రణబాలి బడ్జెట్ 120 కోట్లు.. విజయ్‌, రష్మికల రెమ్యునరేషన్‌ ఎంతంటే? | Ranabaali Movie Budget, Vijay Devarakonda, Rashmika Remuneration Details | Sakshi
Sakshi News home page

రణబాలి బడ్జెట్ 120 కోట్లు.. విజయ్‌, రష్మికల రెమ్యునరేషన్‌ ఎంతంటే?

Oct 10 2026 1:08 PM | Updated on Oct 10 2026 1:19 PM

Ranabaali Movie Budget, Vijay Devarakonda, Rashmika Remuneration Details

పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన చిత్రం ‘రణబాలి’. గతంలో విజయ్‌తో ‘టాక్సీవాలా’ తెరకెక్కించిన రాహుల్‌ సంకృత్యాన్‌  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

స్వాతంత్రం రాక ముందు రాయలసీమలోని ఒక ప్రాంతంలో జరిగిన అమానవీయ సంఘటనలను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్. రణబాలి పాత్ర డిమాండ్ అనుగుణంగా వయొలెన్స్ కూడా అవసరమైన మోతాదు కంటే ఎక్కువే పెట్టినట్టు టీజర్‌, ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఇక పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌ కాబట్టి.. ఖర్చు కూడా భారీగానే పెట్టారట. మొదట ఈ చిత్రాన్ని రూ. 80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించాలని అనుకున్నారట. అయితే షూటింగ్‌ తర్వాత ఖర్చులు పెరిగి.. ఆ బడ్జెట్‌ కాస్త రూ. 120 కోట్లకు చేరినట్లు సమాచారం. ఇందులో విజయ్‌ దేవరకొండ, రష్మికల పారితోషికాలే దాదాపు రూ. 30 కోట్ల వరకు ఉంటుందట. 

(ఇదీ చదవండి: త్రివిక్రమ్.. నా కుటుంబ బలహీనతని వాడుకున్నారు)

అయితే షూటింగ్‌  ప్రారంభం అయినప్పుడే ఓటీటీ బిజినెస్‌ కావడంతో నిర్మాతలకు ఊపిరి పీల్చుకున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు ఓటీటీ రైట్స్‌ దక్కించుకుంది. శాటిలైట్‌, ఆడియో రైట్స్‌తో కలిపి మొత్తంగా నాన్‌ థ్రియేట్రికల్‌ రూపంలో రూ. 60 కోట్ల వరకు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన 60 కోట్లను రిలీజ్‌ తర్వాత రాబట్టాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఈ సినిమాపై బజ్‌  భారీగానే ఉంది. రిలీజ్‌ తర్వాత హిట్‌ టాక్‌ వస్తే.. రూ. 60 కోట్ల కలెక్షన్స్‌  ఈజీగానే వచ్చేస్తుంది. విజయ్‌  ఖాతాలో హిట్‌ పడి చాలా కాలమైంది. మరి ఈ చిత్రంలో అయినా హిట్‌ ట్రాక్‌ ఎక్కుతాడా లేదా? చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement