టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటించిన మూవీ ‘రణబాలి’. వీరిద్దరి కలయికలో రూపొందిన మూడో చిత్రమిది. ఈ హ్యాట్రిక్ మూవీ వీరిద్దరి కెరీర్‌లోనూ ఓ మైలురాయిగా నిలిచేలా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి షోకు సినిమాకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. విజయ్ దేవరకొండ నటన, ఆయన ఎంచుకున్న పాత్ర, తెరపై చూపించిన వైవిధ్యం గురించి ప్రేక్షకుల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా ‘రణబాలి’లో కనిపించడం ప్రధాన ఆకర్షణ. కథానాయకుడిగా తన ఇమేజ్‌కు పరిమితం కాకుండా, నటుడిగా కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని రణబాలి చిత్రం మరోసారి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా పాత్ర కోసం ఆయన చూపించిన డెడికేషన్, తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం సినిమాకు ప్రత్యేకతని తీసుకొచ్చాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)
‘రణబాలి’ విజయ్‌లోని నటుడిని మరో మెట్టు ఎక్కించిన చిత్రంగా నిలుస్తోంది. మరోవైపు రష్మికతో విజయ్ దేవరకొండ జోడీ కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలయికకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్, సినిమా చుట్టూ కొనసాగుతున్న చర్చలు ‘రణబాలి’కి అదనపు ఆకర్షణగా మారింది.
మొత్తంగా చూస్తే ‘రణబాలి’ విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో భిన్నమైన ప్రయత్నం. మూస పాత్రలకు దూరంగా వెళ్లి కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలనే ఆయన ప్రయత్నం మరోసారి సక్సెస్ అయ్యింది. నటుడిగా తన పరిధిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న విజయ్ దేవరకొండ, రష్మికలకు ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిందనటంలో సందేహం లేదు.
ఇకపోతే హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొన్నారు. స్టార్ జంట వేడుకల్లో పాల్గొనడంతో అక్కడి వాతావరణం మరింత సందడిగా మారింది. పెళ్లి తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని రష్మికకు తాను ముందే చెప్పానని విజయ్ దేవరకొండ.. వివాహానంతరం తనకు ఇదే తొలి బతుకమ్మ పండుగ అని రష్మిక మందన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో విరోష్ అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)


