పశుగ్రాసంగా టమాటాలు
జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం : 13800 ఎకరాలు
సాగు చేసే రైతులు : 12800
సాగుకు అయిన ఖర్చు : రూ.465కోట్లు
ఈ ఏడాది పంట నష్టం : రూ. 325కోట్లు
జిల్లాలో ప్రస్తుతం 12800 మంది రైతులు 14800 ఎకరాల్లో టమాటా పంట సాగు చేసారు. పంటసాగు కొసం ఇప్పటికే రూ.465 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈసీజన్‌లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో రూ.325 కోట్ల మేరకు నష్టపోయారు. మార్కెట్లో ప్రస్తుతం 25కేజీల టమాట క్రీట్ ధర రూ.150లోపే ధర పలుకుతోంది. సగటున సరాసరి కిలో రూ.5లోపే ధర ఉంది. ఒక ఎకరం పంట సాగుకు రూ. 2లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో మార్కెట్‌కు టమాటాలను చేర్చేవరు అయ్యే ఖర్చు కుడా రైతులకు మిగలడం లేదు. కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు, జాక్‌పాట్‌లు కలుపు కొంటే మార్కెట్‌కు టమాటాలను తీసుకొచ్చే రైతులకు తమ చేతి నుంచే అదనపు ఖర్చు వస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. పలువురు నాలుగు కోతలు కోసిన తర్వాత పంటను అలాగేే పొలంపై వదిలేస్తున్నారు. దీంతో పలుచోట్ల టమాటా పంట పశుగ్రాసంగా మారిపోతోంది.


