రాజకీయ కుట్ర లేకుండా అభివృద్ధి చేయాలి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని ఉంటే కడపజిల్లా, లేకుంటే తిరుపతి బాలాజీ జిల్లాలో కలపాలని రాజంపేట, రాయచోటి ఎమ్మెల్యేలతో కలిసి 2023 లోనే తెలియజేశానని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పద్ధతి ప్రకారం జిల్లాలు ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి కోసం హామీలు ఇచ్చి చిచ్చు పెట్టారని అన్నారు. బలమైన ప్రతి పక్షం గొంతెత్తడంతో ఏమీ చేయలేక కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు తిరుపతిలో కలపడం స్వాగతించదగ్గ విషయమని తెలిపారు. కానీ రాజకీయ కుట్రలకు అనుగుణంగా విభన చేయడమేకాక అభివృధిలో నిర్లక్ష్యం చేస్తే సహించమని తెలిపారు. అన్ని రంగాల్లో రైల్వేకోడూరుకు తిరుపతి జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
మాజీ ఎమ్మెల్యే
కొరముట్ల శ్రీనివాసులు


