Annamayya
-
కేంద్రీయ విద్యాలయ స్థలం కబ్జా
మదనపల్లె రూరల్ : ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలం కబ్జాకు గురైంది. వేల కోట్ల రూపాయల విలువ కావడంతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు జరిపి ఆక్రమించారు. అధికారులు పరిశీలించడంతో అసలు విషయం వెలుగు చూసింది. మండలంలోని వలసపల్లె పంచాయతీలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. అనంతపురం–కృష్ణగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు అడ్డుకునేందుకు వీలు లేకుండా జహా కాలనీ పేరుతో బోర్డు ఏర్పాటుచేసి పనులు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధ, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ గురువారం ఆ స్థలం పరిశీలించేందుకు వెళ్లగా.. ఆక్రమణల విషయం వెలుగు చూసింది. పనులు నిలిపివేయాలని ఆదేశం కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన సర్వే నెంబర్0496/5 స్థలంలో కొంతమేర, రెవెన్యూ సర్వీసెస్ బిల్డింగ్‌కు సంబంధించిన సర్వే నెంబర్ 713/1, 2లో మరింత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణా లు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇదే కా కుండా.. కేంద్రీయ విద్యాలయం, హంద్రీ–నీవా కా లువకు ఆనుకుని ఉన్న రెండెకరాల స్థలం పదికోట్ల విలువ చేస్తుంది. ఇక్కడ దాదాపు వందకు పైగా పునాదులు వేసి పనులు సాగిస్తున్నారు. ఆక్రమణలను గుర్తించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెంటనే నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధి కారులను ఆదేశించారు. రికార్డులు ఉంటే చూపాల ని సంబంధిత నిర్మాణదారులకు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్వేయర్, ఆర్ఐలను ఆదేశించారు. రూ.10 కోట్ల తో అక్రమ నిర్మాణాలు జహా కాలనీ పేరుతో బోర్డు ఏర్పాటు సబ్ కలెక్టర్ పరిశీలనలో వెలుగులోకి -
ప్రధాన డిమాండ్లు
సాక్షి రాయచోటి: ఆక్రోశం అడుగడుగునా కనిపిస్తోంది..చేసిన పాపం లేదు...చెడుకు పోనే లేదు...కానీ వారు మాత్రం అన్యాయమై పోతున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అనుక్షణం పరితపించే వైద్య విభాగానికి సంబంధించిన వారికి కష్టాలు మొదలయ్యాయి. బాబు...మా మొర ఆలకించండి....మేమెన్నో కష్టాలు పడుతున్నామంటూ రోజుల తరబడి ఉద్యమబాట పట్టినా పట్టించుకునే పరిస్థితే లేదు. గత కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓలు). వారి వేదన చూసి కూడా కూటమి సర్కార్ కనికరించకపోవడం గహనార్హం. సమస్యలపై పోరుబాట జిల్లాలో వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప రిధిలో ఆయుష్మాన్ భారత్ కింద సుమారు 375 మంది పనిచేస్తున్నారు.ప్రభుత్వం పెండింగ్ సమస్యలతోపాటు ఈపీఎఫ్, ఇతర ఉద్యోగుల మాదిరిగా భద్రత ను కల్పించాలని కోరుతున్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంటు, ఎక్స్‌గ్రేషియా, ట్రాన్స్ఫర్, మాతృత్వ సెలవులు ఇలా అన్నింటిని అమలు చేయాలని ఉద్యమబాట పట్టారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు తెలిసినా తెలియనట్లు ఉన్నాయే తప్ప వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 రోజులుగా ఉద్యమం జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కింద పనిచేస్తున్న 375 మంది ప్రతిరోజు రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా కలెక్టరేట్ మెయిన్ గేటు పక్కన టెంటువేసి వినూత్న నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని, తమ డిమాండ్లను నెరవేర్చి న్యాయం చేయాలని ఏదో ఒక కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన కలగకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో నిత్యం శిబిరంలో కూర్చొంటూ తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఏది ఏమైనా 25 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ఎటువంటి చిన్నపాటి స్పందన లేకపోవడంతో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అలుపెరుగని పోరాటం చేస్తున్నాపట్టించుకోని కూటమి ప్రభుత్వం రోజుకొక తరహాలో వినూత్న నిరసన 25 రోజులుగా సమ్మెలోనే.. ప్రజలకు వైద్య సేవలు దూరం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలి ఈపీఎఫ్ఓ పునరుద్దరించాలి క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్దీకరించాలి నిర్దిష్టమైన జాబ్‌చార్టు అందించాలి ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్‌ఓలను మినహాయింపు ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్లు, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు తదితరాలు అమలు చేయాలి. -
స్తంభాన్ని ఢీకొని స్కూటరిస్టు మృతి
చాపాడు : మండలంలోని మైదుకూరు– ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని కొత్తపల్లె ప్రభుకుమార్(41) గురువారం మృతి చెందారు. మండలంలోని కొట్టాల గ్రామానికి చెందిన ప్రభుకుమార్ లింగాపురం వెళ్లి తిరిగి బైక్‌లో వస్తున్నారు. పల్లవోలు సమీపంలోని కాశినాయన వృద్ధాశ్రమ సమీపంలో ప్రమాదశాత్తూ బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రభుకుమార్‌కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. మావోయిస్టులపై హత్యాకాండను ఆపండి – వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మదనపల్లె రూరల్ : ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న హత్యాకాండను ఆపి వారితో చర్చలు జరపాలని విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం శివప్రసాద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 25మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత్యచేయడాన్ని ఖండించారు. కొన్ని నెలలుగా మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం హత్యాకాండ కొనసాగిస్తోందన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్‌లో ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 25మందికి పైగా మృతి చెందడం బాధాకరమన్నారు. శాంతిచర్చల కోసం మావోయిస్టుపార్టీ కేంద్రప్రభుత్వాన్ని పదే పదే కోరిందని తెలిపారు. ఆపరేషన్ కగార్‌ని ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మేధావులు, ప్రజాస్వామిక వాదులు కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా, మావోయిస్టులపై నరమేధాన్ని తీవ్రతరం చేసిందన్నారు. అడవి నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి, అడవిలో సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారణ జరిపించాలని కోరారు. బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు, మావోయిస్టు పార్టీ సభ్యులకు వీసీకే పార్టీ తరఫున విప్లవజోహార్లు తెలుపుతున్నామన్నారు. -
గండి క్షేత్రం.. భక్తజన సందోహం
చక్రాయపేట: హనుమజ్జయంతి సందర్భంగా గురువారం గండి వీరాంజనేయ స్వామి సన్నిధి జైశ్రీరామ్ అనే రామనామ స్మరణతో మారు మోగింది. గండిక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ సహాయ కమీషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజల ఆధ్వర్యంలో ప్రధాన,ఉప ప్రధాన,ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్,రాజగోపాలాచార్యులు లు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ముగిసిన వేడుకలు: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నాలుగు రోజులుగా జరుగుతున్న హనుమజ్జయంతి వేడుకలు గురువారంతో ముగిశాయి.చివరి రోజున త్రికాల ఆరాధన,పంచసూక్త హోమం,మన్యు సూక్త హోమం,ఆంజనేయ స్వామి మూలమంత్ర తదితర హోమాలు నిర్వహించారు. ఘనంగా శోభాయాత్ర: గండి వీరాంజేయ స్వామి సన్నిధి నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. చక్రాయపేటలో వెలసిన శ్రీవేంకటేశ్వర,రాచరాయస్వామి ఆలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్ర గండి నుంచి అద్దాలమర్రి, కుమార్లకాల్వ, చిలేకాంపల్లెల మీదుగా చక్రాయపేటలోని ఆలయాల వద్ద ముగించారు.ఆలయాల చైర్మన్ మోపూరి రామాంజనేయ రెడ్డి,మాజీ చేర్మెన్లు చక్రపాణిరెడ్డి, ఓబుళరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
ఉపాధిలో ‘చిలక్కొట్టుడు’ !
గాలివీడు : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పక్కదారి పడుతోంది. కూలీలకు బిల్లులు చెల్లింపులో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు తెర తీశారు. నీకింత.. నాకింత అంటూ వాటాలు పంచుకున్నారు. గాలివీడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో దాదాపు 14వేల జాబ్ కార్డుదారులు ఉన్నారు. వీరిలో 5వేల మంది పనులకు వెళ్తున్నారు. వీరి అవసరాలు ఆసరాగా తీసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వారు పనులకు వెళ్తే ఓ రేటు.. వెళ్లకుంటే మరో రేటు పెట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మస్టర్లలో పేరు నమోదు మొదలు బిల్లులు చెల్లింపు వరకూ వారి కనుసన్నల్లోనే జరుగుతోంది. ఖాతాలో పడిన వెంటనే.. ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్ కార్డులు కలిగిన తమ అనుకూల ఉపాధి కూలీలను ఎంపిక చేసుకుంటున్నారు. ఉపాధి బిల్లు మొత్తం బ్యాంకు ఖాతాలో పడిన వెంటనే కూలీ తన అకౌంట్ నుండి తీసి ఎఫ్‌ఏలకు ఇవ్వాలి. దీనికి ఒప్పుకున్న వారి పేర్లు మాత్రమే ఉపాధి మస్టర్లలో చేరుస్తున్నారు. గ్రూపులుగా ఏర్పాటుచేసుకుని పనికి వెళ్లే వారైతే.. బిల్లు మొత్తం ఖాతాలో పడిన వెంటనే ఒక్కొక్క కార్డుదారుడు రూ.200 ఫీల్డ్ అసిస్టెంట్ కు ఇవ్వాలి. పనికి వెళ్లని వారైతే .. తమ ఖాతాలో బిల్లు జమ కాగానే 50 శాతం నగదు ఫీల్డ్ అసిస్టెంట్‌కు ముట్టజెప్పాల్సిందే. ఈ లెక్కన ఫీల్డ్ అసిస్టెంట్లు అప్పనంగా సొమ్ము ఆర్జిస్తున్నారు. ఇలా ఒక్కో పనికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఉపాధి అక్రమాలపై దృష్టి సారించి అక్రమ వసూళ్లను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బిల్లుల చెల్లింపులో ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం -
ముహూర్తం ఖరారు
మదనపల్లె కేంద్రీయ విద్యాలయానికిమదనపల్లె రూరల్: పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మదనపల్లెకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం(కేవీఎస్) ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధ...సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌తో కలిసి గురువారం మండలంలోని వలసపల్లె పంచాయతీలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారికి ఆనుకుని సర్వే నంబర్లు.713/3, 713/4, 496/2, 496/3లో మొత్తం..6.09 ఎకరాల భూమిని కేటాయించినట్లు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, కేవీఎస్ అధికారులకు తెలిపారు. దీంతో వారు స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రాంగణంలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ తాత్కాలిక భవనాన్ని పరిశీలించారు. తరగతుల నిర్వహణకు, పాఠశాల ప్రారంభానికి అనువుగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్...కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి వలసపల్లె పంచాయతీలో కేటాయించిన 6.09 ఎకరాల స్థలానికి సంబంధించి అడ్వాన్స్డ్ పొజిషన్‌కు సంబంఽధించిన పత్రాలను కేవీఎస్, హైదరాబాద్ రీజియనల్ ఆఫీస్, డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధలకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ...కేంద్రీయ విద్యాలయం, మదనపల్లెలో 2025–26 విద్యాసంవత్సరం నుంచి మొదటగా 1 నుంచి 5 తరగతుల వరకు కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది 6వతరగతి, మరుసటి సంవత్సరం 7 ఇలా పెంచుకుంటూ వెళతామన్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఆఫ్‌లైన్ నోటిఫికేషన్‌ను వారం, పదిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. వలసపల్లెలో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యాక, పాఠశాలను పూర్తిస్థాయిలో అక్కడి నుంచే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాజంపేట బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షుడు సాయిలోకేష్, కేంద్రీయ విద్యాలయ తిరుపతి సబ్ ఇన్చార్జి చంద్రశేఖర్, తహసీల్దార్ ధనంజయులు, ఆర్ఐ భరత్‌రెడ్డి, మండల సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వో నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి తరగతుల ప్రారంభానికి త్వరలో నోటిఫికేషన్ భూమి, భవనాలను కేవీఎస్ అధికారులకు అప్పగించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఫలించిన ఎంపీ కృషి మదనపల్లెను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఏర్పాటుచేయాలనుకున్న మెడకల్ కాలేజీని మదనపల్లెకు కేటాయించేలా చూశారు. బీటీ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడమే కాకుండా, యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ జీఓ తీసుకొచ్చారు. పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాన్ని మదనపల్లెకు మంజూరు చేయించడమే కాకుండా వలసపల్లె పంచాయతీలో జాతీయరహదారికి ఆనుకుని 6.09 ఎకరాల స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఎంపీ నిధులు రూ.50లక్షలు మంజూరుచేసి, తాత్కాలిక భవన నిర్మాణపనులను పూర్తి చేయించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం అవుతుండటంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎంపీ మిథున్‌రెడ్డికి ఽకృతజ్ఞతలు తెలిపారు. -
రాబోయేది.. జగనన్న ప్రభుత్వమే
గాలివీడు : మళ్లీ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రాష్ట్ర మాజీ డీఓపీ జల్లా సుదర్శన్ రెడ్డి అన్నారు. స్థానిక సాయిమేఘన పెట్రోల్ బంక్ వద్ద జెడ్పీటీసీ ఖాదర్ మొహిద్దీన్, తదితరులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, మారుమూల ప్రాంతాలకు వెళ్లినా జగనన్నే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపిన ఘనత జగన్మోహన్రెడ్డిదే అన్నారు. విద్య, వైద్యం కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, కరోనా విపత్కర సమయంలోనూ ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల భానుమూర్తి రెడ్డి, చెన్నకేశవరెడ్డి, రామాంజులు రెడ్డి, ఉమాప్రభాకర్, వల్లెపు నగేష్, రమణారెడ్డి, జల్లా ధనుంజయరెడ్డి, వెంకటరెడ్డి, అమీన్, తదితరులు పాల్గొన్నారు. మాజీ డీఓపీ జల్లా సుదర్శన్‌రెడ్డి -
ఇక రుణాలన్నీ ఆన్‌ౖలైన్‌లో మంజూరు
బి.కొత్తకోట: మహిళా సంఘాలకు మంజూరు చేసే రుణాలన్నీ ఇకపై డిజిటల్ విధానంలో ఉంటాయని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో సంఘమిత్రలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి రుణాల మంజూరుకు సంబంధించి వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. మొదట సీసీ లాగిన్‌లో రుణానికి సంబంధించిన వివరాలు నమోదు చేశాక ఏపీఎం లాగిన్‌కు.. అక్కడినుంచి బ్యాంక్ మేనేజర్ లాగిన్‌కు వెళుతుందన్నారు. బ్యాంకు మేనేజర్లు వీటిని పరిశీలించి ఎవరికి ఎంత రుణం మంజూరు చేయాలి అన్నది నిర్ణయిస్తారన్నారు. ఇకపై సంఘమిత్రలు, సభ్యులు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.వార్షిక జీవనోపాదులు, రుణ ప్రణాళిక మొత్తం ఆన్లైన్లో ఉంటుందని చెప్పారు. ఏసీ గంగాధర్, ఏపీఎం రాజేశ్వరీ, సీసీలు,సంఘమిత్రలు పాల్గొన్నారు. 3 నెలల్లో లక్ష్యం సాధించాలి కలికిరి: ఉపాధి సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యం మేరకు కూలీలకు పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ పీడీ వెంకటరత్నం అన్నారు. గురువారం స్థానిక సీఎల్ఆర్సీ కార్యాలయంలో కలికిరి క్లస్టర్ పరిధిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల లక్ష్యం మూడు నెలల్లో సాధించాలని, ఫాంపాండ్ల లక్ష్యాలను జూన్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో హార్టికల్చర్ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టి, ప్రతి రైతు ఉద్యాన పంటల సాగు చేపట్టేలా చూడాలన్నారు. ఉపాధి కల్పనలో శ్రద్ధ చూపండి మదనపల్లె: ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించే విషయంలో శ్రద్ధ చూపాలని డ్వామా పీడీ వెంకటరత్నం అధికారులను సూచించారు. గురువారం ఆయన మదనపల్లె రూరల్ మండలంలోని వలసపల్లె పంచాయతీలో జరుగుతున్న ఫాంపాండ్ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కూలీ ఎంత వస్తుంది, ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాంపాండ్ పనులు నాణ్యత ఉండేలా చూడాలన్నారు. కూలీలకు పనులు కల్పించడమే కాకుండా వాటి ద్వారా ప్రయోజనం కలగాలని కోరారు. ఇచ్చిన పనుల లక్ష్యాలను సత్వరమే పూర్తి చేసేలా క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఎంపీడీఓ తాజ్మస్రూర్, ఏపీఓ చెన్నకేశవులు, సిబ్బంది పాల్గొన్నారు. -
28న ఐదువేల మందితో యోగా నిర్వహించాలి
రాయచోటి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర–2025లో భాగంగా ఈనెల 28న ఒకే ప్రాంతంలో ఐదువేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ తదితర అంశాల్లో చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా నుంచి పది లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ● జిల్లాలోని 500 గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో ప్రతిరోజూ చెత్త సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో తడి, పొడి చెత్తలను విడిగా సేకరించాలని, ఈ దశగా ప్రజలలో అవగాహన పెంపొందించాలన్నారు. జిల్లాలోని అన్ని బస్టాండ్లలో మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. బస్టాండ్ పరిసరాలలో క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ బాగుండాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్‌రావు, సబ్ కలెక్టర్ వైఖోన్ నదియా దేవి, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత
రాయచోటి: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ బంగారం, వెండి దోచుకెళ్లిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు పట్టుకున్నా రు. వారి నుంచి కిలో బంగారం, మూడు కిలోల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి పోలీ స్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయు డు విలేకరులకు ఆ వివరాలు గురువారం వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన తోట శివకుమార్ అలియాస్ శివ భవానీ (33) గతంలో విజయవాడ, బందర్, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి గూడెం, హనుమాన్ జంఖ్షన్, కోయిలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కేసులలో అరెస్టయి జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారన్నారు. బయటకు వచ్చిన వెంటనే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మొరవారిపల్లికి చెందిన జెట్టి సుబ్రహ్మణ్యం(27), అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం పోడు గ్రామానికి చెందిన సూరేపల్లి వెంకటేష్(21)లతో పరిచయం పెంచుకుని చోరీలు చేయడం మొదలు పెట్టారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రాంతాలలో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరిపై బొమ్మూరు, నక్కలపల్లి, తిరుచానూరు పీఎస్‌లలో ఐదు, పీలేరు పీఎస్‌లో రెండు, రాయచోటి అర్బన్, రాజంపేట అర్బన్ పీఎస్‌లలో రెండు, ఓబులవారిపల్లి, మన్నూరు అర్బన్ పీఎస్‌లో 4 కేసులు గతంలో నమోదయ్యాయని అన్నారు. ఊటుకూరు సంజీవరాయ స్వామి దేవాలయం వద్ద ఈ నెల 21న వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి కోటి రూపాయలు విలువచేసే కిలో బంగారం, మూడు కిలోల వెండి, రూ.1.40లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరింత బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీ, ఇతర వ్యక్తుల వద్ద రికవరీ చేయాల్సి ఉందన్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మన్నూరు అర్బన్ సీఐ ఎస్.కుళాయప్ప, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్, సీసీఎస్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడును అభినందించారు. వివిధ ప్రాంతాల్లో 17 చోట్ల చోరీలు బంగారు నగలు, వెండి స్వాధీనం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
నిండు చూలాలిని చూడకనే.. తండ్రి మృతి
● కుమార్తె కోసం కువైట్ నుంచి వస్తూ విదేశాల్లో చనిపోయిన తండ్రి ● రూ.2.5 లక్షలు కడితే మృతదేహం ఇస్తామన్న ఆస్పత్రి నిర్వాహకులు రాజంపేట: నిండు చూలాలైన తన కుమార్తెకు కాన్పు చేయించేందుకు విదేశాల నుంచి బయలుదేరిన తండ్రి.. ఆస్పత్రి పాలై కానరాని లోకాలకు చేరారు. మృతదేహం కావాలంటే రూ.2.5 లక్షలు కట్టాలంటూ కొలంబో ఆస్పత్రి వారు చెప్పడంతో కడచూపుకై నా నోచుకోలేకపోతున్నామని తల్లి, కుమార్తెలు కన్నీరు మున్నీరవుతున్నారు. రాజంపేటలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన రాజుబోయిన మనోహర్(45) రాజంపేట పట్టణంలోని రామనగర్‌లో నివాసముంటున్నారు. బ్రతుకు దెరువు కోసం ఎనిమిది నెలల కిందట కువైట్‌కు వెళ్లారు. ఇతడికి భార్య రాజేశ్వరి, కుమార్తె మౌనిక, కుమారుడు ఉన్నారు. కుమార్తె నిండు చూలాలు కావడంతో బిడ్డకు కాన్పు చేయించేందుకు తండ్రి ఈ నెల 17న ఇండియాకు వచ్చేందుకు కువైట్ విమానశ్రయంలో బోర్డింగ్ తీసుకున్నారు. అక్కడ శ్రీలంక విమానం ఎక్కినా.. ఇంటికి రాలేదు. దీంతో ఆయన భార్య రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించగా మనోహర్‌కు విమానంలో ఆరోగ్య సమస్య తలెత్తడంతో కొలంబో ఆస్పత్రిలో చేర్చారని, కోలుకోలేక అక్కడే మృతి చెందారని సమాచారం వచ్చింది. విషయం తెలుసుకుని భార్య, పిల్లలు బోరున విలపించారు. కడచూపుకై నా నోచుకుందామని అడిగితే.. రూ.2.5 లక్షలు కడితే మృతదేహంఇస్తామని కొలంబో ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు. ఏమి చేయాలో తోచక ఇంటి వద్దే కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మనోహర్ మృత దేహాన్ని ఇండియాకు తెప్పించాలని వారు కోరుతున్నారు. వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ చోరీ గుర్రంకొండ : నాలుగు వ్యవసాయ బోర్లు, బావుల వద్ద వరుస చోరీలు జరిగిన సంఘటన మండలంలోని టి.రాచపల్లెలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన నలుగురు రైతులు గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం తమ పొలాల వద్దకు వెళ్లారు. కేబుల్ వైర్లు కత్తిరించి.. ఫీజు క్యారియర్లు బయటపడి ఉండడంతో వ్యవసాయ పరికరాలు చోరికి గురయ్యాయని గుర్తించారు. గ్రామానికి చెందిన రమేష్‌బాబు పొలంలో 30మీటర్ల కేబుల్, సురేంద్రరెడ్డి పొలంలో 50 మీటర్లు, రఘనాథరెడ్డి పొలంలో 45 మీటర్లు, సిద్ధమల్రెడ్డి పొలంలో 25 మీటర్ల కేబుల్ వైర్లు, ఫీజు కారియర్లు దోచుకెళ్లారు. రమేష్‌బాబు పొలంలో రూమ్ తాళాలు పగులగొట్టి అందులో వ్యవసాయ పరికరాలు, సామగ్రి తీసుకెళ్లారు. చోరికి గురైన వస్తువులు, కేబుళ్ల విలువ లక్ష రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థి ప్యాంట్ జేబులో పేలిన మొబైల్ ఫోన్
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాలో విద్యార్థి ప్యాంట్ జేబులో మొబైల్ ఫోన్ పేలిన ఘటన కలకలం రేపింది. రాయచోటికి చెందిన విద్యార్థి తనూజ్ (22) కురబలకోట మండలం అంగళ్లులోని మిట్స్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవలే తనూజ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయగా.. జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా, విద్యార్థి ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫోన్ ఓవర్ హీట్ కారణంగానే పేలినట్లు భావిస్తున్నారు. బ్యాటరీ డ్యామేజీ కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవాలని.. చల్లటి ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు. -
మహిళా ఎస్ఐకు తప్పిన ప్రమాదం
కురబలకోట : మహిళా ఎస్ఐ కారును ఐచర్‌వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్ఐకు పెనుప్రమాదం తప్పింది. ముదివేడు ఎస్ఐ దిలీప్‌కుమార్ వివరాల మేరకు.. మదనపల్లె రూరల్ స్టేషన్ మహిళా ఎస్ఐ గాయత్రి బుధవారం తంబళ్లపల్లె కోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి కారులో మదనపల్లెకు బయలుదేరారు. కడప క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా టమాటా లోడ్‌తో వచ్చిన ఐచర్ వాహనం ఎస్ఐ కారును రెప్పపాటున రాసుకుంటూ వెళ్లింది. ఈ క్రమంలో ఐషర్ వాహనాన్ని డ్రైవర్ కంట్రోల్‌ఽ చేసే క్రమంలో అదుపుతప్పి బోల్తాపడింది. అక్కడే బస్సుకోసం వేచి ఉన్న చౌటకుంటపల్లెకు చెందిన రెడ్డెమ్మ(50), నారేవాండ్లపల్లెకు చెందిన అరుణమ్మ(56), కలకడ మండలం పాపిరెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటరమణ(65)లకు తీవ్ర గాయాలయ్యాయి. ముదివేడు టోల్‌ఫ్లాజా సిబ్బంది వారిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహిళా ఎస్ఐ గాయత్రికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమెను సమీపంలోని ముదివేడు స్టేషన్‌కు తరలించి.. ఆ తర్వాత మదనపల్లె పట్టణంలోని ఇంటికి పంపారు. ఈ సంఘటనపై డ్రైవర్‌పై కేసు నమోదుచేసి ఐచర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. అయితే బస్టాపు వద్ద ప్రయాణికులు ఎక్కువమంది వేచి ఉండడంతో వారిపై లారీ పడి ఉంటే పెద్ద ప్రాణ నష్టం జరిగేదని స్థానికులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. -
యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
రాయచోటి: శారీరక, మానసిక ఉరోగ్యం, భావోద్వేగాల సమతుల్యతలు యోగాతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం రాయచోటిలోని మున్సిపల్ పార్కులో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యా ప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నా రు. ఇందులో భాగంగా జిల్లాలో నేటి నుండి జూన్ 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. . జోనల్ మాస్టర్ ప్లాన్ కోసం నివేదికలు రూపొందించాలి జిల్లా పరిధిలోని శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహ అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ప్రాంతాల ఏకో సెన్సిటివ్ జోన్ల నిర్మాణాలకు రూపొందించనున్న జోనల్ మాస్టర్ ప్లాన్‌కు వారంలోగా పటిష్టమైన నివేదికలను రూపొందించి, సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్హాల్లో సబ్ డీఎఫ్ఓ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రాజంపేట, చిట్వేలి మండలాల పరిధిలో 185.42 చదరపు కిలోమీటర్ల మేర శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ అభయారణ్యం, ఓబులవారిపల్లి, కోడూరు, చిట్వేలి మండలాల పరిధిలో 87.02 చదరపు కిలోమీటర్ల మేర శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు విస్తరించి ఉందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ హిత సున్నితమైన ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందన్నారు. ఇందులో భాగంగా గుర్తించిన ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతాల్లో నిషేదించాల్సిన, ప్రమోట్, రెగ్యులేట్ చేయాల్సిన అంశాల్లో జోనల్ మాస్టర్ ప్లాన్‌లో పొందుపరచడానికి వారంలోగా ఆయా శాఖలు తప్పనిసరిగా నివేదికలు సమర్పించాలన్నారు. అంతకు ముందు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ హైదరాబాద్ సంస్థ రీజినల్ డైరెక్టర్ కె జయచంద్ర జోనల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి ఆయా శాఖలు దృష్టి సారించాల్సిన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ డీఎఫ్ఓ సుబ్బరాజు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
భూసార పరీక్ష.. పంట దిగుబడికి రక్ష
వ్యవసాయ డివిజన్ల వారీగా మట్టి నమూనాల సేకరణ లక్ష్యాలు ఇలా ఉన్నాయివ్యవసాయ మండలాల నమూనాల డివిజన్ సంఖ్య సంఖ్య కడప 6 3366 కమలాపురం 4 3300 పులివెందుల 5 3696 ముద్దనూరు 4 2674 ప్రొద్దుటూరు 4 3107 మైదుకూరు 4 2904 బద్వేలు 4 1814 పోరుమామిళ్ల 5 3427 మొత్తం 36 24,288 వల్లూరు : భూసార పరీక్షలను నిర్వహించుకుని భూముల స్వభావం, అందులోని పోషక విలువల ఆధారంగా తగిన పంటలను ఎంపిక చేసుకుని సాగులో మెలకువలు పాటించడం వలన అధిక దిగుబడులను సాఽధించడానికి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలుపుతున్నారు. నేలలు తమలో సహజంగా ఇమిడి వున్న పోషక పదార్థాలతోబాటు మనం అదనంగా వేసే సేంద్రీయ , రసాయనిక ఎరువుల్లోని పోషకాలను పంటలకు అందజేస్తాయి. ఈ పోషక విలువలతో బాటు భూమిలోని చౌడు గుణం, సున్నం శాతం, నేల కాలుష్యం మొదలైన వాటి స్థాయిలను తెలుసుకోవడానికి భూసార పరీక్ష ఉపయోగపడుతుంది. అంతేగాక నేలల్లో వివిధ రకాల నేలలు వుండగా అందులో కొన్ని రకాల నేలల్లో ప్రత్యేకించి కొన్ని పంటలు సాగుకు అనుకూలంగా వుండి మంచి దిగుబడులు వస్తాయి. భూమి స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా అందుకు తగిన పంటలను సాగు చేసి మంచి ఫలితాలను పొందవచ్చు. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి.. కనీసం రెండు లేక మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను చేయించుకుని తమ పొలాల్లోని వివిధ పోషక పదార్థాల విలువలను తెలుసుకోవడం ద్వారా తగిన మోతాదులోనే ఎరువులను వాడడానికి అవకాశం ఉంటుంది. దీని వలన అవసరమైన పోషకాలను మాత్రమే పంటలకు అందించడం వలన అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతే కాక భూమిలో నిల్వ ఉన్న వివిధ పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఆశించిన దిగుబడులను పొందవచ్చు. సరైన పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తేనే ఫలితం.. కాగా భూసార పరీక్ష నిర్వహించడంలో సరైన పద్ధతిని పాటిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. కావున భూసార పరీక్షలు నిర్వహించేటపుడు రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ● పొలంలో ఇంగ్లీషు వీ అక్షరం ఆకారంలో 15 సెం, మీ వరకు పారతో గుంత తీసి అందులో పై పొర నుండి కింది పొర వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ● ఒక ఎకరా విస్తీర్ణంలో 8 నుండి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక చోట చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదురెదురుగా వున్న భాగాలను తీసుకుని మిగిలిన భాగాలను తీసి వేయాలి. ఇదే విధంగా మట్టి పరిమాణం 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. ● సేకరించిన మట్టిలో రాళ్లు, వేర్లు లేకుండా చేసి నీడలో ఆరబెట్టాలి. ● మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రీయ ఎరువులకు ఉపయోగించిన సంచులను వాడరాదు. ● గట్ల దగ్గర, పంట కాల్వలలో, చెట్ల కింద, ఎరువులను కుప్పలుగా వేసిన చోట, ఎప్పుడూ నీరు నిల్వ వుండే ప్రదేశంలో మట్టి నమూనాను సేకరించరాదు. ● పొలంలో చౌడు ప్రాంతం ఉన్నట్లైతే ప్రత్యేకంగా నమూనాను తీసి పంపాలి. ● పండ్ల తోటల సాగుకు పంట రకాన్ని బట్టి 3 నుండి 6 అడుగుల లోతు వరకు గుంతను తీసి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి పంపాల్సి ఉంటుంది. రైతులకు ఉపయుక్తంగా భూసార పరీక్షా పత్రాలు.. సేకరించిన మట్టి నమూనాలను అందుబాటులోని భూసార పరీక్షా కేంద్రాలకు పంపితే వారు పరీక్షలు నిర్వహించి వివిధ పోషక విలువల శాతాన్ని నమోదు చేస్తారు. వీటిని కార్డులలో పొందుపరిచి రైతులకు అందచేస్తారు. ఇందులో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రీయ కర్బణంలతో బాటు ప్రధాన పోషకాలైన నత్రజని, బాస్వరం, పొటాషియం, సూక్ష్మ ధాతు పోషకాలైన గంధకం, జింక్, బోరాన్, ఇనుము, మాంగనీసు, రాగి వంటి వాటి విలువల శాతాన్ని నమోదు చేస్తారు. దీనితో బాటు సాధారణంగా అవి ఉండాల్సిన శాతాన్ని బట్టి పరీక్షల్లో నమోదైన విలువల స్థాయిలను తక్కువ, ఎక్కువ, సాధారణం, మధ్యస్థం, అతి తక్కువ, అతి ఎక్కువ వంటి వివరాలతో సూచిస్తారు. వీటిని ఆధారంగా చేసుకుని పంటలకు వాడాల్సిన ఎరువుల మోతాదులను, వాడే విధానాలను సైతం సూచిస్తారు. ఇవి పాటించడం వలన రైతులు పంటల సాగులో ఖర్చులను తగ్గించుకుని నికర ఆదాయాన్ని పెంపొందిచుకునే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో భూసార పరీక్షల నిర్వహణకు గానూ మట్టి నమూనా సేకరణను ఇప్పటికే ప్రారంభించారు. గత ఏడాది మట్టి నమూనాల సేకరణ లక్ష్యం 17800 కాగా, 2025– 26 సంవత్సరానికి గానూ జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో మొత్తం 24,288 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో మట్టి నమూనాల సేకరణ ప్రారంభం జిల్లా లక్ష్యం – 24,288 నమూనాలు భూసార పరీక్షతో ప్రయోజనాలు.. భూసార పరీక్ష చేయించుకుని నేల స్వభావాన్ని బట్టి పంటలను సాగు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. భూమిలోని పోషకాల విలువలను తెలుసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలను మాత్రమే ఎరువుల రూపంలో వాడవచ్చు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. – ఏవీ నరసింహారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, కమలాపురం -
ఏటీఎస్‌లలోనే వాహనాల ఫిట్నెస్ పరీక్షలు
రాయచోటి టౌన్: ఇకపై వాహనాల ఫిట్నెస్ పరీక్షలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో (ఏటీఎస్) పొందాల్పి ఉంటుందని జిల్లా రవాణా అధికారి ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏటీఎస్ కేంద్రం సర్వే నంబర్ 1064 మాసాపేట, రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే నిర్వహించుకోవాలని సూచించారు. ఇకపై మ్యానువల్ పద్ధతి ద్వారా ఆర్టీవో కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించరని తెలిపారు. ఈ విషయం వాహనదారులు గమనించాలని కోరారు. ఏపీ ఈఏపీ సెట్‌కు 2493 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం రెండు సెషన్స్‌లో జరిగాయి. జిల్లావ్యాప్తంగా 2493 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కడపలో ఐదు పరీక్షా కేంద్రాలు, పొద్దుటూరులోని మూడు పరీక్షా కేంద్రాలకుగాను 2621 మంది అభ్యర్థులకుగాను 128 మంది గైర్హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌కు సంబంధించి 95.12 శాతంగా హాజరు నమోదయింది. జెడ్పీలో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం కడప సెవెన్‌రోడ్స్: జిల్లా పరిషత్‌లో సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 23, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేది 15.05.2025 మేరకు ఈనెల 16 నుంచి జూన్ 2వ తేదిలోపు సాధారణ బదిలీలు జరగనున్నాయి. ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ఎంపీడీఓలు, మినిస్ట్రీరియల్, నాల్గవ తరగతి సిబ్బంది అధికారుల అనుమతితో రిక్వెస్ట్ బదిలీ దరఖాస్తులు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోపు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సీఈఓ ఓబులమ్మ తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ కావాలని కోరుకునే వారు కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. క్రమశిక్షణా చర్యలుగానీ లేదా శాఖాపరమైన చర్యలు ఉన్నవారు బదిలీకి అనర్హులవుతారు. సాధారణ బదిలీలపై వచ్చేనెల 3 నుంచి మళ్లీ నిషేధం అమలులోకి వస్తుంది. ఆర్డీఎస్ఎస్ పనుల్లో వేగం పెంచాలి కడప కార్పొరేషన్: రివాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్డీఎస్ఎస్) కింద మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. రమణ ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్లో ఆర్డీఎస్ఎస్ పథకం కింద జరుగుతున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రీఫేస్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఈ పనులలో వేగవంతం పెంచాలని, తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరగా లబ్ధి చేకూరటమే కాకుండా విద్యుత్ వ్యవస్థ పటిష్టవంతంగా తయారవుతుందని తెలిపారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్ రాయచోటి: మదనపల్లి మండలం, కోళ్లబైలు–1 గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.ద్వారకనాథ్నాయుడును జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో లంచం తీసుకొని మోసం చేయడంపై బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.గతంలో వాల్మీకిపురం మండలం, కుర్పర్తి సచివాలయంలో పనిచేస్తున్న సమయంలో కుర్పర్తి గ్రామానికి చెందిన రెడ్డప్ప, హరీష్‌లకు ప్రధాన మంత్రి యోజన పథకం కింద రూ. 6 లక్షలు రుణం మంజూరు చేయిస్తామని రూ. 30 వేలు వారిద్దరి నుంచి తీసుకొన్నట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. దీంతో నివేదికను అందజేయాలని మదనపల్లె ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. రెడ్డప్ప, హరీష్‌లు ఆర్జీలో పేర్కొన్న విధంగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ మోసం చేసినట్లు నిర్ధారణ చేస్తూ మదనపల్లె ఎంపీడీఓ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సదరు ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో సస్పెన్షన్‌ను నమోదు చేయాలని మదనపల్లె మండల సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి ఆదేశించారు. ముందస్తు అనుమతి లేనిదే డి.ద్వారకనాథ్ నాయుడు గ్రామాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. -
ముత్తూట్ సిబ్బంది చేతివాటం
– సొమ్ము స్వాహా కేసులో ముగ్గురి అరెస్టు బి.కొత్తకోట : ముత్తూట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. స్థానిక రంగసముద్రంరోడ్డులోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో సొమ్ము జమచేయకుండా స్వాహా చేశారు. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఇన్‌ఛార్జి సీఐ లక్ష్మన్న తెలిపారు. ఆయన కథనం మేరకు..ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్‌లో మదనపల్లెకు చెందిన దూదేకుల ఇమ్రాన్‌బాషా(30), పెద్దతిప్పసముద్రం మండలం మల్లెలకు చెందిన జరిపిటి హరీష్(29), బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీకి చెందిన ముగిలన్నగారి హరికృష్ణ (26) వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కార్యాలయంలో బంగారు ఆభరణాలను కుదవపెట్టే ఖాతాదారులతో సొమ్ము వసూలు చేసినా.. బ్రాంచీలో జమ చేయకుండా స్వాహా చేస్తున్నారు. కొందరు ఖాతాదారులు ఇటీవల నగలు విడిపించుకునేందుకు రాగా ఇంకా రుణం పెండింగ్‌లో ఉందని, చెల్లిస్తే ఇస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయం దావానలంలా అందరికీ తెలియడంతో కొందరు ఖాతాదారులకు అనుమానం కలిగి తమ రుణాలపై ఆరా తీయగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ విషయం సంస్థ ఉన్నతాధికారులకు చేరడంతో విజిలెన్స్ బృందంతో విచారణ చేయించారు. అనుమానించినట్టుగానే ఆ ముగ్గురు సిబ్బంది రూ.65.76 లక్షలు ముత్తూట్ సంస్థకు జమ చేయకుండా స్వాహా చేశారని తేలడంతో చర్యలు చేపట్టారు. రీజనల్ ఫైనాన్స్ మేనేజర్ ఎస్.దేవరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ముగ్గురిని మండలంలోని హార్సిలీహిల్స్ క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఉపకరణాలు కడప ఎడ్యుకేషన్ : విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఉపకారణాలు అందించినట్లు జోన్ 4 పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) కాగిత శామ్యూల్ అన్నారు. స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు బుధవారం ఉపకారణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో ఉపకరణాలు తయారుచేసి అందిస్తోందన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అర్హులను గుర్తించి వీల్ చైర్స్, సీపీచైర్స్, రోలేటర్స్ అందించామని తెలిపారు. ఉపకారణాలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానంద రాజు, విభిన్న ప్రతిభవంతుల శాఖ జిల్లా సంచాలకులు కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ఉపకారణాలతో దివ్యాంగులు తమ లోపాలు అధిగమించి రాణించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌కుమార్, రమణమూర్తి, కేశవరెడ్డి, విశ్వనాథరెడ్డి, వీరేంద్ర, మమత, విజయమ్మ, పద్మ, గంగులప్ప, చంద్ర, రాజా, తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణా కేంద్రం అభివృద్ధికి సహకరించండి
మదనపల్లె రూరల్ : హార్సిలీహిల్స్‌లోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం అభివృద్ధికి సహకరించాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు కోరారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, స్కౌట్ అధికారులు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌ను ఆయన కార్యాలయంలో బుధవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959 మే, 23న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భీమసేన్ సాచార్ హార్సిలీహిల్స్‌లోని శిక్షణ కేంద్రానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని వివరించారు. అప్పటి నుంచి 8 జిల్లాలకు చెందిన రాయలసీమ విద్యార్థులేగాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు శిక్షణ పొందడం జరిగిందన్నారు. ప్రహరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, స్కౌట్ భవనానికి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ హార్సిలీ హిల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్థలానికి సంబంధించిన వివరాలు తెప్పించుకుని దాని అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, జాయింట్ సెక్రటరీ భాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ మహమ్మద్ ఖాన్, బేసిక్ స్కౌట్ మాస్టర్స్ చంద్రశేఖర్ రెడ్డి, అన్వర్ బాషా, లక్ష్మీపతి, కబ్ మాస్టర్స్ భూపతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐఎఫ్ఎస్కు అంబటి బాలాజీ
గాలివీడు: మండలంలోని బోరెడ్డిగారిపల్లెకు చెందిన అంబటి బాలాజీ ప్రతిభ కనబరచి యూపీఎస్సీలో 65 వ ర్యాంకు సాధించారు.కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) – 2024 తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది ఈ సర్వీసులకు ఎంపిక కాగా, వారిలో పది మందికి పైగా తెలుగు తేజాలు ఉండటం విశేషం.అందులో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బోరెడ్డిగారి పల్లెకు చెందిన అంబటి బాలాజీ జాతీయ స్థాయిలో 65 వ ర్యాంకు సాధించి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకర్‌గా నిలిచారు.ఈ సందర్భంగా బాలాజీ స్పందిస్తూ తన తాత అంబటి వెంకటరమణ , తల్లిదండ్రులు రఘునాథ, రామలక్షుమ్మ, ఆన్న వదిన లోకేష్,జ్యోత్స్న, అక్క బావ స్వాతి రవిచంద్ర భార్య గౌతమి కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇంటర్ వరకు జవహర్లాల్ నవోదయ విద్యాలయం రాజంపేట, ఇంజినీరింగ్ ( బీటెక్ –ఈసీఈ) ఎస్వీ యూనివర్సిటీలో పూర్తి చేశాక సివిల్స్ కు ఒక సంవత్సరం కోచింగ్ తీసుకున్నానని, తరువాత సొంత ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. 2020 లో గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు. కొద్దినెలలు మాత్రమే ఉద్యోగం చేసినట్లు చెప్పారు. తరువాత రిజైన్ చేసి మళ్లీ సివిల్స్ ప్రిపేర్ అయినట్లు తెలిపారు.2023 సివిల్స్ తరహాలోనే సెంట్రల్ గవర్నమెంట్లో ఈపీఎఫ్‌లో ఎన్ఫోర్స్మెంట్లో జాయిన్ అయ్యానని, ఇప్పుడు సివిల్స్ ఐఎఫ్ఎస్లో సెలెక్ట్ అయ్యానని తెలియజేశారు. ఐఏఎస్ సాధించాలన్నదే తన అంతిమ లక్ష్యమని, దానిని నెరవేర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు. -
3 కిలో మీటర్లు వెళ్లాలి
తంబళ్లపల్లె మండలం కొత్తకురవపల్లెకు చెందిన గుల్జార్బీకి రేషన్‌కార్డు ఉంది. గతంలో ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలోని కే.రామిగానిపల్లె చౌక దుకాణం (షాప్ నంబర్ 10) వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకునేది. భర్తతోపాటు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న ఆమెకు ఎండీయూ సేవలతో ఎంతో ఉపశమనం కలిగింది. కూలీకి వెళ్లినా ఎండీయూ వాహనం ఎప్పుడొస్తుందో ముందే చెప్పేవారు. కూలీపనికి వెళ్లినా మధ్యలో వచ్చి సరుకులు తీసుకునేవాళ్లు. తిరిగి చౌక దుకాణాల ద్వారా రేషన్ ఇస్తే తీసుకునేందుకు మూడు కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్లి క్యూలో నిలబడి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని గుల్జార్బీ ఆవేదన వ్యక్త చేస్తోంది. ● నిత్యావసర సరుకులకు డీలర్ల వద్ద మళ్లీ క్యూ కట్టాల్సిందే ● ఇంటిముంగిటకే ఇస్తున్న ఎండీయూ సేవలు నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వ నిర్ణయం ● ఇకపై కిలోమీటర్ల దూరం వెళ్లాలి..డీలర్లు ఎప్పుడిస్తే అప్పుడే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి ● మళ్లీ పాతరోజులు వచ్చాయని లబ్ధిదారుల ఆవేదన -
ఉపాధి కల్పించాలి
ఎండీయూ వాహనాలను నిలిపి వేయాలన్న ఆలోచనను ప్రభు త్వం విరమించాలి.ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్లు, హెల్పర్లకు ఉపాధి కల్పించాలి. వైఎస్ జగన్ సర్కార్ ఉన్నతాశయంతో కార్డుదారులకు ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే రేషన్ సరుకులను తీసుకొచ్చింది. ఈ విధానాన్ని తొలగించడంతో కార్డుదారులు మళ్లీ సరుకుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని వైఎస్సార్ సీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. – ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే -
రాజంపేట సబ్‌వేకి కదలిక!
● సబ్వే అందుబాటులోకి రాక అనేక ఇబ్బందులు... రాజంపేట 103 ఎల్సీగేట్ స్ధానంలో సబ్వే నిర్మాణం అందుబాటులోకి రాక ప్రజలు, విద్యార్ధులు, మహిళలు, ఇరువైపుల ఉన్న ప్రాంతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్వేలో కనీసం ఆటో, బైకులు, పాదచారులు వెళ్లేందుకు అనుకూలంగా రైల్వేశాఖ నిర్మించినప్పటికి, రెండువైపు అప్రోచ్‌రోడ్డు వేసే అంశం చిరకాలంగా పెండింగ్‌లో పడిపోయింది. ఇటీవల గంగమ్మ జాతర సందర్భంగా సబ్వే అందుబాటులో లేకపోవడంతో వందలాది అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికి పట్టాలు దాటి అవలివైపు వెళ్లాల్సి వస్తోంది.భవిష్యత్తులో రైల్వేట్రాక్‌కు ఫెన్సింగ్ వేస్తే ఇక దారి వుండదనే వాదన వినిపిస్తోంది. రైలుపట్టాలు దాటడం రైల్వేచట్టం ప్రకారంగా నేరమైనప్పటికి స్ధానికులు తప్పనిపరిస్ధితులో కొనసాగించాల్సి వస్తోంది. ● రూ.5కోట్లు కేటాయింపు ● స్థానికులలో చిగురించిన ఆశలు ● సబ్‌వేకి అప్రొచ్రోడ్డ్డు ప్రశ్నార్ధకరం ● ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రైల్వేస్టేషన్ యార్డులో అర్ధాంతరంగా ఆగిపోయిన సబ్‌వేకి కదిలికవచ్చింది. గుత్తి–రేణిగుంట రైలుమార్గంలో రాజంపేట యార్డు 103 లెవ ల్ క్రాసింగ్ గేట్‌కు ప్రత్యామ్నాయంగా నిర్మితం చేసి న సబ్‌వేకి రూ.5కోట్ల 22లక్షలు కేటాయించారు. దీంతో సబ్వే నిర్మాణం అంశం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రాజంపేట సబ్వే నిర్మాణ విషయంలో నిధుల లేమితో వెనకడుగు వేసినట్లుగా స్ధానికంగా విమర్శలున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఆర్వోబి రాజంపేట రైల్వేగేటు సమస్య తీవ్రరూపం దాల్చిన క్రమంలో దివంగత సీఎం వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి పాల నలో ఆనాటి ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి డీసీసీ అధ్యక్షునిగా ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి చొరవ కృషితో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మితౖమైంది. రాజంపేట–రాయచోటి మార్గంలో ఇప్పుడు వాహనాల రాకపోకల సుగమమైంది. ఆర్వోబి ఇరువైపుల వారికి రాకపోకల సమస్య ఆర్వోబి నిర్మించిన తర్వాత ఇరువైపుల ఉన్న ప్రాంతీయులకు రాకపోకల సమస్య ఉత్పన్నమైంది. రైల్వేగేటుకు ఇరువైపుల ఉన్న ప్రాంతాల వారికి ఆర్వోబితో నిమిత్తం లేకుండా ఆర్యూబీ నిర్మించాలని కోరా రు. అయితే ఆర్వోబి ఉన్న చోట ఆర్యూబీ ఇచ్చే పరిస్ధితులు లేని కారణంగా సబ్వే నిర్మితానికి ముందుకు వచ్చింది. రైల్వేశాఖ నిథులు కేటాయింపులు జరిగాయి. సబ్వే నిర్మితం తుదిదశకు చేరుకునేలా పనులు జరిగాయి. అనేక కారణాలతో సబ్వే నిర్మాణం మరుగునపడింది. ఇప్పటికి ఒకటిన్నర దశాబ్ధకాలం అయింది. వెంటాడుతున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణ వ్యవహారం.. సబ్వే నిర్మాణానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణవ్యవహారమే అడ్డంకీగా మారింది. సబ్‌వేకు అటు రాయచోటి వైపు, ఇటు రాజంపేట వైపు ఉన్న నిర్మాణాలు కారణంగా సబ్వే పూర్తికావడానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో పురపాలకసంఘం, రోడ్లు భవనాల శాఖలు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ కాలాన్ని వెల్లదీసిన సంగతి తెలిసిందే. అలాగే సబ్‌వేకు ఇరువైపు ప్రాంతాలకు చెందిన వారు కొందరు కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. కోర్టులో ఉండటంతో రెండు శాఖలు ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో ఉన్నారు. గతంలో సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన ప్రీతిమీనాతోపాటు అనేకమంది అధికారులు, ప్రజాప్రతినిధులు సబ్వే ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి విధితమే. రైల్వేమంత్రి, జీఎం,డీ ఆర్ఎం వరకు వినతులు రైల్వేమంత్త్వ్రిశాఖ, దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజరు, గుంతకల్ రైల్వే డివిజనల్ మేనజరు వరకు రాజంపేట సబ్వే నిర్మాణం అంశం వెళ్లింది. సబ్వే నిర్మాణం పూర్తి కోసం ఆందోళనలు, నిరసనలు జరిగాయి. రాజంపేట లోక్‌సభ సభ్యుడుపీవీ మిథున్‌రెడ్డి ఇదే అంశాన్ని పలుమార్లు రైల్వేమంత్రిత్త్వశాఖ, ఎస్సీ రైల్వే జీఎం దృష్టి తీసుకెళ్లారు. ఫలితంగా 2025–2026 రైల్వే బడ్జెట్లో రాజంపేట సబ్‌వేకి రూ.5కోట్ల 22 లక్షలు నిధులు కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు పింక్‌బుక్‌లో వెల్లడించారు. సబ్వేను త్వరితగతిన పూర్తి చేయాలి సబ్వే నిర్మాణవిషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిని పూర్తి చేయాలి. రైల్వేబడ్జెట్‌లో రాజంపేట 103 లెవల్ క్రాస్‌గేట్ స్ధానంలో సబ్వే నిర్మాణానికి నిధులు కేటాయించడం హర్షణీయము. సబ్వేను అందుబాటులోకి తీసుకొస్తే ఆర్వోబికి ఇరువైపు ఉన్న ప్రాంతీయులు ఇబ్బందులు తీరుతాయి. –రెడ్డిమాసి రమేష్‌నాయుడు, వైఎస్సార్సీపీనేత, రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి కృషితోనే నిధుల కేటాయింపు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి రాజంపేట సబ్వే నిర్మాణ అంశాన్ని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సెక్షన్ అనేక ప్రాంతాల్లో ఆర్యూబీల నిర్మాణానికి కృషిచేశారు. ఇప్పుడు పెండింగ్‌లో ఉన్న సబ్వే నిర్మాణానికి రైల్వేంత్రి, జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ కృషి ఫలితంగా రైల్వేబడ్జెట్‌లో సబ్వే నిర్మాణానికి నిధులు కేటాయించారు. –తల్లెంభరత్‌రెడ్డి, సభ్యుడు, గుంతకల్ డీఆర్‌యుసీసీ -
కళాశాల గదుల వేలం వాయిదా
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలోని మలయాళస్వామి బీఈడీ కళాశాల గదుల వేలంపాట వాయిదా పడింది. పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ రామచంద్రాచార్యులు ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖకు మరింత నష్టం వాటిల్లినట్లయింది. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయంతోనే వేలంపాట నిర్వహించలేదని, కళాశాల నిర్వాహకులకు అనుకూలంగా సదరు ప్రజాప్రతినిధి వ్యవహరించి ఫోన్ చేయడంతోనే వాయిదా వేశారని చర్చ సాగుతోంది. బహిరంగ వేలం నిర్వహిస్తే ఈ గదులకు నెలకు రూ.లక్ష వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నా.. అధికారుల తీరుతో అందకుండాపోయింది. ఏడేళ్లుగా అద్దె చెల్లించలేదు దేవాదాయ శాఖ ఆధ్వర్యం శ్రీకృష్ణ గీతాశ్రమంలో 7,744 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో మలయాళ స్వామి బీఈడీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ భవనాలకు ఏడేళ్లుగా కళాశాల నిర్వాహకులు అద్దె చెల్లించడం లేదు. కళాశాల యాజమాన్యం గతంలో కోర్టును ఆశ్రయించడంతో గత ఏడాది సెప్టెంబర్ 11న అప్పీల్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఈఓ ఏడేళ్ల బకాయిలు రూ.7 లక్షలు చెల్లించాలని పలుమార్లు నోటీసులిచ్చినా నిర్వాహకులు స్పందించలేదు. నాలుగు రోజుల కిందట కళాశాల భవనాలను ఈవో సీజ్ చేసి వేలం నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేశారు. విషయం తెలుసుకున్న కళాశాలల నిర్వాహకులు వేలం పాటలో పాల్గొనేందుకు గీతాశ్రమానికి వచ్చారు. అయితే పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ తెలిపారు. పది రోజుల తర్వాత తిరిగి వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాగే.. దేవాదాయశాఖకు సంబంధించిన గదులను లోపాయికారీ ఒప్పందాలతో తక్కువ ధరకే అద్దెకు ఇస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. వేలం పాట నిర్వహణను పరిశీలించేందుకు బుధవారం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈఓతో ఆయన మాట్లాడుతూ గతంలోలాగే జరుగుతోందని ఇక్కడికి వచ్చానని, ప్రస్తుతం అదే రీతిన వేలం పాట నిర్వహించకుండా వాయిదా వేశారని అన్నారు. గతంలో వేలం జరిపినట్లు రికార్డులు తయారుచేసి అతి తక్కువ బాడుగకు ఇచ్చారని ఆయన తెలిపారు. ఎవరైతే ఆశ్రమానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారో వారికే రూములను అప్పజెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పది రోజుల తర్వాత అయినా పారదర్శకంగా వేలం పాట నిర్వహించాలని ఈఓను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయశాఖ ఆదాయానికి గండి కొట్టొద్దని తెలిపారు. ఇలా జరిగితే న్యాయ పోరాటం చేస్తానన్నారు. అధికార పార్టీ నేత ఒత్తిడే కారణమా? -
అనుమతొకటి.. తరలించేది మరొకటి..
● తువ్వ మట్టి పేరుతో ఇసుక అక్రమ రవాణా ● టక్కోలు పెన్నా నదిలో జేసీబీ యంత్రాలతో తవ్వకాలు సిద్దవటం: తువ్వ మట్టి తరలింపునకు అనుమతి పొంది.. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఉదంతమిది. సిద్దవటం మండలం టక్కోలు గ్రామనికి చెందిన ఒక వ్యక్తి భూమి సాగు కోసం తువ్వ మట్టి తరలింపునకు అనుమతి పొందారు. టక్కోలు సమీపంలోని పెన్నానది నుంచి.. వంద ట్రిప్పుల మట్టికి మండల రెవెన్యూ శాఖ అఽధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అయితే తువ్వ మట్టి ముసుగులో.. పెన్నా నదిలో జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా కడపకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం పట్టపగలు యథేచ్ఛగా తరలిస్తున్న దృశ్యం స్థానికులకు కనిపించింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా గృహ నిర్మాణాల అవసరాలకే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వగా.. కొంత మంది కడపకు అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే జరిగితే పెన్నా నదికి వరదలు సంభవించినప్పుడు తమ భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్‌బాబుకు సన్మానం
సాక్షి రాయచోటి: ‘కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కాకమునుపే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.. ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో తిప్పికొట్టాలి. అంతేకాకుండా ప్రజల సంక్షేమం కోసం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు కూటమిపై ఆందోళన బాట పట్టాలి. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యం. యువత, పార్టీ నేతలు, అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు, సానుభూతిపనులు, అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి. తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడటంతోపాటు తిరుగులేని విధంగా దూసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలి’ అని పార్టీ కీలక నేతలు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు, కడప నగర మేయర్ కొత్తమద్ది సురేష్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె పార్టీ ఇన్చార్జి నిసార్ అహ్మద్‌తోపాటు పలువురు నేతలు పార్టీకి సంబంఽధించిన అనేక అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, అనుబంధ విభాగాల పటిష్టత, ఇతర అనేక అంశాలపై చర్చించారు. అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలి అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతోపాటు పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నాయకలు, ఇతర పార్టీ శ్రేణులు వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నేతలు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కలిసికట్టుగా ముందుకు వెళుతూ ప్రజా ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని.. ప్రభుత్వం అన్యాయం చేసిన వారికి పార్టీ తరుఫున పోరుబాట చేపట్టేలా కార్యకర్తలు ముందుండాలన్నారు. ఇప్పటికే కూటమి సర్కార్‌కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఇంతకుమునుపు ఏ ప్రభుత్వానికి ఏడాదిలోపే ఇంత వ్యతిరేకత కనిపించలేదని అభిప్రాయపడ్డారు. సూపర్‌సిక్స్ అమలు చేయకపోగా, ఇతర సంక్షేమాన్ని అందించని వైనాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, పార్టీ శ్రేణులు, నాయకులు అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కదం తొక్కుతూ కదలాలని.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని వారు సూచించారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరుబాట రాష్ట్రలలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలపై ఎప్పటికప్పుడు పోరుబాట పట్టేలా నేతలు పథక రచన చేశారు. వైఎస్సార్సీపీ కీలక నేతల సమీక్ష సందర్భంగా.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పుటికప్పుడు ఉద్యమబాట పట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా అధిష్టాంనం ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూనే మరోపక్క అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలువాలని నిర్ణయించారు. కూటమి అరాచకాలు, భూకబ్జాలు, బెదిరింపులు, అక్రమ వ్యవహారాలపై పోరుబాట పట్టాలని సంకల్పించారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవడంతోపాటు ప్రజలకు మద్దతుగా నిలవాలని సమీక్షలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. బలోపేతమే ధ్యేయం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు మండలాలు, గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దామని ప్రతిన బూనారు. ప్రధానంగా మండల కమిటీలతోపాటు నియోజకవర్గ, జిల్లా అనుబంధ కమిటీలను ఎప్పటికప్పుడు సకాలంలో వేసుకుని.. అందులో అన్ని వర్గాలకు సముచితన్యాయం కల్పించడం ఒక లక్ష్యం కాగా.. మరో పక్క వైఎస్సార్సీపీని బలోపేతం చేయడంతోపాటు అన్ని విధాలుగా ప్రభుత్వంపై పోరాటానికి ముందుండేలా సమాయత్తం చేశారు. వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలి సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రణాళిక అన్ని విభాగాలు, అనుబంధ కమిటీల్లో నాయకులను నియమించేలా కసరత్తు ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాడేందుకు వ్యూహ రచన కార్యకర్తలతోపాటు నాయకులు, శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగాలని నేతల పిలుపు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు పరిశీలకునిగా ఎన్నికై న కడప నగర మేయర్ సురేష్‌బాబును నేతలు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ అఽధికార ప్రతినిది, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె పార్టీ ఇన్చార్జి నిస్సార్ అహ్మద్ తదితరులు సురేష్‌బాబును సత్కరించారు. ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. -
హార్సిలీహిల్స్ సుందరీకరణకు ప్రణాళిక
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి, సుందరీకణ కోసం ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన మదనపల్లె సబ్‌కలెక్టర్, హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ మేఘస్వరూప్, తహసీల్దార్ మొహమ్మద్ అజారుద్దీన్, పీకేఎం ముడా ఇంజినీర్లు, డీఈ సూర్యనారాయణతో కలిసి కొండపై విస్త్రృతంగా పరిశీలనలు నిర్వహించారు. కొండపై అతిథిగృహాలు, గాలిబండ, జిడ్డు సర్కిల్, స్విమ్మింగ్ పూల్, గవర్నర్‌బంగ్లా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలి, సుందరీకణ పనులు చేయాలి, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సమీక్ష చేశారు. రెవెన్యూ అతిథిగృహం ప్రయివేటుకు అప్పగించగా.. దాన్ని ఎప్పటి లోగా ప్రారంభిస్తారని జేసీ లీజుదారునితో చర్చించారు. రెండు వారాల్లో ప్రారంభిస్తామని చెప్పగా.. త్వరితగతిన పనులు పూర్తి చేసి పర్యాటకులకు గదులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ గాలిబండ వద్ద సందర్శకులు ప్రకృతి అందాలను తిలకించేందుకు బెంచీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిడ్డు సర్కిల్ ప్రాంతాన్ని సుందరీకరిస్తామని, పర్యాటకులు వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై పారబోయకుండా డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అరకు కాఫీ హౌస్‌ను ప్రారంభించడం, కొత్త టాయిలెట్ల నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు. జేసీ ఆదర్శ్‌రాజేంద్ర -
కన్నేశారు.. కమ్మేస్తున్నారు!
హుండీ ఆదాయం లెక్కింపు సంబేపల్లె: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. బ్యాంక్ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొత్తం రూ.3,23,700 ఆదాయం వచ్చినట్లు ఈఓ కొండారెడ్డి తెలిపారు. ఈ నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఫారంపాండ్ పనుల పరిశీలన గాలివీడు: మండలంలోని నూలివీడు గ్రామం చీమల చెరువుపల్లిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఫారంపాండ్ పనులను ఉపాధి పీడీ వెంకటరత్నం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించి, ఆర్థిక భరోసా ఇవ్వాలని సూచించారు.. పీడీ వెంట ఏపీఓలు హరిబాబు, రామచంద్ర, టీఏ, ఎఫ్‌ఏలు తదితరులు పాల్గొన్నారు. దేవదాయ భూములను పరిరక్షించాలి రాయచోటి: జిల్లాలోని దేవదాయ శాఖ భూములను పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్లో దేవాలయ భూముల పరిరక్షణపై జిల్లా స్థాయి భూ సంరక్షణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరియైన ధరకు వేలం నిర్వహించి భూములను లీజుకు ఇవ్వాలని ఆదేశించారు. దేవాలయాల్లో పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, దేవదాయశాఖ అధికారి సి.విశ్వనాథ్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, టెంపుల్ ఈఓలు, తనిఖీదారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ భూమిఆక్రమణకు యత్నం ● అధికారులుఅడ్డుకుంటున్నా.. వదలని అక్రమార్కులు ● కబ్జాదారులకుకూటమి నేతల అండ ● సరిహద్దులు లేకపోవడంతో చెలరేగుతున్న వైనం గుర్రంకొండ: ప్రభుత్వ భూములపై కొందరు అక్రమార్కులు కన్నేసి.. కబ్జా చేస్తున్నారు. అధికారులు అడ్డుకుంటున్నా.. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతల అండతో ముందుకు సాగుతున్నారు. మండలంలోని గుర్రంకొండ పంచాయతీ చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామ సమీపంలో సర్వే నంబరు 87/8లో 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది గుర్రంకొండ పట్టణ సమీపంలో.. జాతీయ రహదారి 340 పక్కనే ఉండటంతో.. భారీగా విలువ చేస్తోంది. ఈ భూమికి సంబంధించి ఇంత వరకు ఎవరికీ పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో ఎకరం రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో కొంత మంది కబ్జాదారుల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. వారి నుంచి కాపాడుకోవడానికి రెవెన్యూ అధికారులు నెలన్నర క్రితం సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా.. వాటిని కొంత మంది కూటమి నేతలు అడ్డుకుని రెవెన్యూ ఆధికారులను అక్కడి నుంచి పంపించి వేసిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు కొన్నాళ్లు గుంభనంగా ఉన్న కబ్జాదారులు అప్పట్లో మళ్లీ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నెల క్రితం తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబరు 87/8లో ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. మళ్లీ మొదలైన కబ్జా యత్నాలు: కొన్నాళ్లు వేచి చూసిన కబ్జాదారులు మళ్లీ ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెండు రోజులుగా ముమ్మరం చేశారు. ఆ భూమిలో ఉన్న వేప తదితర చెట్లను మెల్లమెల్లగా నరికి వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి.. భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చాలా చదును చేసే పనుల్లో భాగంగా.. బయటి ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఇప్పటికే మట్టికుప్పలు దర్శనమిస్తుండటం గమనార్హం. రెవెన్యూ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూమి ఆక్రమణ పనులు మెల్లగా మొదలు పెడుతున్నారు. ముందుకు సాగని సర్వే పనులు నెలన్నర క్రితం ఆగిపోయిన ప్రభుత్వ భూమి సర్వే పనులు.. మళ్లీ ముందుకు సాగడం లేదు. కేవలం బోర్డులు పెట్టి వదిలేయడంతో మళ్లీ కబ్జా యత్నాలు పుంజుకొంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు సర్వే పనులు పూర్తి చేసి.. సరిహద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూములు కాపాడా లని గ్రామస్తులు కోరుతున్నారు. చెట్ల నరికివేతను అడ్డుకున్నాం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 87/8లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంత మంది చెట్లను నరికివేస్తుండడంతో అడ్డుకొని పంపించి వేశాం. ఇప్పటికే సదరు భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేయించి త్వరలోనే సరిహద్దులు ఏర్పాటు చేస్తాం. ఆ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడుతాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, గుర్రంకొండ -
మినీ మహానాడుకు బత్యాల, కస్తూరి డుమ్మా
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌ఛార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, టిడిపి రాష్ట్ర నిర్వహక కార్యదర్శి, మాజీ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు హాజరుకాకపోవడంపై పలువురు టీడీపీ శ్రేణులు చర్చించుకున్నారు. స్థానిక రాజు రెసిడెన్షీలో మంగళవారం ముందస్తుగా టీడీపీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కస్తూరి, బత్యాల వర్గీయులు హాజరుకాలేదు. గత నెలలో రూపానందరెడ్డి కార్యాలయం వద్ద బయటపడ్డ వర్గ విభేదాలు ఇంకా సమసిపోలేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం ఓబులవారిపల్లె : విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో మండలంలోని జె.వడ్డిపల్లి గ్రామానికి చెందిన డి.నారాయణమ్మ ఇల్లు మంగళవారం దద్ధమైంది. వేసవికాలం కావడంతో నారాయణమ్మ ఇంటి బయట నిద్రిస్తోంది. తెల్లవారుజామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో మంటలు వ్యాపించాయి. ఇరుగుపొరుగు మంటలు అదుపుచేసే లోగా వస్తువులు కాలిపోయాయి. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం రూ.1,50,000ల నగదు తెచ్చి ఇంట్లో ఉంచింది. ఆ డబ్బు కూడా కాలి బూడిదవడంతో ఆమె బోరున విలపించింది. సామగ్రి కాలిపోయి కట్టుబట్టలతో ఉన్నతనను ఆదుకోవాలని ఆమె వేడుకుంది. ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి మృతి పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని అంబకపల్లి రోడ్డు సమీపంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని యువతి స్వాతి మృతిచెందింది. పోలీసుల కథన మేరకు.. వరప్రసాద్, కళావతిల కుమార్తె స్వాతి బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందినట్లు సీఐ చాంద్‌బాషా తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గౌరవం లేదు.. వేతనం రాదు
కాశినాయన : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రా మంలో ఏ పనులు చేయించలేని పరిస్థితి తమకు ఉండడంతో గౌరవం లేకుండాపోయిందని, దానికి తోడు కనీసం రెండేళ్ల నుంచి గౌరవ వేతనాలు అందలేదని పలువురు ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కడ ప జిల్లాలో 559 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వారికి ప్రతి నెలా రూ.3వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఎంపీటీసీలకు చెల్లించలేకపోయింది. 2024 జూలై, 30న కొత్తగా కూటమి ప్రభుత్వం కొలు వుదీరింది. అంతకుముందు పెండింగ్ వేతనాలతోపాటు దాదాపు రెండేళ్ల గౌరవ వేతనం రావాల్సి ఉంది. నేటికీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించలేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలచే ఎంపికై న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వసభ్య సమావేశాలకే పరిమితంః కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసభ్య సమావేశాలకు హాజరుకావడం మినహా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారుల సమస్యలను తీసుకువచ్చినా పట్టించుకున్న పాపాన పోవడంలేదని చెబుతున్నారు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించక పోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరుపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, వివక్షకు గురిచేస్తున్నారని వారు మండిపడుతున్నారు. పలువురు ఎంపీటీసీల ఆవేదన -
విద్యుత్ చీకటి ఒప్పదంతో ప్రజలకు వెన్నుపోటు
రైల్వేకోడూరు అర్బన్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.60 పైసలతో ఒప్పందం చేసుకొంటే గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు, ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలు.. సీఎం చంద్రబాబు తాజాగా యూనిట్ రూ.4.60తో ఒప్పందం చేసుకుంటే స్పందించరేమని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అప్పుడు 2.60 పైసలతో సెకీతో ఒప్పందం చేసుకొంటే చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయన్నారు. ఇపుడు యాక్సిస్‌తో రూ.4.60 పైసలకు ఏరకంగా ఒప్పందం చేసుకుంటారు... ఇది కుంభకోణం కాదా అని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లు ఒప్పందాలతో భవిష్యత్తు తరాలపై భారం మోపిన చంద్రబాబు ఏం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలు కిమ్మనకున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి మేలు చేయడానికి సోలార్ ఎనర్జీపై కేంద్ర సంస్థ సెకీ నిబంధనల మేరకు అప్పటి ఏపీ ప్రభుత్వం యూనిట్‌కు రూ.2.60 పైసలతో కొనేందుకు ఒప్పందం చేసుకుంటే అమెరికాకు లింకులు పెడుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రెండు పత్రికలు విష ప్రచారం చేసాయన్నారు ఇప్పుడు చంద్రబాబు మోపుతున్న భారాలు, తక్కువ కాలంలో చేసిన అప్పుల భారం వారికి కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఏడాదిలో ప్రజలపై సుమారు రూ.15,835 కోట్లు విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో భారం మోపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని ఊదర కొడుతూ పేదలను నమ్మించి వంచన చేశారని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి పరిపాలలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు -
సమస్యలు పరిష్కరించేంత వరకు ఖాళీ చేసేది లేదు
ఓబులవారిపల్లె : మండలంలోని కాపుపల్లి, హరిజనవాడ, అరుంధతివాడ పునరావాస గ్రామాల్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేంతవరకూ ఖాళీ చేసేది లేదని ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక ఎంపీడీఓ సభా భవనంలో మంగంపేట గ్రామస్థులతో తహసీల్దారు శ్రీధరరావు, సీపీవో సుదర్శన్‌రెడ్డి, తదితరులు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాస కాలనీలో రామాలయ నిర్మాణం గ్రామ ఆలయ కమిటీకి అప్పగించాలని కోరారు. 72 ఎకరాల శ్మశాన స్థలాన్ని ఎపీఎండీసీ తీసుకని, రెండు ఎకరాలు మాత్రమే శ్మశానానికి ఏ విధంగా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. అన్ని కులాలకు 40 ఎకరాల స్థలం ఉండాలన్నారు. రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 750కి పైగా కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, 150 కుటుంబాలకు పరిహారం అందించాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గుత్తిరెడ్డి హరినాథరెడ్డి, సర్పంచ్ మినుగు సుధాకర్, గ్రామస్థులు గుజ్జల శ్రీనివాసులురెడ్డి, కౌలూరు రమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, దేవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సురభి లే అవుట్లో చోరీ
మదనపల్లె రూరల్ : మండలంలోని పొన్నూటిపాలెం పంచాయతీ సురభి లే అవుట్లో సోమవారం చోరీ జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితురాలు నాగపరిమళ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నక్కలదిన్నె సత్సంగ్ సమీపంలోని సురభి లేఅవుట్ రోడ్డులో శంకరరెడ్డి, నాగపరిమళ దంపతులు నివాసముంటున్నారు. సత్సంగ్ ఫౌండేషన్‌కు చెందిన స్వాస్థ ఆస్పత్రిలో నాగపరిమళ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోంది. సోమవారం ఆమె విధులకు వెళ్లగా భర్త శంకరరెడ్డి పట్టణంలోకి వచ్చాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నాగపరిమళ ఇంట్లో వస్తువులు చిందరవందరగా, బీరువా తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని భర్త శంకరరెడ్డికి విషయం తెలిపారు. ఆయన డయుల్ 100కు ఫోన్‌చేసి పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళావెంకటరమణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌టీమ్ ద్వారా వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. అనంతరం మంగళవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా చోరీ ఘటనలో తమ ఇంట్లోని బీరువాలో ఉంచిన సుమారు 100గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, దాదాపు 400 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.50వేల నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లినట్లు బాధితులు తెలిపారు. రూ.10 లక్షల విలువైన ఆభరణాల అపహరణ -
కాళ్లు.. చేతులు కట్టేసి.. గొంతుకు తాడుతో బిగించి చంపేశారు
రాయచోటి టౌన్(అన్నమయ్య): కాళ్లు.. చేతులు కట్టేశారు.. గొంతుకు తాడుతో బిగించారు.. చనిపోయిన తరువాత ఆనవాళ్లు లభించకుండా చేసేందుకు పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. అయితే మృతి చెందిన మహిళ చేతి పై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి హత్య జరిగిన వా రం రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. మృతురాలు మదనపల్లె నియోజకవర్గం పరిధిలోని రామసముద్రం ప్రాంతానికి చెందిన వెంకటరమణ భార్య బూసిపల్లె శివమ్మ(27) గా గుర్తించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం విలేకరుల స మావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలోని రామసముద్రం మండలం చెంబుకూరు ఎలకపల్లె రహదారిలో ఈనెల 11వ తేదీ గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. రామసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగించారు. మృతదేహంపై పెట్రోలు పోసి తగలబెట్టడంతో ఎలాంటి ఆధారాలు లభించలేదు. అక్కడ పెట్రోల్ కోసం వాడిన బాటిల్ మాత్రమే ఉండింది. అయితే మృతురాలి చేతిపై యస్మిత అనే పచ్చబొట్టు ఉండటంతో దాని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. పచ్చ బొట్టును సోషల్ మీడియాలో పెట్టడంతో ఆమె ఏ ప్రాంతానికి చెందిన మహిళ అనే విషయం తెలిసింది. అలాగే డాగ్‌స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి బెంగళూరు రోడ్డు వైపు వెళ్లడంతో ఆ మేరకు టెక్నాలజీని ఉపయోగించి నిందితులను గుర్తించారు. నిందితులంతా మృతురాలి బంధువులే అని తేలడంతో ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బెంగళూరులో నివాసం ఉంటున్న ఎం.నీలావతి, రామసముద్రం మండలం గుండేవారిపల్లె నడింపల్లె ప్రాంతానికి చెందిన కన్నెమడుగు గణేష్, బెంగళూరులోని బి.హోసహళ్లి సజ్జాపురం ప్రాంతం అంబేద్కర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్ ఉన్నారు.ఎందుకు హత్య చేశారంటే..మృతురాలు బూసిపల్లె శివమ్మ అదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ఆమె బంధువులు భర్తకు తెలియకుండా ఆమెను హత్య చేసేందుకు పథకం రచించారు. ఇందులో భాగంగా మృతురాలి బంధువైన నీలావతి బెంగళూరుకు చెందిన ఆటో డ్రైవర్ హెచ్వీ గోపాల్‌తో హత్య చేసేందుకు బేరం కుదుర్చుకుంది. వీరికి కన్నెమడుగు గణేష్ అనే వ్యక్తి సహకరించాడు. ఆ తర్వాత వారు రామసముద్రం వచ్చి శివమ్మకు మాయమాటలు చెప్పి ఆమెను తమ వెంట శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకు తాడు బిగించి అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక ముందుగానే తమ వెంట తెచ్చుకున్న పెట్రోలును మృతదేహంపై పోసి నిప్పంటించారు. అయితే ఆమె చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. మదనపల్లె డీఎస్పీ ఎస్.మహేంద్ర, రూరల్ సీఐ సత్యనారాయణ, రామసముద్రం ఎస్ఐ జి.రవికుమార్, మరికొంతమంది సిబ్బంది చాకచక్యంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారని ఎస్పీ ప్రశంసించారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారుసోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే కఠిన చర్యలురాయచోటి టౌన్ : సమాజంలో ప్రజలను ఉద్రేకపరిచేలా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్‌లు పెడితే అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అన్నమయ్య జిల్లాఎస్పీ విద్యా సాగర్‌నాయుడు హెచ్చరించారు. మదనపల్లెలో హనుమాన్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై సోమవారం ఆయన స్పందించి విలేకరులతో మాట్లాడారు. శోభాయాత్ర నిర్వాహకులు ముందుగా తమతో అనుమతులు పొందే సమయంలో ఇచ్చిన రూట్‌మ్యాప్ ప్రకారం కాకుండా వేరే దారిలో వెళ్లేందుకు ప్రయత్నించారన్నారు. పోలీసులు ఎంత నచ్చజెప్పినా వినకుండా సమస్యలు సృష్టించాలని చూశారన్నారు. ప్రకటించిన సమయానికి రాకుండా సుమారు ఒకటిన్నర గంట ఆలస్యంగా రావడమే కాకుండా దారి మళ్లించి సమస్య ను సృష్టించడంతో తమ పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేయాల్సి వచ్చిందన్నారు. కావాలనే శోభాయాత్రను దారి మళ్లించి సమస్యలు సృష్టించేందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేశామని చెప్పారు. అయితే అక్కడ ఏదో జరిగిందని ఒక వర్గాన్ని అణచివేస్తున్నట్లుగా తప్పు డు సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేస్తున్నారన్నారు. అలాంటి వారిపైన కూడా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించుకోవాలని సూచించారు. -
సిరులు కురిపించని విరులు
పూలసాగు విస్తీర్ణం : 3150 సాగు చేసే రైతులు : 2350 సాగుకు అయిన ఖర్చు : రూ.31.50కోట్లు ఈఏడాది పంట నష్టం : రూ.22కోట్లు జిల్లాలో పూలసాగు చేసిన రైతుకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. జిల్లా మొత్తం 2350 మంది 3150 ఎకరాల్లో పూల సాగు చేపట్టారు. నారుమొక్కలు, ఎరువులు, దుక్కులు, మల్చింగ్ కవర్, కూలీల ఖర్చు కలుపుకొంటే ఎకరం బంతిపూల సాగుకు రూ. 80 వేలు నుంచి రూ.లక్షవరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సగటున కిలో బంతిపూల ధర రూ. 10 వరకు ధరలు పలుకుతున్నాయి. కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు,ఇతరత్రా ఖర్చులు కలుపుకొంటే పూలను మార్కెట్‌కు తీసుకెళ్లే రైతులు ఖాళీ చేతులతో వచ్చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో బంతి పూల ధరలు కిలో రూ. 40 నుంచి రూ.50 వరకు ధరలు పలికాయి. ఈ సీజన్ జిల్లా మొత్తం మీద పూల సాగు చేసిన రైతులు రూ.22కోట్ల మేరకు నష్టపోయారు. -
నిధుల రైలు వచ్చేసింది
రాజంపేట : 2025–2026 బడ్జెట్ నుంచి విడదులైన నిధుల రైలు ఎట్టకేలకు వచ్చేసింది..బడ్జెట్ నిధుల కేటాయింపులకు సంబంధించి పింక్ బుక్ (కీ బడ్జెట్ డేటా)ఆలస్యంగా విడుదలైంది. దీనిని పరిశీలిస్తే బడ్జెట్లో ఉభయ వైఎస్సార్ జల్లాకు పెద్దగా ఒరిగిందేమిలేదు. కొత్తలైన్లు, కొత్తరైళ్లు లేవు. పాడిందేపాటరా అన్న సామెత ఇప్పుడు విడుదలైన నిధులకు సరిగ్గా సరిపోతుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు . ● 255.4కిలోమీటర్ల దూరం కలిగిన కడప–బెంగళూరు రైల్వేలైన్ 2014లో ప్రారంభమైంది. యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన రైలుమార్గానికి వ్యయం రూ.20వేలకోట్లు అంచనా వేశారు .2016–2017లో రూ.58కోట్లు, 2017–2018లో రూ.240కోట్లు. 2018–2019లో రూ.175 కోట్లు, 2022–2023లో రూ.289 కోట్లు– 2023–2024లో రూ.10లక్షలు, 2025–2026లో ఈబీఆర్(ఎస్) కింద రూ.21లక్షలు కేటాయింపులు జరిగాయి. కడప–బెంగళూరు రైల్వేలైన్‌పై కేంద్ర ప్రభుత్వం స్పందన ఆశాజనకంగా లేదనేది నిధుల కేటాయింపులను బట్టి తెలుస్తోంది. అందువల్ల పనులు వేగం అందుకోలేకపోతున్నాయి. 14 ఏళ్లవుతున్నా ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో రైల్వేలైన్‌కు రూ.185 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులకు 126 కిలోమీటర్ల దూరం కలిగిన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గానికి ఈబీఆర్(ఎస్) కింద రూ.30.15 కోట్లు కేటాయించారు. 113 కిలోమీటర్ల దూరం కలిగిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైలుమార్గానికి డిపాజిట్(ఆర్వీఎన్) కింద 267 కోట్ల వ్యయం చేస్తున్నారు. ● 2020లో బడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బ అనే కొత్త లైన్ తెరపైకి రావడంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు అప్పట్లో రేకేత్తించాయి. ఈ సారి బడ్జెట్లో 65 కిలోమీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–ముదిగుబ్బ కొత్తలైన్ ఆర్ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు. ● 110 కిలో మీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం లైన్‌కు రూ.2 కోట్లు ఫైనల్ లొకేషన్ సర్వేకు కేటాయించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో రైలుకూత కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడి వాసులు ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంత మీదుగా రైలుమార్గం వెళితే రైలుకూత వినివచ్చునన్న భావనలో ఉన్నారు. మొక్కుబడిగా నిధుల కేటాయింపు ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వలో తెరపైకి వచ్చిన కొత్త లైన్ల సర్వేలకు ప్రతి బడ్జెట్లో మొక్కుబడిగా నిధులు కేటాయింపులు జరిగాయి. కంభం–ప్రొద్దుటూరు లైన్(142కి.మీ) రూ.10లక్షలు డిపాజిట్ చేశారు. సర్వేకు పరిమితమైన భాకారాపేట–గిద్దలూరు లైన్‌ను గాలికి వదిలేశారు. గుంతకల్–రేణిగుంటలైన్లో 3, 4 లైన్‌కు సర్వే గుంతకల్–రేణిగుంట మధ్య 3, 4 లైన్ నిర్మాణానికి రైల్వేబోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బడ్జెట్లో సర్వేకు ఉపక్రమించింది. ఫైనల్ లోకేషన్ సర్వే కింద గుంతకల్–ఓబులవారిపల్లెకు(256 కి.మీ) రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి. 56 కిలోమీటర్ల దూరం ఉన్న ఓబలవారిపల్లె– రేణిగుంటకు ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.1 కోటి వ్యయం చేయనుంది. ప్రస్తుతం డబుల్లైనులో రైళ్లు నడుస్తున్నాయి. 3,4 లైన్ల నిర్మాణం సకాలంలో పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు నిధుల కేటాయిపు ఉభయవైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.18 కోట్ల కేటాయింపులు జరిగాయి. పార్శిల్ ఆఫీసు ఆధునికీకరణ చేయనున్నారు. ఓపెన్ వెయిటింగ్ హాల్‌తోపాటు , రూ.4 కోట్లతో ఎస్కలేటర్స్ సౌకర్యం కోసం బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అప్గ్రేడ్స్టేషన్ కింద పీలేరు, రాజంపేటలో స్టేషన్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు జరిగాయి. గుత్తి–పుల్లంపేట రూ.18కోట్లతో 29 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్సిస్టమ్ బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ప్లాట్‌ఫాంల పొడిగింపు... గుంతకల్–రేణిగుంట మార్గంలో ప్లాట్‌ఫాంలను పొడిగించనున్నారు. రూ.3 కోట్లతో 24/26/ఎల్‌హెచ్‌బీ బోగీలకు అనుకూలంగా రాజంపేట, కోడూరు స్టేషన్లలో నిర్మితం చేయనున్నారు. ఇదే విధంగా ముద్దనూరులో రూ.3 కోట్లతో ప్లాట్‌ఫాం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గూడ్స్షెడ్ల అభివృద్ధి రైల్వేకోడూరులో గూడ్స్‌షెడ్‌ను రూ.11 కోట్లతో, ముద్దనూరు గూడ్స్‌షెడ్ రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. శెట్టిగుంట, రాజంపేటలో ట్రాక్‌మిషన్ సైడింగ్స్,రెస్ట్‌రూం తదితర సౌకర్యాల కోసం రూ.5 కోట్లు కేటాయించారు. రాజంపేట యార్డులోని సబ్‌వేకు రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి. కడప–బెంగళూరు లైన్‌కు స్వల్పనిధులు రేణిగుంట–గుంతకల్ 3,4లైన్‌కు సర్వే -
కొనుగోలు చేసిన భూమిపైనా ‘పచ్చ’ కుట్ర
మదనపల్లె : మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్షకట్టి పచ్చ మీడియా కట్టుకథలను అల్లుతోంది. న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూమిపైనా విషం కక్కుతున్నారు. నిజాలు లేకున్నా అడ్డగోలు రాతలతో ఇబ్బందులకు గురి చేయాలన్న ప్రయత్నాలు విఫలం అవుతున్నా మళ్లీ మళ్లీ అవే కట్టుకథలు అల్లుతున్నారు. ఇందులో భాగమే సోమవారం మదనపల్లె పట్టణం బీకేపల్లె గ్రామంలో పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేసిన భూమి పక్కన ప్రభుత్వ భూమి ఆక్రమణ అంటూ తప్పుడు కథనం వండివార్చారు. అయినా అక్కడ ఆక్రమణ ఏదిలేదని తేలిపోయింది. అధికారులు కూడా ఎన్ఓసీ మేరకు భూమి కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. 1959 జూన్ 30న మాజీ సైనికుడు ఆకుల సిద్దప్పకు అప్పటి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. 2002 జూలై 29న మదనపల్లె సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో తన ఆస్తులు వారసులకు దక్కేలా రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించారు. 2006 మే ఏడున ఆయన చనిపోయాక వీలునామా ప్రకారం పట్టా భూమి కుమారుడు ఆకుల రామాంజులుకు సక్రమించింది. ఈ భూమికి ఎన్ఓసీ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2018 ఫిబ్రవరి 23న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ భూమికి వారసుడైన రామాంజులు 2018 ఫిబ్రవరి 9న తన కుమార్తె ఆకుల శ్రీప్రియ పేరిట వీలునామా రాశారు. ఆయన 2018 మార్చి 13న చనిపోయారు. తర్వాత ఈ భూమిపై శ్రీప్రియకు వారసత్వ హక్కు ఏర్పడింది. దీంతో ఆమె హైకోర్టు తీర్పు మేరకు తమ భూమికి ఎన్ఓసీ జారీ చేయాలని అప్పటి కలెక్టర్ గిరీషాకు దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు, జారీచేసిన పట్టా వివరాలు, కోర్టు తీర్పు, ఉన్నతాధికారుల నివేదికను పరిశీలించి అన్ని సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించాక కలెక్టర్ 2023 మే 3న ఎన్ఓసీఓ జారీ చేశారు. దీంతో భూమిని విక్రయించుకునే హక్కు శ్రీప్రియకు దక్కింది. 3.40 ఎకరాలు కొనుగోలు బీకేపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 552/7లోని మాజీ సైనికుడికి కేటాయించిన భూమిలో 3.40 ఎకరాలను పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేశారు. వారసురాలు శ్రీప్రియ నుంచి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి ఆకుల సిద్దప్ప, ఆయన కుమారుడు రామాంజులు బాబుకు పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, వన్బీలును రెవెన్యూ అధికారులు మంజూరు చేసి ఉన్నారు. పక్కాగా న్యాయబద్ధంగా ఉన్న భూమి కావడంతోనే పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తమ కుటుంబానికి ఈ సర్వేనంబర్‌లో వ్యవసాయ భూమి ఉందని పెద్దాయన స్పష్టంగా పేర్కొన్నారు. పక్కనే ప్రభుత్వ భూమి ఉందని.. కొనుగోలు చేసిన ఈ భూమి పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు. కొన్న భూమి వరకే ఉన్నప్పటికి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. భూమిలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. అయినప్పటికీ భూమిని ఆక్రమించారంటూ ఆరోపిస్తూ కథనం వండారు. అందులో చెరువులు, కుంటలు లేవు, అయినా ఉన్నట్టు ప్రచారం చేశారు. సోమవారం సాయంత్రం సర్వే నంబర్ 552/1లోని 1.35 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ అధికారులు గాడిని తవ్వించారు. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్టు, ఆక్రమణ లు లేవని రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా నిర్ధారించారు. ఎలాంటి వివాదం లేదు సర్వేనంబర్ 552/7లో కొనుగోలు చేసిన 3.40 ఎకరాల భూమి పక్కాగా ఉందని తహసీల్దార్ కే.ధనంజయలు స్పష్టం చేశారు. ఈ భూమిపై ఎలాంటి వివాదం లేదని, పక్కనే ఉన్న 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి కావడంతో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇందులో ఎలాంటి నిర్మాణాలు జరగలేదని స్పష్టం చేశారు. మాజీ సైనికుడి పట్టాకు ఎన్ఓసీ ఇచ్చిన కలెక్టర్ ఆపై వారసురాలి ద్వారా సర్వేనంబర్ 552/7లో 3.40 ఎకరాల కొనుగోలు 2024 ఎన్నికల అఫిడవిట్లో ఈ భూమి వివరాలు పేర్కొన్న పెద్దిరెడ్డి అయినా ఆక్రమణ అంటూ కట్టుకథ -
జిల్లా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉండగా, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ములకలచెరువు నుంచి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్థానిక వైద్యులు అతనికి ఐసీయూ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తుండగా, ఆదివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని మార్చురీ గదిలో ఉంచారు. అతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సంప్రదించాలన్నారు. పాము కాటుకు రైతు కూలీ..లక్కిరెడ్డిపల్లి : మండలంలోని మద్దిరేవుల గ్రామం రెడ్డివారిపల్లికి చెందిన వీరబల్లి వెంకటరమణ (44) అనే రైతు కూలీ ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాటుకాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లింది. వెంకట రమణ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేసి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
గోపవరం ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచింది
ప్రొద్దుటూరు : గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థిగా బీరం రాఘవేంద్రారెడ్డి ఎన్నికైన అనంతరం సోమవారం తన స్వగృహంలో ఆయన విజయం సాధించిన అభ్యర్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ అనేక అవాంతరాల మధ్య, అభద్రత పరిస్థితుల నడుమ ఉప సర్పంచ్ ఎన్నిక ఎట్టకేలకు జరిగిందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యంత ప్రశాంతంగా, సజావుగా ఎన్నిక జరిపించి ప్రజా స్వామ్యాన్ని గెలిపించారన్నారు. ఎన్నికలో విజయం సాధించడం కన్నా ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి చక్కగా విధులు నిర్వహించారన్నారు. ఎన్ని మార్లు ఓడినా, గెలిచినా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడమే ముఖ్యమన్నారు. గతంలో జరిగిన పొరపాటును వరదరాజులరెడ్డి సరిదిద్దుకున్నారన్నారు. వాస్తవానికి మార్చి 27న జరిగిన ఎన్నికల్లోనే తాము గెలవాల్సి ఉందని, టీడీపీ వైఖరి వల్ల ఎన్నిక వాయిదా పడిందన్నారు. 20 మంది వార్డు సభ్యుల్లో తమ వైపు 14 మంది ఉన్నా అడ్డదారిన గెలవాలని టీడీపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదన్నారు. వార్డు సభ్యులను స్ఫూర్తిగా తీసుకుంటాం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు తమ వెంట నడిచిన గోపవరం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను తాము స్ఫూర్తిగా తీసుకుంటామని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. డబ్బులు ఇస్తామని, ప్రలోభాలకు గురిచేయడంతోపాటు బెదిరించి భయపెట్టారన్నారు. ఏమి చేసినా తమ వార్డు సభ్యులు ఎదరొడ్డి నిలబడి చివరకు తమకు విజయాన్ని అందించారన్నారు. ఇది మా జెండా గొప్పతనమని తెలిపారు. వైఎస్సార్సీపీలో ఉండి పదవులు అనుభవించిన తర్వాత పార్టీని వీడిన రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని, 2029 ఎన్నికల్లో తమ పార్టీ తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
అప్పు తీర్చమంటే బెదిరిస్తున్నారు
రాయచోటి టౌన్ : తమ వద్ద అప్పు తీసుకున్నారు.. ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నారంటూ మదనపల్లె పట్టణానికి చెందిన కొందరు మహిళలు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె టౌన్ పరిధిలో సుజాత, సుంకర లావణ్య, పద్మప్రియ, గౌరి, నాగరత్న, నళిని, నాగమణి అనే మహిళలు తమవద్ద పలు దఫాలుగా రూ.3.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని వారు తెలిపారు. తమ పిల్లలకు ఫీజులు కట్టాలని కొందరు ఇంటిలో అవసరం ఉందని మరి కొందరు ఇలా రకరకాల అవసరాల కోసం తమ దగ్గర అప్పు చేశారన్నారు. తమ డబ్బులు ఇవ్వాలని అడిగితే వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి తమ ఇళ్ల వద్దకు వచ్చి దుర్భాషలాడటం, నానా యాగి చేయడం, గొడవకు దిగడం చేస్తున్నారని వాపోయారు. చేసేది లేక తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. తమపై కోర్టుకు వెళతారా అంటూ మరింత రెచ్చిపోయి గొడవకు వస్తున్నారని తెలిపారు. వీరిలో సుజాత అనే మహిళపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, తాము ఫిర్యాదు చేసిన తరువాత విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కూడా సిద్ధం చేసుకొందన్నారు. ఆమె పాస్‌పోర్టు రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో సుగుణ, భారతి, కుసుమ, శ్రీదేవి, అనూరాధ, సునీత, సరస్వతి తదితరులు ఉన్నారు.ఎస్పీకి బాధిత మహిళల ఫిర్యాదు -
వంగసాగుతో నష్టపోయాం
ఈసీజన్లో వంగపంట సాగు చేసి పూర్తిగా నష్టపోయాం. మార్కెట్లో ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. సుమారు రూ.1.50లక్షల మేరకు పెట్టుబడి సాగు ఖర్చు నష్టపోయాం. గత ఏడాది ఇదే సీజన్లో వంగ పంటకు మార్కెట్లో మంచి ధరలు పలికాయి. ఇప్పుడు కిలో రూ.10 వరకు ఉండటంతో గిట్టుబాటు కావడం లేదు. – గంగులమ్మ, గంగిరెడ్డిగారిపల్లె టమాట కోయకుండా వదిలేశాం మార్కెట్లో టమాటాలకు గిట్టుబాటుధరలు లేక పోవడంతో కాయలు కోయకుండా అలాగే తోటల్లొనే వదిలేశాం. ఈసీజన్లో ఒక ఎకరాలో పంట సాగు చేశా. రూ. 2 లక్షలవరకు పెట్టుబడి కోసం ఖర్చు చేశా. ఇప్పటివరకు రూ. 20 వేలు కూడా చేతికందలేదు. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఆశ లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. పంటనష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి – రాజారెడ్డి, కొత్తపల్లె ప్రభుత్వం ఆదుకోవాలి జిల్లాలో రైతులు సాగు చేస్తున్న ఒక్క పంటకు కుడా ఈ ఏడాది గిట్టుబాటు ధరలు లేక పోవడం దారుణం. ప్రభుత్వం పంటలభీమా పథకం కిందనైనా వారిని ఆదుకోవాలి. ముఖ్యంగా కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్లో ధరలు లేకపోవడం వేలాది మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం పంటల బీమా చేసుకొన్నవారితోపాటు బీమా చేసుకోని వారిని కూడా ఆదుకోవాలి. – రమేష్‌బాబు, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, గుర్రంకొండ. -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. మండలంలోని పోతబోలు పంచాయతీ దళితవాడకు చెందిన వెంకటేష్ భార్య ఆర్. రమణమ్మ (55) భర్త మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె కుమారుడు కుషాల్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. రమణమ్మ ఆదివారం స్థానిక కూలీలతో కలిసి పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం కూలి పనులు ముగించుకుని తిరిగి వచ్చి, పోతబోలు నుంచి దళితవాడకు వెళ్తుండగా, ద్విచక్ర వాహనంలో ఒక యువకుడు వేగంగా వచ్చి ఆమెను ఢీకొని, ఎవరు గమనించలేదని అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదంలో రమణమ్మ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకు ని వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకుని, తిరిగి ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యా రు. అయితే మృతదేహాన్ని ఫ్రీజర్‌బాక్స్‌లో పెడుతు న్న సమయంలో ఒంటిపై తీవ్ర గాయాలను గుర్తించారు. ఈ లోపు సంఘటనా స్థలం వద్ద రమణమ్మను పోతబోలు గ్రామానికి చెందిన యాసిన్ లేపి కూర్చోబెడుతుండగా, తాము చూశామని తోటికూలీలు చెప్పారు. దీంతో యాసిన్‌ను ప్రశ్నించగా, అతను బుకాయించగా, కుటుంబ సభ్యులు తాలూకా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీ గదికి పోస్టుమార్టం నిమి త్తం తీసుకువచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వర్షానికి కూలిన మిద్దె
పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ గజ్జెలవారిపల్లికి చెందిన శంకర్‌రెడ్డి అనే వ్యక్తికి చెందిన మిద్దె వర్షం కారణంగా కూలిపోయింది. ఇంటి పైకప్పునకు వేసిన బలమైన రాతి కప్పులు ఒక్కసారిగా కూలిపోయాయి. రాతి కప్పులు పగలడంతో ఇంట్లో ఉన్న ధాన్యం, వంట పాత్రలు, టీవీ ధ్వంసం అయ్యాయి. అంతేగాక ఈ ఘటనలో శంకర్‌రెడ్డి భార్య నేత్రావతికి నడుం భాగం, కుమారుడు ఆదర్శ (23)కు కుడి కాలు దెబ్బతింది. ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో రూ.4లక్షల నష్టం వాటిల్లడమే గాక తాము అద్దె ఇంట్లో తల దాచుకుంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. మార్కెట్ యార్డులో వ్యక్తి ఆత్మహత్యమదనపల్లె రూరల్ : మదనపల్లె మార్కెట్ యార్డులో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానిక మార్కెట్ యార్డులో సురేంద్ర(45) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. భిక్షాటన కూడా చేసేవాడు. కూలి డబ్బులతో అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ, మార్కెట్ యార్డ్ పరిసరాల్లోనే ఉండేవాడు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వెనుక వైపున గదిలో అతను ఉరి వేసుకుని ఉండటాన్ని స్థానికులు గమనించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిసుండుపల్లె : రోడ్డు ప్రమాదంలో షేక్ మహమ్మద్(26) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాయవరం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ తన అత్త తహషీన్ కుమారుడు అయిన షేక్ మహమ్మద్‌ను ఎంసెట్ పరీక్షకు ద్విచక్రవాహనంలో రాజంపేటకు తీసుకుని వెళ్లాడు. పరీక్ష అనంతరం తిరిగి సుండుపల్లెకు వస్తుండగా మార్గమధ్యంలో సానిపాయి–సుండుపల్లె ప్రధాన రహదారిలో కృష్ణారెడ్డిచెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న లగేజీ టెంపో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న షేక్ మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకవైపు కూర్చున్న యువకుడికి రక్త గాయాలయ్యాయి. మృతుని అన్న షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంబి.కొత్తకోట : మండలంలోని బయ్యప్పగారిపల్లె పంచాయతీ గట్టమీద దళితవాడకు చెందిన వరాలయ్య (60) సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబీకులు గుర్తించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యధోరణి తగదని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్‌రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ● వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకొని ఉత్తమ ర్యాంకులను సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సోమవారం ర్యాంకులు సాధించిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. -
జల్సాలకు అలవాటుపడి.. దారి దోపిడీలకు పాల్పడి..
కడప అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమ ధనార్జన కోసం ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కొని పోవడం, రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కొట్టి డబ్బు, నగలు దోపిడీ చేయడం వంటి నేరాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు(5 తులాలు), ఒక బుల్లెట్ మోటారు సైకిల్, ఒక కత్తి, 4 సెల్ ఫోన్లు, రూ.10200 నగదు కలిపి మొత్తం రూ.6,50,000 విలువ గల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కడప సబ్ డివిజన్ పరిధిలో కమలాపురం మెయిన్ రోడ్ వేదాస్ స్కూల్ దగ్గర సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ రోషన్ పర్యవేక్షణలో వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న, కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ తమ సిబ్బందితో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన చక్రకోళ్ల ప్రశాంత్ 13 కేసులలో నిందితుడిగా వున్నాడు. చాపాడు మండలం బద్రిపల్లెకు చెందిన పందిటి ఉదయ్ కుమార్ పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతనిపై జిల్లాలో 10 కేసులున్నాయి. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన దుంపల వినోద్ కూలిపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతను జిల్లాలో 23 కేసులలో నిందితుడిగా వున్నాడు. వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు పొందేందుకు దోపిడీలను మార్గంగా ఎంచుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లడం, ఒంటరిగా బైకుపై వెళ్లే వారిని బెదిరించి వారి వద్ద నుంచి నగలు, నగదు దోపిడీ చేయడం లాంటి నేరాలకు పాల్పడేవారు. నేరాలు చేసేందుకు వీరు వాడుతున్న బుల్లెట్ మోటార్ బైకును తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో డీ మార్ట్ వద్ద చోరీ చేసి తీసుకొచ్చారు. సోమవారం వారు ముగ్గురు నేరం చేసేందుకు మోటార్ బైకుపై వస్తుండగా కడప–కమలాపురం మార్గంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నేరాల వివరాలు ఇలా.. ● ఫిబ్రవరి 11న తేదీ వల్లూరు మండలం ఇ.కొత్తపల్లి గ్రామ సమీపంలో కాంతమ్మ అనే మహిళ మెడలో నుంచి 31.63 గ్రాముల పురి తిరిగిన బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. ● మార్చి 3వ తేదీన తిరుపతి కరకంబాడి రోడ్ లో ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను చోరీ చేశారు. ● ఏప్రిల్ 5వ తేదీన కడప–కమలాపురం మెయిన్ రోడ్ మదీనా కాలేజీ వద్ద కడప వైపు నుంచి టీవీఎస్ ఎక్స్‌ఎల్‌పై పాల డబ్బాలను పెట్టుకొని వస్తున్న వ్యక్తిని బలవంతంగా ఆపి బెదిరించి అతని వద్ద నుంచి ఐదు వేల రూపాయలు దోచుకున్నారు. ● కమలాపురం మండలం కోగటం గ్రామ సమీపంలో పొలాల వద్ద ఒక మహిళ మెడలో ఉన్న 4. 20 గ్రాముల సాదా బంగారు గొలుసును లాక్కెళ్లారు. ● వల్లూరు మండలం గోటూరు క్రాస్ దాటిన తరువాత ఓబాయపల్లి గ్రామ సమీపంలో ఆటోలోని వ్యక్తిని బయటికి లాగి అతని జేబులో ఉన్న 5200 రూపాయల నగదును బలవంతంగా లాక్కెళ్లారు. ఈ కేసులలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల సూచనలు.. తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని డీఎస్పీ కోరారు. పిల్లల మీద శ్రద్ధ చూపకపోతే వారి బంగారు భవిష్యత్తు పాడు కావడమే కాకుండా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరన్నారు. మహిళలు బయటకు వచ్చే సందర్భంలో తాము ధరించిన ఆభరణాలు కనిపించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. అనుమానితులు గ్రామ పరిసరాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముగ్గురు నిందితుల అరెస్టు నగలు, నగదు, బుల్లెట్ వాహనం స్వాధీనం నిందితులంతా చాపాడు మండల వాసులు విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడి -
బాధితులకు అండగా ఉందాం
రాయచోటి: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించి వారికి అండగా నిలుద్దామని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను వివరించి పాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రానికి రాలేని వికలాంగులు, ఇతర ప్రజలు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో వినతులు అందిస్తే తదుపరి చర్యలు చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు. నూతన నియామకంకడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రాయచోటికి చెందిన షేక్ కరమల హరూన్‌బాషా, స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రాజంపేటకు చెందిన గాలివీటి వీర నాగిరెడ్డి, స్టేట్ దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా రాజంపేటకు చెందిన దారా సుధాకర్‌లను నియమించారు. 34 మంది పోలీసుల బదిలీరాయచోటి : జిల్లాలో 34 మంది పోలీసులకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. జిల్లాలో నలుగురు ఏఎస్ఐలు, 13 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 17 మంది పోలీసులు స్థానచలనం కల్పించిన వారిలో ఉన్నారు. ఉత్తర్వులు అందుకున్న వారు ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలను చేపట్టాలని ఎస్పీ ఆదేశించినట్లు పోలీసు వర్గాల సమాచారం. ప్రశాంతంగా ప్రారంభమైన పది సప్లిమెంటరీ పరీక్షలు రాయచోటి : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ప్రైవేట్ అభ్యర్థులకు సంబంధించి 1365 మందికి 961 మంది హాజరుకాగా 404 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్‌స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష నిర్వహణపై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. -
వంగపంటకు గిట్టుబాటు ధర ఏదీ..
జిల్లాలో వంగపంట సాగు విస్తీర్ణం : 2450 ఎకరాలు సాగు చేసే రైతులు : 1810 సాగుకు అయిన ఖర్చు : రూ.19.60కోట్లు ఈ ఏడాది పంట నష్టం : రూ. 16కోట్లు ఈ ఏడాది వంగ పంట సాగు చేసిన రైతులకు బెంగే మిగిలింది. జిల్లాలో ఈ సీజన్లో 1810 మంది 2450 ఎకరాల్లో వంగ పంట సాగు చేశారు. నారు మొక్కల నుంచి దుక్కులు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చు కలుపుకొంటె ఎకరం పంట సాగుకు రూ. 70 వేలు నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వంగ ధర రూ.10 వరకు ధర పలుకుతోంది. జిల్లాలో సాగు చేసే వంగను ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తుంటారు. కోతకులీలు, రవాణాఖర్చులు, కమీషన్లు లెక్కిస్తే ఏమీ మిగలడంలేదని, పంటసాగు భారంగా మారుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ఇదీ సీజన్లో కిలో వంగ మార్కెట్లో రూ.20 నుంచి రు.30 వరకు ధరలు పలికాయి. ప్రస్తుతం తమిళనాడులో వంగ సాగు అక్కడి మార్కెట్లకు ఎక్కువగా వస్తుండడంతో పాటు డిమాండ్ తక్కువగా ఉండడంతో వంగ ధరలు పతనమయ్యాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది జిల్లాలో వంగసాగు చేసిన రైతులకు రూ.16కోట్లు మేరకు పంట నష్టం వాటిల్లింది. -
గోపవరం ఉప సర్పంచ్ పదవి వైఎస్సార్సీపీకే
ప్రొద్దుటూరు రూరల్ : ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఆ పదవి వైఎస్సార్సీపీకే దక్కింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు. సర్పంచ్‌తో పాటు మొత్తం 20 మంది వార్డు మెంబర్లు ఉండగా వైఎస్సార్సీపీ తరపున 14 మంది వార్డు మెంబర్లు హాజరయ్యారు. సర్పంచ్ మోషాతోపాటు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలిపి ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఉప సర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని బీరం రాఘవేంద్రారెడ్డికి అందించారు. డీఎస్పీ భావన ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు. 8వ వార్డు అభ్యర్థి వైఎస్సార్సీపీకే మద్దతు వైఎస్సార్సీపీ తరపున విజయం సాధించిన 8వ వార్డు మెంబర్ గాయత్రి గతంలో టీడీపీలో చేరారు. మార్చి నెలలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించినప్పుడు కూడా ఆమె టీడీపీ తరపునే ఉన్నారు. అనూహ్యంగా సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో గాయత్రి వైఎస్సార్సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలపడం విశేషం. సంబరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఒత్తిళ్లకు గురి చేసినా, ప్రలోభాలకు లొంగకుండా వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన వార్డు సభ్యులను అందరూ ప్రశంసిస్తున్నారు. -
పశుగ్రాసంగా టమాటాలు
జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం : 13800 ఎకరాలు సాగు చేసే రైతులు : 12800 సాగుకు అయిన ఖర్చు : రూ.465కోట్లు ఈ ఏడాది పంట నష్టం : రూ. 325కోట్లు జిల్లాలో ప్రస్తుతం 12800 మంది రైతులు 14800 ఎకరాల్లో టమాటా పంట సాగు చేసారు. పంటసాగు కొసం ఇప్పటికే రూ.465 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈసీజన్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో రూ.325 కోట్ల మేరకు నష్టపోయారు. మార్కెట్లో ప్రస్తుతం 25కేజీల టమాట క్రీట్ ధర రూ.150లోపే ధర పలుకుతోంది. సగటున సరాసరి కిలో రూ.5లోపే ధర ఉంది. ఒక ఎకరం పంట సాగుకు రూ. 2లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో మార్కెట్‌కు టమాటాలను చేర్చేవరు అయ్యే ఖర్చు కుడా రైతులకు మిగలడం లేదు. కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు, జాక్పాట్లు కలుపు కొంటే మార్కెట్‌కు టమాటాలను తీసుకొచ్చే రైతులకు తమ చేతి నుంచే అదనపు ఖర్చు వస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. పలువురు నాలుగు కోతలు కోసిన తర్వాత పంటను అలాగేే పొలంపై వదిలేస్తున్నారు. దీంతో పలుచోట్ల టమాటా పంట పశుగ్రాసంగా మారిపోతోంది. -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
రాయచోటి: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో పదోతరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసినట్లైతే వారికి ఆ సర్టిఫికెట్‌పై సప్లిమెంటరీగా నమోదయ్యేది. అయితే ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో 4817 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరో తొమ్మిది కేంద్రాల్లో 2920 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 24 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సైతం ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పదోతరగతితోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరవుతారు. జిల్లాలో 2920 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు పదోతరగతికి 4, ఇంటర్మీడియట్‌కు 5 సెంటర్ల వంతున పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. అధికారుల నియామకం: జిల్లాలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు వివిధ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. అదే విధంగా ఓపెన్ స్కూల్‌కు సంబంధించి మరో తొమ్మిది మంది అధికారులను కేటాయించారు. పరీక్షల నిర్వహణకు 250 మంది ఇన్విజిలేటర్లను అధికారులు నియమించారు. ఐదు ప్లైయింగ్ స్క్వాడ్లు, పది స్క్వాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ● మార్చి 19వ తేది నుంచి పదోతరగతి విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్షలలో వివిధ సబ్జెక్టులలో 4817 మంది ఉత్తీర్ణత సాధించలేదు. వీరితోపాటు గతంలో ఉత్తీర్ణత సాధించని వారికి ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించారు. ● జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ● పరీక్ష రాయనున్న 4817 మంది విద్యార్థులు ● ఓపెన్ స్కూల్ పరీక్షలకు మరో 9 కేంద్రాలు ప్రత్యేక తరగతులుగత ఏడాదిలాగానే పదోతరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేత తరగతులు నిర్వహించి వారు ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. జిల్లాలోని ఆయా సబ్జెక్టులకు చెందిన ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులను తీసుకొని తప్పిన విద్యార్థులను పరీక్షలకు సమాయాత్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని మెళకువలను నేర్వారు. పరీక్షల విభాగం వారు హాల్ టికెట్లు ఆయా పాఠశాలలకు పంపించగా ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు తీసుకున్నాం. విద్యుత్, రవాణా, రెవెన్యూ, హెల్త్ తదితర శాఖల అధికారుల సహకారంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చాం. –సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి, అన్నమయ్య జిల్లా -
దళిత విద్యార్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఓబులవారిపల్లె : తిరుపతి విద్యానికేతన్‌లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న జేమ్స్ అనే దళిత విద్యార్థిపై అగ్రవర్ణాల విద్యార్థులు సాయి, రూపేష్‌లు దాడి చేయడం అమానుషమని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోలంరెడ్డి మల్లికార్జున అన్నారు. ఆదివారం చిన్నఓరంపాడులో విలేకరులతో మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు జేమ్స్‌పై విచక్షణా రహితంగా దాడిచేసి కట్టేసి కొట్టి మూత్రం పోసిన దారుణమైన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. దళిత విద్యార్థికి న్యాయం జరగని పక్షంలో తిరుపతి ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి ధర్నా చేస్తామన్నారు. ఈ సమావేశంలో భారత బహుజన రాష్ట్ర నాయకుడు కె. లక్ష్మీనారాయణ, ఎం.శ్రీను, దళిత నాయకుడు మన్యం బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)– 2025 నేటి నుంచి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ(బైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, అలాగే మధ్యాహ్న సెషన్ 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. రెండు సెషన్స్‌లో పరీక్ష.. ఉదయం సెషన్‌కు సంబంధించి 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 12.30 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష జరిగే రోజు కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. విద్యార్థులు వెంట తీసుకురావాల్సిన వస్తువులు.. ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్ –2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీతో పొందుపర్చిన నిర్ణీత బాక్స్‌లో విద్యార్థి కలర్ పాస్ పోర్టు సైజ్ ఫొటోను అతికించి సంబంధిత కళా శాల ప్రిన్సిపాల్‌తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు. గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర ఏ వస్తువులు అనుమతించరు. ● విద్యార్థి ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీ పై పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేయాలి. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఏర్పాట్లను సిద్ధం చేసిన అధికారులు 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు -
నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం
కడప కార్పొరేషన్ : కడప నగరం మద్రాసు రోడ్డులోని డాక్టర్ వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో లీజుకు ఉన్న వ్యాపారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగించడం అన్యాయమని మేయర్ సురేష్ బాబు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి నగరపాలక అధికారులు తొలగించిన షాపులను పరిశీలించి, వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. మహిళలని చూడకుండా అనంతపురం, వైజాగ్, గుంటూరు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారని, హత్యలు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి రెడ్‌బుక్ పాలన పాలన సాగిస్తున్నారని, 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి అరాచక పాలన లేదన్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే కడపలో మరొక ఎత్తుగా ఉందన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి గొంతునొక్కే విధంగా కక్ష సాధిస్తున్నారన్నారు. నగర ప్రథమ పౌరుడినైన తన ఇంటిపైనే చెత్త వేయించారని, ప్రశ్నించే వారు ఉండకూడదని వారి నోరు నొక్కేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో 10 గదులు ఉన్నాయని, 2007లో వీరంతా బహిరంగ వేలంలో రూ.7.50 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్నారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వ్యాపారం జరిగినా, జరక్కపోయినా, కోవిడ్ సమయంలోనూ బాడుగ చెల్లిస్తూ ఉన్నారన్నారు. వీటిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డికి కూడా ఒక గది ఉందని, ఆయన్ను లక్ష్యంగా చేసుకొని అందరి షాపులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. గదుల పక్కనే కార్పొరేషన్ నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్లు, ఉర్దూ పాఠశాల ప్రహరీ వీటికంటే ముందుకు ఉన్నాయని మీడియాకు చూపారు. వ్యాపారులు ట్రేడ్‌లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఎన్‌క్రోచ్‌మెంట్ ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ ఆక్రమణల పేరిట తొలగించడం అన్యాయమన్నారు. కడపలో ముడుపులు చెల్లించలేదని వెంచర్లను నిషేధించారని, గతంలో ఏడాదికి 3వేలకు పైగా ప్లాన్ అప్రూవల్స్ అయ్యేవని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దానికి కప్పం కట్టాల్సి రావడం వల్లే ఈ ఏడాది 500 అప్రూవల్స్ కూడా కాలేదన్నారు. నగరపాలక అధికారుల వల్ల నష్టపోయిన వ్యాపారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వారికి నష్ట పరిహారం ఇప్పించడానికి న్యాయ పోరాటం చేస్తామన్నారు. నాపై ఉన్న కక్షతో ఇతరుల జీవనోపాధి దెబ్బతీయడం దారుణం– జయచంద్రారెడ్డి తనపై కక్ష ఉంటే నా గదులు మాత్రమే తొలగించాలిగానీ, పక్కనున్నవారి షాపులు కూడా తొలగించి వారి జీవనోపాధి దెబ్బతీయడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 60 అడుగుల రోడ్డు ఉంది, నాగులపుట్ట, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయ్లెట్లు, పాఠశాల ప్రహరీ కంటే లోపలే షాపులు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేసే వారి గొంతు నొక్కాలనే ఇలా చేశారన్నారు. సాయంత్రవేళ అంగళ్లన్నీ మూసిన తర్వాత కూల్చివేయడం అన్యాయమన్నారు. సూర్యనారాయణ వల్లే తాను కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నానే తప్పా, వారిలాగా వేరే పార్టీ కండువా కప్పుకోలేదన్నారు. ఆడిటోరియం బయట, నెహ్రూపార్కు బయట ఉన్న షాపుల వద్ద సూర్యనారాయణరావు డబ్బులు వసూలు చేశాడన్నది అక్షర సత్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, యానాదయ్య, శ్రీరంజన్‌రెడ్డి, బీహెచ్ ఇలియాస్, ఐస్‌క్రీం రవి, త్యాగరాజు, దేవిరెడ్డి ఆదిత్య, సింధు, దాసరి శివ, షఫీ, రామ్మోహన్‌రెడ్డి, బసవరాజు, సుబ్బరాయుడు, శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, కె. బాబు, చెన్నయ్య, రెడ్డి ప్రసాద్, లక్ష్మయ్య పాల్గొన్నారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఒక్కొక్కరికి రూ.2లక్షల మేర నష్టం వ్యాపారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది రాష్ట్రమంతా ఒక రకమైన పాలన.. కడపలో మరో రకమైన పాలన మేయర్ సురేష్ బాబు మండిపాటు -
గంగమ్మా.. చల్లంగా చూడమ్మా.
లక్కిరెడ్డిపల్లి: చల్లంగా చూడమ్మా..గంగమ్మా అంటూ అనంతపురం గంగమ్మను భక్తులు వేడుకున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు.తలనీలాలు అర్పించారు. ఆలయ పూజారులు అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు జరిపారు.పూజల అనంతరం భక్తులక తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడ్స్ రహిత సమాజం నిర్మిద్దాం రాయచోటి టౌన్: ఎయిడ్స్ రహిత సమాజం నిర్మించేందుకు అందరం కలసి కట్టుగా పని చేద్దామని జిల్లా అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ శైలజ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి రాయచోటిలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రి నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవీ పట్ల ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వం అందించే సేవలను, వాటి ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజా చైతన్య సేవా సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ చెన్నారెడ్డి డీఏపీసీయూ సిలార్ సాబ్, జిల్లా క్షయనివారణ సూపర్వైజర్ గంగన్న, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలి
కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కోరారు. ఆదివారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చట్టం చేసేలోపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్ది మాల, మాదిగ వర్గాలకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంతి రేవంత్‌రెడ్డి వర్గీకరణ అంశానికి సంబంధించి సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య, ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గొడుగునూరు మునెయ్య, తప్పెట హరిబాబు, మాతంగి సుబ్బరాయుడు, తప్పెట శివ, వెంకటసుబ్బయ్య, కొన్నెపల్లె మునెయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలి
మదనపల్లె సిటీ : పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఇష్టం వచ్చిన మీడియంను ఎంచుకునే విధంగా పాఠశాలల్లో తెలుగు మీడియంను ఇంగ్లీషు మీడియంకు సమాంతరంగా పునః ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షన్‌కు అనుమతించాలన్నారు. ఈనెల 21వతేదీన పాత జిల్లా కేంద్రంలో జరగబోయే డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు పురం రమణ, ఆదినారాయణ, నాయకులు విజయకుమార్, సుధాకర్, రవిప్రకాష్, మురళి, అజంతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో అవ్వ, మనవడు దుర్మరణం
కలసపాడు : మండలంలోని సింగరాయపల్లె గ్రామానికి చెందిన యంబడి సౌరమ్మ (45), తలారి జశ్వంత్ (15) కలసపాడు సమీపంలోని ఐటీఐ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సౌరమ్మ, ఆమె మనుమడు జశ్వంత్ సింగరాయపల్లెలో మూడు రోజులు జరిగే తిరునాలకు సరుకులు తీసుకువచ్చేందుకు కలసపాడుకు వెళ్లారు. సరుకులు తీసుకుని స్వగ్రామానికి వస్తుండగా కలసపాడు సమీపంలోని ఐటీఐ వద్ద చెన్నుపల్లె నుంచి గొర్రెల లోడుతో వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. సౌరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు జశ్వంత్‌ను కలసపాడులోని ఓ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. మృతదేహాలను పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుర్తుతెలియని వృద్ధుడి మృతి పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక వైఎస్సార్ సర్కిల్ సమీపంలోని వెంకటేశ్వర వైన్స్ ముందు శనివారం సాయంత్రం గుర్తు తెలియని వృద్ధుడు(70) మృతి చెందాడు. ఇతను గత కొంత కాలంగా ఈ ప్రాంతంలో యాచన చేస్తూ తిరుగుతుండేవాడు. మద్యం కోసం వైన్ షాపు వద్దకు వెళ్లి మద్యం తీసుకొని వర్షం వస్తుండడంతో అక్కడే నిలబడ్డాడు. ఉన్నట్లుండి కుప్పకూలి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఈత సరదాకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి
కలికిరి : ఈత సరదాకు కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి బలైన దుర్ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జేఎన్టీయూ కళాశాల నుంచి శనివారం మధ్యాహ్నం సుమారు పది మంది విద్యార్థులు కళాశాల సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు ఈతకెళ్లారు. ఈత వచ్చిన వారు ఈత ఆడుతుండగా ఈత రాని వారు గట్టుపై కూర్చుని చూస్తున్నారు. ఈ క్రమంలో సివిల్ ఇంజిరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన సూర్యనారాయణ కుమారుడు చింతా రాకేష్(18) ఈతకు పై నుంచి దూకాడు. దీంతో పూడిక మట్టిలో ఇరుక్కుపోయాడు. గమనించిన స్నేహితులు కాపాడటానికి ప్రయత్నించినా ఉపయోగం లేక పోవడంతో కళాశాలకు వెళ్లి అధ్యాపకులకు, సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారు పోలీసులకు సమాచారం అందజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు పీలేరు అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సాయంతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ మదన్మోహన్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువు... జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల పట్ల పర్యవేక్షణ కరువవ్వడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు నిత్యం కళాశాల బయటకు వెళ్తూ వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్నారు. రాత్రి సమయాల్లోనూ ఇలాగే జరుగుతోందని, సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బందిపై మండిపడ్డారు. గతంలోనూ ఇలా ఓ విద్యార్థి ఈతకెళ్లి మృతి చెందినా కళాశాల అధికారులకు కనువిప్పు కలగలేదని చెప్పారు. -
నిరంకుశత్వం, కక్ష సాధింపే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో నిరంకుశత్వం, కక్ష సాధింపే లక్ష్యంగా రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి లక్ష్యంగా వారిపై కేసులు పెట్టేందుకు గత ప్రభుత్వం నిర్వహించిన మద్యం పాలసీని సాకుగా చూపుతున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సంబంధం లేని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహరెడ్డి, బాలాజీ, రాజ్కసిరెడ్డిలను అరెస్టు చేసి వారివద్ద బలవంతపు వాంగ్మూలాలు తీసుకొంటున్నారని ఆరోపించారు. సీఐడీని పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సిండికేట్‌గా మారి విచ్చల విడిగా బెల్ట్ షాపుల ద్వారా దోచుకొంటున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారానే నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చామన్నారు. ఇవేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు చూస్తే ఆటవిక, అరాచక పాలన నడుస్తోందని అర్థమవుతోందన్నారు. కొత్త పథకాలు ఇవ్వక పోగా ఉన్న పథకాలు ఆపేసి దోపిడీలు, దౌర్జన్యాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, జిల్లా యువజన అధ్యక్షుడు శివారెడ్డి, మందల నాగేంద్ర, తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బండారుమల్లి, డీవీరమణ, దామర్ల సిద్దయ్య, వెంకటరెడ్డి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
హెచ్‌వీఐ బాధితులకు అండగా.!
మదనపల్లె సిటీ : కౌన్సెలింగ్‌తో హెచ్ఐవీ బాఽధితులకు మనోధైర్యం కల్పిస్తున్నారు. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (శాక్స్) వ్యాధి నివారణకు నివారణ చర్యలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ సెంటర్లు(ఐసీటీసీ)లు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది మే మూడవ ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో చనిపోయిన వారిని మేము గుర్తుంచుకుంటాం, మేము మాట్లాడుతాం, మేము నడిపిస్తాం అనే నినాదం ఇచ్చారు. వ్యాధితో మృతి చెందిన వారికి ఆత్మశాంతి కలగాలని కోరుతూ క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పిస్తారు. హెచ్ఐవీ/ఎయిడ్స్‌తో బాధపడుతున్నవారికి ఏఆర్టీ (యాంటీ రిట్రోవైరల్) కేంద్రాలు అండగా నిలుస్తున్నాయి. ఆత్మసైర్థ్యాన్ని నింపేలా కౌన్సెలింగ్‌ను ఇవ్వడంతో పాటు అవసరమైన మందులను అందిస్తున్నారు. జిల్లాలో మదనపల్లెలో ఏఆర్టీ కేంద్రం ఉంది. దీంతో పాటు రాయచోటి, పీలేరు ఏఆర్టీ ప్లస్, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, వాల్మీకిపురం, రాజంపేట, లక్కిరెడ్డిరెడ్డి, రైల్వేకోడూరులలోని ప్రభుత్వ సీహెచ్సీలలో లింక్ ఏఆర్టీ కేంద్రాలున్నాయి. ఆయా ఐసీటీసీ కేంద్రాల్లో నిర్వహించే రక్తపరీక్షల్లో హెచ్ఐవీ పాజిటివ్ ఉందని తెలితే వారికి కౌన్సెలింగ్ ఇస్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. వారందరిని ఏఆర్టీ కేంద్రాల్లో నమోదు చేసి మందులు అందజేస్తారు. నేషనల్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలు పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో వ్యాధిని రూపుమాపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. హెచ్ఐవీ వచ్చాక బాధపడేకన్నా దాని బారిన పడకుండా చూసుకోవాలని పలు కార్యక్రమాలతో చైతన్యం పెంచుతున్నారు. ముందు జాగ్రత్తనే అసలైన మందు అనే విషయాన్ని వివరిస్తున్నారు. గతంతో పోలిస్తే బాధితులకు మందులు సకాలంలో అందిస్తుండటంతో ఆరోగ్యం మెరుగవుతోంది. ఏటా పరీక్షల సంఖ్యను పెంచుతూ పాజిటివ్ కేసులను గుర్తిస్తున్నారు.హెచ్ఐవీ పాజిటివ్ గల గర్భిణికి ముందుగా పీపీటీసీటీ చికిత్స అందిస్తూ పుట్టబోయే బిడ్డను ఎయిడ్స్ నుంచి కాపాడే ప్రయత్నాలు జిల్లాలో జరుగుతున్నాయి. అవగాహన కల్పిస్తున్నాం.. జిల్లాలో తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు గుర్తించి ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం. కళా బృందాలతో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాధితులకు అండగా నిలుస్తున్నాం. వారికి మనోధైర్యం కల్పిస్తున్నాం. ఆదివారం సాయంత్రం అన్ని ప్రభుత్వ ఆస్పత్రులో క్యాండిల్స్ వెలిగించి మరణించిన వారి ఆత్మశాంతి కోసం నివాళులు అర్పిస్తాం. – డాక్టర్ శైలజ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ అధికారి, రాయచోటి కౌన్సెలింగ్‌తో మనోధైర్యం ఉచితంగా మందులు పంపిణీ నేడు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం ఐసీటీసీ కేంద్రాలు మదనపల్లె, పీలేరు, వాల్మీకిపురం, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, లక్కిరెడ్డిపల్లె, రైల్వేకోడూరు ఏఆర్టీ కేంద్రం మదనపల్లె -
ఆక్రమణల పేరు చెప్పి అరాచకం
కడప కార్పొరేషన్ : కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి ఆదేశాలతో కడప నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆక్రమణల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా వారి ఆర్థిక మూలలను దెబ్బతీసే పనిలో ఎమ్మెల్యే, వారి అనుచరులు నిత్యం నిమగ్నమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టి విమర్శించారు. 24వ డివిజన్ కార్పొరేటర్ కె. సూర్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డిలపై ఆరోపణలు చేశారు. అలా మాట్లాడిన మరుసటి రోజే మద్రాసు రోడ్డులో నగరపాలక సంస్థకు చెందిన వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో ఆక్రమణలున్నాయంటూ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఉసిగొల్పి కూల్చివేశారు. సదరు వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో రెండు గదులను జయచంద్రారెడ్డి లీజుకు తీసుకొని ఉండటం గమనార్హం. షాపింగ్ కాంప్లెక్స్ లీజుకు ఉన్నవారంతా వర్షం పడకుండా, వర్షపునీరు షాపు ముందు నిలబడకుండా, షాపులోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా రేకులు అమర్చుకొని, ముందువైపు తాపలు, ర్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవన్నీ పర్మినెంట్ స్ట్రక్చర్స్ కాదు. ముఖ్యంగా మున్సిపల్ ఉర్దూ బాలుర హైస్కూల్ ప్రహరీ, మున్సిపల్ స్డేడియం పక్కన నగరపాలక సంస్థ నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్లు వీటికంటే ముందుకు ఉన్నా....టౌన్‌ప్లానింగ్ అధికారులు వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తాత్కాలిక నిర్మాణాలన్నీ విద్యుత్ స్తంభాలకు లోపలే ఉన్నప్పటికీ కూల్చివేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్‌లో తాత్కాలిక నిర్మాణాల తొలగింపు ఎమ్మెల్యేకు, ఫిరాయింపు కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు కక్ష సాధింపు -
ప్రాణం తీసిన పిడుగు
కురబలకోట : MýS$Æý‡-º-ÌS-Mør Ð]l$…yýlÌS… A…VýS-â¶æ$ÏÌZ Ôèæ°-ÐéÆý‡… Æ>{† í³yýl$VýS$ ´ër$ C§ýlªÇ {´ë×êÌS¯]l$ ºÍ-¡çÜ$-MýS$…-¨. D ÑÚë-§ýl-MýSÆý‡ çÜ…çœ$-r-¯]lMýS$ çÜ…º…«-«¨…_ ÝëŠి-£ýl²-MýS$ÌS MýS£ýl¯]l… Ðól$Æý‡MýS$...-Ôèæ-°-ÐéÆý‡… Æ>{† Hyýl$ VýS…rÌS {´ë…™èl…ÌZ MýS$Æý‡-º-ÌS-Mør Ð]l$…yýlÌS…ÌZ° A…VýS-â¶æ$ÏÌZ EÆý‡$-Ð]l¬Ë$ Ððl$Æý‡$-ç³#-ÌS™ø MýS*yìl¯]l Ð]lÆý‡Û… ç³yìl…¨. A…VýSâ¶æ$Ï rÐ]l*-sê Ð]l*Æð‡P-sŒæÌZ K Ð]l$…yîlÌZ Rê§ýlÆŠ‡ Ð]lÎ (41) OÆð‡r-ÆŠ‡V> ç³°-^ól-õÜ-Ðéyýl$. C™èl-°¨ Ð]l$§ýl-¯]lç³ÌñæÏ §ýlVýSYÆý‡ MøâýæÏO»ñæË$ M>ÌS-±. A…VýSâ¶æ$Ï Ð]l*Æð‡P-sŒæÌZ rÐ]l*-sê-ÌS¯]l$ ÌZyýl$ ^ólƇ$$çÜ*¢ §ýlVýSY-Æý‡$¯]l² ^ðlr$t MìS…§ýl E…yýlV> í³yýl$VýS$ ç³yìl…¨. ©…™ø JMýSP-Ýë-ÇV> BĶæ$¯]l MìS…§ýlç³-yìl-´ùĶæ*yýl$. A™èl°² º†-MìS…-^èl-yé°MìS Ý린-MýS$Ë$ ÑÔèæÓ-{ç³-Ķæ$™èl²… ^ólÔ>Æý‡$. BçÜ$ç³-{†MìS BsZÌZ ™èlÆý‡-ÍçÜ$¢…yýlV> ^èl°-´ù-Ķæ*Æý‡$. A§ól çÜÐ]l$-Ķæ$…ÌZ rÐ]l*-sê Ð]l*Æð‡PsŒæMýS$ Ð]l$Æø OÐðlç³# çÜÒ$-ç³…ÌZ° K sîæ ÝëtÌŒæÌZ sîæ ™éVýS-yé-°MìS Ð]l_a¯]l Ð]l$…yýl-ÌS…ÌZ° ™èl$…V>-ÐéÇ-ç³-ÌñæÏMýS$ ^ðl…¨¯]l ¯éĶæ$ç³# {MìSçÙ~ç³µ (60) MýS*yé í³yýl$VýS$ ´ër$MýS$ E¯]l²-r$Ï…yìl MìS…§ýl-ç³yìl ´ùĶæ*yýl$. BĶæ$¯]l MýS*yé °Ñ$ÚëÌS Ð]lÅÐ]l-«¨ÌZ ^èl°´ù-Ķæ*yýl$. C™èl¯]l$ AÑ-Ðéíßæ-™èl$yýl$. JMóS çÜÐ]l$Ķæ$…ÌZ ÐólÆó‡ÓÆý‡$ {´ë…™é-ÌSMýS$ ^ðl…¨¯]l C§ýlªÆý‡$ í³yýl$VýS$-´ër$MýS$ Ð]l$–† ^ðl…§ýlyýl… ¡{Ð]l ÑÚë-§é°² MýSÍ-W…-_…-¨. అంగళ్లులో ఇద్దరి మృతి -
ఉత్సాహంగా క్యారమ్స్ పోటీలు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో శనివారం క్యారమ్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బాలికల విభాగంలో ప్రశాంతి ప్రథమ, దేవిశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో అండర్ 11 పోటీలలో రెమంత్ ప్రథమ, అబ్దుల్‌ఖాదర్ ద్వితీయ స్థానంలో, అండర్ 14 విభాగంలో రంగనాథ్ ప్రథమ, ద్వారకనాథ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆబిద్ ప్రథమ, జశ్వంత్ ద్వితీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ శ్రీనివాసులు, హ్యాండబాల్ కోచ్ మునాఫ్, బాడ్మింటన్ కోచ్‌లు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి పెద్దతిప్పసముద్రం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన బెట్టిన చంద్రబాబు రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ కుయుక్తులు పన్నుతున్నారని మండి పడ్డారు. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెర లేపుతున్నారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు రిటైర్డ్ అధికారుల మీద కూడా కక్ష గట్టి తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించిన వారే ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారన్నారు. పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడం వల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ ఈడీల దర్యాప్తులో చంద్రబాబు స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుకు వెళితే ఇదంతా కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయించాడని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కక్ష పూరిత చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. బాలిక అదృశ్యం పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లుకు చెందిన ఓ మైనర్ బాలిక (16) ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఊళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. మాటలకే స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర – ఎగువ అబ్బవరం కాలనీలో తొలగని మురుగునీరు రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెత్తరహిత ప్రాంతాలుగా మార్చాలని చెబుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వీధులు మినహా మిగిలిన వీధులలో ఎక్కడికి వెళ్లినా బురదమయమైన రహదారులు ముక్కుపుటాలు అదిరే దుర్గంధం వెదజల్లే చెత్తకుప్పలు కనిపిస్తాయి. శనివారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ మున్సిపల్ అధికారులు కలిసి స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగువ అబ్బవరం కాలనీ(33వ వార్డు)లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్వచ్ఛ ఆంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు. కాలనీలోని రోడ్లు చెత్తా చెదారం, మురికినీటితో నిండిపోయాయని ఆ వార్డు ప్రజలు వాపోతున్నారు. అబ్బవరం కాలనీలో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేక పోతున్నామని చెబుతున్నారు. వర్షం వస్తే మురుగునీటి కాలువలు లేక మురుగునీరు రోడ్ల మీదనే ప్రవహిస్తుంది. మలేరియా లాంటి వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తహసీల్దార్ లింగాల : లింగాల మండల తహసీల్దార్‌గా 2022 నుంచి 2024 వరకు పనిచేసిన లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసులు అందుకున్నారు. 20 ఏళ్ల కాల పరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో 2003 సంవత్సరానికి ముందు ఉన్న భూములను చేయాల్సి ఉంది. అయితే లక్ష్మీనారాయణ 2024–25 సంవత్సర భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేశారని విచారణలో తేలింది. మండలంలోని లోపట్నూతల, లింగాల, కామసముద్రం గ్రామాల్లోని 76 ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రస్తుత తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. పశువులు మేపుకునేందుకు వెళ్లి.. – పిడుగుపాటుకు వ్యక్తి మృతి చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడి బాలాయపల్లె సుబ్బ రమణయ్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని దళితవాడకు చెందిన బాలాయపల్లె సుబ్బరమణయ్య అలియాస్ సుబ్రమణ్యం శనివారం సాయంత్రం గేదెలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోని స్మశానవాటిక దగ్గర ఉండే పొలాల్లోకి వెళ్లాడు. ఇతనితో పాటు సమీపంలో మరికొంత మంది మహిళలు గేదెలను మేపుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను పడిపోయిన స్థలం వద్ద పశువులన్నీ గుంపుగా ఉండటంతో గుర్తించిన సమీపంలోని మహిళలు అతని వద్దకు వెళ్లారు. వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఆదిలక్ష్మితో పాటు యుక్త వయస్సుకు వచ్చిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగు పాటుకు సుబ్బరమణయ్య మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
‘స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర’ పకడ్బందీగా నిర్వహించాలి
రాయచోటి: 17న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ప్రతి నెల మూడో శనివారం నిర్వహించాల్సిన స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణ, తాగునీరు, ఉపాధి హామీ, పల్లె పండుగ పనుల ప్రగతిపై అధికారులతో వీసీ నిర్వహించారు. జిల్లాను చెత్త రహితంగా రూపొందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. ● ప్రభుత్వం బదిలీలకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులల్లో మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా బది లీలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ● జిల్లాలో తాగునీటి ఎద్దడి ఎక్కడా రానివ్వకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. నీటి కొరత సమస్యను ముందుగానే గుర్తించి అవసరమైన ప్రతిచోట ట్యాంకర్లు ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. ● ఉపాధిహామి పనులను కూడా పటిష్టంగా అమలు చేయాలన్నారు. లేబర్ మొబిలైజేషన్లో భాగంగా ప్రతి కుటుంబానికి వందరోజుల పని తప్పనిసరిగా కల్పించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వ్యాసరచనతో పిల్లలలో సృజనాత్మకత వ్యాసరచన వల్ల పిల్లల్లో సృజనాత్మకత, సమాజంపట్ల అవగాహన పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ద హీట్ అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలకు కలెక్టర్ సర్టిఫికెట్లు, మెమెంటోలను, పాఠ్యపుస్తకాలను అందజేశారు. పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఈనెల 15న పోటీలు నిర్వహించామని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. వ్యాసరచనలో ఐదుగురికి, చిత్రలేఖనంలో ఐదుగురికిబహుమతులు అందజేసినట్లు చెప్పారు. వ్యాసరచన పోటీల్లో రాయచోటి జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన నికిత రెడ్డి, చిత్రలేఖనంలో రాయచోటి జడ్పీహెచ్ఎస్కు చెందిన భవ్య ప్రథమ బహుమతులు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ శివప్రకాష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
21న జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
కడప సెవెన్‌రోడ్స్: ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయని ఆమె పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, కడప, అన్నమయ్య జిల్లాల అధికారులు హాజరు కావాలని కోరారు. 20న ఉద్యోగమేళా రాయచోటి టౌన్: రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఈ నెల 20వ తేదీ ఉదయం 9గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఏ. సురేష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో హెడీఎఫ్సీ బ్యాంక్, జప్టో, టాటా ఏఐఏ, ఎస్బీఐ కార్‌ుడ్స, పేటీఎం, సూపర్ కె, ఏఐఎఎల్ డిక్స్‌న్,మూత్తూట్ ఫైనాన్స్, నియోలైక్, డాయికిన్, యంగ్ ఇండియా వంటి కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని ఎంపికలు నిర్వహిస్తారని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు పాల్గొనవచ్చన్నారు. మరిన్ని వివరాల కోసం 88977 76368 నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. సంగీతంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణానికి చెందిన సీఎస్ఐ జెసీఎం చర్చి ఫాఽస్టర్ సునీల్వరకుమార్ భార్య లూసీమేరి, సభ్యులు కళ్యాణి, ప్రసన్న, రంజితలకు సంగీతంలో గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. విజయవాడకు చెందిన హల్లెల్ సంగీత పాఠశాల వ్యవస్థాపకులు పాస్టర్ ఆగస్టీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత పోటీల్లో పాల్గొన్నారు. 2024 డిసెంబర్ 1న జరిగిన పోటీల్లో 18 దేశాలకు చెందిన 1,090 మంది పాల్గొన్నారు. వీరిలో 1046 మంది గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. పాస్టర్ ఆగస్టీన్ చేతుల మీదుగా ధ్రువపత్రాలు అందుకున్నట్లు చర్చి నిర్వాహకులు తెలిపారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సాధించిన వీరిని చర్చి సభ్యులతో పాటు పలువురు అభినందించారు. పశువైద్య కళాశాలకు వీసీఐ బృందం ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ సమీపంలో ఉన్న పశువైద్య కళాశాలను వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) బృందం ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు పరిశీలించింది. వీసీఐ పరిశీలకులు డాక్టర్ విజయకుమార్, డాక్టర్ సాహత్పురే కళాశాలలోని వివిధ విభాగాలు, పశుచికిత్సాలయం, పశుగణక్షేత్ర సముదాయాలు, విద్యార్థుల వసతి గృహాలు, క్రీడా విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులతో సమావేశమై వారి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎక్జామినేషన్ డాక్టర్ వి.చెంగల్వరాయులు, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాస ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. హంద్రీ– నీవా లైనింగ్ పనులను వేగవంతం చేయాలి కురబలకోట: ఇప్పటి వరకు నెమ్మదిగా సాగుతున్న హంద్రీ–నీవా లైనింగ్ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని దొమ్మన్నబావి వద్ద హెచ్ఎన్ఎస్ కాలువ లైనింగ్ పనులను పరిశీలించారు. షార్ట్ క్రీటింగ్ మిషన్ పనితీరును కూడా గమనించారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించారు.అనంతరం మాట్లాడుతూ పుంగనూరు కాలువ లైనింగ్ పనులను జూలై 10లోగా పూర్తి చేయాలన్నారు. పనులు నాణ్యతగా సాగించాలన్నారు. నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఈ సందర్భంగా తెట్టు గ్రామంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాలని గ్రామస్తులు మంత్రికి విన్నవించారు. ఇంజినీర్ ఇన్‌చీఫ్ వెంకటేశ్వర రావు, చీప్ ఇంజినీర్ వరప్రసాద్, ఎస్ఇ విఠల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
● అతిపెద్ద రిజర్వాయర్ ఆవులపల్లె
మదనపల్లె: కరువు రైతులకు సాగునీటి కష్టాలు తీర్చి, ప్రజలకు తాగునీటి ఇబ్బందులను దూరం చేయాలన్న లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో మంజూరైన ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లపై టీడీపీ ఆదినుంచి కక్ష కట్టింది. ప్రజలు, రైతులకు మంచి జరిగితే భరించలేకపోతోంది. ప్రాజెక్టులతో అభివృద్ధికి కృషి చేయడమే నేరంగా చూస్తోంది. హంద్రీ–నీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి కరువునేలను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యాన్ని ప్రతిపక్షంలో ఉండగా అడుగడుగునా అడ్డంకులతో ఎన్జీటీ కేసుతో అడ్డుకున్న టీడీపీ..ఇప్పుడు ఆధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణతో రిజర్వాయర్లను మట్టిలో కలిపేసే కుట్రలు చేస్తోంది. చేసిన పనులకు రూ.800 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండటంతో ఇప్పుడు ఈ బిల్లులను అడ్డుకునే కుట్రలో భాగంగా విజిలెన్స్ విచారణ పేరుతో కొత్త నాటకానికి తెరతీసింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని, రికార్డులను పరిశీల చేపట్టింది. హంద్రీ–నీవా ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ ఆవులపల్లె కావడం, ఈ మూడింటి పనులు పూర్తయితే ఉమ్మడిజిల్లాలో పెద్దాయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న అక్కసు, భవిష్యత్‌లో టీడీపీ మనుగడ కష్టమని భావించి పనులు పూర్తిగా ఆపివేసే కుట్రలకు సిద్దమైంది. రూ.800 కోట్లు పెండింగ్: ఈ మూడు రిజర్వాయర్లకు సంబంధించి పనులు నిలిపివేసిన 2023 మే 11 నాటికి ముదివేడు రిజర్వాయర్ 33శాతం, నేతికుంటపల్లె 86శాతం, ఆవులపల్లె 5.8 శాతం పనులు జరిగాయి. మొత్తం టెండర్ వ్యయంలో జరిగిన పని విలువ రూ.800 కోట్లకుపైనే. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చెల్లించింది రూ.30 కోట్లని సమాచారం. ప్రస్తుత ప్రభుత్వంలో పైసా బిల్లు ఇవ్వలేదు. పైగా చేసిన పనులకు రూ.800 కోట్ల వరకు ప్రభుత్వం బిల్లులను చెల్లించాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారం ముందు వస్తుందని, దీనిని అడ్డుకోవడం, మరోవైపు రిజర్వాయర్లకు శాశ్వత సమాధి కట్టడం కోసం కూటమి ప్రభుత్వం పెద్దాయనపై కక్షతో కరువు రైతులను శిక్షిస్తోంది. చేసిన బిల్లుల చెల్లింపుపై ఊసేత్తని ప్రభుత్వం రంధ్రాన్వేషణ చేసి కక్షసాధింపులకు పాల్పడుతోంది. టెండర్లో రూ.64 కోట్ల ఆదా మూడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నిర్మాణాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.2,144.50 కోట్లు మంజూరు చేయగా టెండర్ల నుంచి ఒప్పందం వరకు అన్ని పారదర్శకంగానే జరిగాయి. ఇందులో నిర్మాణాలకు రూ.1,529.37 కోట్లు, భూసేకరణ,ఇతర పనులకు రూ.615.13కోట్లు కేటాయించారు. మూడు రిజర్వాయర్లను ఒకేపనిగా రూ.1,554,21,60,649 అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో ఎన్‌ఈసీఎల్, ఆర్ఆర్సీఐఐపిఎల్ జాయింట్ వెంచర్, మేఘా ఇంజనీరింగ్ వర్క్, హెఈఎస్ ఇన్ఫ్రా ప్రై యివేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయి. అంచనా కంటే అధికంగా రూ.1,618.72 కోట్లకు టెండర్లు వేయగా, దీనిపై ప్రభుత్వం రివర్స్ టెండర్ నిర్వహించగా జాయింట్ వెంచర్ సంస్థ రూ.1,553.96 కోట్లతో టెండర్ వేయడంతోప్రభుత్వానికి రూ.64.76 కోట్ల ఆదా అయ్యింది. అంటే టెండర్ నిర్వహణ పారదర్శకంగానే జరిగింది. ఇందులో పొరబాట్లకు చోటులేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వందకోట్లు దాటిన పనులకు జ్యుడిషియల్ రివ్యూ అనుమతులు వచ్చాకే కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరిగింది. అప్పుడు ఎన్జీటీతో..ఇప్పుడు విజిలెన్స్‌తో మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులు మొదలయ్యాక టీడీపీ నేతలు అడ్డంకులు సృష్టించడం మొదలైంది. ఎన్జీటీలో కేసువేసి పనులు నిలిపివేయించారు. 2023 ఆగస్టు 4న ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగళ్లుకు వచ్చిన చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వాలని ప్రయత్నించిన వారిపై టీడీపీ శ్రే ణులు దాడులు చేశాయి. ఇప్పుడు అధికారంలోకి రావడంతో విజిలెన్స్ విచారణ పేరుతో రిజర్వాయర్లకు సమాధి కట్టి కరువు రైతాంగానికి ప్రాజెక్టుల ఫలాలు అందడకుండా చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. శుక్రవారం మదనపల్లె, తంబళ్లపల్లెల్లో పర్యటించిన జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రిజర్వాయర్లను ఉద్దేశించి చేసిన ఆరోపణలు చూస్తుంటే..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెద్దాయన చేపట్టిన అభివృద్ధిపై ఎంతటి కక్ష సాధింపులకు పాల్పడుతోందో స్పష్టం అవుతోంది. రూ.2,144 కోట్లతో ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లు చేపట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం హంద్రీ–నీవా ప్రాజెక్టులోనే ఆవులపల్లె అతిపెద్ద రిజర్వాయర్ టీడీపీకి మనుగడ ఉండదన్న కక్షతో పార్టీ నేతలతో ఎన్జీటీలో కేసు అర్ధంతరంగా ఆగిపోయిన పనులు రూ.800 కోట్లు పనులకు బిల్లులు ఇవ్వలేదు పనులు ఆపే ఉద్దేశంతో విజిలెన్స్ విచారణ పేరుతో కొత్త నాటకం ఆసియా ఖండంలో అతిపెద్ద, 31 ఎత్తిపోతలు కలిగిన ప్రాజెక్టు హాంద్రీ–నీవా. ఈ ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో ఆవులపల్లె, 3.5 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో చేపట్టిన ఈ రిజర్వాయర్ కింద 20వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. ఇంత గొప్ప రిజర్వాయర్ నిర్మాణం చేపట్టలేని టీడీపీ..వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టడం జీర్ణించుకోలేకపోతోంది. ఇదేకాక కరువుకు కేరాఫ్ అయిన అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో 120 చెరువులకు నీటిని అందించి 15వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి కొత్తగా 20వేల ఎకరాలను సాగులోకి తేవాలని లక్ష్యంతో రెండు టీఎంసీల సామర్థ్యంతో ముదివేడు రిజర్వాయర్ పనలు చేపట్టారు. చిత్తూరుజిల్లా పుంగనూరు మండలంలో ఒక టీఎంసీ సామర్థ్యంతో నేతికుంటపల్లె రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి దీనికింద 5వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి, కొత్తగా 10వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యం. ఈ పనులు పూర్తయితే వీటిని నిర్మాణం కోసం కృషి చేసిన పెద్దాయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. తద్వారా కరువు రైతుల జీవితాల్లో మార్పు వచ్చి ఆర్థికంగా స్థితిమంతులవుతారు. దీంతో వైఎస్సార్సీపీకి ప్రజల్లో మరింత ఆదరణ పెరగడం తథ్యం. ఇదే జరిగితే ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ కుట్రలకు తెరతీసింది. -
మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్
రాజంపేట టౌన్: రాజంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఏడాది తన ఎంపీల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తానని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాఽఽథరెడ్డి తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో శుక్రవారం మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో మేడా రఘునాఽథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాఽథరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మేడా మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంపీ ల్యాడ్స్ కేటాయించాల్సిందిగా చైర్మన్ కోరారని, అందువల్ల రూ.20 లక్షల ఎంపీ ల్యాడ్స్‌తో చెత్తను డంప్‌యార్డ్‌కు తరలించేందుకు రెండు కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఇచ్చినట్లు తెలిపారు. పట్టణం పరిశుభ్రంగా ఉన్నప్పుడే కొన్ని వ్యాధులు దరిచేరవన్నారు. ఇక రాబోయేది వర్షాకాలం అని అందువల్ల మున్సిపల్ అధికారులు పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా హిందు శ్మశాన వాటిక అభివృద్ధికి ఎంపి ల్యాడ్స్ మంజూరు చేయాలిన శ్మశానవాటిక కమిటి ప్రతినిధులు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాధ్రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. ఇందుకు మేడా స్పందించి నిధులు కేటాయిస్తానన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి నిధుల ద్వారా క్రైస్తవ శ్మశాన వాటికను కూడా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అనంతరం ట్రాక్టర్లను మేడా రఘునాఽథరెడ్డి, ఆకేపాటి అమర్నాఽథరెడ్డి, పోలా శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మూలాలను మరవకూడదు:ఎమ్మెల్యే ఆకేపాటి వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు మూలాలను మరచి వ్యవహరిస్తున్నారని అది సరి కాదని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు తమకు బీఫాం ఎవరు ఇచ్చారు?, ఏ పార్టీ గుర్తుపై గెలిచాము అన్న విషయాలను మరచి ప్రత్యర్థి పార్టీ వారితో స్వరం కల్పడం ఏమిటని ప్రశ్నించారు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూడకుండా పట్టణాభివృద్ధికి కృషి చేయాలన్నారు. ● మున్సిపాలిటి అభివృద్ధే ధ్యేయమని మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ ద్వారా హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటికలకు ప్రహరీగోడ నిర్మాణం వంటివి పూర్తయ్యాక మున్సిపాలిటీ ద్వారా విద్యుత్, బోరు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్ల తెలిపారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి -
గస్తీ విధులు పటిష్టం చేయాలి
చిన్నమండెం: రాత్రివేళల్లో గస్తీ విధులు పటిష్టం చేసి నేర నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిన్నమండెం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులను పరిశీలించారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మహిళల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి, వాటి దర్యాప్తు, పురోగతిపై ఆరా తీశారు. రౌడీషీటర్లు, చెడు నడవడిక కలిగిన వ్యక్తులపై, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని, గ్రామస్తులతో మమేకమై శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా ఎంవీ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, ట్రాఫిక్ నిబంధనల గురించి తెలియజేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. గంజాయి అక్రమరవాణాను అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీలు నిరంతరం నిర్వహించాలన్నారు. రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, చిన్నమండెం ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు -
అధికారుల అరెస్టులు అప్రజాస్వామికం
రాజంపేట : గత ప్రభుత్వ పాలనలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, మాజీ ప్రభుత్వాధికారి కృష్ణమోహన్‌రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. చంద్రబాబు కక్షపూరిత రాజకీయలు చేస్తుండడంతో వ్యవస్ధలు దెబ్బతింటున్నాయన్నారు. తప్పుడు కేసులు పెట్టి తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలు సృష్టిస్తూ ప్రభుత్వాధికారులను, మాజీ ప్రభుత్వాధికారులపై రాజకీయవిరోధం చూపిస్తున్నారన్నారు. లిక్కర్ వ్యవహారంలో బెదిరించి, భయపెట్టి తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని అరెస్టు చేస్తున్నారన్నారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు డైవర్షన్ పాలిట్రిక్స్ చేస్తున్నారన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నతాధికారులను బలిచేయడం చూస్తుంటే, ప్రభుత్వ ఆరాచక పాలన స్పష్టం అవుతోందన్నారు. ఇంకా కొనసాగితే ప్రజలు సహించరన్నారు. భవిష్యత్తులో ఇందుకు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్ధితులు ఉత్పన్నమవుతాయని స్పష్టంచేశారు. కక్షపూరిత రాజకీయాలు సరైనవి కావు వైఫల్యాలను కప్పించుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ రాజ్యసభ సభ్యుడు మేడారఘునాథరెడ్డి ఆగ్రహం -
ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడిగా లక్ష్మీప్రసాద్
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా ఏపీజీఈఏ(ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం) అధ్యక్షుడిగా రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి డాక్టర్ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన తెలిపారు. ఈ ఎన్నికకు కడప జిల్లా అధ్యక్షుడు రఘురాంనాయుడు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కృష్ణ ప్రసాద్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికలు బుధవారం నిర్వహించగా రాష్ట్ర అధ్యక్షుడి నుంచి అధికారకంగా శుక్రవారం వెలువడ్డాయి. వాహనం బోల్తా.. ఒకరి మృతి తాడిపత్రి : మండలంలోని ఇగుడూరు గ్రామం వద్ద బొలెరో లగేజీ వాహనం బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొందరు కర్ణాటక ప్రాంతంలో కొనుగోలు చేసిన జీవాలను బొలెరో లగేజీ వాహనంలో ఎక్కించుకుని తిరుగుప్రయాణమయ్యారు. శుక్రవారం ఇగుడూరు గ్రామం వద్దకు చేరుకోగానే టైర్ పేలడంతో వాహనం అదుపు తప్పి రహదారిపై బోల్తాపడింది. ఘటనలో ప్రొద్దుటూరుకు చెందిన చాంద్‌బాషా (45) అక్కడికక్కడే మృతి చెందాడు. షేక్ హుస్సేన్ బాషా, ఎర్రగుంట్లకు చెందిన ఆంజనేయులు, గంగప్రతాప్ గాయపడ్డారు. ఘటనపై రూరల్ పీఎస్ సీఐ శివగంగాధరరెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. 43 దిమ్మెలు కూల్చిన ఆకతాయిలు ఓబులవారిపల్లె : మండలంలోని పున్నాటివారిపల్లి సమీపంలో రైతు ఓబులిబస్సు గారి రమణారెడ్డికి చెందిన వ్యవసాయ భూమి కంచెను ఆకతాయిలు తొలగించా రు. ఉదయం చేను వద్దకు వెళ్లి చూడగా కంచె అమర్చిన 43 సిమెంటు స్తంభాలు విరగగొట్టి ఉండడం గమనించి పోలీసులను ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని రైతు కోరారు. ఎస్ఐ రమణ వ్యవసాయ భూమిని పరిశీలించారు. 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు కడప సెవెన్‌రోడ్స్ : అసైన్డ్ భూముల ఫ్రీ హోల్డ్ విషయంలో నిబంధనలు అతిక్రమించారని జిల్లాలోని 13 మంది తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. గతంలో 20ఏళ్ల కాలపరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణలు చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు రావడంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగం విచారించింది. అప్పట్లో ఆయా మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అప్పట్లో తహసీల్దార్లుగా పనిచేసిన అనూరాధ(మైదుకూరు), వి.గంగయ్య(పోరుమామిళ్ల) మధుసూదన్‌రెడ్డి(బద్వేల్), విజయకుమారి(వీఎన్‌పల్లె), లక్ష్మీనారాయణ(లింగాల), మహబూబ్ బాషా(సింహాద్రిపురం), గుర్రప్ప(జమ్మలమడుగు), ఉదయభాస్కర్‌రాజు(పెండ్లిమర్రి), సువర్ణ(బి.మఠం), సరస్వతి(కమలాపురం) రామచంద్రుడు(కాశినాయన), వెంకటసుబ్బయ్య(వేముల), శంకర్రావు(వల్లూరు)లు షోకాజ్ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ప్రధానంగా మైదుకూరు, లింగాల, బి.మఠం, జమ్మలమడుగు మండలాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలిసింది. -
ఉత్సవమూర్తులకు చక్రస్నానం
రాజుపాళెం : మండలంలోని వెల్లాల క్షేత్రంలో జరుగుతున్న బ్రహోత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజున శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ, సంజీవరాయ స్వాముల విగ్రహాలను హంస వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వసంతం చల్లుతూ, భజన పాటలు పాడుతూ, నవ ధాన్యాల మొలకలు తీసుకొని కుందూనదికి చేరుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవ విగ్రహాలకు స్నపనం గావించి చక్రస్నానం చేయించారు. అనంతరం అక్కడకు వచ్చిన భక్తులంతా కుందూ నదిలో స్నానం ఆచరించారు. భక్తులకు వేద పండితులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈఓ వెంకటరమణ, లక్ష్మినారాయణరెడ్డి, రామ్మోహన్, అర్చకులు పాల్గొన్నారు. -
చెట్టును ఢీకొన్న లారీ
అట్లూరు : మండలంలోని కడప–బద్వేల్ రహదారిపై కలివికోడి పరిశోధనా కేంద్రం సమీపంలో ఓ లారీ అదుపు తప్పి చెట్టును ఢీకొంది. స్థానికుల వివరాల మేరకు.. గురువారం రాత్రి కడప వైపు నుంచి వెళ్తున్న లారీ అట్లూరు పోలీస్ స్టేషన్ సమీపం లోని కలివికోడి పరిశోధనా కేంద్రం వద్దకు చేరగానే.. అదుపు తప్పి రోడ్డుకు ఆవల ఉన్న వేప చెట్టును డీకొంది. రాత్రి సమయంలో వాహనాలు రాకపోవడంతో డ్రైవర్‌కు పెను ప్రమాదం తప్పింది. మద్యం మత్తులో లారీ నడిపినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు బద్వేలు అర్బన్ : నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు బద్వేల్ వాసులకు తీవ్రగాయాలయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలోని వల్లెరవారిపల్లెకు చెందిన సుధీర్, బ్రాహ్మణ వీధికి చెందిన మహేష్ పిపి.కుంట సమీపంలోని సెంచురీ పానెల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. శుక్రవారం ఓ పని నిమిత్తం తమ స్కూటీలో నెల్లూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా కదిరినాయుడుపల్లె సమీపంలోని వంతెన వద్ద అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కడప రిమ్స్‌కు తరలించారు. కోర్టు సముదాయంలో భద్రతపై సెక్యూరిటీ ఆడిట్ కడప అర్బన్ : కడప నగరంలోని జిల్లా కోర్టు సముదాయంలో భద్రతా చర్యలపై స్టేట్ ఇంటెలిజెన్స్, పోలీస్, అగ్నిమాపక అధికారులు సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించారు. భవన సముదాయంలో ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. సీసీ కెమేరాలు, ఫైర్ సేఫ్టీ, ఇతర చర్యల నిమిత్తం కోర్టు ఆవరణంతా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీఎస్పీ వై.సాయిరాం, స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ సీఐ సుదర్శన్‌రెడ్డి, కడప డీఎస్పీ పి.వెంకటేశ్వర్లు, ఎస్.వినయ్‌కుమార్‌రెడ్డి, ఆర్.పురుషోత్తం రాజు, బసివిరెడ్డి, జీవన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
డెంగీ నిర్మూలనకు కృషి చేద్దాం
రాజంపేట రూరల్ : పట్టణ, గ్రామ స్థాయిలో డెంగీ వ్యాధి నిర్మూలనకు సమష్టిగా కృషి చేద్దామని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ చిన్ని కృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక ఏరియా వైద్యశాలలో శుక్రవారం జాతీయ డెంగీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నికృష్ణ మాట్లాడుతూ ఆకస్మికంగా జ్వరం రావడం, తలనొప్పి, విపరీతంగా కండరాలు, కీళ్లు, కాళ్ల నొప్పులు రావడం, చర్మంపై ఎర్రటి దద్దులు రావడం వంటి లక్షనాలు కనిపిస్తే ఆస్పత్రి వైద్యులను సంప్రదించాలన్నారు. ప్రతి శుక్రవారం ప్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించి జ్వరాలు ఎలా ప్రబలుతాయో ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. అనంతరం ఆసుపత్రి నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ పళని వేంకటనాగేశ్వర రాజు, సానే శేఖర్, వికాస్, లక్ష్మీ ప్రసన్న, అశోక్, స్నేహ, ఎస్ఎస్.దాస్, పిల్లి జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు
నిమ్మనపల్లె : రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం ఎగువ కురవంకలో నివాసముంటున్న షేక్ రెడ్డిబాషా శుక్రవారం తన కుటుంబసభ్యులతో కలిసి నిమ్మనపల్లెలోని సయ్యద్షావలి దర్గా వద్ద జరిగే ఉరుసు చూసేందుకు వెళ్లాడు. అక్కడి నుంచి సింగంవారిపల్లెకు వెళ్లేందుకు చిన్నళ్లవారిపల్లెకు చెందిన పఠాన్ ముస్తఫా ఆటో బాడుగకు మాట్లాడుకుని కుటుంబసభ్యులతో బయలుదేరారు. మార్గమధ్యంలో సైదాపేట మలుపు వద్ద కందూరు వైపు నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. ప్రమాదంలో రెడ్డిబాషా(46), తాజున్బీ(40), ఇమ్రాన్(17), అసిఫా(14)తోపాటు ఆటో డ్రైవర్ ముస్తఫా(60)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను నిమ్మనపల్లె పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
కోడి కత్తితో అన్నావదినలపై దాడి
నిమ్మనపల్లె : అన్నదమ్ముల మధ్య వ్యక్తిగత కక్షలు కత్తులతో దాడి చేసుకునే వరకూ దారి తీశాయి. మాటామాటా పెరిగి క్షణికావేశంలో కోడి కత్తితో సొంత తమ్ముడే.. అన్నా, వదినలపై దాడికి దిగారు. తీవ్రగాయాలతో వారు ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండ పంచాయితీ యానాది కాలనీకి చెందిన ఎర్రప్ప(30), శ్యామల(24) నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ దుర్గంవారిపల్లె వద్ద వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఎర్రప్పకు గత కొద్ది రోజులుగా తమ్ముడు హనుమంతుతో వ్యక్తిగత వివాదాలున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఎర్రప్ప తన భార్య శ్యామలతో కలిసి సొంత పనులపై బండ్లపై గ్రామానికి వచ్చారు. తిరిగి రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో దుర్గంవారిపల్లె పొలం వద్దకు వెళ్తున్నారు. తన అన్న వచ్చిన విషయం తెలుసుకున్న మార్గమధ్యంలో శివాలయం వద్ద ఎర్రప్ప తమ్ముడు హనుమంతు, తన స్నేహితుడు అశోక్, మరో వ్యక్తితో కలిసి వాహనాల్లో దారి కాచారు. ఎర్రప్ప రాగానే అడ్డగించి కోడి కత్తులతో అన్నా, వదినలపై విచక్షణా రహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎర్రప్ప భార్యకు తీవ్ర గాయాలవడంతో స్థానికుల సాయంతో పిట్టావాండ్లపల్లెలో ప్రాథమిక చికిత్స చేయించుకుని 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, భర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, నిమ్మనపల్లె ఎస్సై తిప్పేస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. -
పట్టుపట్టి.. ర్యాంకులు కొట్టి
కడప ఎడ్యుకేషన్ : తల్లిదండ్రుల కష్టాలను చూసిన విద్యార్థులు తమ లక్ష్యం ఎంచుకున్నారు. కష్టపడి చదవి తమ కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీ ఈసెట్ పరీక్ష ఫలితాలు గురువారం వెలువడగా జిల్లా విద్యార్థులు ర్యాంకులు సాధించి భళా అనిపించారు. ఇంజినీరింగ్ చదివి తల్లిదండ్రుల కష్టం తీరుస్తామని చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలని.. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లెకు చెందిన సురేష్‌రెడ్డి కుమార్తె పల్లెటి రాజశ్రీ ఏపీ ఈసెట్‌లో ఐదో ర్యాంకు సాధించారు. ఈమె తండ్రి పులివెందుల మెడికల్ కళాశాలలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తుండగా, తల్లి అంగన్వాడీ టీచర్‌గా ఉంది. రాజశ్రీ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు పలివెందులలో చదివారు. పులివెందుల లయోలా కళాశాలలో పాలిటెక్నిక్ సీఎస్సీ పూర్తి చేశారు. ఈసెట్ రాసి ఐదో ర్యాంకు సాధించారు. మంరి కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించడమే తన లక్ష్యమని విద్యార్థిని తెలిపారు. రైతు కుమారుడు చదువులో మెరిసె.. ఖాజీపేట కొటంగురువారిపల్లెకు చెందిన మారుతి శ్రీనివాసులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన సతీమణి నాగలక్ష్మికళ ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు తరుణ్ ఏపీ ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించిన తరుణ్ కష్టపడి చదివాడు. తిరుపతి ఎస్వీ కాలేజీలో డీఫార్మసీ పూర్తి చేశారు. ఏపీ ఈసెట్‌లో ఆరో ర్యాంకు సాధించారు. కొలువు సాధించమే లక్ష్యం అని చెబుతున్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించా.. తమ తల్లితండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన గణేష్ కష్టపడి చదివి ఏపీ ఈసెట్‌లో రాష్ట్ర స్థాయిలో ఆరో ర్యాంకు సాధించాడు. వేంపల్లి మండలం ముత్తకూరు గ్రామానికి చెందిన గంగరాజు, గంగాభవానీలు వ్యవసాయం చేస్తూ కుమారుడిని చదివించారు. గణేష్ పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాలలో మైనింగ్పూర్తి చేశాడు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని చదివి ఏపీ ఈసెట్ రాశారు. ఆరో ర్యాంకు సాధించి భళా అనిపించాడు. మంచి కొలువు సాధించి తల్లిదండ్రుల కష్టాన్ని తీర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. బేల్థారి కుమారుడు ర్యాంకు సాధించాడు జమ్మలమడుగు మండలం పెద్దగండ్లూరుకు చెందిన చెన్నారెడ్డి బేల్దారి పని చేస్తున్నారు. తల్లి శివపార్వతి గృహిణి. వీరి కుమారుడు గువ్వల జయచంద్రారెడ్డి రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటున్న జయచంద్రారెడ్డి వారి కష్టాలు గుర్తించాడు. కష్టపడి చదివి ఏసీ ఈసెట్‌లో రాష్ట్రస్థాయిలో పదో ర్యాంకు సాధించాడు. కొలువు సాధించి తల్లిదండ్రులకు ఆసరాగా నిలుస్తానని చెప్పారు. ఏపీ ఈసెట్‌లో విద్యార్థుల ప్రతిభ -
రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
కలకడ : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కలకడ మండలం కె.బాటవారిపల్లెకు చెందిన కార్పెంటర్ నాగార్జున, అతని కుమారుడు విష్ణు శుక్రవారం ద్విచక్ర వాహనంపై పీలేరు వైపు వెళ్తున్నారు. కడపకు చెందిన శివ రాయచోటి నుంచి సోమలవైపు వెళ్తున్నారు. కె.బాటవారిపల్లి సచివాలయం సమీపంలోకి రాగానే రెండు వాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో కార్పెంటర్ నాగార్జున, విష్ణులతోపాటు, శివకు తీవ్రగాయాలయ్యాయి. నాగార్జునను తిరుపతికి తరలించారు. కలకడ పోలీసులు విచారిస్తున్నారు. -
ఏఐటీయూసీ నాయకుల అవినీతిపై ఫిర్యాదు
మదనపల్లె రూరల్ : దినసరి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తనను ఆప్కాస్ విధానంలో కార్మికురాలిగా చేర్పిస్తామని ఏఐటీయూసీ నాయకులు రూ.70 వేలు వసూలు చేశారని మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు స్థానికురాలు పోగుండ రమణమ్మ గురువారం ఫిర్యాదుచేశారు. మీడియాతో రమణమ్మ మాట్లాడుతూ...మున్సిపాలిటీ రెండో డివిజన్లో దినసరి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తన వద్దకు ఏఐటీయూసీ నాయకులైన పృథ్వీరాజ్, ఓబులేసు, నాగరాజు వచ్చి ఆప్కాస్ విధానంలోకి మారుస్తామని చెప్పారన్నారు. పై అధికారులకు రూ.70 వేలు చెల్లించాలని ఒత్తిడి చేశారని, వారి మాటలు నిజమని నమ్మి 16.1.2024న రూ.70 వేలు ఇచ్చానన్నారు. తనను ఆప్కాస్‌లో చేర్చకపోగా, తన డబ్బులు వెనక్కు ఇవ్వలేదని చెప్పింది.సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. -
ఏపీఈసెట్ ఫలితాలు విడుదల
కడప ఎడ్యుకేషన్ : అనంతపురం జవహరలాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ గురువారం విడుదల చేసిన ఏపీఈసెట్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటి ర్యాంకుల పంట పండించారు. డిప్లమా హాల్టర్స్, బీఎస్సీ(మ్యాథమాటిక్స్) డిగ్రీ హాల్డర్స్ ఏపీ ఈసెట్‌లో అర్హత సాధించి లాటరల్ ఎంట్రీ ద్వారా ద్వితీయ సంవత్సరం ఇంజినీరింగ్ లేదా ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు. ఈ నెల 6న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలు గురువారం వెలువడ్డాయి. రాజుపాలెం మండలం కుటూరు గ్రామానికి చెందిన మెట్టా దివాకర్ రెండో ర్యాంకు, తొండూరు మండలం గుండ్లమడుగుకు చెందిన పల్టెటి రాజశ్రీ ఐదో ర్యాంకు, ఖాజీపేట మండలం సుంకేసులకు చెందిన తరుణ్ ఆరో ర్యాంకు, వేంపల్లి మండలం ముత్తకూరుకు చెందిన వద్దరపు గణేష్ ఆరో ర్యాంకు, జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన గువ్వల జయచంద్రారెడ్డి పదో ర్యాంకు సాధించి భళా అనిపించారు. సత్తా చాటిన మిషన్ డ్రైవర్ కొడుకు తల్లితండ్రుల కష్టాలను తీర్చాలని కష్టపడి చదివి ర్యాంకు సాధించాడు బాలమహేష్. వేముల మండలం మబ్బుచింతపల్లె గ్రామానికి చెందిన గుజ్జల మారుతి యురేనియం ప్యాక్టరీలో ఓ మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా తల్లి గంగాదేవి గృహిణి. తల్లితండ్రుల కష్టాన్ని కళ్లారా చూసిన వారి కుమారుడు దేవి కుమారుడు గుజ్జల బాల మహేష్ కష్టపడి చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు పులివెందులలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన మహేష్ డిప్లమో మైనింగ్ కోర్సు పులివెందుల లయోలా కళాశాలలో పూర్తి చేశారు. తాజాగా ఏపీ ఈసెట్‌లో 111 మార్కులతో రాష్ట్ర స్థాయిలో పస్ట్ ర్యాంకు సాధించారు. పలువురు అతడిని అభినందించారు. కూలీ కొడుకుకు ద్వితీయ ర్యాంకు కూలి పనులు చేసుకుంటున్న చిన్నపుల్లయ్య కుమారుడు ఏపీ ఈసెట్‌లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. రాజుపాలెం మండలం కూలూరు గ్రామానికి చెందిన మెట్టు చిన్నపుల్లయ్య, ఏసమ్మల కుమారుడు మొట్టు దివాకర్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఓ ప్రైవేటు పాఠశాలలో చదివాడు. ఆ తరువాత డిప్లమా ఈఈఈని తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పూర్తి చేశాడు. ఏపీ ఈసెట్ ఈఈఈ విభాగంలో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంకు సాధించాడు. కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేసి తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తానని మొట్టు దివాకర్ తెలిపారు. జిల్లాలో పలువురికీ ర్యాంకుల పంట -
మహిళలపై కూటమి నాయకుల దాడి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో మహిళలపై కూటమి నాయకులు గురువారం రాత్రి స్థానిక విచక్షణా రహితంగా దాడి చేశారు. తుమ్మల జయమ్మ, సంధ్య, తుమ్మల స్పందన, మత్తయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. భాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో స్థల వివాదం ఉండడంతో పలు వివాదాలలో పాత్ర వహించిన రాపూర్ రమేష్, వినేష్, నితేష్, మరి కొందరు మహిళలపై దాడి చేసి బెదిరించారు. తాము పోలీస్‌స్టేషన్‌కు వచ్చినప్పటికీ పోలీసులు తమతో మాట్లాడకుండానే రేపు సమగ్రంగా విచారించి చర్యలు తీసుకొంటామని చెప్పారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ హేమసుందర్ రావు మాట్లాడుతూ సంఘటనా స్థలానికి వెళ్లి విచారించాక తగిన విధంగా చర్యలు తీసుకొంటామని పేర్కొన్నారు. -
లారీ డ్రైవర్ బీభత్సం
వల్లూరు : మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ ద్విచక్ర వాహనం, ప్రైవేటు బస్సును ఢీకొట్టి అదుపుతప్పి రోడ్డు పక్కన వున్న బంకు, దాని పక్కనే వున్న చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఐదుగురు గాయాలపాలవగా.. బంకుతోబాటు మూడు ద్విచక్ర వాహనాలు, బస్సు దెబ్బతిన్నాయి. వివరాల్లోకెలితే.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం తిరుమలపురానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ అబ్దుల్ అహమ్మద్ గురువారం గుజరా సామగ్రితో తాడిపత్రికి వెళ్తున్నారు. మద్యం మత్తులో కడప –తాడిపత్రి ప్రధాన రహదారిలో పాపాఘ్ని నగర్(కట్ట) బస్టాపు వద్ద లారీతో వేగంగా వెళ్తూ ద్విచక్ర వాహనాన్ని, దానికి ముందు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సును డీకొట్టాడు. అనంతరం అదుపు తప్పి రోడ్డు పక్కన వున్న బంకును, దాని పక్కనే పార్కు చేసి వున్న రెండు ద్వి చక్రవాహనాలపై ఎక్కించాడు. చివరకు అదుపు తప్పి పక్కనే వున్న చెట్టును ఢీకొట్టాడు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కు యాడు. స్థానికులు అతన్ని బయటకు తీయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఎస్ఐ పెద్ద ఓబన్న తన సిబ్బందితో వచ్చి జేసీబీ సహాయంతో లారీని కదిలించి రెండున్నర గంటల పాటు శ్రమించి డ్రైవర్‌ను బయటకు తీశారు. చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ● లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులతో బాటు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ మితిమీరి మద్యం తాగి నడపడమే కారణంగా తెలుస్తోంది. మద్యం మత్తులో బస్సును ఢీకొట్టి.. ఐదుగురికి గాయాలు. క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ -
మాండవ్యా నదిని కాటేస్తున్న కాలుష్యం
మాండవ్యా నదిని కాలుష్యం కాటేస్తోంది. పట్టణం గూండా ప్రవహించే ఈ నదిలో ఇప్పటికే ముళ్లకంపలు, తూడు, చెత్త పేరుకుపోయాయి. ఎటు చూసినా పట్టణ వాసులు వేస్తోన్న వ్యర్థాలు, జంతు కలేబరాలు దర్శనమిస్తున్నాయి. చుట్టుపక్కల ప్రజలు దుర్గంధం భరించలేని పరిస్థితి. మాండవ్యా నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని రాయచోటి పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి మున్సిపల్ పరిధిలోని ఎగువ అబ్బవరం నుంచి ప్రారంభమై లక్ష్మీపురం, పాతరాయచోటి, మాసాపేటల గుండా వీరబల్లి మండలం వరకు మాండవ్యా నది ప్రవహిస్తోమంది. అనంతరం వీరబల్లి మండలంలోని పుల్లగూరమ్మ గండిలో కలుస్తుంది. వర్షాకాలంలో నీరు దిగువకు ప్రవహిస్తుండటంతో పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ వర్షం పడనకపోతే నీరు లేక పిచ్చి మొక్కలు, పలు రకాల వ్యర్థాలు పెరుగుతున్నాయి. పట్టణంలోని వ్యర్థాలు కాలువల గుండా మాండవ్యానదిలోకి చేరుతాయి. దీంతో నీరు సరిగ్గా ప్రవహించక ఎక్కడికక్కడ పేరుకుపోయి దోమలు పెరుగుతున్నాయి. నదికి ఇరువైపులా ఉండే ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దుర్గంధం భరించలేకపోగా.. తరచూ జ్వరాల బారిన పడాల్సివస్తోందని ఇరువైపుల నివశించే ప్రజలు వాపోతున్నారు. పర్యావరణానికి పెను ముప్పు నిర్వహణ లోపం.. పేరుకుపోతున్న వ్యర్థాలు దుర్గంధంతో ప్రజల ఇబ్బందులు -
ఘనంగా శ్రీ రెడ్డెమ్మతల్లి విగ్రహ పునఃప్రతిష్ట
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన సంతాన ప్రదాయిని రెడ్డెమ్మతల్లి ఆలయంలో అమ్మవారి విగ్రహ పున:ప్రతిష్ట గురువారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయాన్ని ఇటీవల రూ.2.50 కోట్లతో పునర్నిర్మించారు. రెండు రోజులుగా నూతన విగ్రహాన్ని ప్రతిష్టించే కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఆలయంలో ప్రాతఃకాలపూజ, దేవతా ఉత్తాపనం, పంచామృతాభిషేకం, గర్త సంస్కారం నిర్వహించారు. పది గంటలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రతిష్టా హోమం, ప్రాణప్రతిష్ట, కళాన్యాస హోమం, కళాన్యాసం, నేత్రోన్మీలనం, అలంకారం, కూష్కాండబలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. గ్రామస్థులు చేరుకుని అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, ఈవో మంజుల, దాతలు రెడ్డిపరంజ్యోతి, వీరాంజనేయప్రసాద్, సర్పంచులు ప్రేమకుమారి, ఆనంద్, ప్రసాద్‌నాయుడు, ఎల్లుట్లమురళీ, చలమారెడ్డి, సుంకరశేఖర, సాకే చిన్నప్ప, నౌషాద్‌ఆలీ, పూజారి రెడ్డెప్పలు పాల్గొన్నారు. -
కాలుష్యంతో ప్రాణాలు పోతున్నాయి
ఓబులవారిపల్లె : కంకర క్రషర్ ద్వారా నీరు కాలుష్యం అవుతోంది.. రోగాల బారిన పడి ప్రాణాలు పోతున్నాయి. కాపాడండి సారూ అంటూ మండలంలోని గోవిందంపల్లి గ్రామస్థులు అధికారుల ఎదుట మొరపెట్టుకున్నారు. ఇటీవల కంకర క్రషర్ఫై ఫిర్యాదు చేయడంతో కర్నూలు, కడప ఉమ్మడి జిల్లా కాలుష్య నియంత్రరణ అధికారి సుధారాణి గురువారం పరిశీలించారు. గోవిందంపల్లి గ్రామస్థులు మాట్లాడుతూ కంకర క్రషర్ ద్వారా వెలువడే కాలుష్యంతో దుమ్ము, ధూళి పెరగడంతో కిడ్నీ, శ్వాస కోస, క్యాన్సర్ రోగాల బారిన పడి చాలామంది చనిపోయారన్నారు. అంతేగాక మంగంపేట ఏపీఎండీసీ గనులకు 300 మీటర్ల వరకు డేంజర్ ప్రాంతంగా ఏపీఎండీసీ అధికారులు ప్రకటించారని గుర్తు చేశారు. అయితే గనులకు 75 మీటర్ల లోపు కంకర క్వారీ ఏ విధంగా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పేలుళ్లకు కాలుష్యం ప్రబలుతోందని, అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కాలుష్య నియంత్రణ అధికారిణి ఉషారాణి మాట్లాడుతూ అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పర్యావరణ నియంత్రణ సహాయ అధికారి అనిల్‌కుమార్‌రెడ్డి, ఈశ్వర్‌రాజు, చంద్రరాజు, కేశవరాజు పాల్గొన్నారు. -
ఎట్టకేలకు.. ఒక హాల్టింగ్
రెగ్యులర్రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలి తెలంగాణా, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా రాయలసీమ, కోనసీమ తదితర ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్ట రామాలయానికి వస్తారు. తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరూ రామయ్యను దర్శించుకుంటున్నారు. రైళ్ల హాల్టింగ్, స్టేషన్ అభివృద్ధి గురించి టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావాలి. ఇదే అంశంపై ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేశాఖను కోరారు.ఇక్కడ రెగ్యులర్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలి. –ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, మాజీ డైరెక్టర్, గిడ్డంగులశాఖ కార్పొరేషన్, ఒంటిమిట్ట ఒంటిమిట్టస్టేషన్ను అభివృద్ధి చేయాలి దక్షిణమధ్యరైల్వే భద్రాచలం స్టేషన్లాగే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దూరప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకు చేరుకునేలా రైలుసౌకర్యం కల్పించాలి. అమృతభారత్ పథకంలో చేర్చాలి. స్పెషల్‌ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వడం సంతోషకరం –ముమ్మడి నారాయణరెడ్డి, మాజీ చైర్మన్, రామాలయం, ఒంటిమిట్ట రాజంపేట: రాష్ట్రంలో వైష్టవ క్షేత్రంగా వెలుగొందుతోంది ఒంటిమిట్ట(ఏకశిలానగరం) కోదండ రామాలయం. ఇక్కడ ఉన్న స్టేషన్లో ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వలేదు..ఇటీవల చర్లపల్లె–తిరుపతి (07017–07018) నంబరు గల స్పెషల్‌ట్రైన్‌కు ఎట్టకేలకు హాల్టింగ్ ఇచ్చారు. ఒకరకంగా హాల్టింగ్లో కదలిక మొదలైందని చెప్పుకోవచ్చు. ● రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ముందు ఒంటిమిట్టలో దూరప్రాంతరైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. అలాగే ‘సాక్షి’లో రామయ్య దరిచేరేదేలా అనే శీర్షికతో అనేక మార్లు కథనాలు వెలువడ్డాయి. దీంతో ఒంటిమిట్టలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వరనే నానుడి తుడిచిపెట్టుకుపోయింది. ● తిరుపతి–చర్లపల్లె మధ్య నడిచే స్పెషల్‌ట్రైన్‌కు హాల్టింగ్ ఇవ్వడంతో తెలంగాణా ప్రాంతం, కర్నూలు జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చేందుకు వీలు కలిగింది. శనివారం తిరుపతిలో 4.40 సాయంత్రం 4.40కి బయలుదేరి ఒంటిమిట్టకు 7.05 గంటలకు చేరుకుంటుంది. మరుసటిరోజు ఉదయం 7.10కి చర్లపల్లెకు చేరుకుంటుంది. ఆదివారం రాత్రి 9.45కు చర్లపల్లెలో బయలుదేరి, మరుసటిరోజు ఉదయం 7.50కి ఒంటిమిట్ట, 10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. రెగ్యులర్ ట్రైన్స్ హాల్టింగ్ సౌకర్యం కల్పించాలి ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ మీదుగా నడిచే రెగ్యులర్ ట్రైన్స్‌కు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని భక్తులు కోరుతున్నారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రాయలసీమ, ఎంజీఆర్ చైన్నె ఎక్స్‌ప్రెస్, విశాఖ–కడప ఎక్స్‌ప్రెస్, హరిప్రియ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ఇది వరకే ఎంపీ మిథున్‌రెడ్డి రైల్వేమంత్రిత్వశాఖను తన లేఖ ద్వారా కోరారు. అయితే స్పెషల్‌ట్రైన్‌కు హాల్టింగ్ ఇచ్చారంటే..ఇక రెగ్యులర్ ట్రైన్స్‌కూడా హాల్టింగ్ ఇచ్చే అంశాన్ని రైల్వేపరిశీలనలో ఉన్నట్లు కనిపిస్తోంది. రెగ్యులర్ ట్రైన్స్ హాల్టింగ్ ప్రభుత్వం, టీటీడీ నుంచి కూడా రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు కనెక్టివిటీ కలుగుతుందని రైల్వే వర్గాలు చెపుతున్నాయి. తమిళనాడు, తెలంగాణా, ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఒంటిమిట్టకు వచ్చేందుకు రైలు సౌకర్యం కల్పించాలన్న డిమాండ్‌ను ఎంపీ మినిస్టర్ ఆఫ్ రైల్వే దృష్టికి తీసుకెళ్లారు. అమృత్భారత్స్టేషన్ పథకంలో చేర్చాలిప్రధాని మోదీ ప్రారంభించిన అమృత్‌భారత్ స్టేషన్ పథకంలో ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ చేర్చాలని భక్తులు కోరుతున్నారు. ఈ నిధులతో రైల్వేస్టేషన్లో సౌకర్యాలతోపాటు అధ్యాత్మికపరంగా తీర్చిదిద్దవచ్చిని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఈ పథకంలో చేర్చేలా ఎంపీలు మిథున్‌రెడ్డి, మేడా రఘునాథరెడ్డిలు కృషిచేయాలని భక్తులు కోరుతున్నారు. ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి వారానికి ఒకసారి చెర్లపల్లె–తిరుపతి స్పెషల్‌ట్రైన్ ఒంటిమిట్టలో హాల్టింగ్ సౌకర్యం -
నీటి సమస్య పరిష్కారమే లక్ష్యం
కడప సెవెన్‌రోడ్స్: వేసవిలో గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అన్నారు. అవసరమైన గ్రామాల్లో కొత్త బోర్లు, మోటార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి బోర్లకు యుద్ధ ప్రాతిపదికపై విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. గండిక్షేత్రంలో భక్తుల సౌకర్యం కోసం లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన తాగునీటి ట్యాంకర్‌ను నిర్మించేందుకు రూ.35 లక్షలు అవుతుందని, అందులో రూ.25 లక్షలు జెడ్పీ నిధులను సమకూరుస్తానని తెలిపారు. ఇందుకు సంబంధించిన అంచనా వ్యయాలను తయారు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. జిల్లా పరిషత్ నిధుల కేటాయింపులో అందరికీ సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. ఆ చెరువులో కాంట్రాక్టర్లు ఇష్టానుసారం గుంతలు తవ్వి మట్టి తరలించడం విద్యార్థుల మృతికి కారణమన్నారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతోపాటు వారినుంచే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఘన నివాళి: పాక్ దాడిలో అశువులు బాసిన వీర జవాను మురళీ నాయక్, వయోభారంతో ఇటీవల మరణించిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీఎం బలరామిరెడ్డి మృతికి సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. అందరికీ సమానంగా జెడ్పీ నిధులు సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి -
వింత ఆకారంలో కుక్క పిల్ల జననం
పెద్ద తిప్పసముద్రం: అన్నమయ్య జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలంలోని బూచిపల్లిలో గురువారం వింత ఆకారంలో కుక్కపిల్ల జన్మించింది. డేగానిపల్లి నరసింహులు చెందిన కుక్క ఈ పిల్లకు జన్మనిచ్చింది. కాళ్లు, చేతులు శునకం లాగే ఉన్నా.. ముఖం వద్ద తొండం లాగా ఉంది. ముందు భాగం ఏనుగు ఆకారంలో.. వెనుక భాగం కుక్కలాగా ఉంది. గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు వచ్చి.. దీన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తల్లి వద్ద పాలు తాగేందుకు తొండం అడ్డు రావడంతో అది కొద్ది సేపటికే మృతి చెందింది. ఇది జన్యులోపం వల్ల జన్మించి ఉండవచ్చని పశువైద్యులు తెలిపారు. 17నుంచి వైద్య, వైజ్ఞానిక శిక్షణ తరగతులు మదనపల్లె సిటీ: రాష్ట్ర వైద్య,వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ తెలిపారు. గురువారం ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 17 నుంచి 26 వరకు శిక్షణా తరగతులు జరుగుతాయన్నారు. ఈ తరగతులకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 300 మంది ప్రతినిధులు పాల్గొంటారన్నారు. విద్యార్థుఽలు నాయకత్వం వహించడానికి నైపుణ్యం కోసం.. భవిష్యత్తు తరాల నాయకుల తయారు చేయడానికి ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరసింహ, కార్యదర్శి రమణ, జయబాబు, ఆఫ్రిద్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. పీజీ ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం నాలుగో సెమిస్టర్ పరీక్షా ఫలితాలను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆచార్య పద్మ మాట్లాడుతూ ఏప్రిల్‌లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలు త్వరితగతిన విడుదలకు కృషిచేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కెఎస్వీ కృష్ణారావు మాట్లాడుతూ ఎంఏ తెలుగు, హిస్టరీ, పీఎస్ అండ్ పీఏ, ఎకనామిక్స్, ఉర్దూ ఎంకాం కోర్సులలో విద్యార్థులు వంద శాతం ఫలితాలను సొంతం చేసుకున్నారని వివరించారు. అఫిలియేటెడ్ కాలేజీల్లో ఎం కామ్ లో 96.30 శాతం ఫలితాలు వచ్చాయన్నారు. ఎమ్మెస్సీ.. బోటని, బయోకెమిస్ట్రీ, జియాలజి,మ్యేథమ్యాటిక్స్ మైక్రోబయాలజి, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సు, జెనెటిక్స్ అండ్ జీనోమిక్స్, పుడ్ టెక్నాలజీ , ఎంపీఈడీ కోర్సుల్లో వందశాతం ఉత్తీర్ణత లభించిందన్నారు. విద్యార్థులు ఫలితాల కోసం https: www.yvuexams.in/results.aspx అనే వైబ్సెట్ను సందర్శించాలని కృష్ణారావు సూచించారు. ఏఐ శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానంకురబలకోట: ప్రపంచ మంతటా ఇప్పుడు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) గాలి వీస్తోందని, అత్యంత శక్తివంతమైన సాంకేతిక పరిజ్ఞానంగా అవతరిస్తోందని బెంగళూరులోని జార్పీ ల్యాబ్స్ సీఈఓ శ్రీకాంత్ అరిమాదిత్య పేర్కొన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో నెక్ట్స్ న్యూ ఏఐ వెంచర్ స్టూడియోపై గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎక్కడ చూసినా ఏఐ మాట విన్పిస్తోందన్నారు. వ్యవస్థలతో పాటు వ్యవసాయం, విద్య, వైద్యం, న్యాయం, పరిపాలన, ఉత్పాదకత,ఉద్యోగ అవకాశాలలో సత్తా చాటుతోందన్నారు. ప్రపంచ మంతటా అనేక ఏఐ వెంచర్ స్టూడియోలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కొత్త స్టార్టప్‌లను ప్రారంభించడం, పెట్టుబడులు సమీకరించడం, వ్యాపార అభివృద్దిలో దోహదపడుతోందన్నారు. ఈ ఏడాదిని ఏఐ సంవత్సరంగా ఏఐసీటీఈ కూడా ప్రకటించిందన్నారు. ఏఐతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కానుందన్న ధీమాను వ్యక్తం చేశారు. -
జాతీయ రహదారి పనుల పూర్తికి చర్యలు
లక్కిరెడ్డిపల్లి: రాయచోటి– చాగలమర్రి జాతీయ రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ సభా భవనంలో రహదారి విస్తరణలో ఇంటిస్థలాలు, ఇళ్లు కోల్పోతున్న లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ ఆదర్శ రాజేంద్రన్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఇంటిస్థలాలు, ఇంటి పట్టాలు, ఇళ్లుకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. చాలా మందికి నష్టపరిహారం కింద వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు చెప్పారు. ఇంకా పరిహారం అందనివారు కలెక్టర్‌కు విన్నవించుకొని పరిష్కారం చేసుకోవాలన్నారు. వచ్చేనెల 10వ తేదీలోపు జాతీయ రహదారి విస్తరణలో ఉన్న ఇళ్లు, ఇళ్లస్థలాలు ప్రభుత్వం రోడ్డు విస్తరణ నియమించిన మార్కు వరకు తొలగించనున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎంపీడీఓ ఉషారాణి, మండల సర్వేయర్ మధుసూదన్‌రెడ్డి, ఆర్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. జేసీ ఆదర్శ రాజేంద్రన్ -
● పెద్దిరెడ్డి చేసిన కృషిని చూసి ఓర్వలేక..
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరుజిల్లాను సాగునీటితో సస్యశ్యామలం చేసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి చేసిన కృషి మరువలేనిది. వైఎస్సార్సీపీని ఆదరిస్తున్న ప్రజలు, రైతుల కోసం ప్రత్యేకంగా మూడు రిజర్వాయర్లు, పీబీసీ వెడల్పు, హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల అనుసంధాన పథకం మంజూరుకు చేసిన కృషి ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. దీంతో రాజకీయంగా టీడీపీ బలహీన పడుతుందని ఈ పథకాలపై పెద్దిరెడ్డి కుటుంబ ముద్ర ఉండకూదడన్న కక్షతో కూడా ప్రభుత్వం వాటిని పక్కనపెట్టిందని ఈ ప్రాంత ప్రజలు గుర్తించారు. -
కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది. కార్పొరేషన్లో సీటు వేయలేదనే అక్కసుతో కుతంత్రాలకు తెరలేపింది. నిస్సిగ్గుగా రోత ఫిరాయింపు రాజకీయాలు చేసింది. అయినా తాము అనుకున్న లక్ష్యం నెరవేరదని తెలుసుకుని దొంగ దెబ్బ తీసింది. అవినీతి రుజువుకాకున్నా మేయర్‌పై
● సురేష్‌బాబుపై కక్షగట్టిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి ● అధికారుల తప్పిదాన్ని బూచిగా చూపెట్టి ప్రభుత్వం ద్వారా చర్యలు ● కార్పొరేషన్లో రూ.36లక్షల కాంట్రాక్టు పనులు చేశారని అనర్హత వేటు సాక్షి ప్రతినిధి, కడప : కడప మేయర్ సురేష్‌బాబుపై దొంగదెబ్బ కొట్టారు. కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వర్దిని కనస్ట్రక్షన్స్ సంస్థ రూ.36 లక్షలు కాంట్రాక్టు పనులు చేశారని బూచిగా చూపెట్టి అనర్హత వేటు వేశారు. ఆమేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఆర్టీ నంబర్ 446 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పగబట్టి దొంగ దెబ్బతీశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొలేమని అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకున్నారు. అధికారం అడ్డుపెట్టుకొని అనర్హత వేటు వేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. కడప కార్పొరేషన్లో లేని ప్రొటోకాల్ కావాలని ఎమ్మెల్యే మాధవి రెడ్డి పట్టుబట్టారు. సాధ్యపడకపోవడంతో కడప మేయర్ సీటుపై కన్నేశారు. ఎలాగైనా కై వసం చేసుకోవాలనే అంచనాకు వచ్చారు. సామ బేధ దండోపాయాలను ప్రయోగించినా 8మంది కార్పొరేటర్లు మాత్రమే మొగ్గు చూపారు. అవిశ్వాసంతో దింపలేమని స్పష్టమైంది. లొసుగులు, లోటుపాట్లుపై దృష్టి పెట్టారు. మేయర్ సురేష్‌బాబు తనయుడు అమరేష్ కాంట్రాక్టు సంస్థను రిజిస్టర్ చేసుకున్న విషయాన్ని పసిగట్టారు. కాంట్రాక్టు అనుభవం కోసం చేసిన పనులను బూచిగా చూపెట్టారు. ముందుగా కార్పొరేషన్‌ను అడ్డుపెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ లు చేశారు. విజిలెన్సు ఎన్ఫోర్స్మెంటుకు ఫిర్యాదు చేశారు. పనుల్లో ఎలాంటి అవినీతి లేదని విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంటు ధ్రువీకరించింది. మున్సిపల్ యాక్టుపై దృష్టి సారించారు. అధికారంలో ఉన్న మేయర్ కుటుంబ సభ్యులు కార్పొరేషన్లో పనులు చేపట్టరాదనే ఫిర్యాదు ఆధారంగా ప్రభుత్వం ద్వారా చర్యలు చేపట్టారు. అధికారులపై చర్యలేవీ.... ఆగమేఘాలపై మేయర్ సురేష్‌బాబుపై చర్యలు తీసుకున్న ప్రభుత్వ పెద్దలు కారకులైన అధికారులను విస్మరించారు. మేయర్ మాత్రమే టార్గెట్‌గా వ్యవహరించారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మేయర్ కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న కాంట్రాక్టు సంస్థ కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంటే అభ్యంతరం చెప్పాల్సింది ఎవరు? చట్టం తెలిసిన అధికారులే కదా? మున్సిపల్ నిబంధనలు ప్రకారం కార్పొరేషన్లో పనులు చేయరాదంటూ అభ్యంతరం చెప్పాలి కదా? ఎందుకు అభ్యంతరం చెప్పలేదనే ప్రశ్న ఉదయిస్తోంది. అప్పటి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక రాజకీయ కోణం స్పష్టంగా కన్పిస్తోందని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. పైగా కార్పొరేషన్ పరిధిలో రూ.10లక్షల లోపు పనులు అధికారుల కనుసన్నుల్లోనే చేపట్టనున్నారు, స్టాండింగ్ కమిటీ దృష్టికి కూడా రావు. రూ. 50లక్షల పైబడిన పనులు మాత్రమే జనరల్ బాడీకి చేరనున్నాయి. మరోవైపు రూ.36లక్షల కాంట్రాక్టు పనుల్లో అవినీతి లేదని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు నివేదికలు ఇచ్చాయి. అయినా ఇలా అనర్హత వేటు వేయడం రాజకీయంగా దొంగదెబ్బ కొట్టడమేనని పలువురు వెల్లడిస్తున్నారు. ఆగమేఘాలపై చర్యలు... ప్రభుత్వం మేయర్‌పై అనర్హత వేటు వేయాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు మొదటి నుంచి స్పష్టమౌతోంది. మేయర్‌గా సురేష్‌బాబుకు నోటీసు అందకముందే టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి నోటీసులు మీడియాకు చూపెట్టడం తెలిసిందే. పైగా మంగళవారం సాయంత్రం మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్‌బాబును వి చారించారు. మేయర్ తన వివరణ ఇచ్చిన 24గంటలు కూడా గడవకముందే అనర్హత వేటు ఉత్తర్వులు వెలువడడం గమనార్హం. సీఎంఓ డైరెక్షన్లో జిల్లా అ ధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పర్యవేక్షణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పనిచేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యూహాత్మకంగా దెబ్బకొట్టుతున్న చంద్రబాబు సర్కార్ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్ద పీట వేశారు. 51శాతం స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు ప్రాతినిథ్యం వహించాలని సంకల్పించారు. క్షేత్రస్థాయిలో అమలు పర్చారు. మరోవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లతో గద్దెనెక్కిన సీఎం చంద్రబాబు అదే బీసీ, ఎస్సీలను లక్ష్యం చేసుకొని దొడ్డిదారిన దెబ్బకొడుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. వైజాగ్, గుంటూరు మేయర్, తిరుపతి డిప్యూటీ మేయర్, మాచర్ల మున్సిపల్ చైర్మన్ స్థానాలను ౖకైవసం చేసుకున్న తీరును వారు వివరిస్తుండడం విశేషం. బీసీ నేతపై కక్షసాధింపు చర్యలు బీసీ నేత కడప మేయర్ సురేష్‌బాబును తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కక్షసాదింపు చర్యలు చేపట్టింది. తన కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న సంస్థ ద్వారా కాంట్రాక్టులు పొందారని ఆరోపణలు మేయర్ పదవినుంచి తొలగిస్తూ జీఓ జారీ చేయడం అన్యాయం. ఈచర్య పూర్తిగా రాజకీయ కక్షసాధింపే. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అణచివేత ధోరణిని అవలంబిస్తోంది. అందులోనూ ముఖ్యంగా బీసీ నేతలపై చర్యలు చేపట్టడం విడ్డూరంగా ఉంది. – డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్సీ -
పాజిటివ్ థింకింగ్‌కు ప్రపంచాన్ని మార్చే శక్తి
కురబలకోట : పాజిటివ్ థింకింగ్ (సానుకూల ధృక్పథం)కు దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయడంతో పాటు ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుందని రాష్ట్ర బార్ కౌన్నిల్ సభ్యుడు, ప్రముఖ న్యాయవాది, సైకాలజిస్టు అతిక్ అహమ్మద్ అన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో పాజిటివ్ థింకింగ్ శక్తిపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాజిటివ్ థింకింగ్ జీవితాలను మార్చ గల గొప్ప ఆయుధంగా చెప్పవచ్చన్నారు. ప్రతి కూలాన్ని కూడా అనుకూలంగా మారుస్తుందన్నారు. లక్ష్య సాధనకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. మనస్సును మార్చడంతో పాటు వ్యక్తులపై ప్రభావం చూపుతుందన్నారు. పాజిటివ్ థింకింగ్ విజయానికి సోపానం కాగలదని తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం రాజంపేట రూరల్ : ప్రముఖ శైవ పుణ్య క్షేత్రమైన శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు దేవదాయశాఖ కార్యనిర్వహణ అధికారీ గంగవరం కొండారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 20 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు వ్యాసరచన పోటీలు రాయచోటి జగదాంబసెంటర్ : స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి బీట్ ది హీట్ అనే అంశంపై రాయచోటి పట్టణంలోని డైట్ కళాశాలలో ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 6–10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలి రాయచోటి జగదాంబసెంటర్ : విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ అందించాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాయచోటిలోని ఏపీ ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో రూ.10 లక్షలతో రీ మోడల్ చేసిన ఎస్ఈ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేసి విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు. కొత్తగా అన్నమయ్య జిల్లా ఏర్పడిన సందర్భంగా రాయచోటిలో ఏపీఎస్పీడీసీఎల్ నూతన ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ చంద్రశేఖర్‌రెడ్డి, పాల్గొన్నారు. అధికారుల మాక్‌డ్రిల్ రాయచోటి టౌన్ : ఊహించని విపత్తులు సంభవిస్తే ప్రజలు ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంపై రాయచోటి ఆర్టీసీ బస్టాండ్‌లో రెవెన్యూ, పోలీస్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు.కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హోంశాఖ ఆదేశాల మేరకు భారత పౌరులు ఏ విధంగా సన్నద్ధం అవ్వాలనే విషయాల గురించి వివరించి చెప్పారు. ఈసందర్భంగా రాయచోటి ఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతానికి యుద్ధం ఆగిందని భవిష్యత్‌లో అనివార్యమైతే ప్రజలు తమని తాము ఎలా రక్షించుకోవాలో తెలియచేసేందుకు ఈ మాక్ డ్రిల్ ప్రదర్శన చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో సైరన్ మోగుతుందని అప్పుడు ఎలా అప్రమత్తం అవ్వాలో ప్రదర్శన ద్వారా తెలియజేశామని చెప్పారు. అలాగే ప్రమాద స్థలాల నుంచి సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలో కూడా వివరించారు. కార్యక్రమంలో రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ఉషశ్రీ, రాయచోటి సీఐ వెంకట చలపతి,ఫైర్ స్టేషన్ అఽధికారి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
నన్ను ఇండియా రప్పించండి
బి.కొత్తకోట : ఇక్కడ బతలేకున్నాను.. ఎలాగైనా నన్ను ఇండియా రప్పిస్తే నా కుటుంబంతో జీవిస్తాను.. అంటూ ఓ యువకుడు పంపిన వీడియో సందేశం వైరల్ అవుతోంది. అందులో బాధితుడు పేర్కొన్న వివరాలు.. బి.కొత్తకోట జయశ్రీ కాలనీకి చెందిన అఫ్జల్ బేగ్ జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ మిత్రులు అతని నుంచి డబ్బు తీసుకుని మోసం చేసి కెనడా వెళ్లిపోయారు. డబ్బు ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం అప్జల్పై కేసు నమోదు చేయడంతో 72 రోజుల పాటు జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. ప్రస్తుతం ఇంటి నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి, బయటకు వస్తే మళ్లీ జైలుకు పంపుతారు. దీంతో బతకడం కంటే చావే నయం. నాకు నా కుటుంబంతో కలిసి జీవించాలని ఉంది. నన్ను ఇండియాకు రప్పించండి, నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు. ఆర్థికంగా కృంగిపోయానంటూ సందేశంలో పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన వారు బాధితున్ని ఆదుకోవాలని కోరుతున్నారు.దుబాయ్‌లోని బి.కొత్తకోట వాసి వేడుకోలు -
వ్యాయామ విద్యకు మంగళం
మదనపల్లె సిటీ : కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు వ్యాయమ విద్య కీలకం. అటువంటి విద్యను కూటమి ప్రభుత్వం సమూలంగా దూరం చేసే కుట్ర చేస్తోంది. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఒక పక్క ప్రభుత్వం మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను నిర్దేశించింది. ప్రత్యేకంగా క్రీడల్లో ప్రతిభ, సీనియారిటీ ద్వారా కోటాలో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పోస్టులు భర్తీ కేవలం 6 నుంచి 10వ తరగతి పాఠశాలల వరకే పరిమితం. ఇంటర్మీడియట్ కళాశాలకు మాత్రం పీడీ పోస్టులను భర్తీ చేయకపోగా ఉన్న వాటిని కూడా సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్షన్ చేస్తోంది. ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇకపై ఉండవు. ఇప్పటికే ఖాళీలను భర్తీ చేయకపోగా,కొత్త ఎంపికలను కూడా నిలిపివేసింది. పీడీ పోస్టులను సబ్జెక్టు అధ్యాపకుడిగా కన్వర్షన్ చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరం కానున్నారు. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.వీటిలో మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ రాజంపేట, ప్రభుత్వ జూనియర్ కాలేజీ , రైల్వేకోడూరులలో మాత్రం పీడీలు పని చేస్తున్నారు. రాయలసీమ జోన్ పరిధిలోని చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లా, అనంతపురం జిల్లాల్లో 185 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. తిరిగి డీగ్రీ కాలేజీల్లో కూడా పీడీ పోస్టులు ఉన్నాయి. కానీ మధ్యలో ఇంటర్ కాలేజీల్లో పీడీ పోస్టులు లేనందున వల్ల విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. క్రీడామైదానాలు ఉన్న జూనియర్ కాలేజీల్లో పీడీ పోస్టులు ఉండేవి. అది కూడా ప్రస్తుతం లేకుండా చేస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షగా మారనుంది. పోస్టు కన్వర్షన్ ఇలా జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందితే ఆ కాలేజీలో ఇక పీడీ పోస్టుకు మంగళం పలకనున్నారు. ఈ పోస్టులను అదే కాలేజీ లేదా పక్క మండలాల్లోని కాలేజీల్లో సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్షన్ చేసి పోస్టులను అక్కడ భర్తీ చేస్తున్నారు. విశాలమైన క్రీడామైదానాలు ఉన్నప్పటీకీ పీడీ పోస్టులను కన్వర్ట్ చేసి పోస్టులను తగ్గించుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పీడీ రిటైర్ అయితే ఆ పోస్టు రద్దు ఇంటర్ కాలేజీలకు పీడీ పోస్టుల భర్తీ లేనట్లేనా! పీడీ పోస్టులు కోనసాగించాలి జూనియర్ కాలేజీల్లో పీడీ పోస్టులు కొనసాగించాలి. దీనిపై ఇంటర్మీడియట్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశాం. జూనియర్ కాలేజీలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఆలోచించి న్యాయం చేయాలి. – నరేష్, క్రీడాభారతి జిల్లా కార్యదర్శి -
ఎర్రచందనం కేసుల్లోని నిందితులకు కౌన్సెలింగ్
సిద్దవటం : ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి కేసుల్లోని నిందితులకు బుధవారం కౌన్సెలింగ్ ఇచ్చామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. ఈ సందర్భంగా అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేంజర్ మాట్లాడుతూ పాత ఎర్రచందనం కేసుల్లోని నిందితులు ఇకపై సత్ ప్రవర్తనతో మెలగాలని సూచించామన్నారు. ప్రలోభాలకు లోనై మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. యువత ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడితే వారిపై తీసుకునే చర్యలు, విధించే శిక్షలు, పర్యావరణానికి కలిగే నష్టం వంటి విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కె. ఓబులేసు, ఎఫ్ఎస్ఓ సురేష్‌బాబు, బీట్ అధికారులు, అసిస్టెంట్ బీట్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
మదనపల్లె రూరల్ : విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ జనార్దన్ నాయుడు, ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యంరెడ్డి అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీటీఎస్ విజిలెన్స్ పోలీసులతో తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వీడియో, ఆడియో, వాల్‌పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి విధిగా ఎర్తింగ్ ప్రమాణాలు కలిగిన పరికరాలు ఉపయోగించుకోవాలన్నారు. ముఖ్యంగా వ్యవసాయ బోర్ల వద్ద భద్రత నియమాలు మరింత విధిగా పాటించాలని పేర్కొన్నారు. అతుకులు లేని వైర్లను ఉపయోగించాలన్నారు. అధికశాతం విద్యుత్ ప్రమాదాలు నిర్లక్ష్యంతోనే సంభవిస్తున్నాయన్నారు. వర్షాలు కురుస్తున్నప్పుడు తడిసిన విద్యుత్ స్తంభాలు, వైర్లను తాకరాదన్నారు. తెగిపడిన, వేలాడుతున్న, వదులుగా తక్కువ ఎత్తులో ఉన్న తీగలను ముట్టుకోవద్దన్నారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు ట్రాన్స్ఫార్మర్, స్తంభాల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్ భద్రతపై ప్రజలు మెరుగైన అవగాహన పెంచుకోవాలన్నారు. విద్యుత్ సంబంధిత సమస్యలు లేదా అనుమానాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు. -
‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ పటిష్టంగా నిర్వహించాలి
రాయచోటి : ఈనెల 17న స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో ఈనెల మూడో శనివారం చేపట్టే స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల నిర్వహణ, జిల్లా స్థూల దేశీయోత్పత్తి, ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలు తదితర అంశాలపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేకంగా నియమించిన జోనల్ అధికారి ఈనెల 16న జిల్లాలో పర్యటించనున్నట్లు జేసీ తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లపై వివక్ష ఎందుకు?
రాయచోటి: గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడంపై హెల్త్ ఆఫీసర్లు మండిపడ్డారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సమస్యల పరిష్కారం కోరుతూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమం బుధవారం 17వ రోజుకు చేరింది. హక్కుల సాధన కోసం సమ్మెబాట పట్టి 17 రోజులు కావస్తున్నా ప్రభుత్వం తరపున అధికారులు ఎలాంటి చర్చలు జరపక పోగా కొత్త ఆంక్షలు విధిస్తుండటం తగదన్నారు. ఇప్పటికే వేతనాలను నిలుపుదల చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రాత్రి 8 గంటల సమయంలో ఊరి బయట పొలిమేరల్లో ఉన్న హెల్త్ సెంటర్ దగ్గరకు వెళ్లి అటెండెన్స్ వేయాలని ఆజ్ఞాపించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏపీఎంసీఏ అన్నమయ్య జిల్లా నాయకులు సాల్మోహన్స్, అహ్మద్ బాషా, శివకుమార్, విజయ్ కుమార్ తదితరులు డిమాండ్ చేశారు. -
కూటమిలో చేరి.. భూమిని దోచేసి!
ఒంటిమిట్ట : గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ప్రభుత్వ భూములను తెలుగు తమ్ముళ్లు దర్జాగా దోచేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఒంటిమిట్ట మండలం రాచగుడిపల్లి గ్రామంలో గల సర్వే నంబరు 9లోని 79 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇటీవల ఇన్చార్జి ఎంపీపీగా ఎన్నికై న నల్లగొండ లక్ష్మీదేవి భర్త నల్లగొండ వెంకట సుబ్బారెడ్డి గతంలో ఆవుల మంద ఉన్న 80 సెంట్ల భూమిని ఆక్రమించినట్లు రాచగుడిపల్లి గ్రామస్తులు బుధవారం తహసీల్దార్ వెంకటరమణమ్మకు వినతిపత్రం అందజేశారు. భూమిని ఆక్రమించుకోవడమే కాకుండా ఫెన్సింగ్ పనులు చేపట్టినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరేందుకు కారణం భూ కబ్జాలు చేసేందుకేనని పలువురు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఇలాంటి భూ ఆక్రమణలు జరగలేదని, కేవలం కూటమి ప్రభుత్వం వచ్చాకే అధికారాన్ని అడ్డుపెట్టుకొని కూటమి నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు పేర్కొంటున్నారు. టీడీపీ మద్దతుతో ఇన్చార్జి ఎంపీపీని దక్కించుకున్న నల్లగొండు లక్ష్మీదేవి ఎన్నికై న కొద్ది రోజులకే భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ఎంపీపీ భర్త తహసీల్దార్‌కు గ్రామస్తుల ఫిర్యాదు -
ఏపీఆర్జేసీ, పాలిసెట్ ఫలితాల్లో విశ్వం విజయకేతనం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీఆర్జేసీ, పాలిసెట్ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుపతిలోని విశ్వం విద్యాసంస్థ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థ అధినేత డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 25న నిర్వహించిన ఏపీఆర్జేసీ పరీక్షా ఫలితాల్లో వై.దేదీప్య రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు, కె.మునిరూపేష్ 7వ ర్యాంకు, జె.అంజలి 9వ ర్యాంకు, మనీషా 10వ ర్యాంకు సాధించినట్లు పేర్కొన్నారు. వీరితో పాటు రేవంత్, అబ్దుల్ ఖాదర్, యోగి, సమత, భవ్యశ్రీ గీతిక, రోషన్, ట్వింకిల్, సంతోష్, భువన, కార్తికేయ తదితరులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. అలాగే పాలిసెట్ ఫలితాల్లో ఎం.కావ్య 120 మార్కులకు 117 మార్కులు సాధించి బాలికల విభాగంలో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించినట్లు తెలిపారు. అలాగే కిమ్యశ్రీ 116, కె.నిత్యశ్రీ 114, అబ్దుల్ ఖాదర్ 113, సుజినిరెడ్డి, చాతుర్య, రాజకుమారీలు 112, ఎన్.రోషన్ 111, చేతన్‌రెడ్డి 110, జస్మిత 109 మార్కులతో జిల్లా స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆ విద్యాసంస్థ అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్‌రెడ్డి, కరస్పాండెంట్ తులసీ విశ్వనాథరెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. -
స్కూల్ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూల్‌కు పంపడం సరికాదు
మదనపల్లె సిటీ : పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీఓ 19లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా పంపడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (అపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆపస్ కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డీమోషన్ నిర్ణయం ఉపసంహరించుకుని సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగిస్తూ,విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షన్‌గా పరిగణించి ఆ తర్వాత ప్రతి 30 మందికి మరొక సెక్షన్ కేటాయిస్తూ మిగులు స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్, యుపీ స్కూల్స్‌కు మాత్రమే కేటాయించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తగినంత స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమణారెడ్డి, రాజేశ్వరి, రెడ్డిశేఖర్, నాయకులు సిద్దారెడ్డి, రమణ, కొండారెడ్డి, గిరీష్, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేర పరిశోధనలో ఫోరెన్సిక్ ఆధారాల సేకరణే కీలకం
రాయచోటి: టెక్నాలజీ ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితులలో ముఖ్యమైన కేసుల దర్యాప్తునకు నేర పరిశోధనలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలే ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దర్యాప్తు అధికారులకు సూచించారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాలు, కర్నూలు రేంజ్ డీఐజీ సూచనల మేరకు బుధవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరం చేసిన వ్యక్తి శిక్ష నుంచి తప్పించుకోకుండా నేర స్థలంలో సాక్ష్యాధారాల సేకరణ, వాటి భద్రతా ప్రమాణాలు ఎలా పాటించాలి అనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని సూచించారు. పోలీసు అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దర్యాప్తు పద్ధతులపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. కేసుల దర్యాప్తు విషయంలో తప్పుదోవ పట్టించేందుకు నేరస్తులు కొత్త పద్ధతులను ఉపయో గిస్తున్న సందర్భంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఈ శిక్షణా తరగతులలో అందిపుచ్చుకోవాలన్నారు. ఫోరెన్సిక్ సైన్స్‌లో గల అన్ని విభాగాలకు సంబంధించిన నిష్ణాతులైన వారితో ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు అధికారులు శిక్షణా తరగతులలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ డివిజన్ ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, విజయవాడ ఫోరెన్సిక్ నిపుణులు ఇ.కిరణ్ కుమార్, ఎం.మురళీ, అనంతపురం ఆర్ఎఫ్ఎస్ఎల్ అధికారులు కె.జయరాజు, వై. కుళాయమ్మ, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేరగాళ్ల ఎత్తుగడలకు సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై ఒక్కరోజు శిక్షణా తరగతులు -
ఎమ్మెల్యేను ఎంతో గౌరవించాం
ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక కడప ఎమ్మెల్యే మాధవీకి కార్పొరేటర్లంతా ఘనంగా స్వాగతం పలికి ఎంతో గౌరవించారు. కానీ ఆమె తమను చులకన భావంతో చూసింది. ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోకుండా మేయర్ ఇంటిపై చెత్త వేయించింది. ఎక్స్ అఫిషియో సభ్యులకు నిబంధనల ప్రకారం ఎక్కడ కుర్చీ వేయాలో అక్కడే వేశారు. దాన్ని ఎమ్మెల్యే అవమానంగా భావించి ఇలా రాద్దాంతం చేయడం దారుణం. – రామలక్ష్మణ్‌రెడ్డి, 13వ డివిజన్ కార్పొరేటర్ మేయర్ ఎన్నిక సమయంలోనే ఇవన్నీ చూడాలి మేయర్‌ను ఎన్నుకునే సమయంలోనే వారికి కాంట్రాక్టులు ఉన్నాయా? వారి కుటుంబ సభ్యులకు కాంట్రాక్టు ఉన్నాయా? అన్న విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. మేయర్ ఎన్నిక పూర్తయి 2023లో వర్దిని కన్స్ట్రక్షన్ సంస్థ పుట్టింది. వర్దిని కన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్‌ను అధికారులు రద్దు చేసి ఉండాలి. బీసీ నాయకులనే లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం వారిని పదవుల నుంచి తప్పిస్తోంది. – బసవరాజు, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజాస్వామ్యం ఖూనీ కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. కడప నగర పాలక సంస్థలో 50 స్థానాలకుగాను 49 మంది వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌ను ఏమి చేసుకోలేక ఎనిమిది మంది కార్పొరేటర్లను అన్ని విధాలుగా భయపెట్టి, మభ్యపెట్టి టీడీపీలో చేర్చుకున్నారు. మేయర్ కుమారుడు చేసిన కాంట్రాక్టు పనుల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ విచారణలో చెప్పలేదు. – మల్లికార్జున, 10వ డివిజన్ కార్పొరేటర్ -
నిధుల స్వాహాపై విచారణ ప్రారంభం
మదనపల్లె : మదనపల్లె మున్సిపాలిటీలో 2022–23 గుత్తలకు సంబంధించి గుత్తదారుడు చెల్లించిన రూ.29.50 లక్షలకు చేతిరాత రశీదులతో నిధులు స్వాహా కథనంపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం కమిషనర్ ప్రమీల దీనికి సంబంధించి అప్పటి అధికారులను విచారించారు. ఇప్పటికే తీసుకున్న చర్యలను సమీక్షించిన ఆమె న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రశీదులు ఇచ్చిన ఉద్యోగి ఆ రశీదులను చేతిరాతతో ఎందుకిచ్చారు, ఎంత సొమ్ము తీసుకున్నారన్న దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా సమగ్రమైన విచారణ, ఉన్నతాధికారుల పరిశీలన లేకపోవడంతోనే ఇప్పటికి బాధ్యులను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.వివాహిత ఆత్మహత్యరాజంపేట : రాజంపేట పట్టణ శివారులోని రామ్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త మద్యానికి బానిసై నరసమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.టిప్పర్ ఢీకొని ట్రాక్టర్ బోల్తాచింతకొమ్మదిన్నె : వరి గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపున టిప్పర్ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చింతకొమ్మదిన్నె మండలం ఆజాద్ నగర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో వరిగడ్డి కట్టలు చెల్లాచెదురయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.ప్రొద్దుటూరు ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలుప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఇరువురు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను భద్రపరిచారు. సుబ్బరాయుడు (60) అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఈ నెల 12న జిల్లా ఆస్పత్రిలోని ఎంఎం–2 వార్డులో చేరాడు. మంగళవారం మృతి చెందాడు. ఐపీ రిజిష్టర్‌లో అతని పేరు మినహా ఊరు పేరు, సెల్ నంబర్ లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అలాగే బ్రహ్మయ్య (70) అనే వ్యక్తి ఈ నెల 11న అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ 12న అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. -
టెంపో ఢీకొని యువకుడి మృతి
బి.కొత్తకోట : టెంపో వాహనం ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి బి.కొత్తకోట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన వంశీకృష్ణ (25) అవివాహితుడు. స్థానిక కోటవీధిలో నివాసం ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం పై అధికారి గ్రామాల పర్యటనకు రావడంతో నాయనబావి వద్ద బైక్ ఉంచి అధికారి వెంట తిరిగాడు. తర్వాత నాయనబావికి వెళ్లి బైక్‌పై బి.కొత్తకోటకు వస్తున్నాడు. కస్తూర్బా స్కూల్ సమీపంలో మదనపల్లె వైపు దూడలతో వెళుతున్న టెంపో వాహనం బైకును ఢీ కొట్టింది. బైక్‌తోపాటు వంశీకృష్ణను కొంత దూరం ఈడ్చుకుని వెళ్లింది. తర్వాత టెంపో రోడ్డు పక్కన బోల్తా పడింది. వంశీకృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. టెంపో డ్రైవర్ పరారయ్యాడు. అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఎడమ చేయి నుజ్జునుజ్జయింది. ఏఎస్ఐ భాస్కర్, పోలీసులు ఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని మదనపల్లెకు తరలించారు. -
అవయవదానంతో అందరికీ ఆదర్శం
చిన్నమండెం : చిన్నమండెం మండలం చాకిబండ గ్రామం అంపాబత్తునివారిపల్లెకు చెందిన మద్దిరాల కంచంరెడ్డి, కోటేశ్వరమ్మ దంపతుల కుమారుడు మద్దిరాల కొండారెడ్డి(21) రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అతని అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలను కాపాడి ఆ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలిచింది. స్థానికుల కథనం మేరకు.. మద్దిరాల కొండారెడ్డి బెంగళూరులో సివిల్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 8వ తేదీ జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతి చెందాడు. వైద్యుల సూచనల మేరకు కొండారెడ్డి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసి మరికొందరి ప్రాణాలను నిలబెట్టే దిశగా ఆలోచించారు. కొండారెడ్డికి సంబంధించిన గుండె, లివర్, కిడ్నీలు తదితర అవయవాలు దానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. కన్నవారి కలలు కల్లలైనా.. కుమారుడి చదువు కోసం తల్లిదండ్రులు కంచంరెడ్డి, కోటేశ్వరమ్మలు ఎన్నో ఏళ్లుగా కష్టపడి వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు. కూలి డబ్బులతోనే కుమారుని, కుమార్తెను చదివించుకున్నారు. కుమారుడు కొండారెడ్డి సివిల్ ఇంజనీర్‌గా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడనే సంతోషం ఆ కుటుంబానికి చాలా రోజులు నిలబడలేదు. విధి ఆడిన వింత నాటకంలో ఆ కుటుంబం ఉన్న ఒక్క కుమారుడిని పోగొట్టుకుంది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు చాకిబండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంతటి విషాదంలో కూడా వారు తమ కుమారుడి అవయవాలు దానం చేసి మరి కొందరి ప్రాణాలను కాపాడటం ఎంతో గర్వంగా ఉందని చెప్పడం అందరినీ కదిలించింది. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి బ్రెయిన్‌డెడ్ తర్వాత పలు అవయవాలు దానం -
మా బంగారం ఇప్పించండి సారూ!
రాజంపేట రూరల్ : తమ అన్న కూతురి వివాహంలో కనిపించకుండా పోయిన తన 343 గ్రాముల బంగారం ఆచూకీ కనుగొని తనకు ఇప్పించండి సారూ అని బాధిత మహిళ సానంరెడ్డి నాగమణి ఏఎస్పీని వేడుకున్నారు. మండల పరిధిలోని ఎస్.ఎర్రబల్లి వద్ద ఉన్న ఏఎస్పీ కార్యాలయం వద్దకు తన బంధువులతో కలసి వచ్చిన ఆమె ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డేను ఆశ్రయించి సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని విద్యుత్ నగర్లో నివాసం ఉంటున్న తన అన్న జోగి సుదర్శన్‌రెడ్డి కుమార్తె సాయినందిని వివాహానికి గత నెల 28న వచ్చినట్లు తెలిపారు. తన కుమార్తె వర్షిణి 343 గ్రాముల బంగారాన్ని దుస్తుల బ్యాగ్‌లో పెట్టుకుని తనవెంట తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆ బ్యాగ్‌ను తన అన్న గృహంలోని పడక గదిలో గల మంచంపై ఉంచి బంధువులతో ముచ్చటించి పెళ్లి పనుల్లో నిమగ్నమైనట్లు తెలిపారు. అనంతరం రాత్రి 10.30 గంటల సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందు తన కుమార్తె దుస్తులు మార్చుకునేందుకు బ్యాగ్ తెరిచినప్పుడు బంగారం అలాగే ఉందని, ఉదయం 10 గంటల సమయంలో బ్యాగును తెరవగా అందులోని దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని పేర్కొన్నారు. దుస్తుల మధ్య ఉంచిన బంగారం కనిపించకపోవడంతో తన అన్న సుదర్శనరెడ్డితో పాటు బంధువులకు తెలియజేశామన్నారు. 19 మందిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశానని వారిలో కొందరు కువైట్‌కు వెళ్లి పోయారని ఆమె వివరించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. -
కమనీయం.. లక్ష్మీ నృసింహుని కల్యాణం
రాజంపేట రూరల్ : జిల్లాలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రం భువనగిరి శ్రీలక్ష్మీదేవి సమేత నృసింహ స్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అత్యంత కమనీయంగా సాగింది. కల్యాణాన్ని తిలకించేందుకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీ లక్ష్మీదేవి, శ్రీ నృసింహ స్వామి ఉత్సవ మూర్తులను తొలుత పట్టు వస్త్రాలతో, ప్రత్యేక పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి ఆలయ ప్రధాన అర్చకులు జయంతి నటరాజశర్మ, ధూళిపాటి కృష్ణమోహన్, వేదపండితులు అవధానం రాజశేఖరశర్మ, ధూళిపాటి కాళీచరణ్శర్మ, షడ్దర్శనం సత్యనారాయణ, నందుల బృందం వేదమంత్రోచ్ఛారణతో స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తజనం స్వామి వారి కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోయారు. స్వామి వారికి భువనగిరిపల్లి కోదండరామస్వామి ఆలయం నుంచి కొండపైకి మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కుమారులు పసుపులేటి వీరప్రదీప్, రమ్య, పసుపులేటి పవన్‌కుమార్, సింధు దంపతులు ఆలయ ధర్మకర్తలతో కలిసి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. క్రిష్ణచైతన్య అన్నదాన ట్రస్ట్ కువైట్ అధ్యక్షుడు ఇండ్లూరు వజ్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు మజ్జిగ, మంచినీరు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జి.. ఈ కల్యాణ వేడుకలలో ముఖ్య అతిథులుగా 3వ అదనపు జిల్లా జడ్జి ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రత్యూష దంపతులు, జనసేన నాయకుడు అతికారి కృష్ణ పాల్గొన్నారు. ఏఎస్పీ మనోజ్ రామ్‌నాథ్ హెగ్డే ఆధ్వర్యంలో అర్బన్ సీఐ రాజా నేతృత్వంలో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అర్బన్ ఎస్ఐ ఎస్ఎల్వీ ప్రసాద్‌రెడ్డి, ఏఎస్ఐలు సీఎస్కే ప్రసాద్‌వర్మ, ఖాసీంసాబ్, సిబ్బంది బందోబస్తు విధులను నిర్వహించారు. -
ఆర్టీసీ కార్మికుల ధర్నా
రాయచోటి టౌన్ : నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ధర్నా నిర్వహించారు. జిల్లా పరిధిలోని ఐదు డిపోలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ అధ్యక్షుడు వినోద్ బాబు మాట్లాడుతూ సంస్థలో ఉద్యోగులను చిన్న చిన్న కారణాలతో అధికారులు వేధించడం తగదన్నారు. ఉద్యోగ భద్రత సర్క్యులర్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి రావాల్సిన ప్రమోషన్లు వెంటనే కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు చెల్లించాలని, మహిళా సిబ్బందికి చైల్డ్‌కేర్ లీవ్‌లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. రీజనల్ కార్యదర్శి పీఎస్ఎం రాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రీజనల్ ప్రెసిడెంట్ ఎంఎన్‌రావు, రీజనల్ మహిళా నాయకురాలు విజయేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పీలేరులో చోరీపీలేరు రూరల్ : పీలేరు పట్టణం చెన్నారెడ్డి కాలనీలోని ఓ ఇంటిలో బంగారు, నగదు చోరీ జరిగిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చెన్నారెడ్డి కాలనీకి చెందిన వి. శ్రీనివాసులురెడ్డి, రజనికుమారి దంపతులు మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వేపులబైలులో జరిగిన అంకాలమ్మ జాతరకు వెళ్లారు. తిరిగి ఉదయం 6.30 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు తెరిచి బీరువా పగులగొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ బాలకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వేలిముద్ర నిపుణులు సంఘటన స్థలంలో వేలిముద్రలు సేకరించారు. ఇంటి నిర్మాణం కోసం బీరువాలో దాచుకున్న రూ. 5 లక్షలు నగదుతోపాటు సుమారు 150 గ్రాముల బంగారు చోరీకి గురైందని బాధితులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్/తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. తంబళ్లపల్లె మండలం మర్రిమాకులపల్లి పంచాయతీ దిగువ మావిళ్లవారిపల్లెకు చెందిన చిన్నారెడ్డి కుమారుడు డీవీ సిద్ధారెడ్డి (43), ఈ నెల 10న సొంత పనులపై ద్విచక్ర వాహనంలో వెళుతుండగా, మావిళ్లవారిపల్లె కన్నెమడుగు మార్గంలోని నాయిని చెరువు వద్ద మరో ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో సిద్ధారెడ్డి తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ కావడంతో, సిద్ధారెడ్డిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ఈనెల 11న తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అవుట్ పోస్ట్ పోలీస్ సిబ్బంది తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించడంతో, ఏఎస్ఐ నరసింహులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆర్థిక సాయం.. మృతునికి భార్య నాగమణి, ఇంటర్ చదువుతున్న కుమార్తె రంజిత, పదో తరగతి పాసైన కుమారుడు భతర్కుమార్రెడ్డి ఉన్నారు. ఇంటి పెద్ద దిక్కుకోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన పలువురిని కంటతడి పెట్టించింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆ గ్రామానికి వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించి అండగా ఉంటానని భరోసా కల్పించారు. సర్పంచులు జ్యోతి, శివకుమారి, ఎంపీటీసీ సభ్యులు మహేష్, నాయకులు చంద్రశేఖరరెడ్డి, కె.ఆర్.మల్లిరెడ్డి, రామశంకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
మదనపల్లె మున్సిపాలిటీలో రూ.29 లక్షలు స్వాహా
మదనపల్లె : మదనపల్లె స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో రహస్యంగా దాగిన రూ.29.50 లక్షల నిధుల స్వాహా వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా మున్సిపాలిటీకి పైసా సొమ్ము చెల్లించినా ఆ సొమ్ము జమ చేసినట్టు ఆన్లైన్ బిల్లు ఇస్తారు. అయితే లక్షలు జమ చేసిన లీజుదారునికి ఆన్లైన్ రశీదు కాకుండా చేతిరాత రశీదు ఇచ్చి మొత్తాన్ని స్వాహా చేసిన వ్యవహారంపై అనంతపురం మున్సిపల్ ఆర్డీ విశ్వనాఽథ్ ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 2023లో జరిగిన ఈ స్వాహాపై ఇప్పటివరకు కనీస చర్య లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మున్సిపల్ అధికారులకు తెలిసినా ఈ వ్యవహారాన్ని దాచిపెట్టడం వెనుక కారణమేమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు కథ ఇదీ.. 2022 ఏప్రిల్ ఒకటి నుంచి 2023 మార్చి 31 వరకు మున్సిపాలిటీకి చెందిన వారపుసంత, దినసరి మార్కెట్, జంతువధ శాలను రూ.94.55 లక్షలకు సయ్యద్ ఫారూక్ అహ్మద్ గుత్త దక్కించుకున్నాడు. ఈ గుత్త సొమ్మును పూర్తిగా చెల్లించాల్సిన గుత్తదారుడు విడతల వారీగా చెల్లింపులు చేశాడు. ఈ మొ త్తంలో రూ.55 లక్షలను చెల్లించినట్టు ఆన్లైన్ రశీదు లు ఇచ్చారని తెలిసింది. మిగిలిన దాంట్లో రూ. 29.50 లక్షలను మున్సిపాలిటీకి చెల్లించాడు. మూడు విడతల్లో 2023 ఏప్రిల్ 18న రూ.10 లక్షలు, మే నెల 17న రూ.10 లక్షలు, మే నెల 27న రూ.9.50 లక్షలు చెల్లించాడు. అయితే ఈ సొమ్ము స్వీకరించిన ఉద్యోగి ఈ చెల్లింపులు ఆన్లైన్లో జమచేసి ఆన్లైన్ చెల్లింపు బిల్లులు ఇవ్వాలి. అయితే అలా చేయకుండా నగదు స్వీకరించినట్టుగా మున్సిపాలిటీకి చెందిన క్యాష్ రీసీవ్డ్ సీలు వేసి అందులో ఎంత మొత్తం తీసుకున్నది చేతిరాతతో సంతకం చేసి రశీదులు ఇచ్చా డు. దీనితో తన లీజు సొమ్ము చెల్లించేశానని గుత్తదారు భావించాడు. అయితే ఈ సొమ్ము మున్సిపాలిటీకి జమకాలేదు. రూ.29.50 లక్షల్లో పైసా కూడా జమ చేయకుండా పూర్తిగా స్వాహా చేసేశారు. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. వాస్తవంగాపై నిధులు గుత్తదారుడు చెల్లించకపోయి ఉంటే ఈపాటికే అధికారులు చర్యలు తీసుకోవాలి. అయినా ఎందుకు తీసుకోలేదో అధికారులకే తెలియాలి. రెండేళ్లుగా దాచిపెట్టారు.. రూ.29.50 లక్షల నిధులు స్వాహా వ్యవహారాన్ని అధికారులు రెండేళ్లుగా దాచి పెట్టడం వెనుక కారణమేమిటన్న చర్చ మొదలైంది. మున్సిపల్ నిధుల వ్యవహారంపై నిత్యం జరగాల్సిన పర్యవేక్షణ జరగడం లేదా, లేక తెలిసి ఈ విషయాన్ని పట్టించుకోలేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిధుల స్వాహాపై ఇప్పటికే చర్యలు పూర్తి చేసి ఉంటే స్వాహా సొమ్మును తిరిగి రాబట్టి ఉండవచ్చు. లేదా గుత్తేదారుని ఫిర్యాదుతో స్వాహా చేసిన, నిబంధనలకు విరుద్ధంగా రశీదులు ఇచ్చిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ రెండేళ్లదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదో అధికారులకే తెలియాలి. ముగ్గురికి షోకాజ్.. గుత్తేదారు చెల్లించాల్సిన సొమ్ము విషయంలో అనంతపురం మున్సిపల్ ఆర్డీ విశ్వనాఽథ్ ముగ్గురికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వీరిలో అప్పటి మున్సిపల్ ఆర్ఓ, ప్రస్తుత బి.కొత్తకోట నగర పంచాయతీ కమిషనర్ పల్లవి, జూనియర్ అసిస్టెంట్ రెడ్డిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రామ్మూర్తిలకు ఈ నెల ఏడున షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గుత్తల సొమ్ము వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నట్టు తెలిసింది. గుత్తలకు సంబంధించి చెల్లించిన సొమ్ముకు చేతిరాతతో రశీదు ఇచ్చిన ఉద్యోగి మున్సిపాలిటీకి జమ చేయకుండా మొత్తం స్వాహా రెండేళ్లుగా దాచిపెట్టిన అధికారులు బి.కొత్తకోట కమిషనర్, మరో ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన మున్సిపల్ ఆర్డీ -
● దళారులు, వ్యాపారుల ములాఖత్
సాక్షి రాయచోటి : మామిడి రైతులకు ఈసారి కష్టకాలమే కనిపిస్తోంది. ఆశించిన మేర పంట దిగుబడులు లేవు...ప్రకృతి కరుణించక, తెగుళ్లు బారినపడి...తెగులు, చలి, మంచు ప్రభావం మామిడి రైతన్నను తీవ్రంగా దెబ్బతీసింది. భారీగా ఉన్న అంచనాల నుంచి కొంతమేరనే వచ్చిన దిగుబడి రైతులను కుంగదీస్తోంది. పెద్ద చెట్ల నుంచి ఎకరాకు ఐదు టన్నులకు పైగా దిగుబడి వచ్చే పరిస్థితి నుంచి టన్నుకూడా వచ్చే పరిస్థితి లేకపోయింది. పైగా ఇటీవల అంతో ఇంతో ఉన్న కాయలను కూడా రెండు, మూడు దఫాలుగా వచ్చిన పెనుగాలులు కోలుకోలేని దెబ్బతీశాయి. చెట్లపై ఉన్న కాయలు రాలిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో అన్నదాత కనీస ధరలు ఉంటాయని భావించినా నిరాశే ఎదురవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి గణనీయంగా ధరలు పడిపోయాయి. దేశ స్థాయిలో వీరబల్లి బేనీషాకు పేరున్నా...ఆ కాయలు కూడా ప్రస్తుతం టన్ను రూ. 30–35 వేలకు పడిపోవడం ఆందోళన కలిగించే పరిణామం. మామిడి రైతును దెబ్బతీసిన ప్రకృతి అన్నమయ్య జిల్లాలో సుమారు 37 వేల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. అందులో సుమారు 20 వేల హెక్టార్లలో పెద్ద పెద్ద మామిడి తోటలు ఉన్నట్లు ఉద్యానశాఖ అంచనా. ఈసారి ప్రకృతి దెబ్బకు మామిడి రైతు పూర్తిగా దెబ్బతిన్నాడు. ప్రధానంగా గత నవంబరు, డిసెంబరులో మంచు ప్రభావంతో వచ్చిన పూత, పిందె రాలిపోయి దెబ్బతినడం ఒక ఎత్తయితే, తర్వాత వచ్చిన బంక తెగులు చెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. మరోపక్క పెనుగాలులు, వడగండ్ల వాన రాయచోటి నియోజకవర్గంతోపాటు రాజంపేట, రైల్వే కోడూరు, పీలేరు తదితర ప్రాంతాల్లో కాయలు రాలిపోయాయి. తోటలపై కేవలం 15–20 శాతం మాత్రమే అక్కడక్కడ కాయలు కనిపిస్తున్నాయి. ప్రకృతి దెబ్బకు ఈసారి పెద్ద ఎత్తున రావాల్సిన దిగుబడి కూడా రాకపోవడంతో మామిడి రైతులు ఏం చేయాలో పాలుపోక కష్టాల కడలిలో నెట్టుకొస్తున్నారు. తగ్గిన దిగుబడులు అన్నమయ్య జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా లాల్ బహార్, బేనీషా, ఖాదర్, తోతాపురి, బెంగులూర, ఇమామ్ పసంద్, చెరుకు రసం, సువర్ణ రేఖ, దసేరి, మలుగ్బా తదితర రకాలు సాగు చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంతోపాటు రాయచోటి, రాజంపేట, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో మామిడి తోటలు విస్తరించాయి. అయితే దిగుబడులు పెద్దగా లేకపోవడంతో ఈసారి జిల్లా వ్యాప్తంగా అంతంత మాత్రంగానే కాయలు కనిపిస్తున్నాయి. మామిడి ధర అంతంతే అన్నమయ్య జిల్లాలో మామిడి పంటకు సంబంధించి అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు దిగుబడి అమాంతంగా తగ్గిపోగా, మరోవైపు ధరలు పతనం కావడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. గత ఏడాది మొదటిరకం లాల్బహార్, బేనీషా, ఇమామ్ పసంద్ తదితర రకాలు టన్ను కాయలు రూ. 80 వేలు నుంచి రూ. లక్ష వరకు పలికాయి. ప్రస్తుతం రూ. 30–40 వేలకు పడిపోవడం చూస్తే పరిస్థితి ఇబ్బంది కరంగా మారింది. అంతేకాకుండా మిగిలిన సాధారణ రకం కాయలైతే రూ. 10 వేలు, రూ. 15 వేలు, రూ. 20 వేలులోపు మాత్రమే పలుకుతుండడంతో మామిడి రైతుకు గిట్టుబాటు లభించని పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈసారి మామిడి రైతుకు ఒకవైపు ప్రకృతి దెబ్బతీయగా, మరోపక్క ధరలు పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నాడు. నా పేరు గుగ్గిళ్ల చంద్ర. మాది మండల కేంద్రమైన టి.సుండుపల్లె. నేను నాలుగు ఎకరాల్లో మామిడి వేశాను. 12 ఏళ్ల చెట్లు కావడంతో గతేడాది దిగుబడి బా గుండేది. ఈసారి పెద్దగా లేదు. నేను బేనీషా, ఖాదర్, లాల్ బహార్‌ను సాగు చేశాను. ధర చూస్తే చాలా తక్కువగా ఉండడంతో ఏమి చేయాలో పాలుపోవడం లేదు. తోటల్లో చెట్లకు కాయలు లేవు... పండ్లకు ధర లేదు వ్యాపారులు, దళారుల కుమ్మక్కుతో అంతంతమాత్రంగానే మామిడికి రేట్లు దేశంలో పేరు ఉన్న వీరబల్లి బేనీషా టన్ను రూ. 30–35 వేలలోపే సాధారణ రకం కాయలకు రూ. 15,000 మాత్రమే పలుకుతున్న ధర గతంతో పోలిస్తే ఈసారి భారీగా పడిపోయిన మామిడి ధరలు అన్నమయ్య జిల్లాలో 37 వేల హెక్టార్లలో మామిడి సాగు ప్రతి ఏడాది మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మామిడి సీజన్‌గా భావిస్తారు. ప్రధానంగా ఇక్కడ పండించిన మామిడి కాయలు మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, డిల్లీ తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో వెళతాయి. అయితే ఢిల్లీ, హర్యాన తదితర ప్రాంతాల నుంచి పదుల సంఖ్యలో వ్యాపారులు వచ్చి రైల్వేకోడూరు, రాయచోటి ప్రాంతాల్లో బస చేస్తారు. అయితే ధరలు వివిధ రాష్ట్రాల్లో కొంతమేర అధికంగా ఉన్నా కొనేందుకు వచ్చిన వ్యాపారులతో స్థానికంగా ఉన్న దళారులు మాట్లాడుకుని ధరలను శాసిస్తున్నారు. ఎక్కడికక్కడ వారు అనుకున్న ధర ప్రకారం కొనుగోలు చేస్తున్నారు. రైతులు కూడా దళారుల ద్వారానే వ్యాపారస్తులతో ధరలు మాట్లాడుకోవడంతో ఆశించిన మేర లాభాలు ఒనగూరడం లేదు. ఇక్కడ ధరలు తక్కువగా ఉన్నాయని ఇతర రాష్ట్రాలకు వెళ్లి రైతులు అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. -
వారసులకు అన్యాయమే..
రాయచోటి : రాయచోటిలోనే కాదు రాయలసీమలోనూ సుగవాసి పాలకొండ్రాయుడు లేని టీడీపీని ఊహించుకోవడం కష్టం. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఆ పార్టీతో ఆయనకున్న అనుబంధం.. పార్టీ అధిష్టానంతో పెంచుకున్న బంధం.. ఆయన అనుయాయులు, అనుచర వర్గం, సామాజిక వర్గీయులతో పెనవేసుకున్న బంధం అలాంటిది. అలాంటి సుగవాసి పాలకొండ్రాయుడు మరణం సమయంలో పార్టీ పెద్దలు చూపిన చిన్నచూపు అందరినీ ఆశ్చర్య చెకితులను చేసింది. పాలకొండ్రాయుడు పట్ల టీడీపీ అధిష్టాన వైఖరిపై రాయుడు అనుయాయులు, తెలుగు తమ్ముళ్ల అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు దశాబ్దాల పాటు టీడీపీ జెండా మోసిన నేతకు నివాళులు అర్పించే టైం పార్టీ అధినేతకు లేదా అంటూ రగిలిపోయారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీకి సేవలు అందించిన నిజమైన నాయకుడు పాలకొండ్రాయుడుకు పార్టీ అధిష్టానం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని రాయచోటిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన పాలకొండ్రాయుడును టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ పిలిస్తే టీడీపీలోకి వెళ్లారనేది అందరికీ తెలిసిన సత్యం. 1983 ఎన్టీఆర్ సునామీలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా రాయచోటి ఎమ్మెల్యేగా సుగవాసి గెలుపొందారు. రాజంపేట పార్లమెంట్‌కు అభ్యర్థి దొరకని పరిస్థితులలో టీడీపీ అధ్యక్షులు ఎన్టీఆర్ కోరితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఎన్టీఆర్ అనంతరం పార్టీ అధినేతగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు వెంట నడిచారు. టీడీపీకి స్థానం లేదనుకున్న రాయచోటిలో ఎంపీతో పాటు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చూపించారని పేర్కొంటున్నారు. పార్టీ కష్టాలలో సైతం అధినేతకు అండగా నిలిచి రాయచోటిలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా తన సామాజికవర్గాన్ని బలపరుస్తూ తిరుగులేని నేతగా కూడా కొనసాగారు. అలాంటి నాయకుడు చనిపోయిన సందర్భంలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లేదా ఆయన తనయుడు లోకేష్‌బాబు కానీ పరామర్శకు రాకపోవడం పట్ల సుగవాసి కుటుంబానికి పార్టీలో ఉన్న స్థానాన్ని బయట పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిండికేట్ వాటా ఘర్షణలో చనిపోతే.. ఎవరో.. ఇద్దరు టీడీపీ నేతలు మద్యం సిండికేట్‌లో వాటాల కోసం కొట్టుకు చనిపోతే చంద్రబాబు వెళ్లారు.. నిశ్చయ తాంబూలాలు, పెండ్లిళ్లు, పుట్టినరోజుల వేడుకలకు సైతం హాజరవుతున్న బాబు తనతో కలిసి 40 సంవత్సరాల పాటు ప్రయాణం సాగించిన సహచరుని చివరి చూపుగా నివాళులు అర్పించడానికి కూడా రాకపోవడం ఎంత వరకు సమంజసమంటూ.. సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వేదికలుగా సుగవాసి అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. నారా లోకేష్ పక్కనే ఉన్న సత్యవేడుకు వచ్చి వెళ్లారు తప్ప.. రాయచోటికి వచ్చి... సుగవాసి పాలకొండ్రాయుడుకు నివాళులు అర్పించి ఉంటే ఎంత బాగుండేది? అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదేనా.. పెద్దాయనకు మీరు ఇచ్చే నివాళులు? మర్యాద? అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా.. పార్టీ కష్ట నష్టాలలో ముందుంటూ నడిపిస్తూ వచ్చిన పాలకొండ్రాయుడుకు ఆయన చివరి అంకంలో జరిగిన ఘోర అవమానంపై సోషల్ మీడియా వేదికగా ఆయన అనుయాయులు, అనుచర వర్గం టీడీపీ అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పేరుతో ఉన్న సోషల్ మీడియాలో కనీసం ఒక పోస్ట్ పెట్టి శ్రద్ధాంజలి ఘటించలేదంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. నోట్ల కట్టలకు, పదవులకు పబ్లిక్‌గా అమ్ముడుపోయే నాయకులున్న ఈ కాలంలో బతికున్నని రోజులు పసుపు కండువా మోసాడంటూ రాయుడు సేవలను కీర్తిస్తున్నారు. 80 సంవత్సరాల వయసులో 45 డిగ్రీల ఎండను సైతం లెక్కచేయకుండా రాయచోటిలో టీడీపీని గెలిపించేందుకు ఆయన చేసిన ప్రచారాలను వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లలో పెడుతూ టీడీపీ అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కనీసం పార్టీ అఫీసియల్ సోషల్ మీడియా ద్వారా శ్రద్ధాంజలి ఘటించకపోవడం దారుణమంటూ మండిపడుతున్నారు. పాలకొండ్రాయుడి కుటుంబాన్ని విస్మరించిన టీడీపీ అధిష్టానం చనిపోయిన సందర్భంలోనూ రాని పార్టీ అధినేతలు కార్పొరేషన్ పదవుల్లోనూ మొండిచేయి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినా దక్కని సముచిత స్థానం సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్‌ల వేదికగా రగిలిపోతున్న సుగవాసి అనుచర వర్గంతెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కష్టపడ్డ సుగవాసి వారసులుగా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన తనయుడు సుగవాసి బాలసుబ్రమణ్యంకు పార్టీ నుంచి ఆశించిన మేర స్థానం లభించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో రాయచోటి స్థానాన్ని ఆశించి భంగపాటుకు గురైన సుగవాసి కుటుంబానికి చివరి నిమిషంలో రాజంపేట స్థానాన్ని కేటాయించారు. అన్నమయ్య జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా బలిజ సామాజికవర్గ ఓట్లను దూరం కానివ్వకుండా చేసేందుకు తక్కువ సమయంలో రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. ఆ ఎన్నికల్లో సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేసినా సొంత పార్టీ నాయకులు వెన్నుపోటు పొడవడంతో ఓటమి పాలయ్యారు. రెండు రోజుల కిందట పార్టీ అధిష్టానం ప్రకటించిన రాష్ట్ర కార్పొరేషన్ల పదవులలోనూ సుగవాసి కుటుంబానికి మొండిచేయి చూపించింది. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్ లను పాలకొండ్రాయుడుతో పాటు ఆయన తనయుడు బాలసుబ్రమణ్యం, ప్రసాద్‌బాబులు పలుమార్లు కలిసినా తగిన ప్రాధాన్యత లేకుండా పోయిందన్న వేదన, అక్కసు ఆ పార్టీ నాయకులు, సుగవాసి వర్గీయులలో నిగూఢంగా ఉంది. ఇప్పటికే కూటమి పాలనపై రగిలిపోతున్న టీడీపీ వర్గీయులకు సుగవాసికి లభించని ప్రాధాన్యతతో వారి ఆవేశం సోషల్ మీడియా వేదికగా నిప్పులు కక్కుతోంది. -
కె.కె.కొట్టాల గ్రామస్తులకు న్యాయం చేయండి
● టెయిలింగ్ పాండ్‌తో పంటలు పండక నష్టపోతున్నారు ● కలెక్టర్‌ను కోరిన కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వేముల : యురేనియం బాధిత గ్రామమైన కె.కె.కొట్టాల గ్రామస్తులకు న్యాయం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు విజ్ఞప్తి చేశారు. మండలంలోని కె.కె.కొట్టాల గ్రామస్తులు మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసి టెయిలింగ్ పాండ్‌తో పడుతున్న ఇబ్బందులను, సమస్యలపై వినతి పత్రం అందజేశారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి బాధిత రైతులను వెంట బెట్టుకుని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన టెయిలింగ్ పాండ్‌తో కె.కె.కొట్టాల గ్రామస్తులు నష్టపోతున్న తీరును, గ్రామస్తుల ఇబ్బందులను ఇబ్బందులను కలెక్టర్‌కు వివరించారు. ఇప్పటికే టెయిలింగ్ యురేనియం వ్యర్థాలతో నిండిపోయిందని, కాలుష్యంవలన గ్రామస్తులు అనారోగ్యానికి గురవుతున్నారని విన్నవించారు. టెయిలింగ్ పాండ్ నిండిపోవడంతో టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచే పనులు చేస్తున్నారని, టెయిలింగ్ పాండ్ ఎత్తు పెంచితే గ్రామస్తులు ఇంకా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. ఇప్పటికే గ్రామస్తులు తమ సమస్యలను పరిష్కరించేంతవరకు టెయిలింగ్ పాండ్ పనులు చేపట్టవద్దని పనులను అడ్డుకున్నారని పేర్కొన్నారు. వ్యర్థ పదార్థాల టెయిలింగ్ పాండ్‌తో నష్టపోతున్న కె.కె.కొట్టాల గ్రామాన్ని యూసీఐఎల్ తీసుకుని పునరావాసం, ఉద్యోగాలు, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్ శ్రీధర్ టెయిలింగ్ పాండ్‌తో నష్టపోతున్న కె.కె.కొట్టాల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు న్యాయం చేస్తానని హామి ఇచ్చినట్లు బాధిత రైతులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రంగనాథం, బాధిత రైతులు పాల్గొన్నారు. మున్సిపల్ విభాగ బలోపేతానికి కృషి చేయాలికడప కార్పొరేషన్ : జిల్లాలో వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చిన ఎంపీని వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి వై. శ్రీరంజన్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి రావడానికి కృషి చేసినందుకు కృతజ్ఙతలు తెలుపుతూ సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, తద్వారా పార్టీని పటిష్టం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆర్టీఐ వింగ్ జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, ఐస్‌క్రీం రవి, రెడ్డి ప్రసాద్, వెంకటేష్ పాల్గొన్నారు. -
లోయలో పడిన కోలాట బృందం వాహనం
రాజంపేట : రాజంపేట–రాయచోటి ఘాట్‌రోడ్‌లోని లోయలో కోలాట బృందం పయనిస్తున్న బొలోరో లగేజి వాహనం బోల్తా పడింది. సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కోలాట బృందంలోని వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో ఘోరప్రమాదం తప్పిందని ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా నుంచి మదనపల్లెకు కోలాట బృందం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, 16 మందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసు స్టేషన్లో ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు.తప్పిన ఘోర ప్రమాదం -
వాట్సాప్ బాట్ ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు
కడప కల్చరల్ : వాట్సాప్ బాట్ ద్వారా ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లింపు సౌకర్యం మే 9 నుంచి అందుబాటులోకి వచ్చిందని కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్సీ రవికుమార్ తెలిపారు. ఇప్పటిదాకా ఎల్ఐసీ కస్టమర్ పోర్టల్‌పై 2 కోట్ల 20 లక్షల మంది తమ పాలసీలను నమోదు చేసుకున్నారని, ప్రతిరోజు మూడు లక్షల మంది ఆన్లైన్ సేవలు వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఇప్పుడు ఈ వాట్సప్ బాట్ సౌకర్యం అదనంగా అందుబాటులోకి రావడంతో పాలసీదారులు ఎల్ఐసీ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేదన్నారు. పాలసీలపై ప్రీమియంలు చెల్లించవచ్చన్నారు. 8976862090 వాట్సాప్ నంబరుకి ఏజీ అని మెసేజ్ చేస్తే, మన పాలసీలపై చెల్లించాల్సిన ప్రీమియం వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. ఆ తర్వాత వాట్సాప్ బాట్ నుంచే యూపీఐ, నెట్ బ్యాంకింగ్, కార్డ్స్ ద్వారా ప్రీమియం చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇదే కాకుండా ఎల్ఐసీకి సంబంధిన మరో 14 సేవలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వాట్సాప్ బాట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన పాలసీదారులను కోరారు.బస్టాండ్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న వేలూరు పోలీసులుమైదుకూరు : ప్రయాణికులు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో మైదుకూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఒక్కసారిగా అక్కడున్న ఓ నిందితుడిని తమిళనాడులోని వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది చూసిన ప్రయాణికులు కొద్ది సేపు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. బస్టాండ్‌లో ఉన్న వ్యక్తిని సాధారణ పౌరుల దుస్తుల్లో ఉన్న కొంత మంది ఒక్క సారిగా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లడం కలకలం రేపింది. అతన్ని వాహనంలో ఎక్కిస్తున్న సమయంలో ప్రయాణికులు వాహనాన్ని చుట్టుముట్టారు. పలువురు వీడియో, ఫొటోలు తీయకుండా ప్రయత్నించారు. అయితే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వారు ఫొటోలు తీయకుండా అడ్డుకున్నారు. తర్వాత తాము వేలూరు పోలీసులమని పలు కేసుల్లో ఈ వ్యక్తి నిందితుడిగా ఉన్నాడని, ఇతని కోసం నెల రోజులుగా గాలిస్తూ ఇప్పుడు పట్టుకున్నామని తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయొద్దని అన్నారు.ఆలయంలో హుండీ చోరీకాశినాయన : మండలంలోని బాలాయపల్లె గ్రామం రామాలయంలో ఆదివారం అర్థరాత్రి హుండీ చోరీకి గురైనట్లు గ్రామస్తులు తెలిపారు. దేవాలయం తాళం పగులకొట్టి హుండీ తీసుకెళ్లారన్నారు. ఊరి బయటికి వెళ్లి హుండీని పగులకొట్టి నగదు ఎత్తుకెళ్లారన్నారు. పోలీసులకు సమాచారం అందించామని గ్రామస్తులు తెలిపారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని ఒక పాడు బడిన గదిలో గుర్తు తెలియని మహిళ(45) మృతి చెందింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరైనా భిక్షాటనకు వచ్చి వడదెబ్బ సోకి మృతి చెంది ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని సీఐ వెంకటాచలపతి తెలిపారు. భార్యపై కత్తితో దాడిమదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యపై భర్త కత్తితో దాడిచేసిన ఘటన సోమవారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం నేతాజీ కాలనీకి చెందిన రమణ తన భార్య సుజాత(45)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వారు ఇటీవల కొంత అప్పుచేసి ఇంటిని నిర్మించారు. అప్పులు తీర్చేందుకు భర్తకు తెలియకుండా భార్య గొర్రెలు అమ్మడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన రమణ భార్య సుజాతపై కత్తితో దాడిచేశాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వ్యక్తిపై కేసు నమోదుసుండుపల్లె : మండల పరిధిలోని భైరవగుట్ట ఫారెస్ట్ చెక్‌పోస్ట్ ఆవరణలో ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. నాలుగు చక్రాల లగేజ్ టెంపోను ఆపి తనిఖీ చేయగా డ్రైవర్ నాగేశ్వర మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు తనిఖీలో గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని మద్యం తాగిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఆటో ఢీకొని డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ఆటో ఢీకొని డిగ్రీ విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. సత్యసాయిజిల్లా కదిరి మండలం కొండకమర్లకు చెందిన చాంద్‌బాషా కుమారుడు సుహేల్(21) డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం పట్టణంలోని బీటీ కాలేజీలో పరీక్ష ముగించుకుని ద్విచక్రవాహనంలో కురబలకోట మండలం అంగళ్లులోని స్నేహితుడి వద్దకు వెళుతుండగా, మార్గమధ్యంలోని అమ్మచెరువుమిట్ట ఏసీ గోడౌన్ వద్ద ఆటో ఢీకొంది. ప్రమాదంలో సుహేల్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఉపాధ్యాయుల ఇళ్లే టార్గెట్!
రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నలుగురు ఉపాధ్యాయుల ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఇసుకపల్లె ప్రాథమిక పాఠశాలలో హెడ్ టీచర్‌గా పనిచేసే సాయిప్రసాద్ పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 1వ తేదీ సాయిప్రసాద్ కుటుంబంతో సహా టూర్‌కు వెళ్లగా అదే రోజు రాత్రి దొంగలు ఆయన ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం దాదాపు ఆరు లక్షల విలువచేసే బంగారు వస్తువులను దొంగలు దొంగిలించుకుపోయినట్లు సాయిప్రసాద్ తెలిపారు. అలాగే పట్టణంలోని మన్నూరులో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయిని సుజాత కుటుంబ సభ్యులు వ్యక్తిగత పనిపై ఈనెల 8తేదీ ఉదయం కడపకు వెళ్లి అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చేలోపు దొంగలు చోరీకి పాల్పడ్డారు. పట్టపగలే దొంగలు ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి దొంగతనం చేయడం గమనార్హం. దాదాపు 20 తులాల బంగారు, నాలుగు లక్షల నగదు, మూడు వందల గ్రాముల వెండి చోరీకి గురైనట్లు సుజాత తెలిపారు. మండలంలోని కొండ్లోపల్లె ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న సోమశేఖర్ మన్నూరులో నివాసం ఉంటుంన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లగా ఈనెల 8వ తేదీ రాత్రి సోమశేఖర్ ఇంటిలో దొంగలు పడి చోరీకి పాల్పడ్డారు. దాదాపు రెండు లక్షల రూపాయల విలువ చేసే వెండినగలను దోచుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మండలంలోని జి.ఒడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్న మురళీ మనోహర్ కుటుంబ సభ్యులతో బెంగళూరులో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్ళగా ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అరవై గ్రాముల బంగారును దొంగలు ఎత్తుకెళ్లినట్లు మురళీ మనోహర్ తెలిపారు. బలమైన తలుపు తాళాలను సైతం బద్ధలు చేస్తున్న దొంగలు.. దొంగలు బలమైన తాళాలను సైతం బద్ధలు చేస్తున్నారు. ఇంటికి ఉన్న సేఫ్టీ గ్రిల్‌కు వేసిన తాళాన్ని పగులగొట్టి ఆ తరువాత బలంగా ఉండే ప్రధాన ద్వారం తాళాన్ని తొలగిస్తున్నారు. ప్రధాన ద్వారం తాళాలను తొలగించిన విధానాన్ని పరిశీలిస్తే ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. దొంగలు తాళాలను తొలగించేందుకు స్క్రూ డ్రైవర్, కటింగ్‌ప్లేయర్, సుత్తివంటి వాటిని ఉపయోగించి సులువుగా తాళాలను తొలగించేస్తున్నట్లు తెలుస్తోంది.రాజంపేటలో వరుస చోరీలు -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం చెంబకూరు–ఎలకపల్లి మార్గంలోని గుట్ట ప్రదేశంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం ఉదయం రైతులు గుర్తించి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, సీఐ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి గుర్తు తెలియకుండా కాలిపోవడంతో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి వయసు సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. యువతిని అతి కిరాతకంగా చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా సమీపంలోని కర్నాటక నుంచి కూడా తండోపతండాలుగా చూసేందుకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయినా ఎవరికి మృతదేహం ఎవరిదన్నది అంతుచిక్కలేదు. దీంతో చిత్తూరు నుంచి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. కుక్కలు మృతదేహం వద్ద నుంచి ఎలకపల్లి గ్రామం వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేశాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక వీఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. -
మేం చెప్పిందే వేదం!
బియ్యం లారీ సీజ్ – విడుదలకలికిరి : రేషన్ బియ్యం అక్రమంగా తరలుతున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం అర్థరాత్రి 2.30 గంటల ప్రాంతంలో స్పెషల్ బ్రాంచ్ హెడ్‌కానిస్టేబుల్ ముని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుటే బియ్యం లారీని ఆపి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు లారీని సీజ్ చేసిన పోలీసులు సమాచారం ఉన్నతాధికారులకు తెలియచేశారు. బియ్యం రవాణాదారు మధ్యాహ్నానికి బియ్యం రవాణాకు సంబంధించి సంబంధిత రికార్డులను చూపడంతో పరిశీలించిన పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రవాణాదారుకు లారీని అప్పగించారు. అయితే లారీని అదుపులోకి తీసుకున్నప్పుడు లేని రికార్డులు మధ్యాహ్నానికి ఎలా వచ్చాయనేది చర్చనీయాంశంగా మారింది.సాక్షి ప్రతినిధి, కడప : పోట్లదుర్తిలో మేం చెప్పిందే వేదం. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవహారాలు ఏవైనా సరే, మా ఇష్టారాజ్యంగా కొనసాగాల్సిందే. కోర్టు ఉత్తర్వులకు సైతం ధిక్కారమే. ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మమన్న గ్రామస్తులపై పోలీసు అధికారుల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. గ్రామ దేవత పెద్దమ్మ దేవాలయం ప్రాంగణం మొత్తం ప్రహరీ నిర్మించాలని హైకోర్టు ఉత్తర్వులున్నాయి. ఆ ఉత్తర్వులు అమలు చేయాల్సిందిగా దేవదాయశాఖ సంయుక్త కమిషనర్ ఎండోమెంటు అసిస్టెంట్ కమిషనర్‌ను ఆదేశించారు. హైకోర్టు ఉత్తర్వులు భేఖాతర్ చేస్తున్న వైనాన్ని ప్రశ్నించిన గ్రామస్తులపై ఖాకీ ఆగ్రహించిన వైనమిది. పోట్లదుర్తి గ్రామంలో సర్వేనంబర్ 657లో 3.06 ఎకరాలు పెద్దమ్మ దేవాలయం భూమి. అందులో కొంత భాగం ఆక్రమణ చేశారు. పెద్దమ్మ దేవాలయం భూమి మొత్తానికి ప్రహరీ నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా, ఆక్రమణలతో నిమిత్తం లేదు. ఉన్న భూమికి మాత్రమే ప్రహరీ నిర్మిస్తామని పోట్లదుర్తి బ్రదర్స్ స్పష్టం చేస్తున్నారు. ఇదివరకే రూ.9 0లక్షలు సీఎం రమేష్ రాజ్యసభ గ్రాంట్ నుంచి దేవాలయంలో ప్రహరీ, ఇతర పనుల కోసం కేటాయించారు. గ్రామస్తులంతా ముక్తకంఠంతో దేవాలయం భూమి అన్యాక్రాంతం కాకుండా మొత్తానికి ప్రహరీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వారి అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దేవాలయం ప్రాంగణం మొత్తానికి ప్రహరీ నిర్మించాలని డబ్ల్యుపీ నెంబర్ 871/2025 ద్వారా ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని దేవదాయశాఖ సంయుక్త కమిషనర్ భ్రమరాంబ ఆర్సీ నెంబర్ ఎం3/19024(39)/2/ 2025 ద్వారా ఈనెల 6న ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై గ్రామస్తులు అభ్యంతరం చెప్పారు. అక్కడికెళ్తే కేసులు నమోదు చేస్తాం.. గ్రామస్తులు ప్రహరీ నిర్మాణానికి అడ్డు తగులుతున్నారని పోట్లదుర్తి బ్రదర్స్ ఎర్రగుంట్ల పోలీసులను ఉసిగొల్పారు. వారి ఆదేశాలను తు.చ. అమలు పర్చేందుకు సిద్ధమైన ఓ త్రిబుల్‌స్టార్ అధికారి గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. ఆ పనుల వద్దకు మీరు వెళ్లొద్దంటూ హుకుం జారీ చేశారు. ఓ వైపు హైకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన, మరోవైపు దేవదాయశాఖ కమిషనర్ ఆదేశాలు అమలు కాకపోవడంపై గ్రామస్తులు ప్రశ్నిస్తే, వారిని పోలీసు అధికారులు మందలించడంపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. పోట్లదుర్తి బ్రదర్స్ నియంతృత్వాన్ని అమలు చేయడమే తమలక్ష్యం అన్నట్లుగా జిల్లాలో అధికార యంత్రాంగం ఊడిగం చేస్తోందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దమ్మ దేవాలయం ఆక్రమణలు చట్టబద్ధం చేస్తున్న పోట్లదుర్తి బ్రదర్స్ ప్రాంగణం మొత్తం ప్రహరీ నిర్మించాలంటున్న గ్రామస్తులు హైకోర్టు తీర్పును సైతం ఉల్లంఘిస్తున్న వైనం -
తడబడితే తప్పదు మూల్యం
కడప ఎడ్యుకేషన్ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదేదో లేనిదేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొన్ని విద్యా సంస్థలు సీబీఎస్ఈ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులుంటేనే పాఠశాలలను నిర్వహించాలి. వీటిపై ఆరా తీయండి.. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవడం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరపున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థుఽలను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు కచ్చితంగా విచారించి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి.నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు.. ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలను తప్పకుండా పాటించాలి. విద్యార్థులకు పాఠశాలల్లో క్రీడా మైదానంతో పాటు అన్ని వసతులు పక్కాగా ఉండాలి. లేకుంటే ఆ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. అదే విధంగా విద్యా సంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు తప్పక పొంది ఉండాలి. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థల ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. అన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలను చేర్పించాలి. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్ కడప జిల్లా● తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ● ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి. ● మౌలిక వసతులతోపాటు బాత్రూములు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. ● విద్యార్థుల మానసిక, శారీరక ఉల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఆరా తీయాలి. ● అర్హత గల ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారా లేదా పరిశీలించాలి. ● ప్రాఽథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాల అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి. ● సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాన్ని జారీ చేస్తుంది. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి. ● జీ–1 భవనాలు ఉంటే అగ్నిప్రమాపక పరికరాలు, ఆ స్థాయి దాటితే మంటలు ఆర్పే పూర్థిస్థాయి వ్యవస్థ ఉండాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి ఉండాలి. ● ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్నవారీగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడతాయి.తీసుకోవాల్సిన జాగ్రత్తలివి.. ముందస్తు అడ్మిషన్లతో తస్మాత్ జాగ్రత్త ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోకండి పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి రిజిస్ట్రేషన్, గుర్తింపుపై ఆరా తీయండి క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని పరిశీలించాకే అడ్మిషన్ తీసుకోవాలి -
అధికారులు చెప్పిన ఫీజులు చెల్లించలేం...
ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్ లో ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు అధికారులు చెప్పిన ఫీజులను చెల్లించలేం. సెమిస్టర్–2 ఎగ్జామ్స్ పూర్తయి త్వరలో రిజల్ట్స్ వస్తాయి. మేము క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఉద్యోగాలకు ఎంపికై నందున త్వరలోనే సర్టిఫికెట్లు ఇవ్వాలని అధికారులను కోరాం. కానీ ట్రిపుల్ ఐటీ అధికారులు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లిస్తేనే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని అంటున్నారు. సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగాలకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. – యండ్లూరు ఇందు (ట్రిపుల్ ఐటీ విద్యార్థిని), సత్యసాయి జిల్లా, కదిరి -
అధికారులు మాట మారుస్తున్నారు...
2019లో నేను ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో చేరాను. చేరేటప్పుడు పీయూసీ–1కు రూ.36వేల చొప్పున రెండేళ్లకు రూ.72వేలు, ఇంజినీరింగ్ నాలుగేళ్లకు రూ.4వేల చొప్పున రూ.1.60లక్షలు చెల్లిస్తే చాలు అని చెప్పారు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అధికారులు మాట మారుస్తున్నారు. దీనిపై ఫైనలియర్ విద్యార్థులందరం ధర్నా కూడా చేశాం. ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ అమరేంద్ర కుమార్ విద్యార్థులకు సర్ది చెప్పి త్వరలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి ఎంత ఫీజు కట్టాల్సింది వెల్లడిస్తామని చెప్పారు. ఇప్పటివరకు అధికారుల్లో ఎలాంటి స్పందన లేదు. దీనిపై త్వరగా స్పందించాల్సి అవసరం ఉంది. – వైష్ణవి (ఈఈఈ విద్యార్థిని), అనంతపురం జిల్లా, సింగనమల గ్రామం -
శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనలతో విశ్వవ్యాప్తం
రాజంపేట : శ్రీవారి మహిమలు అన్నమయ్య కీర్తనల ద్వారా విశ్వవ్యాప్తమయ్యాయని రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. సోమవారం తాళ్లపాకలో అన్నమాచార్య జయంతి సందర్భంగా ధ్యానమందిరంలోని అన్నమాచార్యుని దర్శించుకున్నారు. ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ తన గానంతో వెంకటేశ్వరస్వామి హృదయంలో స్ధానం కలిగిన అన్నమయ్యతో ఎవరు కూడా సాటిరారన్నారు. స్వామి అనుగ్రహంతో ఎవరూ ఈ సృష్టిలో రచించిలేని రచనలు ప్రారంభించిన అద్భుతమైన ప్రాంతం అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక అన్నారు. వెంకటేశ్వరస్వామి మహిమలు, మహాత్యం.. తెలియలాంటే అన్నమయ్య కీర్తనలు విశ్వవ్యాప్తం కావాలన్నారు. స్వామివారిని ప్రత్యక్షంగా చూసిన, స్వామివారి అందాలను తన కీర్తనలతో అభివర్ణించి తెలియచేసిన మహాజ్ఞాని అన్నమయ్య అని కొనియాడారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రూరల్ కన్వీనర్ దొడ్డిపల్లె భాస్కరరాజు, ఎంపీటీసీ మధుబాబు, వైఎస్సార్సీపీ నాయకులు శివయ్య,రెడ్డయ్య,శేఖర్‌రెడ్డి, బోయనపల్లె సర్పంచి రాజా, బొడిచెర్ల సుబ్బరాయుడు, రామయ్య, శివకుమార్, సొంబెత్తిన శ్రీనువాసులు టీటీడీ అధికారులు తాళ్లపాక గ్రామస్తులు పాల్గొన్నారు ఆకేపాటికి సత్కారం అన్నమాచార్య జయంత్యుత్సవాలలో తొలిరోజు తాళ్లపాకలోని అన్నమాచార్య ధాన్యమందిరానికి ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి వచ్చారు. ఈసందర్భంగా టీటీడీ అధికారులు ఆయనను సత్కరించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదాలను అందచేశారు. అనంతరం కల్యాణవేదికపై ఆసీనులైన వెంకటేశ్వరస్వామి, శ్రీదేవి,భూదేవి ఉత్సవమూర్తులను ఆకేపాటి దర్శించుకున్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
రూ.3.20 లక్షలు చెల్లించమంటున్నారు...
ఇంజనీరింగ్ ఫైనలియర్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో తమకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ట్రిపుల్ ఐటీ అధికారులను కోరగా.. రూ.3.20 లక్షలు చెల్లించమంటున్నారు. మాది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు రమేష్, హైమావతి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పోను మిగిలిన బకాయిలు చెల్లిస్తేనే తప్ప సర్టిఫికెట్లు ఇవ్వమని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ట్రిపుల్ ఐటీకి చెల్లిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారు. – ధరణి (ఈసీఈ ఇంజనీరింగ్ ఫైనలియర్) చిత్తూరు జిల్లా, పుట్లూరు -
పేదింటి బిడ్డలపై ఫీజులుం
● ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించని కూటమి సర్కార్ ● ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని అధికారులు ● సర్టిఫికెట్లు కావాలంటే పెండింగ్ ఫీజు చెల్లించాలంటున్న అధికారులు ● ప్రభుత్వ పెద్దల్లో లోపించిన మానవత్వం.. వాపోతున్న విద్యార్థులు సాక్షి ప్రతినిధి, కడప : చదువులు అయిపోయాయి... కొలువుల్లో చేరాలనే ఆతృత విద్యార్థులది. ఆ స ర్టిఫికెట్లు కాస్త చేజారితే బకాయిలు పెండింగ్‌లో ఉండిపోతాయనే ఆందోళన యూనివర్సిటీ యంత్రాంగానిది. వెరసి కూటమి సర్కారు నిర్వాకంతో ఇటు చదువుల బిడ్డలు.. అటు యూనివరర్సిటీ అధికారులు నలిగిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. పేదింటి గ్రామీణ చదువుల బిడ్డలకు ఉన్నత విద్యను అందించాలనే సదాశయంతో ప్రవేశ పెట్టిన ట్రిపుల్ ఐటీపై కూటమి సర్కార్‌కు చిత్తశుద్ధి లోపించింది. విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ట్రిపుల్ ఐటీ విద్య పూర్తయ్యింది, కొలువుల్లో చేరేందుకు వెళ్లాలి, సర్టిఫికెట్లు జారీ చేయండని విద్యార్థులు అడుగుతుంటే యూనివర్సిటీ అధికారులు చెవికెక్కించుకోవడం లేదు. ఫీజులు పెండింగ్‌లో ఉన్నాయి, మీరు సర్టిఫికెట్లు తీసుకెళ్తే తమ బకాయిలు ఎలా? అంటూ తిరిగి ప్ర శ్నిస్తున్నారు. బకాయిలు క్లియర్ చేసిన తర్వాత సర్టిఫికెట్లు జారీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. డబ్బులు చెల్లించే స్థోమత తమకు తమ కుటుంబాలకు లేదని, ప్రభుత్వ బకాయిలు సర్దుబాటుకు కావాల్సిన ఎన్ఓసీ తీసుకొని తమ సర్టిఫికెట్లు ఇవ్వాలంటూ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు విన్నవిస్తున్నారు. వారి ఆవేదన పట్టించుకునే స్థితిలో ఆర్జీయూకేటీ యూనివర్సిటీ కన్పించడం లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించాలనే దిశగా అటు అధికారులకు ఇటు కూటమి నేతలకు కూడా లేకపోవడంతో 8వేల మంది విద్యార్థుల సమస్య పెండింగ్‌లో ఉండిపోయింది. చొరవ చూపని ఆర్జీయూకేటీ... విద్యార్థుల నుంచి ఫీజులు వసూళ్లు చేసుకోవాలనే ఆలోచనకు తగ్గట్లుగా ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేయాలనే ఆలోచన ఆర్జీయూకేటీ అధికారుల్లో కన్పించలేదు. ఉన్నత విద్యామండలి దృష్టికి సమస్యను తీసుకెళ్లి, ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిల వివరాలు సేకరించి, ఎవరెవరికి ఫీజు రీయింబర్స్‌మెంటు డబ్బులు పడ్డాయి. పేరెంట్స్ అకౌంట్లల్లో ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు పడ్డాయా? అలాంటి వారు బకాయిలు ఎంత ఉన్నాయో తెలుసుకుని వారి సర్టిఫికెట్లు జారీ చేయడానికి అభ్యంతరం చెబితే అర్థం ఉందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించని పక్షంలో విద్యార్థుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు తీసుకొని ప్రభుత్వం నుంచి నేరుగా యూనివర్సిటికీ బకాయిలు చెల్లించేలా ఉన్నత విద్యామండలితో సంప్రదించి సర్టిఫికెట్లు జారీ చేయవచ్చు కదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ దిశగా ఆర్జీయూకేటీ చొరవ చూపడం లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
నందబాలుని ఆనంద విహారం
ముగిసిన దేవునికడప తెప్పోత్సవాలు కడప కల్చరల్ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ తెప్పోత్సవాలలో భాగంగా మూడవరోజు సోమవారం ముగింపు సందర్భంగా స్వామి, అమ్మవార్లు తెప్పపై విహరించారు. ఆలయ అర్చకులు తొలుత ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులకు తిరుమంజన అభిషేకం నిర్వహించి అలంకారం చేశారు. అనంతరం పల్లకీపై స్వామికి సమీప వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి అలంకరించి పూజలు చేసి తెప్పపై కొలువుదీర్చారు. మూడుమార్లు వేద పండితుల మంత్రోచ్ఛాటనలు, రెండుసార్లు మంగళ వాయిద్యాల సుస్వరాలు, మరో రెండుసార్లు అన్నమాచార్య కీర్తనల మధ్య తెప్పోత్సవం నిర్వహించారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు బృందం పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
ఘనంగా నల్లగంగమ్మ తిరునాల
సంబేపల్లె : మండల కేంద్రంలోని శ్రీ దేవరరాయ నల్లగంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొలకలపౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని వేపాకులతో శుద్ధిచేసి పచ్చని తోరణాలు, వివిధరకాల పుస్పాలతో అంకరించారు. ప్రతి ఏడాది మొలకల పౌర్ణమి రోజున అమ్మవారి తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం నుంచి అమ్మవారికి హోమాలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. మొక్కులు తీరిన వారు చాందినీ బండ్లను అమ్మవారి ఆలయం చుట్టూ తిప్పారు.ఆలయ కమిటీ సభ్యులు దాతల సహకారంతో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. తిరునాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘనలు జరగకుండా స్థానిక ఎస్ఐ భక్తవత్సలం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
24 గంటలూ మెరుగైన విద్యుత్
రాయచోటి: ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా గ్రామాలలో 24 గంటలూ మెరుగైన విద్యుత్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర రవాణా,యువజన క్రీడాశాఖమంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో మంత్రి, జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి ఆర్డీఎస్ స్కీమ్‌పై ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా త్రీఫేస్ కనెక్షన్ ఇచ్చి 24 గంటలూ మెరుగైన విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వివరించారు.జిల్లాలో జరుగుతున్న ఆర్డీఎస్ స్కీమ్ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సంబంధిత కాంట్రాక్టర్‌కు సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ స్కీమ్ ద్వారా మారుమూల గ్రామాలలో సైతం చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, పవర్ గ్రిడ్ డీజీఎం కిరణ్, ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ కన్స్ట్రక్షన్ శ్రీనివాసరెడ్డి, రాజంపేట, మదనపల్లి, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాఫిర్యాదులకు సత్వర పరిష్కారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదు లను నూరుశాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఎన్నో వ్యయ ప్రయాసాలతో సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రం రాయచోటికి వచ్చిన అర్జీదారులకు జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ స్నాక్స్, వాటర్ బాటిల్స్, టీ సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో డీఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రధాన అర్చకులు మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగు రంగుల పూలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, స్థానికులతో పాటు కన్నడ భక్తులు పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రిస్తాం రాయచోటి టౌన్ : నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని జిల్లా ఫౌరసరఫాల శాఖ అధికారి రఘురామయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు 22 రకాల నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక, నిల్వల వివరాలు ప్రచురించాలని చెప్పారు. అక్రమంగా సరుకులు నిల్వలు ఉంచినా.. నల్లబజారుకు తరలించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇండియా– పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలపై సామాజిక మాధ్యమాల్లో వస్తన్న వార్తలు నమ్మొద్దని తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలి రాయచోటి: వివిధ సమస్యలతో ప్రజావేదికకు వచ్చిన బాధిత సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారంపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్‌ద్వారా ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పోలీసుశాఖకు స్వేచ్ఛగా తెలియజేయడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉపయోగపడాలని తెలిపారు. -
విదేశీ విద్యావకాశాలపై అవగాహన
కురబలకోట: మారుతున్న ప్రపంచంలో వివిధ విదేశీ యూనివర్సిటీలు భారత విద్యార్థులకు అర్థవంతమైన అవకాశాలు కల్పిస్తున్నాయని హైదరాబాద్ ఆర్వ మేనేజ్మెంట్ సర్వీస్ రీసోర్సు పర్సన్ ఎ. అనిల్ కుమార్ అన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విదేశీ విద్య, స్కాలర్షిఫ్లపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా కేరీర్లో విద్యార్థులు రాణించవచ్చన్నారు. ఆకాశమే హద్దుగా ఉపాధి, ఉద్యోగ రంగాలతో పాటు పరిశోధన రంగంలో విస్త్రృత అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు విదేశీ ఉన్నత విద్యావకాశాలు కొత్త దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. ప్రపంచ స్థాయిలో విద్యాభ్యాసం మనిషి జీవితంలో సరికొత్త అద్యాయానికి తెరలేపుతుందన్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు భారత విద్యార్థులకు వీసా సడలింపులు, స్కాలర్షిప్ లు పెంచడం వంటి ప్రక్రియలతో విద్యార్థులు విదేశీ ఉన్నత విద్య పట్ల మక్కువ చూపుతున్నారన్నారు.భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అవసరమన్నారు. కార్యక్రమంలో ఇంగ్లీషు విభాగాధిపతి డాక్టర్ సమీనా తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో డ్రిప్ పైపుల దొంగలు
గుర్రంకొండ : అసలే టమాటాతో సహా ఏ ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఓ వైపు రైతులు అల్లాడుతున్నారు.. మరోవైపు రైతుల పొలాల్లో ఇష్టానుసారం డ్రిప్‌పైపులు, ల్యాడర్లులను చోరీ చేసుకెళుతున్న దొంగల్ని రైతులు పొలీసులకు పట్టించిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. దొంగల వద్ద నుంచి ఆటోతో సహా రూ. 2 లక్షలు విలువచేసే డ్రిప్ పరికరాలు, పైపుల్ని రైతులు రైతులు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుర్రంకొండ, కండ్రిగ గ్రామాల పరిధిలో రైతులు టమాటాతో పాటు ఇతర పంటల్ని సాగు చేసుకొంటున్నారు. పంట సాగుకు అవసరమైన డ్రిప్‌పైపులు, ల్యాడర్లను వేలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటారు. ఎకరం పొలానికి రూ. 30 వేలు నుంచి రూ. 40 వేలు విలువ చేసే పరికరాలను రైతులు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గుర్రంకొండ, కండ్రిగ గ్రామాల్లో కొంతమంది దొంగలు గుట్టుచప్పుడు కాకుండా డ్రిప్‌పైపులు, పరికరాలను పొలాల వద్ద చోరీ చేసుకెళుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దొంగలు పగలు పొలాల వద్ద రెక్కీలు నిర్వహంచి రాత్రిళ్లు యథేచ్ఛగా డ్రిప్ పరికరాల చోరీకి పాల్పడుతున్నారు. ఆదివారం కండ్రిగ గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా ఆటోలో డ్రిప్‌పైపులు, పరికరాలు తీసుకెళుతుండడంతో రైతులు అడ్డగించారు. పైపులకు సంబంధించిన వివరాలు ఆరా తీయగా దొంగలు పొంతనలేని సమాధానలివ్వడంతో రైతులు వారిని పట్టుకొన్నారు. సమాచారాన్ని పొలీసులకు అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రూ. 2 లక్షల విలువచేసే డ్రిప్ పరికరాలున్న ఆటోతో సహా దొంగలను పొలీస్ స్టేషన్‌కు తరలించారు. గుర్రంకొండ, కండ్రిగ గ్రామాల చుట్టుపక్కల పొలాల్లో పెద్ద ఎత్తున చోరీలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు దొంగల్ని విచారిస్తున్నారు. వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. ఆటో సహా రూ.2 లక్షలు విలువచేసే పైపులు స్వాధీనం దొంగల్ని పట్టించిన రైతులు -
ఉపాధ్యాయ సంఘాల సూచనలను పరిగణనలోనికి తీసుకోవాలి..
ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా విద్యా శాఖాధికారులు ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం వల్ల ప్రభుత్వ విద్యారంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి గ్రామంలో 1 నుండి 5 తరగతులతో ప్రాథమిక పాఠశాలలను తప్పనిసరిగా కొనసాగించాలి. 1 నుండి 10 తరగతుల విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలకు అన్ని రకాల సబ్జెక్టు టీచర్లను నియమించాలి. ఉన్నత పాఠశాలలలో 45 మంది విద్యార్థులు దాటితే రెండవ సెక్షన్ , 80 మంది దాటితే మూడవ సెక్షన్‌ను ఏర్పాటు చేయాలి. – ఆదిరెడ్డి శ్యాసుందర్‌రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
యథేచ్ఛగా ప్రభుత్వ భూముల కబ్జా
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పుల్లంపేట అడ్డగా మారింది. పుల్లంపేట మండలంలో 22 గ్రామ పంచాయతీలు ఉండగా పది గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించుకొని రాత్రికి రాత్రే మొక్కలు నాటుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆక్రమణదారులకు రైల్వేకోడూరు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉన్నా యని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. పుల్లంపేట మండలంలోని కొమ్మనవారిపల్లి, దళవాయిపల్లి, రెడ్డిపల్లి, అనంతంపల్లి, రంగంపల్లి, బావికాడపల్లి, అనంతసముద్రం, వత్తలూరు, దేవసముద్రం, దొండ్లోపల్లి, గారాలమడుగు, తదితర గ్రామాలలో కూటమి ఫ్రభుత్వం అధికారం చేపట్టాక వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. గత ప్రభుత్వంలో ఎనిమిదవ విడత భూ పంపిణీలో భాగంగా పేదలకు పంంచాల్సిన ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. కొమ్మనవారిపల్లి సర్వే నంబరు. 846లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని మామిడి చెట్ల పెంపకం సాగిస్తున్నారు. అలాగే కొమ్మనవారిపల్లికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మండల వ్యాప్తంగా కబ్జాదారులు వారి ఇష్టానుసారం ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. దోచుకున్నవారికి దోచుకున్నంత అన్న చందంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నారు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లోపించడంతో మండల స్థాయి అధికారులు వారి ఇష్టానుసారం వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మండల అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ పుల్లంపేట మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణపై ప్రత్యేక అధికారిని నియమించి విచారణ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై తహసీల్దార్ అరవింద కిషోర్‌ను వివరణ కోరగా ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు -
కమణీయం.. శ్రీ నారసింహుడి కల్యాణం
గుర్రంకొండ : మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం శ్రీ నృసింహస్వామి జయంతి వేడుకలను పురస్కరించుకొని స్వామివారికి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు. ఆలయంలో చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లి వేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి రాభిషేకం చేశారు. రంగురంగుల పుష్పాలతో స్వామివార్లను అలంకరించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ముత్యాల తలంబ్రాలతో స్వామివారి పెళ్లి వేడుక నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య మేళతాళాలతో శాస్త్రోక్తంగా మాంగల్యధారణ కావించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామివారి ఎదుట యజ్ఞహోమాలు జరిపారు. రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులకు టీటీడీ వారు పట్టువస్త్రాలు, కంకణాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గోపాల బట్టార్, కృష్ణరాజ బట్టార్, అనిల్‌స్వామి, గోకుల్‌స్వామి పాల్గొన్నారు. ఘనంగా తరిగొండ వెంగమాంబ, నృసింహ జయంతి మండలంలోని తరిగొండలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 255వ జయంతి, నృసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రియ భక్తురాలైన ప్రముఖ రచయిత్రి వెంగమాంబ జన్మస్థలం తరిగొండ గ్రామం. ఇక్కడే శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ ప్రాంగణంలోనే వెంగమాంబ ఆలయం ఉంది. వెంగమాంబ, నరసింహస్వామి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కావించారు. వేదపండింతుల మంత్రోచ్ఛారణల మధ్య మహా స్నపనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంగమాంబ ఆలయాన్ని రంగు రంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలతో పురవీధుల గుండా స్వామివార్లకు గ్రామోత్సవం నిర్వహించారు. టీటీడీకి చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల చేత మాతృశ్రీ వెంగమాంబ సంకీర్తన గోష్టిగానం, హరికథా కాలక్షేప కార్యక్రమాలు నిర్వహించారు. వెంగమాంబ, నృసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహించారు. గుర్రంకొండలో.. మండల కేంద్రమైన గుర్రంకొండలో నృసింహస్వామి జయంతి వేడుకలు రెండేళ్ల తరువాత ఘనంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక చరిత్రాత్మక గుర్రంకొండ కోట పైభాగంలో ఉన్న శ్రీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలను జరిపారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు కిరణ్‌కుమార్‌శర్మ పాల్గొన్నారు. -
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి..
అధిక సంఖ్యలో ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి. ప్రభుత్వం రూపొందించిన విధానాల వల్ల విద్యా రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. – రెడ్డెప్పరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్, అధ్యక్షుడు అన్నమయ్య జిల్లా -
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో పరిపాలన సాగలేదు...అంతా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్ విమర్శించారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచం అంతా మహిళలను గౌరవిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అగౌరవపరుస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఓ వైపు ఉగ్రవాదులతో దేశం యుద్ధం చేస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక మాజీ మహిళా మంత్రికే విలువ లేకుంటే ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా ఆ ర్గనైజింగ్ సెక్రటరీ సుగవాసి శ్యాం కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజని పీఏపై అక్రమ కేసులు బనాయించి తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు తీసుకెళ్లడం అమానుషం అన్నారు. ఆ సంఘటకు కారణమైన సీఐ సుబ్బానాయుడును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ సుగవాసి పద్మ, గువ్వల నాగలక్ష్మి, గువ్వల బుజ్జి బాబు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట సబ్‌కలెక్టరేట్‌కు నూతనశోభ రాజంపేట : రాజంపేట సబ్‌కలెక్టరేట్ నూతనశోభను సంతరించుకుంది. ఆదివారం జేసీ రాజేంద్రన్ ప్రారంభించారు. సబ్‌కలెక్టరేట్ భవనాలను ఇటీవల ఆధునీకరణ చేశారు. సబ్‌కలెక్టర్ వైఖోమానైదియా దేవి బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె సబ్‌కలెక్టరేట్ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నూతన భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ వైఖోమానైదియాదేవి, మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్తోపాటు రెవెన్యూ అధికారులు, సబ్‌కలెక్టరేట్ సిబ్బంది, వివిధ మండల అధికారులు పాల్గొన్నారు. కాగా నూతనశోభను సంతరించుకున్న సబ్‌కలెక్టరేట్‌కు ఐఎస్ఓ సర్టిఫికెట్ గుర్తింపు వచ్చింది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దగ్ధంప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న ఒక ట్రాక్టర్, రెండు చెత్త సేకరణ ట్రై సైకిళ్లు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఆదివారం దగ్ధమయ్యాయి. ట్రాక్టర్ ఇటీవల మరమ్మతులకు గురికావడంతో పక్కన పెట్టామని, ఎండ వేడిమికి మంటలు చెలరేగాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి తెలిపారు. -
గోనుపల్లి వద్ద ఘోరం!
రాపూరు : నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గోనుపల్లి వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా.. పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం, పెరింపాడు గ్రామానికి చెందిన కుటుంబీకులు సుమారు 23 మంది రాపూరు మండలం, పెంచలకోనలో జరిగే బ్రహ్మోత్సవాలకు ట్రక్కు ఆటోలో బయలుదేరారు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి ట్రక్కు ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఇందులో ప్రయాణిస్తున్న పెరింపాడుకు చెందిన శివయ్య, రాధమ్మ, నారాయణమ్మకు తీవ్ర గాయాలు కాగా.. మరో పది మందికిపైగా స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది, పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు. తప్పిపోయిన బాలిక పోలీసులకు అప్పగింతరైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట వై.కోట క్రాస్ వద్ద తప్పిపోయిన తిరుపతి జీవకోనకు చెందిన నాగమణి అనే బాలికను ఆదివారం వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ సీహెచ్ రమేష్, అనంతరాజుపేట ఎంపీటీసీ బండారు మల్లికార్జునలు పోలీసులకు అప్పగించారు. వీరి వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు.● బోల్తా పడిన ట్రక్కు ఆటో ● పలువురికి గాయాలు -
చర్చలలో ఒక తీరు, నిర్ణయాలు మరో తీరు..
పాఠశాలల పునః వ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు ఒక తీరుగా, నిర్ణయాలను అమలు చేసేటప్పుడు మరో తీరుగా వ్యవహరిస్తోంది. జీఓ 117ను బేషరతుగా రద్దుచేసి, దాని స్థానంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలలను పునః వ్యవస్థీకరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. అన్ని ప్రాథమిక పాఠశాలలలో 1:20 నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయులను నియమించాలనే ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని దిగజార్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్గా నియమిస్తామనడం సరికాదు. – మాదన విజయకుమార్, యూటీఎఫ్ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు -
మహిళలపై పోలీసుల వైఖరి సిగ్గుచేటు
రాజంపేట రూరల్ : మహిళల పట్ల పోలీసులు రౌడీలుగా వ్యవహరించటం సిగ్గుచేటని, మాజీ మంత్రి విడదల రజనిపై సీఐ సుబ్బనాయుడు తీరు దారుణమని వెఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి మండిపడ్డారు. స్థానిక ఆకేపాటి భవన్లో ఆదివారం వైఎస్సార్సీపీ నియోజక వర్గ మహిళా అధ్యక్షురాలు మిరియాల సురేఖ, జిల్లా కార్యదర్శి రక్కాసీ శ్రీవాణీ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండు చంద్రలీలతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాలనలో మహిళలకు ఎంతో ప్రాధా న్యత ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసుల ఎదుటనే దిశ చట్టానికి సంబంధించిన పేపర్లను తగలబెట్టడం బాధాకరమన్నారు. ఒక మహిళ అని కూడా చూడకుండా మాజీ మహిళా మంత్రి విడదల రజని చేయి పట్టి లాగి పక్కకు నెట్టేసి దౌర్జన్యంగా కారులోకి దూరి పీఏ శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
రాయచోటి: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కాను న్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు 37, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 26 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. 13978 మంది విద్యార్థులు..... జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 13978 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 10726 మంది, ద్వితీయ ఏడాదికి సంబంధించి 3252 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంపంధించి ఇంప్రూవ్మెంట్ రాసే వారి సంఖ్య అధికంగా ఉంది. జనరల్ 10726 మంది ఉన్నారు. కాగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 37 మంది డిపార్టుమెంట్, 37 మంది చీఫ్ సూపరిటెండెంట్లను నియమించారు. ద్వితీయ ఏడాదికి సంబంధించి 26 మంది డిపార్టుమెంట్ అధికారులు, 26 మంది చీఫ్ సూపరిటెండెంట్లను నియమించారు. వీరితోపాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. పశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని ఆయా పోలీసు స్టేషన్లో భద్రపరిచారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండు సెషన్లలో.... ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, ద్వితీయ ఏడాదికి సంబంధించి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా హాజరుకానున్న 13978 మంది విద్యార్థులు -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 12వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని ఆయన తెలిపారు.గంగమ్మా..కరుణించమ్మా..లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. గంగమ్మా..వర్షాలు సకాలంతో కురిపించమ్మా...కరుణించి.. కాపాడు తల్లీ అంటూ వేడుకున్నారు. చుట్టుపక్కల వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.నేటి నుంచి అన్నమాచార్యుడి జయంత్యుత్సవాలురాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 617 జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద ఏర్పాట్లను పూర్తిచేసింది. ఈనెల 18వరకు ఉత్సవాలు జరుగుతాయని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తొలిరోజు గోష్టిగానంతో ఉత్సవాలు ప్రారంభమవతాయి. సంగీతసభలు, హరికథలు ఉంటాయని చెప్పారు.ఈ సందర్భంగా శ్రీనివాసుని కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఊంజల్‌సేవ జరగుతుందని వివరించారు. కాగా తాళ్లపాక ధ్యానమందిరం ఆవరణలో చలువపందిళ్లు ఏర్పాట్లు చేశారు.కొనసాగుతున్న సీహెచ్‌ఓల సమ్మెరాయచోటి: సమస్యల పరిష్కారం కోరుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓ) చేపట్టిన సమ్మె 14వ రోజుకు చేరింది. ఆదివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమ్మె కొనసాగింపుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం పడకేసింది. దగ్గు,జలుబు, జ్వరం లాంటి వ్యాధులకు చికిత్స అందించే ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందన చూపడం లేదని సీహెచ్‌ఓలు విమర్శించారు. ప్రోత్సాహకాల బకాయిలను 7 నెలలుగా చెల్లించకపోవడం దారుణమని అన్నారు. వేతన సవరణ అంశం, ప్రోవిడెంట్ ఫండ్ తదితర వాటిపై అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి పరిష్కారం కోసం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. కార్య క్రమంలో ఏపీఎంసీ అన్నమయ్య జిల్లా నాయకులు సాల్మోహన్, అహ్మద్‌బాషా, శివ కుమార్, భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
లాహిరి..లాహిరి..లాహిరిలో..
పగలంతా భక్తుల మొరలు విని వారి సమస్యలను తీర్చి శ్రమించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుడు సాయంత్రం వాతవరణం చల్లబడ్డాక అలా అలా తెప్పపై జలవిహారం చేస్తూ సేద తీరాడు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలో భాగంగా రెండవరోజు ఆదివారం పుష్కరిణిలో తెప్పపై స్వామి, అమ్మవార్లు ఐదుమార్లు విహరించారు. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేర్చారు. అక్కడి అలంకార మండపంలో విశేష అభిషేకాలు, అలంకారం చేసి, మంగళ హారతులు ఇచ్చి పుష్కరిణిలో సిద్ధంగా ఉంచిన తెప్పపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు త్రివిక్రమ్, కృష్ణమోహన్ బృందం, ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో మంగళ హారతులు ఇచ్చి తెప్పను జల విహారం చేయించారు. భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఈ మనోహరమైన దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. భక్తుల గోవిందనామ స్మరణలతో పుష్కరిణి పరిసరాలు మార్మోగాయి. ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. –కడప కల్చరల్ -
ఎర్ర స్మగ్లింగ్‌లో తగ్గేదేలే...
పల్లాగట్టు ప్రాంతం 20 కిలోమీటర్లలో విస్తరించి ఉంది.వెలుగులోకి రాని ఈ ఐలాండ్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు పల్లా గట్టును తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గుండ్లమాడతోపాటు సోమశిల వెను కజలాల వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి అక్రమరవాణాకు బ్యాక్‌వాటర్ అడ్డాగా వాడుకుంటున్నారు. రాజంపేట: ఉభయ వైఎస్సార్ జిల్లాలో విస్తరించిన సోమశిల బ్యాక్‌వాటర్ ‘పుష్పా’లకు అడ్డగా మారుతోందన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. నందలూరు, ఒంటిమిట్ట మండలాల పరిధిలో ఉన్న సోమశిల బ్యాక్‌వాటర్‌లో ఎర్రచందనం స్మగ్లింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. గతంలో అటవీశాఖ ప్రత్యేక దృష్టి సారించి ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసింది. గతంలో ఉన్నతాధికారులు దుంగలను పట్టుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి.ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు.గత కొంతకాలంగా స్మగ్లింగ్ మళ్లీ పడగవిప్పిందని ముంపుగ్రామాల్లో చర్చ మొదలైంది. ఆదిశగా అటవీశాఖ చర్యలు కనిపించడంలేదన్న విమర్శలు ఉన్నాయి. జనసంచారంలేని ప్రాంతాలే టార్గెట్.. అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి వాటిని జనసంచారం లేని ముంపు గ్రామాల శివార్లకు చేర్చి.. అక్కడి నుంచి అనుమానం రాకుండా అనుకున్న ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం గురించి ముంపుగ్రామాల్లో ఏ ఒక్కరిని కదిలించినా చెప్పేస్తారు. ఇప్పటికే ఈ స్మగ్లింగ్‌తో బ్యాక్‌వాటర్ సమీప గ్రామాలకు చెందిన కొందరు ఆర్ధికంగా బాగా స్ధిరపడ్డారన్న వాదన వినిపిస్తోంది. పల్లాగట్టు, గుండ్లమడ ప్రాంతాల పరిధిలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి వాటిని నాటుబోట్లలో గట్టుకు చేర్చి అక్రమంగా మెయిన్‌రోడ్డుకు తరలిస్తున్నారు. చేపలవేట ముసుగులో... చేపలవేట ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఐస్‌బాక్స్‌లో పైన చేపలు, కింద భాగంలో ఎర్రచందనం దుంగలు అక్రమంగా రవాణా చేస్తున్నారు. బ్యాక్‌వాటర్‌లో చేపల వేట ముసుగులో ముంపు గ్రామాలకు సంఽబంధించిన ఇద్దరు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా ఇటీవల ఇతర ప్రాంతంలో పట్టుకొని కేసులు కూడా నమోదు చేసినట్లు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం వల్ల ముంపుగ్రామాలకు చెందిన కొందరు తిరుపతి, రేణిగుంట తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు, స్ధానికంగా కూడా విలాసవంతమైన జీవితాలను గుడుపుతున్నారని ఇక్కడి వారు చర్చించుకుంటున్నారు. ఈ విషయం అటవీశాఖ స్ధానిక సిబ్బందికి తెలియకుండా ఉంటుందా అన్న భావనలు పుట్టుకొస్తున్నాయి. ముంపు గ్రామాల్లో వాహనాల రాకపోకలు జనజీవనం లేని ముంపు గ్రామాల్లో అర్ధరాత్రి వేళలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ వాహనాలు ఎందుకు వస్తున్నాయి..పోతున్నాయనేది పరిసర గ్రామాల వారికి తెలిసినా, తెలియనట్టు ఉంటారు. నేరుగా బ్యాక్‌వాటర్ ఉన్న ప్రాంతాల వద్దకు చేరుకొని, అక్కడి నుంచి అక్రమరవాణా మొదలవుతుంది. చేపల వేట, వ్యాపారంతో పేరుతో ఇతర ప్రాంతాలకు చెందిన ముంపుగ్రామాల్లో మకాం వేసి, జీవనం సాగిస్తున్నారు. అసలు నిజంగా చేపల వ్యాపారం కోసమే ఉన్నారా? దీని ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారా అనేది అటవీశాఖ విచారణలో వెల్లడి కావాల్సిన అంశం. ఐలాండ్‌గా పల్లాగట్టు చెక్‌పోస్టులు ఉన్నా... మచ్చుకొక సంఘటన.. సోమశిలలో పుష్పరాజ్‌లు వెనుకజలాల చాటున యథేచ్ఛగా దుంగల అక్రమరవాణా చేపల వేట ముసుగులో తరలింపు స్థానిక అటవీ సిబ్బంది సహకారం పై అనుమానాలు సోమశిలబ్యాక్వాటర్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సోమశిల బ్యాక్‌వాటర్ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారి స్తాము. ఇప్పటికే బేస్‌క్యాంప్‌ను అక్కడ ఉంచాం. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగుతున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారణ చేపడతాం. దుంగల తరలింపును అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. –జగన్నాథసింగ్, జిల్లా అటవీశాఖాధికారి, రాజంపేట గత వారంలో కొంతమంది యువకులు బ్యాక్‌వాటర్‌లోకి వెళ్లారు. ఈత కొడుతుండగా దుంగలు కనిపించాయి.ఇది ఆ నోటా..ఈ నోటా అటవీఅధికారులకు చేరింది. బ్యాక్‌వాటర్‌లో తనిఖీ చేసేందుకు వచ్చారు. పరిశీలించి, అవి దుంగలు కాదు..రాళ్లు కొట్టుకువచ్చాయంటూ డైవర్సన్ చేశారు. అదే రోజున సిబ్బందికి నాటుకోడి, సారా విందు ఇచ్చారని ఆరోపణలు గుప్పుమన్నాయి. తర్వాత రెండురోజులకే బ్యాక్‌వాటర్‌లో ఉంచిన దుంగలను ఎవరికి అనుమానం రాకుండా తరలించేశారని ముంపుగ్రామాల్లో గుసగుసలు వినిపించాయి. కడప–రేణిగుంట జాతీయరహదారిలో రామాపురం(రాజంపేట) భాకరాపేట(సిద్ధవటం)లో, రైల్వేకోడూరు –రేణిగుంట మధ్యలో బాలపల్లెలో, నెల్లూరు రహదారిలో బెస్తపల్లె, అనుంపల్లె వద్ద చెక్‌పోస్టులు ఉన్నాయి. అయినా ఏ విధంగా ఎర్రచందనం దుంగలు అక్రమంగా దాటిపోతున్నాయో అంతుపట్టడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సోమశిల బ్యాక్‌వాటర్ వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటుచే యాలని ముంపువాసులు కోరుతున్నారు. నందలూరు మండలంలో మదనమోహనపురం క్రాస్ ద్ద అటవీ చెక్‌పోస్టు పెడితే ఎర్రచందనం అక్రమరవాణాకు బ్రేక్ పడుతందని మండలవాసులు పేర్కొంటున్నారు. -
మండలాల వారీగా విత్తనకాయల కేటాయింపు (క్వింటాళ్లు)
: : : : : : : : : : : :బి.కొత్తకోట 1,973.9 మదనపల్లె 1,185 నిమ్మనపల్లె 1,105 రామసముద్రం 1,016 కేవీపల్లె 2,357 పీలేరు 1,644 పెద్దమండ్యం 1,373 గుర్రంకొండ 923.9 కలకడ 986.9 కలికిరి 1,089.9 వాయల్పాడు 1,352.9 బఫర్ 837 చిన్నమండెం 591 సంబేపల్లె 1,790 టి.సుండుపల్లె 805 రాయచోటి 789 గాలివీడు 2,364.9 లక్కిరెడ్డిపల్లె 1,760 రామాపురం 764 వీరబల్లి 330 తంబళ్లపల్లె 3,019.9 ములకలచెరువు 2,731.9 కురబలకోట 1,535.9 పెద్దతిప్పసముద్రం 3,663.9 -
‘పేడ నీళ్ల’ రచ్చ.. అసలేం జరిగిందంటే?
జమ్మలమడుగురూరల్(అన్నమయ్య): ఇంటి ముందు పేడ నీళ్లు చల్లే విషయంలో జరిగిన చిన్న చిన్న పాటి గొడవ పెద్దదై పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. మండల పరిధిలోని పి. బోమ్మెపల్లి గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు పోలీసుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. బొగ్గు గురులక్ష్మి తన ఇంటి ముందు పేడ నీళ్లు చల్లుకుంటూ ఉండగా కొన్ని నీళ్లు పక్కన నివాసం ఉంటున్న రాజచౌడయ్య ఇంటి వద్ద పడ్డాయి. ఈ విషయమై ఇరువురి మధ్య తీవ్ర స్థాయి వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు కుటుంబాల వారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు కుటుంబాలకు చెందిన వారు గాయపడ్డారు. గాయపడి వారిలో బొగ్గు నాగ అంజి, మహేష్, నాగేంద్ర, మల్లికార్జున, రామాంజనేయులు, గురులక్ష్మి, మరోవర్గంలో గూడెంచెరువు రాజ చౌడయ్య, సోమశేఖర్, పెద్ద చౌడప్ప, రమణమ్మ, రామ చౌడయ్య ఉన్నారు. రాజ చౌడయ్యకు తలపై బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరుకు తరలించారు -
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
మదనపల్లె రూరల్ : మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సమావేశం ఎన్.జి.ఓ కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ... కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలుకై చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారత దేశంలోని యావత్ కార్మికవర్గం మే 20వ తేదీన సమ్మె చేయడం ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 13 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సార్వత్రిక సమ్మె ఏ రంగంలో పనిచేసే కార్మికులకై నా కనీస వేతనం ధరలకు అనుగుణంగా 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తుందని తెలిపారు. పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై, కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మే 20 సమ్మెలో కార్మికులు సంఘాలతో నిమిత్తం లేకుండా భారీగా పాల్గొనడం ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వరి, నాయకులు మధురవాణి, కృష్ణమూర్తి, ఐద్వా నాయకురాలు భాగ్యమ్మ తదితరులు మాట్లాడుతూ లేబర్ కోడ్ రద్దు చేయడం, ఇండియన్ లేబర్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం, నెలవారీ కనీస వేతనం రూ. 26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ రూ. 9,000 అందించడం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఏ పథకం కిందకు రానివారికి నెలకు రూ. 6,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ రాజు, కృష్ణప్ప, శంకర్ నాయక్, గౌరీ, ప్రమీల, సుగుణ, ప్రభావతి, అఖిరున్నిష, విజయ తదితరులు పాల్గొన్నారు. -
వెరిటాస్ సైనిక్ స్కూల్‌కు భారత ప్రభుత్వం అనుమతి
తిరుపతి కల్చరల్ : తిరుపతిలో గత 22 ఏళ్లుగా బీఎస్ఆర్ విద్యాసంస్థల ద్వారా క్రమశిక్షణతో కూడి విద్యతో పాటు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు విద్యార్థుల ఉన్నతికి, దేశ రక్షణకు అందిస్తున్న సేవలను గుర్తించి భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ అనుమతి పొందిందని వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి తెలిపారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ విద్యాసంస్థల ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు 6 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు. అందరి సహకారంతో భారత రక్షణ దళానికి ఎంతో మంది సైనికులను అందించేలా కృషి చేశామన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ స్థాపించినప్పటి నుంచి అనుభజ్ఞులైన వారిచే అత్యుత్తమమైన విద్యాప్రమాణాలతో విద్యార్థులకు విద్యతో పాటు శారీరక, మానసిక, మానవీయ విలువలతో కూడిన విద్యను అందస్తూ ఆదరణ పొందామన్నారు. భారత ప్రభుత్వం గుర్తింపుతో మరింత బాధ్యతగా దేశ భద్రత కోసం వెరిటాస్ సైనిక్ స్కూల్ ముందడుగు వేస్తోందన్నారు. దేశానికి అవసరమైన విద్యను యువతకు డిఫెన్స్ రంగగాలలో ఎన్డీఏ, టీఈఎస్ వంటి ఉత్తమమైన ఉద్యోగ అవకాశాలను కేవలం 17 ఏళ్ల వయస్సులోనే పొందే విధంగా తీర్చిదిద్దాలని సంకలిపంచామన్నారు. ఇకపై ఆలిండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ పరీక్షల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. విద్యాసంస్థలో ప్లస్–1 ఇంటర్మీడియట్‌తో స్పెషల్ ఎన్డీఏను ప్రారంభిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో వెరిటాస్ సైనిక్ స్కూల్ డైరెక్టర్లు బి.శ్రీకర్‌రెడ్డి, బి.సందీప్‌రెడ్డి పాల్గొన్నారు. వెరిటాస్ సైనిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ బి.శేషారెడ్డి -
అన్నమయ్య కోసం.. కదిలిన వారసులు !
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సంకీరన్తలు విశ్వవ్యాప్తి చేసేందుకు అన్నమయ్య వారసులు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో 2005లో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్‌ను ఆగస్టు 30న తిరుపతిలో ప్రారంభించుకున్నారు. ఉభయ తెలుగురాష్ట్రాలలో సంకీర్తనల సేవతోపాటు ఆధ్యాత్మిక, సామాజిక సేవలను కొనసాగిస్తూ వస్తున్నారు. 12వ తరం అన్నమయ్య వారసులు ఏర్పాటుతో ప్రారంభమై ఇప్పుడు 13వ తరం వారసులు కూడా నేటి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణా)లో అన్నమయ్య సేవా సంస్కృతి అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఊరూరా అన్నమయ్యలో.. ఊరూరా అన్నమయ్య కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆలయాలకు వెళ్లి సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విష్ణుపురాణం, హనుమాన్ చాలీసా, నగర సంకీర్తన కార్యక్రమాలు చేపడుతున్నారు. అన్నమయ్య పల్లకీసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనలు, కోలటాలలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. సామాజికసేవ, ఆధ్యాత్మికసేవ, అన్నమయ్య సంకీర్తన ప్రచారసేవ, సాంస్కృతిక సేవ, భక్తిసేవ, సంగీతసేవ, పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా అన్నమయ్య సంకీర్తనలు నేర్పిస్తున్నారు. కోలాటంలో కూడా శిక్షణ ఇస్తున్నారు. పిల్లలకు స్తోత్ర మంజరి పై కార్యక్రమాలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించారు. ఏటా అన్నమయ్య ఆరాధనోత్సవాలు.. ప్రతి ఏటా అన్నమయ్య ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీటీడీ నిర్వహించే అన్నమయ్య జయంతి, వర్ధంతి ఉత్సవాలకు అన్నమయ్య 12 వతరానికి చెందిన హరిస్వామి విధిగా పాల్గొంటున్నారు. ఈ ట్రస్ట్ చైర్మన్‌గా తాళ్లపాక రామ్‌చరణ్, వైస్‌చైర్మన్‌గా తాళ్లపాక కృష్ణధీరజ్, సెక్రటరీగా తాళ్లపాక గౌరీ ప్రసన్న, ఉభయ రాష్ట్రాల డైరెక్టర్లుగా కొఠారి సునీత, మీనాక్షి అన్నమయ్యలున్నారు. సామాజిక సేవలోనూ.. ప్రతి సంవత్సరం మార్చి నుంచి జూన్ వరకు వేసవిలో విశాఖ, కర్నూలు నగరాలలో భక్తులకు దాహం తీర్చేందుకు మంచినీళ్లు, మజ్జిగ వితరణ కేంద్రాలను ఏర్పాటుచేసి అన్నమయ్యసేవను అందిస్తున్నారు. అలాగే పల్స్‌పోలియో, మెడికల్ క్యాంప్, రక్తదానశిబిరం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం కొనసాగుతోంది. అన్నమయ్య బాటలో ఆయన వారసులు ముందుకెళుతున్నారు. 12న అన్నమయ్య జయంత్యుత్సవాల్లో వారసులు.. ఈనెల 12న జరిగే అన్నమయ్య జయంత్యుత్సవా ల్లో అన్నమయ్య వారసులు పాల్గొంటారు. వారిని టీటీడీ గౌరవిస్తుంది. అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో ఊరూరా అన్నమయ్య..ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఊరూరా అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంకీర్తనల సేవ ఏటా అన్నమయ్య వర్ధంతి, జయంతి, ఆరాధనోత్సవాలు నడుం బిగించిన అన్నమయ్య 12వ తరం వారసులు అన్నమాచార్యుని వంశీయులు కావడం పూర్వజన్మ సుకృతం అన్నమాచార్యుని వారసులు కావడం మా పూర్వజన్మ సుకృతం. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు చూపిన మార్గంలో మేము నడుచుకుంటున్నాము. శ్రీవారిసేవ చేసుకునే మహాభాగ్యం దక్కింది. ఆధ్యాత్మిక, సామాజిక సేవలను చేస్తున్నాము. అన్నమయ్య కీర్తనలు విశ్వవ్యాప్తం చేసేందుకు. ఊరూరా అన్నమయ్య.. ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాన్ని చేపట్టాము. టీటీడీ, భక్తుల సహకారంతో విజయవతంగా నిర్వహిస్తున్నాము. – తాళ్లపాక హరినారాయణచార్యులు, తిరుమల నలుదిశలా అన్నమయ్య సంకీర్తనలకు విస్తృత ప్రచారం తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నాం. ఊరూరా అన్నమయ్య..ఇంటింటా అన్నమయ్య కార్యక్రమాలను ఏపీ, తెలంగాణలో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామంటే భక్తులు, టీటీడీ సహకారం మరువలేనిది. – తాళ్లపాక గౌరీ ప్రసన్న, ట్రస్ట్ సెక్రటరీ, తిరుమల -
తల్లికి వందనం.. వీడని సందిగ్ధం !
రాయచోటి : తల్లికి వందనంపై ప్రభుత్వం వైపు నుంచి వారి అనుకూల పత్రికలు, సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్న నిబంధనలు, మార్గదర్శకాలపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళనలు, నీలినీడలు అలుముకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఇస్తామన్న తల్లికి వందనం గత ఏడాదికి వర్తిస్తుందా లేక రానున్న విద్యా సంవత్సరానికి వర్తిస్తుందా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా మే నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులకు సమాయాత్తమవుతోంది. ఈ మేరకు మార్గదర్శకాలపై జరుగుతున్న కసరత్తుతో ఎంత మంది తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందోనన్న కలవరం మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం ముందుగానే తల్లికి వందనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపైన స్పష్టత ఇచ్చినా నమ్మకం లేకుండాపోయింది. ఒకవేళ చెల్లిస్తే ఇదే విడతలోనే అమలు చేస్తారా.. రెండు విడతలుగా చెల్లిస్తారా అనేది చర్చగా మారింది. ఇక దాదాపుగా ఈ పథకం అమలులో నిబంధనలు ఖరారైనట్లు జరుగుతున్న ప్రచారంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అమలుపై కసరత్తు.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా తల్లికి వందనంపైన చేస్తున్న కసరత్తుపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించినా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. హామీ ఇచ్చిన విధంగా ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున ఇస్తారా లేక నిబంధనల పేరుతో కోత పెడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికలో కీలకం కానున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల సభలో ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా ఇస్తామని చెబుతూనే.. ఒక ఇన్‌స్టాల్‌మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తోంది. చంద్రబాబు నుంచి రాని క్లారిటీ.. తల్లికి వందనం పథకాన్ని విద్యా సంవత్పరం ప్రారంభం ముందే అమలు చేస్తామని చెబుతున్నా పథకం అమలు విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో ఒకే విడతలో రూ.15 వేలు చెల్లిస్తారా.. రెండు విడతలుగా రూ.7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య.. కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇన్స్టాల్మెంట్ అంశం తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. 2025–26 బడ్జెట్లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించారు. 2024–25 విద్యా సంవత్సరంలో జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2,41,026 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే ఇందులో ప్రాథమికంగా ఈ పథకానికి ఎంత మంది విద్యార్థులు అర్హులుగా ఉంటారో విద్యాశాఖ తేల్చాల్సి ఉంది. నిబంధనలు.. ఈ పథకం అమలుకు సంబంధించిన విధి విధానాలపైన అధ్యయనం కొనసాగుతున్నట్లు సమాచారం. పథకం అమలులో భాగంగా విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, తెల్లరేషన్‌కార్డులు లేని వారిని, 300 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్న వారికి పథకం వర్తిస్తుందా లేదా వేచి చూడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. విద్యుత్ వినియోగం, కారు ఉండటం వంటి నిబంధనలను గతంలో వ్యతిరేకించిన కూటమి నేతలు ఇప్పుడు మినహాయింపు ఇస్తారా.. లేక కొనసాగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. జిల్లాలో 2731 పాఠశాలల్లో 2,41,026 మంది విద్యార్థుల ఎదురుచూపులు ప్రభుత్వం తాజా నిర్ణయాలు, నిబంధనలతో నీలినీడలు ఒకేసారి ఇస్తారా లేక కంతుల వారీగానా అన్న అనుమానాలు కొత్త నిబంధనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన