‘టాక్సీవాలా’ తర్వాత రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘రణబాలి’. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో ‘రణబాలి’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ పాత్రకే కాదు రష్మిక పోషించిన జయమ్మ పాత్రకు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పాత్రకు రష్మికను తీసుకోవాలని విజయ్ చెప్పలేదట. దర్శకుడు రాహుల్ పట్టుపట్టి రష్మికను హీరోయిన్‌గా ఒప్పించారట.
(ఇదీ చదవండి: రాజమౌళితో సినిమా చేస్తే తప్ప.. టికెట్ల రేట్లు పెంచను: విజయ్ దేవరకొండ)
ఈ విషయాన్ని స్వయంగా విజయ్ దేవరకొండనే చెప్పాడు. తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రష్మిక పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘జయమ్మగా రష్మిక పేరును డైరెక్టర్ రాహుల్ సూచించాడు. నాకు కూడా ఆమె అయితేనే బాగుంటుంది అనిపించింది. గతంలోనూ నా సినిమాల్లో హీరోయిన్ గా రష్మిక ప్రస్తావన వచ్చినా ఆ సినిమాలకు తను కరెక్ట్ కాదు అనిపించింది. మేము కలిసి చేసే సినిమా స్పెషల్ గా ఉండాలని అనుకున్నాను. రణబాలి సినిమాలో మా ఇద్దరి మధ్య అలాంటి మంచి డ్రామా ఎమోషన్ ఉంది. మేము కలిసి చేయడం వల్ల ఈ పాత్రలకు ఇంకాస్త ఎమోషనల్ డెప్త్ వచ్చింది. ఎందుకంటే ఆ పాత్రలపై మా రియల్ లైఫ్ ఇంపాక్ట్ కూడా పడుతుంది. సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా ఇదే ఫీల్ అవుతారు’ అని విజయ్ అన్నారు.


