మాకు పిల్లలు పుట్టేలోపు.. గుర్రాలను పెంచుకుంటా: విజయ్‌ దేవరకొండ | Vijay Deverakonda Interesting Comments About Childrens On Ranabaali Movie Promotions | Sakshi
Sakshi News home page

మాకు పిల్లలు పుట్టేలోపు.. గుర్రాలను పెంచుకుంటా: విజయ్‌ దేవరకొండ

Oct 10 2026 7:12 PM | Updated on Oct 10 2026 7:26 PM

Vijay Deverakonda Interesting Comments About Childrens On Ranabaali Movie Promotions

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వస్తోన్న పీరియాడికల్ మూవీ రణబాలి. ఈ చిత్రాన్ని రాయలసీమలో బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 16న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది.  దీనిలో భాగంగా ఈ రోజు(శనివారం) మీడియా సమావేశం నిర్వహించింది చిత్రబృందం. ఇందులో పాల్గొన్న విజయ్‌ తనదైన శైలిలో నవ్వూతూ పుట్టబోయే పిల్లలపై కామెంట్స్‌ చేశారు.

మాకు పిల్లలు పుట్టేలోపు..
‘రణబాలి ఎంతో కష్టపడి చేసిన సినిమా. దీని కోసం హార్స్‌ రైడింగ్‌ నేర్చుకున్నాను. చాలా సార్లు కింద పడ్డాను. కానీ గుర్రంతో మంచి బాండిగ్‌ ఏర్పడింది. అప్పుడే అనుకున్నా నేనూ ఒక గుర్రాన్ని పెంచుకోవాలని.  అయితే ఒక్క గుర్రాన్ని పెంచితే మళ్లీ అది డిప్రెషన్‌లోకి వెళ్తుంది. దానికి తోడుగా ఇంకోటికూడా ఉండాలి. మాకు పిల్లలు పుట్టేలోపు గుర్రాలను  తెచ్చుకొని​ పెంచుకుంటాను’ అని సరదాగా అంటూ నవ్వులు పూయించారు.

రణబాలి విషయానికొస్తే..  1854 నుంచి 1878 మధ్య జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్‌, అతుల్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నిర్మించారు. 

(ఇదీ చదవండి: ‘ఆ డైరెక్టర్లు క్రిమినల్స్‌తో సమానం.. వారిని బ్యాన్‌ చేయాలి’)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement