‘ఎవరికోసమో నేను మారలేను’.. రష్మిక స్ట్రాంగ్‌ రిప్లై | Rashmika Spoke About Trolling In Ranabaali Movie Promotion | Sakshi
Sakshi News home page

Rashmika Trolling: ‘ఎవరికోసమో నేను మారలేను’.. రష్మిక స్ట్రాంగ్‌ రిప్లై

Oct 6 2026 2:50 PM | Updated on Oct 6 2026 3:00 PM

Rashmika Spoke About Trolling In Ranabaali Movie Promotion

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. రాహుల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది. ఈ క్రమంలో తనపై సోషల్‌ మీడియాలో వచ్చే ట్రోలింగ్స్‌పై రష్మిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

తాను అందరితో సరదాగా, స్నేహపూర్వకంగా ఉండటాన్ని కొందరు మరోలా అర్థం చేసుకుంటున్నారని రష్మిక తెలిపారు. అందరితో మంచిగా ఉండటం తన బలహీనత కాదని స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉంటే అక్కడ సానుకూల వాతావరణం ఉండాలని కోరుకుంటానని చెప్పారు.

ఉన్న చోట పాజిటివిటీ ఉండాలని..
‘అందరితో మంచిగా ఉండటం నా బలహీనత కాదు. నేను ఉన్న చోట పాజిటివిటీ ఉండాలని, సరదాగా ఉండాలని అనుకుంటాను. దీనికి ఎవరు ఏ పేరు పెట్టినా నాకు పెద్దగా పట్టింపు లేదు. అందరికీ నేను నచ్చాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం నేను మారలేను. సరదాగా ఉండటం వల్ల నా కుటుంబం, స్నేహితులు సంతోషంగా ఉంటారు’ అని రష్మిక తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

రణబాలి విషయానికొస్తే..
ఇక ‘రణబాలి’ విషయానికొస్తే.. సినిమా నేపథ్యం, కథ ఎలా ఉండబోతుందనే విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్రబృందం ఇప్పటికే నాలుగు భాగాలుగా డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసింది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

(ఇదీ చదవండి: ‘40 సినిమాలకు డైలాగ్స్‌ రాశా.. 500 చిత్రాల్లో నటించా.. కానీ..’)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement