జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని ప్రతిభ
మదనపల్లె సిటీ : న్యూఢిల్లీలో జరిగిన యూత్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన యూత్ గేమ్స్ నేషనల్ ఛాంఫియన్‌షిప్ పోటీల్లో కరాటే విభాగంలో స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని షేక్ అర్షియా అంజుమ్ ప్రతిభ కనబరిచింది. విద్యార్థిని 9వ తరగతి చదువుతుంది. ఈనెల 26వతేదీ నుంచి 28వ తేదీ వరకు జరిగిన కరాటే పోటీల్లో 54 కేజీల బాలికల విభాగంలో గోల్డ్‌మెడల్ సాధించింది. సోమవారం పాఠశాలలో జరిగిన అభినందన సభలో హెచ్ ఎం సుబ్బారెడ్డి అర్షియా అంజుమ్‌ను అభినందించారు. కార్యక్రమంలో పీడీ సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అర్జీలకు సత్వర పరిష్కారం
రాయచోటి : పీజీఆర్‌ఎస్ అర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో బాధ్యతగా పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కడప అగ్రికల్చర్ : కడప కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రక్షిత సాగుపై షేడ్ నెట్ – పాలీ హౌస్‌ల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్ సోమవారం తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులు పాల్గొనాలని కోరారు.
జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థిని ప్రతిభ


