పెళ్లి తర్వాత జాక్‌పాట్ కొట్టిన రష్మిక! | Rashmika Mandanna Highest Remuneration For Cocktail 2 Movie | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: రష్మిక రేంజ్ పెరిగిపోయింది.. హీరోలని మించిపోయేలా

Jun 1 2026 12:42 PM | Updated on Jun 1 2026 7:49 PM

Rashmika Mandanna Highest Remuneration For Cocktail 2 Movie

కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకోరు. కానీ రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో హీరో విజయ్ దేవరకొండని వివాహం చేసుకుంది. అయితే బ్రేక్ తీసుకోవడం లాంటివేం లేకుండా ఫుల్ బిజీగా మారిపోయింది. తెలుగులో రణబాలి, మైసా లాంటి మూవీస్ చేస్తూ హిందీలో 'కాక్‌టెయిల్ 2' లాంటి క్రేజీ ప్రాజెక్టులు చేసింది. అయితే రష్మిక ఉందంటే కచ్చితంగా సదరు మూవీకి క్రేజ్ రావడం గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఇప్పుడు ఈ బ్యూటీ రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.

(ఇదీ చదవండి: ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సినిమా ఛాన్స్)

తెలుగులో ఒక్కో సినిమాకూ రూ.8-10 కోట్ల మధ్య తీసుకునే రష్మిక.. బాలీవుడ్‌లో మాత్రం దీనికి రెట్టింపు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 19న రిలీజయ్యే 'కాక్‌టెయిల్ 2' కోసం ఏకంగా రూ.15 కోట్లు అందుకుందట. ఇప్పుడీ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ మూవీలో నటించిన మరో హీరోయిన్ కృతి సనన్‌కి కూడా అంతే మొత్తం ఇచ్చారు. కాకపోతే కృతితో పోలిస్తే రష్మిక జూనియర్. అయినా సరే ఇద్దరకీ ఒకే మొత్తం రెమ్యునరేషన్ అంటే రష్మిక రేంజ్ పెరిగిపోయినట్లే!

కన్నడ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపు ఇక్కడే వరస మూవీస్ చేసింది. హిందీలో అమితాబ్, సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి స్టార్స్‌తోనూ నటించింది గానీ 'పుష్ప' ఫ్రాంచైజీ ఈమెకు ఉత్తరాదిలోనూ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. గతేడాది వచ్చిన 'ఛావా' సక్సెస్ కూడా ఈమె కలిసొచ్చింది. ఈ క్రమంలోనే హిందీలో ఈమెకు రూ.15 పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలామంది మిడ్ రేంజ్ హీరోల తీసుకునే మొత్తంతో పోలిస్తే ఈ మొత్తం చాలా ఎక్కువనే చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement