
ముహూర్తం ఖరారు
మదనపల్లె కేంద్రీయ విద్యాలయానికి
మదనపల్లె రూరల్: పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మదనపల్లెకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం(కేవీఎస్) ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధ...సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌తో కలిసి గురువారం మండలంలోని వలసపల్లె పంచాయతీలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారికి ఆనుకుని సర్వే నంబర్లు.713/3, 713/4, 496/2, 496/3లో మొత్తం..6.09 ఎకరాల భూమిని కేటాయించినట్లు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, కేవీఎస్ అధికారులకు తెలిపారు. దీంతో వారు స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రాంగణంలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ తాత్కాలిక భవనాన్ని పరిశీలించారు. తరగతుల నిర్వహణకు, పాఠశాల ప్రారంభానికి అనువుగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్...కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి వలసపల్లె పంచాయతీలో కేటాయించిన 6.09 ఎకరాల స్థలానికి సంబంధించి అడ్వాన్స్‌డ్ పొజిషన్‌కు సంబంఽధించిన పత్రాలను కేవీఎస్, హైదరాబాద్ రీజియనల్ ఆఫీస్, డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధలకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ...కేంద్రీయ విద్యాలయం, మదనపల్లెలో 2025–26 విద్యాసంవత్సరం నుంచి మొదటగా 1 నుంచి 5 తరగతుల వరకు కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది 6వతరగతి, మరుసటి సంవత్సరం 7 ఇలా పెంచుకుంటూ వెళతామన్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఆఫ్‌లైన్ నోటిఫికేషన్‌ను వారం, పదిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. వలసపల్లెలో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యాక, పాఠశాలను పూర్తిస్థాయిలో అక్కడి నుంచే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాజంపేట బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షుడు సాయిలోకేష్, కేంద్రీయ విద్యాలయ తిరుపతి సబ్ ఇన్‌చార్జి చంద్రశేఖర్, తహసీల్దార్ ధనంజయులు, ఆర్‌ఐ భరత్‌రెడ్డి, మండల సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వో నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఫలించిన ఎంపీ మిథున్‌రెడ్డి కృషి
తరగతుల ప్రారంభానికి త్వరలో నోటిఫికేషన్
భూమి, భవనాలను కేవీఎస్ అధికారులకు అప్పగించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్
ఫలించిన ఎంపీ కృషి
మదనపల్లెను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఏర్పాటుచేయాలనుకున్న మెడకల్ కాలేజీని మదనపల్లెకు కేటాయించేలా చూశారు. బీటీ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడమే కాకుండా, యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ జీఓ తీసుకొచ్చారు. పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాన్ని మదనపల్లెకు మంజూరు చేయించడమే కాకుండా వలసపల్లె పంచాయతీలో జాతీయరహదారికి ఆనుకుని 6.09 ఎకరాల స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఎంపీ నిధులు రూ.50లక్షలు మంజూరుచేసి, తాత్కాలిక భవన నిర్మాణపనులను పూర్తి చేయించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం అవుతుండటంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎంపీ మిథున్‌రెడ్డికి ఽకృతజ్ఞతలు తెలిపారు.

ముహూర్తం ఖరారు