అమ్మాయి పుడితే.. రష్మిక వ్యాఖ్యలు వైరల్‌ | Rashmika Mandanna Funny Answer About Children At Ranabaali Pre Release Event | Sakshi
Sakshi News home page

అమ్మాయి పుడితే.. రష్మిక వ్యాఖ్యలు వైరల్‌

Oct 14 2026 11:32 AM | Updated on Oct 14 2026 11:38 AM

Rashmika Mandanna Funny Answer About Children At Ranabaali Pre Release Event

రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిన్న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యాంకర్‌ సుమ అడిగిన ప్రశ్నకు రష్మిక చెప్పిన సరదా సమాధానం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

(చదవండి: ' ఆ సినిమా డిజాస్టర్‌.. అందుకే నా ఈగో హార్ట్ అయింది')

‘రణబాలి’ చిత్రంలో జయమ్మ పాత్రను రష్మిక పోషించిన సంగతి తెలిసిందే. రియల్‌ లైఫ్‌లో భర్త అయిన విజయ్‌కి.. ఈ చిత్రంలోనూ భార్యగా నటిస్తోంది. అయితే జయమ్మకు ఇన్‌స్టాగ్రామ్‌ ఉంటే ఎలాంటి రీల్స్‌ చేసేదని యాంకర్‌ సుమ అడగ్గా.. ‘ఫుడ్‌ రీల్స్‌ చేసేది’అని రష్మిక సమాధానం చెప్పింది. ఇక ‘జయమ్మగా ఈ ప్రపంచంలోని ఆడవాళ్లకు ఏదైనా చెప్పాలంటే..ఏం చెబుతారు? అంటే.. ‘అమ్మాయి పుడితే ఏం తక్కువ కాదు. అదే ఒక పవర్‌ అని చెబుతా’ అని రష్మిక అనడంతో అక్కడున్నవాళ్లంతా చప్పట్లు కొట్టారు. ఇక ఇలాంటి ప్రశ్నలనే విజయ్‌ని అడిగారు. ‘రణబాలి’ ఎలాంటి వ్యక్తులను క్షమించడు అని అడగ్గా.. ‘రణబాలి నా కంటే పది రెట్లు మంచి మనిషి. రెస్పెక్ట్‌ ఇవ్వని వ్యక్తులను అస్సలు క్షమించడు. ప్రజల కోసం ప్రాణం అయినా ఇస్తాడు’ అని చెప్పాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement