
గంగమ్మా.. చల్లంగా చూడమ్మా.
లక్కిరెడ్డిపల్లి: చల్లంగా చూడమ్మా..గంగమ్మా అంటూ అనంతపురం గంగమ్మను భక్తులు వేడుకున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు.తలనీలాలు అర్పించారు. ఆలయ పూజారులు అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు జరిపారు.పూజల అనంతరం భక్తులక తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎయిడ్స్ రహిత
సమాజం నిర్మిద్దాం
రాయచోటి టౌన్: ఎయిడ్స్ రహిత సమాజం నిర్మించేందుకు అందరం కలసి కట్టుగా పని చేద్దామని జిల్లా అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ శైలజ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి రాయచోటిలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రి నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హెచ్‌ఐవీ పట్ల ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వం అందించే సేవలను, వాటి ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజా చైతన్య సేవా సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ చెన్నారెడ్డి డీఏపీసీయూ సిలార్ సాబ్, జిల్లా క్షయనివారణ సూపర్‌వైజర్ గంగన్న, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు.