
దళిత విద్యార్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఓబులవారిపల్లె : తిరుపతి విద్యానికేతన్‌లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న జేమ్స్ అనే దళిత విద్యార్థిపై అగ్రవర్ణాల విద్యార్థులు సాయి, రూపేష్‌లు దాడి చేయడం అమానుషమని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోలంరెడ్డి మల్లికార్జున అన్నారు. ఆదివారం చిన్నఓరంపాడులో విలేకరులతో మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు జేమ్స్‌పై విచక్షణా రహితంగా దాడిచేసి కట్టేసి కొట్టి మూత్రం పోసిన దారుణమైన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. దళిత విద్యార్థికి న్యాయం జరగని పక్షంలో తిరుపతి ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి ధర్నా చేస్తామన్నారు. ఈ సమావేశంలో భారత బహుజన రాష్ట్ర నాయకుడు కె. లక్ష్మీనారాయణ, ఎం.శ్రీను, దళిత నాయకుడు మన్యం బ్రహ్మయ్య పాల్గొన్నారు.