
సిరులు కురిపించని విరులు
పూలసాగు విస్తీర్ణం : 3150
సాగు చేసే రైతులు : 2350
సాగుకు అయిన ఖర్చు : రూ.31.50కోట్లు
ఈఏడాది పంట నష్టం : రూ.22కోట్లు
జిల్లాలో పూలసాగు చేసిన రైతుకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. జిల్లా మొత్తం 2350 మంది 3150 ఎకరాల్లో పూల సాగు చేపట్టారు. నారుమొక్కలు, ఎరువులు, దుక్కులు, మల్చింగ్ కవర్, కూలీల ఖర్చు కలుపుకొంటే ఎకరం బంతిపూల సాగుకు రూ. 80 వేలు నుంచి రూ.లక్షవరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సగటున కిలో బంతిపూల ధర రూ. 10 వరకు ధరలు పలుకుతున్నాయి. కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు,ఇతరత్రా ఖర్చులు కలుపుకొంటే పూలను మార్కెట్‌కు తీసుకెళ్లే రైతులు ఖాళీ చేతులతో వచ్చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్‌లో బంతి పూల ధరలు కిలో రూ. 40 నుంచి రూ.50 వరకు ధరలు పలికాయి. ఈ సీజన్ జిల్లా మొత్తం మీద పూల సాగు చేసిన రైతులు రూ.22కోట్ల మేరకు నష్టపోయారు.