుదలై..మంచి విజయం సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఆగస్ట్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.కాక్ టెయిల్ 2 కథేంటంటే..కునాల్ (షాహిద్ కపూర్), దియా (రష్మిక మందన్న) ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఓ సారి కునాల్, దియా ఫారిన్లో వెకేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడ దియా బెస్ట్‌ఫ్రెండ్ యాలీతో కునాల్‌కి పరిచయం ఏర్పడుతుంది. అయితే కునాల్‌పై యాలీ క్రష్ పెంచుకోవడమే కాకుండా ఓ సమయంలో అతడితో శారీరకంగా కలుస్తారు. ఈ విషయం దియాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది? కునాల్, దియా మధ్యకు యాలీ ఎలా వచ్చింది? దియాతో డేటింగ్ చేస్తున్నప్పటికీ.. యాలీ ఎలా దగ్గరైంది? చివరకు కునాల్ ఎవరినీ పెళ్లి చేసుకొన్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
రష్మికకు ఏమైంది..?
-
షూటింగ్లో రష్మికకు గాయాలు.. అభిమానుల్లో ఆందోళన
-
హీరోయిన్ రష్మికా దేవరకొండకు గాయాలు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ హీరోయిన్, పాన్ ఇండియా స్టార్ రష్మికా దేవరకొండ ప్రమాదానికి గురయ్యారు. ఓ సినిమాకు సంబంధించిన డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో ఇది జరిగింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన ఫీల్ గుడ్ సినిమా 'చిన్న చిన్న ఆశై' తెలుగు రివ్యూ)డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నప్పుడు రష్మికకు ఒక్కసారిగా జారిపడటంతో ఆమె నడుముకు బలమైన గాయమైంది. ప్రమాదం జరిగిన వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించారు. రష్మికను పరీక్షించిన వైద్యులు శరీరంలోని నడము భాగంలో బలమైన దెబ్బ తగిలిందని నిర్ధారించారు. గాయం తీవ్రత దృష్ట్యా ఆమె కనీసం 6 వారాల పాటు ఎలాంటి కదలికలు లేకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచనలు చేశారు. ఈ అనుకోని ప్రమాదం కారణంగా రష్మిక ప్రస్తుతం నటిస్తున్న పలు సినిమాల షూటింగ్‌లకు బ్రేక్ పడింది. ఆమె కోలుకునే వరకు డాన్స్, ఫైట్ సీన్లతో కూడిన షెడ్యూల్స్ అన్నింటినీ దర్శకులు తాత్కాలికంగా వాయిదా వేశారు. రష్మిక త్వరగా కోలుకోవాలంటూ ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.రీసెంట్ టైంలో టాలీవుడ్ స్టార్స్ వరసగా గాయాల బారిన పడుతున్నారు. కొన్నిరోజుల క్రితమే రామ్ చరణ్, బాలకృష్ణ, ఎన్టీఆర్ తదితరులు గాయాలపాలయ్యారు. ఇప్పుడు రష్మికకు కూడా అలానే జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఈమె పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈమె చేతిలో రణబాలి, మైసా మూవీస్ ఉన్నాయి. మరి ఏ మూవీ సందర్భంగా ఈ ఘటన జరిగిందనేది తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. ట్రైలర్ రిలీజ్) -
రష్మికతో ఐటెం సాంగ్.. ఆ భయంతో తీసేశారు: తమన్
చాలా కాలం తర్వాత ‘లెనిన్’తో హిట్ కొట్టాడు అఖిల్ అక్కినేని. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్గా నటించింది. తమన్ నేపథ్య సంగీతం, పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. అయితే ఈ చిత్రంలో ఓ ఐటం సాంగ్ కూడా ప్లాన్ చేశారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ పాటని పక్కన పెట్టాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని తమన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.‘లెనిన్‌లో ఒక ఐటం సాంగ్ పెట్టాలని ముందే అనుకున్నాం. అఖిల్ కోసం ఓ మంచి పాటను కూడా కంపోజ్ చేశా. రాయలసీమ యాసలో సాగే ఆ పాట..బయటకు వస్తే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నా. ఈ పాట కోసం రష్మిక, పూజాహెగ్డే, కయాదు లోహర్ లేదా ప్రీతిముకుందన్లలో ఎవరినో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఆ పాట బయటకు వస్తే బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ కథకి బ్రేక్ వేసినట్లుగా అవుతుంది. నెగెటివ్ రివ్యూలు వస్తాయని భయపడి చివరి నిమిషంలో దాన్ని తీసేశారు. ఆ సమయంలో నాకు చాలా కోపం వచ్చింది. బాధతో నాలుగైదు వాట్సాప్ గ్రూపులను నుంచి వైదొలిగాను’అని తమన్ చెప్పుకొచ్చాడు.#Lenin ఒక ఐటమ్ సాంగ్ అనుకున్నాం... Pooja Hegde, Rashmika Mandanna ఇలా డిస్కషన్ కూడా జరిగింది. కానీ ఆ సాంగ్ షూట్ కి ముందే తీసేసారు. నేను Whatsapp గ్రూప్స్ నుండి వెళ్లిపోయాను. - #Thaman pic.twitter.com/WczB7Ymvze— Rajesh Manne (@rajeshmanne1) July 28, 2026 -
కొత్త కాంబినేషన్?
ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా, మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు రష్మిక మందన్నా. మరోవైపు ఇటు సినిమాలు అటు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్ నిడిమోరు (రాజ్), కృష్ణ దాసరి (డీకే). వీరిద్దరూ తాజాగా రష్మిక కోసం ఓ పవర్ఫుల్ కథని సిద్ధం చేస్తున్నారట. కాగా ఇటీవలే రాజ్ నిడిమోరు అందించిన కథతో సమంత లీడ్ రోల్లో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు రూ. 100 కోట్లు వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.అందం, అభినయంతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ అభిమానులను సం పాదించుకున్న రష్మికతో ఇప్పుడు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట రాజ్ అండ్ డీకే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథా చర్చలు ఆరంభంలో ఉన్నాయని సమాచారం. రష్మిక ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసిన తర్వాత ఆమెను కలిసి వినిపించనున్నారట రాజ్–డీకే. మరి... వార్తల్లో ఉన్నట్లు ఈ కొత్త కాంబినేషన్ కుదురుతుందా? అనేది వేచి చూడాల్సిందే. -
కామన్వెల్త్ గేమ్స్‌లో రష్మిక..!
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో నేషనల్ క్రష్ మెరవనుందా? ఈ క్రీడల సంగ్రామం ముగింపు వేడుకలకు హాజరు కానుందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొగనుందని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్‌తో కలిసి ఈ వేడుకకు హాజరకానున్నట్లు సమాచారం. వచ్చే నెల ఆగస్టు 2న జరగనున్న ఈ వేడుకల్లో భారతదేశం తరఫున నిర్వహించే ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొగననుంది. ఈ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది.అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ వేడుకలకు హాజరయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గేమ్స్ అధికారిక ఫ్లాగ్‌ను భారత్‌కు అందించనున్నారు. 2030లో జరగబోయే 100 ఏళ్ల శతాబ్ది కామన్వెల్త్ గేమ్స్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం అతిథ్యం ఇవ్వనుంది. గతంలో 2010లో ఢిల్లీలో కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహించిన తర్వాత.. భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం రెండోసారి కావడం విశేషం. -
రష్మిక కోసం సుకుమార్ సెంటిమెంట్ బ్రేక్?
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. ఈ సినిమాల్లో హీరోయిన్లు ఎవరా అని చూస్తే రష్మిక లాంటి ఒకరిద్దరు సౌత్ హీరోయిన్లు, లేదంటే బాలీవుడ్ భామలే కనిపిస్తారు. ఈ క్రమంలోనే రీసెంట్గా పెళ్లి చేసుకుని రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మికని మరో బంపర్ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సైన్స్ ఫిక్షన్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)'పుష్ప' తర్వాత సుకుమార్.. రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే మూవీ లాక్ అయింది. రీసెంట్గా 'పెద్ది'తో వచ్చిన చరణ్ ఖాళీ అయిపోయాడు. మరోవైపు సుక్కు చరణ్‌తో తీయబోయే మూవీ పనిలో ఉన్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, ప్రస్తుతం మిగతా పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగానే హీరోయిన్గా రష్మికని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.సుకుమార్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేశాడు గానీ ఒకసారి పనిచేసిన హీరోయిన్‌తో మళ్లీ పనిచేయలేదు. 'పుష్ప' రెండు భాగాలు అయినప్పటికీ అది ఒక ప్రాజెక్ట్ కిందకే వస్తుంది. ఒకవేళ ఇప్పుడు చరణ్ సరసన రష్మికని తీసుకుంటే సుక్కు సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. అదే టైంల చరణ్-రష్మికది కూడా ఫ్రెష్ కాంబో కాబట్టి. ప్రేక్షకుల్లోనూ కాస్త ఆసక్తి పెరిగే అవకాశముంటుంది.సుకుమార్ సినిమా అంటే కచ్చితంగా ఏళ్లకు ఏళ్లు పడుతుంది. 'పుష్ప' రెండు భాగాలు తీయడానికి ఐదేళ్లు పట్టేసింది. మరి ఇప్పుడు రామ్ చరణ్‌తో కనీసంలో కనీసం రెండేళ్లయినా పట్టొచ్చు. అంటే ఎంతలేదన్నా మూవీ వచ్చేసరికి 2028 చివర అయిపోవచ్చు. మరి రష్మిక విషయంలో వస్తున్న రూమర్స్ నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: విలేజ్ స్టైల్లో మెగాహీరో మాస్ పాట) -
రష్మిక డేరింగ్ యాక్షన్.. తొలి హీరోయిన్గా రికార్డ్..!
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే కాక్టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను అలరించింది. ఈ బాలీవుడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రణబాలిలో నటిస్తోన్న రష్మిక.. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా చేస్తోంది. ఈ మూవీలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ మైసాపై ఆసక్తిని మరింత పెంచేశాయి.తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ వైరలవుతోంది. ఈ సినిమా కోసం రష్మిక సాహసం చేసింది. ఇండియన్ యాక్షన్ సినిమాలో ఇంతకుముందు ఎవరు ప్రయత్నించని అడ్వెంచరస్ ఫైట్ సీక్వెన్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా హీరోయిన్‌పై చిత్రీకరించిన అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ సక్సెస్‌ఫుల్‌గా రష్మిక పూర్తి చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక మందన్న ఎంతగానో శ్రమించినట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్ కోసం స్కూబా డ్రైవింగ్ కిట్ ధరించి నీటి అడుగున ఆమె చేసిన రిస్కీ స్టంట్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనున్నట్లు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్ చూస్తుంటే అంచనాలు మరింత పెంచేసింది. ఇండియన్ సినీ చరిత్రలోనే మొట్టమొదటి హీరోయిన్ అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్‌తో కొత్త అధ్యాయం క్రియేట్ చేసింది.ఈ యాక్షన్ మూవీకి రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతమందిస్తున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. A NEW CHAPTER IN ACTION CINEMA BEGINS. 🌊🔥Team #MYSAA has successfully wrapped India's First Female Underwater Fight Sequence, featuring the fearless #RashmikaMandanna❤️🔥Get ready to witness a groundbreaking action spectacle that's set to make waves across Indian cinema.💥… pic.twitter.com/z92GB0Brdk— UnFormula Films (@unformulafilms) July 9, 2026 -
జస్ట్ పదేళ్లు.. రష్మిక లైఫే మారిపోయింది
కృషి, శ్రమ, పట్టుదల విజయానికి మూలాలు. ఆ తర్వాత అదృష్టం తోడవ్వాలి. ఇవన్నీ పుష్కలంగా ఉన్న అతికొద్దిమంది హీరోయిన్లలో రష్మిక పేరు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సరిగ్గా పదేళ్ల క్రితం 'కిరిక్ పార్టీ' అనే కన్నడ మూవీతో నటిగా పరిచయమైంది. అలాంటి ఈమె.. పాన్ ఇండియా హీరోయిన్ అవుతానని కలలో కూడా ఊహించి ఉండదు. కానీ అవ్వడంతో పాటు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')హీరోయిన్గా తొలి సినిమాతో గుర్తింపు వచ్చిన కొన్నాళ్లకు 'ఛలో' అంటూ రష్మిక తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం మంచి పేరుతో పాటు అద్భుతమైన అవకాశాల్ని తెచ్చిపెట్టింది. అనంతరం తెలుగులోనే 'గీతగోవిందం' మూవీ ఈమె లైఫ్, కెరీర్ రెండింటిని మార్చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఈమె భర్త అయ్యాడు. ఇది బ్లాక్‌బస్టర్ సక్సెస్ కావడంతో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చాయి.తెలుగులో మంచి సక్సెస్ కారణంగా బాలీవుడ్‌లోనూ రష్మికకు వరస ఛాన్సుల వచ్చాయి. యానిమల్, ఛావా చిత్రాలు ఈమెని పాన్ ఇండియా స్థాయిలో ఓ రేంజికి తీసుకెళ్లిపోయాయి.ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ఓవైపు సినిమాలు చేస్తూ మరోవైపు ఫిట్నెస్ కాపాడుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. రీసెంట్ టైంలో ఈమె చేసిన 'కాక్టెయిల్ 2' థియేటర్లలోకి వచ్చింది. ఈ ఏడాదిలోనే భర్తతో చేసిన రణబాలి, లీడ్ రోల్ చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'మైసా' రిలీజ్ కానున్నాయి. ఇదంతా చూస్తుంటే పదేళ్లలో రష్మిక జీవితం ఎంతలా మారిపోయిందో కదా!(ఇదీ చదవండి: సీఎం విజయ్‌లా రాజకీయాల్లోకి సూర్య.. ఇది క్లారిటీ) -
బన్నీ-రష్మిక మరోసారి.. యాక్షన్ తో షురూ!
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఫాంటసీ అండ్ యాక్షన్ సినిమా ‘రాకా’. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. దీపికా పదుకొనె, మలయాళ నటి ఫెమినాజార్జ్ ఈ మూవీలో భాగమయ్యారు. జాన్వీ కపూర్, రష్మికా మందన్నా, మృణాల్ ఠాకూర్ సైతం ‘రాకా’లో నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ముంబైలో జూలైలో ప్రారంభం కాబోయే కొత్త షూటింగ్ షెడ్యూల్లో రష్మిక మందన్నా జాయిన్ అవుతారని, ఆమె పాత్రకు సంబంధించి తొలుత యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు అట్లీ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అంతేకాదు.. రష్మిక క్యారెక్టరైజేషన్ లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, సరికొత్త గెటప్‌లో ఆమె కనిపిస్తారని తెలిసింది. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ‘రాకా’ సినిమా 2027లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రస్తుతం ‘మైసా’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు రష్మిక. అలాగే విజయ్ దేవరకొండ సరసన ‘రణబాలి’ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
‘రాకా’లోకి రష్మిక ఎంట్రీ. . బన్నీతో మరోసారి..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మరోసారి వెండితెరపై జోడీగా కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇప్పటికే పుష్ప, పుష్ప 2లో చిత్రాల్లో జోడీగా నటించి మెప్పించిన ఈ జంట.. ఇప్పుడు ‘రాకా’ కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారట. త్వరలోనే ముంబైలో జరగబోయే కొత్త షెడ్యూల్లో రష్మిక పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో రష్మికతో పాటు దీపికా పదుకొణె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇప్పటికే దీపికా పదుకొణె షూటింగ్లో పాల్గొంది. కొత్త షెడ్యూల్లో రష్మికతో పాటు మృణాల్, జాన్వీలకు సంబంధించిన కీలక సీన్లను కూడా షూట్ చేయబోతున్నారట. ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ కూడా కీలక పాత్ర చేయబోతున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ నిర్వహించి, షారుక్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తారట.ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ రూ. 700 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ పూర్తి చేసుకొని.. వచ్చే ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. -
ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో
ఇప్పుడు సోషల్ మీడియా విజృంభన మామూలుగా లేదు. చీమ చిటుక్కుమన్నా వార్త అయిపోతోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ముందుంటోంది. దీంతో చాలామంది తమ ఎదుగుదలకు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం షాక్ తగిలినట్లుగా భయపడిపోతున్నారు. కొన్ని విషయాల్ని గోరంతని కొండంత చేయడమే ఇందుకు కారణం కావచ్చు. మరికొన్ని హ్యాండిల్స్ రూమర్స్ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా అనే వాదనను కొట్టి పారేయలేని పరిస్థితి.(ఇదీ చదవండి: ఓవైపు విడాకులు కేసు.. హీరో ఇంట్లో చోరీ)ఒక్కోసారి పరిస్థితులని బట్టి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వా వారిని విమర్శలకు గురి చేస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించారు అని ఎదురదాడి చేస్తుంటారు. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాకు కొందరు భయపడుతున్నారని చెప్పక తప్పదు. తమ గురించి జరుగుతున్న వదంతుల నుంచి బయట పడటానికి కొందరు సోషల్ మీడియాకే దూరం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక కూడా సోషల్ మీడియా దెబ్బకు భయపడుతున్నట్లు తేట తెల్లమైంది. ఇందుకు చిన్న ఉదాహరణ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే.సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల గురించి దొర్లుతున్న వదంతులపై మీ స్పందన అన్న ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది. ఏం మాట్లాడినా అది వేరే విధంగా బయటకు పోతోంది. అనని విషయాలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే మనం గురించి ఎలాంటి రూమర్ ప్రచారమవుతుందోనని రోజూ భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా ఎదుగుదల మంచిదే, కానీ దాన్ని కొందరు తప్పుగా వాడుతుండటమే బాగోలేదు అని రష్మిక చెప్పుకొచ్చింది.ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడు, హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం భర్తతోనే 'రణబాలి' సినిమా చేస్తోంది. మరోవైపు ఈమె నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'కాక్ టెయిల్ 2' రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్) -
రీల్‌పైకి రియల్ లైఫ్
