
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లపై వివక్ష ఎందుకు?
రాయచోటి: గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపడంపై హెల్త్ ఆఫీసర్లు మండిపడ్డారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు సమస్యల పరిష్కారం కోరుతూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమం బుధవారం 17వ రోజుకు చేరింది. హక్కుల సాధన కోసం సమ్మెబాట పట్టి 17 రోజులు కావస్తున్నా ప్రభుత్వం తరపున అధికారులు ఎలాంటి చర్చలు జరపక పోగా కొత్త ఆంక్షలు విధిస్తుండటం తగదన్నారు. ఇప్పటికే వేతనాలను నిలుపుదల చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రాత్రి 8 గంటల సమయంలో ఊరి బయట పొలిమేరల్లో ఉన్న హెల్త్ సెంటర్ దగ్గరకు వెళ్లి అటెండెన్స్ వేయాలని ఆజ్ఞాపించడం ఎంతవరకు సమంజసమన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఏపీఎంసీఏ అన్నమయ్య జిల్లా నాయకులు సాల్మోహన్స్, అహ్మద్ బాషా, శివకుమార్, విజయ్ కుమార్ తదితరులు డిమాండ్ చేశారు.