
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యధోరణి తగదని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ్‌రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదన్‌రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్‌డీసీ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
● వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్‌లో ఉండి చదువుకొని ఉత్తమ ర్యాంకులను సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సోమవారం ర్యాంకులు సాధించిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.