సాయిపల్లవి.. ఇంటర్వ్యూల్లో కనిపించి చాన్నాళ్లయిపోయింది. తెలుగులో అయితే చివరగా నాగచైతన్యతో 'తండేల్' చేసింది. ఆ మూవీలో బుజ్జితల్లిగా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. వచ్చే నెల 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతున్న 'రామాయణ'లో సీతగా అలరించనుంది. అయితే ఓ టాక్ షోలో కనిపించిన ఈ బ్యూటీకి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ ఇప్పుడు రివీల్ అయ్యాయి. వీటిని హీరో నాగచైతన్యనే బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: 'రాజాసాబ్' సినిమా.. అలా చేయకుండా ఉండాల్సింది: నిర్మాత)
జగపతిబాబు హోస్ట్ చేస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా' టాక్ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్ గెస్ట్‌గా పాల్గొన్న సాయిపల్లవికి ఎన్ని భాషలొచ్చని హోస్ట్ అడిగాడు. అలానే తను నటి కాకపోయింటే డాక్టర్‌గా సేవ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. సినిమాల వల్ల క్లాసులకు సరిగా వెళ్లలేకపోయిన విషయాన్ని కూడా గుర్తుచేసుకుంది.
ఇక వీడియో కాల్ ద్వారా సర్‌ప్రైజ్ ఇచ్చిన నాగచైతన్య.. సాయిపల్లవి చూడటానికి సైలెంట్‌గా కనిపిస్తుంది గానీ చాలా ఎక్కువ మాట్లాడుతుందనే సీక్రెట్ చెప్పాడు. ఇక చైతూ గురించి మాట్లాడిన సాయిపల్లవి.. తనని అబ్బాయిలా ట్రీట్ చేస్తాడనే ఫన్నీ సంగతి చెబుతూ నవ్వేసింది. ఈ ప్రోమోలో సాయిపల్లవి పెద్దగా ఏం చెప్పలేదు. ఈ శుక్రవారం జీ5 ఓటీటీలో ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్‌లో ఇంకేం కొత్త సంగతులు చెబుతుందో చూడాలి?
(ఇదీ చదవండి: శోభిత షాకింగ్ లుక్.. బీచ్ వెకేషన్ లో మాళవిక మోహనన్)


