పచ్చ కామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటారు. అలాగే సినీ తారల్లో తప్పులే వెతికేవారికి వాళ్లు చేసే ప్రతి పనిలోనూ నెగెటివిటీనే కనిపిస్తుంది. చిన్న విషయాన్ని సైతం పెద్దది చేస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగుతుంటారు. అలా రష్మిక విషయంలోనూ జరుగుతోంది. ఆమె యాసను హేళన చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. హిందీ సినిమాల్లో దక్షిణాది యాసతో మాట్లాడుతుందని హేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
తాజాగా ఈ ట్రోలింగ్‌పై రష్మిక స్పందించింది. తను దక్షిణాది నుంచి వచ్చిన అమ్మాయిని కాబట్టి..సహజంగానే తనలో ఆ యాస ఉంటుందని చెప్పింది. తాజాగా భర్త విజయ్ దేవరకొండతో కలిసి ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో పాల్గొన్న ఆమె.. తన యాసపై వచ్చిన ట్రోల్ గురించి మాట్లాడుతూ.. ‘ఇలాంటి విమర్శలను తాను ఎన్నో చూశానని.. వాటి కారణంగా తనను తాను ఎప్పుడూ హద్దులు విధించుకోవాలని ఆలోచించలేదని చెప్పింది.
(ఇదీ చదవండి: పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగితే.. అప్పుడు ఓకే చేశా: విజయ్ దేవరకొండ)
‘నేను సౌత్ యాసలో మాట్లాడుతున్నానని ట్రోల్ చేస్తున్నారు. అది నిజమే.. నేను దక్షిణాది నుంచి వచ్చాను. అందుకే నాలో ఆ యాస సహజంగానే ఉంటుంది. అలా కాకుండా మరోలా మాట్లాడాలనుకోవడం సమంజసం కాదు. ఇలాంటి ట్రోల్ నాకు కొత్తేమి కాదు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా నన్ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. నా మాట, నటన, యాస..ఇలా దేనిని వదలడం లేదు. కానీ నేను వాటిని పట్టించుకోను. వారి కోసం నాకొచ్చిన అవకాశాలను మిస్ చేసుకోవాలనుకోలేదు’ అని రష్మిక అన్నారు.


