రష్మిక తరపున క్షమాపణలు చెబుతున్నా : విజయ్‌ దేవరకొండ | Vijay Devarakonda Apologies To Rashmika Fans At Ranabaali Trailer launch Event | Sakshi
Sakshi News home page

రష్మిక తరపున క్షమాపణలు చెబుతున్నా : విజయ్‌ దేవరకొండ

Oct 8 2026 6:52 PM | Updated on Oct 8 2026 7:24 PM

Vijay Devarakonda Apologies To Rashmika Fans At Ranabaali Trailer launch Event

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘రణబాలి’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. విజయదశమి సందర్భంగా అక్టోబర్‌ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు(అక్టోబర్‌ 8) ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌కి విజయ్‌ దేవరకొండతో పాటు దర్శకుడు రాహుల్‌, నిర్మాతలు నవీన్‌, రవి హాజరయ్యారు. వేరే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంతో రష్మిక ఈ ఈవెంట్‌కి రాలేకపోయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. రష్మిక తరపున అభిమానులకు క్షమాపణలు చెప్పారు విజయ్‌. 

(ఇదీ చదవండి: ట్రైలర్ రాకముందే నెగెటివ్ ప్రచారం.. మైత్రి రవి కామెంట్స్)

ఈవెంట్‌లో విజయ్‌  మాట్లాడుతూ.. ‘రష్మిక కూడా ఈ ఈవెంట్‌కు రావాల్సింది. కానీ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో రాలేకపోయింది. ఆమె తరపున అందరికి నేను క్షమాపణలు చెబుతున్నా’అని అన్నారు. రష్మిక ఎలాగో రాలేదు కాబట్టి..ఫోన్‌లో అయినా ఆమెతో మాట్లాడిస్తే బాగుంటుందని యాంకర్‌  చెప్పడంతో.. విజయ్‌  వెంటనే రష్మికకు ఫోన్‌ చేశాడు.అయితే ఆమె మాత్రం లిఫ్ట్‌ చేయలేదు. షూట్‌లో బిజీగా ఉండడం వల్లే ఆమె ఫోన్‌  లిఫ్ట్‌ చేయలేదు. మళ్లీ చేసినప్పుడు చూద్దాంలే’ అని విజయ్‌ ఫోన్‌ కట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement