పుట్టపర్తిలో విరోష్ జంట ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్ | Vijay and Rashmika Visits Puttaparthi Prashanthi Nilayalam today | Sakshi
Sakshi News home page

Virosh: పుట్టపర్తిలో విరోష్ జంట ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్

Oct 15 2026 12:36 PM | Updated on Oct 15 2026 12:36 PM

Vijay and Rashmika Visits Puttaparthi Prashanthi Nilayalam today

రణబాలి జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పుట్టపర్తిని సందర్శించారు. అక్కడి ప్రశాంతి నిలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇటీవలే తిరుమల వెళ్లిన వీరిద్దరు.. ఇవాళ పుట్టపర్తి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా జరుగుతున్న  దసరా శరన్నవరాత్రి వేడుకల్లో ఈ జంట పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వీరిద్దరు పెళ్లి తర్వాత జంటగా కలిసి నటించిన పీరియాడికల్ మూవీ రణబాలి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. అక్టోబర్ 16న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రాయలసీమలో దారుణ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీశ్ పాలనలో తలెత్తిన తీవ్ర కరువుతో దాదాపు కోటిమందికి పైగా ఆకలి చావులతో చనిపోయారనేదే ఈ మూవీ కాన్సెప్ట్. ఈ చీకటి చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు డైరెక్టర్ రాహుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement