విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాన్ని రాయలసీమలో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్లలో భాగంగా రణబాలి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే రాయలసీమలో బ్రిటీష్ కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల పాటు కరువు రావడంతో దాదాపు కోటిమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజుల్లో బ్రిటీశ్ పాలకులు చేసిన దురాగతాలకు వ్యతిరేకంగా రణబాలి చేసే పోరాటం ట్రైలర్‌లో కనిపిస్తోంది. బ్రిటీశ్ పాలకులకు ఎదురొడ్డి పోరాడిన వీరుడి కథే రణబాలి అని అర్థమవుతోంది. ఈ ఫుల్ యాక్షన్ ట్రైలర్ మీరు కూడా చూసేయండి.
ఇక ‘రణబాలి’ సినిమా విషయానికొస్తే.. సినిమా నేపథ్యం, కథ ఎలా ఉండబోతుందనే విషయాలను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు చిత్రబృందం ఇప్పటికే నాలుగు భాగాలుగా డాక్యుమెంటరీ సిరీస్‌ను విడుదల చేసింది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించారు.


