విజయ్‌కు భార్యపై ఎంత ప్రేమో.. వీడియో వైరల్‌ | Vijay Deverakonda Wears R Pendant, this is for Rashmika Mandanna | Sakshi
Sakshi News home page

Vijay Deverakonda: భార్యపై ప్రేమను చాటుకున్న విజయ్‌.. ఎలాగంటే?

May 28 2026 12:40 PM | Updated on May 28 2026 12:46 PM

Vijay Deverakonda Wears R Pendant, this is for Rashmika Mandanna

హీరో హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా.. ఆన్‌స్క్రీన్‌పైనే కాదు ఆఫ్‌ స్క్రీన్‌లోనూ ది బెస్ట్‌ కపుల్‌ అనిపించుకున్నారు. ప్రేమ విషయాన్ని వీలైనంతవరకు సీక్రెట్‌గా ఉంచారు. అదే సమయంలో తామిద్దరం కలిసే ఉన్నామంటూ కొన్ని హింట్లు కూడా వదిలారు. అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం అని కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి వార్త చెప్పి అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. 

జంటగా..
ఈ పెళ్లిలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అభిమానుల్ని, తన ఊరి ప్రజలను భాగం చేయడం విశేషం! ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ జోడీ మార్చిలో ఘనంగా రిసెప్షన్‌ జరుపుకున్నారు. ఈ విరోష్‌ జోడీ ప్రస్తుతం 'రణబాలి' సినిమాలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్స్‌ మధ్య గ్యాప్‌ దొరికినప్పుడు ట్రిప్పులకు కూడా వెళ్తున్నారు. తాజాగా వీరిద్దరూ విమానాశ్రయంలో కనిపించారు.

భార్యపై ఎంత ‍ప్రేమో!
ఈ సందర్భంగా సింపుల్‌ టీ షర్ట్‌లో కనిపించిన విజయ్‌ మెడలో ఒక చైన్‌, లాకెట్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఆ లాకెట్‌ R అక్షరంలో ఉంది. దీంతో రష్మిక మందన్నాకు గుర్తుగా R పెండెంట్‌ ధరించాడని ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. సినిమాల విషయానికి వస్తే.. విజయ్‌ చేతిలో 'రణబాలి' కాకుండా మరో రెండు సినిమాలున్నాయి. అటు రష్మిక మందన్నా నటించిన బాలీవుడ్‌ మూవీ 'కాక్‌టైల్‌' జూన్‌ 19న విడుదలవుతోంది. ఇది కాకుండా ఆమె చేతిలో మైసా మూవీ ఉంది.

 

 

చదవండి: కరుప్పు రిజెక్ట్‌ చేసిన విజయ్‌కు థాంక్స్‌.. ఎందుకో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement