జిల్లా పాత స్వరూపం
రాయచోటి రాజంపేట, రైల్వేకోడూరు మదనపల్లె తంబళ్లపల్లె పీలేరు
మదనపల్లె : అన్నమయ్యజిల్లాను మూడుజిల్లాల్లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం వెనుక టీడీపీకి అనుకూలమైన పరిస్థితులు సృష్టించుకోవడం కోసమే చివరి అస్త్రం రాజకీయ విభజన అంశం ప్రయోగించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఒక జిల్లా ఏర్పాటై మనుగడలోకి వచ్చాక ఆ జిల్లా ఉనికినే లేకుండా చేయడం వెనుక రాజకీయ కారణాలే కీలకంగా మారినట్టు చర్చ మొదలైంది. దీనికి గత, ప్రస్తుత రాజకీయ అంశాలు ప్రస్తాపనకు వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో టీడీపీకి రాజకీయంగా అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా పట్టు నిలుపుకొవాలన్న ప్రయత్నాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగుతున్నాయి. ప్రత్యర్థి వైఎస్సార్‌సీపీని ఎదుర్కునేందుకు విశ్వప్రయత్నాలు చేసినా, ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలన్న ప్రయత్నాలు సాధ్యపడలేదు. దీనికితోడు అధికారంలోకి ఉన్నా టీడీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో భౌగోళికంగా అన్నమయ్యజిల్లా స్వరూపం మొదట మార్చినా ఇప్పుడు జిల్లానే లేకుండా పోతోంది.
టీడీపీకి అభ్యర్థులెవరు?
కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి రాయచోటి, మదనపల్లె, కోడూరు, పీలేరుల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. తంబళ్లపల్లె, రాజంపేటలో ఓటమి మిగిలింది. ప్రస్తుత పరిస్థితికి వస్తే..వచ్చే ఎన్నికల్లో కోడూరులో కూటమి తరపున పోటీ చేసే బలమైన అభ్యర్థి కరువు. గత ఎన్నికల, వచ్చే ఎన్నికల పరిస్థితి వేరు కాబట్టి వైఎస్సార్‌సీపీకి ఉన్న బలమైన క్యాడర్, అభ్యర్థి టీడీపీ లేదా కూటమికి లేదు. రాయచోటిలో గత ఎన్నికల్లో 2,495 స్వల్ప తేడాతో వైఎస్సార్‌సీపీ ఓడింది కాని, టీడీపీకి ఘనమైన విజయం కాదు. తాజా పరిస్థితుల మేరకు వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి అఖండ విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ టీడీపీ తరపున ఎవరు బరిలో ఉన్నా ఓటమి తప్పదని పరిశీలకులు చెబుతున్నారు. ఇక తంబళ్లపల్లెలో టీడీపీకి నకిలీమద్యం తయారీ మరకతో తలెత్తుకుని ప్రజల్లోకి వెళ్లలేకపోతోంది. ఇన్‌చార్జి జయచంద్రారెడ్డిపై నకిలీమద్యం కేసు నమోదై, పార్టీనుంచి సస్పెన్షన్ కావడంతో నాయకత్వ లోపంతో ఉంది. గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే శంకర్‌కు టికెట్ కాదనడంతో ఆయన తంబళ్లపల్లెకు, పార్టీకి దూరమయ్యారు. ఇక్కడ టీడీపీకి అభ్యర్థి కోసం వెతుకులాట తప్పదు. మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ కేవలం నాలుగు వేల పైచిలుకు ఓట్లతో ఓడింది. దీనికి కారణాలేమైనా ఇప్పుడు టీడీపీ పరిస్థితి గందరగోళంలో పడింది. వచ్చే ఎన్నికలకు కొత్త అభ్యర్థి బరిలో ఉంటారన్న ప్రచారం ఉంది. స్థానిక ఎమ్మెల్యేకు అధిష్టానంతో దూరం పెరిగిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయనకు తిరిగి అభ్యర్థిత్వంపై అనుమానాలు ఉన్నప్పటికి మదనపల్లెలో టీడీపీ మళ్లీ గెలవడం కష్టమే. అందుకనే పఠాన్ ఖాదర్‌ఖాన్‌కు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ప్రత్యామ్నాయ నేతగా ప్రోత్సహిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు అంటున్నారు. పీలేరులో టీడీపీ ఎమ్మెల్యేదే నాయకత్వం. అయితే పార్టీ నిర్ణయాలపైనా, మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తితో రగిలిపోతున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అనుకూల వాతావరణం, గెలుపు అవకాశాలు అంత సులువుకాదని పరిశీలకులు స్పష్టంగా చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ క్షేత్రస్థాయిలో బలం పుంజుకోడవమే కాక బలమైన నాయకత్వం ఉంది.
మంత్రి ప్రాధాన్యత తగ్గుతుందా
రాయచోటి నియోజకవర్గం కొత్త మదనపల్లె జిల్లాలోకి విలీనం, జిల్లా కేంద్రాన్ని రాయచోటినుంచి మదనపల్లెకు మార్చడం ద్వారా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రాధాన్యతను తగ్గించాలన్న చర్యగా పార్టీ వర్గాలు చర్చించుకొంటున్నాయి. టీడీపీ కొత్త పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ నియామకంలో అధిష్టానం మంత్రి అభిప్రాయం తీసుకోలేదని చెబుతున్నారు. మదనపల్లె జిల్లా ప్రకటన వెలువడిన తర్వాత పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్‌రెడ్డి చంద్రబాబును కలిసి ధన్యావాదాలు చెప్పగా ఇకపై జిల్లా వ్యవహారాలు, పాలనాపరమైన అంశాలను చూసుకోవాలని చెప్పినట్టు పార్టీలో ప్రచారం సాగుతోంది. దీన్నిబట్టి చూస్తే మంత్రికి కొత్తజిల్లాలో ప్రాధాన్యత తగ్గే పరిస్థితి ఉందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
పెద్దిరెడ్డి ధాటికి తట్టుకోలేక
రాజంపేట పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు చంద్రబాబు ఎన్నిపాట్లు పడినా సాధ్యం కావడం లేదు. 1984, 1999లో రెండుసార్లు తప్ప టీడీపీ ఎంపీ పదవిని గెలుచుకోలేకపోయింది. రాజకీయ సమీకరణలను మార్చేస్తూ 2014లో ఎంపీ పదవికి వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసిన పీవీ మిథున్‌రెడ్డి హ్యట్రిక్ విజయం సాధించారు. మిథున్‌రెడ్డిని ఓడించాలని చేయని ప్రయత్నం లేదు, చివరకు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని పోటిచేయించి ఓడించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి ప్రజల్లో ఉన్న ఆదరణ, వైఎస్సార్‌సీపీ బలానికి దీటుగా టీడీపీ నిలవలేకపోతుంది. దీంతో ఎంపీగా ఎవరు పోటిచేసినా గెలిచే అవకాశాలు లేకపోవడం, పోటి ఇచ్చే అభ్యర్థి దొరకని పరిస్థితుల్లో ప్రతి ఎన్నికలోనూ టీడీపీకి కొత్త అభ్యర్థులే కావడం దీనికి నిదర్శనం.
కొత్త స్వరూపం
ఉనికి కోసమే రాజకీయ విభజన
రాజంపేట పార్లమెంట్ పరిధిలో
టీడీపీకి నిరాశజనక పరిస్థితులు
వచ్చే ఎన్నికల్లో పోటీ ఇచ్చే అభ్యర్థులెవరు?
రాయచోటిలో గెలవలేమనే
మదనపల్లెలో విలీనం
మంత్రి రాంప్రసాద్ ప్రాధాన్యతకు చెక్
జిల్లా పాత స్వరూపం
జిల్లా పాత స్వరూపం


