
రాబోయేది.. జగనన్న ప్రభుత్వమే
గాలివీడు : మళ్లీ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రాష్ట్ర మాజీ డీఓపీ జల్లా సుదర్శన్ రెడ్డి అన్నారు. స్థానిక సాయిమేఘన పెట్రోల్ బంక్ వద్ద జెడ్పీటీసీ ఖాదర్ మొహిద్దీన్, తదితరులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, మారుమూల ప్రాంతాలకు వెళ్లినా జగనన్నే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే అన్నారు. విద్య, వైద్యం కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, కరోనా విపత్కర సమయంలోనూ ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల భానుమూర్తి రెడ్డి, చెన్నకేశవరెడ్డి, రామాంజులు రెడ్డి, ఉమాప్రభాకర్, వల్లెపు నగేష్, రమణారెడ్డి, జల్లా ధనుంజయరెడ్డి, వెంకటరెడ్డి, అమీన్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ డీఓపీ జల్లా సుదర్శన్‌రెడ్డి