పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన సినిమా 'రణబాలి'. తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతానికైతే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్.. థియేటర్ల యజమానులకు రిక్వెస్ట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
(ఇదీ చదవండి: వీకెండ్ ధమాకా.. ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)
ప్రస్తుతం సినిమాలని 5.6 లెవల్లో ఆడియో(సౌండ్) ప్లే చేస్తున్నారు. అయితే 'రణబాలి' కోసం 6 లేదా 6.6 లెవల్కి పెంచితే మంచి థియేట్రికల్ అనుభూతి కలుగుతుందని టీమ్ పోస్ట్ పెట్టింది.
ఇకపోతే స్వాతంత్ర్యం రాకముందు రాయలసీమలో బ్రిటీషర్లు సాగించిన అరాచకాల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ సినిమా తీశారు. ఇందులో ప్రజల కోసం పోరాడే వీరుడు రణబాలిగా విజయ్ దేవరకొండ కనిపించగా, ఇతడి భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించింది. వీళ్లిద్దరూ జంట బాగుందనే ప్రశంసలు దక్కుతున్నాయి. మరి ఈ మూవీ అసలు రిజల్ట్ ఏంటో తెలియాలంటే ఒకటి రెండు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది.
(ఇదీ చదవండి: ‘రణబాలి’మూవీ రివ్యూ)


