
వంగసాగుతో నష్టపోయాం
ఈసీజన్‌లో వంగపంట సాగు చేసి పూర్తిగా నష్టపోయాం. మార్కెట్లో ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. సుమారు రూ.1.50లక్షల మేరకు పెట్టుబడి సాగు ఖర్చు నష్టపోయాం. గత ఏడాది ఇదే సీజన్‌లో వంగ పంటకు మార్కెట్లో మంచి ధరలు పలికాయి. ఇప్పుడు కిలో రూ.10 వరకు ఉండటంతో గిట్టుబాటు కావడం లేదు.
– గంగులమ్మ, గంగిరెడ్డిగారిపల్లె
టమాట కోయకుండా వదిలేశాం
మార్కెట్లో టమాటాలకు గిట్టుబాటుధరలు లేక పోవడంతో కాయలు కోయకుండా అలాగే తోటల్లొనే వదిలేశాం. ఈసీజన్‌లో ఒక ఎకరాలో పంట సాగు చేశా. రూ. 2 లక్షలవరకు పెట్టుబడి కోసం ఖర్చు చేశా. ఇప్పటివరకు రూ. 20 వేలు కూడా చేతికందలేదు. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఆశ లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. పంటనష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి – రాజారెడ్డి, కొత్తపల్లె
ప్రభుత్వం ఆదుకోవాలి
జిల్లాలో రైతులు సాగు చేస్తున్న ఒక్క పంటకు కుడా ఈ ఏడాది గిట్టుబాటు ధరలు లేక పోవడం దారుణం. ప్రభుత్వం పంటలభీమా పథకం కిందనైనా వారిని ఆదుకోవాలి. ముఖ్యంగా కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్లో ధరలు లేకపోవడం వేలాది మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం పంటల బీమా చేసుకొన్నవారితోపాటు బీమా చేసుకోని వారిని కూడా ఆదుకోవాలి. – రమేష్‌బాబు,
రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, గుర్రంకొండ.

వంగసాగుతో నష్టపోయాం

వంగసాగుతో నష్టపోయాం