రణబాలి ఈవెంట్‌లో నిర్మాత యలమంచిలి రవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ దేవరకొండ చాలా మంచివాడని ప్రశంసించారు. ట్రైలర్ రిలీజ్ కాకముందే నెగెటివ్ ప్రచారం చేయడం ఆపండని హితవు పలికారు. బ్రిటీష్ కాలం నాటి స్టోరీ కచ్చితంగ మిమ్మల్ని అలరిస్తుందని అన్నారు. విజయ్ దేవరకొండపై నెగెటివ్ ప్రచారం చేయడం ఇకనుంచైనా ఆపాలని నిర్మాత రవి విజ్ఞప్తి చేశారు. విజయ్‌తో నేను దాదాపు ఏడేనిమిదేళ్లుగా జర్నీ చేస్తున్నానని వెల్లడించారు.
కథ నచ్చకపోతే మమ్మల్ని విమర్శించండి.. తప్పులేదని నిర్మాత రవి అన్నారు. ట్రైలర్ రాకముందే మీరు నెగెటివ్ కామెంట్స్ చేయడం అపేయండని రిక్వెస్ట్ చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. సినిమా చూడకుండానే మీరు ఎలా డిసైడ్ చేస్తారని రవి ప్రశ్నించారు. విజయ్ చాలా మంచివాడని.. అతనికి సినిమా తప్పా వేరే లోకం లేదని అన్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాని బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో అక్టోబర్ 16న సందడి చేయనుంది.


