విరోష్ వెడ్డింగ్.. ఆ సీక్రెట్ రివీల్..! | Rashmika Mandanna wedding event planner Reveals Secret In Marriage | Sakshi
Sakshi News home page

Rashmika- Vijay: విరోష్ వెడ్డింగ్.. రష్మికనే స్వయంగా చేసుకుందట..!

May 21 2026 6:51 PM | Updated on May 21 2026 7:28 PM

Rashmika Mandanna wedding event planner Reveals Secret In Marriage

ఈ ఏడాది టాలీవుడ్‌లో జరిగిన బిగ్గెస్ట్ గ్రాండ్ వెడ్డింగ్ విరోష్ జంటదే. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. ఆ తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు.

అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ పెళ్లికి సంబంధించి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ప్రియ మాగంటి ఓ సీక్రెట్ రివీల్ చేశారు. రష్మిక తన మంగళసూత్రాన్ని స్వయంగా డిజైన్‌ చేసుకున్నారని తెలిపారు. ట్రెండ్‌ను ఫాలో కావాలని విరోష్‌ జోడీ ముందు నుంచే అనుకోలేదన్నారు. దుస్తులు, ఆభరణాల నుంచి అన్నీ రొటీన్‌కు భిన్నంగా ప్లాన్‌ చేసుకున్నారని వెల్లడించారు.  వీరిద్దరు ప్రతి ఒక్కటీ ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేశారని అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే వీరిద్దరు రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా ఈ కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement