విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా రణబాలి. పెళ్లి తర్వాత వీరిద్దరు జంటగా నటించిన మూవీ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌ను మరింత జోరుగా నిర్వహిస్తున్న మేకర్స్.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ గురించి మాట్లాడారు. నాకు రాహుల్ ఓ కథ చెప్పారు.. అది చాలా బాగా నచ్చిందని అన్నారు. ఆ తర్వాత 2015లో ఓ కొత్త బ్యానర్ తెలుగు సినిమాలో అడుగుపెట్టారని తెలిపారు. తొలిసారే వీళ్లు పెద్ద ప్రాజెక్ట్ చేయడం చూసి షాకయ్యానని అన్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో వచ్చిన మొదటి మూవీ సూపర్‌హిట్‌గా నిలిచిందన్నారు.
విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ అయిపోయారని రాహుల్ రవీంద్రన్ అన్నారు. ఆ తర్వాత రాహుల్, విజయ్ ఇద్దరు టాక్సీవాలాతో సూపర్ హిట్ కొట్టారని తెలిపారు. ఇప్పుడు వీళ్లంతా రణబాలితో మనముందుకొస్తున్నారని కొనియాడారు. ఇక్కడ నాకు అందరికంటే ఎక్కువ కావాల్సిన అమ్మాయి రష్మిక అన్నారు. తన కోసమే ఈ ఈవెంట్‌కి వచ్చానని.. ఎక్కడికైనా వస్తా రాహుల్ రవీంద్రన్ తెలిపారు. నువ్వు నాకు ఫ్యామిలీతో సమానమని అన్నారు.
కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.