రీల్‌పై కనిపించే స్టార్స్ లైఫ్ తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. ఆ స్టార్స్ జీవితంలో జరిగిన సంఘటనలు, కెరీర్ కోసం వారు చేసిన కృషి వంటి అంశాలతో వచ్చే సినిమాలకు చాలా క్రేజ్ నెలకొంటుంది. ప్రస్తుతం అలాంటి క్రేజీ చిత్రాలు కొన్ని ఉన్నాయి. వెండితెర పై కనిపించే యాక్టర్స్, తెరవెనక విభాగాల్లో కృషి చేసే టెక్నీషియన్స్... ఇలా సిల్వర్ స్క్రీన్‌కి ఏయే స్టార్ లైఫ్ రానుంది? వారిపాత్రల్లో కనిపించనున్న స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.కిశోర్ కుమార్‌గా ఆమిర్ ‘ఖైకేపాన్ బనారస్ వాలా’... ‘డాన్’లోని ఈ పెప్పీ నంబర్ నేటికీ ఫేమస్..., ‘ఓ సాథీ రే’... ‘ముకద్దర్ కా సికందర్’లోని ఈ విషాద గీతాన్ని ఇప్పటికీ చాలామందిపాడుకుంటారు. ‘మేరే సప్నోం కీ రాణి కబ్’... ‘ఆరాధన’లోని ఐకానిక్ రొమాంటిక్ సాంగ్ ఇది. ఇలా మాస్, రొమాన్స్, విషాదం... అన్నిపాటలూ కిశోర్‌కుమార్ గాత్రంతో జీవం పోసుకున్నాయి. అందుకే ఆయన దేశం గర్వించదగ్గ గాయకుడిగా నిలిచి పోయారు. కిశోర్‌కుమార్ గొప్ప నటుడు కూడా. దాదాపు 80 చిత్రాల్లో నటించారు.కిశోర్‌కుమార్ భౌతికంగా దూరమై 35 ఏళ్లు పైనే అయినా (13 అక్టోబరు 1987లో మరణించారు)పాట రూపంలో నేటి తరానికీ వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కించనున్నారు. కిశోర్ కుమార్పాత్రను రణ్‌బీర్ కపూర్‌తో చేయిద్దామనుకున్నారట. ఈ విషయాన్ని స్వయంగా అనురాగ్ తెలిపారు.అయితే అదే టైమ్‌లో రణ్‌బీర్‌కి ‘రామాయణ్’ ఆఫర్ రావడంతో ఆ సినిమాకి డేట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ని నటింపజేయాలని అనురాగ్ అనుకున్నారు. ఇదంతా ఏడాది క్రితమే జరిగింది. అయితే ఎలాంటి అప్డేట్ లేదు. ‘‘ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఆమిర్ నటిస్తారా? లేదా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. అగ్రిమెంట్ పూర్తయిన తర్వాతే చెబుతాను’’ అని అనురాగ్ ఆ మధ్య ఓ సందర్భంలో తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉందని బాలీవుడ్ టాక్. ఇళయరాజాగా ధనుష్ 1980వ దశకంలో ఇళయరాజాపాట వినపడని ఇల్లు ఉండదు...పాడుకోని ప్రేక్షకులు ఉండరు. ప్రేమ, విషాదం, సెంటిమెంట్, మాస్... ఇలా అన్ని రకాలపాటలకు బీట్స్ అందించిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ‘మంచు కురిసే వేళలో ...’ (అభినందన), ‘ఆమనిపాడవే...’ (గీతాంజలి), ‘కలయా... నిజమా...’ (కూలీ నెం. 1 ) ఇలా ఎన్నో ప్రేమపాటలను అందించారు ఇళయరాజా. తెలుగులో ‘అభిలాష, అన్వేషణ, సాగర సంగమం, రుద్రవీణ, మహర్షి’ వంటి పలు చిత్రాలకు సంగీతం అందించిన ఈ మ్యూజిక్ మేస్ట్రో బయోపిక్ వెండితెరకు రానుంది.స్టార్ హీరో ధనుష్ మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాగా నటించనున్నట్లు 2024 మార్చిలో అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఆరంభమైంది. అయితే ఆ తర్వాత పెద్దగా అప్డేట్ రాలేదు. పైగా లోకేశ్ కనగరాజ్ హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ‘డీసీ’ టైటిల్‌తో సినిమా ఆరంభం కావడంతో ఇళయరాజా బయోపిక్ ఆగి పోయిందనే ప్రచారం మొదలైంది.అయితే అవి జస్ట్ రూమర్స్ మాత్రమే. ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత ధనుష్‌తో ఇళయరాజా బయోపిక్‌ని పట్టాలెక్కించేలా అరుణ్ మాథేశ్వరన్ ప్లాన్ చేశారట. మరోవైపు ధనుష్ కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. లోకేశ్ కనగరాజ్‌తో తెరకెక్కిస్తున్న సినిమా పూర్తయ్యే సమయానికి ధనుష్ చేతిలోని తాజా చిత్రాలు కూడా పూర్తవుతాయట. ఆ తర్వాత నాన్‌స్టాప్‌గా ఇళయరాజా బయోపిక్ షూట్‌ని జరపాలనుకుంటున్నారని సమాచారం.మధుబాల ఎవరు? హిందీ సినిమా రంగంలోని ప్రముఖ తారలలో మధుబాల ఒకరు. అందం, అభినయంతో నాటి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి పోయారామె. మధుబాల జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శక–నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఓ సినిమాకి సన్నాహాలు చేశారు. ఆలియా భట్ నటించిన ‘డార్లింగ్స్’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన జస్మీత్ కె. రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ చిత్రంలో మధుబాలపాత్రను కియారా అద్వానీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని భన్సాలీ ప్రతినిధులు పేర్కొన్నట్లుగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... మధుబాలగా ఎవరు నటిస్తారు? ఈ బయోపిక్ షూటింగ్ ఎప్పుడు ఆరంభం అవుతుందనేది వేచి చూడాల్సిందే. కియారానే మీనాకుమారి? ప్రముఖ నటి, ట్రాజెడీ క్వీన్‌గా పేరు పొందిన మీనా కుమారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో కియారా అద్వానీ నటించనున్నారట. ‘కమల్ ఔర్ మీనా’ అనే టైటిల్‌తో ఈ చిత్రానికి సిద్ధార్థ్ పి. మల్హోత్రా దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రకథాంశం ప్రధానంగా మీనా కుమారి, నిర్మాత కమల్ అమ్రోహిల మధ్య ఉన్న సంక్లిష్టమైన అనుబంధంపై ఉంటుందని టాక్. దాదాపు 500 చేతిరాత లేఖల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుందని, 1950ల నుంచి 1970ల మధ్య మీనా కుమారి జీవితాన్ని చూపించనుందని వినికిడి. కాగా, గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఒక బయోపిక్ ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు కియారా.‘‘నేను ఇప్పటికే కొన్ని స్క్రిప్ట్స్ చదువుతున్నాను. వాటిలో నాకు బాగా నచ్చిన ఒక బయోపిక్ ఉంది. ఇది ఒక జానర్‌కు సంబంధించినది కాదు.... ఈ కథ ఆత్మకు సంబంధించినది’’ అని ఆమె ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కియారా పేర్కొన్నది మీనా కుమారి బయోపిక్ గురించే అనే ఊహాగానాలు ఉన్నాయి. కాగా మీనా కుమారిపాత్రకు కృతీ ససన్ కూడా బాగుంటారని సిద్ధార్థ్ పి. మల్హోత్రా ఈ బ్యూటీని సంప్రదించారట. అయితే కియారానే నటించే చాన్స్ మెండుగా ఉందని టాక్. ఇదిలా ఉంటే... ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా కూడా మీనా కుమారి జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కించాలనుకున్నారు. అయితే ఈ సినిమా చేసే ఉద్దేశం లేదని ఆ తర్వాత ఆయన పేర్కొన్నారు. క్వీన్ ఆఫ్ ది సౌత్ గ్లామర్ క్వీన్ అనిపించుకున్న సిల్క్ స్మిత జీవితం ఆధారంగా హిందీలో ‘ది డర్టీ పిక్చర్’ వచ్చిన సంగతి తెలిసిందే. దక్షిణాదిన ‘సిల్క్‌స్మిత – క్వీన్ ఆఫ్ ది సౌత్’ టైటిల్‌తో ఓ సినిమా నిర్మాణంలో ఉంది. జయరామ్ శంకరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్‌లో సిల్క్ స్మితగా చంద్రిక రవి కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన చంద్రిక రవి లుక్‌కి మంచి స్పందన లభించింది. స్మితలానే చంద్రిక ఉందనే కితాబులు అందాయి. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో విడుదల చేయాలనుకుంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ప్రకటన వచ్చి, లుక్ విడుదల చేసి దాదాపు మూడేళ్లవుతోంది. సో... ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉందనే విషయం తెలియాల్సి ఉంది.ఎం.ఎస్. సబ్బులక్ష్మిగా రష్మికప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఇక సినిమాల పరంగా వస్తే... ‘సేవా సదనమ్, శకుంతలై, సావిత్రి, మీరా’ వంటి తమిళ చిత్రాల్లో నటించారు సుబ్బులక్ష్మి. ఆమె బయోపిక్‌ని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మిపాత్ర కోసం సాయి పల్లవిని తీసుకోవాలనుకుంటున్నారనే వార్త వినిపించింది.అయితే, హిందీ ‘రామాయణ్’ రెండు భాగాలు, ఇతర చిత్రాల షూట్‌తో బిజీగా ఉండటం వల్ల సాయి పల్లవి ఈ చిత్రానికి డేట్స్ సర్దుబాటు చేయలేక పోతున్నారట. ఆ తర్వాత సాయి పల్లవి స్థానంలో ‘కాంతార’ ఫేమ్, కన్నడ నటి రుక్మిణీ వసంత్‌ని తీసుకోవాలనుకుంటున్నారనే వార్త వినిపించింది. అయితే తాజా వార్తల ప్రకారం సుబ్బులక్ష్మిపాత్రకు రష్మికా మందన్నాని ఎంపిక చేశారట. లుక్ టెస్ట్ కూడా జరిగిందని సమాచారం. ఈ చిత్రం గురించి నిర్మాణ సంస్థ ఇప్పటివరకూ అధికారికంగా ప్రకటించలేదు. మరి... ఎప్పుడు ప్రకటిస్తారు? ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగా ఎవరు నటిస్తారు? అనేది వేచి చూడాల్సిందే.సిల్వర్ స్క్రీన్‌కి సిల్వెస్టర్ స్టాలోన్ జీవితంహాలీవుడ్లో స్టార్ డైరెక్టర్స్, హీరోల లిస్ట్ తీస్తే... అందులో ప్రముఖంగా ఉండే పేర్లలో సిల్వెస్టర్ స్టాలోన్ పేరు ఒకటి. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా... స్టాలోన్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. ముఖ్యంగా ‘రాకీ, రాంబో’ చిత్రాల ఫ్రాంచైజీలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు సిల్వెస్టర్ స్టాలోన్. ఆయన జీవితం ఆధారంగా ‘ఐ ప్లే రాకీ’ అనే చిత్రం తెరకెక్కుతోంది. ప్రధానంగా ఈ చిత్రం 1976లో క్లాసిక్ సినిమాగా నిలిచిన ‘రాకీ’ (ఈ చిత్రానికి స్టాలోన్ కథ అందించి, నటించారు) ముందు స్టాలోన్ పడిన కష్టాలు, పోరాటాలను ఆవిష్కరించేలా ఉంటుందని టాక్.అందుకే ‘ఐ ప్లే రాకీ’ అని టైటిల్ పెట్టినట్లు సమాచారం. నిరుద్యోగి అయిన ఒక సాధారణ వ్యక్తి తనను తాను నమ్ముకుని రాకీ బాల్బోవా అనే బాక్సర్ కథను రాసి, ఆ సినిమాను నిర్మించేందుకు హాలీవుడ్ స్టూడియోలతో చేసిన పోరాటమే ఈ బయోపిక్ అని భోగట్టా. ఈ చిత్రంలో యంగ్ స్టాలోన్పాత్రలో ఆంథోనీ ఇ΄్పోలిటో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత పీటర్ ఫారెల్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సిల్వెస్టర్ స్టాలోన్ తన కెరీర్ ఆరంభంలో పడిన ఇబ్బందులు, నిరాశలను అధిగమించి హాలీవుడ్ లెజెండ్‌గా ఎలా ఎదిగారో చూపించే ఈ చిత్రం యూఎస్‌లో ఈ ఏడాది నవంబరు 13న, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా నవంబరు 20న విడుదల కానుంది. ఇదిలా ఉంటే...పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా రూపొందిన ‘మైఖేల్’ ఆ మధ్య విడుదలై, సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం హాలీవుడ్లో సిల్వెస్టర్ స్టాలోన్ ‘ఐ ప్లే రాక్’ మాత్రమే కాకుండా... క్వీన్ ఆఫ్పాప్గాపాపులార్టీ తెచ్చుకున్న మడోన్నా వంటి వారి బయోపిక్స్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. తొలి తరం సూపర్ స్టార్ జీవితంతో...భారతదేశపు తొలి తరపు సూపర్ స్టార్లలో రాజేష్ ఖన్నా ముందు వరుసలో ఉంటారు. కెరీర్లో ఐదేళ్లల్లో వరుసగా 15 సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన రికార్డ్ ఆయన సొంతం. 1969 నుంచి 1974లోపు ఆయన 15 సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. వాటిలో ‘ఆరాధన’, ‘దో రాస్తే’ (1969), ‘సచ్చా జూతా, సఫర్’ (1970), ‘కటీ పతంగ్, ఆనంద్’ (1971), ‘అమర్ ప్రేమ్’ (1972) వంటి సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస హిట్స్ అందించిన ఈ స్టార్ ఆ తర్వాత కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక స్టార్‌గా ముఖ్యంగా అమ్మాయిల్లో ఆయనకు అభిమానులు ఎక్కువ.రక్తంతో ప్రేమలేఖలు రాసేవారట. ఆ స్థాయి ఫ్యాన్స్ ఉండేవారు. ఇక రాజేష్ ఖన్నా మరణం ఇప్పటికీ ఓ మిస్టరీ.. ఆయన వృత్తి, వ్యక్తిగత జీవితాల ఆధారంగా గౌతమ్ చింతామణి రాసిన ‘డార్క్ స్టార్: ది లోన్లీనెస్ ఆఫ్ బీయింగ్ రాజేష్ ఖన్నా’ పుస్తకం హక్కులను నిర్మాత నిఖిల్ ద్వివేది దక్కించుకున్నారు. ఆ పుస్తకం ఆధారంగా ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ దర్శకత్వంలో రాజేష్ ఖన్నా బయోపిక్‌ని సిల్వర్ స్క్రీన్‌కి తీసుకు రావాలన్నది నిఖిల్ ద్వివేది ఆలోచన.అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. మరి... ఈ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు ఎవరు చేపడతారు? రాజేష్ ఖన్నాపాత్రలో ఎవరు నటిస్తారు? అనే విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్‌లోని ఒక యువ హీరోకి ఈ ఆఫర్ రాగా, రాజేష్ ఖన్నా స్టైల్‌ని మ్యాచ్ చేయలేనని ఆ హీరో ఈ ప్రాజెక్ట్‌ని సున్నితంగా తిరస్కరించారట. వాçస్తవానికి ఈ సినిమాకి నాలుగైదేళ్ల ముందే సన్నాహాలు చేశారు నిఖిల్. అయితే ఈ మధ్యకాలంలో ఎలాంటి అప్డేట్ లేదు. మరి... రాజేష్ ఖన్నా బయోపిక్ షూట్ ఎప్పుడు ఆరంభమవుతుంది? ఎవరు నటిస్తారు? అనేది కాలమే చె΄్పాలి.గురు దత్ బయోపిక్ లేనట్లేభారతీయ చలనచిత్ర చరిత్రలో మేటి దర్శకుడు, నటుడు అయిన గురుదత్ జీవితం ఆధారంగా కొన్నాళ్ల క్రితం ఓ బయోపిక్ ప్రకటన వెలువడింది. తొలి చిత్రం ‘ధర్మ్’తో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకురాలు భావనా తల్వార్ ఈ బయోపిక్‌ను ప్రకటించారు. షీతల్ తల్వార్‌తో కలిసి భావనా తల్వార్ ఈ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. గురుదత్ కెరీర్‌లోని సంచలన చిత్రాల్లో ఒకటైన ‘ప్యాసా’నే టైటిల్‌గా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నారు. అయితే గురు దత్ కుమార్తె నీనా మెమన్ తన తండ్రి జీవిత కథపై సినిమా తీయడానికి వేరే ఎవరికీ అనుమతి లేదని, ఇది కాపీరైట్ ఉల్లంఘన అవుతుందనీ నోటీసులు పంపడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. సో... ప్రస్తుతానికి గురుదత్ బయోపిక్ లేనట్లే.- డిజి భవాని -
పెళ్లి తర్వాత రష్మిక తొలి సినిమా.. టాక్ ఏంటి?
ఈ వీకెండ్ ఇద్దరు స్టార్ హీరోయిన్లు తమ సినిమాలతో వచ్చారు. మామూలుగా చెప్పుకొంటే ఇందులో అంతేం ఉందని అనిపిస్తుంది. కానీ ఈ రెండు మూవీస్ కూడా ఆయా హీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినవి కావడంతో కాస్త ఆసక్తి నెలకొంది. సమంత 'మా ఇంటి బంగారం' పాస్ మార్కులు వేయించుకుంది. మరి రష్మిక 'కాక్టెయిల్ 2' టాక్ ఏంటి? ప్రేక్షకులు ఏమంటున్నారు?(ఇదీ చదవండి: సమంత ప్రెగ్నెన్సీ నిజమే.. వీడియో వైరల్)రష్మిక ఇదివరకే హిందీలో గుడ్ బై, థామా, ఛావా, యానిమల్, మిషన్ మజ్ను తదితర సినిమాలు చేసింది. అయితే వీటిలో యానిమల్, ఛావా మాత్రమే మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇప్పుడు 'కాక్టెయిల్ 2'తో వచ్చేసింది. షాహిద్ కపూర్, కృతి సనన్‌తో కలిసి రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంది. అయితే ఈ మూవీకి దాదాపుగా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ స్టార్స్ ఉండటం వల్ల కలెక్షన్స్ పర్లేదనిపిస్తున్నాయి.మరీ ముఖ్యంగా ఇప్పటితరానికి కనెక్ట్ అయ్యే లివ్ ఇన్ రిలేషన్, గ్లామర్ లాంటివి ఉండటంతో కాస్తోకూస్తో యూత్ వస్తున్నారు. అయితే ఇది హిందీ వరకే రిలీజ్ చేశారు. సోషల్ మీడియా అంతా కూడా కృతి సనన్ సూపర్ అన్నట్లు ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే బాలీవుడ్లో పీఆర్ చాలా ఉంటుంది. మరి నిజంగానే కృతి బాగా చేసిందా లేదంటే రష్మికని సైడ్ చేయడానికి కృతిని పొగిడేస్తున్నారా అని సందేహం కలుగుతోంది. ప్రస్తుతానికైతే నెగిటివ్ టాక్ నడుస్తోంది. వీకెండ్ పూర్తయితే ఫలితం ఏంటనేది పూర్తి క్లారిటీ రావొచ్చు.'కాక్టెయిల్ 2' విషయానికొస్తే.. షాహిద్ కపూర్, రష్మిక పాత్రలు లివ్ ఇన్ రిలేషన్లో ఉంటారు. ఓ సందర్భంలో రష్మిక పాత్ర విదేశాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో తన బాయ్ ఫ్రెండ్ ఎంత నిజాయతీపరుడో తెలుసుకునేందుకు రష్మిక, తన ఫ్రెండ్ కృతి సనన్ సాయం అడుగుతుంది. సరదాగా పరీక్షిద్దాం అనుకుంటే మొత్తం సీన్ మారిపోతుంది. చివరకు ఏమైందో? మరి ఎవరు ఎవరు ఒక్కటయ్యారు అనేది మిగతా స్టోరీ. (ఇదీ చదవండి: సీఎం విజయ్ నిర్ణయం.. ఇండస్ట్రీ వ్యక్తికి కీలక పదవి) -
బెంగళూరులో రష్మిక.. కృతితో కలిసి హడావుడి (ఫొటోలు)
-
పెళ్లయిపోయింది.. మిగిలింది అదొక్కటే
సాధారణంగా హీరో లేదా హీరోయిన్లకు పెళ్లయిన తర్వాత అదృష్టం కూడా కలిసొస్తుందని అంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే పలువురు హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్న తర్వాత హిట్స్ కొడుతుంటారు. జీవితంలోనూ సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఇప్పుడు రష్మిక, సమంత కూడా పెళ్లి తర్వాత సక్సెస్ అందుకుంటారా? ఒకేవారం రిలీజ్ అవుతున్న వీళ్ల సినిమాలపై హైప్ ఎలా ఉంది?(ఇదీ చదవండి: విదేశీయుడితో స్టార్ హీరో దత్త కూతురు నిశ్చితార్థం)సమంత గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఒకప్పుడు మహేశ్ బాబు, రామ్ చరణ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. స్టార్డమ్ అనుభవించింది. కానీ హీరో నాగచైతన్యతో విడాకులు, తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడటం లాంటివి జరిగేసరికి నటించడం చాలావరకు తగ్గించేసింది. హీరోయిన్గా అయితే చివరగా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి'లో కనిపించింది. ఇది ఫ్లాప్ అయింది. దీని తర్వాత ఓ సిరీస్ చేసింది గానీ ఇదీ వర్కౌట్ కాలేదు.ఇక గతేడాది 'శుభం' మూవీతో నిర్మాతగా మారింది. కంటెంట్ పరంగా ఓకే అనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా సేఫ్ అయిపోయింది. గతేడాది చివరలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుని రెండో పెళ్లి చేసుకుంది. ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్ చేసి నిర్మాతగా 'మా ఇంటి బంగారం' అనే సినిమాని పూర్తి చేసింది. పలుమార్లు వాయిదా పడి ఈ వారమే ఇది థియేటర్లలోకి రానుంది. మార్కెట్లో అయితే దీనిపై పెద్దగా హైప్ అయితే లేదు. సమంత కోసమే ఈ మూవీకి ఆడియెన్స్ రావాలి. అలానే కంటెంట్ కూడా అదిరిపోయిందనే టాక్ రావాల్సి ఉంటుంది. 'పెద్ది' కూడా నెమ్మదించింది కాబట్టి పాజిటివ్ టాక్.. సమంత 'బంగారం'కి చాలా కీలకం. మరి పెళ్లి సామ్‌కి హిట్ రూపంలో అదృష్టాన్ని తీసుకొస్తుందేమో చూడాలి?రష్మిక విషయానికొస్తే కెరీర్ పరంగా పీక్ స్టేజీలో ఉంది. ఇలాంటి టైంలో పెళ్లి గురించి సాధారణంగా హీరోయిన్లు ఆలోచించారు. కానీ ఈమె ఆలోచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండతో ఏడడుగులు వేసింది. ఇది జరగడానికి ముందే హిందీలో 'కాక్టెయిల్ 2' అనే మూవీ చేసింది. ఓ కుర్రాడు ఇద్దరమ్మాయిలని ప్రేమించడం, వీళ్ల ముగ్గురు కలిసే ఉండటం అనే బోల్డ్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమాకి ప్రస్తుతానికి హిందీలో మాత్రమే బజ్ ఉంది. తెలుగులో రిలీజ్ చేయట్లేదు. ఇప్పటివరకు యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న రష్మిక.. ఇందులో పూర్తిగా గ్లామర్ షో చేసింది. పెళ్లి తర్వాత ఈమె నుంచి వస్తున్న తొలి చిత్రమిదే. మరి సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'పెద్ది' ఐటమ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్) -
పెళ్లి తర్వాత పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!
-
కృతీ... నువ్వు సూపర్
అభిమాన తారలను చూడగానే ఫ్యాన్స్‌కి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఒక్కోసారి ఆ అభిమానమే స్టార్స్‌ని ఇబ్బందులపాలు చేస్తుంది. షాహిద్ కపూర్, కృతీ సనన్, రష్మికా మందన్నా అలానే ఇబ్బందిపడ్డారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో రూపొందిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా ఈ ముగ్గురూ జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే పుణెలోని ఓ మాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లా జరిగిన మ్యూజికల్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. వేదికపై ముగ్గురూ డ్యాన్స్ చేశారు.అలాగే అక్కడి లోకల్ స్నాక్ అయిన ‘వడ పావ్’ తిన్నారు. అంతా బాగానే జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరైన వీక్షకుల్లో కొందరు కనబర్చిన అత్యుత్సాహంతో అనుకున్న సమయానికన్నా నిర్వాహకులు కాస్త ముందుగానే వేడుకను ముగించాల్సి వచ్చింది. షాహిద్, కృతి, రష్మికలను అక్కణ్ణుంచి పంపించే క్రమంలో అభిమానులు బారికేడ్లను దాటుకుని ముందుకు దూసుకు రావడంతో కంట్రోల్ చేయడానికి సెక్యూర్టీ చాలా ఇబ్బందిపడ్డారు.ఎలాగైతేనేం ముగ్గుర్నీ క్షేమంగా అక్కణ్ణుంచి పంపించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఆకట్టుకున్న విషయం ఏంటంటే... రష్మిక చుట్టూ తన చేతులు వేసి, కృతి ఆమెకు హెల్ప్ చేయడం. నిజానికి కృతీకి కూడా బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక వ్యక్తి ఆమెను తాకడానికి కూడా ట్రై చేశాడట.అయితే రష్మిక భయపడినట్లు కనిపించడంతో ఆమెకు రక్షణగా కృతి తన చేతులను ఆమె చుట్టూ వేశారని వీడియో స్పష్టం చేస్తోంది. ఇలా సహ నటికి సహాయం చేయడం పట్ల ‘కృతీ... నువ్వు సూపర్’ అంటూ కృతీ సనన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే... దూసుకొచ్చినవారిని షాహిద్ నెట్టేయడం వీడి యోలో కనిపించింది. ఆయన దుస్తులు కూడా చిరిగాయని సమాచారం. -
సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు)
-
పేరు మార్చుకున్న రష్మిక.. కొత్త పేరు ఇదే!
రష్మిక మందన్న పేరు మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత రష్మిక పేరు చివరన దేవరకొండ లేదా విజయ్ అని యాడ్ చేస్తారని చాలా మంది భావించారు. గతంలో చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించేవారు. కానీ రష్మిక అలా చేయలేదు. తన సోషల్ మీడియా ఖాతాలన్నీ పెళ్లికి ముందు ఉన్న పేరుతోనే ఉన్నాయి. దీంతో ఆమె పేరులో ఎలాంటి మార్పు ఉండదని అనుకున్నారు. అయితే తాజాగా రష్మిక కూడా తన పేరు చివరన భర్త ఇంటిపేరుని యాడ్ చేశారు. తాజాగా ఆమె భర్త విజయ్ దేవరకొండతో కలిసి అత్తాగారి సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో వెళ్లారు. అక్కడ ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి ఉపకారవేతనాలు అందజేశారు.ఈ సందర్భంగా రష్మిక తనని తాను రష్మిక మందన్న దేవరకొండగా పరిచయం చేసుకున్నారు. ‘ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు మాట్లాడుతున్నా. చాలా ఆనందంగా ఉంది. 9,10వ తరగతిలో ఫస్ట్, సెండర్ ర్యాంకులు సాధించి మీరు(విద్యార్థులను ఉద్దేశించి) నా కంటే ముందే ఉన్నారు. చాలా కష్టపడి ఈ ర్యాంకులు సాధించారు. లైఫ్‌లో కొన్నిసార్లు విన్ అవుతాం, కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం.. కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. పేరెంట్స్, టీచర్స్ నుంచి నేర్చుకొని గొప్పగా ఎదగండి.’ అని విద్యార్థులకు సూచించారు.అయితే రష్మిక తొలిసారి తనపేరుని రష్మిక మందన్న దేవరకొండ అని పరిచయం చేసుకోవడం విశేషం. సోషల్ మీడియా ఖాతాల్లో కూడా పేరు మార్చుకుంటారా లేదా అలానే ఉంచుతారా? చూడాలి. -
మాట నిలబెట్టుకున్న విరోష్ జంట.. పుట్టిన గడ్డ కోసం..!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నెరవేర్చారు. తన స్వగ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటలో విద్యార్థులకు సాయం అందించారు. తాను ఇచ్చిన మాట ప్రకారం 9,10 తరగతుల విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. తన స్వగ్రామంలోని జడ్పీహెచ్ఎస్ తుమ్మన్‌పేట పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థులు బి. హేమలత (1వ ర్యాంక్), పి. ప్రణీత (2వ ర్యాంక్) ఎంపికయ్యారు. అలాగే 10వ తరగతిలో కె. గణేష్ (1వ ర్యాంక్), బి. అనిల్ (2వ ర్యాంక్) ఈ స్కాలర్షిప్కు అర్హత సాధించారుతాజాగా ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2026 విద్యా సంవత్సరంలో అచ్చంపేట డివిజన్లోని విద్యార్థుల మెరిట్ స్కాలర్షిప్ అవార్డీస్ పేరిట ఎంపికైన జాబితాను విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో మొత్తం 45 ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలల్లో 9, 10వ తరగతుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి స్కాలర్ షిప్స్ అందజేయనున్నారు. ఈ ఉపకార వేతనాలతో దాదాపు 180 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. ఈ ఏడాది తన సొంతూరిలో పర్యటించిన విజయ్ దేవరకొండ విద్యార్థులకు మాటిచ్చారు. ఇవాళ అఫీషియల్‌గా తన మాటను నెరవేర్చారు. హీరో విజయ్ దేవరకొండ తమ సొంత గ్రామానికి చేస్తున్న సేవపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. సొంతూరిపై తనకున్న ప్రేమను చాటుకున్నారని కొనియాడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాయల సీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ మూవీకి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. We are on our way to Thummanpet. The little village where my Father was born. In February - @iamRashmika and I had announced the beginning of a little dream of ours. To reward all the hardworking students of 9th and 10th grade from Achampet Mandal of Telangana. Here is a… pic.twitter.com/wLNSr4ZZHe— Vijay Deverakonda (@TheDeverakonda) June 14, 2026 -
'కాక్టెయిల్ 2' మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్నా సందడి (ఫొటోలు)
-
చీరలో అనసూయ అలా.. జీన్స్‌లో రష్మిక ఇలా
చీరలో మైమరిపించేస్తున్న అనసూయమాయ చేసేస్తున్న రష్మిక మంధాన్నక్యూట్ అండ్ స్వీట్‌గా మాళవిక నాయర్పట్టుచీరలో చందమామలా రజిషబాపుబొమ్మలా హీరోయిన్ కావ్య కల్యాణ్‌రామ్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Malvika Nair (@malvikanairofficial) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) -
విజయ్-రష్మికల ‘రణబాలి’.. 100 రోజుల షూటింగ్ పూర్తి!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ‘రణబాలి’ సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి’ సినిమా రూపొందుతోంది.తాజాగా ‘రణబాలి’ సినిమా సక్సెస్ ఫుల్ గా వంద రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే గండికోటలో షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. వారం రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ రూపొందించారు. ఇప్పటిదాకా ఈ చిత్రానికి సంబంధించిన 90 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఔట్ పుట్ పూర్తి సంతృప్తికరంగా వచ్చిందని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్ లోని ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్సులు మూవీ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ‘రణబాలి’ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. -
రష్మిక రెమ్యునరేషన్ రూ. 15 కోట్లు!
సినిమా ఒక్కసారి ముద్దుగా అక్కున చేర్చుకుంది అంటే ఊహించనంత తీరాలకు తీసుకెళ్లి కూర్చో పెడుతుంది. అలాంటి వారిలో రష్మికమందన్నా ఒకరు. ఎక్కడో కర్ణాటకలోని గ్రామంలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ మొదట్లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత టాలీవుడ్లోకి దిగుమతి అయి గీత గోవిందం చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.ఆ తరువాత పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇక గుడ్‌బై చిత్రంతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక యానిమల్ చిత్రంతో కమర్షియల్‌గా సూపర్‌హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఆ తరువాత ఒకటి రెండు చిత్రాలు ఫ్లాప్ అయినా కేరీర్‌కు వచ్చే డోకా ఏమీ ఉండదు. రష్మిక విషయంలో ఇదే జరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌కు జంటగా నటించిన చిత్రం నిరాశ పరిచింది. ఇటీవల నటుడు విజయ్ దేవరకొండను ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.ఇక్కడ పెళ్లి అయిన హీరోయిన్లకు కెరీర్ దెబ్బ తింటుందన్న ఆనవాయితీని ఈ బ్యూటీ తిరగరాశారు. ఇప్పుడు ఈ క్రేజీ భామ రేంజ్‌కు వరుసగా భారీ అవకాశాలు రావడమే కాదు పారితోషికాన్ని భారీ మొత్తంలో ముట్టచెబుతున్నారు. అది ఎంతగా అంటే ఇప్పటి వరకు దక్షిణాది టాప్ హీరోయిన్లు తీసుకుంటున్న పారితోషికాన్ని బీట్ చేసేంతగా. ఇప్పటి వరకు దక్షిణాది హీరోయిన్లలో అత్యధికంగా నయనతార రూ.10 కోట్ల తీసుకుంటున్న ప్రచారం జరుగుతోంది. రష్మిక ఇప్పుడు కాక్–టెయిల్–2 చిత్రంలో రూ.15 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే పారితోషికం విషయంలో ఈ అమ్మడు నయనతారను బీట్ చేసినట్లే అవుతుంది. -
'కాక్టెయిల్ 2' మూవీ ట్రైలర్ లాంచ్...రష్మిక సందడి (ఫొటోలు)
-
ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. కాక్టెయిల్-2 ట్రైలర్ చూశారా?
రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోన్న లేటేస్ట్ బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2. ఈ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ కృతి సనన్ మరో హీరోయిన్గా మెప్పించనుంది. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా కాక్టెయిల్-2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీని ఇద్దరమ్మాయిలతో ఓ అబ్బాయి రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో సీన్స్ ఫుల్ రొమాంటిక్‌గా కనిపిస్తున్నాయి. ఇద్దరితో షాహిద్ కపూర్ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయినట్లు కనిపిస్తోంది. కాగా.. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. దీపికా పడుకోన్, డయానా పెంటీ, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలలో నటించిన 'కాక్టెయిల్' (2012) చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. -
భర్తతో కలిసి జపాన్ ట్రిప్‌లో రష్మిక.. ఇప్పటికీ దాచేస్తోంది!(ఫొటోలు)
-
పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక!
కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకోరు. కానీ రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని వివాహం చేసుకుంది. అయితే బ్రేక్ తీసుకోవడం లాంటివేం లేకుండా ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగులో రణబాలి, మైసా లాంటి మూవీస్ చేస్తూ హిందీలో 'కాక్టెయిల్ 2' లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేసింది. అయితే రష్మిక ఉందంటే కచ్చితంగా సదరు మూవీకి క్రేజ్ రావడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్)తెలుగులో ఒక్కో సినిమాకూ రూ.8-10 కోట్ల మధ్య తీసుకునే రష్మిక.. బాలీవుడ్లో మాత్రం దీనికి రెట్టింపు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న రిలీజయ్యే 'కాక్టెయిల్ 2' కోసం ఏకంగా రూ.15 కోట్లు అందుకుందట. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీలో నటించిన మరో హీరోయిన్ కృతి సనన్‌కి కూడా అంతే మొత్తం ఇచ్చారు. కాకపోతే కృతితో పోలిస్తే రష్మిక జూనియర్. అయినా సరే ఇద్దరకీ ఒకే మొత్తం రెమ్యునరేషన్ అంటే రష్మిక రేంజ్ పెరిగిపోయినట్లే!కన్నడ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు ఇక్కడే వరస మూవీస్ చేసింది. హిందీలో అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్స్‌తోనూ నటించింది గానీ 'పుష్ప' ఫ్రాంచైజీ ఈమెకు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన 'ఛావా' సక్సెస్ కూడా ఈమె కలిసొచ్చింది. ఈ క్రమంలోనే హిందీలో ఈమెకు రూ.15 పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలామంది మిడ్ రేంజ్ హీరోల తీసుకునే మొత్తంతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువనే చెప్పొచ్చు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్) -
సరదా సరదాగా...
సరదాగా ఆటపట్టించడం అంటాం కదా... షాహిద్ కపూర్–రష్మికా మందన్నా మధ్య అలాంటి సంఘటనే జరిగింది. షాహిద్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా, కృతి సనన్ హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘కాక్టెయిల్ 2’. ఈ నెల 19న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోంది ఈ టీమ్. ఆ మధ్య ఒక కార్యక్రమంలో ఫొటోలకు పోజులిస్తున్న సమయంలో షాహిద్ కపూర్ అనుకోకుండా రష్మిక భుజంపై చేయి వేశారు.అయితే రష్మిక కాస్త ఇబ్బందిగా ఫీల్ అయినట్లు వెనక్కి జరిగి, అతని చేతిని తప్పించారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. తాజాగా ముంబైలో జరిగిన ఒక ప్రమోషనల్ ఈవెంట్లో షాహిద్, రష్మిక, కృతి పాల్గొన్నారు. ముగ్గురూ కలిసి ఫొటోలకు పోజులిస్తున్నప్పుడు రష్మికను సరదాగా ఆట పట్టిస్తూ షాహిద్ కావాలని కాస్త దూరంగా జరిగారు. గత ఈవెంట్లో రష్మిక ఎలా అయితే చేశారో షాహిద్ అచ్చంగా అలానే అనుకరించడం చాలా ఫన్నీగా కనిపించింది. అయితే షాహిద్ దూరం జరగ్గానే అతనితో పాటు రష్మిక, కృతి సరదాగా నవ్వేశారు. ఆ వీడియో వైరల్‌గా మారింది. -
రష్మిక జపాన్ ట్రిప్.. యానిమే అవార్డ్ వేడుకలో ఇలా (ఫొటోలు)
-
విజయ్‌కు భార్యపై ఎంత ప్రేమో.. వీడియో వైరల్
హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా.. ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ ది బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ప్రేమ విషయాన్ని వీలైనంతవరకు సీక్రెట్‌గా ఉంచారు. అదే సమయంలో తామిద్దరం కలిసే ఉన్నామంటూ కొన్ని హింట్లు కూడా వదిలారు. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం అని కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి వార్త చెప్పి అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. జంటగా..ఈ పెళ్లిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అభిమానుల్ని, తన ఊరి ప్రజలను భాగం చేయడం విశేషం! ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ జోడీ మార్చిలో ఘనంగా రిసెప్షన్ జరుపుకున్నారు. ఈ విరోష్ జోడీ ప్రస్తుతం 'రణబాలి' సినిమాలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్స్ మధ్య గ్యాప్ దొరికినప్పుడు ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. తాజాగా వీరిద్దరూ విమానాశ్రయంలో కనిపించారు.భార్యపై ఎంత ప్రేమో!ఈ సందర్భంగా సింపుల్ టీ షర్ట్‌లో కనిపించిన విజయ్ మెడలో ఒక చైన్, లాకెట్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ లాకెట్ R అక్షరంలో ఉంది. దీంతో రష్మిక మందన్నాకు గుర్తుగా R పెండెంట్ ధరించాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సినిమాల విషయానికి వస్తే.. విజయ్ చేతిలో 'రణబాలి' కాకుండా మరో రెండు సినిమాలున్నాయి. అటు రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్ మూవీ 'కాక్టైల్' జూన్ 19న విడుదలవుతోంది. ఇది కాకుండా ఆమె చేతిలో మైసా మూవీ ఉంది. View this post on Instagram A post shared by NandGowli Kamlesh (@artistrybuzz_) చదవండి: కరుప్పు రిజెక్ట్ చేసిన విజయ్‌కు థాంక్స్.. ఎందుకో తెలుసా? -
కాజల్ ఇలా కామ్నా అలా.. మధ్యలో రష్మిక
అందంతో రచ్చ లేపుతున్న కాజల్ అగర్వాల్ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ కామ్నా గ్లామర్ డోస్మోడ్రన్ డ్రస్‌లో మాయ చేసేలా ఐశ్వర్య రాజేశ్పొడుగు కాళ్ల సుందరి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్న సంయుక్తజపాన్ ట్రిప్ లో హీరోయిన్ రష్మిక ఎంజాయ్ View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Amyra Dastur (@amyradastur) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kamna Jethmalani (@kamana10) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Cherukuri Maanasa Choudhary (@maanasa.choudhary1) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Preity Mukhundhan (@preity_mukhundhan) -
ఆడపులులం మేము
ఆడపిల్ల కదా... సిల్వర్ స్క్రీన్‌పై ఆడుతూపాడుతూ గ్లామరస్‌గా కనిపిస్తే చాలు అనే రోజులు పోయాయి. గ్లామర్‌ని పక్కన పెట్టి, సిల్వర్ స్క్రీన్‌పై డిష్యుం డిష్యుంకి సై అంటున్న రోజులు వచ్చాయి. మెరుపు తీగలా కనిపించే కథానాయికలు సినిమాలో విలన్లపై మెరుపు దాడి చేయడానికి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్లోకి ఎంటరవుతున్నారు. దీపికా పదుకోన్ వంటి సీనియర్ హీరోయిన్ మాత్రమే కాదు... రష్మికా మందన్నా, సంయుక్త, ఆలియా భట్, కృతీ సనన్... ఇలా పలువురు యంగ్ హీరోయిన్స్ పవర్ఫుల్ రోల్స్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ కోసం గుర్రపు స్వారీ, కత్తి సాము, గన్ షూట్ వంటి వాటిలో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ‘ఆడపులులం మేము’ అంటూ ఈ హీరోయిన్లు ఏయే చిత్రాల్లో పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారో తెలుసుకుందాం...‘మైసా’ కోసం మార్షల్ ఆర్ట్స్ఒకపాత్ర ఒప్పుకుంటే ఆపాత్రలానే మారిపోవాలనుకుంటారు రష్మికా మందన్నా. ఆ క్యారెక్టర్‌కి న్యాయం చేయడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు. ‘మైసా’ సినిమాలోని మైసాపాత్ర కోసం ఈ బ్యూటీ తీసుకున్న ఓ రిస్క్ 80 అడుగుల ఎత్తు నుంచి దూకడం. నిజానికి ఈ సన్నివేశాన్ని డూప్‌తో చేయిద్దామని యూనిట్ అన్నప్పటికీ ‘నో నో’ అంటూ, తానే చేశారు. ఇంకా ఈ సినిమా కోసం బోలెడన్ని రిస్కీ ఫైట్స్ చేస్తున్నారామె. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం రష్మిక థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా స్టంట్స్, మార్షల్ ఆర్ట్స్‌లో కఠోర శిక్షణ తీసుకున్నారు.రోజుకు దాదాపు 8 గంటలపాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ సాగింది. హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్, అధునాతన స్టంట్ టెక్నిక్స్ వంటివి నేర్చుకున్నారు. ఆ ట్రైనింగ్ పూర్తయ్యాక కేరళలో తీసిన యాక్షన్ సీక్వెన్స్‌లో భాగంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకారు. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైసా అనే గిరిజన గోండు యువతిపాత్రలో కనిపించనున్నారు రష్మిక. ఈ షెడ్యూల్ కోసమే రష్మిక బ్యాంకాక్‌లో ప్రత్యేక శిక్షణ పొందారు. అంతర్జాతీయ యాక్షన్ డైరెక్టర్ ఆండీ లాంగ్ ఈ చిత్రానికి స్టంట్స్ పర్యవేక్షిస్తున్నారు. ఈ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ ఈ ఏడాదే విడుదల కానుంది.కత్తి సాముకి సైక్యారెక్టర్ డిమాండ్ మేరకు నటించడానికి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేస్తా అంటున్నారు సంయుక్త. అనడమే కాదు... ఆ పని చేశారు కూడా. ‘స్వయంభు’ సినిమాలో చేసిన యోధురాలిపాత్ర కోసం ఆమె గుర్రపు స్వారీ నేర్చుకున్నారు, కత్తి సాములో శిక్షణ తీసుకున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్ పర్యవేక్షణలో ఆమె ఈ యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంతే కాదు... ఈ పోరాట సన్నివేశాలు చిత్రీకరించే రోజు షూటింగ్‌కు దాదాపు నాలుగైదు గంటల ముందు ప్రాక్టీస్ సెషన్స్లోపాల్గొన్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలను దట్టమైన అడవుల నేపథ్యంలో చిత్రీకరించారు. అందువల్ల శిక్షణను కూడా అదే తరహా వాతావరణంలో, కొండలు గుట్టలు వంటి కఠినమైన భూభాగాలకు అలవాటు పడేలా నిర్వహించారు. ఇక ఈ భారీపాన్ ఇండియన్ మూవీలోనిపాత్ర కోసం హీరో నిఖిల్ సిద్ధార్థ్ కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.ఎనిమిది మంది ఫైటర్స్‌తో దీపిక ఫైట్ఇరవై ఏళ్లయింది దీపికా పదుకోన్ సినిమాల్లోకి వచ్చి. ఇన్నేళ్లల్లో గ్లామరస్ క్యారెక్టర్స్‌తోపాటు పూర్తిగా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. అలాగే ‘పఠాన్, జవాన్, ఫైటర్’ వంటి సినిమాల్లో యాక్షన్ రోల్స్ చేశారు. ‘ఫైటర్’ సినిమా కోసం ఆమె మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. తాజాగా చేస్తున్న ‘కింగ్’ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు కానీ... స్టంట్ రిహార్శల్స్ చేశారట. ఈ చిత్రంలో ఒకేసారి ఎనిమిది మంది ఫైటర్స్‌తో దీపిక ఫైట్ చేసే యాక్షన్ సీన్ ఉందని సమాచారం. అలాగే ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ని సౌత్ ఆఫ్రికాలో చిత్రీకరించారని టాక్. ఈ భారీ ఫైట్‌లో షారుక్, దీపిక, సుహానాపాల్గొన్నారట. ఒక నటి 20 ఏళ్ల తర్వాత కూడా ఉత్సాహంగా యాక్షన్ రోల్స్ ఒప్పుకోవడం, రిహార్సల్స్ చేసి మరీ చేయడం అనేది అభినందించదగ్గ విషయం. ఇదిలా ఉంటే... అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమాలోనూ దీపికా పదుకోన్ ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె గర్భవతి. ‘కింగ్’ సినిమాకి ముందే ట్రైనింగ్ తీసుకుని, యాక్షన్ సీన్స్ చేశారు దీపికా పదుకోన్. అయితే గర్భవతి కావడంతో ‘రాకా’లోని యాక్షన్ సీన్స్‌ని ఆమెకు బదులు డూప్‌తో చేయించాలనుకుంటున్నారట. కాగా ‘కింగ్’ సినిమా కోసం యువ నటి సుహానా కూడా ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే...సుహానా... షూట్‌కి రెడీ‘రెడీ టు షూట్’ అంటూ సిల్వర్ స్క్రీన్ పైకి రావడం రావడమే సుహానా ఖాన్ ‘కింగ్’ చిత్రంతో తుపాకీతో ఎంట్రీ ఇస్తున్నారు. మామూలుగా ‘స్టార్ కిడ్స్’పై ఎన్ని అంచనాలు ఉంటాయో షారుక్ ఖాన్ తనయగా సుహానా మీద అన్నీ ఉన్నాయి. 2023లో చేసిన ‘ది ఆర్చీస్’ సుహానాకి తొలి సినిమా. అయితే ఆ సినిమా నేరుగా ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. సో... ‘కింగ్’ వంటి భారీ యాక్షన్ సినిమాతో సుహానా వెండితెరపైకి వస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఒక క్రూరమైన, అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేని హంతకుడిపాత్రలో కనిపిస్తారట. ఆయనపాత్ర రెండు టైమ్‌లైన్స్‌లో ఉంటుందని సమాచారం.ఒకటి గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ అని టాక్. ఈ చిత్రంలో షారుక్ శిష్యురాలిపాత్రను సుహానా చేస్తున్నారు. షారుక్ దగ్గర యాక్షన్ ట్రైనింగ్ తీసుకునేలా ఈపాత్ర ఉంటుందని తెలిసింది. ఇక ఇది పూర్తిగా యాక్షన్ క్యారెక్టర్ కావడంతో ‘కింగ్’ షూటింగ్ ఆరంభించే ముందు దాదాపు ఆరు నెలలపాటు అంతర్జాతీయ శిక్షకుల వద్ద మార్షల్ ఆర్ట్స్, గన్ షూట్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నారు సుహానా. ఈ షూటింగ్ లొకేషన్లో కుమార్తెకు షారుక్ కూడా కొన్ని యాక్షన్ మెళకువలు నేర్పిస్తున్నారట. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణీ ముఖర్జీ, దీపికా పదుకోన్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది క్రిస్మస్కి ‘కింగ్’ని విడుదల చేయాలనుకుంటున్నారు.ఫైట్‌కే కాదు... పాటకూ ట్రైనింగ్స్పై ఏజెంట్ క్యారెక్టర్ చేయడం అంటే మామూలు విషయం కాదు... బ్రెయిన్‌తో ఆలోచించి, ప్రత్యర్థిని ట్రాప్ చేయాలి, బాడీ పవర్‌ని ఉపయోగించి రఫ్ఫాడించాలి. సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగల్లా కనిపించే ఆలియా భట్, శార్వరి ఈ స్పై క్యారెక్టర్ చేశారు. ఆ సినిమానే యశ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ‘ఆల్ఫా’. బాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన యశ్ రాజ్ ఫిలింస్ నుంచి స్పై సినిమాలు చాలా వచ్చాయి. కానీ అవన్నీ హీరో ఓరియంటెడ్ సినిమాలు. ఈ సంస్థలో స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి మహిళా ప్రధాన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాలో పవర్ఫుల్ స్పై ఏజెంట్లుగా ఒదిగిపోవడానికి ఆలియా, శార్వరి ఫిట్నెస్తోపాటు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ట్రైనింగ్ తీసుకున్నారు.జిమ్‌లో ఫంక్షనల్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చేస్తూ, పూర్తిగా యాక్షన్ మోడ్‌లో ఉన్న వీడియోలను ఆలియా షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. విశేషం ఏంటంటే... ఫైట్స్‌కి మాత్రమే కాదు... ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ కోసం కూడా ఆలియా, శార్వరి కఠినమైన వర్కౌట్స్ చేశారట. ఈపాట డ్యాన్స్ మూమెంట్స్ ఎక్కువ స్టామినాని డిమాండ్ చేయడంతో ఈ వర్కౌట్స్ చేశారని తెలిసింది. ఇద్దరూపాల్గొన్న ఫైట్స్, ఈ స్పెషల్ సాంగ్ సినిమాకే హైలైట్‌గా ఉంటాయని బాలీవుడ్ టాక్. శివ్ రావైల్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆల్ఫా’ జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఏజెంట్‌గా ఫైట్ఆలియా, శార్వరిలానే వామికా గబ్బి కూడా స్పై క్యారెక్టర్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై తుపాకీ ఎక్కు పెట్టి, ఏజెంట్‌గా సిల్వర్ స్క్రీన్‌పై విజృంభించడానికి వామికా శిక్షణ తీసుకున్నారు. ‘జీ 2’ సినిమా కోçసమే వామికా గబ్బి ట్రైనింగ్ తీసుకుని మరీ సెట్స్‌లోకి ఎంటరయ్యారు. అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’కి (2018) సీక్వెల్‌గా ‘జీ 2’ రూపొందుతోంది. ఈ చిత్రంలో ఏజెంట్ గోపి 116పాత్ర చేశారు శేష్. సీక్వెల్లోనూ ఈపాత్ర చేస్తున్నారు. ఏజెంట్ మహాలక్ష్మి నాగిన్‌గా వామికా గబ్బి నటిస్తున్నారు. ఈ సినిమాకి వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు.ఇందులోని యాక్షన్ సీన్స్, స్పై మిషన్స్, ఫిట్నెస్కి సంబంధించి వామికా గబ్బి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. కాగా ఈ సినిమా కోసం యూరప్‌లో చిత్రీకరించిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ హైలైట్‌గా ఉంటుందని తెలిసింది. ఇక 2015లో ‘భలే మంచి రోజు’ చిత్రం ద్వారా వామికా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత పంజాబీ, హిందీ మలయాళం వంటి భాషల్లో నటించిన వామికా ‘జీ 2’తో మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారు. ‘భలే మంచి రోజు’లో ట్రెడిషనల్ క్యారెక్టర్లో కనిపించిన వామిక ‘జీ 2’లో పూర్తి భిన్నంగా చాలా పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఈపాన్ ఇండియన్ స్పై యాక్షన్ మూవీ పలు భాషల్లో ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా ట్రైనింగ్గ్లామరస్, డీ గ్లామరస్, ట్రెడిషనల్... ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అంటారు కృతీ సనన్. ‘ఆది పురుష్’లో సీతగా కనిపించిన ఈ బ్యూటీ ‘మిమీ’లో సరోగేట్ మదర్ క్యారెక్టర్లో ఒదిగిపోయారు. త్వరలో విడుదల కానున్న ‘కాక్టెయిల్ 2’లో గ్లామరస్‌గా కనిపించనున్నారు. ఇప్పుడు తనలోని పూర్తి స్థాయి యాక్షన్ నటిని ఆవిష్కరించుకోవడానికి కృతి కసరత్తులు చేస్తున్నారట. మరి... ఈ బ్యూటీకి వచ్చిన ఆఫర్ అలాంటిది. బాలీవుడ్ భారీ మాస్ సినిమాల్లో ఒకటైన ‘డాన్’ సిరీస్‌లో నటించే చాన్స్ కృతీకి దక్కిందని సమాచారం. ‘డాన్, డాన్ 2’ చిత్రాల తర్వాత దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3’ చేయనున్న విషయం తెలిసిందే.రెండు భాగాల్లో డాన్‌గా షారుక్ ఖాన్, ఇంటర్‌పోల్ ఆఫీసర్ రోమాగా ప్రియాంకా చోప్రా నటించారు. అయితే మూడో భాగంలో రణ్వీర్ సింగ్‌ని డాన్పాత్రకు తీసుకున్నారు ఫర్హాన్ అక్తర్. కానీ, ఈ సినిమా నుంచి రణ్వీర్ తప్పుకున్నారు. ఇక షూటింగ్ ఆరంభించడమే ఆలస్యం అనే తరుణంలో సరిగ్గా మూడు వారాల ముందు రణ్వీర్ తప్పుకున్నారట. ఈ విషయంలో రణ్వీర్–ఫర్హాన్ మధ్య వివాదం నెలకొంది. ముందు నటిస్తానని చెప్పి, తర్వాత తప్పుకోవడంతో రణ్‌వీర్‌కి సహాయ సహకారాలు అందించకూడదని ముంబైకి చెందిన ‘ఫిల్మ్ బాడీ’ నిర్ణయించుకుంది.అలాగే నష్టపరిహారం కింద రణ్వీర్ తనకు రూ. 45 కోట్లు ఇవ్వాలని ఫర్హాన్ డిమాండ్ చేస్తున్నారు. మరి... ఈ వివాదం ఎప్పుడు సద్దుమణుగుతుందనేది కాలమే చెప్పాలి. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో ఇంటర్‌పోల్ ఆఫీసర్ రోమాపాత్రకు కృతీ సనన్ని ఎంపిక చేశారని భోగట్టా. ‘డాన్’ సిరీస్‌లో ఈపాత్రకు యాక్షన్ సీన్స్ ఉన్నట్లే మూడో భాగంలోనూ ఉంటాయి. దాంతో కృతీ సనన్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారనే వార్త వినిపిస్తోంది.అయితే కృతీ సనన్ని ఈ చిత్రానికి ఎంపిక చేసినట్లు యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఫర్హాన్ అక్తర్ ఆఫీస్ వద్ద కృతి పలుమార్లు కనిపించడంతో ‘డాన్ 3’ చర్చల్లోపాల్గొనడానికే అని ప్రచారంలో ఉన్న వార్తకు బలం చేకూరినట్లయింది. ఇక ఈ సినిమాని 2023లోనే ప్రకటించారు ఫర్హాన్. అయితే ఇప్పటివరకూ షూటింగ్ ఆరంభించలేదు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ తారలే కాదు... మరికొంత మంది కూడా క్యారెక్టర్ డిమాండ్ మేరకు కసరత్తులు చేసి, సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. రిస్క్ తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడకుండాపాత్రల్లో ఒదిగిపోతున్న ఈ కథానాయికలను అభినందించాల్సిందే. – డి.జి. భవాని -
విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..!
ఈ ఏడాది టాలీవుడ్లో జరిగిన బిగ్గెస్ట్ గ్రాండ్ వెడ్డింగ్ విరోష్ జంటదే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పెళ్లికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ ప్రియ మాగంటి ఓ సీక్రెట్ రివీల్ చేశారు. రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్ చేసుకున్నారని తెలిపారు. ట్రెండ్‌ను ఫాలో కావాలని విరోష్ జోడీ ముందు నుంచే అనుకోలేదన్నారు. దుస్తులు, ఆభరణాల నుంచి అన్నీ రొటీన్‌కు భిన్నంగా ప్లాన్ చేసుకున్నారని వెల్లడించారు. వీరిద్దరు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అన్నారు.ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఈ సినిమా ప్రేక్షకుల ఊహకు అందదు : రష్మిక మందన్నా
షాహిద్ కపూర్, రష్మికా మందన్నా, కృతీసనన్ ప్రధాన తారాగణంగా నటించిన హిందీ చిత్రం ‘కాక్ టెయిల్ 2’. హోమి అదజానియా దర్శకత్వంలో దినేష్ విజన్, లవ్ రంజన్ , అంకుర్ గార్గ్ నిర్మించారు. ఇందులో కునాల్ పాత్రలో షాహిద్ కపూర్, దియాగా రష్మికా మందన్నా, అల్లీగా కృతీసనన్ నటించారు. ఈ చిత్రం జూన్ 19న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఈ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో రష్మికా మందన్నా మాట్లాడుతూ–‘‘డిఫరెంట్ లవ్‌స్టోరీ సినిమా ఇది. ఈ సినిమా కథ ప్రేక్షకుల ఊహకు అందదు. షాహిద్‌తో ఆన్ స్క్రీన్ పై మంచి కెమిస్ట్రీ కుదిరింది. ఈ సినిమాలో కృతీసనన్ మరింత అందంగా కనిపిస్తారు’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో నేను కునాల్ రోల్ చేశాను. కథలో ఇద్దరు హీరోయిన్ల మధ్యలో కునాల్ ఎవరివైపు వెళ్లాలో తెలియక సతమతం అవుతుంటాడు. రష్మిక, కృతీసనన్ సూపర్‌స్టార్స్. ఎంతో ప్రొఫెషనల్‌గా ఉంటారు’’ అని చెప్పారు. ఇక హోమి అదజానియా దర్శకత్వంలో సైఫ్ అలీఖాన్ , దీపికా పదుకొనె, డయానా పెంటీ లీడ్ రోల్స్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘కాక్టెయిల్’. ఈ ‘కాక్టెయిల్’ ఫ్రాంచైజీ నుంచి రాబోతున్న రెండో సినిమా ‘కాక్ టెయిల్ 2’ అని తెలుస్తోంది. -
'బూతు'ని కంట్రోల్ చేసుకోలేకపోయిన రష్మిక
సాధారణంగా నటీనటులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతుంటారు. స్టార్స్ అయితే ఇంకా జాగ్రత్తగా ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పొరపాటులో నోరు జారుతుంటారు. హీరోయిన్ రష్మిక కూడా ఇప్పుడు అలానే చేసింది. తోటి హీరోయిన్ని పొగుడుతూ టంగ్ స్లిప్ అయింది. వెంటనే నాలిక్కరుచుకుంది. ఇంతకీ ఏమైంది?(ఇదీ చదవండి: ఓటీటీలోకి మెగా కోడలి కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)స్వతహాగా కన్నడ అమ్మాయి అయినప్పటికీ రష్మిక.. తెలుగు సినిమాలతోనే బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. హీరో విజయ్ దేవరకొండని ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలు అయిపోయింది. హిందీలోనూ మూవీస్ చేస్తున్న ఈమె నటించిన 'కాక్టెయిల్ 2' వచ్చే నెల 19న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది.ఈ కార్యక్రమంలోనే తోటి హీరోయిన్ కృతి సనన్ గురించి చెబుతూ '****' అనే బూతుని పొరపాటున ఉపయోగించింది. వెంటనే క్షమాపణ కూడా చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రష్మిక, కృతిసనన్ హీరోయిన్లుగా కాగా షాహిద్ కపూర్ హీరో. అయితే ఈ మూవీలో రష్మిక-కృతి సనన్.. స్వలింగ సంపర్క పాత్రల్లో కనిపించనున్నారనే రూమర్స్ గతంలో వచ్చాయి. (ఇదీ చదవండి: తెలుగు క్రికెటర్‌తో శ్రీలీల డేటింగ్.. స్పందించిన హీరోయిన్ తల్లి)#RashmikaMandanna just couldn’t stop praising #KritiSanon 🤯🔥pic.twitter.com/bf76j1cVYd— Filmyscoops (@Filmyscoopss) May 18, 2026 -
రష్మికకు చేదు అనుభవం.. స్టార్ హీరో అసభ్య ప్రవర్తన..!
టాలీవుడ్ హీరోయిన్, కన్నడ బ్యూటీ రష్మికకు చేదు అనుభవం ఎదురైంది. తాను నటిస్తోన్న కాక్టెయిల్-2 మూవీ ప్రమోషన్స్‌లో చాలా ఇబ్బందికి గురైంది. రష్మిక మాట్లాడుతుండగా పక్కనే ఉన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో రష్మిక మందన్నా తీవ్ర అసౌకర్యానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇక కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం.. విజయ్ దేవరకొండతో కలిసి రణబాలి చిత్రంలో నటిస్తోంది. పెళ్లి తర్వాత వీళ్లిద్దరు కలిసి నటిస్తోన్న మూవీ ఇదే కావడం విశేషం. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ మూవీ ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం కాక్టెయిల్-2 మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ మూవీ ‘కాక్టెయిల్-2’ ప్రమోషన్లలో షాహిద్ కపూర్ తీరుతో రష్మిక కాస్త ఇబ్బంది పడ్డారు. షాహిద్ తన భుజంపై చేయి వేయగానే అన్‌కంఫర్టబుల్‌గా ఫీలై వెంటనే పక్కకు తప్పుకున్నారు. ఆ సమయంలో ఆమె పైకి నవ్వుతూనే ఉన్నప్పటికీ ఏదో జరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి… pic.twitter.com/FGza2sYnR8— ChotaNews App (@ChotaNewsApp) May 18, 2026 -
‘కాక్టెయిల్ 2’ మూవీ ప్రమోషన్ లో రష్మిక మందన్న,కృతి సనన్ (ఫొటోలు)
-
కొత్త శక్తి వచ్చింది.. ఆ భయాన్ని పూర్తిగా జయించా : రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ‘మైసా’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల కొచ్చిలోని దట్టమైన అడవుల్లో జరిగింది. సాధారణంగా రష్మికకు 'అక్రోఫోబియా' (ఎత్తులంటే భయం) ఉంది. అయితే, ఈ సినిమా కారణంగా ఆ భయాన్ని అధిగమించానని చెబుతోంది రష్మిక. ఈ మేరకు ఇన్‌స్టాతో ఓ సుధీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ‘కొచ్చిలో ఉన్న రోజులు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చాయి. అడవులు, కీటకాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు, వర్కౌట్లు, వర్షాలు.. ఇలా ప్రతిదీ ఒక అనుభవం. నాకు ఎత్తులంటే చాలా భయం. ఇక్కడ ఆ భయాన్ని పూర్తిగా జయించాను. మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా పోరాడటం నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఉదయాన్నే అలారం మోగగానే నిద్ర లేవడం నుంచి, ఎంతో ఇష్టమైన పళం పూరీలు కడుపునిండా తినడం వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను’ అంటూ కొచ్చిలో దిగిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాగా, ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం రష్మిక ఎలాంటి డూప్ లేకుండా ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు.ఈ సాహసోపేతమైన ఫీట్ చేస్తున్న సమయంలో రష్మిక కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. అయినప్పటికీ, ఆమె ఏమాత్రం విరామం తీసుకోకుండా పట్టుదలతో షూటింగ్లో పాల్గొన్నారని దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)


