
జిల్లా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉండగా, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ములకలచెరువు నుంచి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్థానిక వైద్యులు అతనికి ఐసీయూ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తుండగా, ఆదివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని మార్చురీ గదిలో ఉంచారు. అతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సంప్రదించాలన్నారు.
పాము కాటుకు రైతు కూలీ..
లక్కిరెడ్డిపల్లి : మండలంలోని మద్దిరేవుల గ్రామం రెడ్డివారిపల్లికి చెందిన వీరబల్లి వెంకటరమణ (44) అనే రైతు కూలీ ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాటుకాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లింది. వెంకట రమణ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేసి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.