విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. రాయలసీమలో బ్రిటీశ్ కాలంలో జరిగిన ఆకృత్యాల నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారని.. ఆనాటి దారుణ పరిస్థితులను ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ ఈవెంట్కు హాజరైన విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా నోటా మూవీ సరిగా ఆడకపోవడంతో అందరు నన్ను ట్రోల్స్ చేశారని అన్నారు. ఆ సమయంలో నేను కూడా ఫీల్ అయ్యానని.. అప్పుడు అందరికీ ఐ విల్ బీ బ్యాక్ అని లెటర్ రాశానని చెప్పుకొచ్చారు. అయితే కొందరు ఫెయిల్యూర్ చూసి ఎంజాయ్ చేశారని తెలిసిందన్నారు. అందుకే నా ఈగో హార్ట్ అయిందన్నారు. ఇప్పుడు మళ్లీ రణబాలితో మీ ముందుకొస్తున్నానని.. ఆ రోజు టాక్సీవాలా సక్సెస్ మీట్లో బ్లడీ షూర్ ఐ విల్ బి బ్యాక్ చెప్పానని గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు మీరు ఆదరిస్తే మళ్లీ సక్సెస్ మీట్కు వచ్చి అందరి ముందు మళ్లీ గుర్తు చేస్తానని విజయ్ దేవరకొండ అన్నారు. ఈసారి మనం అనుకున్నది జరిగిందంటే... అనంతపూర్లో మీ అందరి ముందు మళ్లీ గుర్తు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. మనకు తెలిసింది మన అందరికీ తెలిసిందే ఒకటే, మన చేతిలో రెండే ఉంటాయి.. మన మీద మనకున్న నమ్మకం, మనం చేసే పనిలో పూర్తిగా ప్రాణం పెట్టి చేయడమని మాట్లాడారు. రాహుల్ కేవలం కెరీర్ కోసం సినిమాలు తీయడని.. బలమైన కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటాడని డైరెక్టర్ను విజయ్ కొనియాడారు.


