తిరుమల శ్రీవారి సేవలో విరోష్ జంట.. సుప్రభాత సేవలో పూజలు | Vijay devarakonda rashmika Visited Tirumala Temple ahead of ranabaali | Sakshi
Sakshi News home page

Virosh: తిరుమల శ్రీవారి సేవలో విరోష్ జంట.. సుప్రభాత సేవలో పూజలు

Oct 13 2026 9:23 AM | Updated on Oct 13 2026 9:23 AM

Vijay devarakonda rashmika Visited Tirumala Temple ahead of ranabaali

టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయాన్నే సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరోష్ జంటకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లి ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం వీరిద్దరు జంటగా నటించిన రణబాలి రిలీజ్‌కు రెడీ అయింది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. అక్టోబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని బ్రిటీశ్ కాలంలో రాయలసీమలో జరిగిన దారుణాల నేపథ్యంలో తెరకెక్కించారు. కరువుతో దాదాపు కోటి మంది ఆకలి చావులతో అల్లాడిపోయారని డైరెక్టర్ రాహుల్ తెలిపారు. అందుకే ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement