
ప్రధాన డిమాండ్లు
సాక్షి రాయచోటి: ఆక్రోశం అడుగడుగునా కనిపిస్తోంది..చేసిన పాపం లేదు...చెడుకు పోనే లేదు...కానీ వారు మాత్రం అన్యాయమై పోతున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అనుక్షణం పరితపించే వైద్య విభాగానికి సంబంధించిన వారికి కష్టాలు మొదలయ్యాయి. బాబు...మా మొర ఆలకించండి....మేమెన్నో కష్టాలు పడుతున్నామంటూ రోజుల తరబడి ఉద్యమబాట పట్టినా పట్టించుకునే పరిస్థితే లేదు. గత కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్‌ఓలు). వారి వేదన చూసి కూడా కూటమి సర్కార్ కనికరించకపోవడం గహనార్హం.
సమస్యలపై పోరుబాట
జిల్లాలో వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప రిధిలో ఆయుష్మాన్ భారత్ కింద సుమారు 375 మంది పనిచేస్తున్నారు.ప్రభుత్వం పెండింగ్ సమస్యలతోపాటు ఈపీఎఫ్, ఇతర ఉద్యోగుల మాదిరిగా భద్రత ను కల్పించాలని కోరుతున్నారు. హెచ్‌ఆర్ పాలసీ, ఇంక్రిమెంటు, ఎక్స్‌గ్రేషియా, ట్రాన్స్‌ఫర్, మాతృత్వ సెలవులు ఇలా అన్నింటిని అమలు చేయాలని ఉద్యమబాట పట్టారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు తెలిసినా తెలియనట్లు ఉన్నాయే తప్ప వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
25 రోజులుగా ఉద్యమం
జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కింద పనిచేస్తున్న 375 మంది ప్రతిరోజు రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా కలెక్టరేట్ మెయిన్ గేటు పక్కన టెంటువేసి వినూత్న నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని, తమ డిమాండ్లను నెరవేర్చి న్యాయం చేయాలని ఏదో ఒక కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన కలగకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో నిత్యం శిబిరంలో కూర్చొంటూ తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఏది ఏమైనా 25 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ఎటువంటి చిన్నపాటి స్పందన లేకపోవడంతో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
అలుపెరుగని పోరాటం చేస్తున్నాపట్టించుకోని కూటమి ప్రభుత్వం
రోజుకొక తరహాలో వినూత్న నిరసన
25 రోజులుగా సమ్మెలోనే..
ప్రజలకు వైద్య సేవలు దూరం
ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి
పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలి
ఈపీఎఫ్‌ఓ పునరుద్దరించాలి
క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్దీకరించాలి
నిర్దిష్టమైన జాబ్‌చార్టు అందించాలి
ఎఫ్‌ఆర్‌ఎస్ నుంచి సీహెచ్‌ఓలను మినహాయింపు ఇవ్వాలి
హెచ్‌ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్‌ఫర్లు, ఎక్స్‌గ్రేషియా, పితృత్వ సెలవులు తదితరాలు అమలు చేయాలి.

ప్రధాన డిమాండ్లు