‘‘దసరా పండగ మొదలైపోయింది. తిరుపతిలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, తెలంగాణలో బతుకమ్మ సంబరాలు, విజయవాడలో దుర్గమ్మ ఉత్సవాలు మొదలయ్యాయి. పిల్లలకు సెలవులు కూడా మొదలయ్యాయి. మరో మూడు రోజుల్లో మీరందరూ, తెలుగు సినిమా గర్వపడేలా ‘రణబాలి’ సినిమా వస్తోంది’’ అని హీరో విజయ్ దేవరకొండ తెలిపారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘రణబాలి’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదలవుతోంది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్’ సినిమాల తర్వాత ‘రణబాలి’ లాంటి పెద్ద సినిమా చేయాలన్నది డైరెక్టర్ రాహుల్ కల. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌ని అందమైన విధానంలో చెప్పాలని ‘రణబాలి’ క్రియేట్ అయింది. ఈ నెల 16న తన విజన్‌ని అందరూ తెరపై చూస్తారు. 150 ఏళ్ల క్రితం బ్రిటిషర్స్ చేసిన పని వల్ల వచ్చిన ఆకలి కరువు కొన్ని లక్షల మంది చావుకు కారణం అయింది. ప్రస్తుతం ఎలినో నడస్తోంది. నీళ్లు, విద్యుత్, తిండి... ఏదైనా వృథా చేయకుండా జాగ్రత్తగా వాడాలి. ‘టాక్సీవాలా’ సినిమాకి ముందు నా ‘నోటా’ సినిమా విడుదలవడం, అది సరిగ్గా ఆడకపోవడం.. అందరూ నన్ను అదోలా మాట్లాడటం జరిగాయి. నేను బ్యాక్ అవుతానని ఆ రోజు ఓ లేఖ రాశాను. ‘టాక్సీవాలా’తో కమ్‌బ్యాక్ ఇచ్చాను.
ఈసారి నేను, రాహుల్ అనుకున్నది జరిగిందంటే అనంతపురంలో మీ అందరి ముందు మళ్లీ గుర్తు చేస్తా. మన మీద మనకుండే నమ్మకం, మనం చేసే పనిలో పూర్తిగా ప్రాణం పెట్టి చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటాయి. రవి, నవీన్‌గార్లకు కథ నచ్చితే వారు ఎలాగైనా బిగ్ స్కేల్లో ప్రజల వద్దకు తీసుకెళతారు. నేను–రష్మిక కలిసి చేసిన మూడో సినిమా ‘రణబాలి’. కెరీర్లో రష్మిక ఎదుగుదల చూస్తే నాకు గర్వంగా ఉంటుంది. జయమ్మ పాత్రకు నువ్వు అవసరం. ఈ సినిమా ఒప్పుకున్నందుకు తనకు థ్యాంక్స్’’ అని తెలిపారు.
రాహుల్ సంకృత్యాన్ మాట్లాడుతూ–‘‘మైత్రి మూవీ మేకర్స్ అన్నది మహాసముద్రం. ఎంతోమంది దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు, ఎన్నో మంచి సినిమాలు వస్తున్నాయి. ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి. మీ బ్యానర్‌కి ‘రణబాలి’ మంచి పేరు తీసుకొస్తుందని గర్వంగా చెబుతున్నాను. మైత్రి సంస్థ సహకారం లేక΄ోతే ఆర్నాల్డ్లాంటి హాలీవుడ్ నటుణ్ణి తీసుకురాలేం. ఈ సినిమాలో జయమ్మ–రణబాలి ΄ాత్రల్లో భార్యాభర్తలుగా అద్భుతంగా చేశారు రష్మిక–విజయ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విశ్వరూపం చూస్తారు’’ అని పేర్కొన్నారు.

రష్మిక మందన్నా మాట్లాడుతూ– ‘‘రణబాలిగా విజయ్ నటన చూస్తుంటే భయం వేసేది. ఎంతో ప్యాషన్‌తో, ప్రేమతో కష్టపడ్డాడు. ‘గీత గోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాలు అద్భుతమైన లవ్‌స్టోరీస్. కానీ, ‘రణబాలి’ లవ్‌స్టోరీ కాక΄ోయినప్పటికీ లవ్‌ట్రాక్ మాత్రం అత్యద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా మాకు (విజయ్–రష్మిక) మంచి విజయాన్ని అందించాలి’’ అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘రణబాలి’లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి.
ఈ సినిమా మాకు బాగా సంతృప్తినిచ్చింది. ఇందుకు కారణం డైరెక్టర్ రాహుల్. విజయ్, రష్మికగార్ల పెళ్లి తర్వాత వారిద్దరితో సినిమా చేయాలని ఎవరికైనా ఉంటుంది. ఆ చాన్స్ మాకు ఇచ్చినందుకు వారికి థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ– ‘‘రణబాలి’ మన సినిమా, మన మట్టి కథ, మన సంస్కృతితో రాహుల్ ఎంతో బాగా తీశాడు. ఈ సినిమాలో విజయ్–రష్మిక నటన, డ్రామా సన్నివేశాలు అత్యద్భుతం. ‘ఇరుముడి’ సినిమాలోలా ‘రణబాలి’లోనూ భక్తి నేపథ్యం కూడా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.


