'రణబాలి' సెన్సార్ రివ్యూ.. రన్ టైమ్ ఎంతంటే? | Ranabaali Movie Censor Talk And First Review | Sakshi
Sakshi News home page

Ranabaali Censor: పెద్ద గండం దాటిన విజయ్-రష్మిక సినిమా

Oct 13 2026 9:02 PM | Updated on Oct 13 2026 9:02 PM

Ranabaali Movie Censor Talk And First Review

ఈ మధ్య చిన్న నుంచి పెద్ద సినిమాల వరకు సెన్సార్ అనేది చాలాపెద్ద సమస్యగా మారిపోయింది. టైటిల్ దగ్గర నుంచి మూవీలోని సన్నివేశాల వరకు సెన్సార్ ఇబ్బందులతో చాలానే సతమతమయ్యాయి. ‍అయితే ఈ గండం నుంచి విజయ్ దేవరకొండ 'రణబాలి' దాటేసింది. ఇంతకీ సెన్సార్ టాక్ ఏంటి? చిత్ర రన్ టైమ్ ఎంత?

(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)

విజయ్ దేవరకొండ, రష్మిక.. తమ పెళ్లి తర్వాత చేసిన తొలి సినిమా 'రణబాలి'. స్వాతంత్ర్యం రాకముందు రాయలసీమ ప్రాంతంలో జరిగిన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. అయితే ట్రైలర్‌లో హింస, రక్తం కనిపించే సీన్స్ ఉండేసరికి దీనికి కూడా సెన్సార్ ఇబ్బందులు తప్పవేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డ్.. యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయని సెన్సార్ టాక్ వినిపిస్తోంది. మరీ ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకున్న దర్శకుడు.. హింస మోతాదు తగ్గించి భావోద్వేగ సన్నివేశాలకు ఎక్కువగా చోటిచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సినిమాకు అన్ని కలిసొస్తున్నాయి. ఇక కంటెంట్‌తో హిట్ కొట్టడమే మిగిలుంది. విజయ్-రష్మిక ఏం చేస్తారో చూడాలి?

(ఇదీ చదవండి: సాయిపల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement